24, డిసెంబర్ 2022, శనివారం

భూపరీక్ష విధానం

 [22/12, 3:27 am] +91 98850 30034: వాస్తు శాస్త్రము నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ . 

   గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను , కొన్ని ఊట భూములుగాను , కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం. 

 *  స్థలపరీక్ష మొదట పద్దతి. - 

       గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది , నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు . ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు. 

 * స్థలపరీక్ష రెండొవ పద్దతి. - 

      గృహనిర్మాణం చేయదలచిన భూమి మధ్యభాగమున హస్తము లోతున ఒక గొయ్యి తవ్వవలెను . ఆ తవ్విన మన్నుతోనే మరలా ఆ గొయ్యిని పూడ్చవలెను . అలా పూడ్చగా మన్ను మిగిలినచో ఆ భూమి గృహనిర్మాణమునకు ప్రశస్తమైనదిగా తెలియును. మన్ను తక్కువ అయినచో ఆ స్థలము గృహనిర్మాణమునకు అనువైనది కాదు అని తెలుసుకోవలెను . మన్ను సరిపోయిన మధ్యమము . 

          పైన తెలిపిన రెండు పద్ధతులు అందరు మహర్షులు అంగీకరించి ఉన్నారు. 

         అలా గొయ్యి తవ్వుచున్న సమయంలో వివిధరకములు అయిన పురుగులు , కప్పలు , కీటకములు , ఊక , ఎముకలు , భస్మము మొదలైనవి కనపడుట యజమానికి మంచిది కాదు. బొగ్గులు , కాలిపోయిన కర్రలు , గవ్వలు మొదలైనవి కనపడిన స్థలము నందు గృహనిర్మాణం చేసి అందు నివసించుచున్న రోగములచేత , దరిద్రముచేత భాధలు పడుదురు. శల్యము ( ఎముక ) భూమి యందు ఆరు అడుగులకు పైగా లోతులో ఉన్నచో ఎటువంటి కీడూలేదని పురాతన వాస్తుశాస్త్ర గ్రంధాలలో ఉన్నది. 

          దర్భలతో కూడుకొని ఉన్న భూమి గృహనిర్మాణానికి శుభప్రదమైనది. రక్తవర్ణం గల భూమి రాజ్యసంపదలు , వాహనయోగం కలిగించును. కాశిగడ్డివలె పచ్చటి భూమి విశేష ధనయోగమైనది. సాధారణ గడ్డితో కూడి ఉండు నల్లటి భూమి గృహనిర్మాణానికి యోగ్యమైనది కాదు. 

 వాస్తుశాస్త్రం నందు భూపరీక్ష విధానం - సంపూర్ణ వివరణ  - 2 . 

   అంతకు ముందు పోస్టులో భూపరీక్షా విధానం గురించి తెలియచేసాను . ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయవలెనో , ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయకూడదో , భూములలో రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను. 

 *  మద్ది , రావి , తులసి , గరికె , విష్ణుక్రాంత , కొండగోగు , బూరుగ , సుగంధి , చిలుకలు , పావురములు , హంసలు మొదలైనవి కలిగి ఉండిన భూమి శైలభూమి అనబడును. ఈ భూమికి తూర్పు , ఉత్తరములలో నదీప్రవాహములు , చెరువులు , నూతులు , నీటితో ఉన్న గుంటలు ఉన్నచో శ్రేష్టము . అట్టి నీటివనరులు దక్షిణ పశ్చిమములలో ఉండరాదు. ఇట్టి భూమిలో ముండ్లతో ఉన్న చెడ్డ వృక్షములను తీసి గృహనిర్మాణం చేయుట ఐశ్వర్య ప్రదము. 

 *  బీటలు బారిన భూమి మరణము కలుగచేయును. పాముపుట్టలు కలిగిన భూమి ధననాశనము కలుగచేయును. శల్యములు కలిగిన భూమి నిత్యము నష్టములను కలుగచేయును. విషమాకారముగా ఉన్న భూమి శత్రుభయము కలుగచేయును. 

 *  పుర్రెలు , రాళ్లు , పురుగులు , పాముపుట్టలు , బొరియలు , గోతులు , ఎలుకలు , ఇసుక , పొట్టు , బొగ్గులు , వృక్షముల వేళ్ళు , బురద , పెంకు ముక్కలు , బూడిదతో ఉన్న భూములు , ముండ్లచెట్లు , కోట సమీప ప్రదేశములు , దుష్టమృగములు సంచరించు ప్రదేశములు , ఇనుము కరిగించి పనులు చేయు స్థలములు , నాలుగు వీధుల మధ్యస్థలము , వీధి శూలలు గల ప్రదేశములు గృహనిర్మాణానికి పనికిరావు. ధనక్షయం , కులక్షయం , నానావిధములు అయిన కష్టాలను కలుగచేయును . 

 *  బొంతజెముడు , ఇరుగుడు మొదలైన చెట్లతో , చిన్న ఇసుకరాయి గల భూములు , ఎక్కడ తవ్వినను నీటిజలాలు లేని భూములు ఆగ్నేయ భూములు అనబడును. ఇవి దరిద్రము కలుగచేయును . 

 *  నక్కలు , కంకరరాళ్ళు గల భూమి వాయువ్యభూమి అనబడును. ఇది గృహనిర్మాణానికి పనికిరాదు. దరిద్రము కలుగచేయును. 

 *  వృక్షములు కల భూమి వారుణ  భూమి అనబడును. ఇందు గృహనిర్మాణం చేసి నివసించువారలకు సకల సంపదలు కలిగి అభివృద్ది దాయకంగా ఉండును. 

 *  ముండ్లు గల వృక్షములు , దొంగలు సంచరించు ప్రదేశములు , కారము , తీపివాసన గల భూములు , ఎక్కడ నిలబడిన తలనొప్పి వచ్చునో అట్టి భూములలో మానవులు గృహనిర్మాణం చేయరాదు . వాటిని రాక్షస భూములు అని పిలుస్తారు. 

 *  బూరుగచెట్టు , పొగడ , తాండ్ర, సరుగుడు చెట్లు , గాడిదలు , ఒంటెలు , పందులు , చండాలురు , చౌడునేలలు , దుర్వాసన కల భూములు పిశాచ భూములు అనబడును. ఇవి గృహనిర్మాణమునకు యోగ్యములు కావు. సర్వనాశనం కలుగచేయును . 

 *  చింత, బూరుగు , గానుగ , వెదురు , పత్తి , జిల్లేడు , దాసాని , ముళ్ళులేని వృక్షములు , హంసలు , సాధుజంతువులతో ఉన్న భూములు వైష్ణవభూములు అనబడును. ఇట్టి భూములకు ఉత్తరదిక్కున నదీప్రవాహములు , తటాకములు , నూతులు ఉండటం శ్రేష్టము . 

 *  అరటి , పనస, మామిడి , పొన్న , పొగడ , నెల్లి , వావిలి , పొదరి , నల్లకలువ , మొదలగు వృక్షములు ఉండి సువాసన గల భూములు ధన , ధాన్య సమృద్ధిని కలుగచేయును. 

 *  వావిలి , వసంత, గరిక , మోదుగ , తెల్లగన్నేరు , మల్లిక , ఉడుగ , ఇప్ప మొదలగు వృక్షములతో ఉండి బూడిద వాసన గల భూములయందు గృహనిర్మాణం చేసినచో అన్నవస్త్రములు , సుఖం , ఐశ్వర్యము కలుగును. 

 *  ఉడుగ చెట్లు , పిల్లులు , ముంగీసలు , కుందేళ్లు , చక్రవాక పక్షులు , తోడేళ్ళు గల భూములు , శౌర్య , వీర్య , సకలసంపదలు కలుగచేయును . 

           వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు. మానవుడు తాను నిర్మించుకున్న గృహము నందు సుఖముగా , సంతోషముగా సరైన గాలి , వెలుతూరు వచ్చే విధముగా ఒక పద్దతి ప్రకారం ఎలా గృహనిర్మాణం చేయాలో మన పూర్వీకులు మనకు తెలియచేసిన గొప్పవరం ఈ వాస్తుశాస్త్రం. 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

[23/12, 6:01 am] +91 98850 30034: సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ  - ఔషధ గుణాలు  .

 కొర్రలు యొక్క ఉపయోగాలు  -

 *  కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

 *  శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

 *  కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

 *  శరీరం నందు వేడిని కలిగించును.

 *  జ్వరమును, కఫమును హరించును .

 *  జీర్ణశక్తిని పెంచును.

 *  రక్తమును వృద్దిచేయును.

 *  నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

 *  అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

 *  గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

 *  కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

 *  కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

 *  కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

 * కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

 * కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

 * కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

   సామలు యొక్క ఉపయోగాలు  - 

 *  సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును. 

 *  చలవ , వాతమును చేయును . 

 *  మలమును బంధించును . 

 *  శరీరము నందు కఫమును , పైత్యమును హరించును . 

 *  ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

 * గుండెల్లో మంటకు మంచి ఔషదం.

 * కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం . 

  రాగుల యొక్క ఉపయోగాలు  - 

 *  వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు . 

 *  రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును. 

 *  శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును . 

 *  మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును . 

 * రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును. 

 * రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును. 

 *  కఫాన్ని పెంచును. చలవ చేయును . 

 *  శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

 *  ఆకలిదప్పికలను అణుచును.

 *  విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును. 

 *  రాగుల్లో  పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

 *  రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును . 

 *  మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని 

కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

 *  రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును . 

 *  రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

[24/12, 3:33 am] +91 98850 30034: ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి దురదలు తగ్గించుట కొరకు నెను ప్రయోగించిన ఔషధ విధానం  - 

   అల్లం , ధనియాలు , జీలకర్ర , వాము , తులసి , నిమ్మరసం , తేనే వీటికి సమానంగా 3 గ్రాముల చొప్పున తీసుకుని రోజుకి రెండుసార్లు ఉదయం పరగడుపున , సాయంత్రం ఆహారానికి రెండు గంటల ముందు తీసికొనవలెను. కేవలం 2 నుంచి 3  రోజులలో ఎటువంటి మొండి దురదలు అయినా మాయం అవుతాయి. 

 గమనిక  -

      టీ మరియు కాఫీ పూర్తిగా ఆపి వేయాలి .

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

 గమనిక  -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            కాళహస్తి వేంకటేశ్వరరావు 

         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                        9885030034 

         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

మేలుజాతి గుఱ్ఱములు

 మేలుజాతి గుఱ్ఱములు - వాటి ఆయుఃప్రమాణము .

 * అప్పుడే కొత్తగా ముందరి దంతములు కనిపించుచున్న గుఱ్ఱము యొక్క వయస్సు నెలరోజులు . ముందరి దంతములు కొంచం లావుగా అయ్యి కొంచం పొడువు పెరిగిన దాని వయస్సు రెండునెలలు అని కనుగొనవలెను. 

 * కొత్తగా మధ్యలో దంతములు కనిపించుచున్న దాని వయస్సు 3 నెలలు అని గమనించవలెను. ఆ దంతములు స్పష్టంగా కనిపించినచో నాలుగు నెలలు . మిగిలిన దంతములు వచ్చిన గుర్రము యొక్క వయస్సు 8 నెలలు . 

 *  ఆ దంతములు ఎరుపు రంగులో మారిన ఆ గుర్రము యొక్క వయస్సు రెండు సంవత్సరాలు . గుఱ్ఱముకి పుర్తిగా దంతములు రావడానికి 5 సంవత్సరాల సమయం పట్టును. 

 *  గుర్రముకి 5 సంవత్సరాలు వచ్చు సమయంలో దంతములు తెల్లగా అవ్వుట , స్థిరచిత్తము కలుగుట , కన్నులు దృష్టి స్పష్టంగా కనిపించుట , బలం , శరీరము నందు తేజస్సు అధికముగా అవ్వుట జరుగును. 

 * గుర్రము యొక్క బాల్యదశ 5 సంవత్సరములు . గుర్రము యొక్క జీవితకాలం 32 సంవత్సరాలు . 

 *  గుర్రము యొక్క శరీరం పైన సుడులు 10 ఉండవలెను. 10 కంటే తక్కువ అయిన ఆ అశ్వము అల్పజీవి అగును. అంతేకాక ఆ గుర్రము యొక్క యజమానులకు కూడా కీడుగల్గును. 

 *  తల చిన్నగా ఉన్న గుర్రము అనేక చిక్కులను ఎదుర్కొని 5 సంవత్సరముల లోపలనే మరణించును. అలా జరగనిచో 5 సంవత్సరములలోపు ఆ గుఱ్ఱముని పాలించు యజమాని మరణించుట తధ్యం. 

 *  మెడమీద జూలు నందు సుడి , దేవమణి ఆకారంలో సుడి కలిగిన అశ్వము యజమానికి శుభం చేకూర్చును . 

 *  ముట్టెయందు , కేశాంతము నందు , నోటికి ఇరుపక్కలా ఉండు మూలలయందు సుడులు కలిగిన అశ్వము యజమాని సకలశుభాలు ఇచ్చును. 

 *  ముందరి కాళ్ళకి సుడులు కలిగియున్న అశ్వమును బాహువర్తతు రంగమనబడును.ఈ అశ్వమును పాలించు అధికారి యుద్ధములు యందు విజయాన్ని సాధించును. 

*  పద్మము , కులిశము , చెంబు , చామరం , తోమరము , చక్రము , రోకలి , మొగ్గ , శంఖువు , చంద్రుడు , మణి ఖడ్గము మొదలగు ఆకారాలలో తెల్లని బొల్లి ఉండుట మంచిది . 

 * శూలము , అరదండము ఆకారాలలో మరియు నీలివన్నె పచ్చ రంగు కలిగిన బొల్లులు ఉండరాదు. అందువలన కీడు సంభవించును. తలయందు , క్రింద పెదవి యందు , ముక్కు పైన బొల్లి ఉండరాదు. 

 *  ఎక్కువ , తక్కువ దంతములు కలిగినది , పిల్లి కండ్లు కలిగినది , ఒక కన్ను దృష్టి కలిగినది , ఒక బీజము కలిగినది , పిల్లిచెవులు కలిగినది , రెండు పిల్లలని ఈనే గుర్రము , పెద్ద పెద్ద గిట్టలు కలిగినది మున్నగు దోషములు కలిగిన అశ్వములును పెంచరాదు. 

 *  నాలుగు కాళ్ళ యందు తెలుపు కలిగిన అశ్వము ని పంచకళ్యాణి అందురు . అది తన యజమాని కి సర్వదా జయము కలిగించును. 

 *  నాలుగు కాళ్ల ను , చెవుల యొక్క కొనలను , తోకయును , ముఖము పైన వక్షస్థలం పైన తెల్లని రంగు కలిగియున్న అశ్వముని "యష్టమంగళి " అనుదురు . ఆ గుఱ్ఱమును పాలించువాడు ధరణిని  యేలును . 

 * గుర్రముని అధిరోహించు సమయమున అగ్నిని , వాయుదేవుని దలచుకొని అధిరోహించవలెను. 

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

తేలుకాటు నివారణా యోగాలు

 తేలుకాటు నివారణా యోగాలు  -

 *  జీలకర్ర నూరి సైన్ధవ లవణం కలిపి ఇచ్చిన తేలుకాటు బాధ తగ్గును.

 *  ఉత్తరేణి ఆకు రసం తేలుకాటు పైన రుద్దిన తేలు విషం దిగును.

 *  జిల్లేడు పాలల్లో నేపాళం గింజలోని పప్పు నూరి తేలుకాటు వేసిన చోట అంటించాలి. గోమూత్రం 20 మి.లీ .లో పసుపు వేసి తాగించాలి . విషం దిగును .

 *  ఉత్తరేణి చెట్టు వేరు బియ్యం కడుగుతో నూరి తాగించవలెను . తేలు విషం హరించును .

 *  తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టినచోట అంటించుచున్న తేలు విషం విరుగును.

 *  దాల్చినచెక్క నూనె తేలు కుట్టినచోట దూదిలో ముంచి పెట్టిన నొప్పి తగ్గును.

 *  గుగ్గిలం పొడి తేలు కుట్టినచోట పెట్టి నిప్పు వేడి చూపించిన విషాన్ని లాగేస్తుంది.

 *  జీలకర్ర నూరి తేలు కుట్టినచోట అంటించిన నిప్పువేడి చూపిన విషం తగ్గును.

 *  కుంకుడుకాయ తడిపి దాని గుజ్జుతో తేలుకుట్టిన చోట రుద్దిన బాధ తగ్గును.

 *  ఎర్ర చేమంతి పువ్వుల రసం తేలు కుట్టినచోట వేస్తే విషప్రభావం దిగును .

 *  గచ్చకాయలోని పప్పు నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట వేసి ఒక కాటన్ బట్ట కాల్చి ఆ పొగ గంథం పూసిన చోట చూపించవలెను.ఈ విధంగా చేసిన తేలు విషం దిగును .

 *  ఇంగువను నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట దళసరిగా పూసి గుడ్డ ముక్క కాల్చి ఆ పొగ చూపించిన విషం దిగును .

 *  మోదుగ గింజలను జిల్లేడు పాలతో నూరి ఆ గంధాన్ని తేలుకుట్టినచోట పూస్తే తేలు విషం దిగును .

   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  .

సేవకుడు తప్పుచేసినపుడు

 శ్లోకం:☝️

*దాసే కృతాగసి భవేదుచితః ప్రభూణాం*

*పాదప్రహారితి మానిని నాతిదూయే ।*

*ఉద్యత్కఠోరపులకాంకుర కంటకాగ్రైర్*

*యద్భిద్యతే పదమిదం తవ సా వ్యథా మే ॥*

భావం: సేవకుడు తప్పుచేసినపుడు యజమాని కోపంతో తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను. కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పులకించి నిక్కబొడిచిన ముళ్ళలాంటి రోమాల వల్ల కోమలమైన నీ పాదానికి నొప్పికలిగిందేమోనని నేను బాధపడుతున్నాను.

నంది తిమ్మనగారి పారిజాతాపహరణంలో సత్యభామ కృష్ణుని తన్నిన సన్నివేశంలాంటిది ఈ శ్లోకం.

మూల పురుషుడు ఎవరు

 చాలామందిలో ఆలోచనలలో ఉన్న విషయం.. బ్రాహ్మణుడే శూద్రులను అణచి వేశాడు. అందువల్ల బ్రాహ్మణుడు అహంకారి. అని. కానీ చాలామందికి తెలియని విషయాలు ఏమిటంటే! మీ మీ జాతి లేక వంశ మూల పురుషుడు ఎవరు? ఒక ఋషి ఉంటాడు. శూద్రుడ లేక బ్రాహ్మణుడా, క్షత్రియుడ, వైశ్యుడ అని కాకుండా ఎవరినైనా సరే చూడండి. గోత్రం పేరు ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ద్వారా మీ వంశం వృద్ధి చెంది మీ వరకు వచ్చింది. అన్ని జాతులలో ఋషులు, యోగులు ఉన్నారు. ఎవరికి సందేహం వద్దు. అక్షరసత్యం. మీ చేతకాని తనం, చెప్పుడు మాటలు వినడం వల్ల బ్రాహ్మణ ద్వేషం పెరిగింది. బ్రహ్మవిద్య నేర్చిన వాడే బ్రాహ్మణుడు. పుట్టుకతో వచ్చేది కాదు బ్రాహ్మణత్వం.

జాతి భేదాలతో ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ధర్మ ద్రోహులు అవ్వకండి 

హిందూ ధర్మం జాతి నీ అనుసరించి ఉద్భవించింది కాదు 

హిందూ ధర్మం

జ్ఞానం మీద ఆధారపడి నడిచింది. 

జన్మించిన కులం వల్ల కాదు. 

(వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు ..

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమపవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీవశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ హిందువులచేత .. అరుంధతీవశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందుకుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా ..

1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టినవారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్కరించారు ... వారిలో కొందరు

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూలపురుషుడైన రఘుమహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు. 

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు.. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణుపురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణుపురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. నాలుగు వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

*ఈ సందేశాన్ని కూడా మీ బంధువులకు స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి*

*తెలియని విషయాలు తెలుసుకునే అదృష్టాన్ని వారికి అందించటంలో సహాయపడండి*