24, డిసెంబర్ 2022, శనివారం

సేవకుడు తప్పుచేసినపుడు

 శ్లోకం:☝️

*దాసే కృతాగసి భవేదుచితః ప్రభూణాం*

*పాదప్రహారితి మానిని నాతిదూయే ।*

*ఉద్యత్కఠోరపులకాంకుర కంటకాగ్రైర్*

*యద్భిద్యతే పదమిదం తవ సా వ్యథా మే ॥*


భావం: సేవకుడు తప్పుచేసినపుడు యజమాని కోపంతో తన్నడం సరైనదే. నేను నీకు దాసుడును నీ విషయంలో అపరాధం చేసినందుకు నన్ను నీవు పాదప్రహారం చేసినందుకు బాధపడను. కాని నీ పాదస్పర్శచేత నా శరీరం పులకించి నిక్కబొడిచిన ముళ్ళలాంటి రోమాల వల్ల కోమలమైన నీ పాదానికి నొప్పికలిగిందేమోనని నేను బాధపడుతున్నాను.

నంది తిమ్మనగారి పారిజాతాపహరణంలో సత్యభామ కృష్ణుని తన్నిన సన్నివేశంలాంటిది ఈ శ్లోకం.

కామెంట్‌లు లేవు: