17, జూన్ 2021, గురువారం

స్వార్ధం

 🔸🔸

స్వార్ధం

🔸🔸


ఒక గ్రామంలో ఒక సాధువు నివసించేవాడు.ఆయన చాలా మహిమ కలవాడు. ఆయన వద్దకు నిత్యమూ అనేకమంది జనులు వచ్చి తమ

కష్టాలను ,సమస్యలను ఆయనవద్ద మొరపెట్టుకుని

తగిన ఉపశమనం పొందేవారు. బయట ఊళ్ళ నుండి కూడా జనాలు వచ్చేవారు. 


ఒకనాడు  ఒక స్త్రీ సాధువు వద్దకు వచ్చి  " నాకు  వివాహమై చాలాకాలమైనా సంతానభాగ్యం కలుగలేదు.

ఎన్నో వ్రతాలు, పూజలు,

చేశాను.గుళ్ళూ గోపురాలు తిరిగినా ఏ ప్రయోజనమూ కలుగలేదు. తమరే ఏదైనా పరిహారం చెప్పి, అనుగ్రహించాలని వేడుకుంది.

మొరపెట్టుకున్న  ఆ 

స్త్రీని ఒక

నిముషం తీక్షణంగా చూశాడు సాధువు.

ఆమెకి చేతినిండా వేరుశనగ కాయలు యిచ్చారు. " అమ్మా ..నీవు ఆ తలుపు వద్ద కూర్చో, నేను కాసేపట్లో మరల పిలుస్తాను " అని అన్నాడు.


ఆ స్త్రీ  తలుపు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. సాధువు యిచ్చిన వేరుశెనగలు చేతినిండా వున్నవి. ఆమె ఒక్కొక్కటిగా ఒలిచి తినడం మొదలుపెట్టింది. ఇంతలో అటువేపుగా కొంతమంది

చిన్నపిల్లలు వచ్చారు.

వచ్చిన పిల్లలో ఒక బాలిక ఆ స్త్రీ వద్దకు

వచ్చి, అమ్మా ..నాకు కొంచెం వేరుశెనగలు పెట్టవా ? అని ఆశగా అడిగింది.

 ఆ పిల్లమీద ఆ స్త్రీకి కోపం వచ్చింది.

" నీకు ఒక్క దానికి యిస్తే మిగతా పిల్లలు కూడా వచ్చి చేయి చాచుతారు. మీకోసం నేనేమీ వేరుశనగ మడులేవీ పెంచడంలేదు.  ఫో  ఫొమ్మని కఠినంగా కసిరి పంపింది. ఆ బాలిక చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది.


ఇదంతా దూరం నుండి సాధువు గమనించాడు. ఆ స్త్రీని  తన ధగ్గరకు రమ్మని పిలిచాడు.

ఆ స్త్రీ లేచి సంతోషంగా సాధువు వద్దకి వెళ్ళింది. ఆమె రాగానే " నీకు  ఈ జన్మలో సంతాన భాగ్యం లేదు  నీవు వెళ్ళవచ్చు" అన్నాడు సాధువు.

ఆ స్త్రీ ఆశ్చర్య పోయినది.

" ఎందకు స్వామీ? అని అడిగింది. సాధువు ప్రశాంతంగా జవాబిచ్చాడు " అమ్మా! 

నీలో ఒక తల్లికి వుండవలసిన మమతానురాగాలు లేవు. నీవు స్వార్ధపరురాలివి.

ఇప్పుడు 

నీవు తింటున్న వేరుశెనగలు నీవి కావు.

అయాచితంగా లభించినవి.

ఎవరో యివ్వగా వూరికే వచ్చినవి. వాటిలో ఒక కొంచెం భాగం ఆశతో అడిగిన ఆ చిన్నపిల్లకు ఇవ్వడానికి నీకు మనసురాలేదు కసిరికొట్టావు. 


పసిపిల్లల పట్ల  ప్రేమానురాగాలు చూపడం తెలియని నీకు దైవం సంతాన భాగ్యం ఎందుకు అనుగ్రహిస్తాడు ?  

దేవుడి అనుగ్రహంలేకపోతే నేను మాత్రం ఏం పరిహారం చెప్పగలను అని అడిగాడు సాధువు.

ఆ స్త్రీ సిగ్గుతో అక్కడనుండి వెళ్ళిపోయింది. 

ఈ సంఘటన ద్వారా చుట్టూ వున్న భక్తులు ఒక మంచి పాఠం నేర్చుకున్నారు.

సేకరణ

https://chat.whatsapp.com/J2smXvOBzztJK9Nsz8h8oi

కామెంట్‌లు లేవు: