22, జూన్ 2024, శనివారం

రాష్ట్ర శాసన సభ్యులు -

 *రాష్ట్ర శాసన సభ్యులు - సుపరిపాలన 6*


సభ్యులకు నమస్కారములు.


మన రాష్ట్ర  చట్ట సభ  రెండు సభలను కల్గి ఉన్నది.  1) శాసన సభ లేక విధాన సభ 2) శాసన మండలి / విధాన పరిషత్. 

1) *శాసన సభ/విధాన సభ* సభ్యుల ఎన్నికల నిర్ణయం భారత దేశ ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. సభ్యుడు రాజీనామా చేసినా, అనర్హుడిగా ప్రకటింపబడినా లేక స్వర్గస్తుడైనా, ఆ నియోజక వర్గంలో  *సభ్యుడు లేనప్పుడు*  ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి సభ్యుడిని ఎన్నిక చేస్తారు. పై పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆరు (6) నెలల వ్యవధిలో ఉప ఎన్నికలు జరుగవల్సి ఉంటుంది. సాధారణంగా శాసన సభ / విధాన సభ సంవత్సరంలో మూడు సార్లు సమావేశమవుతుంది. 1) బడ్జెట్ సమావేశాలు 2) వర్షాకాల 3) సీతాకాల సమావేశాలు. సమావేశాలు ఎంతకాలం జరగాలి అన్న విషయం స్పీకర్ అధ్యక్షతన Business Advisory Council (BAC) తీసుకునే నిర్ణయంపై ఆధారపడివుంటుంది. మన శాసన సభ  119 నియోజక వర్గములు కల్గిఉన్నది అధికారానికి రావాలంటే కనీసము 60 స్థానాలు సాధించి ఉండాలి. *భారత రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర శాసన సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు*.


2 *శాసన మండలి/విధాన పరిషత్*  శాసన  మండలి సభ్యులు ప్రజలచే పరోక్షంగా ఎన్నిక కాబడుతారు. శాసన మండలి *శాశ్వత సభ*. మామూలు పరిస్థితులలో రద్దు చేయు వీలుకాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు వంతుల సభకు ఎన్నికలు నిర్వహిస్తారు. మండలి సభ్యుని పదవీ కాలము ఆరు (6) సంవత్సరములు. శాసన మండలి లోని సభ్యుల సంఖ్య  శాసన సభ/విధాన సభ సభ్యుల సంఖ్యలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉండరాదు.  కనీసము 40 మంది సభ్యులుండాలి. 

ఎన్నిక:-  I) మండలిలోని మొత్తము సభ్యులలో 1/3 వంతును రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు. ii) 1/3 వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు iii)  1/3 వంతును పట్టభద్రులు iv) 1/2 వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. v) 1/6 వంతును గవర్నర్ గారు ప్రతిపాదిస్తారు. 


ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వాలు శాసన మండలిని రద్దు చేయాలనుకుంటే, ఆ తీర్మానం పార్లీమెంటుకు పంపాలి. రద్దు తర్వాత శాసన మండలిని   మళ్ళీ పునరిద్దంచాలంటే తిరిగి చట్టం చేయాలి. *శాసన సభా సభ్యులు గాని, శాసన మండలి సభ్యులు గాని ప్రజా సేవయే పరమార్థంగాఉంటారు*

ధన్యవాదములు

(*సశేషం*)

కామెంట్‌లు లేవు: