ఆ. ప్ర. లో మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు అక్కడ ఎలాంటి సామజిక దూరం పాటించకుండా ఒకరిమీద ఒకరుగా వుంటూ ఇన్నాళ్లు ఎదురుచూసిన మధురసం పొందటానికి పోటీ పడ్డారు. ఇది ప్రత్యక్షంగా ప్రతి టి.వి. చానలు చూపించింది. ఇక కరోనాకు కళ్లెం వేయటం కుదరదు అని అనుకున్నాము. తెలంగాణలోకూడా సారా పిపాసులకు స్వగతం పలుకుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం శోచనీయం. దేశంలోనే మన రాష్ట్రం కరోనా కట్టడిలో కఠినంగా వర్తిస్తు చాలా వరకు కరోనాను కట్టడి చేసాము అన్న ముఖ్యమంత్రి గారికి మరి సారా తెరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదా అని అనేక వర్గాలు ఉటంకిస్తున్నాయ్.
ఈ పరిస్థితి చుస్తే సారా బాబులు మీరు ఎక్కడికో వెళ్లి తాగక్కరలేదు. చక్కగా ఇక్కడే తాగండి తూలండి కరోనాను తగిలించుకోండి మీ కుటుంబాన్ని మీ కాలనీకి అంటించండి మీకు పూర్తీ స్వేచ్ఛ వుంది. అని అనాలనిపిస్తుంది.
ఇక్కడ ఎంతో కట్టుదిట్టం చేస్తేకూడా అటు రాజకీయ నాయకులూ ఇటు కొందరు వున్మాదులు, వారి వారి అధికారాల్ని, మూర్ఖత్వాన్ని చూపుతూ పోలీసులపై, డాక్టర్ల ఫై దాడికి దిగుతున్నారని రోజు మనం ట్.విలో చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం డాక్టర్లమీద, ఇతర ఆరోగ్య సిబ్బందిమీద దాడి చేసే వారిమీద కఠిన చెర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తే ఎన్ని కేసులు పెట్టారు అన్నది శోచనీయం. చదువుకున్న, సంస్కారమున్న, అధికారమున్న వారే ఆలా ప్రవర్తిస్తే ఇక చదువు సంధ్య లేని తాగుబోతుల్ని ఆపటం సాధ్యమా. ఈ విషయాన్నీ ప్రభుత్వం గుర్తించాలి.
దేముడే అన్ని చూసుకుంటాడు. మనకేం కాదని మెట్ట వేదాంతం వల్లిద్దామా. ఆలోచించండి.
ఇక మనం చేసిది ఏమిలేదు మధుపాన ప్రియో జ్ఞానీ భవ, మధుపాన ప్రియా సంస్కార భావ, మధుపాన ప్రియా ఆరోగ్య భవ అని కోరుకోటం తప్ప
సర్వే జానా సుఖినోభవంతు.
సర్వ సంతు ఆరోగ్య భవతు.
ఓం శాంతి శాంతి శాంతిః