21, మార్చి 2025, శుక్రవారం

ప్రియ బాంధవా మేలుకో 15*

 *ప్రియ బాంధవా మేలుకో 15*




దేశంలో భద్రతా చట్టాలతో బాటు న్యాయ వ్యవస్థ గూడా సమాజానికి అవసరమైన ముఖ్య వ్యవస్థ. న్యాయ ప్రమాణాల ననుసరించి చట్ట పరిధిలో నేరాలకు, అన్యాయాలకు సంబంధించిన తీర్పులు వినిపించి, శిక్షలు విధించునవి న్యాయస్థానాలు. న్యాయస్థానాలు సాధారణంగా సివిల్ మరియు క్రిమినల్ వ్యాజ్యాలు స్వీకరిస్తాయి. దేశమంతటా న్యాయస్థానాలు నెలకొని ఉన్నాయి. 

1) *ప్రాథమిక హక్కులు*

సమానత్వం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్చ, వివక్షతా రక్షణ. అపకీర్తి, పరువు నష్టము ఇత్యాది.

2) *సివిల్ వ్యాజ్యాలు*;- భూమి, ఆదాయము, ఆస్తి, సరిహద్దులు, వారసత్వ హక్కులు, భూ బదిలీలు, అద్దెలు, లాభాలు మున్నగునవి.

3) *క్రిమినల్*:- హత్యలు, దొంగతనాలు, దౌర్జన్యాలు, మానభంగాలు, బలవంతపు మానవ అపహరణలు, అక్రమ ఆయుధాలు కల్గి ఉండుట మున్నగునవి.


ప్రపంచంలో న్యాయ వ్యవస్థ ఆయా దేశాలలో *స్వతంత్రంగా* ఉంటుంది. కాని, మన దేశంలో *ఏకీ కృత* న్యాయ వవస్థ అమలులో ఉన్నది. వ్యాజ్యాలు దిగువ స్థాయిలో పరిష్కారం కానప్పుడు అంచలంచెలుగా ఎగువ స్థాయి న్యాయస్థానాలకు వెళ్ళ వచ్చును. అప్పీల్ సౌకర్యం మన న్యాయ వ్యవస్థలో పొందుపర్చబడినది.


న్యాయ సేవలలో భాగంగా వ్యాజ్యాలు స్వీకరించుట ప్రధానంగా దిగువ న్యాయస్థానం నుండి అత్యుత్తమ స్థాయి న్యాయస్థానాలు దిగువ చూపబడిన విధంగా ఉంటాయి. 

1) Munsif, Addi Sub Judge, Sub Judge, Sessions Court.

(గ్రామీణ మరియు పట్టణ )

ఈ క్రమంలోనే లోక్ అదాలత్ లు, 

2) *Sub ordinate courts*

(జిల్లా)

3) *High courts*

(రాష్ర్ట స్థాయి)

ఈ క్రమంలోనే ట్రిబ్యునల్ లు మరియు మహిళా కోర్టులు

4) *Supreme court*

(దేశ స్థాయి అత్యుత్తమ న్యాయస్థానము).


*ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఎవరైనా P I L (Public Interst Litigation) న్యాయస్థానాలలో వ్యాజ్యాలు వేయవచ్చును*.


Virtual/online న్యాయ వ్యవస్థ కూడా మన దేశంలో అమలులో ఉన్నది.


న్యాయస్థానాలకు సంబంధించిన రాష్ట్ర మరియు జాతీయ న్యాయ అకాడమీలు, కొలీజియం వ్యవస్థ మరియు Law Commission కూడా దేశంలో ఉన్నాయి. దేశంలో ఇంత విస్తారమైన న్యాయ వ్యవస్థను కలిగి ఉన్నప్పుడు దేశంలో ప్రజా భద్రతకు మరియు ప్రశాంతతకు కొదవ ఉండకూడదు. 


అధికారిక లెక్కల ప్రకారం 2018 - 2022 సంవత్సరాల మధ్య *మానవ అక్రమ రవాణా* అను *ఒక్క నేర* రంగంలోనే దేశవ్యాప్తంగా పదిన్నర వేలకు పైగా ఫిర్యాదులు నమోదు అయినాయి. దాదాపు ఇరువది వేల మందిపై ఛార్జ్ షీట్ లు దాఖలు కాగా శిక్షలు పడిన వారు మాత్రము వెయ్యి మంది నేరస్థులే. సత్యాసత్యాల నిర్ధారణలో న్యాయస్థానాలకు సహాయపడే పవిత్ర బాధ్యతను నిర్వర్తించగల్గినవారే *సాక్ష్యులు, ఆమాటకొస్తే సాక్ష్యులే న్యాయానికి కళ్ళు మరియు చెవులు*. పైన చూపిన గణాంకాల ప్రకారం ఎన్ని వేల కేసులు వీగిపోయినవో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దోషులు తప్పించుకునే లొసుగుల వల్ల *ఈలాంటి సంఘటనలు భద్రతా విభాగాలను, చట్టాలను మరియు న్యాయస్థానాలను పరిహసిస్తున్నట్లు అగుపిస్తున్నాయి*. సమాజం మొత్తం ఇందుకు *బాధ్యత వహించాలి*.


ప్రజలు మౌన మునులు లాగా ఉండడం ముఖ్యంగా విద్యావంతులుమరియు జ్ఞానవంతులు నిశ్శబ్దత పాటించడం పరోక్షంగా సమాజ కీడుకు, దేశ దురదృష్టానికి ప్రధాన హేతువు.


ధన్యవాదములు

*(శేషం)*

కామెంట్‌లు లేవు: