🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శంకరులు శ్రీ శైల క్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగమూర్తి యైన భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామిని సేవిస్తున్నారు*
*శ్లోకం : 50*
*సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం*
*సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।*
*భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం*
*సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।*
*పూర్వకథ:~*
*శ్రీ శైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాడు.అతని కూతురు రతీదేవి వలె సౌందర్యము కలది. ఆమె పేరు చంద్రవతి. ఆరాజు తన కూతురినే మోహించాడు. ఆవిషయం తెలిసిన చంద్రవతి, రాజ గృహం విడచి శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్రక్షమైనాడు. ఆమె శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది. ఈశ్వర సాయుజ్యాన్ని ఆమె కోరింది. ఆ మల్లికా మాలను తీసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు. అప్పుడు చంద్రవతి ఈశ్వరుని "మల్లికార్జునుడు " అనే సార్థకనామాన్ని ధరించమని ప్రార్థించింది. శివుడు అంగీకరించి లింగరూపం ధరించాడు. అప్పటినుండి శ్రీ శైల లింగానికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.*
*తాత్పర్యము:~*
*సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవనృత్యంతో భక్తులను ఆనందపరుస్తాడు. మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్ప వికాసముతో ఆనంద పరుస్తుంది. ఈశ్వరుడు శ్రీ శైలమునందేగాక శ్రుతి సరస్సులలో అనగా ఉపనిషత్తుల యందు ఉంటాడు. మద్ది చెట్టు పుష్పాలు చెవులయందు, శిరస్సులయందూ అలంకారములుగా ఉంటాయి. మల్లికార్జునుడు అనురాగంతో కూడిన భ్రమరాంబా దేవితో మనోహరంగా ఉంటాడు. మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలచే సుందరముగా ఉంటుంది. ఈశ్వరుడు మాటిమాటికినీ యోగ్యములయిన సంస్కారములచే ప్రకాశించేవాడు. మద్ది చెట్టు మంచి సువాసనలచే ప్రకాశిస్తుంది. ఈశ్వరుడు సర్ప రాజయిన వాసుకి ఆభరణంగా కలవాడు . మద్ది పువ్వు భోగప్రియులైన వారికి ఆభరణమైనట్టిది.*
*ఈశ్వరుడు అందరు దేవతలకూ పండితులకూ పూజనీయుడు. మద్ది పూవు అన్ని పువ్వులలో శ్రేవ్టమైనది. ఈశ్వరుడు సద్గుణములచే వ్యక్తము చేయ బడేవాడు. మద్దిపుష్పము సుగంధ గుణము వలన తెలియబడుతుంది.*
*పార్వతిచే కౌగిలించుకొనబడినవాడు. శ్రీశైల మల్లికార్జున స్వామి మద్ది చెట్టు జమ్మి చెట్టు తో కూడినది. మల్లెపూదండలచే పూజింపబడి ఒకవిధమైన తెల్లనివర్ణము గలవాడు మల్లికార్జునుడు. అటువంటి మల్లికార్జున నామముగల శివుని జ్యోతిర్లింగాన్ని సేవిస్తాను.*
*వివరణ:~*
*శంకరాచార్యులవారు శిష్యులతో పాదచారియై హిందూమత ప్రచారానికై భారతదేశమంతటా పర్యటించారు. ఆసందర్భంలో వారు మన ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో సంధ్యాకాలమయ్యింది.* *అప్పుడక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు వారికి కనబడింది. దానిని పోలికగా చేసుకుని పరమేశ్వరుని ఈ అద్భుతమైన శ్లోకంలో వారు వర్ణించారు.*
*ఈ శ్లోకం దీని తర్వాతి శ్లోకము శ్రీశైల మల్లికార్జున స్వామిపై శంకరులు చెప్పిన గొప్ప శ్లోకాలు. శ్రీశైలం గొప్ప పుణ్య జ్యోతిర్లింగ క్షేత్రం.*
*"శ్రీ శైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న లభ్యతే " అంటారు. శివానంద లహరి లోని 100 శ్లోకాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ని వర్ణించే ఈ రెండు శ్లోకాలూ మణిహారంలోని నాయక మణుల వంటివి.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి