♥️
♥️♥️ *"1"* ♥️♥️
♥️♥️ *"ఉపనిషత్తులు"* ♥️♥️
🌼💜🌼♥️🌼💜🌼
🌼💜🕉💜🌼
🌼♥️🌼
🌼
*"ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే ఈ మూడింటిని కలిపీ ప్రస్తానత్రయం అంటారు."*
*"వేద వాగ్మయాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు వేదాలుగా విభజించేరు. ఈ నాలుగు వేదాలకు 1131శాఖలు ఉండేవిట. కానీ ఈనాడు మొత్తం 13 శాఖలు మాత్రమే లభిస్తూండగా వాటిలో ఏడు వేద శాఖలుమాత్రమే గురుముఖత అధ్యయనానికి లభిస్తున్నాయిట."*
*"ప్రతి వేద శాఖ లోను నాలుగు అంతర్భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని సంహిత అంటారు."*
*"రెండవ భాగాన్ని బ్రాహ్మణం, మూడవ భాగాన్ని ఆరణ్యకము, నాల్గవ భాగాన్ని ఉపనిషత్తులు అంటారు."*
*"మొదటి రెండు భాగాల్లో ( సంహిత, బ్రాహ్మణం) యజ్ఞయాగాది కర్మకాండ గురించిన వివరాలు ఎక్కువగా ఉన్నాయి. మూడవ భాగమైన ఆరణ్యకాలలో వానప్రస్ధాశ్రమ ధర్మాలకు చెందిన వివరాలు ఉన్నాయి. ఇక నాల్గవదైన ఉపనిషత్తులలో ఆత్మ, పరమాత్మల విషయాలకుచెందిన జ్ఞాన విశేషాలు ప్రస్తావించారు. వేదాలలో చివరవి కాబట్టి వీటిని వేదాంతం అనికూడా అంటారు."*
♥️ *"ఉపనిషత్తులు అంటే"* ♥️
*
*"వ్యక్తులలో అవిద్య అనే సంసార బీజమును నాశనము చేస్తుంది కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*
*"మోక్షాన్ని ఆకాంక్షించేవారిని పరమాత్మ దగ్గరకు జేర్చేవి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*
*"జన్మ వార్ధక్యం మొదలైన ఉపద్రవములను శిధిలము చేస్తాయి కాబట్టి ఉపనిషత్తులు అని అర్ధం."*
*"అధ్యయనం చేసేవారికి ఉపనిషత్తు అంటే గ్రంధం అని అర్ధం.- ఆ గ్రంథం ద్వారా అందించబడిన విద్య అని అర్ధం."*
*"అనేక వేల సంవత్సరాల క్రితం మహర్షులు తాము దర్శించి కారుణ్య దృష్టితో లోకానికి అందించిన ఉపనిషత్తులు – భౌతిక స్ధాయి దాటి, జీవిత పరమార్ధం ఏమిటని ఆలోచించే వారికి ఈ ఉపనిషత్తులు షడ్రసోపేత విందు భోజనం, అమృత రసాస్వాదనం."*
*"ఉపనిషత్తులు లౌకిక సుఖాలను పరిత్యజించి వైరాగ్యంతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని చెప్పకుండా గృహస్త జీవితాన్ని ప్రోత్సహించి దాన్ని అర్ధవంతం, ఫలవంతం చెయ్యడానికే ప్రయత్నించేయి."*
*"ఏ సుఖాలను పరిత్యజించమని చెప్ప లేదు. ఏ ఏ సుఖాలు మొదట సుఖంగా కనిపించి తర్వాత దుఃఖం గా మారుతాయో వాటిని మాత్రమే వదలమని చెబుతున్నాయి."*
🌷💜🌷💜🌷
🌷🕉🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి