చ.తెలుగు మనోహరమ్ములగు తీయని సుస్వర మార్దవమ్ములౌ
వెలుగులు నింపు భాష మది వేడుక గొల్పుచు నుండు భాషణన్
విలసిత రాగ రంజిత వివేకము గూర్చెడు నట్లు సన్మతిన్
తెలియగ జెప్పనెంచిన సుధీమతి గూర్చుచు నుండు భారతీ!౹౹ 97
చ.పలువురు మాతృభాష తమపాలిట భారము గూర్చు భాషగా
దలచుట ధర్మమే జనని తాల్మిని జన్మ మొసంగి వేడ్కమై
తొలి యడుగుల్ ముదమ్ము గన తుష్టిగ నేర్పిన భాష విద్యలన్
వెలుగులు జీవితమ్మునకు ప్రీతి నొసంగుట కల్మి భారతీ౹౹98
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి