పరమహంస యోగనంద గారు తమ గ్రంధంలో జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే విధానాలను విపులంగా వివరించారు ఇలా
మానవుని శక్తులలో జ్ఞాపకశక్తి ముఖ్యమైనది. జ్ఞాపకశక్తి లేకపోతే మనం చిన్నపిల్లల్లా ఉండిపోతాము. Remember (జ్ఞాపకం )అనేపదం re అంటే 'తిరిగి ' మరియు memorari అంటే గుర్తుచేసుకోవడం అనే మాటలనుండి వచ్చింది.జ్ఞాపకం అంటే ప్రతి ఆలోచన, పని లేక అనుభవం మొదటిసారి జరిగినపుడుదా ని మౌలికమైన మానసిక జ్ఞాపకార్ధ లేఖనం, ప్రతి జ్ఞాపకం మెదడులో ఒక ప్రత్యేక భావ నమూనా లాగ నమోదు అవుతుంది. లెక్కలేనన్ని ఈ నమూనాలలో దేనినయినా చైతన్యపు జాగరూ కత లోనికి గుర్తు తెచ్చుకోవడమే జ్ఞాపకం.
మనిషి స్మృతిలో అతడు రూపొందించు కున్న మంచి చెడు అలవాట్లు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అతడువాటిని గుర్తుంచుకున్నా లేకపోయినా అవన్నీ అతడి మెదడులో ఉన్నాయి.మీరెవరికైనా మంచి చేసినా , హాని చేసినా ప్రతిసారి, ఆ స్మృతి మీ మెదడులో నిక్షిప్త మౌతుంది. అలాగే మీరెవరికన్నా హాని చేసిన ప్రతీసారి, ఈ జ్ఞాపకం మీ మానసిక కోశాగారంలో భద్రపారాచబడుతుంది. మంచి గాని, చెడు గాని ఇతరులకి బుద్ధి పూర్వకంగా చేసిన దేదైనా గుర్తు పెట్టుకోబడుతుంది. మీ ప్రస్తుత చర్యలు మీకు తెలియకుండానే ఈ పాత చర్యల మూలంగా ప్రభావితం మౌతాయి. గత జన్మనుంచి మంచి అలవాట్లున్న ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు, గతంలోని మంచి యొక్క ప్రభావం వెంటనే ఆ క్రియను మంచి అలవాటుగా మారుస్తుంది. అలాగే ఒక చెడ్డ మనిషి తప్పు పని చేసినప్పుడు, అతని పాత చెడు అలవాట్లు కారణంగా పటిష్ట పరచబడిన దాని ప్రభావం ఆ పనిని వెంటనే చెడ్డలవాటుగా మారుస్తుంది. గత జన్మలనుండి వచ్చిన ఈ జన్మలో ఏర్పడిన చెడు ప్రవృత్తులను వదిలిపెట్టాలని గట్టిగ తీర్మానించుకోండి. మీ మంచి పనులనీగుర్తుంచుకోండి. అప్పుడే మీకు మనఃశాంతి లభిస్తుంది.కొద్దిపాటి మంచి తనమైన ఏ జన్మలోదయినా మీ రెన్నాడూ కోల్పోరు. ఆ మంచి జ్ఞాపకాలను మీ ప్రస్తుత చర్యలను ప్రభావితం చేసేలా ఉపయోగించండి. ఇతరులకు కూడా వారి లోని మంచి చేయగల సామర్ధ్యాన్ని గుర్తు చేయండి. మంచిని పెంపొందించే వాహకులుగా మనం నిరంతరం అందరం కృషి చేస్తుంటేనే చెడుని సమూలంగా నాశనం చేయగలుగుతాము. పాశ్చాత్య దేశా లు క్రమశిక్షణ తో వరవలంబించే మౌలికసూత్రమిదే. మనలో కొరవడిందీ ఇదే..
భగవంతుడు ఇచ్చిన జ్ఞాపక శక్తికి ప్రయోజనం ప్రతికూల విషయాలు ఆలోచించడం, పదే పదే తలచుకొని బాధ పడడంకాదు. అది ఆరోగ్యాన్ని దెబ్బతీసి మనల్ని మానసికంగా కూడా క్రుంగ దీస్తుంది. మంచిని, అనుకూల విషయాలను తలచుకుని దీనినే అభ్యసించాలి. అందువల్ల మనము ప్రశాంతంగా మానసిక దృఢాత్త్వంతో జీవించా గలుగుతాము. మనసు బంధించిన పాశా లను జ్ఞానమనే ఖడ్గంతో చేదించడం లేక బందీ గానే ఉండిపోవడం అనేది మన మీదే ఆధారపడి ఉంది.
జ్ఞాపకాన్ని పెంపొందించుకునే margalu---
1. ఆహారం.: తాజా పాలు, పెరుగు మంచి జ్ఞాపకానికి సహాయపడతాయి. ఏమితంగా తింటే దుష్ప్రభావము చూపుతుంది. కొవ్వు పదార్ధాలు అధికంగా తింటే జీర్ణక్రియ మందగించి చివరకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. వేపుళ్ళు, కొవ్వు పదార్ధాలు మితంగా తినాలి. పంది మాంసం పూర్తిగా విడిచిపెట్టాలి. అది జ్ఞాపకాశక్తిని న సింపజేస్తుంది.
2, చల్లని నీటి లో స్నానం జ్ఞాపక శక్తికీ నాడు లకూ మంచిది. నరాలను చల్ల బరిస్తే మానసిక ప్రశాంతత వృద్ధి చెందు . తుంది..
3. భోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆత్మనిగ్రహం ఉన్నవారు మహాత్తర మైన జ్ఞాపక శక్తిని, అద్భుతమైన మనోబలాన్ని సాధించగలరు..
4. గతస్మృతులను ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవడం వలనకూడా జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది. మానసికంగా వ్యాయామంతో కూడికలు, తీసివేతలు లాంటి చిన్న కసరాత్తులతో జ్ఞాపకాశక్తిని పెంపొందించుకోవచ్చు.
5.జ్ఞాపకశక్తి పేంపొందించుకునే ఇంకొక పద్ధతి తలమీద నెమ్మదిగా చేతివేళ్ల కణు పులతో కొట్టుకోవడం.
6. చేసేప్రతిపనీ గాధమైన శ్రద్ధ తో ఏ కాగ్రత తో చెయ్యాలి.చాదస్తాన్ని వదులుకోవాలి.
7. సాహిత్యము, చిత్రాలేఖనము వంటి లలిత కళల అభ్యాసంతో కూడా జ్ఞాపకాశక్తిని పెబచుకోవచ్చు.
8. చివరగా మానసిక అనుభూతుల్ని మరచిపోకుండా గుర్తుము తెచ్చుకోవాలి. అవికూడా మంచివిషయాలే అయి ఉండాలి.
మీ మనో మందిరాన్ని భగవంతుడి స్మరణతో నిత్యం పవిత్రంగా ఉంచుకోవాలి. దుష్ట జ్ఞాపాకాలనే దోపిడీ దొంగలుణితరిమికొట్టాలి. ఆ మందిరాన్ని మంచి తనమనే దేవతల కోసమే తెరవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి