21, మార్చి 2025, శుక్రవారం

గరుడ పురాణం_*24

 * *గరుడ పురాణం_*24వ భాగం*


 *"విషదూరక మంత్రం"*_


_ఋషులారా! ఇపుడు మీకు సర్పాది విష జంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి._


_*'ఓం కణిచికీణి కళ్వాణీ చర్వాణీ భూతహరిణి ఫణి*_ _*విషణి విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండేరౌద్రే*_ 

_*మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే*_

_*శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ*_

_*సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి*_

_*సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య*_ 

_*హృదయే జాతా రుద్రస్య హృదయే స్థితా ।*_

_*రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష*_

_*మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠఠ*_ 

_*స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ*_

_*ఓం శాలే మాలే హర హర విషోంకార*_

_*రహి విషవేగే హాంహాం శవరిహుం*_

_*శవరి ఆ కౌలవేగేశే సర్వే వించమేఘమాలే*_ 

_*సర్వనాగాది విషహరణం !'*_


_*ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నపుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ వుండాలి. దీని భావం ఇది :*_


_'అమ్మా ఉమాదేవీ! నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్రరూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి వున్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైనా విషసర్పాలకే విషరూపిణివి. విరథనారాయణిగా, శుక్రముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి; ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవీ! ఈ నరుని (లేదా నారి)లో వ్యాపించిన విష ప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితంగా గావించు, సమ్మోహితం గావించు. దేవీ మమ్ము రక్షించు, రక్షించు' అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్ధించి హ్రూం మాం హ్రూం ఫఫఫఠఠ అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాంహం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహవచ్చేదాకా మంత్ర పఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి._ _*(అధ్యాయం - 27)*_

గరుడ పురాణం_*23వ భాగం*

 *గరుడ పురాణం_*23వ భాగం*


*త్రిపురాదేవి గణేశాదుల పూజ:-*_


_ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి._


ఓం గాం హృదయాయ నమః, 

ఓం గీం శిరసే స్వాహా,

ఓం గూం శిఖాయై వషట్, 

ఓం గైం కవచాయ హుం, 

ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం గః అస్త్రాయ ఫట్


_*తరువాత సాధకుడు. "ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః " అంటూ దుర్గమ్మ యొక్కయూ, "ఓం గురుపాదుకాభ్యాం నమః" అంటూ గురువు గారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికీ, ఆమె ఆసనానికి నమస్కారం చేసి 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గ, చందోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే తొమ్మిది శక్తులనూ పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా "ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః" అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత "ఓం ఐం క్లీం (హ్రీం) సౌంత్రిపురాయై నమః " అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి.*_


_తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికీ (పద్మానికి), మూర్తికీ, హృదయాది అంగాలకీ నమస్కారం చేసి ఆ పద్మపీఠం పై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక - అను ఎనమండుగురు దేవతలనూ పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులనూ అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారలు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులనూ, గురువునూ, క్షేత్రపాల దేవతలనూ పూజించాలి._


_*సాధకుడిపుడు ఒక పంచగర్భ మండలాన్నిగానీ త్రికోణ పీఠాన్నిగానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభితా, వరదాయినీ, వీణాపుస్తక ధారిణీ, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృతా యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాతిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని లక్షమార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అపుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు.*_


_(అధ్యాయాలు 24-26)_

మహాభారత సారాంశం.

 💥లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం... తొమ్మిది వాక్యాలలో..

   మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి.                       ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

  🔥1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు 

   ఉదా "కౌరవులు."               ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

 🔥2. . నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

  ఉదా: కర్ణుడు.                     ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

 ఉదా.. అశ్వత్థామ.              ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥 4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

  " భీష్ముడు."                         ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

 "దుర్యోధనుడు "                    ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

  ఉదా: ధృతరాష్ట్రుడు.                  ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

 🔥7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

 ఉదా: అర్జునుడు.                 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥8. మోసం,కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

  ఉదా: శకుని.                       ⭕⭕⭕⭕⭕⭕⭕⭕                       

🔥9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

  ఉదా : యుధిష్ఠిరుడు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

💫💫💫💫💫💫💫💫

 " సర్వే జనాః సుఖినోభవంతు.🌷

సంతృప్తి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥మన జీవితంలో విజయం కంటే సంతృప్తి చాలా ముఖ్యం.. ఎందుకంటే మన విజయాన్ని ఇతరులు నిర్ణయిస్తారు.. కానీ మన సంతృప్తిని మనమే నిర్ణయస్తాము.. తృప్తి లేని విజయం వ్యర్థం🔥జీవితాన్ని ఒత్తిడికి గురించేయవద్దు.. ఎల్లప్పుడూ ప్రశాంతగా నవ్వుతూ అనందంగా ఉండడానికి ప్రయత్నిద్దాము.. ఎందుకంటే ప్రశాంతత, నవ్వు మన జీవితానికి సంవత్సరాలు జోడించక పోవచ్చు.. కానీ ఖచ్చితంగా మనము జీవించిన సంవత్సరాలకు ఎక్కువ జీవాన్నిస్తుంది🔥మనిషి అందంగా కనిపించాలి అంటే ముఖం పై ఎన్నో రంగులు అద్ది ఎన్నోన్నో పొరలు వేయాలి..కానీ మనసు అందంగా కనబడాలి అంటే అహం, స్వార్థం, ఈర్స్య, అసూయ, ద్వేషం అనే పొరలను తొలిగించాలి🔥ఇష్టపూర్వకంగా కోరుకునేది అదృష్టం..బలంగా నమ్మినదే భవిష్యత్తు..అందంగా ఉన్న వారు అనందంగా ఉంటారో లేదో తెలియదు కానీ అనందంగా ఉన్నవారు మాత్రం అందంగా కనిపిస్తారు...ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో..గడుపుతున్న ఈ క్షణం మాత్రం మనది.. నిన్న అనేది తిరిపోయిన ఋణం..రేపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం.. అందుకే నవ్వుతూ అనందంగా జీవనం సాగిద్దాం🔥🔥మీ అల్లంరాజు భాస్కరారావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏3

భ్రమల వల్లే బాధలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

      *భ్రమల వల్లే బాధలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి పెంచుకుంటున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు…* 


*కారణజన్ములుగా ఈ భువిపైన అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలను అమృతగుళికలుగా అందజేశారు.*


*లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈలోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నా మానవులకు ఆయన హెచ్చరికలు చేశారు.*


*కొన్నాళ్లు యాత్రికుల్లా గడపడానికి ఈలోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరచిపోయి, స్థిరాసనాలు వేసుకునేందుకు ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రపడుతున్నాం. తుదకు మనమూ వెళ్లిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. తామరాకుపై ఉన్న నీటిబిందువులా మనిషి జీవితం కూడా అతిచంచలమైంది. అయినా ఈలోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ, దేహాభిమానాన్ని విడువక, దుఃఖంతో చిక్కుకొని ఉంటారు. ఇలా మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.*


*ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు. వాస్తవమేంటంటే తెలుసుకొని మసలుకొమ్మని చేస్తున్న హెచ్చరిక.*


*మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం ఈ శరీర సుఖాలకోసం పడుకున్న తాపత్రయం తగ్గించుకోమనే చెప్తున్నారు. ఏ సుఖమూ శాశ్వతం కాదనీ, ఏ కష్టమూ కలకాలం ఉండదనీ, మన మనస్సు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్‌ శ్రీరామకృష్ణులు అనేవారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి.*


*మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈలోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని ఇది మా తోట. ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే, మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. పుత్రమిత్ర బంధువులంతా సహచరులేకానీ శాశ్వతం కాదనీ ఇల్లూ, వాకిలీ, ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్నా వసతి సౌకర్యమే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామనీ, వెంటవచ్చేవి కావనీ గుర్తుంచు కోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకు, నీటిబిందువ్ఞల సహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు.*


*నీటిలోనే పుట్టి పెరిగి, నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా, నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాన యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు. చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకార పూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించి ఈలోకానికి ఏ ఒక్కరి అవసరమూ లేదు.*


*నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తిపరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం.*


*ఓం శ్రీ గురుభ్యోనమః.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(82వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇంకో సంగతి అంటూ మంత్రివర్గం మళ్ళీ కొన్ని మాటలు చెప్పింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు. గోవులు, బ్రాహ్మణులు, జపతపాలు, యజ్ఞయాగాలు, వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కనుక, గోబ్రాహ్మణులను వధించడం, యాజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారన్నారు. బయటపడితే విష్ణువుని ఇట్టే వధించవచ్చనీ, పగతీర్చుకోవచ్చనీ అన్నారు.*


*మంత్రుల బోధలు కంసునికి నచ్చాయి. వారు చెప్పినట్టుగానే విష్ణువుని వధించి, నిశ్చింతగా ఉండవచ్చనుకున్నాడతను. మంత్రవిద్యలు నేర్చినవారూ, మాయలు పన్నేవారూ, కామరూపులూ, బలాఢ్యులూ, దుర్మార్గులూ, రాక్షసులు ఎందరెందరో కంసుని అనుచరవర్గంలో ఉన్నారు. వారందరినీ కంసుడు ఆజ్ఞాపించాడు. అతడు ఆజ్ఞాపించినట్టుగానే వారంతా చెలరేగిపోయారు. సాధువుల్ని హింసించసాగారు.*


*గోబ్రాహ్మణులను వధించసాగారు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ, తాపసులను చిత్రహింసల పాల్జేశారు. స్త్రీలను చెరబట్టారు. విష్ణువుకి నిలయాలయిన పుణ్యస్థలాలను అపవిత్రం చేసి, ఆనందించసాగారు. కామరూపులయిన రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో, నగరాల్లో కనిపించిన బాలలందరినీ చంపడం మొదలుపెట్టారు. తల్లడిల్లిపోయారు తల్లులు. పిల్లలను కనడమే మహాపాపమయినట్టుగా రోదించారు. బాలలు బ్రతకడం కష్టం. వారి బ్రతుకు క్షణక్షణం ఓ గండం అయిపోయింది.* 


*ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకు నందగోపుడు మధురానగరానికి వచ్చాడు. కంసుడికి సామంతుడతను. ఏటేటా కంసునికి కప్పం కట్టాలి. కప్పం సొమ్మును మూటగా కట్టి మధురానగరానికి బయల్దేరుతూ, వ్రేపల్లెను జాగ్రతగా చూసుకోమని గోపాలురకు హెచ్చరించి వచ్చాడతను. కంసుణ్ణి దర్శించాడు. కప్పం చెల్లించి, కానుకలు కూడా సమర్పించాడతనికి.* 


*వసుదేవునికి నందగోపుడు బంధువు. వసుదేవుని భార్య రోహిణీ, ఆమె కుమారుడు బలరాముడూ, ఇంకొందరు బంధువులూ అతని రక్షణలో వ్రేపల్లెలో ఉన్నారు. వారి క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు నందుణ్ణి చూడవచ్చాడు వసుదేవుడు*.



*వసుదేవుణ్ణి చూస్తూనే గట్టిగా అతన్ని కౌగిలించుకున్నాడు నందుడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చాలా కాలానికి పుత్రసంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందించాడు వసుదేవుడు. ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు, దేవకీ వసుదేవులు కంసుని చెరలో హింసలపాలయినందుకు బాధపడ్డాడతను. కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక, ఏటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వసుదేవుడు. ఏమయిందేమయింది అన్నట్టుగా నందుడు కూడా లేచి నిల్చున్నాడు. భయాందోళనలతో వణికిపోతున్న వసుదేవుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు శ్రీ శైల క్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగమూర్తి యైన భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామిని సేవిస్తున్నారు*


*శ్లోకం : 50*


*సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం*


*సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।*


*భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం*


*సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।*


*పూర్వకథ:~*


*శ్రీ శైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాడు.అతని కూతురు రతీదేవి వలె సౌందర్యము కలది. ఆమె పేరు చంద్రవతి. ఆరాజు తన కూతురినే మోహించాడు. ఆవిషయం తెలిసిన చంద్రవతి, రాజ గృహం విడచి శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్రక్షమైనాడు. ఆమె శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది. ఈశ్వర సాయుజ్యాన్ని ఆమె కోరింది. ఆ మల్లికా మాలను తీసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు. అప్పుడు చంద్రవతి ఈశ్వరుని "మల్లికార్జునుడు " అనే సార్థకనామాన్ని ధరించమని ప్రార్థించింది. శివుడు అంగీకరించి లింగరూపం ధరించాడు. అప్పటినుండి శ్రీ శైల లింగానికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.*


*తాత్పర్యము:~*


*సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవనృత్యంతో భక్తులను ఆనందపరుస్తాడు. మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్ప వికాసముతో ఆనంద పరుస్తుంది. ఈశ్వరుడు శ్రీ శైలమునందేగాక శ్రుతి సరస్సులలో అనగా ఉపనిషత్తుల యందు ఉంటాడు. మద్ది చెట్టు పుష్పాలు చెవులయందు, శిరస్సులయందూ అలంకారములుగా ఉంటాయి. మల్లికార్జునుడు అనురాగంతో కూడిన భ్రమరాంబా దేవితో మనోహరంగా ఉంటాడు. మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలచే సుందరముగా ఉంటుంది. ఈశ్వరుడు మాటిమాటికినీ యోగ్యములయిన సంస్కారములచే ప్రకాశించేవాడు. మద్ది చెట్టు మంచి సువాసనలచే ప్రకాశిస్తుంది. ఈశ్వరుడు సర్ప రాజయిన వాసుకి ఆభరణంగా కలవాడు . మద్ది పువ్వు భోగప్రియులైన వారికి ఆభరణమైనట్టిది.*


*ఈశ్వరుడు అందరు దేవతలకూ పండితులకూ పూజనీయుడు. మద్ది పూవు అన్ని పువ్వులలో శ్రేవ్టమైనది. ఈశ్వరుడు సద్గుణములచే వ్యక్తము చేయ బడేవాడు. మద్దిపుష్పము సుగంధ గుణము వలన తెలియబడుతుంది.*


*పార్వతిచే కౌగిలించుకొనబడినవాడు. శ్రీశైల మల్లికార్జున స్వామి మద్ది చెట్టు జమ్మి చెట్టు తో కూడినది. మల్లెపూదండలచే పూజింపబడి ఒకవిధమైన తెల్లనివర్ణము గలవాడు మల్లికార్జునుడు. అటువంటి మల్లికార్జున నామముగల శివుని జ్యోతిర్లింగాన్ని సేవిస్తాను.*


*వివరణ:~*


*శంకరాచార్యులవారు శిష్యులతో పాదచారియై హిందూమత ప్రచారానికై భారతదేశమంతటా పర్యటించారు. ఆసందర్భంలో వారు మన ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో సంధ్యాకాలమయ్యింది.* *అప్పుడక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు వారికి కనబడింది. దానిని పోలికగా చేసుకుని పరమేశ్వరుని ఈ అద్భుతమైన శ్లోకంలో వారు వర్ణించారు.*


*ఈ శ్లోకం దీని తర్వాతి శ్లోకము శ్రీశైల మల్లికార్జున స్వామిపై శంకరులు చెప్పిన గొప్ప శ్లోకాలు. శ్రీశైలం గొప్ప పుణ్య జ్యోతిర్లింగ క్షేత్రం.*


*"శ్రీ శైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న లభ్యతే " అంటారు. శివానంద లహరి లోని 100 శ్లోకాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ని వర్ణించే ఈ రెండు శ్లోకాలూ మణిహారంలోని నాయక మణుల వంటివి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శబ్ద చికిత్సాదేవి

 .                శబ్ద చికిత్సాదేవి

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నేడు…



                  *శీతల సప్తమి*

                    ➖➖➖✍️

```

హైందవులు జరుపుకునే పండుగలలో శీతల సప్తమి ఒకటి. ఈ రోజున శీతలా మాతను పూజిస్తారు. అంటు వ్యాధులు సోకకుండా తమను, తమ పిల్లలలను తమ కుటుంబ సభ్యులను రక్షించమని శీతలా మాతను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శీతలా సప్తమి రోజు అక్కడి గ్రామ దేవతలను పూజిస్తారు.


శీతల సప్తమి పండుగ ఔచిత్యం స్కాంద పురాణంలో స్పష్టంగా వివరించారు. పురాణాల ప్రకారం పార్వతి దేవి మరో అవతారమే శీతలా దేవి. శీతలా దేవి ప్రకృతి వైపరిత్యాలనుండి ప్రజలను కాపాడుతుందని విశ్వసిస్తారు. 'శీతలా' అనే పదానికి చల్లదనం అని అర్థం. ఆ తల్లిని నమ్మి కొలిచిన వారిని, వారి కుటుంబాలను శీతలా మాత చల్లగా చూస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అనేక ప్రాంతాల్లో ఈ రోజున భక్తులు శీతలా మాతకు పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు శీతలా దేవతకు ప్రార్థనలు చేస్తారు. కొందరు శీతల వ్రతం పాటించి శీతల మాత వ్రత కథను చదువుతారు. శీతలా మాతను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు.


శీతల సప్తమి రోజున, భక్తులు వంట చేయడం మానుకుంటారు. ఒక రోజు ముందు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఈ ప్రత్యేక రోజున వేడి, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధిస్తారు. మహిళలు ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తారు.```



*పురాణ కథనం:* ```

శీతల సప్తమికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇంద్రయుమ్న అనే రాజు ఉదారవంతుడు. సద్గుణశీలి. అతనికి ప్రమీల అనే భార్య, శుభకరి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇంద్రయుమ్నుని రాజ్యంలో ప్రతి సంవత్సరం శీతల సప్తమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. ఒకసారి శుభకరి కూడా ఆ ఉత్సవంలో పాల్గొంది. పూజలు చేయడానికి శుభకరి తన స్నేహితులతో కలిసి సరస్సుకు బయలుదేరింది. కానీ దారి తప్పడంతో వారు సరస్సుకు చేరుకోలేక పోయారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు వారికి సహాయం చేసి సరస్సుకు దారి చూపింది. అంతేకాదు శీతల సప్తమి పూజా నిర్వహణలో, ఉపవాసం పాటించడంలో తదితర ఆచార వ్యవహారాలను వారికి వివరిస్తూ తగు సూచనలు ఇచ్చింది. అంతా బాగా జరిగింది, శీతలా దేవి చాలా సంతోషించి శుభకరికి వరం ఇచ్చింది. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు ఆ వరాన్ని ఉపయోగించుకుంటానని శుభకరి దేవితో చెప్పింది. వారు రాజ్యానికి తిరిగి వస్తుండగా ఒక పేద కుటుంబంలో పాము కాటు కారణంగా వారి కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినందుకు దుఃఖిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన శుభకరీ తనకు లభించిన వరాన్ని గుర్తుచేసుకుంది. చనిపోయిన ఆ వ్యక్తికి ప్రాణం పోయమని శీతలా దేవిని ప్రార్థించింది. ఆ వ్యక్తి తన జీవితాన్ని తిరిగి పొందాడు. శీతల సప్తమి వ్రత మహత్యం తెలుసుకున్న ప్రజలందరు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అచంచలమైన భక్తి ప్రవత్తులతో, అంకిత భావంతో వ్రతం ఆచరిస్తున్నారు. ✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

దత్తపది

 కల్లలు - ఎల్లలు - మల్లెలు - జల్లులు (దత్తపది) *వసంత ఋతువు*


కల్లలు గావు రాజ! నవకంబులె నిత్యము సౌరు దిద్దుచున్


ఎల్లలు దాటె శోభలును నేర్పడె పల్లవ మందహాసముల్


మల్లెలు పూచె కొల్లలుగ మావులు నిండెను పూప పిందెతోన్


జల్లులు రాల్చె పుష్పతతి జావళి పాడ వసంత! రాగదే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

ప్రియ బాంధవా మేలుకో 16*

 *ప్రియ బాంధవా మేలుకో 16*




శాస్త్ర, సాంకేతిక, విద్యా, ఆర్థిక రంగాలలో భారత దేశం ఎంత పురోగమిస్తున్నా, చట్ట పరమైన నిబంధనలు ఎన్ని అమలుచేస్తున్నా దిన దినము వ్యక్తిగత, సామాజిక అవినీతి మరియు నేరాలు పెరుగుటకు కారణాలు పెద్దలు అన్వేషించాలి. 


లెక్కకు మించిన క్రిమినల్ కేసులలో నిందితులైన వారిని, సాంఘికంగా దుశ్చరిత్ర కలవారిని తమ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికలలో అభ్యర్థులుగా ఎంపిక చేసే

 *దుర్నీతి రాజకీయ* పార్టీలు వేళ్లూనుకున్న సమాజంలో మనం జీవిస్తున్నామన్న స్పృహ ప్రజలకు (సామాన్యులు + మాన్యులు)  ఉండాలి. *మేథోప్రజ నిద్ర నటిస్తే* చట్టాలను ఉల్లంఘించే వారు *శాసన కర్తలవుతున్నారు* అంటే ఆశ్చర్యానికి తావులేదు, నేర గ్రస్థ రాజకీయ నేపథ్యంలో ఇవన్నీ సాధ్యమే. 


సాక్షుల అకారణ మరణాలు, హత్యలు, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభత్వ అధికారుల అనైతిక ప్రాబల్యాలు, తాబేదారుతనం ప్రజలు గమనిస్తున్నారు. 


హత్యా ప్రయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, కుంభకోణాలు, స్కాంలు, వీటిపై నత్తనడక విచారణలు, దర్యాప్తులు, న్యాయస్థానాలలో ఏళ్ల తరబడి వాద వివాదాలు,  వాయిదాలపై వాయిదాలు, సుధీర్ఘ విచారణలు చివరికి *శిక్షలు జీవిత కాలం లేటు*.దేశ ద్రోహులకు, తీవ్ర వాదులకు, విదేశీ నేరస్థులకు కారాగారాలలో మృష్టాన్న భోజనాలు, రాజ మర్యాదలు.  

 

భారతీయ న్యాయ స్థానాల సామర్థ్యము కంటే మించిన వ్యాజ్యాలు. 2024 సంవత్సరపు గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా మరియు న్యాయ మూర్తుల నిష్పత్తి (:) ...పది లక్షలు : ఒకటి. న్యాయ మూర్తుల నియామకాలు గూడా చాలినంతగా లేవు. 


ఏ దేశంలో లేని  మరియు ప్రపంచం అబ్బురపడే వింత... *దేశ ద్రోహులను, అరాచక మరియు తీవ్రవాదులను సమర్థిస్తూ వాదించే న్యాయవాదులు మన దేశంలోనే  కోకొల్లలు*.


దేశ  సామాజిక పరిస్థితి గురించి ఒక అవలోకనము, ప్రశ్నల రూపంలో....*దేశంలో నేర నిరోధక మరియు న్యాయ వ్యవస్థ శక్తివంతంగా ఉందా*. సాక్షుల రక్షణకు న్యాయపాలిక నిర్దేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ  *అవి యథాతథాంగా అమలవుతున్నాయా*. ఇవన్నీ ఎవరు గమనించాలి అంటే సమాజమే గమనించాలి, *అది సమాజ బాధ్యత*.


అధిక శాతం ప్రజలకు  సమాజ శ్రేయస్సు విషయమై పట్టింపులేదు, ఉండదు,  ఎందుకంటే తాము బాగున్నాము, తమ వాళ్ళు బాగున్నారు, *ఎక్కడ ఏమైతే మనకెందుకు*.  ఇంత దుర్గంధ భూయిష్టంగా ఉన్న సమాజంలో విద్యావంతులు, విజ్ఞానవంతులు మరియు ప్రజ్ఞావంతులు ప్రశాంతంగా ఉండడం లేదా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి లోనుగావడం నాలాంటి సామాన్యులందరికీ ఆశ్చర్యకరమే.


ధన్యవాదములు

*(సశేషం)*

ఆరోజులు

 ఆరోజులు మళ్లీ రావు. వస్తే ఎంత బాగుండును?


పెళ్ళి భోజనం

💥💥💥💥


ఆకుపచ్చని అరిటాకు ముందు కూచుంటాము శుభ్రంగా.  శుభ్రంగా...తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవ నవలాడుతూ. 


వంటల వాసన గాలిలో తేలివస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది తొందర చేస్తూ.  తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. 


ఈలోగా ‘ చవి’ వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరిబుగ్గల పిల్లవాడు. బొజ్జనిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. 

శ్రద్ధగా వేస్తున్నవాణ్ణి చూసి నవ్వుతుంటాం. 


పట్టుపరుకిణీ గర గర లాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి , దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని . కిలకిలా గల గలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసులలో నీళ్ళు పోస్తుంటే, ఆడపిల్లల వద్దిక చూసి ముచ్చట పడిపోతాం ఆకుల ముందు కూచున్న మనం . 


ఈలోగా వస్తాడు పూర్ణంబూరెల బుట్ట పుచ్చుకుని చినమామయ్య. 

ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. 

బావా ! బామ్మర్దీ! ఏమే మరదలా ! మేనకోడలా ! అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా రెండు బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వేయవయ్యా ! అంటున్నా మాటలు చెవిని వేసుకోనే వేసుకోడు. 


పెద్ద పళ్ళంలో కనపడేట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించి పోతాడు నూనూగు మీసాల మేనల్లుడు మరో మాటుండదు. 


వచ్చి ఆకులో ఇటుపక్క  చెంమ్చాతో చూసి చూసి వడ్డిస్తుంది దోసావకాయను , పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నంగనాచి మేనకోడలు. 

ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి , ‘అదేమిటే ఆ  విదపడం ..ఇంకొంచం వేయచ్చు కదే ‘అంటే , 

‘ముందు అది తినవమ్మా తర్వాత మళ్ళా వేస్తా ‘అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెపుతూ చక్కా పోతుంది.


తర్వాత కొత్తావకాయని అత్తయ్య పట్టుకొస్తుంది . 

ఈ రంగు చూసావా వదినా! 

నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, ముక్క కసుక్కుమంటోంది కొరికితే ‘ అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింప చేస్తుంది.


పచ్చళ్ళ గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. 

పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో.. 

రుచులూరించే గోంగూర పచ్చడి దానికి తగ్గట్టుగా గొప్పకబుర్లు చెపుతూ’ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడినే వలిచాను తెలుసా ‘ అంటూ. ఆచేత్తోనే గుత్తి రెండో భాగంలో ఉన్న తాజాగా ఘుమ ఘుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు.


తర్వాత అమాయకపు పిన్ని వంతు. పట్టెడు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది, వరసలో కుర్రవెధవ నాకు వేరుశనగపలుకులు ఎక్కువ రాలేదంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. ‘సుబ్బరంగా తినండి , లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది ‘ అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో.


ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకువస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, పదిమందికీ తన వంట నైపుణ్యం చెప్పాలని , పనసపొట్టు కొట్టిన దగ్గరనుంచి పోపు పుష్కలంగా వేసానని , జీడిపప్పుకు మొహమాటపడలేదని,  కొంచం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం ఎప్పుడెప్పుడు నోటపెట్టుకుందామా అని. 


ఈలోగా ’గుత్తివంకాయ కూర ‘అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంటు కుర్రాడు , పరుగులే నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంటుంది నూనె ఓడుతున్న నోరూరూంచేసే గుత్తి వంకాయ . ఎవరో అది చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు , ‘గుత్తివంకాయ కూరోయి బావా ” అంటూ. 


పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్ళిపనుల పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా , వడ్డింపు పనికి కూడా పరుగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని, వచ్చిన అతిధులను భోజనంతో ఆదరించడం . పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా , పది కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు అందరకీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనేలేదు.  


సిల్కు వల్లెవాటు జారిపోతుంటే సద్దుకుంటూ, మొహం మీది ముంగురులు వెనక్కి తోసుకుంటూ, అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది, పెళ్ళి కూతురు చెల్లి అప్పడాలు,గుమ్మడి వడియాలు,ఊర మిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కాని ఒకళ్ళకి వడియం వడ్డించడం, వదిలేస్తే ఇంకోరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది , నలుగురినీ ఒక్కదగ్గరగా చూసిన గాభారాలో. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతీవాళ్ళూ పరాచికాలాడటమే. 

‘ఏమిటా కంగారు అంటూ ‘తర్వాత నీదే కదా ఛాన్స్’, నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం’ 

ఇవ్వన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి , కనిపించిన వదిన గారికి ఆ అప్పడాలు అప్పచెప్పి తుర్రుమంది.


వెంట అన్నం పట్టించుకుని చేతిలో నేతి కొమ్ముజారీ పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్నవాటితో ఆమట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ , పెళ్ళికూతురు తల్లి యజమానురాలు. మొహమంతా పెళ్ళి నిర్విఘ్న్నంగా జరిగిందన్న తృప్తీ సంతోషమూనూ. 

ప్రతి వక్కరనీ పేరుపేరునా వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని ‘ ‘అన్నయ్యా! వచ్చి నీ చేతుల మీదుగా 

మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజమనమయ్యేక బొట్టెట్టించుకుని తాంబూలం తీసుకు వెళ్ళండమ్మా’ అంటూనూ’ 

తమ్ముడూ ! నువ్వొచ్చావు ఎంతో సంతోషం , అమ్మాయీ లక్షీమీదేవి లాగ ఉన్నావమ్మా’ అంటూ చిన్నవాళ్ళనీ పలకరించుతూ, వడ్డించిన అన్నం మరికాస్త కలపండి మొహమాటం లేకుండ భోంచేయమని చెపుతూ , చాలు చాలంటున్నా నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో.


ఈలోగా అల్లక్కడ లోపలనుంచి  ‘తప్పుకోండి , తప్పుకోండి వేడి వేడి గుమ్మడికాయ దప్పళం వస్తోంది’ అని కేకలు వినిపిస్తుంటాయి . 

మనం అయితే దప్పళానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ, అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరచి తింటాము. 


అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద గృహయజమాని కన్యాదాత , కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకుని. జోడీగా చక్కెరకేళీ,అరటిపండు .విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిపిస్తాడు. అన్నీ అందాయా లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. 

అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరకీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలచుకుంటూ అందరనీ గబ గబా చిరునవ్వుతో తలపంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు.


ఈయనకు ఎదురు వస్తాడు అత్తాకోడలంచు పంచా, కండువా సవరించుకుంటూ, పెళ్ళికూతురి తండ్రికి ప్రాణస్నేహితుడుట. ‘ ప్రత్యేకించి పురమాయించి చేయించాను, మాపిల్ల పెళ్ళి కోసం’ అంటూ  బూందీ మిఠాయి , పాకం కాజా వేసి, ‘ వదలకుండా తినాలి’ అని బెదిరించి మరీ వెడతాడు.


చివరలో ఎవరు పెట్టి పోయారో గమనించముగాని , భోజనం పూర్తి చేసి తలఎత్తి చూసేటప్పటికి సుగంధభరితమైన తియ్యని కిళ్ళీ ఉంటుంది, మంచినీళ్ళ గ్లాసు పక్కన.


కిళ్ళీ నోట్లో బిగించి , ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి, స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు.

 సిగ్గులతో ఓరచూపులతో కొంటె నవ్వులతో,ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరోకరు కొరుకుతూ , జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో  కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి, భుక్తాయాసంతో ఇంటిదారి పడతాం మనం.

💥💥💥💥

మరి ఈరోజుల్లో ఆ సరదాలు ఎక్కడ,

ఆ అపురూప వడ్డనలు ఎక్కడ....

నుంచుని ప్లేట్ పట్టుకుని తినే రోజుల్లో

ఈ కబుర్లు,సంతోషాలు..మృగ్యం ఐనాయి.

కొసరు వడ్డనలు..ఆత్మీయ పలుకరింపుల్ల

మధ్య  ఉల్లాసం గా సాగే ... విందు భోజనాలు...దాదాపు కను మరుగే..

ఆ రోజులు మళ్లీ రావు, కదా, వస్తె ఎంత బాగుండు?



ఈ కమ్మని పోస్ట్ కొత్త వారి కోసం..చిన్న  మార్పులతో మరోసారి....

చదువుతూ  ఆనందించ గలరు...


Forwarded

⚜ శ్రీ మమ్మియూర్ మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1056


⚜ కేరళ  : గురువాయూరు


⚜ శ్రీ మమ్మియూర్ మహాదేవ ఆలయం



💠 శివునికి అంకితం చేయబడిన మమ్మీయూర్ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.  

ఈ ఆలయం ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది.  

మమ్మియూర్ ఆలయాన్ని మమ్మియూర్ శివాలయం మరియు మమ్మియూర్ మహాదేవ క్షేత్రం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.  


💠 శివుని విగ్రహం పక్కనే విష్ణువు విగ్రహం ఏర్పాటు చేయబడింది, ఇది చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం.  శివుడు మరియు విష్ణువు ఒకరినొకరు సమానంగా భావించే ఏకైక ఆలయం ఇది.  

ఇక్కడ శివుడు ఉగ్ర భవంలో ఉన్నాడు కాబట్టి ఆయనను శాంతింపజేయడానికి విష్ణువు కూడా ఇక్కడ పూజించబడతాడు. 

మమ్మియూర్ ఆలయాన్ని సందర్శించకుండా గురువాయూర్ ఆలయంలో ప్రార్థనలు చేయడం అసంపూర్ణంగా ఉంటుందని బలంగా నమ్ముతారు.  రెండు దేవాలయాల్లోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది.


💠 అది ద్వాపరయుగం చివరి దశ.  మహా ప్రళయంలో శ్రీకృష్ణుని నివాసమైన ద్వారక మునిగిపోయింది. 

 ఒక మర్రి ఆకుపై భద్రపరచబడిన కృష్ణుడు, భూమిపై ప్రతిష్టించడానికి దేవగురువు బృహస్పతి మరియు వాయుదేవుడైన వాయుదేవునికి ఒక విగ్రహాన్ని అప్పగించాడు.


💠 చివరగా గురువు మరియు వాయులు అక్కడ యుగయుగాలుగా తపస్సు చేస్తున్న శివునిచే పవిత్రమైన రుద్రతీర్థం విశాలమైన సరస్సు  ఒడ్డుకు చేరుకున్నారు.  చాలా సేపు తపస్సు చేస్తూ కూర్చున్న స్వామికి దొరికాడు.  


💠 గురువు మరియు వాయుదేవుని ఉద్దేశాన్ని శివుడు అర్థం చేసుకున్నాడు, అతను రుద్రతీర్థ సరస్సు ఒడ్డున శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించమని సూచించాడు.  అలా చేయడానికి, శివుడు సరస్సుకు అవతలి వైపు ఉన్న సమీపంలోని ప్రదేశానికి మారాడు.


💠 శ్రీకృష్ణుని విగ్రహాన్ని గురువు మరియు వాయుదేవుడు ప్రతిష్టించిన ప్రదేశం గురువాయూర్ అని పిలువబడింది.  


💠 శివుడు తన కోసం మరియు అతని భార్య శ్రీ పార్వతి కోసం వెంబడించే ప్రదేశం మహిమయూర్‌గా మారింది.  కృష్ణ భగవానుడికి వసతి కల్పించడానికి తన అసలు నివాసాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందుకు శివునికి ప్రసాదించిన స్థితి నుండి మహిమ అభివృద్ధి చెందుతుంది.  

ఇది కాలక్రమేణా మమ్మియూరుగా వ్యావహారికంగా మారింది.  

ఈ విధంగా మమ్మియూర్ మహాదేవ దేవాలయం యొక్క పురాణం ప్రసిద్ధ శ్రీ గురువాయూర్ ఆలయ ప్రతిష్ఠాపన వరకు విస్తరించింది.


💠 ఇది కేరళలోని 108 ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి మరియు గురువాయూర్ చుట్టూ ఉన్న ఐదు శివాలయాల్లో ఒకటి, ఇది శివుని ఐదు ముఖాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.


💠 ఈ ఆలయంలో శివుడిని ఉమా మహేశ్వరుడిగా, పార్వతితో వర్ణించే రూపం ఉంది.  ఒక ప్రత్యేక గర్భగుడి విష్ణువుకు అంకితం చేయబడింది.

గురువాయూర్ ఆలయాన్ని సందర్శించే భక్తులు మమ్మియూర్‌ను తీర్థయాత్రలో భాగంగా భావిస్తారు.


💠 ఈ ఆలయం కేరళలోని 108 ప్రసిద్ధ శివాలయాల్లో ఒక భాగం మరియు గురువాయూర్ చుట్టూ ఉన్న ఐదు శివాలయాల్లో ఒకటి.  


💠 ప్రధాన దేవత శివుడు, అతను 'ఉమా మహేశ్వర' భావనలో ప్రతిష్టించబడ్డాడు - అతని ఎడమవైపు పార్వతి దేవితో అతని రూపం.  

ఇక్కడ విష్ణుమూర్తికి కూడా గుడి ఉంది.  

ఉప దేవతలు గణపతి, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్పన్, కాళీ మరియు సర్ప దేవతలు.  

ఈ ఆలయాన్ని మలబార్ దేవస్వోమ్ బోర్డు నిర్వహిస్తోంది.  రోజూ మూడు పూజలు నిర్వహిస్తారు.  పూజక్కర చెన్నాస్ మన ఈ ఆలయానికి వారసత్వ తంత్రి కూడా.  శివరాత్రి మరియు అష్టమి రోహిణి ప్రధాన పండుగలు.


💠 ఆలయ సముదాయం క్లిష్టమైన చెక్కడాలు, సాంప్రదాయ వాస్తుశిల్పం మరియు పవిత్రమైన ఆచారాలతో అలంకరించబడి, భక్తులకు ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు పొందేందుకు ప్రశాంతమైన మరియు దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.


💠 గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం మరియు గురువాయూర్ ఏకాదశి ఉత్సవాలతో అనుబంధం కలిగి ఉండటం మమ్మియూర్ శివాలయం యొక్క విశిష్టమైన లక్షణాలలో ఒకటి. ఈ వార్షిక పండుగ సందర్భంగా, భక్తులు శివుడు మరియు కృష్ణుడు ఇద్దరి ఆశీర్వాదాలను కోరుతూ పవిత్ర యాత్రలో భాగంగా రెండు దేవాలయాలను సందర్శిస్తారు. 

ఈ ఆలయం ఏడాది పొడవునా వివిధ మతపరమైన వేడుకలు, ఆచారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది, దాని ఆధ్యాత్మిక ఆకర్షణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడిస్తుంది.


💠 గొప్ప వారసత్వం, శిల్పకళా వైభవం మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో, మమ్మియూర్ శివాలయం గురువాయూర్‌లో ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది, భక్తులను మరియు సందర్శకులను భగవంతుని యొక్క దైవిక ఉనికిని అనుభవించడానికి మరియు హిందూ ఆరాధన యొక్క పురాతన సంప్రదాయాలు మరియు ఆచారాలలో మునిగిపోతుంది. .


💠 గురువాయూర్ రైల్వే స్టేషన్ నుండి 1.5 కి.మీ దూరంలో మరియు గురువాయూర్ ఆలయానికి 2 కి.మీ దూరం


Rachana

©️ Santosh Kumar

15-05-గీతా మకరందము

 15-05-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నాశరహితమగు అట్టి పరమాత్మపదమును ఎవరు పొందగలరో వచించుచున్నారు -

 

నిర్మానమోహా జితసఙ్గదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః | 

ద్వన్ద్వైర్విముక్తాః  సుఖదుఃఖసంజ్ఞైః 

గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్ || 

 

తాత్పర్యము:-అభిమానము (లేక, అహంకారము) అవివేకము లేనివారును, సంగము (దృశ్యపదార్థములం దాసక్తి) అను దోషమును జయించినవారును, నిరంతరము ఆత్మజ్ఞానము (బ్రహ్మనిష్ఠ) గలవారును, కోరికలన్నియు లెస్సగ (వాసనాసహితముగ తొలగినవారును, సుఖదుఃఖములను ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును (మోక్షమును) బొందుచున్నారు.


వ్యాఖ్య:- పునరావృత్తిలేని శాశ్వతబ్రహ్మపదమును (మోక్షమును) ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగ నిరూపింపబడినది. ఆఱు సల్లక్షణములు గలవారు అట్టి మహోన్నతపదవిని జేబట్టగలరు. అవి యేవి యనిన -

(1) అభిమాన, అవివేకరాహిత్యము.

(2) సంగమను దోషమును జయించుట - (సంగమనగా దృశ్యపదార్థములందు ఆసక్తి, అసంగమనగా అది లేకుండుట, వానితో అంటకనుండుట).

(3) నిరంతరము ఆత్మయందు నిష్ఠగలిగియుండుట. ఇచట నిరంతరము (నిత్యాః) అను పదము గమనింపదగినది. ఏదియో యొక కాలమున దైవచింతన చేయుట మంచిదేకాని, అది చాలదు, క్రమక్రమముగ ఆ దైవనిష్ఠాసమయమును పెంచుకొనుచుపోయి 'నిరంతర దైవనిష్ఠ’ యను స్థితిని జేరుకొనవలయును. ఏలయనిన, దైవభావమను ప్రకాశము లేనిచో మాయయను అంధకారము వెంటనేవచ్చి అలముకొనును. అత్తఱి మహాప్రమాదము సంభవించును. కావున నిరంతర అధ్యాత్మనిష్ఠద్వారా మాయకు ఒకింతేని అవకాశమీయక నుండవలెను. ప్రపంచములో మూడురకముల జనులుందురు. కొందఱు అహర్నిశము ఆత్మస్థితిని, దైవభావమును గల్గియుందురు. వీరు ఉత్తములు. మఱికొందఱు కొద్దిసేపు దైవచింతనగలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములయందు నిమగ్నులగుదురు. వీరు మధ్యములు, సాధనాతిశయముచే వీరు మొదటితరగతికి క్రమముగ జేరుకొనగలరు. ఇక నిరంతరము దృశ్యపదార్థవ్యామోహములోనే కొట్టుకొనుచు దైవస్మరణ ఒకింతైనను లేనివారు కనిష్ఠులు. ఈ స్థితి నింద్యము, గర్హితము అయియున్నది. కావున వివేకవంతు లిద్దానిని త్యజించవలయును.

  (4) ఇక మోక్షపదప్రాప్తికి ఆవశ్యకమైన నాల్గవ సుగుణము కోరికలను సంపూర్ణముగ, వాసనాసహితముగ తొలగించుట (వినివృత్తకామాః). "నివృత్త” అని చెప్పక "వినివృత్త” అని చెప్పుటవలన కోరికలన్నియు నిశ్శేషముగ, సమూలముగ (వాసనాసహితముగ) తొలగిపోవలెనని భావము.


 'అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః’ అను ఈ శ్లోకపాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది. ఏలయనిన ఆధ్యాత్మిక సాధనసర్వస్వమంతయు ఈ రెండు పదములలోనే ఇమిడియున్నది. మొదటిది తత్త్వజ్ఞానము (అధ్యాత్మనిత్యాః), రెండవది వాసనాక్షయము" (వినివృత్తకామాః). మొదటిది దృక్ - స్వరూపస్థితి. రెండవది దృశ్యరాహిత్యము. ఈ రెండిటిని సాధకుడు ఏకకాలములో అభ్యసించుచురావలెనని శాస్త్రము లుద్ఘోషించుచున్నవి.

          (5) ఇక ఐదవసాధన సుఖదుఃఖాది ద్వంద్వరాహిత్యము.

(6) ఆఱవది అమూఢత్వము. అనగా అజ్ఞానము లేకుండుట. అజ్ఞానమును, అవిద్యను దరికిచేరనీయక, జ్ఞానమందే సదా నిలుకడగలిగియుండుట. ఈ ప్రకారముగ భగవానుడు తెలిపిన ఆఱుసాధనలను చక్కగ అవలంబించువారు పొందునట్టి మహత్తర ఫలితమేది? అవ్యయమగు మోక్షమే (గచ్ఛన్తి  పదమవ్యయమ్). ప్రపంచములోని పదవులన్నియు వ్యయములు, నాశవంతములు, క్షయిష్ణువులు. పరమాత్మపదవి యొక్కటియే అవ్యయమైనది. శాశ్వతమైనది. తరుగులేనిది. కావున విజ్ఞులెల్లరును అద్దానినే అన్వేషింపవలయును.


ప్రశ్న:- పరమాత్మపద మెట్టిది?

ఉత్తరము:- అవ్యయమైనది. నాశరహితమైనది. 

ప్రశ్న:- దాని నెవరు, పొందగలరు? 

ఉత్తరము:- (1) అభిమానము అవివేకము లేనివారు (2) సంగము (దృశ్య వస్తులం దాసక్తి) అను దోషమును జయించినవారు (3) నిరంతరము ఆత్మస్థితియందుండువారు (4) కోరికలను పరిపూర్ణముగ (వాసనాసహితముగ) తొలగించినవారు (5) సుఖదుఃఖాది ద్వంద్వములనుండి విడువబడినవారు (6) మూఢత్వము (అజ్ఞానము) లేనివారు - ఈ ప్రకారములగు ఆఱుసల్లక్షణములుగలవారు-పరమాత్మపదమును (మోక్షపదవిని) పొందగలరు.

తిరుమల సర్వస్వం 184-*

*తిరుమల సర్వస్వం 184-*

*సప్తగిరులు -3*

అలా వారిరువురికి చాలాసేపు వాదోపవాదాలు జరుగుతుండగా, వారి సంభాషణలను అన్యాపదేశంగా విన్న విష్ణుమూర్తి తన పీఠం నుంచి తరలి ప్రవేశద్వారం వద్దకు వచ్చాడు. దాంతో కక్షిదారులిరువురు శ్రీమహావిష్ణువుకు తమ తమ వాదనలను వినిపించారు. అంతే కాకుండా, వారిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పవలసిందిగా శ్రీహరిని కోరారు.


‌ ముల్లోక వాసులందరికీ ప్రాణాధారమైన తాను గొప్పవాణ్ణని వాయుదేవుడు; భూమండల మంతటినీ తన పడగలపై మోస్తున్నందున తానే గొప్పవాణ్ణని ఆదిశేషుడు ఇలా ఎవరికి వారు తమ గొప్పతనాన్ని శ్రీమహావిష్ణువుకు చెప్పుకున్నారు. శ్రీమన్నారాయణడు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది. అదే అదనుగా ఆదిశేషువుకు తన స్థానం ఏమిటో తెలియబరచదలచుకున్నాడు. వారిరువురిని ఉద్దేశించి ఇరువురు తమ తమ స్థానాలలో, కర్తవ్య నిర్వహణలో తిరుగులేని వారేనని; వారిలో ఎవరు అధికులో తేల్చటం అత్యంత కష్టతరమని బోధపరచి, వారిరువురికి ఒక పరీక్ష పెట్టదలచుకున్నట్లుగా చెప్పాడు.


‌ వైకుంఠంలో అల్లంత దూరాన ఉన్న 'ఆనందుడు' అనే పర్వతాన్ని చూపించి ఆదిశేషువు తన పడగలతో ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకుని ఉండాలని; వాయుదేవుడు శక్తినంతా ఉపయోగించి తన వాయుతాడనంతో, ఆదిశేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని కదిలించడానికి ప్రయత్నించాలని ఆదేశించాడు. పర్వతం కదిలితే వాయుదేవుడు గెలిచినట్లు, లేకుంటే విజయం ఆదిశేషువుదన్నమాట.


 ఆ పందానికి అంగీకరించిన వారిరువురు ఈ పరీక్షకు సన్నద్ధమయ్యారు. అపరిమిత బలశాలి అయిన ఆదిశేషువు ఆనందపర్వతాన్ని చుట్టుకొని, పడగలతో గట్టిగా అదిమి పెట్టి, తన బలానికి తానే మురిసిపోయాడు. వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఏమాత్రం కదిలించలేడన్న ధీమాతో నిశ్చింతగా ఉన్నాడు.


‌ ఆటు వాయుదేవుడు భారమంతా శ్రీమహావిష్ణువు పై వేసి, ఆ దేవదేవుని మనసులోనే స్మరించుకుంటూ, ఒక్క ఉదుటున ఉధృతమైన ప్రభంజనాన్ని సృష్టించాడు.


 సాక్షాత్తు శ్రీమన్నారాయణుని మహిమ ముందు, అహంకారంతో విర్రవీగే ఆదిశేషుడి శక్తి ఏపాటిది? చండప్రచండంగా వీచిన వాయువు ధాటికి ఆనందుడు అనబడే ఆ పర్వతం ఆదిశేషువుతో సహా ఎగిరి; కొన్ని వేల యోజనాల దూరంలో ఉన్న, భూలోకం లోని సువర్ణముఖి నదీ తీరాన వచ్చి పడింది.


‌ మరో కథనం ప్రకారం, ఈ పోటీ జరుగుతున్న సమయంలో శ్రీమన్నారాయణుని సంకేతాన్ననుసరించి; నారదమహర్షి వైకుంఠాని కేతెంచి, ద్వారం ముందు నిలిచి, తన వీణతో మృదుమధురమైన నాగస్వరం పలికించాడు. నాగులకు సహజమైన ప్రవృత్తితో ఆ నాగస్వరానికి మైమరచిన ఆదిశేషువు తన పట్టును కొద్దిగా సడలించి, తన్మయత్వంతో నాట్యం చేయసాగాడు. అదే అదనుగా వాయుదేవుడు విజృంభించి, తన ప్రచండమారుతంతో ఆదిశేషువుతో సహా ఆనందపర్వతాన్ని భూలోకంలోకి విసిరి వేశాడు. అలా ఎగరవేయబడ్డ పర్వతం స్వర్ణముఖి నదీతీరం వద్ద ప్రతిష్ఠితమైంది.


 తిరుమలకొండపై ఇప్పుడు శ్రీనివాసుడు కొలువుదీరి ఉన్న 'ఆనందనిలయం' ఆ పర్వతం పైనే నెలకొని ఉన్నది.

2  **ఈ సంఘటన జరిగిన తర్వాత, వైకుంఠవాసి అయిన మేరుపర్వతం శ్రీమహావిష్ణువు వద్దకు వచ్చి వైకుంఠం నుండి భూలోకంలోకి వాయుదేవుని ద్వారా విసిరివేయ బడ్డ 'ఆనందుడు' అనే పర్వతం తన తనయుడని; ఆదిశేషునికి వాయుదేవునికీ మధ్య తగాదాలతో ఏమాత్రం సంబంధం లేని తన కుమారుడు, తనకూ వైకుంఠానికి దూరమై, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని; తాను తన తనయుడు శ్రీహరిని యుగయుగాలుగా భక్తిశ్రద్ధలతో సేవించుకుంటున్నామని, ఎలాగైనా తన తనయుడిని అనుగ్రహించాలని మొరపెట్టుకుంది. మేరుపర్వతం మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు ఇదంతా తన సంకల్పమేనని, ముందు ముందు రాబోయే 28వ కలియుగంలో తాను శ్రీవేంకటేశ్వరునిగా భూలోకంలో అవతరిస్తానని, అప్పుడు తాను మేరుపర్వతం తనయుడైన ఆనందపర్వతం పైనే కొలువై ఉండి, కలియుగాంతం వరకు భక్తులను ఉద్ధరిస్తారని, తద్వారా ఆనందుని జన్మ సార్థకమై అజరామరమైన కీర్తిప్రతిష్ఠలతో వర్ధిల్లుతాడని శెలవిస్తాడు.**


 ఆ విధంగా శ్రీనివాసుడు కొలువై ఉన్న శేషాచల పర్వతానికి 'ఆనందపర్వత' మనే మరో పేరు కూడా వచ్చింది. అలాగే, శ్రీనివాసుడు కొలువై ఉండే ఆలయానికి కూడా 'ఆనందనిలయం' అనే సార్థక నామధేయం ఏర్పడింది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*323 వ రోజు*


*సాత్యకి శౌర్యం*


సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భల్ల బాణములతో కృతవర్మ వింటిని తుంచి నాలుగు బాణములు వేసి రథాశ్వములను చంపి, ఒక్క అగ్నిబాణముతో సారథిని కొట్టి, ఇంతలో తనకు అడ్డు వచ్చిన త్రిగర్త సైన్యమును నాశనం చేసాడు. రథము విరిగిన కృతవర్మను పాండవ సైన్యం చుట్టుముట్టింది. ఇది చూసిన ద్రోణుడు సాత్యకిని వదిలి పాండవ సైన్యమును ఎదుర్కొన్నాడు. ఇంతలో జలసంధుడు అనే రాజు సాత్యకిని ఎదుర్కొని తన ఏనుగును సాత్యకి మీదకు తోలాడు. సాత్యకి అతడిని అడ్డుకున్నాడు. జస్లసంధుడు సాత్యకి వింటిని విరిచి ఏభై బాణములతో సాత్యకి గుండెలకు గురి చూసి కొట్టాడు. సాత్యకి కోపించి జలసంధుని అరవై బాణములు జలసంధుని శరీరంపై నాటాడు. జలసంధుడు ఒక తోమరంతో సాత్యకిని కొట్టి కత్తితో అతడి విల్లు విరిచాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు తీసుకుని ఆలస్యం చేయక జలసంధుని క్రూరమైన బాణముతో చేతులు నరికి, మరొక బాణముతో అతడి తల నరికి మరొక బాణంతో అతడి ఏనుగును తరిమాడు. సాత్యకి పరాక్రమానికి కౌరవసైన్యం భయకంపితం అయింది. ఇది చూసిన ద్రోణుడు కృతవర్మను వ్యూహము వద్ద నిలిపి తాను సాత్యకిని ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా ద్రోణుడు రావడం చూసాడు సాత్యకి అతడి వెనుక కురుకుమారులైన దుర్మర్షణ, దుర్ముఖ, దుశ్శాసన, దుస్సహ, వికర్ణ, చిత్రసేనాదులు రావడం చూసాడు. ఇంతలో సుయోధనుడు వారితో చేరాడు. వారిని చూసిన ద్రోణుడు సుయోధనుడు తన సహోదరులతో సాత్యకిని ఎదిరించగలడు అనుకుని తిరిగి వ్యూహరక్షణకు వెళ్ళాడు. సాత్యకి కురుకుమారులకు ఒక్కొక్కరికి ఒక్కొకడిలా కనిపిస్తూ వారందరితో ఏక కాలంలో యుద్ధం చేస్తున్నాడు. అలా యుద్ధం చేస్తూ సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ఇది చూసిన కురుకుమారులు సాత్యకిపై బాణవర్షం కురిపించారు. సాత్యకి వారి అందరిపై ఒక్కొక్కరిపై అయిదేసి బాణము వేసి సుయోధనుడి మీద ఎనిమిది బాణములు వేసి అతడి వింటిని తుంచి, కేతనమును విరిచి, సారథిని కొట్టి, రథాశ్వములను చంపాడు. సుయోధనుడు సాత్యకి పరాక్రమానికి భయపడి పక్కనే ఉన్న చిత్రసేనుడి రథం ఎక్కి పారిపోయాడు.


*సాత్యకి కౌరవ సేనలను ఎదుర్కొనుట*


సుయోధనుడిపై సాత్యకి పైచేయి కావడం చూసిన కౌరవసేన హాహాకారాలు చేసింది. అది చూసి కృతవర్మ అక్కడకు చేరాడు. సాత్యకి కూడా తన రథమును కృతవర్మకు ఎదురుగా నిలిపాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు శరవర్షం కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మ విల్లు విరిచి, సారథిని చంపి మరొక బాణంతో కృతవర్మను మూర్చపోయేలా కొట్టాడు. ఆ దెబ్బకు కృతవర్మ రథంపైన పడ్డాడు. కృతవర్మ మరణించాడని అనుకుని సాత్యకి అర్జునుడి వద్దకు పోవడానికి ఆయత్తమయ్యాడు. కృతవర్మ తేరుకుని తిరిగి యుద్ధానికి వచ్చాడు. ద్రోణుడు కృతవర్మను వ్యూహద్వారము వద్ద నిలిపి తాను సాత్యకిని అడ్డగించడానికి వెళ్ళి మూడు క్రూర బాణములతో సాత్యకి నుదుటన కొట్టాడు. సాత్యకి అందుకు ప్రతిగా ద్రోణుడిపై బాణప్రయోగం చేసాడు. ఇరువురి మధ్య పోరు ఘోరమైంది. ద్రోణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం విధి వశమున సాత్యకి రథమును తాకింది. సాత్యకి ద్రోణుడి భుజం మీద బాణమును వేసాడు. ద్రోణుడు సాత్యకి విల్లు తుంచి, సారథిని మూర్ఛిల్లేలా కొట్టాడు. సాత్యకి తానే రథము తోలుతూ యుద్ధము చేస్తున్నాడు. సాత్యకి ద్రోణుని రథసారథిని చంపాడు. సారథి లేని ద్రోణుని రథాన్ని గుర్రములు ఎటో లాక్కెళ్ళి చివరకు వ్యూహద్వారం చేర్చాయి. ద్రోణుని అడ్డు తొలగగానే సాత్యకి తన రథమును అర్జునుడి వైపు నడిపాడు. శరవేగంతో దూసుకుపోతున్న సాత్యకిని సుదర్శనుడు ఎదుర్కొని సాత్యకిపై బాణములు గుప్పించాడు. సాత్యకి ఆ బాణములను తునాతునకలు చేసి సుదర్శనుడి రథాశ్వములను చంపి, సారథిని చంపి చివరకు సుదర్శనుడి తల నరికాడు. సాత్యకి రథసారథితో " మహాసముద్రం వంటి ద్రోణుడిని దాటి వచ్చాను. ఈ పిల్ల కాలువలు ఒక లెక్కా ! " అన్నాడు. " ఆ విషయం నాకు తెలియనిదా ! ఇప్పుడు మనమెవరిని ఎదుర్కోవాలి " అన్నాడు సారథి. సాత్యకి " సారధీ! ఇక్కడ రధములు విరిగి పడి ఉన్నాయి. చనిపోయిన ఏనుగులు, హయములు, సైనికుల శవాలు పడి ఉన్నాయి. వీరిని అర్జునుడే చంపి ఉంటాడు. కనుక రధాన్ని ఈ మార్గంలో పోనిమ్ము అదిగో గాండీవం యొక్క ధనుష్టంకారం వినిపిస్తుంది అటు పోనిమ్ము. ఇంతలో కాంభోజరాజ సైన్యములు సాత్యకిని చుట్టుముట్టాయి. సాత్యకి వారి బాణములను ఎదుర్కొని అందరిని యమసదనముకు పంపాడు. ఆ ప్రాంతం అంతా పీనుగుల పెంట అయింది. వారి మీదనుండి రధము నడుపుతూ సాత్యకి ముందుకు సాగాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

తెలుగు మనోహరమ్ములగు

 చ.తెలుగు మనోహరమ్ములగు తీయని సుస్వర మార్దవమ్ములౌ

వెలుగులు నింపు భాష మది వేడుక గొల్పుచు నుండు భాషణన్

విలసిత రాగ రంజిత వివేకము గూర్చెడు నట్లు సన్మతిన్

తెలియగ జెప్పనెంచిన సుధీమతి గూర్చుచు నుండు భారతీ!౹౹ 97


చ.పలువురు మాతృభాష తమపాలిట భారము గూర్చు భాషగా

దలచుట ధర్మమే జనని తాల్మిని జన్మ మొసంగి వేడ్కమై

తొలి యడుగుల్ ముదమ్ము గన తుష్టిగ నేర్పిన భాష విద్యలన్ 

వెలుగులు జీవితమ్మునకు ప్రీతి నొసంగుట కల్మి భారతీ౹౹98

21, మార్చి, 2025🪷* *దృగ్గణిత పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹*

*🪷21, మార్చి, 2025🪷*

   *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి      : సప్తమి* రా 04.22 తె వరకు ఉపరి *అష్టమి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : జ్యేష్ఠ* రా 01.46 వరకు ఉపరి *మూల*


*యోగం  : సిద్ధి* రా 06.42 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : భద్ర* మ 03.36 *బవ* రా 04.22 తె వరకు ఉపరి *బాలువ*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *సా 04.08 - 05.53*

అభిజిత్ కాలం  : *ప 11.50 - 12.39*


*వర్జ్యం            : శేషం ఉ 07.24 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 08.36 - 09.25 మ 12.39 - 01.27*

*రాహు కాలం   : ఉ 10.44 - 12.15*

గుళికకాళం      : *ఉ 07.42 - 09.13*

యమగండం    : *మ 03.17 - 04.47*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *వృశ్చికం/ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 06.11* 

సూర్యాస్తమయం :*సా 06.18*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 06.11 - 08.36*

సంగవ కాలం         :      *08.36 - 11.02*

మధ్యాహ్న కాలం    :      *11.02 - 01.27*

అపరాహ్న కాలం    : *మ 01.27 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ బహుళ సప్తమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.18*

ప్రదోష కాలం         :  *సా 06.18 - 08.41*

రాత్రి కాలం          :  *రా 08.41 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.38*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.35 - 05.23*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం🪷*


*మహాలక్ష్మినమస్తుభ్యం నమస్తుభ్యంసురేశ్వరి*

*హరిప్రియేనమస్తుభ్యం నమస్తుభ్యందయానిధే*


*🪷ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

 🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - కృష్ణ పక్షం  - సప్తమి - జేష్ఠ -‌‌ భృగు వాసరే* (21.03.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag



 

ప్రియ బాంధవా మేలుకో 15*

 *ప్రియ బాంధవా మేలుకో 15*




దేశంలో భద్రతా చట్టాలతో బాటు న్యాయ వ్యవస్థ గూడా సమాజానికి అవసరమైన ముఖ్య వ్యవస్థ. న్యాయ ప్రమాణాల ననుసరించి చట్ట పరిధిలో నేరాలకు, అన్యాయాలకు సంబంధించిన తీర్పులు వినిపించి, శిక్షలు విధించునవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు సాధారణంగా సివిల్ మరియు క్రిమినల్ వ్యాజ్యాలు స్వీకరిస్తాయి. దేశమంతటా న్యాయస్థానాలు నెలకొని ఉన్నాయి. 

1) *ప్రాథమిక హక్కులు*

సమానత్వం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్చ, వివక్షతా రక్షణ. అపకీర్తి, పరువు నష్టము ఇత్యాది.

2) *సివిల్ వ్యాజ్యాలు*;- భూమి, ఆదాయము, ఆస్తి, సరిహద్దులు, వారసత్వ హక్కులు, భూ బదిలీలు, అద్దెలు, లాభాలు మున్నగునవి.

3) *క్రిమినల్*:- హత్యలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, మానభంగాలు, బలవంతపు మానవ అపహరణలు, అక్రమ ఆయుధాలు కల్గి ఉండుట మున్నగునవి.


ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ఆయా దేశాలలో *స్వతంత్రంగా* ఉంటుంది. కాని, మన దేశంలో *ఏకీ కృత* న్యాయ వవస్థ అమలులో ఉన్నది. వ్యాజ్యాలు దిగువ స్థాయిలో పరిష్కారం కానప్పుడు అంచలంచెలుగా ఎగువ స్థాయి న్యాయస్థానాలకు వెళ్ళ వచ్చును. అప్పీల్ సౌకర్యం మన న్యాయ వ్యవస్థలో పొందుపర్చబడినది.


న్యాయ సేవలలో భాగంగా వ్యాజ్యాలు స్వీకరించుట ప్రధానంగా దిగువ న్యాయస్థానం నుండి అత్యుత్తమ స్థాయి న్యాయస్థానాలు దిగువ చూపబడిన విధంగా ఉంటాయి. 

1) Munsif, Addi Sub Judge, Sub Judge, Sessions Court.

(గ్రామీణ మరియు పట్టణ )

ఈ క్రమంలోనే లోక్ అదాలత్ లు, 

2) *Sub ordinate courts*

(జిల్లా)

3) *High courts*

(రాష్ర్ట స్థాయి)

ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ లు మరియు మహిళా కోర్టులు

4) *Supreme court*

(దేశ స్థాయి అత్యుత్తమ న్యాయస్థానము).


*ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఎవరైనా P I L (Public Interst Litigation) న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేయవచ్చును*.


Virtual/online న్యాయ వ్యవస్థ కూడా మన దేశంలో అమలులో ఉన్నది.


న్యాయస్థానాలకు సంబంధించిన రాష్ట్ర మరియు జాతీయ న్యాయ అకాడమీలు, కొలీజియం వ్యవస్థ మరియు Law Commission కూడా దేశంలో ఉన్నాయి. దేశంలో ఇంత విస్తారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు దేశంలో ప్రజా భద్రతకు మరియు ప్రశాంతతకు కొదవ ఉండకూడదు. 


అధికారిక లెక్కల ప్రకారం 2018 - 2022 సంవత్సరాల మధ్య *మానవ అక్రమ రవాణా* అను *ఒక్క నేర* రంగంలోనే దేశవ్యాప్తంగా పదిన్నర వేలకు పైగా ఫిర్యాదులు నమోదు అయినాయి. దాదాపు ఇరువది వేల మందిపై ఛార్జ్ షీట్ లు దాఖలు కాగా శిక్షలు పడిన వారు మాత్రము వెయ్యి మంది నేరస్థులే. సత్యాసత్యాల నిర్ధారణలో న్యాయస్థానాలకు సహాయపడే పవిత్ర బాధ్యతను నిర్వర్తించగల్గినవారే *సాక్ష్యులు, ఆమాటకొస్తే సాక్ష్యులే న్యాయానికి కళ్ళు మరియు చెవులు*. పైన చూపిన గణాంకాల ప్రకారం ఎన్ని వేల కేసులు వీగిపోయినవో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దోషులు తప్పించుకునే లొసుగుల వల్ల *ఈలాంటి సంఘటనలు భద్రతా విభాగాలను, చట్టాలను మరియు న్యాయస్థానాలను పరిహసిస్తున్నట్లు అగుపిస్తున్నాయి*. సమాజం మొత్తం ఇందుకు *బాధ్యత వహించాలి*.


ప్రజలు మౌన మునులు లాగా ఉండడం ముఖ్యంగా విద్యావంతులుమరియు జ్ఞానవంతులు నిశ్శబ్దత పాటించడం పరోక్షంగా సమాజ కీడుకు, దేశ దురదృష్టానికి ప్రధాన హేతువు.


ధన్యవాదములు

*(శేషం)*

ఉదంకకృత నాగస్తుతి-- నన్నయభట్టారకుడు.

 శు భో ద యం 🙏


ఉదంకకృత నాగస్తుతి-- నన్నయభట్టారకుడు.


              చ: బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణసరస్సరస్వతీ 


                    సహిత మహామహీ భరమజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు


                    స్సహతర శీలికిన్ జలధి శాయికిఁ బాయక శయ్యయైన య


                    య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడిన్!


                     ఇది నన్నయగారి పద్యం .పౌష్యదేవేరి కుండలములను గురుపత్ని కొరకై దెచ్చుటకేగిన యుదంకుడు నాగుల వెన్నంటి పాతాళమున కేగిన సందర్భమున నాగరాజుల యనుగ్రహమును గోరుచు ప్రార్ధన చేయుచు ,ముందుగా ఆదిశేషుని యీపద్యమున ప్రస్తుతించు 

చున్నాడు.


              అర్ధములు:- బహువన- అనేకమైన యడవులు; పాదప--వృక్షములు ; అబ్ధి- సముద్రము లు;కులపర్వత- కులపర్వతములు;

                                  పూర్ణసరస్- నిండుగా నున్నచెఱువులు; సరస్వతీ--నదులు :మొ:వానిచే సహిత--కూడిన; మహామహీభరము--

గొప్పభూభారమును; అజస్ర-- ఎల్లప్పుడు; సహస్ర ఫణాళిన్-- వేయిపడగలపై ; దాల్చి-ధరించి ; దుస్సహతర మూర్తికిన్--భరింపశక్యముగాని యాకారముగల; జలధిశాయికిన్-- ఉదధి శయనుడగు విష్ణుమూర్తికి; పాయక-- విడువని; శయ్యయైన--సెజ్జగామారిన ; దుష్కృతాంతకుడు--దుర్మార్గుల నంతమొందించు; అనంతుడు--ఆదిశేషుడు; మాకు--మాకు;(మమ్ము) ప్రసన్నుఁడయ్యెడిన్--కరుణించుగాక! 


               భావము:- అనేక అరణ్యములతోను , వృక్షములతోను ,సముద్రములతోను ,కులపర్వతములతోను ,( నిండిన) సరస్సులు ,నదులతోను, కూడిన యీభూభారమును నింతరము తనపడగలపై మోయుచు, సకలవిశ్వగర్భుఁడై వెలుగొందుచు మోయ నసాధ్యుడై సాగరశయునుడై యొప్పు ఆశ్రీహరికి విడువని సెయ్యగానమరి ,దుర్మార్గులను మట్టుబెట్టు స్వభావముగల ఆ

ఆదిశేషుఁడు మాపై దయచూపుగాక! అనిభావము.


                విశేషాంశములు:- హృద్యమైన పద్యవిద్య కాద్యుడు నన్నయగారు. ఆయన భారతాంధ్రీకరణ విధానము అనుపమానమైనది. సంస్కృతమున వ్యాస మహామునిచే బహువిస్తారముగా వ్రాయబడిన భారత గ్రంధమును.భావానువాదమొనర్చి యాంధ్రసారస్వతమున కంకురార్పణము ను గావించెను. అక్షర రమ్యత ,ప్రసన్నకథ ,లోనారయుట, ఇతనికవితాగుణములు. పండితులు కధాగమన రీతులను వ్యంగ్యమర్యాదలను జూచి మెచ్చ ,తక్కురు అక్షర రమ్యత నాదరింప రుచిరార్ధ సూక్తి నిధానముగా భారత రచన మొనరించెను. ఈపద్యము అతని పద్యరచనాశిల్పానికి పట్టుగొమ్మ. అక్షరరమ్యత ననుసంధించుచు నన్నయ ప్రదర్శించిన వ్యంగ్య రచనావిధానమిందు మెచ్చదగినది.


                   ఆదిశేషుని ప్రాముఖ్యమును లేదా గొప్పతనమును చెప్పవలెనన్న నతడుచేయుచున్న మహత్తరమైన కార్యములను వెల్ల

డించవలసి యుండును. నన్నయచేసిన దదియే! సర్వభువన ముల తనలో మోయుచున్న శ్రీహరి నీతడు నిరంతరము మోయుట నీ

తడొనరించుకార్యము. దానితో బాటు భూభువన భారమునుగూడ వహించుచుండుటను సూచించు చున్నాడు. అడవులు వృక్షములు,సముద్రములు ,పర్వతములు ,సరస్సులు ,నదులు మొన్నగు వానితోగూడిన విశాల మైనది భూమి. ఆభూభారము నెల్లపుడు తన వేయిపడగలపై మోయుచుండుట.


                       ఇదిగాక దుష్ట శిక్షణమొకటి. కదిలెనా హరికి నిద్రచెడును.పడగలు వాల్చెనా ధరణిదడదడలాడును. ఎంత సహనము,ఎంత శక్తి ,ఎంతటి నేర్పుకావలెను? సందేహమేలేదు .ఇవియన్నియు ఉన్నవాడు అనంతుడే! ననువిషయమును

వ్యంగ్యముగా సూచించుచు, సరస్సరస్వతీ , అజస్రసహస్రఫణాళి ,మహామహీభరము , ఇత్యదిగా ప్రయోగములతో అక్షరరమ్యతను

పోషించుచు ,పద్యమును నడిపించిన నన్నయ బహుధా శ్లాఘనీయుడుగదా!


                                                            స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌟🌷🌟🌟🌷🌷

అపూర్వ కవితా భానూదయం!!

 శు భో ద యం 🙏


అపూర్వ కవితా భానూదయం!!


ఉదయాద్రి బుజమెక్కి ఒకడు నవ్వెను చూడు 

     భూ దివమ్ములు వెల్గుపూలు పూయ,


ఉవిద తామరబుగ్గ నెవడొ ముద్దిడె చూడు 

     మనసులో వలపు చందనము రాయ,


చిమ్మ చీకటి కాల జిమ్మె నెవ్వడొ చూడు 

    గుండె లోపలి తమోగుణము మాయ,


కనురెప్ప దుప్పటీ కప్పులాగె నెవండొ 

      వెలుగు లోకాలు తల్పులను తీయ


వేయి చేతుల ధరణిన పిలచి పిలచి

     కౌగిలించు నెవండొ  శృంగారి చూడు,


కనబడరాని దివ్య లోకాలు చూపి    

     తాను కనుమూయు లోకబాంధవుడు వాడు.


( *సుప్రభాతము * డా:దాశరధి.) 🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: మూడవ అధ్యాయం

కర్మయోగం: శ్రీ భగవానువాచ


యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః 

భుఞ్జతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ (13)


అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః 

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః (14)


పార్థా...

యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వపాపాలనుంచీ విముక్తులవుతున్నారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్నవాళ్ళు పాపమే తింటున్నారు. అన్నంవల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తున్నది. యజ్ఞం మూలంగా వర్షం కలుగుతున్నది. యజ్ఞం సత్కర్మలవల్ల సంభవిస్తున్నది.

PARENTS

 MESSAGE TO ALL PARENTS 


1- Avoid Giving your child everything he asks for. He will grow up believing that he has the right to get everything he wants.


2-Avoid laughing when your child speaks insulting words. He will grow up thinking that disrespect is entertainment.


3-Avoid remaining insensitive to bad behavior that he can display without scolding him for his bad behavior. He will grow up thinking that there are no rules in society.


4- Avoid picking up anything that your child messes up. He will grow up believing that others must take responsibility for his responsibilities.


5- Avoid letting him watch any program on TV. He will grow up thinking that there is no difference between being a child and being an adult.


6- Avoid giving your child all the money he asks for. He will grow up thinking that getting money is easy and will not hesitate to steal for it.


7- Always avoid putting yourself on his side when he is wrong against the neighbors, his teachers, the police. He will grow up thinking that everything he does is right, it is the others who are wrong.


8- Avoid leaving him alone at home when you go to the place of worship, otherwise he will grow up thinking that God does not exist.


May our labour over our children not be in vain🙏❤️

పంచాంగం 21.03.2025

 ఈ రోజు పంచాంగం 21.03.2025

Friday


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాస కృష్ణ పక్ష సప్తమి తిథి భృగు వాసర జ్యేష్ఠ నక్షత్రం సిద్ధి యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.

 



శుభోదయ:, నమస్కార:

తేదీ ... 21 - 03 - 2025,

 🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏 


    🪷 *శుభోదయం🪷

          -------------------

🌺 *మహనీయుని మాట*🌺

        -------------------------

"ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా

ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"నీ చేయి పట్టి నడిపించిన వారిని ఎన్నడూ మరువద్దు.

వీలైనంతవరకు వారిని సంతోష పెట్టడానికి ప్రయత్నిoచు.

అది కర్తవ్యమని భావిస్తావో

ప్రేమతో చేస్తావో అది నీ ఇష్టం.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

         🌹పంచాంగం🌹

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 21 - 03 - 2025,

వారం ...  భృగువాసరే ( శుక్రవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

బహుళ పక్షం,


తిథి     :  *సప్తమి* రా11.50 వరకు,

నక్షత్రం :  *జ్యేష్ఠ* రా9.45 వరకు,

యోగం :  *సిద్ధి* మ3.15 వరకు,

కరణం  :  *విష్ఠి* ఉ11.12 వరకు,

                 తదుపరి *బవ* రా11.50 వరకు,


వర్జ్యం                :  *రా1.58 - 3.41*

దుర్ముహూర్తము :  *ఉ8.31 - 9.19*

                               మరల *మ12.31 - 1.19,*

అమృతకాలం     :  *మ12.17 - 2.00,*

రాహుకాలం        :  *ఉ10.30 - 12.00,*

యమగండం       :  *మ3.00 - 4.30,*

సూర్యరాశి          :  మీనం ,

చంద్రరాశి            :  వృశ్చికం,

సూర్యోదయం     :  6.08,

సూర్యాస్తమయం:  6.07,


               *_నేటి మాట_*


      *_ఏది నిజమైన పూజ_*

ఈశ్వరుడికి పరిశుద్ధమైన భక్తితో చేసిన పూజ మాత్రమే నిజమైన పూజ. 

భక్తి అనే పదం ఇక్కడ గమనించదగ్గది, ఇతరులకు ఆర్భాటం చూపటానికి గానీ, ప్రచారం పొందటానికి గానీ, పూజ చేయకూడదు... 

మనం చేసే పూజ వలన అందరికీ మంచి కలగాలని పూజించాలి. 

కొందరు పూజకన్నా సంకల్పానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. 

సంకల్పం కన్నా మనం చేసే పూజలో శ్రద్ధా, భక్తి ఉండాలి, ఈశ్వరుడికి తెలుసు మన మంచి,చెడు రెండూ ... కుచేలుడు శ్రీకృష్ణపరమాత్మను కలుసుకోవటానికి వెళ్ళినప్పుడు తనకు ఏదైనా కావాలని అడగలేదు...

శ్రీకృష్ణుడిని ఆనందపరచటానికి గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చాడు. 

శ్రీకృష్ణుడు కూడా ప్రేమతో ఇచ్చిన అటుకులను స్వీకరించి మూడు నిమిషాలలో కుచేలుడిని కుబేరుడిని చేసాడు. 

కాబట్టి మనం ఈశ్వరుడిని ఏమీ అడగక్కర్లేదు అని చెప్పటానికి ఇదొక నిదర్శనం,

కాబట్టి మనం ఏ పని చేసినా ఈశ్వరకృప కలగాలని చేయాలి గానీ ప్రచారం, ఆర్భాటం కోసంకాదు. 

భక్తితో పది నిమిషాలు పూజించినా చాలు, గంటలకొద్దీ కూర్చుని మనస్సంతా వ్యర్ధ ఆలోచనలు పెట్టుకుని పూజించనక్కరలేదు. 

పూజించే సమయం తక్కువైనా అది శుద్ధమైన భక్తితో చేస్తే ఈశ్వరుని కృప, పుణ్యం లభిస్తుంది...


              *_🌹శుభమస్తు🌹_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

స్నానము

 ఆయుర్వేదం నందు వివరించిన స్నానము చేయు పద్దతులు  - నియమములు .


      స్నానము చేయుట వలన శారీరక మలినములు తొలగి దేహమునకు ఆరోగ్యము మరియు ఉత్సాహము లభించును. ఆరోగ్యవంతులకు చన్నీటిస్నానం మంచిది . జబ్బుపడి లేచినవారికి దగ్గు , నెమ్ము , ఆయాసము కలిగినవారికి గోరువెచ్చటి నీటితో స్నానం చేయుట ఆరోగ్యమును కలిగించును.


            ఆయుర్వేదం స్నానం చేయు నీటిని గురించి ఈ విధముగా వివరించింది. నదీజల  స్నానం ఉత్తమ ఫలితమును కలిగించును. చెరువు లేదా తటాకం నందలి నీటితో చేయు స్నానం మధ్యమ ఫలితం కలిగించును. కూప జలం అనగా బావి నందలి నీటితో చేయు స్నానం అధమ ఫలితం కలిగించును. కుండలు మరియు ఇతర పాత్రల యందు నిలువ ఉంచిన నీటితో స్నానం చేయుట కూడా అధమ ఫలితాన్ని ఇచ్చును.


 *  స్నానము చేయుటకు ముందు శరీరంలో ఏ భాగమునకు ఆ భాగము నూనెతో రుద్దుకొనవలెను . కొందరు సెనగపిండి , పెసరపిండి తో మరియు సున్నిపిండితో నలుగు పెట్టుకుంటారు. అవయవ మర్దన వలన నూనె రోమరంధ్రముల ద్వారా శరీర లోపలి భాగములకు ప్రవేశించును. తదుపరి అరగంటసేపు ఆగి స్నానం చేయుట మంచిది .


 *  స్నానము చన్నీటితో చేయుట మంచిది . ప్రతిదినము చన్నీటితో స్నానము చేయుట వలన జీర్ణశక్తి అధికము అగును. అంతేకాక ఆయుర్వృద్ధి కలుగును. తద్వారా ఉత్సాహము , బలం , ఆరోగ్యము లభించును.


 *  ఆయుర్వేదగ్రంధాలలో "త్రిపిస్నానం" గురించి వివరించబడినది. అనగా ప్రతిరోజు మూడుపూటలా స్నానం చేయవలెను అని చెప్పబడినది.


 *  ప్రతిదినం వేడినీటితో స్నానము చేయరాదు . అలా చేసిన వెంట్రుకలకు , నేత్రములకు బలము తగ్గును.


 *  భోజనం చేయుటకు ముందే స్నానం చేయవలెను . కడుపు ఉబ్బరం , పీనస రోగము గలవారు రోజుకి ఒకపర్యాయము చేసిన చాలును . వీరు ఎక్కువసార్లు స్నానం చేయరాదు .


 *  నోరు , చెవులు , ముక్కు వ్యాధులు కలిగినవారు , పక్షవాత రోగులు చన్నీటిస్నానం ఆచరించకూడదు.


 *  ఆరోగ్యవంతులు తలకు నూనె మర్దన చేసుకుని స్నానం చేయుట మంచిది .


 *  చెవిలో తైలం వేసుకొని స్నానం చేయుట మంచిది . తలకు , అరికాళ్లకు తైలమును మర్దించి స్నానం చేయుట వలన శరీరముకు చలవ చేయును .


 *  మగవారు శనివారం , ఆడవారు శుక్రవారం తలంటుకుని స్నానం చేయుట మంచిది .


 *  దగ్గు , నెమ్ము వంటి వ్యాధులు కలవారు మరియు విరేచనముకు మందువాడి ఎక్కువసార్లు విరేచనం అయినవారు , అజీర్ణ వ్యాధిగ్రస్తులు తలస్నానం చేయరాదు .


 *  ఆరోగ్యవంతుడు ప్రతిరోజు మామూలు స్నానం చేయుట మంచిది . తలకు  నూనె పట్టించి తలస్నానం చేయుట వారానికి ఒకసారి చేయుట మంచిది .


          ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034