21, జూన్ 2023, బుధవారం

పురుషోత్తమ క్షేత్రమని

 పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. స్వామి వారికి 56 నుండి 64 రకాల పిండి వంటలను నివేదిస్తారు. ఇక్కడ వంటను సాక్షాత్‌ మహాలక్ష్మీదేవి అదృశ్య రూపంలో పర్యవేక్షిస్తుంటుందట, అందుకే అన్న ప్రసాదాలు అంత రుచికరంగా ఉంటాయని అక్కడి వారి విశ్వాసం. 


*💫పూరి వంటగది అద్భుతమైనది  ఆశ్చర్యమైనది💫*


500మంది వంటవారు!!300మంది సహాయకులు!!

752చుల్హాల తయారీ!!

700మట్టి కుండలతో వంటలు

ఆచారాలసమయంలో 6000మంది పూజారులు!


172సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం లోని ఎకరంలో విస్తరించి ఉన్న 32 గదుల ఈ విశాలమైన వంటగదిలో (150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు మరియు 20 అడుగుల ఎత్తు), 752 చుల్హాలను దేవతకు అర్పించే మహాప్రసాద్‌ను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు.


మరియు సుమారు 500 మంది వంటవారు మరియు వారి సహాయకులు 300 మంది పనిచేస్తున్నారు .... ఈ సమర్పణలన్నీ ఏడు వందల మట్టి కుండలలో వండుతారు, వాటిని 'అట్కా' అని పిలుస్తారు. సుమారు రెండు వందల మంది సేవకులు కూరగాయలు, పండ్లు, కొబ్బరి మొదలైన వాటిని కోసి, సుగంధ ద్రవ్యాలు రుబ్బుతారు ..

ఈ వంటగదిలో ఏమైనా భోగ్ తయారవుతుందని నమ్ముతారు ......


దీని నిర్మాణం మాతా లక్ష్మి పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది.


ఈ వంటగది ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది అంటారు.ఇది ఆలయం యొక్క ఆగ్నేయ దిశలో ఉంది.ఆహారం పూర్తిగా శాఖాహారం.

 

ఆలయంలో బంగాళాదుంపలు, టమోటాలు మరియు కాలీఫ్లవర్ ఉపయోగించబడవు.

ఇక్కడ తయారుచేసిన వంటకాలకు 'జగన్నాథ్ వల్లభ్ లడ్డు', ' మఠపులి' అని పేరు పెట్టారు. భోగ్‌లో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడటం నిషేధించబడింది.


వంటగది దగ్గర రెండు బావులు ఉన్నాయి, వీటిని 'గంగా' మరియు 'యమునా' అని పిలుస్తారు.


వాటి నుండి వచ్చే నీటి నుండి మాత్రమే భోగ్ తయారవుతుంది.  ఈ వంటగదిలో 56 రకాల భోగా తయారు చేస్తారు.  మహా ప్రసాద్ కాయధాన్యాలు, బియ్యం, కూరగాయలు, తీపి పూరి, ఖాజా, లడ్డస్, పెడాస్, బూండి, చివ్డా, కొబ్బరి, నెయ్యి, వెన్న, మిస్రి మొదలైన వాటి నుండి తయారవుతుంది ...


వంటగది మొత్తం వంట సామగ్రిని సరఫరా చేస్తుంది.  రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు.


ఎనిమిది లక్షల లడ్డస్‌ను కలిపి తయారు చేసినందుకు ఈ వంటగది పేరు గిన్నిస్ పుస్తకంలో కూడా నమోదు చేయబడింది.


వంటగదిలో ఒకేసారి 50 వేల మందికి మహాప్రసాద్ తయారు చేస్తారు.  ఆలయ వంటగదిలో ప్రతిరోజూ డెబ్బై రెండు క్వింటాళ్ల బియ్యం ఉడికించాలి.


వంటగదిలో, బియ్యం ఒకదానికొకటి 7 కుండలలో వండుతారు.  ప్రసాదం చేయడానికి, 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు.  పైభాగంలో ఉంచిన పాత్రలో ఉంచిన ఆహారాన్ని మొదట వండుతారు ...తరువాత ప్రసాదం కింది నుండి ఒకదాని తరువాత ఒకటి వండుతారు.  ప్రతిరోజూ కొత్త పాత్రలను భోగ్ తయారీకి ఉపయోగిస్తారు.


అన్నింటిలో మొదటిది, భోగ్ ను భగవంతునికి అర్పించిన తరువాత, ప్రసాదం భక్తులకు ఇవ్వబడుతుంది.


జగన్నాథ్‌కు 'అబ్దా' అని పిలువబడే మహాప్రసాద్‌ను అర్పించిన తరువాత, దీనిని తల్లి బీమలకు అర్పిస్తారు ... అప్పుడు ఆ ప్రసాద్ మహాప్రసాద్ అవుతుంది ...


మహాప్రసాదాన్ని జగన్నాథ స్వామి కి రోజుకు ఆరుసార్లు అర్పిస్తారు.


రథయాత్ర రోజున, ఒక లక్ష పద్నాలుగు వేల మంది వంటగది కార్యక్రమంలో మరియు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ...


ఆచారాలలో 6000 మంది పూజారులు పనిచేస్తున్నారు.  ఒడిశాలో జరిగే పది రోజుల పాటు జరిగే ఈ జాతీయ ఉత్సవంలో పాల్గొనడానికి ప్రపంచంలోని అన్ని మూలల ప్రజలు ఉత్సాహంతో వస్తారు.


 ఇక్కడ వివిధ కులాల ప్రజలు కలిసి తింటారు, కులం, మతం అనే వివక్ష లేదు.


🙏🌺 పూరీలో జగన్నాథ స్వామికి నివేదించే ఛప్పన్న బోగాలేమిటి వాటి తయారీకి ఉపయోగించే పదార్థాలు.🌺🙏


🌺1. అన్నం

2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)

3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)

4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)

5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

6. నేతి అన్నం 7. కిచిడీ

8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)

9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)

10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)

12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)

14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)

15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)

16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)

17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)

19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)

21. సువార్‌ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)

23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)

27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)

30. దొహిబొరా (పెరుగు గారెలు)

31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)

33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)

35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)

36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)

38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)

39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)

40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)

41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)

42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)

43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్‌ డల్లి (మినప్పప్పు వంటకం)

47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)

48. మవుర్‌ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)

49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)

51. పొటొలొ రొసా (పొటల్స్‌/పర్వల్‌ కూర)

52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)

53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)

54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)

55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె)

 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)🌺

ఆషాఢమాసంలో

 *ఆషాఢమాసంలో చేసి తీరాల్సిన పనులు!*


 వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఈ ఆషాఢమాసంతో తనతో కొన్ని ఆచారాలనూ తీసుకువస్తుంది. 


ఇవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చుగాక! కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనకా ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి...

పేలాల పిండి:ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫసంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే!  ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలుకలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలిఏకాదశి రోజున తప్పకుండా పేలాలపిండి తినాలని చెబుతూ ఉంటారు.

మునగాకు:మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటిసమస్యలన్నీ తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు చిరుచేదుగా ఉంటుంది. పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకుని తినేందుకు ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా ఫర్వాలేదనుకున్నా... వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడినీ పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది.


దానాలు:ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం, పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెబుతుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. ముఖ్యంగా గొడుగు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులూ ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా!

సముద్రస్నానాలు:ఆకామావై పేరుతో సముద్రస్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢమాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకూ సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్షరుతువుతో పాటుగా అందులోకి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాలలో ఉన్న ఔషధగుణాలని తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్రస్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది.


గోరింటాకు:ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే! అలా తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనులలో పాల్గొనేవారైతే రోజూ నీటిలో తడవక తప్పదు. దాంతో గోళ్లు సందున నీరు చేరి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోళ్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకి ఉంది. పైగా గోరిటాకుని పెట్టుకోవడం వల్ల కఫసంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు.

ఆవకాయట

 *


“ఆవకాయ “ 

కలిపెడిది ఆవకాయట😀😀😀


ఆవకాయ మీద తెలుగు భాషలో ఎంతో సాహిత్యం ఉద్భవించింది.


ఈ క్రింది పద్యాలని చూడండి


కం.

కలిపెడిది ఆవకాయట

కలిపించెడి వారు మామ గారట మరి నే

కలిపిన రుచికరమగు నట

కలుపగ వేరొండు గాయ కలుపగ నేలా


కం.

ఉదయమె బ్రెడ్డున జాముకు

బదులుగ ఇదివాడిచూడు, బ్రహ్మాండములే,

అదియేమి మహిమొ తెలియదు,

పదునుగ నీ బుర్ర అపుడు పనిచేయునయా!


కం.

ఇందువల దందు బాగని

సందేహము వలదు; ఊట సర్వ రుచిహరం

బెందెందు కలపి చూసిన,

అందందే రుచిగనుండు, అద్భుత రీతిన్!


కం.

చారెరుగనివాడును, గో

దారిన తా నొక్కమారు తడవని వాడున్,

కూరిమిన ఆవకాయను

ఆరారగ తిననివాడు, తెలుగు వాడు  కాడోయ్!


కం.

శ్రేష్టంబిది పచ్చళ్ళలోన,

టేష్టున ఇది మొదటనుండు డెఫినెట్ గానూ,

ఇష్టముగ ఆవకాయను

సుష్టుగ తిని దొర్లినంత సుఖమది కలదే!


కం.

ఊరిన ముక్కను కొరకగ,

ఔరా! అది ఎంత రుచిని అందించునయా,

కూరిమితొ నాల్గు ముక్కలు

నోరారా తినని నోరు నోరవ్వదుపో!


కం.

బెల్లము వేసిన మధురము,

పల్లీనూనెను కలపగ పచ్చడి మధురం,

వెల్లుల్లి వేయ మధురము,

పుల్లని మామిడితొ చేయ ముక్కది మధురం!!!


ఆవకాయ అవతరణ:


కం.

చప్పటి దుంపలు తినుచును,

తిప్పలు పడుచుంటిమయ్య దేవా, దయతో

గొప్పగు మార్గం బొక్కటి

చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్పన్


ఆవకాయ ఇష్టం లేదని ఎవరైనా అంటే వానిని ఒక కవి ఏకంగా శపించేస్తున్నాడు చూడండి


కం.

ముక్కోటి దేవులందరు

మ్రొక్కగ తా జిహ్వలేప సృష్టించెనయా

చక్కనిది ఆవకాయన

ముక్క తినని వాడు కొండముచ్చై పుట్టున్!!


ఈ ఆవకాయలోని ముక్కకి చాలా పేర్లు ఉన్నాయి:


కం.

చెక్కందురు డిప్పందురు

ముక్కందురు కొంతమంది మురిపెము తోడన్

డొక్కందురుగ  మామిడి

పిక్కందురు దీనికన్ని పేర్లున్నవయా!


మరొక మంచి గేయ కవితని చూడండి.


ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది

మాగాయ పేరిన నేయ్యితో మంతరిస్తుంది

మెంతికాయ  మోజు పెంచేస్తుంది

తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది

కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది

బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది

పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది

పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది


చింతకాయ చింతించినా చూడరు

ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు

గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు

కొరివికారం కొరకొర చూసినా చలించరు

టమాటా టక్కుటమారాలు చేసినా పడరు

నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా

అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు

వంకాయ బండపచ్చడి బాధపడినా


నువ్వు పచ్చడి నువ్వులేక నేను లేనన్నా

దోసావకాయ దోరగా నవ్వినా

నారింజకారం కవ్వించినా 

కొత్తిమీరపచ్చడి కొంటెగా విజిలేసినా

పుదీనా పచ్చడి ప్రాణం పెడతానన్నా

క్యాబేజి పచ్చడి  ఘుమఘుమలాడినా

కొబ్బరిపచ్చడి  కూతపెట్టి పిలిచినా

బీరకాయ పచ్చడి బీరాలు పోతున్నా

కన్నెత్తయినా చూడని ఋష్యశృంగుడిలా

వేసవికాలమంతా వేడి ఆవిర్లు కమ్ముతున్నా

వడగళ్ల జడివానలు కురుస్తున్నా

చల్లని హేమంత శీతగాలులు వణికిస్తున్నా

అన్ని ఋతువుల అమృతమనుచు

మామిడికాయ తో కలిపిన ఆవకాయలకే


అగ్ర తాంబూలమిచ్చే ఆంధ్రులందరికీ

ఎన్నెన్ని రుచులు ఇల లో ఉన్నా

కంటికింపుకాదు నోటికి రుచికాదు

మనసుకి తృప్తికలుగదన్నది నిక్కమని

ఇంతటి మహత్తరమైన ఆవకాయని, ఇంతమంది అంతగా అందరూ పొగిడే ఆవకాయని మనం వదిలి పెట్ట గలమా! నిస్సందేహంగా వదలలేం.


పదార్థాలని తినేప్పుడు అందరూ ఆవకాయని నంజుకుని తిని ఆవకాయ రుచిని ఆస్వాదించండి. చక్కటి వరి బియ్యం అన్నంలో ఆవకాయని కలిపి కమ్మని ఆవు నేయితో నిజమైన ఆవకాయ రుచిని ఆశ్వాదించండి.


– O.V.L.N. Murthy,

WordPress.com.

యోగ.. రహస్యం...*

 *భారతీయ యోగ.. రహస్యం...*


మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో 

ఆ రహస్యం ...


*శ్వాస*

-------------

మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.


ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?


దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...

అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.


మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.


ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది. 

దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.

ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".

ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...


ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.

ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...

ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...

ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.

ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......


ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...

ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...

ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.


పాత వాటిని ఖాళీ చేస్తేనే...

కొత్తవి రాగల్గుతాయి.

అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.


ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో... 

వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,

సరిగా ఉష్ణం జనించక......

తీవ్ర రోగాల బారిన పడతారు...


కనుక ఈ టాక్సిన్ లను

బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్

(విసర్జన)"

చాలా ముఖ్యం.


ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.


అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


5 రోజులు జీవిస్తుంది......


13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...


7 రోజులు జీవిస్తుంది......


ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...

మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.


ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......

అలాగే ఈ కణాలు కూడా......


భారతీయ యోగులు ...

కణం యొక్క జీవిత కాలాన్ని...

3 నుండి 21 రోజుల వరకూ

పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...


శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...

ఆ కణం త్వరగా పాడై పోతుంది.


*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"* ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......

మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...


ఎందుకంటే......


అవయవాలు అంటే...

కణాల సముదాయమే.


ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...

ఆయుష్షు పెరిగితే...


*మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!*


*మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...*

*20 సంవత్సరాల ఆయుష్షును*

*పెంచు కోవచ్చు...*


*యోగులు...*

*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*

*తాము... ఏ రోజు...మరణించేదీ...*

*ముందే చెబుతారు 🙏🙏.*


సేకరణ


🌳🌴🌿🌱☘️🌴🌳🌱🌿☘️

సుభాషితమ్

 .                     🕉️


             _*సుభాషితమ్*_


శ్లో𝕝𝕝 

*ఆదౌ చిత్తే తతః కాయే*

*సతాం సంపద్యతే జరా౹*

*అసతాం తు పునః కాయే*

*నైవ చిత్తే కదాచన॥*

                                                                                                               తా𝕝𝕝|| సజ్జనులకు ముందుగా మనస్సులోను, ఆ తరువాత శరీరమునందును వార్ధక్యం వస్తుంది.... *దుర్జనులకు మాత్రం శరీరంలో వార్ధక్యం వస్తుందేగానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యంరాదు*.... {పెద్దరికం రాదు}

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 97*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️




*పార్ట్ - 97*


♦️వర్ణాశ్రమధర్మములు అన్ని వర్ణములవారికీ అనుసరణీయములు. వాటిని తప్పక పాటించవలెను. 


♦️దండనీతిని స్వపర బేధములు లేకుండా కఠినముగా అమలుపరచవలెను. 


♦️ శతృరాజులు, పరదేశీయులు, స్వదేశమునందలి దేశద్రోహులు, విప్లవకారులు, ప్రభుత్వములను కూలద్రోయుటకు కుట్రలు పన్నువారు వీరిని 'భేదోపాయము' చేతనే లొంగదీసుకొనుట శ్రేయస్కరము. భేదోపాయము ఆచరించుటచేత యుద్ధముల వంటి రక్తపాతములు, జననష్టము నివారించవచ్చును. 


♦️భేదోపాయమును సక్రమముగా అమలుపరచుటకు సమర్థులైన గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేసుకొనవలెను. 


♦️సన్మార్గుడైన ప్రభువుతో మిత్రత్వము పాటించి సంధి చేసుకొనవచ్చును సామంతునిగా అంగీకరించవచ్చును. 


♦️దుర్మార్గుడైన పొరుగురాజును ఏమాత్రం ఉపేక్షించరాదు. అట్టి ఉపేక్ష తన రాజ్యమునకు చేటు తెస్తుంది గనక - సామదాన భేద దండోపాయాల ద్వారా దుర్మార్గుడైన రాజును దండించి అక్కడ సన్మార్గుడినొక్కడిని తన ప్రతినిధిగా నియమించాలి. 


♦️చివరగా - రాజుకి ప్రజాసంక్షేమమే ముఖ్యము. ధర్మపరిరక్షణము కర్తవ్యం. కాన ధర్మస్థాపనార్థం రాజు లేక మహామంత్రి యే మార్గాన్ని అనుసరించినా దోషములేదు. తత్పలితము ధర్మపరిరక్షణమే గదా ...... !"


ఇలా చాణక్యుడు అనేక దినముల పాటు తన అర్థశాస్త్రముని కూలంకషముగా చంద్రగుప్తునికి బోధించాడు. అనంతరం...


"వత్సా ! పురాతన మనుధర్మశాస్త్రంలోని కొన్ని ప్రధాన సూత్రములను కాలానుగుతంగా నా అర్థశాస్త్రంలో ప్రస్తావించి అవసరమైన మార్పులు చేశాను. నేటి మార్పులు రేపటి కాలాన్ని బట్టి మరికొన్ని మార్పులకు దారితీయవచ్చు. మార్పు అభిలాషణీయం. అయితే ధర్మము అనునది న్యాయముపై ఆధారపడి ఉన్నది. న్యాయసమ్మతం కాని ధర్మము.... 'అది ఎంతటి ప్రాచీన ధర్మమైనా నా దృష్టిలో అధర్మమే...' ఎందుకంటే న్యాయసమ్మతం కాని, ఆచరణ యోగ్యం కాని ఏ ధర్మాన్నీ ప్రజలు ఆచరించరు. జనులు ఆచరించని ధర్మము వృధా... అంటే ధర్మం యొక్క మూలసూత్రము మారదు. ఏ రూపంలో ఆచరించినా ధర్మము ధర్మమే... అది నిరంకుశముగా నుండకుండా సర్వజనామోదముగా 'మూలసిద్ధాంతం మారకుండా ఆచరణా విధానాన్ని మార్చడమే' నా ఈ అర్థశాస్త్ర సిద్ధాంతము. అన్యాయమునకు గురియైన వానికి న్యాయం చేస్తే చాలదు. న్యాయమే జరిగిందన్న నమ్మకాన్ని కూడా కలిగించాలి. ఇదే నా అర్థశాస్త్ర సారాంశము...." అని వివరించాడు చాణక్యుడు. 


చంద్రగుప్తుడు శిరస్సు వంచి చేతులు జోడించి "కృతజ్ఞుడను ఆచార్యదేవా... అనితర సాధ్యమైన తమ అర్థశాస్త్రమును నాకు ఉపదేశించి నన్ను ధన్యుడిని చేశారు. రేపటినుంచే మీ అర్థశాస్త్రమును మౌర్య సామ్రాజ్యమంతటా అమలు చేయిస్తాను. సత్ఫలితాలు సాధిస్తాను. తమ అభీష్టాన్ని నెరవేరుస్తాను" అని చెప్పాడు శ్రద్ధాభక్తులతో. 


చాణక్యుడు మందహాసం చేసి "ఇప్పుడు మౌర్యసామ్రాజ్యం... మున్ముందు యావత్ భారతావని నీ పాలనలో, అర్థశాస్త్ర సత్ఫలితాలతో సర్వతోముఖాభివృద్ధి గాంచాలి. అదే ...... అదే ..... నా జీవితాశయం" అన్నాడు సాలోచనగా.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

ఈ రోజు పద్యము

 197వ రోజు: (సౌమ్య వారము) 21-06-2023

మన మాతృ భాష సేవలో


ఈ రోజు పదము:

అక్క (Elder Sister):  అగ్రజ, అగ్రభువు, అత్తిక, అప్ప, అవంతి, పూర్వజ. 


 ఈ రోజు పద్యము:


తనపై దయ నూల్కొనఁగను 

గొప్ప నేతెంచినను శీల గురుమతులను వం 

దనముగఁ  బూజింపం దగు 

మన మలరగ నిదియ విబుధ మతము కుమారా!


 ఓ కుమారా!  తన మీద దయతో ప్రవర్తించే మంచి ప్రవర్తన కల వారికి నమస్కారము చేసి గౌరవించుట, అవతలి వారి మనస్సు సంతోష పడునట్లుగా నడచుకొనుటయే బుద్ధమంతులు చేయుపని.

రసీదు

 టోల్ ఫ్రీ రసీదు విలువను అర్థం చేసుకోండి మరియు ఉపయోగించండి.

  

టోల్ బూత్ వద్ద దొరికిన 

ఈ రసీదులో ఏమి దాచబడింది మరియు దానిని ఎందుకు భద్రంగా ఉంచాలి? దాని అదనపు ప్రయోజనాలు ఏమిటి?" 

ఈ రోజు తెలుసుకుందాం.


1. టోల్ రోడ్డులో ప్రయాణిస్తున్నప్పుడు 

మీ కారు అకస్మాత్తుగా చెడిపోతే, మీ కారును లాగడానికి టోల్ కంపెనీ బాధ్యత వహిస్తుంది.


2. ఎక్స్‌ప్రెస్ హైవేలో 

మీ కారులో పెట్రోల్ లేదా బ్యాటరీ అయిపోతే, 

మీ కారును భర్తీ చేయడం మరియు పెట్రోల్ మరియు బాహ్య ఛార్జింగ్‌ను అందించే బాధ్యత టోల్ వసూలు సంస్థపై ఉంటుంది. మీరు కాల్ చేయాలి పది 10 నిమిషాల్లో సహాయం అందుతుంది మరియు 5 నుండి 10 లీటర్ల పెట్రోల్ ఉచితంగా లభిస్తుంది. కారు పంక్చర్ అయినప్పటికీ, మీరు ఈ నంబర్‌ను సంప్రదించడం ద్వారా సహాయం పొందవచ్చు.


3. మీ కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ, మీరు లేదా మీతో పాటు వచ్చే ఎవరైనా మొదటి టోల్ రసీదులో అందించిన ఫోన్ నంబర్‌ను సంప్రదించాలి.


4. కారులో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే, ఆ వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో మీకు అంబులెన్స్‌ని తీసుకురావడం టోల్ కంపెనీల బాధ్యత.

  

ఈ సమాచారం పొందిన వారు వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి.

కాకస్య దంతః

 

 కాకస్య దంతః 

పూర్వం ఒక గ్రామంలో వీధి అరుగుమీద ఇద్దరు పండితులు కూర్చొని ఒక విషయాన్ని గురినిచి తర్కించుకుంటున్నారట అదేమిటంటే " కాకస్య దాంతః" అంటే కాకికి దంతాలు వుంటాయని రామశర్మ అనే పండితుడు కాకికి దంతాలు ఉండవని కృష్ణ శర్మ అనే పండితుడు చాలా ఆవేశంతో తర్కిస్తున్నారు.  నారాయణ శర్మ అనే ఒక బ్రాహ్మడు అటువైపునుండి నడుచుకుంటూ  వెళుతున్నాడట. అది వారి కంట పడింది.  అప్పుడు ఆ పండితులు ఇద్దరు నారాయణ శర్మను ఆపి తమ తర్కమును విని సమాధానం చెప్పమన్నారు.  నారాయణ శర్మకు కంఠంలో వెలగకాయ పడ్డట్లు అయ్యింది.  ఎందుకంటె గ్రామంలో  రామ శర్మ, కృష్ణ శర్మ ఇద్దరు కూడా ఉద్దండ పండితులని వేద, మీమాంస, తర్క, న్యాయ, జ్యోతిషాది శాస్త్రాలు కూలంకుషంగా చదివిన దిట్టలని ప్రతితీ కాబట్టి సామాన్యుడైన నారాయణ శర్మ వారి తర్కం విని వారి తగువు తీర్చటం అంటే మాటలా.  అతని పని అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారయ్యింది.. 

కాకి కూడా ఘనాహారం అంటే పప్పులు, గింజలు మనుషులు తిన్నట్లే తింటుంది కాబట్టి కాకులకు తప్పకుండా దంతాలు ఉండి తీరాలిసిందే అని రామ శర్మ తన తర్కాన్ని చెపితే దానికి కృష్ణ శర్మ కాకికి వుండే ముక్కే చాలా చిన్నగా ఉంటుంది అందులో చిన్న నాలుక ఉంటుండి ఇక దంతాలు పెట్టె అంత నోరే లేనప్పుడు ఇక దంతాలు ఉండటానికి అవకాశం ఎక్కడ వున్నది.  నిజానికి కాకికి వున్న ముక్కుతోటె అంటే ఫై ముక్కు మరియు క్రింది ముక్కు మధ్యలో ఆహారాన్ని నమిలి తింటుంది అని కృష్ణ శర్మ వాదించాడు. ఇద్దరి వాదనలు విన్నతరువాట్ ఏమి మాట్లాడాలో   తెలియక తెల్లమొహం వేయవలసివచ్చింది నారాయణ  శర్మ. నిజానికి నారాయణ శర్మ వారిద్దరిలాగా పెద్దగా చదువుకొనక పోయినా కానీ చక్కటి యుక్తిపరుడు, ఎటువంటి సమస్యనయినా సాధించగల సాధకుడు. కొంచం ముందు బెరుకుగా ఉన్నకాని వారిద్దరికీ తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. 

పండితులారా పితృకార్యాలలో కాకులకు అదే వికిర పిండం ఎందుకు పెడతారో ముందు చెప్పండి అప్పుడు మీ సందేహాన్ని నివృత్తి చేయగలను అని వారి మనస్సును ప్రక్కత్రోవ పట్టించే ప్రయత్నం  చేసాడు. అతని ప్రయత్నం కొంత ఫలిచిందనే చెప్పవచ్చు.  కొన్ని సందర్భాలలో బాగా చదువుకున్నాం అనుకునే మేధావులు కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని వుండరు. ఇప్పుడు ఆ పండితుల ఇద్దరి పరిస్థితి అట్లానే అయ్యింది. పేలబోయిన వారి ముఖములను కనిపించకుండా తెలివిగా ఇద్దరు మేము అడిగినదానికి నీవు అడిగిన దానికి సంబంధం ఏమిలేదు ముందుగా మా సందేహం తీర్చమని నారాయణ శర్మ ను వత్తిడి చేశారు. 

నారాయణ శర్మ కూడా ఏమి తక్కువ తినలేదు పండితులారా వికిర పిండం తినాలంటే కాకి ఎలా తినాలి.  అందుకే నేను ఆ ప్రశ్నను వేసాను అని అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పండితులు కొంత వెనుకకు తగ్గవలసి వచ్చింది..  మాట మారుస్తూ వాళ్ళు ఇంతకూ నారాయణ శర్మ ఎందుకు ఇటువైపు వచ్చావు అని అన్నారు. అంటే మా గొడవ ఏదో మేము పడేవారం కదా మధ్యలో నీ వల్ల మేమిద్దరం తెలివిలేని వారిగా బయటపడవలసి వస్తున్నదే అన్నట్లుగా వున్నది వారి మాట. 

నారాయణ శర్మ వారిద్దరిని ఉద్దేశించి పండితులారా మనం ఎన్నో లక్షల జన్మలనుంచి తపిస్తూవుంటే ఆ ఈశ్వరుడు మనకు ఈ జన్మను  ప్రసాదించారు. ఎంతో జ్ఞ్యానం కలిగి వున్నాము ఇప్పుడైనా మనం కళ్ళు తెరువక ఇంకా శుష్క వాదనలతోటి కాలయాపన చేస్తే మన జన్మకు అర్ధం ఏముంది మనకు శంకర భగవతపాదులవారు చక్కగా భజగోవిందాన్ని బోధించారు.  కాబట్టి కాలాన్ని వృధాచేయకుండా చక్కగా పరమేశ్వరుని చేరే మార్గం ఎంచుకోవాలి అని అంటే వారిద్దరికీ కనువిప్పు అయ్యింది. 

నాటి నుండి రామ శర్మ కృష్ణ శర్మ శుష్క సంభాషణలు చేయకుండా చక్కగా సాధన చేతుష్టయాన్ని అవలంబీనించి ముముక్షుకత్వం వైపు పయనించారు. 

కాబట్టి భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ఓ సాధక మిత్రమా మనకు సమయం తక్కువగా వున్నది మోక్షపదం చాలా దూరంగా వున్నది ఈ క్షణం నుంచే మనం సాధన మొదలుపెడితే కానీ మోక్షాన్ని పొందలేము.  తస్మాత్ జాగ్రత్త 

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

 










భజగోవిందం

 ॐ                 भज गोविन्दं

                    భజగోవిందం 

                 (మోహముద్గరః) 

            BHAJA GOVNDAM   

 

      (श्रीमच्छंकरभगवतः कृतौ 

       శ్రీమచ్ఛంకరభగవత్పాద కృతం 

           BY SRI ADI SANKARA)


                           శ్లోకం :29/31

                   SLOKAM :29/31

                  

ఆదిశంకరుల ఆశీర్వచన మాలిక - 2   


अर्थंमनर्थम् भावय नित्यं,

नास्ति ततः सुखलेशः सत्यम्।

पुत्रादपि धनभजाम् भीतिः,

सर्वत्रैषा विहिता रीतिः॥२९॥

                    ॥भज गोविन्दं॥ 


అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||  

                    ॥భజ గోవిందం॥ 


    డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. 

    దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. 

    ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. 

    అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే. 


అనువాదం 


ధనము గూర్చదు సుఖము, 

               దుఃఖమే మిగులు తుది, 

ధనమూల మిదం జగత్తని ధన 

                      మమితముగ 

గూర్చుకొన, నిజ సంతతియు 

              భయ హేతువగును 

వివర మెరిగి విడువుము 

                   పేరాశ ధనముపై 


    धन अकल्याणकारी है और इससे जरा सा भी सुख नहीं मिल सकता है, 

    ऐसा विचार प्रतिदिन करना चाहिए | 

    धनवान व्यक्ति तो अपने पुत्रों से भी डरते हैं ऐसा सबको पता ही है॥२९॥  


    Keep on thinking that money is cause of all troubles, 

    it cannot give even a bit of happiness. 

    A rich man fears even his own son. 

    This is the law of riches everywhere. 


https://youtu.be/ImWKhB_PMiw 


                          కొనసాగింపు 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

            భద్రాచలం

శ్రీనాధ కవితా వైభవం

 ---శ్రీనాధ కవితా వైభవం!--


శా: " కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దు ష్క్రోధాంధకారంబు నన్ ,

జక్షుల్ రెండును జిమ్మచీఁకటులుగా , సంరంభ శుంభద్గతిన్ ,

బ్రేక్ష ఛ్ఛాత్రులు భీతిఁబొందఁ , గడు నుద్రేకించి ,హట్టంబునన్ ,

బిక్షాపాత్రము రాతిమీఁద శతధా భిన్నంబుఁగా వైచితిన్ .

శ్రీ భీమేశ్వర పురాణము - 2 ఆ: 102 వ పద్యము. కవిసార్వభౌమ శ్రీనాధుడు.


కఠిన పదములకు అర్ధము: కుక్షిప్రోధ్భవ- పొట్టనుం డిపుట్టిన ;నిష్ఠుర: కఠినముగా; క్షుధిత: ఆకలిపీడగలిగిన; దు ష్క్క్రోధ :చెడ్డదియైనకోపమనే

; అంధకారంబునన్: చీకటిచేత ; చక్షుల్ రెండును- రెండుకన్నులును : చిమ్మచీకటులుగా- గాఢాంధకారముకాగా ; సంరంభ-తొందరపాటు చే నేర్పడిన; శుంభద్గతిన్- వేగముతో ; ప్రేక్షత్ -చూచుచున్న ;ఛాత్రులు- శిష్యులు ; భీతిఁబొంద-భయపడగా ; కడునుద్రేకించి- మిక్కిలి నుద్రేకముతో; హట్టంబునన్- వీధిలో (రోడ్డుమీద) భక్షాపాత్రము- బిచ్చమెత్తుకొను గిన్నె (మట్టిగిన్నె) రాతిమీద ; శతధా-నూరుముక్కలుగా:భిన్నంబుగా వైచితిన్-పగులునట్లు నేలకు గొట్టితిని;


భావము: కడుపున నాకలిరేగ నాయాకలి వలన గలిగిన కోపమనే గ్రుడ్డితనమున కన్నులు రెండును మూసుకొనిపోగా(కనులకు చీకటికమ్మ) కడువేగముగా , పరిసరములందున్న 

శిష్యులెల్ల భయమందగా మిక్కిలి యుద్రేకముతో చేతనున్న భిక్షాపాత్రను నూరుముక్కలగునట్లు వీధిలో నేలకు గొట్టితిని; అనిదీని భావము.


వ్యాసుడు కాశీని  వీడివచ్చుటకు గల కారణమును అగస్త్యునకు వివరించు సందర్భము. ఒకరు లోకహితార్ధియై వింధ్యపర్వత గర్వముడుప ( అగస్త్యుడు) కాశిని వీడిరాగా, మరియొకరు (వ్యాసుడు) ఆకలి కాగలేక కాశిని శపింప బూని ,పరమేశ్వరాగ్రహమునకు లోనయి కాశిని వీడవలసివచ్చినది. వీరిరువురి కలయిక ఒక అపూర్వము.ఒక దివ్యసందేశము.


కోపమెంత దుర్గుణమో కదా! దానికి యాకలియు తోడైనది. ఇంకేమున్నది? పుణ్యాలరాశి  కాశిని వ్యాసుడుశపింప బూనినాడు.చివరకు కాశి నుండి బహిష్కరింప బడినాడు. వ్యాసునకు మూజురోజులు భిక్షదొరుక కుండుట పరమేశ్వరుని మాయయే!

కాని యతడద్దానిని తెలిసికొనలేక పోయినాడు.


వ్యాసు డెట్టివాడు? పరమ సంయమి.తపస్వి . విజ్ఙాని, మహఋషి. అట్టియుత్తముడే ఆకలి ,కోపములకు లొంగి పామరుని వలె ప్రవర్తించెను. కారణము? కోపము.కోపమెంతచెడ్డది?. దానిని అందరూ జయింప వలెనని దీని సందేశము.


రామాయణ కావ్యం సుందరకాండలో లంకా దహనానంతరం హనుమంతు డెంతో విచారిస్తాడు. "కోపంతో యెంతపనిచేశాను.లంకంతా కాల్చేశాను. సీతామాత కేమైనా ప్రమాదం కలగలేదుగదా! కోపాన్ని జయించినవారు యెంత ఘనులోగదా! .కోపం చాలా చెడ్డది.దానివల్ల యుక్తాయుక్తములు మరచిపోతాం. కాబట్టి దానికి దూరంగా ఉండాలి అని"- నిజమే

వ్యాసుని కోపావేశాన్ని ,ఆఉద్రేకాన్ని , ఆరౌద్రమూర్తిని ,శ్రీనాధమహాకవి ఈపద్యంలో ఆరభటీ వృత్తితో నిరూపించాడు. కఠిన సమాన పదజాలం, పెద్దపెద్ద సమాసాలు ఆరభటీ వృత్తికి పోషకాలు. ఈవిధంగా ఈపద్యంలో భయానక రసాన్ని పోషించి శ్రీనాధుడు

తన రసోచిత రచనను మనకు చవి చూపాడు.కోపంకూడదని సందేశించాడు.🙏

చిదంబర రహస్యం?

 శుభోదయం👏


చిదంబర రహస్యం?


 పార్ధసారధి అంబాళం వారి సౌజన్యంతో-


(మొదటి భాగం)

"దక్షిణాది దేవాలయాలలో

ఒకప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం చిదంబరం.

అది శివాలయం. ఆకాశలింగానికి స్థావరం.అంటే అక్కడ శివలింగం ఉండదు అడ్డుగా ఒకగోడమాత్రమే!

   "ఆద్యంతంఅద్భుతం .నాకోరిక మన్నించి మిత్రులు పార్ధసారధిగారు మనకు అనుగ్రహించారు.ఇది రెండు భాగాలు రోజుకొకటి విడువకుండా చదవండి!భావితరాలకోసం!!


ఇంకమొదలు పెట్టండి.


98.

దాదాపు పదేళ్ల క్రితం, బంధువులు, మిత్రులు అందరం కలిసి దక్షిణదేశ యాత్రకని బయలుదేరాము. అయితే, అది మంచి ఎండాకాలం. ఎక్కువ భాగం గుళ్లు చాలా సువిశాలమైనవి. అక్కడి ఆచారం ప్రకారం షర్ట్, బనియన్ సైతం విప్పేసి లోపలికి నడవాల్సివచ్చేది. మా అందరికీ చక్కటి, ఆనంద దాయకమైన అనుభవం కలిగింది. 


అనేక వైష్ణవ, శైవ దేవాలయాలు దర్శించుకున్నాం. అందులో చిదంబరం దేవాలయం నన్ను బాగా ఆకర్షించింది. ఆ దేవాలయం యొక్క స్థలపురాణం, భౌగోళికంగా దాని విశిష్టత తెలుసుకున్న నాకు ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతమైన దేవాలయం గుఱించి, నాకు తెలిసినంతవఱకు ఈరోజు మీకు తెలియజేస్తాను.  


శివాలయాలకు, వైష్ణ్వాలయాలకు తమిళనాడు పుట్టినిల్లు లాంటిది. ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు పరిపాలించిన చోళులు నిజంగా అభినందనీయులు. సంస్కృత భాషలో చోళము అంటే రాగులనబడే ధాన్యము. రాగులను బాగా పండించేవారు కాబట్టి, వారిని చోళులు అని పిలిచేవారని అంటారు. చివరకు అదే వారి శాశ్వత ఇంటి పేరు, పాలకుల వంశం పేరుగా ఖ్యాతినార్జించింది. 


శివుడి పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనమే అన్ని దేవాలయాలు. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భుతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు మనకు ఇంకెక్కడా కనబడవు. వారు అపారమైన ధనం వెచ్చించి చరిత్రలో నిలబడిపోయారు. కొందరు "రాజుల సొమ్ము రాళ్ల పాలని" అంటుంటారు.  


అక్కడి సువిశాలమైన దేవాలయాలను దర్శించుకొని పులకించిపోతాము. ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధులమవుతాము. ఇన్ని వేల యేళ్ళ నుంచి శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న  ఆలయాలను దర్శించుకోవడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తుంటాము. అవకాశం వున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన దేవాలయాలవి. 


అలాంటి అనేక శైవ దేవాలయాలలో, పంచ భూత శివ క్షేత్రాలలో, నటరాజ స్వామి వేంచేసి, ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం అతి ముఖ్యమైనది. ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారం అనుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారని ప్రతీతి. పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి "సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి" అనే ఐదు పారమార్థిక క్రియలను బయట పెడతారంటారు.


ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాల పైన, 13 అతి పెద్ద రాగి కలశాలతో పాటు, విశాలమైన వాకిళ్లు, అపురూపమైన శిల్ప సంపద, మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ దేవాలయంలో చిత్రాంబళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ, అనే ఐదు భాగాలున్నాయి.


చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వుంటాడు. చిత్రాంబళానికి ముందు భాగాన్ని పొన్నాంబళం అంటారు. ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకాలు చేస్తారు. పెరాంబళం అంటే దేవసభ. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అలరారుతుంటాయి. ఒకప్పుడు, నృత్తసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వ తాండవనృత్యం చేశారట. ఇక్కడ స్వామి నృత్యభంగిమ విగ్రహం ప్రతిష్టించబడి వుంది.


రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి మహర్షి, తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారట. మార్గశిర మాసంలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని, ఇతర దేవతలను ఐదు రథాలలో ఊరు ఎరిగిస్తారు (ఊరేగిస్తారు అనకూడదు).


చిత్రాంబళం ప్రాకారం బయట వున్న ప్రత్యేక ఆలయంలో శివ కామ సుందరీదేవి అమ్మవారుంటుంది. ఇక్కడే చిత్తగుప్తుడి (అందరూ అనుకుంటునట్లు చిత్రగుప్తుడు కాదు, చిత్తంలోనివి గుప్తంగా వ్రాసే వాడు) మందిరమున్నది. ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ మనల్ని కట్టిపడేసే విధంగా, చాలా బాగుంటుంది. 


నటరాజ ఆలయంలోని స్వామి మూలాట్టనేశ్వరార్. అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలోని స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనమవుతుందట. ఇక్కడి అమ్మవారి పేరు ఉమాదేవి. ముక్కురుని వినాయకర్ విగ్రహం 8 అడుగుల ఎత్తుంటుంది. ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడుంటాడు.


ఇంకా అనేక దేవీ, దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటాయి. నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ, కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వుందేమో.


చిదంబరం దేవాలయ విశేషాలు తెలుసుకున్నాం కదా, మరి, ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని వుంది కదా! ఒక్క 24 గంటలు ఆగి, ఆ రహస్యం ఏమిటో రేపు ఉదయం తెలుసుకుందాం.

చి దం బ ర ర హ స్యం!


       (రెండవ భాగం )

99.

నిన్నటి 'చిదంబరం దేవాలయం' గుఱించి తెలియజేసిన విషయాలకు ముఖపుస్తక పాఠకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఎప్పుడో నేను నా డైరీలో వ్రాసుకున్న దేవాలయ వివరాలు మిమ్మల్ని ఇంతగా అలరిస్తాయని, నేనెప్పుడూ ఊహించలేదు. అందరికీ పేరు పేరునా మరొక్కసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


అయితే, నిన్న దేవాలయ బాహ్య పరిస్థితులు తెలుసుకున్నాం. మరి ఆ చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృతగా వున్నారని నాకు తెలుసు. వివరిస్తాను, దయచేసి చదవండి. గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి ఎప్పుడు తెరవేసి వుంటుంది. అప్పటి ఋషులు, అక్కడ గోడలో ఒక విశిష్టమైన యంత్రం బిగించారని చెప్తారు. 


అది ఏ యంత్రమో ఎవరూ చెప్పలేక పోయారు. దాని పైన దట్టమైన చందనం పూయబడి వుంటుంది. దానిని ఎవరూ తాకడానికి వీలులేదు. ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి, యంత్రానికి పూజ చేస్తారు. ఇంకెవరూ పూజ చేయరు సరికదా, పూజా సమయంలో చూడటానికి కూడా అనుమతి ఇవ్వబడదు. 


అయితే, ఆసక్తిగల భక్తులు వూజారిని అడిగి 50 రూపాయల టికెట్ సహాయంతో, కొద్ది దూరంగా, కిటికీలోంచి ఆ యంత్ర దర్శనం చేసుకునే వీలుంది. ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి, హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు. అప్పుడు అదే గొప్పగా అనిపిస్తుంది.


ఆ యంత్రంపై లీలగా బంగారు బిల్వ పత్రాల మాలలు మనం గమనించవచ్చు. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి. ఎవరి భక్తి పారవశ్యం వారిది. ఎవరంతకు వాళ్లు కళ్లు మూసుకొని తన్మయత్వంలో వుండిపోతారు. ఇంతకూ, ఆ స్ధలంలో భక్తులు ఏం చూసి వుంటారు? ఇదే ఎవరికీ అంతుచిక్కని దేవ రహస్యం, 'చిదంబర రహస్యం'. 


అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన (ఆకాశతత్వం) దేవదేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం, చిదంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని చెబుతారు. ఎవరి అంతరంగ భావాలను అనుసరించి వారు, ఆ యా రూపంలో నిరాకారుడైన స్వామిని దర్శించుకుంటారని తెలుస్తుంది.


అక్కడ మాకు, చాలా కాలం క్రిందట lAS అధికారిగా పని చేసి, పదవీ విరమణ పొందిన వయో వృద్ధులు శ్రీ నావల్ పాకం నరసింహన్ గారు పరిచయమయ్యారు. వారు తెలిపిన కొన్ని రహస్యమైన విశేషాలును ఇక్కడ మీకు తెలియజేస్తాను.


కొన్ని వేల యేళ్ల క్రిందట తిరుమూలర్ అనే తమిళ శాస్త్రజ్ఙుడు, ఏదో ఒక రోజు తప్పక చిదంబర దేవాలయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందనే విషయాన్ని తెలియజేశారట. ఇప్పుడు, పాశ్చాత్య శాస్త్రజ్ఙులు పదేళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత, వాళ్లు కనిపెట్టిన ఇతర విశేషాలు, ఈ క్రింది విధంగా వున్నాయట.


చిదంబరం ఆకాశ తత్వానికి, కాళేశ్వరం వాయు తత్వానికి, కంచి ఏకాంబరేశ్వరం భూ తత్వానికి చిహ్నం. అదేగాక, ఈ మూడు దేవాలయాలు, గిరిగీసినట్లుగా, ఒకే వరుసలో, భూ రేఖాంశము 79' 70" లో వున్నాయనేది, ఈనాటి ఖగోళ శాస్త్రజ్ఙుల ఊహకందని నగ్నసత్యం. తరువాత శ్రీ రంగం దగ్గర జంబుకేశ్వరం జలతత్వానికి, అరుణాచలేశ్వర దేవాలయం, అగ్ని తత్వానికి చిహ్నాలు. వీటినే మన పెద్దలు పంచ భూతాత్మకమైన ఆలయాలని అన్నారు.


మానవ దేహంలో నవ రంధ్రాల మాదిరి, చిదంబర దేవాలయానికి కూడా తొమ్మిది ద్వారాలున్నాయి. దేవాలయ ఉపరి భాగంలో 21600 బంగారు రేకులతో కప్పబడి వుందట. ఇది శాస్త్రంలో చెప్పినట్లుగా, నిముషానికి 15 ఉచ్ఛ్వాసనిశ్వాసల చొప్పున రోజుకు 15 × 60 × 24 = 21600 సంఖ్యను సూచిస్తుందని చెప్పుకొచ్చారు.


అలాగే, 21,600 బంగారు రేకులను గోపురంపై, 72,000 చిన్న చిన్న బంగారు మేకులతో తాపడం చేశారట, ఇది మన దేహంలోని 72,000 నాడులకు చిహ్నంగా ఏర్పఱిచారని, వారి ద్వారా తెలుసుకుంటుంటే ఆశ్చర్యమనిపించింది.


మానవ శరీరంలో గుండె ఎడమవైపు వున్నట్లు, పొన్నాంబళం కొంచెం ఎడమవైపుగా వుండి, అదే విషయాన్ని సూచిస్తుందని, అక్కడికి చేరాలంటే, పంచాక్షర పడిగా పిలిచే 'శి, వా, య, న, మ' అనే ఐదు మెట్లు ఎక్కవలసి వుంటుందని చెప్పారు.


అక్కడి కనక సభకు నాలుగు స్తంభాలుంటాయి. అవి, మన నాలుగు వేదాలను సూచిస్తాయి. పొన్నాంబళానికి 28 స్తంభాలుంటాయి. ఈ స్తంబాలపైన, 64 + 64 వాట్లుంటాయి (అడ్డ, నిలువు దూలాలు), ఇవి 64 కళలను, మనలో అంతర్లీనంగా వున్న 64 రక్త నాళాలను సూచిస్తాయట. జయహో! మన పూర్వీకుల గొప్పతనం. 


గోపురంపైని కలశాలు, మనలోని శక్తి కేంద్రాలని, అర్ద మంటపానికి వుండే ఆరు స్తంభాలు, ఆరు శాస్త్రాలని, ప్రక్కన మంటపానికున్న 18 స్తంభాలు,18 పురాణాలను సూచిస్తాయని ఉన్మీల నేత్రాలతో ఉదహరించిన నరసింహన్ lAS గారికి కృతజ్ఞతలు.


మన నటరాజు నృత్యం, భూమండల సంబంధమైన నృత్యంతో పోల్చారట పాశ్చాత్య శాస్త్రజ్ఙులు. ఇప్పుటి శాస్త్రజ్ఙులు చెబుతున్న విషయాలు, వేల సంవత్సరాల క్రిందటనే GPS లేని రోజుల్లో మన ఋషులు విశదపఱచిన విషయం గమనించ ప్రార్థన. 


అందుకే, హిందూత్వం అనేది మతం కాదు, మనల్ని మార్గనిర్దేశం చేసే రహదారి. ఆర్ష సనాతన ఆచార సాంప్రదాయాలన్నీ ఆచరణ యోగ్యమైనవే అని నిరూపితమైనాయి.


చదివినందులకు ధన్యవాదములు!


Very interesting - Can you guess what is common between all these prominent temples.


1. Kedarnath 79.0669°

2. Kalahashti 79.7037°

3. Ekambaranatha- Kanchi 79.7036°

4. Thiruvanamalai 79.0747°

5. Thiruvanaikaval 78.7108

6. Chidambaram Nataraja 79.6954°

7. Rameshwaram 79.3129°

8. Kaleshwaram N-India 79.9067°


If your answer is they all are Shiva temples, you are only partially correct. It is actually the longitude in which these temples are located. They all are located in 79° longitude. 


What is surprising and awesome is that how the architects of these temples many hundreds of kilometers apart came up with these precise locations without GPS or any such gizmo like that. Wow.. 

Hats off to them. See the picture.

చదివినందులకు ధన్యవాదములు 🙏

అతిపెద్ద పగటి రోజు

 👉రేపు అతిపెద్ద పగటి రోజు


👉13 గంటల 7 నిమిషాల పాటు పగలు


👉గుడివాడలో తొలి సూర్యోదయం


నిజమే.. బుధవారం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పగటిపూటను మనం అనుభవించనున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్న జీవ పరిణామ క్రమంలో ఇది నిజమే. సాధారణంగా మనం ప్రతిరోజూ పగటి పూట 8 నుంచి 12 గంటలు అనుభవిస్తాం. అలాంటిది.. జూన్‌ 21వ తేదీ బుధవారం 13 గంటల 7 నిమిషాలు సుదీర్ఘమైన పగటి సమయం ఉంటుంది.

చరిత్రలో అతిపెద్ద పొడవైన రోజులుగా వేసవి కాలాన్ని పేర్కొంటారు. భూమి చిన్నగా ఉండి.. దీర్ఘకాలం భూ భ్రమణంలో వేగం తగ్గుతుందని, ఈ పరిణామ క్రమంలో కొన్నిసార్లు పగటి సమయం ఎక్కువగా ఉంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. 


ఈనెల 21వ తేదీ తెల్లవారుజామున 5.34 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది. సాయంత్రం 6.41 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది.


ఏటా జూన్‌ 20 లేదా 21వ తేదీన లేదా డిసెంబర్‌లో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయని పరిశీలనలో తేలింది. దక్షణాది అర్థగోళంలో ఉండే యూకే, యూఎస్, రష్యా, కెనడా, భారత్, చైనాలో వేసవి కాలం ముగిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, న్యూజిలాండ్‌లో శీతాకాలం ప్రారంభమవుతుండటం ఖగోళ పరిణామ క్రమంలో మరో విశేషం.


👉ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుడివాడలో

ఈ నెల 21వ తేదీ, 

అలాగే మనదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినిలో తొలి సూర్యోదయం జరుగుతుంది.

ఆంధ్ర రాష్ట్రంలో తొలి సూర్యోదయం కృష్ణాజిల్లాలోని గుడివాడలో సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో  సెకన్ల తేడాతో సూర్యాస్తమయం జరుగుతుంది. ఇలాంటి పరిణామం 1975లో వచ్చిందని, తిరిగి మళ్లీ 2203వ సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

పంచాయతనం

 *పంచాయతనం అంటే.... ?*


ఆదిశంకరుల వారు భారతదేశంలో అనేక అవైదిక మతాలు ఉన్నటువంటి సందర్భంలో వారందరితో వాదించి ఓడించి అందులో చిట్టచివరిగా ఆరు మతాలను స్థాపన చేయడం జరిగింది.


ఆరు మతాలు అంటే మహమ్మదీయ మతము, క్రైస్తవపతము అని కాదు...


గాణా పత్యము, 

శైవము, 

సౌరము, 

వైష్ణవము, 

శాక్తేయము, 

కౌమారము. 

ఈ ఆరింటిని షణ్మతాలు అంటారు.  


*అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే...!*


గణపతి, 

శివుడు, 

విష్ణువు, 

అమ్మవారు, 

సూర్యుడు, 

కార్తికేయుడు...


ఈ ఆరు మతాలను శంకరులు స్థాపించారు కనుక ఆయనను షణ్మతాస్థాపనచార్యుడు అంటారు.


ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యనారాయణ, శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది. 


ఇక కార్తికేయుడు అగ్నిస్వరూపం కనుక అగ్ని ఆరాధన మన సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది కనుక కార్తికేయునికి అగ్ని ఆరాధనతో సంబంధం ముడి పెట్టడం జరిగింది. 


కార్తికేయుని వదిలివేస్తే ఇక మిగతా 5 దేవతామూర్తులను అందరూ తప్పకుండా ప్రతినిత్యము ఆరాధించి తీరవలసిందే. 


ఈ ఐదు మూర్తులను పంచాయతనము అని అంటారు. 

శివుడు మధ్యలో ఉండి మిగతా మూర్తులు చుట్టూ ఉంటే ....

అంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ స్థానంలో ఇతర మూర్తులు ఉండి మధ్యలో శివుడు ఉంటే అది శివపంచాయతనము అవుతుంది. 


మధ్యలో అమ్మవారు ఉండి మిగతా మూలలో ఇతర మూర్తులు ఉంటే అది అంబికా పంచాయతనము అంటారు...


మధ్యలో విష్ణుమూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే దానిని విష్ణు పంచాయతనము  అంటారు. 


మధ్యలో గణపతి ఉండి చుట్టూ ఇతర దేవతామూర్తులు ఉంటే అది గణపతి పంచాయతనము అవుతుంది.


అదేవిధంగా మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉండి చుట్టూతా ఇతర మూర్తులు ఉంటే అది సూర్యపంచాయతనము అవుతుంది. 


ఎవరు ఏ విధంగానైనా గాని ఈ పంచాయతన పూజను ఆచరించుకోవచ్చు. 


ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 

మనము కొన్ని  ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శివపంచాయతనము మనకు కనబడుతూ ఉంటుంది. 

శివలింగము మధ్యలో ఉండి చుట్టూ మిగతా మూర్తులు ఉండడం గమనించి ఉంటారు. అలాంటి పూజ విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది.


నిత్యము ఈ పంచాయతనస్మరణ ఈ పంచాయతన శ్లోకములను పఠించడం చేత ఆ పంచాయతన దేవత ఆరాధన ఫలితము మనకు దక్కుతుంది.

నూటపదహార్లు

 *నూటపదహార్లు.* 


శుభకార్యాలలో చదివింపులకిగాను నూట పదార్లూ-వెయ్యిన్నూటపదహార్లను ఇస్తుంటారుగదా! ఈ నూటపదారుకి ఏమైనా విశిష్ట ఉందంటారా? ప్రశ్నించారు హరిబాబుగారు. అదిగో అందుకే ఈ టపా, అవధరించండి.


భారతీయ సంస్కృతి అంతా ఎప్పుడూ పూర్ణాంకం గురించే చెబుతుంది, శతం,సహస్రం,శత సహస్రం ఇలా, దశాంశంలో. మరీ నూటపాదహారెక్కడనుంచి వచ్చి చేరిందన్నదే ఆలోచన, అదీ తెనుగునాటే, ఈ అలవాటూన్నూ.


తెనుగునాడు మూడు భాగాలుగా విడి ఉండేది పాలనలో. ప్రజలు మాత్రం ఒక చోటినుంచి మరోచోటికి రాకపోకలూ, వలసలూ బాగానే ఉండేవి. ఆ ప్రాంతాలకి పేర్లూ ఉన్నాయి., కోస్తా, రాయలసీమ ( దీన్నే సీడెడ్ జిల్లాలు అంటే వదలిపెట్టబడిన జిల్లాలు, అవి కడప, కర్నూలు,బళ్ళారి, అనంతపురం. తరవాత కాలంలో బళ్ళారిజిల్లా కర్నాటకలో జేరిపోయింది) ఇక మూడవది నైజాం రాష్ట్రం.


కోస్తా ప్రాంతం నిజంగానే కోస్తా! సముద్రపు ఒడ్డు. బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉండేది. స్వదేశీ సంస్థానాలుండేవి. ఉర్లాం, బొబ్బిలి,విజయనగరం, పిఠాపురం, పెద్దాపురం, నూజివీడు, వేంకటగిరి ప్రముఖమైన సంస్థానాలు. ఇక నైజాంలో కూడా సంస్థానాలున్నా గద్వాలుకున్నంత పేరు మిగిలినవాటికి లేదు. ఈ సంస్థానాధీశులంతా కవులను పండితులను పోషించేవారు, వార్షికాలూ ఇచ్చేవారు. ఇలా ఇచ్చే వార్షికాలు నూరు రూపాయలుగా ఉండేవి. ఈ మొత్తం నిజాంలో ఉన్న సంస్థానాలవారు పండితులకిస్తే అవి నిజాం హాలీ రూపాయలై ఉండేవి. నైజాం రూపాయల్ని హాలీ రూపాయలనేవారు. కోస్తా రాయలసీమ నుంచి నైజాం వైపు సంస్థానాలకి వెళ్ళిన వారికిచ్చిన నూరు హాలీ రూపాయలు బ్రిటిష్ పరగణాలో కొచ్చేసరికి నూటికి తగ్గేవి. కారణం ఏడు హాలీ రూపాయలు ఆరు బ్రిటిష్ రుపాయలకు మారకం అయేవి కనక. కాలం నడుస్తోంది. అటు సంస్థానాధీశుల లోనూ ఇటు గ్రహీతలలోనూ నూరు రూపాయలు పూర్ణాంకం చేరటం లేదనే వ్యధ ఉండిపోయింది. మార్గం కనపడలేదు.


చివరగా తేలినదేమంటే నూట పదారు హాలీ రూపాయలకి నూరు బ్రిటిష్ రూపాయలొస్తాయి గనక ఇటునుంచి వెళ్ళిన పండితులకు సత్కారంగా నూటపదార్లు ఇవ్వడం మొదలయింది. అక్కడ నూట పదహార్లు పుచ్చుకోవడం అలవాటైనవారు ఇక్కడా కోస్తాలో, రాయలసీమలో నూటపదహార్లు, ఇవ్వడం, పుచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు, అప్పటివరకూ ఉన్న అలవాటు పూర్ణాంకానికి బదులుగా. ఇలా నూటపదార్లు - వెయ్యిన్నూటపదహార్లు  అలవాటులో మిగిలిపోయాయి. నేటి కాలానికి అర్ధనూటపదహార్లు కూడా ఉన్నాయి. పెట్టడం పెద్దలనాటినుంచీ లేదుగాని పుచ్చుకోడం పూర్వీకులనుంచీ అలవాటేనన్న సామెతగా.


శతమానం భవతి, శతాయుః…అశీర్వచనం

నూరు సంవత్సరములు ఆయుస్సు కలుగుగాక.

శతం జీవ శరదో వర్ధమానా… ఆశీర్వచనం.

నూరు శరత్తులు వర్ధిల్లుదువుగాక……ఇలా పూర్ణాకం చెప్పడమే మన అలవాటు.


ఇదీ నూటపదహార్ల కథ.