1, జనవరి 2022, శనివారం

హనుమాన్ చాలీసా

 ॐ హనుమాన్ చాలీసా


31. అష్టసిద్ధి నవనిధి కే దాతా I 

        అసవర దీన(న్హ) జానకీ మాతా ॥ 


    - అణిమాద్యష్టసిద్ధులను, నవనిధులను సంప్రాప్తింప చేసేవాడివి.

      సీతాదేవి ఆవిధంగా వరం నీకు ఒసగింది.


    - Mother Sita granted you the boon that 

       you will be the bestower of the eight powers and nine wealths.


వివరణ


 అష్టసిద్ధులు,నవనిధులు అంటే ఏమిటి?


అష్టసిద్ధులు...


1.అణిమ,2.మహిమ3. గరిమ,4.లఘిమ,5.ప్రాప్తి, 6.ప్రాకామ్యము,7.ఈశత్వం,8.వశిత్వం.


1) అణిమ: శరీరమును అతి చిన్నదిగా చేయుట

2) మహిమ: శరీరమును అతి పెద్దదిగా చేయుట

3) గరిమ: శరీరము బరువు విపరీతముగా పెంచుట

4) లఘిమ: శరీరమును అతి తేలికగా చేయుట

5) ప్రాప్తి: కావలసిన వస్తువులు పొందుట

6) ప్రాకామ్యం: కావలసిన భోగము అనుభవించుట

7) ఈశత్వం : ఎవరిపైనైనా, దేనిపైనైనా అధికారము పొందుట

8) వశిత్వం: అన్ని భూతములను లోబరచుకొనుట


నవనిధులు...


1. పద్మం,2. మహాపద్మం,3. శంఖం,4. మకరం,5. కచ్చపం,6. ముకుందం,7. కుందం, 8.నీలం, 9. ఖర్వం


(ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద మహాలక్ష్మి దయవలన కలిగి ఉన్నాయి. ఈ నిధి దేవతల వలన భూ,జల, లోహ భోగాది సంపదలు లభిస్తాయి)


          ఆంజనేయ స్వామి సురస పరీక్షను ఎదుర్కొనే సమయంలోనూ,

          సింహికను సంహరించు సమయానా తాను స్వయంగా అణువులా మారి నోటిలో వెళ్ళి తిరిగి బయటకు రావడం మనకు తెలిసిన విషయమే... 

          అలానే సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు లంక నుండి హిమాలయాల వరకు లంఘించారు.. 

          ఆంజనేయస్వామికి ఇన్ని శక్తులున్నా, అవసరమైనమేరకే విచక్షణతో వాటిని ఉపయోగిస్తారు.

          శక్తులను కలిగి ఉండడం గొప్ప కాదు.. కానీ వాటిని మంచి కార్యాలకు వినియోగించడం గొప్ప... 

          వాటి విలువ తెలుసుకుని వాటిని గౌరవించడం ఇంకా గొప్ప. 

          అందుకే హనుమ గొప్ప నమ్మకస్థుడు, భక్తుడు, దైవం అయ్యారు...


    బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారి వివరణ 👇


    https://youtu.be/rax3zcZJszQ


                    =x=x=x=


    — రామాయణం శర్మ 

             భద్రాచలం