22, జూన్ 2024, శనివారం

జగన్నాథ వార్షిక స్నానం

 *_22/06/2024 - శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం / నెత్రోత్సవం_*

❀┉━❀

*జగన్నాథ జ్యేష్ఠాభిషేకం జగన్నాథ వార్షిక స్నానం*

♻️♻️♻️♻️♻️


*పరాయ పరరూపాయ పరంపారాయ తే నమః.*

*పరంపరాపరివ్యాప్త పరతత్త్వపరాయ తే.*


సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా, లక్ష్మీదేవి సుభద్రాదేవిగా, ఆదిశేషుడు బలభద్రునిగా - దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం. 


*అలౌకికీ సా ప్రతిమా లౌకికీతి ప్రకాశితా*


అలౌకికమైన దివ్యమూర్తులే లౌకికమైన దారుమూర్తులుగా ప్రకాశిస్తున్నాయి - అని పురాణవాక్కు.


ఏ క్షేత్రంలోనైనా మూలవిరాట్టుకు నిత్యాభిషేకమో, వారాభిషేకమో నిర్వహిస్తుంటారు. పూరీ జగన్నాథుని ఆలయం సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. పూరీలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రమే ఏడాదికొక్కరోజు మాత్రమే అభిషేకం చేస్తారు.


*_ప్రతీ ఏటా జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథునికి నిర్వహించే అభిషేకాన్నే దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు._*


ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరీలోని మూలవిరాట్టులు దారుతో చేసినవి. అంటే వేప చెక్కతో మలచిన శిల్పాలు. దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి గనుక, నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి,  ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికే అభిషేకం చేస్తారు. దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు.


అయితే…..


జ్యేష్ఠపూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాదమస్తకం పవిత్రజలాలతో అభిషేకం చేస్తారు. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నానవేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు.

🙏☝️

🪷🌸🌻🍒🌼ఇలాంటి  మంచి విషయాలు  తెలుసు  కోవటం కోసం,*"ఓం నమో శ్రీ వేంకటేశాయ*" గ్రూప్ లో, మీతో బాటు,  మీ తోటి బంధువులను, మరియు మీ సన్నిహిత స్నేహితులను కూడా    చేర్చమని       ❀꧁గోవింద ꧂❀ 9676434666    నంబరుకు  వాట్సప్ వాయస్ మెసేజ్ పెట్టండి...  లింక్ పంపుతాము..🥥🍒🍓🍌🌺🪻🍈🪷

ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తాం. ఆ నేపథ్యంలోనే పూరీ జగన్నాథునికి కూడా 108 కలశాలతో జ్యేష్ఠపూర్ణిమ అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే వినియోగిస్తారు. స్నానవేదికపై ముగ్గురు దేవతలతో పాటు సుదర్శనుణ్ణి కూడా ప్రతిష్టిస్తారు. అనంతరం జగన్నాథునికి 35 కలశాలు, బలరాముడికి 33 కలశాలు,  సుభద్రకు 22 కలశాలు, సుదర్శనుడికి 18 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు. అభిషేకం పూర్తైన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపజేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు.


స్నానపూర్ణిమ ఉత్సవం పూర్తైన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు. అందుకు కారణమేమిటీ అంటే నీళ్లలో బాగా తడిసిపోవడంతో స్వామివారికి జలుబూ, జ్వరం వస్తాయని అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజులపాటు చీకటి మందిరంలోనే ఉంచి ప్రత్యేక సపర్యలు చేస్తారు. నిత్యం సమర్పించే నైవేద్యాలు కాకుండా జలుబు నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసిన వంటకాలనే నివేదన చేస్తారు. ఈ పదిహేను రోజులూ భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు. అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే పట్టచిత్రా అంటారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజున చీకటిగదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్టిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు.


ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది.  మొత్తం మీద జ్యేష్ఠ పౌర్ణమి నుంచి పక్షం రోజులపాటు స్వామివారు దర్శనమివ్వరు.


* జై జగన్నాథ *

Panchaag


 

*శ్రీ వీరనారాయణ ఆలయం*

 🕉 *మన గుడి : నెం 356*


⚜ *కర్నాటక  :-  - గదగ్*


⚜ *శ్రీ వీరనారాయణ ఆలయం* 



💠 శ్రీ వీరనారాయణ దేవాలయం గడగ్ జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి.  పురాతనమైన ఈ ధార్మిక ప్రదేశం  1117 నాటిది మరియు హొయసల రాజు విష్ణువర్షనుచే నిర్మించబడింది.  

ఇక్కడ ప్రధాన దేవుడు వీరనారాయణ/భగవాన్ విష్ణువు.



💠 వీరనారాయణ దేవాలయం భారత పురావస్తు శాఖకు చెందిన కర్ణాటక రాష్ట్ర విభాగం క్రింద సంరక్షించబడిన స్మారక చిహ్నం. 


💠 ఒక పురాణం ప్రకారం, బిట్టి దేవ అని పిలవబడే రాజు విష్ణువర్ధన, ఒక హొయసల యువరాణిని అనారోగ్యం నుండి నయం చేసిన తర్వాత,  రామానుజాచార్యచే చాలా ప్రభావితమయ్యాడు.  

బిట్టి దేవా తన పేరును విష్ణువర్ధనగా మార్చుకోవడమే కాకుండా జైనమతం నుండి శ్రీ వైష్ణవ మతంలోకి మారాడు.  

ఆ తర్వాత అతను శ్రీ రామానుజాచార్య యొక్క బలమైన భక్తుడు అయ్యాడు మరియు ఐదు విష్ణు దేవాలయాలను నిర్మించాడు. 

ఆయన నిర్మించిన పంచ నారాయణ దేవాలయాలలో ఇది ఒకటి.

 వాటిలో గడగ్‌లోని ఐదు పుణ్యక్షేత్రాల వీరనారాయణ దేవాలయం ఒకటి.  


💠 విష్ణువర్ధన రాజు నిర్మించిన ఇతర నాలుగు విష్ణు క్షేత్రాలు ..

తొండనూర్‌లోని నంబినారాయణ ఆలయం, బేలూరులోని చెన్నకేశవ ఆలయం, తలకాడ్‌లోని కీర్తి నారాయణ ఆలయం మరియు 

మేల్కోటేలోని చెలువనారాయణ ఆలయం.  విజయనగర సామ్రాజ్యం పాలనలో, కుమారవ్యాస అనే ప్రసిద్ధ కన్నడ కవి ఉండేవాడు.


💠 ఒక పురాణం ప్రకారం, కుమారవ్యాస హిందూ ఇతిహాసం మహాభారతం యొక్క కన్నడ శీర్షిక  రచించాడు.  


💠 వీరనారాయణ ఆలయం, చాళుక్య, హొయసల మరియు విజయనగర సామ్రాజ్యాల నిర్మాణ శైలి ప్రకారం నిర్మించబడింది.  గర్భగృహ, లేదా గర్భాలయం, మరియు ఆలయ పైగోపురం చాళుక్యుల శిల్పం గరుడగంబ, లేదా గరుడ స్తంభం మరియు రంగమంటపం హోయసల శిల్పం పద్ధతిలో ఉన్నాయి.


💠 ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం విజయనగర కళకు చెందినది.

తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ద్వారం గుండా అడుగు పెట్టగానే అక్కడ గరుడ గంబ కనిపిస్తుంది. 

గరుడ గంబ వెనుక ఒకలి బావి మరియు దాని సమీపంలో శ్రీవైష్ణవ త్రిపుండ్రాలు ఉన్నాయి. దానికి ఎదురుగా నమస్కార భంగిమలో గరుడ విగ్రహం ఉంది.


💠 వీరనారాయణ ఆలయం లోపల కళాత్మకంగా చెక్కబడిన చిత్రాలతో కూడిన అనేక స్తంభాలు ఉన్నాయి.

 ఈ స్తంభాలలో ఒకదాని క్రింద కూర్చుని మహాకవి కుమారవ్యాస "కర్ణాటక భారత కథా మంజరి" రచించాడని సాంప్రదాయ నమ్మకం.

ఆ తర్వాత మధ్యరంగం, తర్వాత గర్భగృహం వస్తుంది. 

గర్భగుడిలో ముదురు నీలం రంగు రాతితో చెక్కిన శ్రీ వీరనారాయణ విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. కిరీటము, కర్ణకుండల, శంఖ, చక్ర, గధ, పద్మములతో అలంకరింపబడి, వీరగచ్చె వస్త్రము ధరించి, అభయహస్తముతో వీరనారాయణుడు భక్తులను రక్షించుచున్నాడు. 


💠 అతని విశాలమైన వక్షస్థలంలో లక్ష్మి, పాదాల వద్ద దశావతారాలు మరియు రెండు వైపులా లక్ష్మి మరియు గరుడ నిలబడి ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ-నరసింహ దేవాలయం, సర్పేశ్వరాలయం మొదలైన చిన్న చిన్న దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి.


💠 సమయాలు - అన్ని రోజులలో ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 వరకు.  గమనిక - శివరాత్రి పండుగ రోజున, సమయాలున్ మారవచ్చు. 

జ్ఞానం వైపు...

మన ప్రయాణం జ్ఞానం వైపు...

జ్ఞానం, విజ్ఞానం అనే మాటల పర్యాయపదాలుగా వినిపిస్తాయి. ఆ మాటల్లో కొంత భేదం కనిపిస్తుంది. జ్ఞానం అంటే అది వ్యవహార జ్ఞానం కావచ్చు. విశేషించి ఆధ్యాత్మిక జ్ఞానం కావచ్చు కాని, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. జీవాత్మలు అల్పజ్ఞానం కలిగినవని, పరమాత్మ పూర్ణజ్ఞానం కలిగినవాడని, అతడు సర్వజ్ఞుడని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తాయి.

లోకంలో మానవులను చూస్తే వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా తెలివితేటలు ఉన్నట్లు గమనిస్తాం. కాళిదాసులాగా అందరూ కవులు కాకపోవచ్చు. జగదీశ్ చంద్రబోస్లోగా అందరూ శాస్త్రవేత్తలు కాకపోవచ్చు. అరవిందుడిలాగా, రామకృష్ణ పరమహంసలాగా అందరూ యోగులు కాకపోవచ్చు కాని- ఎవరి జ్ఞానం వారిదే. వారికున్న జ్ఞానపరిధిలోనే వారి సుఖదుఃఖానుభవాలు ఉంటాయి. జ్ఞానానికి వ్యవహారానికి సంబంధం ఉంది. అంతేకాదు, జ్ఞానానికి మోక్షానికి కూడా సంబంధముంది. కాని వ్యవహార జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. దేనికి సంబంధించిన జ్ఞానం, దానికి సంబంధించిన ఫలాలనే ఇస్తుంది.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీత చెబుతుంది. దేని మీద శ్రద్ధ ఉంటుందో దానికి సంబంధించిన జ్ఞానమే దొరుకుతుంది. విద్యార్థుల శ్రద్ధను బట్టి వారికి ఆయా విద్యలను బోధించే విధానం అనాది కాలం నుంచీ ఉంది. కపిలుడు సాంఖ్య విద్యలో, పతంజలి యోగవిద్యలో ఆరితేరినవారు కావడానికి వారి అభిరుచులే కారణం.

పూర్వం శౌనకుడనే ఋషి కుమారుడు అంగీరసుడనే గురువు వద్దకు వెళ్ళాడు. దేన్ని తెలుసుకుంటే అంతా తెలుస్తుందో, దాన్ని చెప్పమని అడుగుతాడు. పర, అపర విద్యలు రెండున్నాయని, వాటిలో పరవిద్య అనగా పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుస్తుందని గురువు చెబుతాడు. శౌనకుడు గురువాజ్ఞను పాటించి బ్రహ్మచర్యాన్ని పాటించి, వివేకాన్ని సాధించి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.
లౌకిక విద్యలన్నీ అపరవిద్యలే. అవి లోక వ్యవహారాల్లో మనల్ని నడిపిస్తాయి. పరావిద్య మనల్ని సాంసారిక జీవితం నుంచి నివృత్తి చేసి యోగమార్గంలో నడిపిస్తుంది.

'నేను శాస్త్రవిద్యలో కుశలుడి'నని చెప్పుకొనే స్థాయికి ఒక శాస్త్రవేత్త ఎలా ఎదగగలుగుతాడో, అట్లే 'నేను నన్ను తెలుసుకున్నాను... పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నాను... ఇంక తెలుసుకోవలసింది ఏమీ లేదు' అనే స్థాయికి యోగి అయినవాడు ఎదుగుతాడు. ఎవరే స్థాయికి ఎదగాలన్నా జ్ఞానమే ముఖ్యమైంది. అందుకు మానవుడు నిరంతరం కృషి చేయవలసి వస్తుంది. ఈ కృషినే ఆధ్యాత్మిక భాషలో తపస్సు అంటారు. తపస్సులో మనోనిగ్రహం ఉంది, స్థితప్రజ్ఞ ఉంది, ద్వంద్వ సహిష్ణుత ఉంది. లక్ష్యాన్ని చేరాలన్న కోరిక ఉంది.

కొందరు కోరికల్ని తక్కువగా భావిస్తారు గాని సాధించవలసిన లక్ష్యం తనకు గాని, ఇతరులకు గాని ఉపయోగకరమైంది అయితే తప్పక కోరిక ఆదరణీయమైందే. ఫలాపేక్ష లేకుండా ఒక పని చేయాలనుకోవడం ఉత్తమ ధర్మమని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తాయి. ఇక్కడ సత్సంకల్పం లేకపోతే నిష్కామకర్మ కూడా సాధ్యం కాదు కదా!

మనిషి జ్ఞానం వైపు ప్రయాణించాలి. అప్పుడు అతడికి గమ్యం గోచరిస్తుంది. గమ్యం అనేది జ్ఞానాన్ని అనుసరించే ఉంటుంది- భౌతిక వాదులకైనా, యోగులకైనా.

ప్రక్కవాళ్ళ పూలతో పూజ ...*

 *ప్రక్కవాళ్ళ పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది...*


రోజూ ఉదయమే చాలామంది పూజ కోసమని ప్రక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు. కొంతమంది ఐతే వాకింగ్ కి అని వెల్తూ,  కూడా ఒక కవరు పట్టికెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నా... లేదా వీళ్ళకేసి చూస్తున్నా..  వీళ్ళు వాళ్ళ కేసి చాలా సీరియస్ గా పాపాత్ములని చూసినట్టు చూస్తూ చాలా బిల్డప్ ఇస్తుంటారు. ఇవన్నీ రోజూ మనకి కనపడే దృశ్యాలే...


మరి నిజంగా ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజకి ఏమి ఫలితం వస్తుంది, దీనిగురించి శాస్త్రాలు ఏమంటున్నాయి ???


నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు. దేముని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం...


ప్రక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది. అందుకు శిక్షగా  మళ్ళీజన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు. కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, అప్పుడుకూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళీపోతుంది.. ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడపురాణం లో గరుడునికి చెప్పారు. ఈ శ్లోకం చూడండి...


శ్లో" తాంబూల ఫల పుష్పాది హర్తాస్యా ద్వానరో వనే !


ఉపానతృణ కార్పాసహర్తాస్సా న్మేష యోనిషు !!

( గరుడపురాణం పంచమాధ్యాయం 14వ శ్లోకం ) 


తాత్పర్యం : తాంబూలము, ఫలములు, పుష్పములు మొదలగు వానిని అపహరించినవాడు అడవిలో కోతిగాను; పాదుకలు, గడ్డి, ప్రత్తి మొదలగువానిని అపహరించినవాడు మేక జన్మముగాను పుట్టుచుందురు...


మరి పూజ చేస్తే పుణ్యం రావాలి, దానివల్ల మోక్షం, ముక్తి కలగాలి, లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి. నిజానికి మానవ జన్మ ఏకైక  లక్ష్యం ముక్తిని పొందడమే.. ఇక జన్మలనేవే లేనివిధంగా ఆ భగవంతునిలో ఐక్యం ఐపోడమే.. అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం, ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు....


మరి ప్రక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజవల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సివస్తొందే..  ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాతగానీ మనిషిగా పుట్టే అవకాసమే రాదే.. మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా... ఒక్కాసారి ఆలోచించండి, తెలియనివార్కి తెలియచేసి వారికి సాయం చేయండి.....


                 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

కర్మకి సంబంధం ఉన్నవాళ్లే

 గత జన్మలో మనకి, మన కర్మకి సంబంధం ఉన్నవాళ్లే ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలంకొద్ది మంది మాత్రమే మన జీవితం లోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి కూడా అంతుచిక్కని పరమార్థం ఉంటుంది.

వానలు వచ్చినాయని

 ఉ.

వానలు వచ్చినాయని యవారిత వాక్కులఁ జెప్పగా యహో 

మేనులు చల్లగా నగును మేల్బళి యంచు ప్రమోదమందితిన్ 

వానల సంగతుల్ సమసి భళ్ళున యెండ లవారితోష్ణమున్ 

బూనికఁ గ్రక్కుచుండె నిట మోములు వాడగ బ్రధ్న హెచ్చగాన్ 

*~శ్రీశర్మద*

8333844664

ఎప్పటికీ తృప్తి పడరాదు.

 శ్లో𝕝𝕝 సంతోష స్త్రిషు కర్తవ్యః

కళత్రే భోజనే ధనే।

త్రిషు చైవ న కర్తవ్యః 

దానే తపసి పాఠనే॥


తా𝕝𝕝 భార్య, భోజనం, ధనం ఈ మూడింటి విషయంలో దొరికిన దానితోనే తృప్తి పడాలి, 

దానము, తపస్సు, విద్య ఈ మూడింటి యందు మాత్రం ఎప్పటికీ తృప్తి పడరాదు.

విజయానికి మానసిక ధైర్యం

 అడ్డంకులకు భయపడి, కొందరు మంచి కార్యకలాపములను చేపట్టడానికి కూడా వెనుకాడతారు.  కొందరు ఒక పనిని ప్రారంభిస్తారు, కానీ వారికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే మధ్యలో వదిలేస్తారు.  కానీ ఒక గొప్ప వ్యక్తి తన పనుల మధ్య వచ్చే అవాంతరాలను తానే ఎదుర్కొంటాడు,తద్వారా అతను ఎలాంటి కష్టాలను అనుభవించైనా అధిగమిస్తాడు .  శ్రీ ఆదిశంకరాచార్యులు దేశమంతటా ధర్మ ప్రచార సమయంలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు.  అయినప్పటికీ, వారు తమ కార్య దీక్షను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా ఈ విశ్వానికే ఒక ఉదాహరణగా నిలిచారు . అందుకే జగద్గురువులు అంటారు..."విజయానికి మానసిక ధైర్యం చాలా అవసరం."అని.

*-జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారు.*

ఈ పద్యం జ్ఞాపకముంద

 నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే


ఈ పద్యం జ్ఞాపకముంద

 మీ ఇంట్లొ చిన్నారులకు వీటిని నేర్పగలరు.


Send yr comment below

జూన్ 22, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

        🍁 *శనివారం* 🍁 

   🌹 *జూన్ 22, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                    

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః* 

 *జ్యేష్ఠమాసం - శుక్లపక్షం*

*తిథి : పౌర్ణమి* ఉ 06.37 *కృష్ణ పాడ్యమి* (23) తె 05.12 వరకు

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : మూల* సా 05.54 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : శుక్ల* సా 04.45 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బవ* ఉ 06.37 *బాలువ* సా 05.58 ఉపరి 

*కౌలువ* (23) తె 05.12 ఆపైన *తైతుల*

*సాధారణ శుభ సమయాలు* 

*ఉదయం 10.30 - మధ్యాహ్నం 12.30 వరకు*

అమృత కాలం :*ప 11.37 - 01.11*

అభిజిత్ కాలం :*ప 11.43 - 12.36*

*వర్జ్యం : సా 04.20 - 05.54 & రా 03.10 - 04.42*

*దుర్ముహుర్తం : ఉ 05.36 - 07.21*

*రాహు కాలం : ఉ 08.53 - 10.31*

గుళిక కాలం :*ఉ 05.36 - 07.15*

యమ గండం :*మ 01.48 - 03.26*

సూర్యరాశి : *మిధునం* 

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.36* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల :‌ తూర్పు దిక్కుకు ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.36 - 08.14*

సంగవ కాలం :*08.14 - 10.51*

మధ్యాహ్న కాలం :*10.51 - 01.28*

అపరాహ్న కాలం :*మ 01.28 - 04.06*

*ఆబ్ధికం తిధి:జ్యేష్ఠ బహుళ పాడ్యమి*

సాయంకాలం :*సా 04.06 - 06.43*

ప్రదోష కాలం :*సా 06.43 - 08.53*

నిశీధి కాలం :*రా 11.48 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*

*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*...


*ఓ దేవా!* 

నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా?

ఏమైనా సునాయాసంగా చేయగలవు.

రామదూత అయిన నువ్వు

కరుణామయుడవు....

నా విన్నపమును సాధ్యం చేయు ప్రభు!🙏🙏🙏


           🍁 _*ఓం శ్రీ*_🍁 

🍁 *_ఆంజనేయయా నమః*_🍁

🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🍁🌹🍁🍁🌷🍁🌹

వైకుంఠ పాళి

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 22.06.2024,

బాల్యంలో ఆడే ఆటల్లో పరమపద సోపానం (వైకుంఠ పాళి) ఒకటి. మొదటి గడినుంచి ప్రారంభమయ్యే ఆట క్రమంగా ముందుకు సాగుతుంది. ఒక్కొక్కసారి నిచ్చెనలు ఎక్కి పైకి ఎగబాకడం మరోసారి పాము బారిన పడి కిందికి దిగజారడం క్రీడలో భాగం. అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు విజయ లక్ష్యం సాధిస్తే విజేత అవుతారు. అదేవిధంగా జీవితం ఒక క్రీడ, సుదీర్ఘ జీవితకాలం ఒక మైదానంలో క్రీడా స్పూర్తితో ఆడాలి... పోరాడి గెలవాలి. అదే జీవిత వైకుంఠపాళి ఆట.


ఒక్క విజయం సిద్ధిస్తే ఆట ఆగిపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. జీవితంలో అనేక విజయాలు, మరెన్నో పరాజయాలు తటస్థించి ఆశ నిరాశలకు గురిచేస్తాయి. ఇక నేను సాధించలేను ఓడిపోయాను అనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆశాభావం అవసరం.


పసివయసులో ఎదుగుదల కఠోర పరిశ్రమ. పొట్టను

నేలకు ఆనించి ముందుకు పాకడం, మోకాళ్లమీద చేతుల సహాయంతో సాగడం, కూర్చోవడం, నిలబడటం, తడబాటు అడుగుల నడక, క్రమంగా పరుగు... ఇవన్నీ మన కాళ్లమీద మనం నిలవాలనే లక్ష్యంగా సాగే సాధనా ప్రక్రియలు. జీవితంలో ప్రతి సన్నివేశం మనల్ని భయపెడుతుంది. పరీక్షిస్తుంది. నిలిచి గెలవగలమా అనే సందేహం కలుగుతుంది. ధైర్యాన్ని నింపుకొని సముచిత నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. ఆరంభింపరు నీచ మానవులు, ఆరంభించినా మధ్యలో వదిలేవారు బలహీన మానవులు వారే పరాజితులని భర్తృహరి పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకే లక్ష్యంతో సాగితే... విజయమాల వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తములని కీర్తించాడు.

రాష్ట్ర శాసన సభ్యులు -

 *రాష్ట్ర శాసన సభ్యులు - సుపరిపాలన 6*


సభ్యులకు నమస్కారములు.


మన రాష్ట్ర  చట్ట సభ  రెండు సభలను కల్గి ఉన్నది.  1) శాసన సభ లేక విధాన సభ 2) శాసన మండలి / విధాన పరిషత్. 

1) *శాసన సభ/విధాన సభ* సభ్యుల ఎన్నికల నిర్ణయం భారత దేశ ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. సభ్యుడు రాజీనామా చేసినా, అనర్హుడిగా ప్రకటింపబడినా లేక స్వర్గస్తుడైనా, ఆ నియోజక వర్గంలో  *సభ్యుడు లేనప్పుడు*  ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి సభ్యుడిని ఎన్నిక చేస్తారు. పై పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆరు (6) నెలల వ్యవధిలో ఉప ఎన్నికలు జరుగవల్సి ఉంటుంది. సాధారణంగా శాసన సభ / విధాన సభ సంవత్సరంలో మూడు సార్లు సమావేశమవుతుంది. 1) బడ్జెట్ సమావేశాలు 2) వర్షాకాల 3) సీతాకాల సమావేశాలు. సమావేశాలు ఎంతకాలం జరగాలి అన్న విషయం స్పీకర్ అధ్యక్షతన Business Advisory Council (BAC) తీసుకునే నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మన శాసన సభ  119 నియోజక వర్గములు కల్గిఉన్నది అధికారానికి రావాలంటే కనీసము 60 స్థానాలు సాధించి ఉండాలి. *భారత రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర శాసన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు*.


2 *శాసన మండలి/విధాన పరిషత్*  శాసన  మండలి సభ్యులు ప్రజలచే పరోక్షంగా ఎన్నిక కాబడుతారు. శాసన మండలి *శాశ్వత సభ*. మామూలు పరిస్థితులలో రద్దు చేయు వీలుకాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు వంతుల సభకు ఎన్నికలు నిర్వహిస్తారు. మండలి సభ్యుని పదవీ కాలము ఆరు (6) సంవత్సరములు. శాసన మండలి లోని సభ్యుల సంఖ్య  శాసన సభ/విధాన సభ సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండరాదు.  కనీసము 40 మంది సభ్యులుండాలి. 

ఎన్నిక:-  I) మండలిలోని మొత్తము సభ్యులలో 1/3 వంతును రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు. ii) 1/3 వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు iii)  1/3 వంతును పట్టభద్రులు iv) 1/2 వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. v) 1/6 వంతును గవర్నర్ గారు ప్రతిపాదిస్తారు. 


ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు శాసన మండలిని రద్దు చేయాలనుకుంటే, ఆ తీర్మానం పార్లీమెంటుకు పంపాలి. రద్దు తర్వాత శాసన మండలిని   మళ్ళీ పునరిద్దంచాలంటే తిరిగి చట్టం చేయాలి. *శాసన సభా సభ్యులు గాని, శాసన మండలి సభ్యులు గాని ప్రజా సేవయే పరమార్థంగాఉంటారు*

ధన్యవాదములు

(*సశేషం*)

నైవేద్యాల పేర్లు*

 *నైవేద్యాల పేర్లు* 

🍌🍎🍈🍇🥥🍊🍋


*_(తెలుగు పేర్లు – సంస్కృతం పేర్లు)_*


|| పళ్ళు ||

అరటిపండు – కదళీఫలం

ఆపిల్ – కాశ్మీరఫలం

ఉసిరికాయ – అమలక

కిస్మిస్ – శుష్కద్రాక్ష

కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం

కొబ్బరికాయ ౨ చిప్పలు – నారికేళ ఖండద్వయం

ఖర్జూరం – ఖర్జూర

జామపండు – బీజాపూరం

దబ్బపండు – మాదీఫలం

దానిమ్మపండు – దాడిమీఫలం

ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం

నారింజ – నారంగ

నిమ్మపండు – జంభీరఫలం

నేరేడుపండు – జంబూఫలం

మామిడి పండు – చూతఫలం

మారేడుపండు – శ్రీఫలం

రేగు పండు – బదరీ ఫలం

వెలగపండు – కపిత్తఫలం

సీతాఫలం – సీతాఫలం


|| విశేష నివేదనలు ||

🫕🍓🍱🍓🍚🍓🧆🍓

అటుకులు – పృథక్

అటుకుల పాయసం – పృథక్పాయస

అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం

అన్నం (నెయ్యి,కూర,పప్పు,పులుసు,పెరుగు) – మహానైవేద్యం

ఉగాది పచ్చడి – నింబవ్యంజనం

కట్టుపొంగలి (మిరియాలపొంగలి) – మరీచ్యన్నం

కిచిడీ – శాకమిశ్రితాన్నం

గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం

చక్కెరపొంగలి – శర్కరాన్నం

చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం

నిమ్మకాయ పులిహోర – జంభీరఫలాన్నం

నువ్వులపొడి అన్నం – తిలాన్నం

పరమాన్నం (పాలాన్నం)- క్షీరాన్నం

పానకం – గుడోదకం, మధురపానీయం

పాయసం – పాయసం

పిండివంటలు – భక్ష్యం

పులగం – కుశలాన్నం

పులిహోర – చిత్రాన్నం

పెరుగన్నం – దధ్యోదనం

పేలాలు – లాజ

బెల్లపు పరమాన్నం – గుడాన్నం

వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపమ్

వడలు – మాసపూపం

శెనగలు (శుండలు) – చణకం

హల్వా – కేసరి


|| వివిధ పదార్థాలు ||

🍯🍯🍯🍯🍯🍯

అప్పాలు – గుడపూపం

చెరుకుముక్క – ఇక్షుఖండం

చక్కెర – శర్కర

తేనె – మధు

పాలు – క్షీరం

పెరుగు – దధి

బెల్లం – గుడం

వెన్న – నవనీతం

బుద్ధి కలుషితం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లో𝕝𝕝  బుద్ధౌ కలుషభూతా*

*యాం వినాశే సముపస్థితే।*

        *అనయో నయసంకాశో* *హృదయాన్నావసర్పతి*॥


తా𝕝𝕝 *పోయేకాలం దగ్గరకి వస్తే బుద్ధి కాస్తా కలుషితం అయిపోతుందట... అప్పుడు చేయకూడని పనులు చేయాల్సినవిగానూ, చేయవలసిన పనులు కూడనవి కానూ కనిపిస్తాయట... అంతేకాదు,* *చేయకూడని పనిని చేపట్టేదాకా అది హృదయంలోనే తిష్ట వేసుకుని ఉండిపోతుంది....అందుకే పెద్దలు వినాశకాలే విపరీతబుద్ధి అన్నారు కదా*!


 ✍️🌺🪷💐🙏

కథ

 అన్నదాన మహిమ..

अन्नदान महिमा -


పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు.


प्राचीने काले, एकः ब्राह्मणः काशी-तीर्थयात्रां कर्तुं प्रस्थितवान्। तस्मिन् काले यात्रायाः साधनानि, समुचितमार्गव्यवस्था च न आसीत् । अतः काशी-नगरं प्राप्तुं क्षेत्रानुगुणं कतिपयान् मासान् यावत् यात्रां करणीया आसीत्। पर्यटकाः यात्रा मध्ये ग्रामेषु रात्रौ तिष्ठन्ति स्म।



ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేక పోయాడు... చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు.

శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు.

తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి, చంపి వేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు.*

కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు.


अयं ब्राह्मणः विलम्बस्य कारणात् अन्धकारे यत्र गन्तव्यं तत् ग्रामं प्राप्तुं न शक्तवान्। अन्धकारः अस्ति। किं करणीयम् इति अहं न जानामि स्म। परन्तु सौभाग्येन एकं गृहं प्राप्तम्। सः तत्र आश्रयं अन्विष्यत्।

व्याधः शम्बरः तं आश्रयं दातुं अङ्गीकृतवान्, तं भक्षयितुं वेणु-तण्डुलान् मधुः च अददात्।

तस्य कुटीरं लघु आसीत् इति कारणात्, ब्राह्मणाय तस्मिन् निद्रां कर्तुं प्रोक्तवान् बहिः निरीक्षणं कर्तुं गच्छति स्म। मध्यरात्रौ, एकः व्याघ्रः तस्य उपरि आक्रमणं कृत्वा, तस्य वधं कृत्वा तस्य शरीरं अपहारयत्। ब्राह्मणः स्तब्धः अभवत्। 

व्याधस्य मृत्योः चिन्तितवान् सः स्वमार्गम् अगच्छत्। काशी आगतवान्।


దైవదర్శనం చేసుకున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది.

తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు.


सः ईश्वरं दृष्टवान्। ब्राह्मणाय अन्नदानं श्रेष्ठम् अस्ति वा इति सर्वदा शङ्का आसीत्।

सः चिन्तितवान् यत् तस्य प्रियः देवः विश्वेश्वरः तस्य संशयस्य निवारणं करोति चेत् उत्तमं भविष्यति इति। तस्मिन् रात्रौ भगवतः तस्यां स्वप्ने दर्शनं दत्तवान् तथा च तव पुनरागमनयात्रायां एकं राज्यं गमिष्यसि इति उक्तवान्न्। 


అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు... ఎందుకో చెప్పలేదు.


तस्य राज्यस्य राज्ञः एकः पुत्रः जातः। सः ब्राह्मणाय एकान्ते शिशुं आशीर्वादं ददातु इति उक्तवान् … किमर्थम् इति न अवदत्।


బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి,... ఓయీ బ్రాహ్మణా..! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి... శంబరుణ్ణి.. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు.

మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువు మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.


ब्राह्मणः अपि तथैव कृतवान्। सः केवलं राजकुमारं आशीर्दिष्टुं गतवान्। राज्ञः पुत्रः ब्राह्मणं दृष्ट्वा स्मितः। आह...! किं त्वं माम् स्मर्यसि? अहं - शाम्भरः.. एकं रात्रिभोजनं दत्त्वा, अस्मिन् जीवने अहं राजयोगाय सिद्धः अस्मि।

अचिरात् सः पुनः पूर्वज्ञानं नष्ट्वा सामान्यशिशुः इव क्रीडितुम् आरब्धवान्। ब्राह्मणः स्तब्धः अभवत्। एषा कथा अन्नदानं श्रेष्ठम् इति कथयति।


ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః

ओम् श्री अन्नपूर्णा देव्यै नमः

అన్నదాన మహిమ...

 అన్నదాన మహిమ...

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు.

ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేక పోయాడు... చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు.

శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు.

తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి, చంపి వేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు.*

కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు.

దైవదర్శనం చేసుకున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది.

తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు... ఎందుకో చెప్పలేదు.

బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి,... ఓయీ బ్రాహ్మణా..! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి... శంబరుణ్ణి.. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు.

మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువు మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః

ఏరువాక పౌర్ణమి

 🌹 ఏరువాక పౌర్ణమి🌹


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


భారతీయ సంస్కృతికి , జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం.  దానికి తొలి పనిముట్టు నాగలి , ముఖ్యవనరు వర్షం.  ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ *'కృషిపూర్ణిమ'*. దీనికే *హలపూర్ణిమ,* *ఏరువాక పున్నమి* అనే పేర్లున్నాయి. *'ఏరు'* అంటే నాగలి అని , *'ఏరువాక'*  అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం , నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం *జ్యేష్ఠ పూర్ణిమ* పర్వదిన ముఖ్యాంశాలు. రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం *జ్యేష్ఠ* అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు *జ్యేష్ఠపూర్ణిమ*. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు *(మంచు , ఎరువు , సూక్ష్మధాతువులు)* పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. పై కారణాలన్నింటివల్ల *జ్యేష్ఠపూర్ణిమనాడు* ఈ పర్వదినాన్ని జరుపుతారు.


వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద , భూమి , పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. నాగలిని శుభ్రపరచి , పసుపు , కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. పశువుల కొట్టాలు , కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. ఆపైన పొంగలిని *(కొన్ని ప్రాంతాల్లో పులగం)* వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు , ఎడ్లకు తినిపిస్తారు. నాగలిని పూజించి , పశువులను , బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు. పశువులగెత్తం *(ఎరువుగా మారిన పశువుల పేడ)* పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.


ఉత్తర భారతదేశంలో దీన్ని *'ఉద్‌వృషభయజ్ఞం'* అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 


రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. అధర్వణ వేదంలోనూ *'అనడుత్సవం'* అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. దీనిలో భాగంగా హలకర్మ *(నాగలిపూజ)* , మేదినీ ఉత్సవం *(భూమి పూజ)* , వృషభ సౌభాగ్యం *(పశువుల పూజ)* మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి. ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ *'కృషిపూర్ణిమ'* ప్రసక్తి ఉంది. 🙏


🌺ఏరువాక పౌర్ణమి🌺


జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఏరువాక పున్నమి. కృషిక పున్నమి. ఏరువాక పౌర్ణమి అనేక నామాలతో ఈ పండుగను ఈ ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులకు ఈ పండుగ పెట్టింది పేరు. ఏరువాక అనగానే ప్రయాణం చేయడం అనే అర్థాన్ని మనకు స్ఫురిస్తాయి. ఏరు అంటే పంటపొలాలు, నాగలి అని అర్థం వుంది. నాగలితో కృషిక క్రియకు ఉపక్రమించడం ఏరువాక అని అర్థం. అంటే దుక్కి దున్నడం. ఈ రోజు వ్యవసాయదారులు తమ సంరక్షణలో వుండే జంతువులను అనగా వృషభాలను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరించి వాటితో పాటుగా నాగలిని ఒక భుజంపై పట్టుకొని ఇతర వ్యవసాయ పనిముట్లను తీసుకొని వ్యవసాయ క్రియకి ఉపక్రమించడం ఈరోజు ఆరంభం చేస్తారు. కనుక దీనిని ఏరువాక పున్నమి అని పేరు. ఈ ఏరువాక పున్నమికి సీతాయజ్ఞము అని పేరు పెట్టింది విష్ణుపురాణము. "మంత్ర యజ్ఞా పరా విప్రాః" - అంటే బ్రాహ్మణులు మంత్రాదులు జపం చేయడంలో యజ్ఞం వలె ఆ దీక్షతో, లక్ష్యంతో వ్యవహరిస్తారు. అలాగే కర్షకులు సీతా యజ్ఞము - సీత అంటే నాగలి. నాగలితో దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని ఆరంభించి పంటలు పండిస్తారు. ఇది వారికి యజ్ఞంతో సమానం. అని వివరిస్తుంది విష్ణుపురాణం. 

విశ్వవ్యాపిత స్వరూపమంతా ఆకాశం. నిజానికి ఆకాశమంటే శూన్యం. ఏమీలేని ఆ శూన్యంలో నుంచి వెలుగుగా కనిపించే ఆ ప్రకాశంలోనుంచి వాయువు పుట్టింది. ఆ వాయువులోనుంచి అగ్నితత్త్వం పుట్టింది. ఆ అగ్నిలోనుంచే నీరు ప్రవహించింది. ఆ నీరు వర్ష రూపంలో ఈ భూమిపై పడిన సమయంలో అనేక ఓషధులు మొలకెత్తుతాయి. పాడిపంటలు, సస్యశ్యామలంగా ప్రకృతి అంతా పులకరిస్తుంది. కనుకనే ఏదో ఒకరూపంలో ఈ మాసంలో అమ్మవారిని(ప్రకృ తి), అయ్యవారిని(భూమి) అర్చించాలి.

వ్యవసాయాధారిత పండుగలలో ఇది ప్రధానమైనది. వైశాఖమాసంలో బలరామ జయంతిని చెప్పుకుంటాం. బలరాముడు వర్షాధార భూములన్నింటికీ నాయకుడుగా వ్యవహరించాడు. నాగలిని ఆయుధంగా ధరించాడు. బలరామక్షేత్రం అని మన ఆంధ్రప్రాంతానికి వున్న పేరు ఆయన నిజం చేశాడు. బలరాముడు కూడా ఈ పౌర్ణమిని ఆచరించినట్లుగా మనకు పురాణ కథలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏరువాక పౌర్ణమినాడు స్త్రీలందరూ కూడా వట సావిత్రీ వ్రతం అనే ఒక వ్రతాన్ని ఆచరించాలి. మర్రిచెట్టుకు చుట్టూ అయిదుసార్లు దారం చుట్టాలి. ప్రదక్షిణలు చేయాలి. పాలు పోయాలి. మర్రి వ్యాపించినట్లుగా శాఖోపశాఖలుగా ఊడలతో కలకాలం వంశం నిలవాలి అనే కోరిక ఈ నేపథ్యంలో వుంది. ప్రకృతిని కాపాడుకోవడమే


సేకరణ

వట సావిత్రి పూర్ణిమ వ్రతం

 🌹నేడు వట సావిత్రి పూర్ణిమ వ్రతం మరియు ఉపవాసం యొక్క ప్రాముఖ్యత 🌹


వట పూర్ణిమ ఉపవాసాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోసం కొన్ని ప్రాంతాలలో ఆచరిస్తారు భారతదేశం . ఉపవాసం మహాభారతంలోని సావిత్రి సత్యవాన్ పురాణం ఆధారంగా రూపొందించబడింది. వట్ పూర్ణిమ జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ (పౌర్ణమి) సందర్భంగా వ్రతాన్ని ఆచరిస్తారు మరియు ఇది గుజరాత్‌లో మరింత ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్ర . కొన్ని ప్రాంతాలలో ఇది మూడు రోజుల వ్రతం.


ప్రార్థనలు మరియు పూజలు వట్ వృక్ష (మర్రి చెట్టు) మరియు సావిత్రికి అంకితం చేయబడ్డాయి. చాలా మంది ప్రజలు ఇప్పుడు ప్రధాన ఆచార దినమైన పూర్ణిమ రోజున మాత్రమే ఉపవాసం ఉంటారు. ఈ ఆచారాన్ని పీపాల్ పూజ అని కూడా అంటారు.


మర్రి చెట్టు చుట్టూ ఎరుపు లేదా పసుపు దారం కట్టడం మరియు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండటం ఈ రోజు ప్రధాన ఆచారం.


వట్ సావిత్రి అమావాస్య వ్రతాన్ని జ్యేష్ట మాసంలో అమావాస్ (చంద్రుడు లేని రోజు)లో పాటిస్తారు మరియు ఈ వ్రతం ఉత్తరాది ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందిందని గమనించాలి.


🌻వట సావిత్రి పూజ  ప్రాముఖ్యత🌻


వట సావిత్రి పూజ లేదా వట్ సావిత్రి వ్రతం హిందూ మతంలో ఒక పవిత్రమైన రోజు, వివాహిత స్త్రీలు ఉపవాసం పాటించి, తమ భర్త ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. యమ (మరణం) బారి నుండి తన భర్తను తిరిగి తెచ్చిన సావిత్రి పేరు మీద ఈ ఉపవాసం పెట్టారు. వట్ (మర్రి) చెట్టుకు దారాలు కట్టడం ఆనాటి ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. 


ఉపవాసం మూడు రోజులు పాటించబడుతుంది మరియు హిందూ నెల జ్యేష్ఠ (జూన్ - జూలై)లో పూర్ణిమ లేదా అమావాస్యకు రెండు రోజుల ముందు ప్రారంభమవుతుంది.


ఉపవాసం దాని పేరు వట్ వృక్ష (మర్రి చెట్టు) మరియు సావిత్రి నుండి వచ్చింది. మర్రి చెట్టు ప్రతీకాత్మకంగా బ్రహ్మ, విష్ణు మరియు శివునిగా సూచించబడుతుంది. వట్ వృక్షానికి మూలం బ్రహ్మ, కాండం విష్ణువు మరియు పై భాగం శివ. పూజ రోజున, మర్రి చెట్టు ప్రతీకాత్మకంగా సావిత్రిని మరియు మహాభారతంలో పేర్కొన్న సంఘటనను సూచిస్తుంది.


పురాణాల ప్రకారం, అశ్వపతి రాజు కుమార్తె యువరాణి సావిత్రి భద్ర రాజ్యం , సత్యవాన్ అనే కలప నరికివేతతో ప్రేమలో పడ్డాడు. కానీ సత్యవాన్ ఒక సంవత్సరం లోపు చనిపోవాల్సి వచ్చింది మరియు సావిత్రికి ఈ వాస్తవాన్ని ఋషి నారదుడు తెలియజేశాడు. కానీ సావిత్రి సత్యవాన్‌ను వివాహం చేసుకుని అతనితో అడవిలో నివసించాలని నిర్ణయించుకుంది.


ఊహించినట్లుగానే సత్యవాన్ చెట్టుపై నుంచి పడి ఏడాదిలోపే చనిపోయాడు. మృత్యుదేవత యమరాజ్ అతన్ని తీసుకువెళ్లడానికి వచ్చాడు. సావిత్రి తన భర్తతో పాటు యమరాజ్‌ను అనుసరిస్తానని యమరాజ్‌కు స్పష్టం చేసింది. యమ్‌రాజ్ సావిత్రిని అతనిని అనుసరించకుండా నిరోధించడానికి అనేక మార్గాలు ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు మరియు సావిత్రి మొండిగా ఉండిపోయింది.


చివరగా, యమరాజు సావిత్రి భక్తికి చలించి సత్యవాన్‌ను తిరిగి బ్రతికించాడు.


జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున సత్యవాన్ తన చివరి క్షణాలను వట్ లేదా మర్రి చెట్టు కింద గడుపుతాడని నమ్ముతారు. మరియు యమరాజ్ ఇక్కడ కనిపించాడు మరియు సావిత్రి మర్రి చెట్టు క్రింద యమరాజును వేడుకుంది. ఈ సంఘటన జ్ఞాపకార్థం, మహిళలు తమ భర్తల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం 108 సార్లు మర్రి చెట్టు చుట్టూ దారాలు కట్టి ఉపవాసం ఉంటారు. 🙏

సేకరణ

అల్లుడి కాళ్ళెందుకు కడగాలి. ?

 🙏🙏🙏🙏🙏

వివాహ సమయంలో

అల్లుడి కాళ్ళెందుకు కడగాలి. ?

భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తన కంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి, ఆ నీటిని తన తలమీద, భార్య తలమీద చల్లుకోవడం తెలిసిందే. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. 'సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీమహాలక్ష్మీ స్వరూపి శ్రీం కన్యామ్' అనేది వివాహమంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా, వయసుఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాలనుంచి గంగపుట్టింది కనుక ఇతడి పాదాలనుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తలమీదచల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లికూతురు మహాలక్ష్మీ స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్లికూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్లాలని, అందువల్ల శ్రీలక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్దులంటారు.

(సేకరణ)

🙏🙏🙏🙏🙏

షట్ బేర ఆరాధన

 🙏🪷🙏🪷🙏

షట్ బేర ఆరాధన - సింహాచలం 


సింహాచల దేవాలయం పాంచరాత్ర ఆగమ విధాన వైష్ణవ సాంప్రదాయ దేవాలయం. దేవాలయంలో షట్ బేర ఆరాధన విధానము ఉన్నది.


1. ధ్రువ బేరం : మూల విరాట్ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి - గర్భాలయంలో మనం చూసే స్వామి.


2. స్వపన బేరం : యోగ నృసింహ స్వామి - అభిషేక కార్యక్రమాలు ఈ మూర్తికి జరుగుతాయి 


3. శయన బేరం : వేణుగోపాల స్వామి - ప్రతీ రోజూ శయన ఉత్సవం ఈ మూర్తికి జరుగుతుంది . రుక్మిణీ సత్యభామా సమేతుడై స్వామి ఉంటారు.


4. కౌతుక బేరం : మదన గోపాల స్వామి - ఈ మూర్తి లోనికి ద్రువ మూర్తి నుంచి కళావాహన, ఉపసంహరణ జరుగుతాయి. పూర్వం ఈ మూర్తి స్వామి పక్కనే ఉండేది అట. ఏకాదశి దినాల్లో ఈ స్వామికి తిరువీధి జరుగుతుంది.


5. ఉత్సవ బేరం: గోవింద రాజస్వామి - చందనోత్సవం తప్ప దేవలయంలో జరిగే అన్ని ఉత్సవాలు ఈ మూర్తికే జరుగుతాయి. స్వామి మందహాసం తో , చేతులకు, కాళ్ళకు నఖముల తో ప్రత్యేకముగా బహు సుందరంగా ఉంటారు. స్వామి ఆపాద మస్తకము వర్ణన చేస్తూ ఎన్నో కావ్యాలు ఉన్నాయి. 


6. బలి బేరం : బలి నారాయణుడు ( చక్ర పెరుమాళ్) - విశేష హోమాలు, బలిహరణలు ఈ మూర్తికి జరుగుతాయి. సింహాచలంలో ఈ మూర్తి చాలా అరుదు అయినది. స్వామి 16 భుజాలతో ఉంటారు.


ధ్రువ, స్వపన బేరాలు గర్భాలయంలో చూడవచ్చును. మిగిలినవి భోగ మండపం ఇరువైపులా ఉన్న చిన్న అద్దాల నిర్మాణాలలో ఉంటాయి. 


సింహగిరి నరహరి నమో నమో దయానిధి.

🙏🪷🙏🪷🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - గ్రీష్మ ఋతువు - జే‌ష్ట మాసం - శుక్ల పక్షం  -‌  పూర్ణిమ & కృష్ణ ప్రతిపత్ - మూల -‌‌ స్థిర వాసరే* (22.06.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం 22.06.2024 Saturday

 ఈ రోజు పంచాంగం 22.06.2024  Saturday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: పౌర్ణమి తదుపరి ప్రతిపత్తి తిధి స్థిర వాసర: మూల నక్షత్రం శుక్ల యోగ: బవ తదుపరి బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పౌర్ణమి ఉదయం 06:36 వరకు తదుపరి పాడ్యమి రేపు తెల్లవారుఝామున 05:12 వరకు.

మూల సాయంత్రం 05:50 వరకు.


సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:49


వర్జ్యం : సాయంత్రం 04:15 నుండి 05:50 వరకు తిరిగి రాత్రి 03:06 నుండి 04:39 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 05:47 నుండి 07:31 వరకు.


అమృతఘడియలు : పగలు 11:32 నుండి మధ్యాహ్నం  01:07 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

జగన్నాథ జ్యేష్ఠాభిషేకం

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 22/06/2024 - శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి మంగళస్నానం / నెత్రోత్సవం 𝕝𝕝 卐 𝕝𝕝_*

*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*


*జగన్నాథ జ్యేష్ఠాభిషేకం జగన్నాథ వార్షిక స్నానం*

~~~~~


*పరాయ పరరూపాయ పరంపారాయ తే నమః.*

*పరంపరాపరివ్యాప్త పరతత్త్వపరాయ తే.*


సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథునిగా, లక్ష్మీదేవి సుభద్రాదేవిగా, ఆదిశేషుడు బలభద్రునిగా - దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం. 


*అలౌకికీ సా ప్రతిమా లౌకికీతి ప్రకాశితా*


అలౌకికమైన దివ్యమూర్తులే లౌకికమైన దారుమూర్తులుగా ప్రకాశిస్తున్నాయి - అని పురాణవాక్కు.


ఏ క్షేత్రంలోనైనా మూలవిరాట్టుకు నిత్యాభిషేకమో, వారాభిషేకమో నిర్వహిస్తుంటారు. పూరీ జగన్నాథుని ఆలయం సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. పూరీలో కొలువై ఉన్న జగన్నాథునికి మాత్రమే ఏడాదికొక్కరోజు మాత్రమే అభిషేకం చేస్తారు.


*_ప్రతీ ఏటా జ్యేష్ఠపూర్ణిమ రోజున జగన్నాథునికి నిర్వహించే అభిషేకాన్నే దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు._*


ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరీలోని మూలవిరాట్టులు దారుతో చేసినవి. అంటే వేప చెక్కతో మలచిన శిల్పాలు. దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి గనుక, నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి,  ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికే అభిషేకం చేస్తారు. దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు.


అయితే…..


జ్యేష్ఠపూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాదమస్తకం పవిత్రజలాలతో అభిషేకం చేస్తారు. గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నానవేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు.


ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తాం. ఆ నేపథ్యంలోనే పూరీ జగన్నాథునికి కూడా 108 కలశాలతో జ్యేష్ఠపూర్ణిమ అభిషేకం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే వినియోగిస్తారు. స్నానవేదికపై ముగ్గురు దేవతలతో పాటు సుదర్శనుణ్ణి కూడా ప్రతిష్టిస్తారు. అనంతరం జగన్నాథునికి 35 కలశాలు, బలరాముడికి 33 కలశాలు,  సుభద్రకు 22 కలశాలు, సుదర్శనుడికి 18 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు. అభిషేకం పూర్తైన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపజేసి నైవేద్యాలు సమర్పిస్తారు. అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు.


స్నానపూర్ణిమ ఉత్సవం పూర్తైన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఓ చీకటి మందిరానికి తరలిస్తారు. అందుకు కారణమేమిటీ అంటే నీళ్లలో బాగా తడిసిపోవడంతో స్వామివారికి జలుబూ, జ్వరం వస్తాయని అర్చకులు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజులపాటు చీకటి మందిరంలోనే ఉంచి ప్రత్యేక సపర్యలు చేస్తారు. నిత్యం సమర్పించే నైవేద్యాలు కాకుండా జలుబు నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసిన వంటకాలనే నివేదన చేస్తారు. ఈ పదిహేను రోజులూ భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు. అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు. దీన్నే పట్టచిత్రా అంటారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజున చీకటిగదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్టిస్తారు. దీన్నే నవయవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు.


ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది.  మొత్తం మీద జ్యేష్ఠ పౌర్ణమి నుంచి పక్షం రోజులపాటు స్వామివారు దర్శనమివ్వరు.


*_𝕝𝕝 ॐ 𝕝𝕝 జై జగన్నాథ 𝕝𝕝 卐 𝕝𝕝_*


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*


🚩 *_స్వస్తి_* 🚩

Support this blog

 Support this blog


Do you think this blog is useful. 

Please support financially by donating via G Pay Or phone pay to this Mbl. 9848647145