9, డిసెంబర్ 2022, శుక్రవారం

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

 భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల తేదీల వివరాలు ఇవే!


ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (#Bhadrachalam #Temple) లో ముక్కోటి ఏకాదశి (#Mukkoti #Ekadashi) మహోత్సవాల వివరాలు:


డిసెంబర్ 23, 2022 నుంచి జనవరి 12, 2023 వరకు భద్రాద్రి దేవస్థానంలో శ్రీ వైకుంఠ ఏకాదశి సంయుక్త అధ్యాయం ఉత్సవాలు, విలాసోత్సవాలు, పగల్ పత్త్ రాపత్త్ సేవలు, విశ్వరూప సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి దశ అవతారాలలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.


డిసెంబర్ 23న మత్స్యావతారంలో, 

24న కూర్మావతారంలో, 

25న వరహావతారంలో, 

26న నరసింహా వతారంలో, 

27న వామనావతారంలో, 

28న పరుశురామావతారంలో, 

29న శ్రీరామవతారం (నిజరూప అవతారం)లో, 

30న శ్రీకృష్ణా వతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 


అదేవిధంగా 1 జనవరి 2023న శ్రీతిరుమంగై అళ్వారులు పరమపదోత్సవము, 

సాయంత్రం 4 గంటలకు శ్రీస్వామి వారికి గోదావరి నదిలో తెప్పోత్సవం 


జనవరి 2, 2023న వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నారు. శ్రీవైకుంఠ ఏకాదశి మహోత్సవమును తెల్లవారుజామున 5 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిర్వహించి అనంతరం ఉత్తర ద్వార దర్శనం జరుగునని, తిరువీధి సేవ, 

రాత్రి 8 గంటలకు రాపత్తు ఉత్సవం ప్రారంభం అవుతుందని తెలియజేశారు.


రాపత్తు సేవలో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు జనవరి 02న శ్రీరామరక్షా మండపం( భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం). 

03న శ్రీహరిదాస మండపం (అంబాసత్రం), 

04న శ్రీగోకుల మండపం (శ్రీకృష్ణాలయం), 

05న శ్రీరామదాస మండపం (భద్రాచలం రెవెన్యూ కార్యాలయం), 

06న గోవింద మండపం (తాతగుడి), 

07న పునర్వపు మండపం, 

08న శ్రీరామదూత మండపం (శ్రీఅభయాంజ నేయస్వామి వారి ఆలయం), స్వామివారు పర్యటించనున్నారు. 


జనవరి 09న శ్రీకల్కి అవతారం, దొంగల దోపు ఉత్సవం, విశ్రాంత మండప సేవ, 

10న దమ్మక్క మండపం (పురుషోత్తపట్నం)లలో స్వామివారు రాపత్తు సేవలు నిర్వహించనున్నారు. 


ముక్కోటి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్‌లు లేవు: