8, సెప్టెంబర్ 2022, గురువారం

ఉపవాసం

 ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు  - 


 *  జీర్ణక్రియ  - 


      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 


 *  మలాశయం  - 


       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 


 *  మూత్రపిండములు  - 


       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 


 *  ఊపిరితిత్తులు  - 


        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 


 *  గుండె  - 


       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 


  *  లివర్ , స్ప్లీన్  - 


        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 


 *  రక్తప్రసరణ  - 


       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 


 *  కీళ్లు  - 


        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 


 *  నాడి మండలము  - 


        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 


 *  జ్ఞానేంద్రియములు  - 


        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 


 *  చర్మము  -  


        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 


 *  మనస్సు  - 


        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 


        పైన చెప్పినవే కాకుండా మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి . దురభ్యాసాలను విడుచుటకు ఉపవాసం మిక్కిలి ఉపయోగపడును. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకపోవడం ఉపవాసం కాదు. ఉపవాసానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటి గురించి తరవాతి పోస్టులలో వివరిస్తాను . 


        

తులసితో చికిత్స

 మలేరియా జ్వరమునకు తులసితో చికిత్స -


      మలేరియా జ్వరం వర్షాకాలం  నందు విపరీతంగా వ్యాప్తి చెందును. ఇది ఇప్పుడు సర్వసాధారణం అయినది. దీనికి ఇతర వైద్యులు "క్యూనైన్ "మందుగా వాడటం జరుగుతుంది. దీనిచే జ్వరం తగ్గును. కానీ తలనొప్పి , చెవులలో హోరుమను శబ్దం , తలతిరుగుట , చెవుడు మొదలుకొని హృదయసంబంధ కాంప్లికేషన్స్ అగుపిస్తున్నాయి. మన ఆయుర్వేద వైద్యం నందు తులసితో ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా ఈ జ్వరాన్ని సులభంగా నివారించవచ్చు. 


  నివారణోపాయాలు  - 


 *  7 మిరియాలు , 7 తులసి ఆకులు కలిపి నమిలి మ్రింగుచున్న  మలేరియా జ్వరం 3  రోజులలో హరించును . 


 *  మానిపసుపు , పిప్పిళ్ళు , వెల్లుల్లి , జీలకర్ర , శొంఠి , తులసి , నారింజ పిందెలు , వావిలి వ్రేళ్ళు , ఆకుపత్రి వీటిని సమాన భాగాలుగా కలిపి చూర్ణించి పూటకు అరతులం వంతున ఇచ్చుచున్న చలిజ్వరములు తగ్గును. 


 *  తులసి ఆకులు 60 గ్రా , కొద్దిగా మందార పుష్పదళములు , కొద్దిగా ఉమ్మెత్త పుష్పదళములు , మిరియాలు 10 గ్రా , కొద్దిగా నీరువేసి మర్దించి బఠాణి గింజంత పరిమాణంతో మాత్రలు చేసి చలిజ్వరం వచ్చుటకు గంట ముందుగా రెండు మాత్రలు తీసుకున్న చలిజ్వరం రాకుండానే పోవును.అలాగే రొజు మార్చి రొజు వచ్చు మలేరియా జ్వరం లందు మంచి ఫలితాన్ని ఇచ్చును . 


 *  మలేరియా జ్వరం మొండిగా ప్రతిసంవత్సరం వస్తూనే ఉండిన తులసీదళములు , మిరియాలు నీటిలో వేసి ఉడికించిన కషాయములో కొద్దిగా బెల్లం , నిమ్మరసం కలిపి వేడిగా ఉన్నప్పుడే కాఫీ వలే తాగి రగ్గు కప్పుకొని పడుకోవలెను . ఇలా మూడు గంటలకు ఒకమారు చేయుచుండిన మంచి ఫలితం ఉండును. 


 *  తులసి వ్రేళ్ళ కాషాయం త్రాపిన బాగుగా చెమటపట్టి చలిజ్వరం వెంటనే తగ్గును. 


 *  మలేరియా జ్వరం ప్రతిసంవత్సరం భాదించుచున్న వ్యక్తికీ తులసిరసం , పుదీనా రసం , అల్లం రసం ఒక్కొక్కటి 5 గ్రాముల వంతున కలిపి తాగుచున్న మంచి ఫలితం కనిపించును.


  గమనిక  - 


      తులసి చెట్టు వైద్యం కొరకు కుండీలలో ఇంట్లో పెంచుకొనుట చాలా మంచిది.


  నా అనుభవం - 


         ప్రతిరోజు 2 స్పూన్స్ తులసి రసం ఇచ్చి టాబ్లెట్ లేకుండా రక్తపోటు 170 నుంచి 130 కి తీసుకొనివచ్చాను కేవలం 2 వారాలలోనే  ఇలా కొంతకాలం తులసిరసం వాడటం వలన రక్తపోటు పూర్తిగా పోతుంది. 


   

         

కనుమరుగు

 🌹🌿అందరికి నమస్కారం 🌹🌿


మడిబట్ట ఆరేసుకోవటానికి దండె వుండేది.....


కొద్ది సంవత్సరాలు లలో కొద్దిగా మిగిలిన ఈ తరం కనుమరుగు అవుతోంది...హుషార్


మడి నీళ్లు, వంటిల్లు, చల్లగదిలో ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి,దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతి కాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊరచల్ల మిరపకాయలు, వుండేవి. 


బాదం చెట్టు, కరివేపాకు, అరటి, మందార పుావుల, పారిజాతం, తులసి మొదలైనవి. 


రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు కరణీకం దస్త్రాలు గది, మధ్యలో మండువా, అటుా, ఇటుా గదులు, పెద్ద వసారా, అందులో ఆడపిల్లలు కుార్చునేవారు.


బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం. 

ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు.


ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం , జంతికలు, మిఠాయి కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.


శీతాకాలంలో, సీతాపలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు ,  తాటి ముంజెలు, 

వేసవికాలంలో, ఈత కాయలు, చీమచింతకాయలు.


భోజనములో కంది పచ్చడి, పెసరపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలుపోసి ఆనపకాయకుార, ఆవ పెట్టి, పనస, అరటి, కందబచ్చలి, కూరులు, తెలగపిండితో కుారలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర శనగ పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార.

 

ఇంక తద్దినం భోజనము సరేసరి,   ఆలస్యం అయినా అమోఘం, మధ్యాహ్నం 2 దాక వేచి చూసే  వాళ్ళం, మధ్యలో అడిగితే, బ్రాహ్మలు భోజనాలు  అవుతున్నాయి, అరగంట ఆగండి అనేవారు.


గారెలు, అప్పాలు, పరవాన్నం, 

నుావుపచ్చడి, అల్లపచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు (ఉట్టిదే తినాలని పించేది) తీపి కుార, 

ఆవపెట్టిన కుార, ఇంకో కుార, 

అనకుాడదుకానీ, తద్దినం భోజనం తలుచుకుంటే ఎటువంటివారికైనా నోట్లోనుంచి చొంగ కారాల్సిందే ... 


శుభకార్యాలలో, బుారెలు, బొబ్బట్లు, మైసుారు పాక్(ఆరోజుల్లో) పుాతరేకులు, బుాంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కుార స్పెషల్.


అత్తరు సాహెబ్ సెంటు, అత్తరు, 

వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు, 


తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నుానె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ 'రీట' రాసుకునేవారు. 

అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. 


మగవాళ్ళుకుాడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం, 


పెద్దలు విభూది పెట్టు కొనేవారు. 

రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పుకునేవారం, 


అవన్నీ మధురస్మృతులు...❤️

జాగ్ర‌త్త‌లు

 *సొంత వాహ‌నాల్లో ప్ర‌యాణించే  మిత్రులంద‌రికీ 4 జాగ్ర‌త్త‌లు*


* బ్రేకులు చ‌క్రాల‌కే గాని కారుకు కాదు. 70-80 కిలోమీట‌ర్ల లోపు అయితే, స‌డెన్ బ్రేకేస్తే కారు ఆగుతుంది. కానీ అంత‌కు మించితే బ్రేకు వ‌ల్ల ఉప‌యోగం లేదు. 


  * ప్రమాదాలు ఎవ‌రూ ఆప‌లేరు గాని... మ‌రీ ఆగిఉన్న వాటిని,  ఢీకొట్ట‌డం మాత్రం క‌చ్చితంగా స్వ‌యంకృతాప‌రాధ‌మే.

 డ్రైవింగ్‌లో జాగ్ర‌త్త లేన‌పుడు మాత్ర‌మే ఇది జ‌రుగుతుంది. 

 

 మీరు హ‌ర్ట‌యినా ప‌ర్లేదు గాని.. మీరేమీ ప్ర‌ధాని కాదు, సీఎం కాదు.. మీరు కొంచెం లేటెల్తే కొంప‌లేం మునిగిపోవు. పైగా మీ కొంప మునిగిపోయే అవ‌కాశాలెక్కువ‌. స్పీడు 160 దాకా కూడా వెళ్లొచ్చు. 


కానీ స్ట్రెయిట్ హైవేలు కాన‌పుడు 80 కి.మీ. కంటే, రాత్రి ప్ర‌యాణాల్లో 80-100 కంటే ఎక్కువ‌ స్పీడు క‌చ్చితంగా మిమ్మ‌ల్ని చంపేస్తుంది. 

 * అయినా రాత్రిపూట సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అర్జెంటుగా మీరు ఉద్ద‌రించాల్సిందేంటో ఆలోచించాలి. 

ముందుగా పోయి చేసేదేముంది.


 *రిస్కు....*  

*వ్యాపార‌ల్లో చేస్తే డ‌బ్బులు పోతాయి*. 

*రోడ్ల మీద చేస్తే ప్రాణాలు పోతాయి*


*మీరు లేకుంటేమిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు పడే బాధను ఊహించి జాగ్రత్త గా డ్రైవ్ చేయండి*


జాగ్రత్తగా డ్రైవ్ చేయడం ద్వారా మన ప్రాణాలని నిలుపుకుందాం...

ఎదుట వచ్చే వారి ప్రాణానికి హామీ ఇద్దాం......

వేగం వద్దు....ప్రాణం ముద్దు


నిదానమే ప్రదానం అని ఊరికే అనలేదు భయ్యా, ఆలోచించండి, ఆచరించండి..


80Kmph స్పీడ్ కి 100-120kmph స్పీడ్ కి మధ్య తేడా కేవలం 10 నిమిషాలు మాత్రమే... లేటైతే పోయేది ఏమి లేదు, కానీ తొందర పడితే పోయేది కొన్ని జీవితాలు... 


 స్కూటర్ స్పీడ్ 40 KM/H, బైక్ స్పీడ్ 50 KM/H మరియు కార్ స్పీడ్ 80 KM/H

లోపల ఉండాలి


 *ఎక్కువ వేగంగా వెళ్ళి  నోడు గొప్పోడు కాదు అవసరమైనప్పుడు తక్కువ వేగంగా జాగ్రత్తగా వెళ్ళి నోడు గొప్పోడు* 

                   ఇట్లు

         *మీ శ్రేయోభిలాషి*

పందితో పడవలో

 ఒక వ్యక్తి తన పందితో పడవలో ప్రయాణిస్తున్నాడు.


ఆ పడవలో ఇతర  ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు.


పంది ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు. అందువల్ల అది ఎవరినీ శాంతంగా కూర్చోనివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడుతోంది.


దీనితో బోట్ నడిపేవాడు ఇబ్బంది పడుతున్నాడు.  ఈ పంది వల్ల ,ప్రయాణికుల భయం కారణంగా పడవ మునిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నాడు.


పంది కానీ శాంతించకపోతే అది పడవని 

మునిగిపోయే ప్రమాదంలోకి నెట్టేస్తుంది.


ఆ పందిని తెచ్చిన మనిషి పడవలో ఉన్న ఈ పరిస్థితి గురించి కలత చెందుతున్నాడు.  కాని తన పందిని శాంతింపచేయడానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.


వాళ్లలో ఉన్న తత్వవేత్త ఇవన్నీ చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


 "మీరు అనుమతిస్తే, నేను ఈ పందిని ఇంటి పిల్లిలా నిశ్శబ్దంగా చేయగలను." అని ఆ పంది యజమానితో ఆ తత్వవేత్త చెప్పాడు. 


ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు.


తత్వవేత్త, ఇద్దరు ప్రయాణీకుల సహాయంతో పందిని ఎత్తుకొని నదిలోకి విసిరాడు.


ఆ పంది నీటిలో తేలుతూ ఉండటానికి ఈత కొట్టడం ప్రారంభించింది. దానికి ఇప్పుడు ఈత కొట్టకపోతే చచ్చిపోతాను అని తెలిసి దాని ప్రాణం నిలుపుకోవడం కోసం కష్టపడడం మొదలుపెట్టింది.


కొంత సమయం తరువాత, తత్వవేత్త పందిని తిరిగి పడవలోకి లాగాడు.


పంది వెళ్లి పడవలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంది.


పంది యొక్క మారిన ప్రవర్తనను చూసి దాని యజమాని మరియు ఇతర ప్రయాణీకులందరూ ఆశ్చర్యపోయారు.


ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు: "మొదట అది అటూ ఇటూ దూకుతోంది. ఇప్పుడు అది పెంపుడు పిల్లిలా కూర్చుంది. ఎందుకు? కారణం ఏమిటి అని అడిగాడు.


తత్వవేత్త ఇలా అన్నాడు: "అదే తరహా ఇబ్బందిని అనుభవించకుండా మరొకరి కష్టాన్ని ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేరు. నేను ఈ పందిని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటిలో పడితే  ప్రమాదాన్ని మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అది అర్థం చేసుకుంది."


భారతదేశంలో అలాగే దేశం బాగోలేదు, వాక్ స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ప్రభుత్వం బాగా నడపడం లేదు అంటూ అటూ ఇటూ దూకుతున్న పందులను ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా,ఇరాన్, ఇరాక్ లేదా పాకిస్తాన్ లేదా చైనాలో 6 నెలలు విసిరివేయాలి. తరువాత వారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఆటోమాటిక్ గా పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా జీవించడం నేర్చుకొని ఒక మూల కూర్చొని వుంటారు.


ఈ భారత్ దేశాన్ని'  రోజూ తిట్టుకునే అన్ని పందులకు అంకితం.


వాట్స్ అప్ సేకరణ..

జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధానాలను

 పరమహంస యోగనంద గారు తమ  గ్రంధంలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధానాలను విపులంగా వివరించారు  ఇలా

   మానవుని శక్తులలో జ్ఞాపకశక్తి ముఖ్యమైనది. జ్ఞాపకశక్తి  లేకపోతే మనం చిన్నపిల్లల్లా ఉండిపోతాము. Remember (జ్ఞాపకం )అనేపదం re అంటే 'తిరిగి ' మరియు memorari అంటే గుర్తుచేసుకోవడం అనే మాటలనుండి వచ్చింది.జ్ఞాపకం అంటే ప్రతి ఆలోచన, పని లేక  అనుభవం మొదటిసారి జరిగినపుడుదా ని మౌలికమైన మానసిక జ్ఞాపకార్ధ లేఖనం, ప్రతి జ్ఞాపకం మెదడులో ఒక ప్రత్యేక భావ నమూనా లాగ నమోదు అవుతుంది. లెక్కలేనన్ని ఈ నమూనాలలో దేనినయినా చైతన్యపు జాగరూ కత లోనికి గుర్తు తెచ్చుకోవడమే జ్ఞాపకం.

     మనిషి స్మృతిలో అతడు రూపొందించు కున్న మంచి చెడు అలవాట్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అతడువాటిని గుర్తుంచుకున్నా లేకపోయినా అవన్నీ అతడి మెదడులో  ఉన్నాయి.మీరెవరికైనా మంచి చేసినా , హాని చేసినా ప్రతిసారి, ఆ స్మృతి మీ మెదడులో నిక్షిప్త మౌతుంది. అలాగే మీరెవరికన్నా హాని చేసిన ప్రతీసారి, ఈ జ్ఞాపకం మీ మానసిక కోశాగారంలో భద్రపారాచబడుతుంది. మంచి గాని, చెడు గాని ఇతరులకి బుద్ధి పూర్వకంగా చేసిన దేదైనా గుర్తు పెట్టుకోబడుతుంది. మీ ప్రస్తుత చర్యలు మీకు తెలియకుండానే ఈ పాత చర్యల మూలంగా ప్రభావితం మౌతాయి. గత జన్మనుంచి మంచి అలవాట్లున్న ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు, గతంలోని మంచి యొక్క ప్రభావం వెంటనే ఆ క్రియను మంచి అలవాటుగా మారుస్తుంది. అలాగే ఒక చెడ్డ మనిషి తప్పు పని చేసినప్పుడు, అతని పాత చెడు అలవాట్లు కారణంగా పటిష్ట పరచబడిన దాని ప్రభావం ఆ పనిని వెంటనే చెడ్డలవాటుగా మారుస్తుంది. గత జన్మలనుండి వచ్చిన ఈ జన్మలో ఏర్పడిన చెడు ప్రవృత్తులను వదిలిపెట్టాలని గట్టిగ తీర్మానించుకోండి. మీ మంచి పనులనీగుర్తుంచుకోండి. అప్పుడే మీకు మనఃశాంతి లభిస్తుంది.కొద్దిపాటి మంచి తనమైన ఏ జన్మలోదయినా మీ రెన్నాడూ కోల్పోరు. ఆ మంచి జ్ఞాపకాలను మీ ప్రస్తుత చర్యలను ప్రభావితం చేసేలా ఉపయోగించండి. ఇతరులకు కూడా వారి లోని మంచి చేయగల సామర్ధ్యాన్ని గుర్తు చేయండి. మంచిని పెంపొందించే వాహకులుగా మనం నిరంతరం  అందరం కృషి చేస్తుంటేనే చెడుని సమూలంగా నాశనం చేయగలుగుతాము. పాశ్చాత్య దేశా లు క్రమశిక్షణ తో వరవలంబించే  మౌలికసూత్రమిదే. మనలో కొరవడిందీ ఇదే..

    భగవంతుడు ఇచ్చిన జ్ఞాపక శక్తికి  ప్రయోజనం ప్రతికూల విషయాలు ఆలోచించడం, పదే పదే తలచుకొని బాధ పడడంకాదు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనల్ని మానసికంగా కూడా క్రుంగ దీస్తుంది. మంచిని, అనుకూల విషయాలను తలచుకుని దీనినే అభ్యసించాలి. అందువల్ల మనము ప్రశాంతంగా మానసిక దృఢాత్త్వంతో జీవించా గలుగుతాము. మనసు బంధించిన పాశా లను జ్ఞానమనే ఖడ్గంతో చేదించడం లేక బందీ గానే ఉండిపోవడం అనేది మన మీదే ఆధారపడి ఉంది.

జ్ఞాపకాన్ని పెంపొందించుకునే margalu---

1. ఆహారం.: తాజా పాలు, పెరుగు మంచి జ్ఞాపకానికి సహాయపడతాయి. ఏమితంగా తింటే దుష్ప్రభావము చూపుతుంది. కొవ్వు పదార్ధాలు అధికంగా తింటే జీర్ణక్రియ మందగించి చివరకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వేపుళ్ళు, కొవ్వు పదార్ధాలు మితంగా తినాలి. పంది మాంసం పూర్తిగా విడిచిపెట్టాలి. అది జ్ఞాపకాశక్తిని న సింపజేస్తుంది.

2, చల్లని నీటి లో స్నానం జ్ఞాపక శక్తికీ నాడు లకూ మంచిది. నరాలను చల్ల బరిస్తే మానసిక ప్రశాంతత వృద్ధి చెందు . తుంది..

3. భోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మనిగ్రహం  ఉన్నవారు మహాత్తర మైన జ్ఞాపక శక్తిని, అద్భుతమైన మనోబలాన్ని సాధించగలరు..

4. గతస్మృతులను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవడం వలనకూడా జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. మానసికంగా వ్యాయామంతో కూడికలు, తీసివేతలు లాంటి చిన్న కసరాత్తులతో జ్ఞాపకాశక్తిని పెంపొందించుకోవచ్చు.

5.జ్ఞాపకశక్తి పేంపొందించుకునే ఇంకొక పద్ధతి తలమీద నెమ్మదిగా చేతివేళ్ల కణు పులతో కొట్టుకోవడం.

6. చేసేప్రతిపనీ గాధమైన శ్రద్ధ తో ఏ కాగ్రత తో  చెయ్యాలి.చాదస్తాన్ని వదులుకోవాలి.

7. సాహిత్యము, చిత్రాలేఖనము వంటి లలిత కళల అభ్యాసంతో కూడా జ్ఞాపకాశక్తిని పెబచుకోవచ్చు.

8. చివరగా మానసిక అనుభూతుల్ని మరచిపోకుండా గుర్తుము తెచ్చుకోవాలి. అవికూడా మంచివిషయాలే అయి ఉండాలి.

మీ మనో మందిరాన్ని భగవంతుడి స్మరణతో నిత్యం పవిత్రంగా ఉంచుకోవాలి. దుష్ట జ్ఞాపాకాలనే దోపిడీ దొంగలుణితరిమికొట్టాలి. ఆ మందిరాన్ని మంచి తనమనే దేవతల కోసమే తెరవాలి.

అజీర్ణే భోజనమ్ విషమ్

 1. _*అజీర్ణే భోజనమ్ విషమ్:*_


మధ్యాహ్న భోజనం జీర్ణం కాకపోతే, రాత్రి భోజనం చేయడం, విషం తీసుకోవడంతో సమానం అని ఈ సూత్రానికి అర్థం. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం. కాబట్టి ఆకలి లేకుండా మళ్ళీ ఆహారం తీసుకోకూడదు.


2. *అర్ధరోగహరి నిద్రా:*


సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో, తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతుడు రోజుకి కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి, శారీరక శ్రమ వల్ల కాళ్ళు, చేతులు, గుండె, మెదడు మొదలైన ముఖ్య అంగాలు అలసట తీరి సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఉపకరిస్తుంది. అటువంటి వారికి రోగాలు దరిచేరవు. కనుక మంచి నిద్ర సగం రోగాలను హరించి వేస్తుంది అని ఈ సూక్తికి అర్థం.


3. _*ముద్గధాలి గధవ్యాలి:*_


అన్ని రకాల పప్పుధాన్యాలలో, పచ్చ *పెసలు* (Greengrams) ఉత్తమమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ,

 ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.


4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహ:*


వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. వెల్లుల్లి తరచుగా తినేవారిలో ఎముకలు, వాటి జాయింట్లు గట్టిగా ఉంటాయి.


5. *అతి సర్వత్రా వర్జయేత్:*


అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి.


6. *నాస్తిమూలం అనౌషధం:*


శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం లేని కూరగాయలు అంటూ లేవు.


7. *న వైద్యా ప్రభుయుయుషా:*


ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. వైద్యులకు కొన్ని పరిమితులు ఉన్నాయి.


8. *చింతా వ్యాధి ప్రకాషయ:*


చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది.


9. *వ్యాయామశ్చ శనై: శనై:*


ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. నడక కూడా ఇందులోకి వస్తుంది.


10. *అజవత్ చర్వనం కుర్యాత్:*


మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది.


11. *స్నానమ్ నామ మనః ప్రసాధనకరం దుస్వప్న విధ్వంసకం*


స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. ఇది చెడ్డ కలలనును దూరం చేస్తుంది.


12. *న స్నానం ఆచరేత్ భుక్త్వా:*


ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.


13. *నాస్తి మేఘ సమం తోయం*


స్వచ్ఛతలో వర్షపునీటికి, ఏ నీరు సాటి రాదు. పల్లెటూళ్ళలో ఇప్పటికీ వర్షపు నీటిని పట్టి వడకట్టి త్రాగుతారు. కాని నేరుగా పడిన వర్షపు నీటినే పట్టాలి. ఇంటి చూరుల మీదనుంచి కారిన నీరుకాదు.


14. *అజీర్నే భేషజం వారీ:*


మంచినీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు.


15. *సర్వత్ర నూతనం శాస్త్రం సేవకన్న పురాతనం.*


తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, తొలగించవద్దు.)


16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా:*


ఉప్పు, తీపి, చేదు, పులుపు, (Astringent మరియు pungent) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి.


17. *జఠరమ్ పూరైధార్ధమ్ అన్నాహి:*


మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి.


18. *భుక్త్వోపా విసస్థాంద్:*


ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం 100 అడుగులు అయినా నడవండి.


19. *క్షుత్ సాధూతం జనయతి:*


ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)


20. *చింతా జరానామ్ మనుష్యానమ్:*


చింతించడం అనేది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. కనుక అనవసరపు చింతలతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి.


21. *సతం విహాయ భోక్తవ్యం:*


ఆహారం తీసుకొనే సమయం వచ్చినప్పుడు, ఎంతటి పనినైనా కూడా పక్కన పెట్టండి. నిదానంగా భోజనం చేయండి. వేగంగా తినడం, పని ఉందని అసలు భోజనమే మానివేయడం చాలా అనర్థదాయకం.


22. *సర్వ ధర్మేశు మధ్యమామ్:*


ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించిన వారికి చిరాయువు, నిత్య ఆరోగ్యం తప్పక లభిస్తుంది.