8, సెప్టెంబర్ 2022, గురువారం

కనుమరుగు

 🌹🌿అందరికి నమస్కారం 🌹🌿


మడిబట్ట ఆరేసుకోవటానికి దండె వుండేది.....


కొద్ది సంవత్సరాలు లలో కొద్దిగా మిగిలిన ఈ తరం కనుమరుగు అవుతోంది...హుషార్


మడి నీళ్లు, వంటిల్లు, చల్లగదిలో ఊరగాయ జాడీలు, అందులో చింతకాయి, నిమ్మకాయి,దబ్బకాయి, ఆవకాయ, మాగాయి, మెంతి కాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, అప్పడాలు, ఊరచల్ల మిరపకాయలు, వుండేవి. 


బాదం చెట్టు, కరివేపాకు, అరటి, మందార పుావుల, పారిజాతం, తులసి మొదలైనవి. 


రెండు పెద్ద అరుగులు, ఎడమవైపు పోస్టాఫీసు గది, కుడి వైపు కరణీకం దస్త్రాలు గది, మధ్యలో మండువా, అటుా, ఇటుా గదులు, పెద్ద వసారా, అందులో ఆడపిల్లలు కుార్చునేవారు.


బయట తిరిగి వస్తే, కాళ్లు చేతులు కడుగుకొని, బట్టలు మార్చుకున్నాకే భోజనం. 

ఉదయం 10.30, సాయంత్రం 6 కల్లా భోజనం. మజ్జిగ అన్నంలో వేసవి కాలంలో మామిడి పళ్ళు.


ఉదయం చద్దెన్నం, చిన్న పిల్లలకు కాఫీ లేదు, మధ్యాహ్నం , జంతికలు, మిఠాయి కొమ్ములు, చేగోడీలు, పుాతరేకులు.


శీతాకాలంలో, సీతాపలాలు, జామకాయ, సపోటా, తేగలు, బుర్ర గుంజు ,  తాటి ముంజెలు, 

వేసవికాలంలో, ఈత కాయలు, చీమచింతకాయలు.


భోజనములో కంది పచ్చడి, పెసరపప్పు పచ్చడి, మినపప్పు పచ్చడి, గోంగూర పచ్చడి, కొబ్బరి కాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, మెంతి మజ్జిగ, చల్లపులుసు, కందిపొడి, నువ్వులపొడి, పొట్లకాయపెరుగు పచ్చడి, పాలుపోసి ఆనపకాయకుార, ఆవ పెట్టి, పనస, అరటి, కందబచ్చలి, కూరులు, తెలగపిండితో కుారలు, గుత్తి వంకాయ, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు (టమోటా తక్కువ), తోటకూర, బచ్చలికూర, గోంగూర శనగ పప్పు పులుసు, పెండలం కుార, వేపుళ్ళు, బంగాళదుంప ఉప్మా కుార.

 

ఇంక తద్దినం భోజనము సరేసరి,   ఆలస్యం అయినా అమోఘం, మధ్యాహ్నం 2 దాక వేచి చూసే  వాళ్ళం, మధ్యలో అడిగితే, బ్రాహ్మలు భోజనాలు  అవుతున్నాయి, అరగంట ఆగండి అనేవారు.


గారెలు, అప్పాలు, పరవాన్నం, 

నుావుపచ్చడి, అల్లపచ్చడి, పులుసు వుండదు, చారు, పెసరపప్పు (ఉట్టిదే తినాలని పించేది) తీపి కుార, 

ఆవపెట్టిన కుార, ఇంకో కుార, 

అనకుాడదుకానీ, తద్దినం భోజనం తలుచుకుంటే ఎటువంటివారికైనా నోట్లోనుంచి చొంగ కారాల్సిందే ... 


శుభకార్యాలలో, బుారెలు, బొబ్బట్లు, మైసుారు పాక్(ఆరోజుల్లో) పుాతరేకులు, బుాంది లడ్డు, గుమ్మడి కాయ దప్పళం, పనస పొట్టు కుార స్పెషల్.


అత్తరు సాహెబ్ సెంటు, అత్తరు, 

వచ్చినప్పుడు కంటికి సుర్మ పెట్టే వాడు, 


తలకు రాసుకోవటానికిి టాటా, స్వస్తిక్ సువాసనగల నుానె, ఆడవాళ్ళు జుట్టు ఊడకుండ 'రీట' రాసుకునేవారు. 

అప్పట్లో తిలకం పెట్టుకునే వారు, స్టిక్కర్లు లేవు. 


మగవాళ్ళుకుాడ తిలకం పెట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం, 


పెద్దలు విభూది పెట్టు కొనేవారు. 

రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్పుకునేవారం, 


అవన్నీ మధురస్మృతులు...❤️

కామెంట్‌లు లేవు: