9, డిసెంబర్ 2022, శుక్రవారం

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

 భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల తేదీల వివరాలు ఇవే!


ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (#Bhadrachalam #Temple) లో ముక్కోటి ఏకాదశి (#Mukkoti #Ekadashi) మహోత్సవాల వివరాలు:


డిసెంబర్ 23, 2022 నుంచి జనవరి 12, 2023 వరకు భద్రాద్రి దేవస్థానంలో శ్రీ వైకుంఠ ఏకాదశి సంయుక్త అధ్యాయం ఉత్సవాలు, విలాసోత్సవాలు, పగల్ పత్త్ రాపత్త్ సేవలు, విశ్వరూప సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి దశ అవతారాలలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.


డిసెంబర్ 23న మత్స్యావతారంలో, 

24న కూర్మావతారంలో, 

25న వరహావతారంలో, 

26న నరసింహా వతారంలో, 

27న వామనావతారంలో, 

28న పరుశురామావతారంలో, 

29న శ్రీరామవతారం (నిజరూప అవతారం)లో, 

30న శ్రీకృష్ణా వతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


అదేవిధంగా 1 జనవరి 2023న శ్రీతిరుమంగై అళ్వారులు పరమపదోత్సవము, 

సాయంత్రం 4 గంటలకు శ్రీస్వామి వారికి గోదావరి నదిలో తెప్పోత్సవం 


జనవరి 2, 2023న వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నారు. శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవమును తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిర్వహించి అనంతరం ఉత్తర ద్వార దర్శనం జరుగునని, తిరువీధి సేవ, 

రాత్రి 8 గంటలకు రాపత్తు ఉత్సవం ప్రారంభం అవుతుందని తెలియజేశారు.


రాపత్తు సేవలో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు జనవరి 02న శ్రీరామరక్షా మండపం( భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం). 

03న శ్రీహరిదాస మండపం (అంబాసత్రం), 

04న శ్రీగోకుల మండపం (శ్రీకృష్ణాలయం), 

05న శ్రీరామదాస మండపం (భద్రాచలం రెవెన్యూ కార్యాలయం), 

06న గోవింద మండపం (తాతగుడి), 

07న పునర్వపు మండపం, 

08న శ్రీరామదూత మండపం (శ్రీఅభయాంజ నేయస్వామి వారి ఆలయం), స్వామివారు పర్యటించనున్నారు. 


జనవరి 09న శ్రీకల్కి అవతారం, దొంగల దోపు ఉత్సవం, విశ్రాంత మండప సేవ, 

10న దమ్మక్క మండపం (పురుషోత్తపట్నం)లలో స్వామివారు రాపత్తు సేవలు నిర్వహించనున్నారు. 


ముక్కోటి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 https://drive.google.com/file/d/1DVywvB8Yqsx0nxm7Tc5twryIWK2pUdbU/view?usp=drivesdk

తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి

 చక్కని నీతి కథ


         చాలా, ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.  


          ఓ రోజు చెట్టు పైకి ఎక్కి పండ్లు కోసుకొని తిన్నాడు. ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడేది, అతన్ని అమితంగా ప్రేమించింది. 


       కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి కొంచం పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు.


        కొన్ని  రోజుల తరువాత ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు. ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది. 


 బాలుడు :- "నేనింకా చిన్న పిల్లాడిని కాను. చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి. అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. 


 చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేసితే , దానితో నీకు డబ్బులు వస్తాయి దానితో బొమ్మ కొనుక్కో" అని అన్నది. 


      బాలుడు ఎంతో సంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు అతని కోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. 


         క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది.


         "నీతో ఆడుకునే వయస్సు ఇప్పుడు నాకు లేదు. నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"......!? అని అడిగాడు. 


          నా వద్ద మీకూ ఇవ్వడానికి ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయ పడతాయి. కావాలంటే వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. 


        అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు కూడా చాలా ఆనందపడింది. కానీ అతను మళ్ళీ తిరిగి రాలేదు.చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉండి పోయింది. 


        బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళీ వచ్చాడు, చెట్టుకు అతన్ని చూడగానే ఎక్కడలేని ఆనందం ముచ్చికొచ్చింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేనిప్పుడు మధ్య వయస్సు వాడిని అయ్యాను.... నీతో ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు


           నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. 


          అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకుపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ విహారయాత్రకు వెళ్లడం జరిగింది.చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. 


     చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. అతన్ని చూసి   ఆ చెట్టు.....నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, ఇప్పుడు పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. 

                  అప్పుడు ఆ మాటకు ఆ వ్యక్తి ఏమి ఇబ్బంది లేదు,నీ పండ్లు నాకు తినడానికి పళ్లే లేవులే అన్నాడు.


 చెట్ట:- నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. 

ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు అతను..... 


            భాదతో నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ చెట్టు. 


        నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు ఆ వ్యక్తి . 


 వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి,.... అనుకూలంగా ఉంటాయి, నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది ఆ చెట్టు. 

                  

                        *******


           "ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. 


         కొంచెం పెద్దయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా వాళ్ళు చేస్తారు. 


 చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కానీ మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే గదా చేస్తున్నాం.


         మనకు భరోసాగా వాళ్లను చూస్తున్నాం, మన కోసం సర్వస్వం దార పోసిన తల్లిదండ్రులకు కనీసం కృతజ్ఞత చూపం. కానీ అప్పటికే సమయం మించి పోతోందని మాత్రం గుర్తించలేకున్నాం. 


 #నీతి :-


     మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు ఇక లేనప్పుడు వాళ్ళు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుందనీ మాత్రం మరవకండి. 


             మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. అదే మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అది అనుభవంలోకి వస్తుందని మరవకండి.......!!.


సేకరణ. మానస సరోవరం

వంశాభివృద్ధి జరుగుతుంది

 ☘️☘️☘️


 *నమస్కారం విలువ.*

🌹🌹🌹🌹🌹🌹


```మహాభారత యుద్ధ సమయంలో "మీరు పక్షపాతంగా యుద్ధం చేస్తున్నారు" అని దుర్యోధనుడు అనిన వ్యంగ్యమైన మాటలకు బాధపడి భీష్మ పితామహడు "నేను రేపు పాండవులను చంపుతాను" అని ప్రకటించాడు.


అంతే... పాండవుల శిబిరంలో ఆందోళన పెరిగింది. భీష్ముని సామర్ధ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి, చెడు భయంతో కలవరపడ్డారు. అప్పుడు.. శ్రీ కృష్ణుడు తన వెంట ద్రౌపదిని తీసుకొని భీష్ముని శిబిరానికి వెళ్ళాడు.


తను బైటే నిలబడి ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించు, ఆయన "అఖండ సౌభాగ్యవతీ భవ" అని ఆశీర్వదిస్తాడు. తర్వాత జరిగేది గమనించు అన్నాడు.


ద్రౌపది అలానే చేసింది, భీష్ముడు దీవించి, "ఏంటమ్మా! ఇంత రాత్రి ఒంటరిగా వచ్చారు. నిన్ను కృష్ణుడు తీసుకు వచ్చాడు కదా" అన్నాడు.


దానికి ద్రౌపది "అవును తాతయ్యా.. అన్న శిబిరం బయట నిలబడి ఉన్నారు" అనింది. భీష్ముడు బయటకు వెళ్ళగా.. ఇద్దరూ ఒకరికి ఒకరు నమస్కరించు కున్నారు.


వెంటనే భీష్ముడు.. నాకు తెలుసు కృష్ణా, మీరు ఇలా చేస్తారని. ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ప్రభావం ఎక్కువ. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి అని ఒక మార్గం ఉపదేశించాడు.


శిబిరం నుండి తిరిగి వస్తున్నప్పుడు, శ్రీ కృష్ణుడు ద్రౌపదితో "నీవు వెళ్లి భీష్మునికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు".


"ఇలాగే.. నీవు ప్రతిరోజూ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు లాంటి పెద్దలకు నమస్కరిస్తూ ఉండు. అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడి భార్యలు కూడా ఆ పెద్దలతో పాటు పాండవులకు కూడా నమస్కరిస్తూ ఉంటే బహుశా ఈ యుద్ధం ఆగిపోవచ్చు. ఒక్క నమస్కారానికి అంతటి భాగ్యం కలుగుతుంది" అన్నాడు.

🌹🌹🌹🌹🌹🌹


ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలకు మూల కారణం ఒకరి నొకరు గౌరవించుకోక పోవడం. అహంకారం వదిలి, ఎదుటి వారిని చులకనగా చూడడం వలన అనర్ధాలు జరుగు తున్నాయి.


ఇంటిలోని పిల్లలు మరియు కోడళ్లు ప్రతిరోజూ ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ ఇంటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెద్దల ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి.

🌹🌹🌹🌹🌹🌹

ఎందుకంటే...

నమస్కారం ప్రేమ.

నమస్కారం క్రమశిక్షణ.

నమస్కారం చల్లదనం.

నమస్కారం గౌరవాన్ని నేర్పుతుంది.

నమస్కారం మంచి ఆలోచనలను ఇస్తుంది.

నమస్కారం సంస్కారాన్ని నేర్పుతుంది.

నమస్కారం కోపాన్ని తొలగిస్తుంది.

నమస్కారం కన్నీళ్లను కడిగివేస్తుంది.

🌹🌹🌹🌹🌹🌹

ఎక్కడ సజ్జన సాంగత్యం లభిస్తుందో అక్కడ ప్రతిభ ఇనుమడిస్తుంది. మంచి సంస్కారాలు అలవర్చుకొంటే తరతరాలుగా వంశాభివృద్ధి  జరుగుతుంది.```

🌹🌹🌹🌹🌹🌹

ఉపనిషత్తులు

 ♥️

         ♥️♥️ *"1"* ♥️♥️

♥️♥️ *"ఉపనిషత్తులు"* ♥️♥️

     🌼💜🌼♥️🌼💜🌼

           🌼💜🕉💜🌼

                 🌼♥️🌼

                      🌼

*"ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే ఈ మూడింటిని కలిపీ ప్రస్తానత్రయం అంటారు."*


*"వేద వాగ్మయాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు వేదాలుగా విభజించేరు. ఈ నాలుగు వేదాలకు 1131శాఖలు ఉండేవిట. కానీ ఈనాడు మొత్తం 13 శాఖలు మాత్రమే లభిస్తూండగా వాటిలో ఏడు వేద శాఖలుమాత్రమే గురుముఖత అధ్యయనానికి లభిస్తున్నాయిట."*


*"ప్రతి వేద శాఖ లోను నాలుగు అంతర్భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని సంహిత అంటారు."*


*"రెండవ భాగాన్ని బ్రాహ్మణం, మూడవ భాగాన్ని ఆరణ్యకము, నాల్గవ భాగాన్ని ఉపనిషత్తులు అంటారు."*


 *"మొదటి రెండు భాగాల్లో ( సంహిత, బ్రాహ్మణం) యజ్ఞయాగాది కర్మకాండ గురించిన వివరాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవ భాగమైన ఆరణ్యకాలలో వానప్రస్ధాశ్రమ ధర్మాలకు చెందిన వివరాలు ఉన్నాయి. ఇక నాల్గవదైన ఉపనిషత్తులలో ఆత్మ, పరమాత్మల విషయాలకుచెందిన జ్ఞాన విశేషాలు ప్రస్తావించారు. వేదాలలో చివరవి కాబట్టి వీటిని వేదాంతం అనికూడా అంటారు."*


♥️ *"ఉపనిషత్తులు అంటే"* ♥️

         *

*"వ్యక్తులలో అవిద్య అనే సంసార బీజమును నాశనము చేస్తుంది కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*


*"మోక్షాన్ని ఆకాంక్షించేవారిని పరమాత్మ దగ్గరకు జేర్చేవి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*


*"జన్మ వార్ధక్యం మొదలైన ఉపద్రవములను శిధిలము చేస్తాయి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*


*"అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే గ్రంధం అని అర్ధం.- ఆ గ్రంథం ద్వారా అందించబడిన విద్య అని అర్ధం."*


*"అనేక వేల సంవత్సరాల క్రితం మహర్షులు తాము దర్శించి కారుణ్య దృష్టితో లోకానికి అందించిన ఉపనిషత్తులు – భౌతిక స్ధాయి దాటి, జీవిత పరమార్ధం ఏమిటని ఆలోచించే వారికి ఈ ఉపనిషత్తులు షడ్రసోపేత విందు భోజనం, అమృత రసాస్వాదనం."*


*"ఉపనిషత్తులు లౌకిక సుఖాలను పరిత్యజించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని చెప్పకుండా గృహస్త జీవితాన్ని ప్రోత్సహించి దాన్ని అర్ధవంతం, ఫలవంతం చెయ్యడానికే ప్రయత్నించేయి."*


*"ఏ సుఖాలను పరిత్యజించమని చెప్ప లేదు. ఏ ఏ సుఖాలు మొదట సుఖంగా కనిపించి తర్వాత దుఃఖం గా మారుతాయో వాటిని మాత్రమే వదలమని చెబుతున్నాయి."*

          🌷💜🌷💜🌷

                🌷🕉🌷

గోవుతో వైద్యం .

 గోమాత గొప్పదనం  - గోవుతో వైద్యం .


    వేదకాలం నుంచి గోమాతకు ఈ భారతదేశం నందు ప్రత్యేక స్థానం కలదు. గోవు ని తల్లిలా భావించిన మన పూర్వికులు పూజించుట యే కాకుండా ఆవు కు సంబంధించిన వుత్పత్తులలోని గొప్పతనాన్ని తెలుసుకుని గ్రంధస్తం కూడా చేశారు అవి చాలా రహస్య యోగాలుగా ఉండిపోయాయి. కొన్ని పురాతన గ్రంథాల నుండి ఆ వివరాలు సేకరించాను అవి మీకు తెలియచేస్తాను .


 *  ఆవుపాలు   - 


               ఇవి మధురంగా సమ శీతోష్న్ం గా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి , దేహపుష్టి కలిగిస్తాయి . వీటిలో A B C D విటమిన్లు వున్నాయి. పగలంతా మనంచేసే శ్రమ హరించిపొయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపుట తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆవుపాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లి జీవింప చేసి ధీర్ఘాయిషుని అందించడంలో ఆవుపాలదే అగ్రస్థానం వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతల తత్వం వారు ఎక్కువుగా వాడవచ్చు.


 *  ఆవుపెరుగు  -  గర్భిణి స్త్రీకి వరం .  


             వెండి పాత్రలో తోడు బెట్టిన పెరుగు గర్భిణి స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవుపెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎలాంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవుపెరుగు శ్రేష్టం అయినది.


 *  ఆవు వెన్న  - 


              ఇది చలువ చేస్తుంది శరీరంలోని వాత, పిత్త , కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహరోగాలు , నేత్రవ్యాదులు పోగోడుతుంది . ముఖ్యంగా పిల్లలకు,వృద్దులకు ఆవువెన్న చాలా ఉపయోగపడుతుంది.


 *  ఆవునెయ్యి  - 


              ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ ధీర్ఘాయిషు ని ఇస్తుంది.ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది  సుఖవిరేచనం చేస్తుంది . ఉన్మాదం , పాండు రోగం , విషప్రయోగం , ఉదర శులలు ( కడుపు నొప్పి ) మొదలయిన వ్యాదులతో బాధపడే వారికి మంటల్లో కాలినవారికి , గాయాలు అయినవారికి మంచి పధ్యమైన ఆహారం గా ఆవునెయ్యి ఉపకరిస్తుంది. ఆవునేయ్యితో తలంటు కొని స్నానం చేస్తే తలకు, కళ్లకు అమితమైన చలువ చేస్తుంది .


 *  ఆవుపేడ  - 


              ఆవుపేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవుపాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృత పిండం బయటపడుతుంది.


 *  గుధస్తానంలో తిమ్మిరి కొరకు  - 


             ఆవుపేడ ని వేడిచేసి ఒక గుడ్డలో చుట్టి గుధస్థానం లో కాపడం పెరుగుతూ ఉంటే తిమ్మిరి వ్యాధి హరిస్తుంది .


 *   వంటి దురదలకు   - 


                అప్పుడే వేసిన ఆవుపేడతో వంటికి మర్దన చేసుకుంటూ ఉంటే ఒక గంట తరువాత వేడినీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి . 


 *   కడుపులోని క్రిములకు  - 


               20 గ్రా ఆవుపేడ పిడకల చూర్ణం 100 గ్రా మంచినీళ్ళలో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు అయిదారు రోజులలో పడిపోతాయి.


                  ఆవుపేడ లొ క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి వుందని అందువల్ల కొంచం ఆవుపేడ ని మంచినీళ్ళతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ మలేరియా , కలరా వ్యాధులు హరించి పొతాయి. ఇదే విషయాన్ని ఇటలి శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు .


 *   ఆవుముత్రం   - 


 

 *  ప్రతిరోజు వడకట్టిన గోముత్రాన్ని 25 గ్రా మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించి పొతాయి . 


 *  గో మూత్రంలో కొంచం కలకండ పొడి కలిపి కొంచం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రొజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం , కడుపునోప్పులు మొదలయిన వ్యాదులు అన్ని హరించి పొతాయి.


 *  వడకట్టిన గో మూత్రాన్ని 35 గ్రా మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే ఇరవయి నుంచి 40 రొజుల్లొ పాండు వ్యాధి హరించి పొతుంది.


 *  గో మూత్రాన్ని గోరువెచ్చగా వేడిచేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలొ చీము కారడం తగ్గిపొతుంది.


 *  ఇరవై గ్రాముల గో మూత్రం లొ పది గ్రాముల మంచి నీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫిగా బయటకు వెళ్ళిపోతుంది.


 *  ప్రతిరోజు ఉదయమే గొముత్రాన్ని 30 గ్రా మొతాదులో 20 గ్రా పటికబెల్లం కలుపుకుని తాగుతూ ఉంటే మలబద్దకం హరించి పొతుంది.


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 

నైపుణ్యం కలిగి ఉంటారు

 శ్లోకం:☝️

*పరవాచ్యేషు నిపుణః*

  *సర్వో భవతి సర్వదా ।*

*ఆత్మవాచ్యం న జానీతే*

  *జానన్నపి చ ముహ్యతి ॥*


భావం: ప్రతి ఒక్కరూ ఇతరుల గురించి మాట్లాడటంలో ఎల్లప్పుడూ నైపుణ్యం కలిగి ఉంటారు. కానీ తమ గురించి తమకు తెలియదు. ఒకవేళ తెలిసినప్పటికీ, వారు తమను గురించి తాము తప్పు (confused, mistaken) గా తెలుసుకుంటారు!