18, ఆగస్టు 2024, ఆదివారం

తొలి ఉత్తరం!

 *కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల*

*తన తల్లికి వ్రాసిన తొలి ఉత్తరం!*            


“అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను.


ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడు అని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.


కానీ, ఈరోజు నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే ఒక అందమైన పూలపానుపు కాదు అని!


కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని, నాకు అర్ధం అయింది.!


నేను ఊహించిన దాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.


నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు.


మన ఇంట్లో లాగా నైట్ దుస్తులతో, పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది.


నీ దగ్గర ఉన్నప్పుడు, పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు.


నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునే వారు ఇక్కడ లేరు కానీ, నేను మాత్రము అందరి గురించి చాలా శ్రధ్ధ తీసుకోవాలి.


అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా! అని ఏడుపు కూడా వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలు పోవాలని, మళ్లీ హాయిగా వుండాలని అనిపిస్తుంది.


మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు, సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.


కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది, నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చిన దానివేగా అని, నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు, సేవలు చేసే ఉంటావు కదా!


నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాలన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళీ నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది.


నేను చెప్తున్నా అమ్మ, కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే, నా ఈ కొత్త కుటుంబాన్నీ, కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను.


నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.


అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి.


థాంక్ యూ అమ్మా! 

ఐ మిస్ యు!!


*రేపు రాఖి పండుగ సందర్బంగా మహిళలందిరికి కృతఙ్ఞతలతో!*

Panchaag


 

శ్రావణ పూర్ణిమ

 శ్రావణ పూర్ణిమ - హయగ్రీవ జయంతి

✍️ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫


శ్రీ మహాగణాధిపతయేనమః

శ్రీ గురుభ్యోనమః


జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం♪!

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే♪!!


🙏 శ్రావణ పూర్ణిమ జ్ఞానస్వరూపమని దేవీభాగవతం చెబుతోంది♪.


🌈 మెుట్టమెుదట వేదములను లోకానికి శ్రీమహావిష్ణువు బ్రహ్మ ద్వారా ఇచ్చినటువంటి తిథి శ్రావణ పూర్ణిమ♪. శ్రావణమాసంలో అపూర్వ దినం శ్రావణ పూర్ణిమ♪.

 

🌈 ఈ పూర్ణిమను - రక్షాబంధన్ పూర్ణిమ అని, హయగ్రీవ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని అంటారు♪. 


🌈 శ్రావణ పూర్ణిమనాడే హయగ్రీవ అవతారం ఎత్తి వేదములను విఘ్ణవు సంరక్షించాడు, అందుకే హయగ్రీవ పూర్ణిమ అంటారు♪. హయగ్రీవుడు జ్ఞానానందస్వరూపుడు♪. పిల్లలు హయగ్రీవుని పూజించడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది♪. 


🌈 పూర్ణిమ నాడు హయగ్రీవ పటం కానీ, విగ్రహం కానీ పెట్టి పిల్లలతో పూజ చేయించాలి♪. హయగ్రీవ మంత్రాన్ని చెప్పించాలి♪. ఇలా చేయటం వల్ల పిల్లలలో జ్ఞానం పెరుగుతుంది♪. మాతృ, పితృ భక్తి పెరుగుతుంది♪. పిల్లలు ఉత్తములుగా మారతారు♪. 


🌈 ఈరోజు ఏడు తోరములను (ముడి) కలిగిన దారం తయారు చేసి గౌరీదేవి ముందు పెట్టాలి♪. యథాశక్తిగా పూజించాలి♪. పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి♪. పూజ అయ్యాక స్త్రీ లు అయినా, పురుషులు అయినా కుడిచేతికి తోరమును కట్టుకోవాలి♪. ఇలా చేయటం వల్ల విజయం లభిస్తుంది♪. శత్రుబాధ తగ్గుతుంది♪. 


🌈 ఈరోజు తప్పనిసరిగా జంధ్యం మార్చుకోవాలి♪. అందరూ గాయత్రీ జపం చేయాలి♪. ఉపనయనం లేని వారు, స్త్రీలు చేయటానికి దేవీభాగవతంలో శ్లోకం ఉంది♪. గాయత్రీ జపం వల్ల అనేక యజ్ఞములు, యాగములు, దానములు చేసిన ఫలితం లభిస్తుంది♪. 


🙏 దేవీభాగవతంలోని శ్లోకం


యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః

ప్రేరయేత్తస్యయద్భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే


💫 _*ఈ రోజు ఒక్కసారి గాయత్రీ మంత్రం జపిస్తే వేయిసార్లు చేసిన ఫలితం దక్కుతుంది♪._ ఈరోజు అందరూ వేదశ్రవణం చేయాలి♪. వేదపండితులకు దానం చేయాలి♪. 


💫 ఈ పూర్ణిమ నాడు గౌరీదేవి కోకిలాదేవి అనే పేరుతో విహరిస్తుంది♪. 


💫 గాయత్రీ సహస్రనామ స్తోత్రం చదవాలి♪. అమ్మవారిని కుంకుమతో పూజించి ప్రదక్షిణ చేయాలి♪. గురుపత్నికి గానీ లేదా ముత్తైదువకు కానీ చీర సమర్పించాలి♪. 


💫 రక్షాబంధన్ పూర్ణిమ నాడు సోదరునికి, సోదరి హరినామాన్ని స్మరిస్తూ రక్షాబంధనం కట్టాలి♪.


✅👉 (బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనములు మరియు శ్రీమతి శ్రీవిద్య గారు, కవయిత్రి రచించిన వ్యాసవిద్య అనే పుస్తకం నుంచి సేకరించిన సమాచారం)


 ❀┉┅━❀🕉️❀┉┅━❀

సేకరణ:

💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

రాఖీ పౌర్ణమి

 రేపు రాఖీ పౌర్ణమి. అన్నాచెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళు ఒకరిపై ఒకరికి గల ఆప్యాయతను,ప్రేమను పంచుకొనే రోజు. అక్కాచెల్లెళ్ళు తమ అన్నాతమ్ముళ్ళను అన్ని వేళలా తమకు అండగా ఉండాలని కోరుతూ రక్షా బంధన్ కట్టే రోజు.అయితే ఈ రాఖీ పౌర్ణమికి మీ మీ అన్నాతమ్ముళ్ళకి రాఖీ కట్టి ప్రియమైన మీ అన్నా తమ్ముళ్ళ నుండి "మీలానే మిగిలిన అమ్మాయిలను కూడా ఆదరిస్తాను.ఏ అమ్మాయినీ బాధపెట్టను. ఏ అమ్మాయికి హాని తలపెట్టను." అని ప్రమాణాన్ని బహుమతిగా తీసుకోండి. ఖచ్చితంగా మీరు బహుమతిగా తీసుకొనే ఈ ప్రమాణం మిగిలిన అమ్మాయిలను కాపాడుతుంది.ఈ msg అందరికీ చేరేవరకు forward చేయండి.అమ్మాయిలను హింస,వేధింపుల నుండి కాపాడండి.🙏🙏🙏

ధర్మసందేహాలు

 *ధర్మసందేహాలు:*


*1. ప్ర: పూజాదికాలు చేస్తున్నప్పుడు మధ్యలో తుమ్మువంటివి వస్తే, పూజ నిష్ఫలమా?*


*జ: శాస్త్రరీత్యా పూజాదికాల సమయంలో కన్నీరు కారినా, క్రోధం కలిగినా, అపాన వాయువు, తుమ్ము వంటివి కలిగినా, అశౌచులను చూసినా ఆచమనం చేస్తే ఆ దోషాలు పోతాయి. అదే విధంగా కుడి చెవిని కుడిచేతితో తాకాలి.*



*2. ప్ర: మనం రోజును ఎలా లెక్కిస్తాం? అర్ధరాత్రి 12 తరువాత తేదీ మారినట్లు, అప్పుడే మనకి రోజు మారుతుందా?* 


*జ: మనకి సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఒకరోజు క్రింద లెక్క, అర్ధరాత్రి లెక్కకి లేదు. సూర్యోదయమే ప్రధానం. 'ఉదయాదుదయం వారం' అని శాస్త్రం.*



*3. ప్ర: ‘ప్రాతఃస్మరణీయులు' అంటే ఏమిటి? వారెవరు?*


*జ: ప్రాతఃకాలాన్నే నిద్ర లేస్తూ పవిత్రమైన, దివ్యమైన వస్తువుల్నీ, మహాపురుషుల్ని స్మరించుకోవడం భారతీయ సనాతన ధర్మం. ఉదయానికి పూర్వకాలం ఆ రోజు ఆరంభం. ఆ సమయంలో 'మంచి'ని తలచుకుంటే దినమంతా మంచే జరుగుతుందని భావన. ప్రాతఃకాలాన ముందుగా, శయ్యమీదే కూర్చొని అరచేతిలో ముగ్గురమ్మలనీ భావనచేసి నమస్కరించి, ఆ తరువాత ఇష్టదైవాన్నీ, దేవతలనీ స్మరించాలి. అటు పిమ్మట వసిష్ఠాది మహర్షులనీ పృథు మాంధాత రఘు మొదలైన మహాచక్రవర్తులనీ ప్రహ్లాదాది పరమ భాగవతులనీ, హిమవత్పర్వతాది పుణ్యగిరులనీ, గంగాది పావన నదులనీ తలంచుకొని నమస్కరించాలి. అటుతరువాత భూమాతకి నమస్కరించి శయ్య నుండి దిగాలి. ఇలా ప్రాతఃకాలంలో స్మరించదగినవారిని 'ప్రాతఃస్మరణీయులు' అంటారు. అలాంటి పుణ్యచరిత్ర గలవారిని కూడా ఆ పేరుతో గౌరవించడం సంప్రదాయం.*



*4. ప్ర: నది- నదం ఈ రెండింటికీ తేడా ఏమిటి?*


*జ: తూర్పు దిక్కు వైపు ప్రవహిస్తూ పోయి, తనంత తానే సముద్రంలో కలిసేది - నది.*

*(కృష్ణ,గోదావరి మొ॥నవి)

పడమటి దిక్కున ప్రవహిస్తూ వెళ్ళి, అక్కడ నదితో చేరి*, 

*సముద్రంలో కలిసేది 'నదం'.(నర్మద,తపతి మొ॥నవి)*



*5. ప్ర: మా ఇంట్లో బోర్వెల్ సదుపాయంగానీ, నుయ్యిగానీ లేదు. మున్సిపల్ పంపుల మీదనే ఆధారపడవలసి వస్తోంది. ఆ నీరునే పట్టి సంపులలో దాచుకోవాలి. మరి పూజలకి నీళ్లు వాడుకోవాల్సినప్పుడు, శుచిగా ఎలా సాధ్యం? నిత్యకర్మలు చేయడం ఎలా కుదురుతుంది?*


*జ: మనకి దొరికే నీటినే పూజలకు వినియోగించుకోవాలి. 'సాధ్యమైనంత వరకు' శక్తివంచన లేకుండా నియమాలను పాటించాలి. సాధ్యం కానిది ఎలాగూ చేయలేం. సాధ్యమైన మేరకు శుచిగల జలాన్ని సేకరించి, ఆ దొరికిన దానిలోనే 'గంగ, యముగా, గోదావరి' లాంటి పుణ్యనదుల్ని భావనచేసి, ఇష్టదేవతా స్మరణ చేసి వినియోగించాలి. అంతేగానీ నిత్యకర్మానుష్టానం మానరాదు.*



*6. ప్ర: కొత్త తులసి మొక్కను పాతడానికిగానీ, మార్చి వేయడానికి గానీ మంచి రోజులు చూడాలా?*


*జ. శాస్త్రరీత్యా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి, కార్తిక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలంటారు. ఆ రోజుల్లో కొత్తగా తులసి మొక్కను మార్చి పాతడం కూడదు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో తులసిని కోయరాదు.*



*7. ప్ర: నాకు పీడకలలు ఎక్కువ వస్తుంటాయి. అవి రాకుండా ఉండాలంటే, వాటి ప్రభావం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అసలు కలలు నిజమౌతాయా? పగటి నిద్రలో కలలు నిజమౌతాయంటారు కదా!*


*జ: "దుస్స్వప్నే స్మర గోవిన్దం'' అంటారు. గోవింద నామస్మరణ చేసి, నిద్రపోతే పీడకలలు రావు. వచ్చినా వాటి ప్రభావం ఉండదు. గజేన్ద్రమోక్ష ఘట్టాన్ని, త్రిమూర్తులనీ తలచుకొని నిద్రించడం, తిరిగి లేస్తూనే వాటిని స్మరించడం చేస్తే దుస్స్వప్న ప్రభావం ఉండదు. ఉదయానే దూర్వాలతో గణేషుని అర్చించినా మేలుకలుగుతుంది*. 

"*పుణ్యో దుస్స్వప్న నాశనః" నారాయణుడు దుస్స్వప్ననాశకుడని విష్ణు సహస్రనామాలలోనే పేర్కొన్నారు.* *పగటి నిద్రలో, వాతప్రకోపాలలో వచ్చే కలల వల్ల ప్రయోజనం లేదు.*



*8. ప్ర: నవబ్రహ్మలు అంటే ఎవరో వివరిస్తారా?*


*జ: బ్రహ్మదేవుని నుండి ఉద్భవించిన ప్రజాపతులు తొమ్మిది మంది.* 

*వీరు సృష్టి విస్తరణకై బ్రహ్మ ద్వారా కలిగినవారు. వీరినే ప్రజాపతులు అంటారు.*  

*మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వసిష్ఠ, దక్ష.*



*9. ప్ర: మంగళవారం వంటి రోజుల్లో తలస్నానం చేయరాదనీ, నూతన వస్త్రాలు ధరించరాదని అంటారు కదా? మరి పర్వదినాలు ఆ రోజుల్లో పడితే ఏం చేయాలి?*


*జ: పర్వదినాలు పడిన 

ఏ రోజైనా ఆ నియమం వర్తించదు*

*మంగళవారమైనా ఆ రోజు తలస్నానం చేయవచ్చు. నూతన వస్త్రాలు ధరించవచ్చు.*



*10. ప్ర: ‘విశ్వేదేవతలు' అంటే ఎవరు? వీరి ప్రత్యేకత ఏమిటి? వీరెంతమంది?*


*జ: విశ్వేదేవతలు పదిమంది. 'విశంతి కర్మసు - ఇతి విశ్వే' - ఆయా కర్మానుష్టానాలలో ఆరాధింపబడేవారిగా ప్రవేశమును పొందినవారు. వీరు 'విశ్వా' అనే ఆమెకు పుత్రులు. కర్మానుష్ఠానాలలో వీరిని ఆరాధిస్తారు.*


*వసుః సత్యః క్రతుర్దక్షః 

కాలః కామో ధృతిః కురుః*

*పురూరవా మాద్రవాశ్చ 

విశ్వేదేవా దశస్మృతాః*

          

*వసువు, సత్యుడు, క్రతువు, దక్షుడు, కాలుడు, కాముడు, ధృతి, కురు, పురూరవుడు, మాద్రవుడు... ఇవీ వారిపేర్లు.*



*11. ప్ర: జన్మనక్షత్రంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?*


*జ: జన్మనక్షత్రంలో యాగం, చౌలకర్మ, అన్నప్రాశన, వ్యవసాయం, ఉపనయనం, భూసంపాదన, అక్షరాభ్యాసం చేయవచ్చు. శుభకరం. సీమంతం, గర్భాధానం, క్షౌరకర్మ, ఔషధసేవారంభం, ప్రయాణం చేయరాదు. అశుభం*. 

*స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం చేయడం మంచిదే. పురుషులకు జన్మనక్షత్రాన వివాహం పనికిరాదు.*



*12. ప్ర: శివాలయానికి వెళ్ళేటప్పుడు నంది కొమ్ముల నుండి శివుని చూడాలంటారు. ఆ విధానం, చెప్పవలసిన స్తోత్రం ఏమిటి?*


*జ: నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి, వెనుక భాగంలో కుడిచేతితో స్పృశించడం చేత అతడు శిరసు వంచుతాడు. అప్పుడు కొమ్ముల నుండి శివుని చూడాలి. పశుపతి అయిన శివుడు, పశువులైన జీవులకు ప్రభువు. ఆ పశుత్వాన్ని దాటి శివుని చూడాలి.*


*మరియొక భావంలో - నంది ధర్మస్వరూపుడు. ఆ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, ధర్మం ద్వారానే దైవాన్ని దర్శించాలనే సంకేతం కూడా ఇందులో దాగి ఉంది.*


*శాంతానంద ప్రదాయక,

మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి,అనే శ్లోకాన్ని పఠిస్తూ*


 "*హర హర - శివశివ" అనే శివ నామాన్ని పలుకుతూ, నంది కొమ్ముల మధ్య నుండి శివ లింగాన్ని దర్శిస్తే - వేదపఠనం చేసిన ఫలం, సప్తకోటి మహా మంత్ర జపఫలం లభిస్తాయని, పాప పరిహారం అవుతుందనీ పురాణాలు చెబుతున్నాయి.*



*13 ప్ర: అమ్మవారి అష్టోత్తరశతనామాలలో*


*భక్త హంసపరీముఖ్య వియోగాయైనమోనమః” అని 83వ నామం. ఈ నామానికి అర్థం ఏమిటి?*

*కొన్ని పుస్తకాలలో 'పరీముఖ్య' బదులుగా 'పరాముఖ్య' అని ఉంది. ఏది సరియైన పాఠం.*


*జ: 'పరాముఖ్య' అనేదే సరియైన పాఠం. దీని అర్థం- 'పరాఙ్ముఖత్వం'. అంటే- 'పెడమొగముతో ఉండుట' (విముఖత్వం). భక్తులైన హంసల (పరమహంసలు - యోగులు) పట్ల అమ్మవిముఖంగా ఉండడంలో వియోగం కలది. అంటే విముఖత్వాన్ని కలిగి ఉండదు. భక్తయోగుల పట్ల సుముఖురాలు. ఈ మాటని ఈ విధంగా చెప్పడంలో ఒక అందముంది. ఏ మాత్రము భక్తుల పట్ల విముఖంగా ఉండని తల్లి. యోగుల హృదయంలో అమ్మయే యోగము. అక్కడ వియోగం లేదు. భక్తవాత్సల్య స్వరూపిణి. పరమహంసలలో భాసించే జ్ఞానానందతత్త్వం.*



*14. ప్ర. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు - అని అంటారు కదా! అవి ఏమిటి? వివరించ ప్రార్థన.*


*జ. ఒకటే జాతిలో రెండు వస్తువులకు గల భేదము 'సజాతీయ భేదం'. ఉదాహరణకు రెండు రాతి వస్తువులు. ఒక రాతికీ మరో రాతితో గల భేదమిది.*

 *వేరు వేరు జాతుల్లో రెండు వస్తువులకున్న భేదం - విజాతీయ భేదం*

*ఉదా: ఒక రాతికి ఒక చెట్టుతో గల భేదం.*

*ఒకే వస్తువులో ఉన్న భేదం విగత భేదం. తనయందే ఉన్న భేదం.*


*ఉదా: ఒకే చెట్టులో కొమ్మ, రెమ్మ, ఫలం - వంటి భేదాలు. ఈ మూడు రకాల భేదాలు నామరూపాత్మక ప్రపంచంలోని ఉపాధులలో ఉన్నాయి. ఈ భేదాలు లేని అభిన్న స్వరూపుడు సర్వవ్యాపకుడైన పరమాత్మ. వేదాంత శాస్త్రంలో పరమాత్మ తత్త్వాన్ని తేటపరచే సందర్భంలో ఈ మాటలను వివరించారు.*



*15. ప్ర: 'ఏడుగడ' అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో కనిపిస్తోంది. ఆ 'ఏడు' సంఖ్య దేనికి వర్తిస్తుంది? ఆ పదానికి అర్థం ఏమిటి?*


*జ: 'ఏడుగడ' అనే మాటకి 'ఆధారము, ఉనికి' ప్రధానార్థం. వ్యక్తి ఏడు రకాల ఆధారాల వలన తన జీవితాన్ని నిర్వహించగలడు. తల్లి, తండ్రి, గురువు, పురుషుడు (జీవ చైతన్యం), విద్య, దాత, దైవము - ఈ ఏడు ఉనికికి, మనిషికి కావలసినవి. కనుక వీటిని 'ఏడుగడ' అంటారు. ఒక శక్తి గానీ, వ్యక్తి గానీ ఈ ఏడురకాలుగా సహకరించినప్పుడు ఆ శక్తినీ, వ్యక్తినీ 'ఏడుగడ' అనడం సంప్రదాయం.*



*16. ప్ర: దీపం పెట్టేటప్పుడు వత్తి ఏ ముఖంగా ఉండాలి. రాత్రి దీపం ఎంత వరకు ఉండాలి?*


*జ: దీపం తూర్పుముఖంగా ఉంటే ఆయుష్షు, ఉత్తరముఖంగా వెలిగిస్తే ధనం లభిస్తుంది. పడమర ముఖంగా, దక్షిణముఖంగా వెలిగించరాదు. పడమర ముఖం దుఃఖాన్ని, దక్షిణముఖం కీడును కలిగిస్తాయి.*


*రవేరస్తం సమారభ్యయావత్ సూర్యోదయా భవేత్।*

*యస్య తిష్ఠేత్ గృహే దీపస్తస్య నాస్తి దరిద్రతా॥*


,*సూర్యుడు అస్తమించినది మొదలు, మళ్ళీ సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతుండాలి. అలా దీపం వెలిగే ఇంట్లో దరిద్రం ఉండదు.*



*17. ప్ర: ఆబ్దికం చేసేటప్పుడు - చనిపోయినవారి తిథి ఆ రోజు పగలు పదిగంటలకు వచ్చి, మర్నాడు ఉదయం కొన్ని గంటలు మాత్రమే ఉన్నప్పుడు శ్రాద్ధకర్మ ఎప్పుడు చేయాలి?*


*జ: ఇది జ్యోతిష - ధర్మ శాస్త్రాల సమన్వయంతో తేల్చ వలసిన అంశం. మీరు అనుసరించే పంచాంగ సంప్రదాయం ప్రకారం నిర్ణయించుకోవాలి.*


 *అయితే అపరాహ్న (మధ్యాహ్నం 12 గం ॥) సమయంలో ఉన్న తిథినే గ్రహించాలి కనుక, 10 గంటలకు వచ్చిన తిథి ఉన్న రోజునే ఆబ్దికానికి స్వీకరించాలి.*



*18. ప్ర: మహాభారతంలో దుష్యంతుని పుత్రుడు భరతుడు అని ఉన్నది. ఆ భరతుని పుత్రుడు ఎవరు? అదే విధంగా - భీష్ముని తండ్రియైన శంతనునికి తండ్రి ఎవరు? 'కుఱువంశం' అనే పేరు ఎందువల్ల వచ్చింది?*


*జ: భరతుని పుత్రుడు 'భుమన్యువు' - అని భారతం చెబుతోంది. తరువాత కొన్ని తరాల చక్రవర్తులు గడిచాక 'సంవరణుడు' అనే భారతవంశీయుని కొడుకు 'కుఱు'. సంవరణుని కాలంలో రాజ్యాధికార భ్రష్టమై అతడు పరివారంతో సహా పారిపోయి అరణ్యంలో తలదాచుకున్నాడు. తరువాత వసిష్ఠుని దీవెనల వల్ల తిరిగి శత్రువుల్ని జయించి రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఆతని పుత్రుడు 'కుఱు'. పోయిన రాజ్యం తిరిగి వచ్చాక, కలిగిన ఈతడు అనంతర రాజైన కారణంగా ప్రత్యేకించి ఈతని నుండి 'కుఱు' పేరుతో వంశ వ్యవహారం నడిచింది. ఈతని పేరుతో 'కుఱుజాంగలదేశ'మనే ప్రసిద్ధి కూడా వచ్చింది*. 


*వీరి తరువాత ఆరవ తరం వాడు శాంతనుడు. అతని పుత్రుడు భీష్ముడు. 'శాంతనుడు' అన్నా 'శంతన' చక్రవర్తి అన్నా ఒకడే. ఈతని తండ్రి పేరు ప్రతీపుడు*.



*19. ప్ర. పూజ అనే మాటకు అర్ధం ఏమిటి?*


*జ. "పూః యేన జాయతే ఇతి పూజా” అని పురాణాల్లో నిర్వచనమిచ్చారు*. 


*పూః- అంటే ఇష్టసిద్ధి, భోగం అని అర్ధాలు. ఏ కర్మ వలన ఇష్టసిద్ధి లభిస్తుందో దానికి పూజ అని అర్ధం. భగవదర్చన వల్ల అభీష్టసిద్ధి లభిస్తుంది కనుక అర్చనకు 'పూజ' అనే శబ్దాన్ని వాడుతారు.*



*20. ప్ర: కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది?*


*జ: కార్తికమాసం అనగానే తెల్లవారుఝామున స్నానాలు, ఉభయసంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలు, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం... చక్కని సందడి!*


*ఇందులో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి.చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం...*


*ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళాచాతురిని కొనియాడవలసిందే.కార్తికంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తికం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికి ప్రాధాన్యం.*


*కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం.కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్ని యందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం.అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది - కృత్తికానక్షత్రంతోనే ప్రారంభమవుతుంది.*


*ఆ యజ్ఞతత్త్వానికి సంకేతంగానే 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది. కార్తికంలో దీపార్చన, దీపదానం వంటివి - యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి.*


*భర్తృహరి తన శతకసాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు.*


 *ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు*


*జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసమిది.*


"*ఆనందాలకు ఆహ్వానాలు - ఈ కార్తికదీపాలు"*


*శుభమస్తు*

.

సర్వారాయుళ్లు

 ఏరీ అలనాటి సర్వారాయుళ్లు? 


          "శ్రీ లక్ష్మీ కాఫీ హోటల్"

"పరమేశ్వర బ్రాహ్మణ కాఫీ హోటల్"  

"ధనలక్ష్మీ ఆర్యవైశ్య కాఫీ హోటల్"

"సుబ్బారావుగారి కాఫీ భోజన హోటల్"


వీధిలోకి వెళ్ళగానే కనిపించే  హోటల్లోకి అడుగుపెట్టగానే  ముందు గదిలో టేబుల్ మీద పెద్ద సైజ్ రేడియో,  బిల్లులను గుచ్చడానికి దబ్బనం  లాంటి ఒక పరికరం, ఒకటో రెండో చాకోలెట్స్  సీసాలు  పెట్టుకుని కుర్చీలో ఒక పెద్దమనిషి కూర్చుని కనిపిస్తాడు.  అతని కుర్చీ వెనుక పదిరకాల దేవుళ్ళ ఫోటోలు గోడకు తగిలించి ఉంటాయి.  అగరొత్తులు సుగంధాలు విరజిమ్ముతాయి.   లోపలకి వెళ్ళగానే హాల్లో  మూడు నాలుగు వరుసల్లో టేబుళ్లు, టేబుల్ కు అటూ ఇటూ రెండు కుర్చీలు కనిపిస్తాయి.  మనం ఏదొక కుర్చీలో కూర్చోగానే  బట్లర్ లేదా సర్వర్ వస్తారు.  "టేబుల్ క్లీన్" అని కేకపెడతాడు.  క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తడిగుడ్డతో టేబుల్ మొత్తాన్ని కసకసా తుడిచేసి వెళ్ళిపోతాడు.


  "ఏమున్నాయి?" ప్రశ్నిస్తాము.  "ఇడ్లీ వడ ఉప్మా పూరి ఉల్లిదోసె సాదాదోస పెసరట్టు ఉప్మా పెసరట్టు" అని ఫుల్ స్టాప్, కామాలు లేకుండా ఆరనిముషంలో ఇరవై రకాల టిఫిన్ల దండకాన్ని చదువుతాడు.  అలా ఒకసారి కాదు...రోజుకు కనీసం రెండు వందలసార్లైనా ఆ దండకాన్ని చదువుతాడు.   అన్నీ విని సరిగా వినపడనట్లు ముఖం పెట్టి కొంతమంది మళ్ళీ అడుగుతారు.  ఏమాత్రం విసుక్కోకుండా  మళ్ళీ చెబుతాడు.    ఆర్డర్ ఇవ్వగానే వెళ్లి రెండు మూడు నిముషాల్లో ప్లేట్ లో తీసుకుని వస్తాడు.  


కొన్నిసార్లు ఉదయం వేళల్లో రద్దీగా ఉన్న సమయంలో ఒకేసారి నాలుగైదు  ప్లేట్లను కూడా ఒకదానిమీద మరొకదాన్ని పెట్టి  తీసుకొస్తాడు.  నలుగురి దగ్గర ఆర్డర్ తీసుకుని కిచెన్ లోకి అన్నీ తెచ్చి ఎవరెవరు ఏమి అడిగారో వారికి కచ్చితంగా  వాటినే ఇస్తాడు.  చిన్నపొరపాటు కూడా జరగదు.  


ఇడ్లీ సాంబార్  చాలా ఫేమస్.  దానికి సాంబార్ ఇడ్లీ అని చెప్పాలి.  మామూలు ఇడ్లీ అంటే  ఇడ్లీ ప్లేట్ లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కొద్దిగా కారప్పొడి తో తెస్తాడు.  సింగిల్ సాంబార్ ఇడ్లీ అని చెబితే పెద్ద ప్లేట్ లో ఒక్క ఇడ్లీ తీసుకొచ్చి పెద్ద లోటాతో సాంబార్ తెచ్చి పళ్లెం నిండా పోస్తాడు. పావు లీటరు పైగానే ఉంటుంది.  కొంతమంది ఆ ఒక్క ఇడ్లీకే మళ్ళీ సాంబార్ వేయించుకుంటారు.  


తిన్న తరువాత "ఇంకేమి కావాలి సార్" అడుగుతాడు. "కాఫీ" అనగానే గ్లాసులో నురగలతో కాఫీ తెచ్చి ఇచ్చి చెవి పైభాగంలో  దోపుకున్న పెన్సిల్ తీసుకుని జేబులొనించి చిన్న కాగితం ముక్క తీసి ఎంత అయిందో రాసి ఇస్తాడు. నేను తొలిసారి హోటల్లో తిన్నపుడు రెండు ఇడ్లీ పావలా.  పూరీ రెండు అర్ధరూపాయి.  కాఫీ ఇరవై పైసలు అని గుర్తు.   ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, తిని కాఫీ తాగితే తొంభై అయిదు అయిదు పైసలు అయ్యేది.  రూపాయి నోటు ఇచ్చి "మిగిలింది ఉంచుకో" అనేసి వెళ్ళిపోయేవారు కొందరు.  


  

1975 ప్రాంతంలో ఆంధ్రాలో కానీ,  తెలంగాణాలో కానీ, తమిళనాడులో కానీ  చిన్న చిన్న ఊర్లలో  రెండు ఇడ్లి పావలా,  రెండు పూరి అర్ధ రూపాయి, ఉల్లిపాయ దోసె అర్ధ రూపాయి ఉండేవి.  స్వీట్ యాభై గ్రాముల బరువున్న ముక్క యాభై పైసలు.

  

అయితే ఈ సర్వర్లు కొందరు యజమానులు మోసం చేసేవారు.   ఎలాగంటే వీరు విధుల్లో లేనపుడు వ్యాపారులు,  ఉద్యోగస్తుల ఇళ్లకు వెళ్లి అయిదు రూపాయలు, పదిరూపాయలు అప్పుగా తీసుకునేవారు.  వాటిని తీర్చడం వాళ్ళ వల్లయ్యేది కాదు.  అందుకని వారు  హోటల్ కు వచ్చినపుడు టిఫిన్ బిల్ రెండు రూపాయలు అయితే రూపాయిన్నర వేసి ఇచ్చేవారు.  వంటవాళ్లు లోపల ఎక్కడో ఉండేవారు.  యజమాని ముందుగదిలో గల్లా పెట్టె   దగ్గర  ఉండేవాడు.  చిన్న చిన్న ఊళ్లు  కావడం వలన అందరూ ఒకరికొకరు  పరిచయం కలిగి ఉండేవారు.  అందువలన వారు ఏమి తిన్నారు ఎంతయింది అనే విషయాలు పట్టించుకునేవారు కారు.  ఈ సర్వర్లు చేసే మోసాల కారణంగా కొంతమంది యజమానులు దివాళా తీసి హోటల్ ను మూసెయ్యాల్సి వచ్చేది.  తొందరగా మేలుకున్న యజమాని ఆ సర్వర్ ను నాలుగు తన్ని బయటకు గెంటేసేవాడు.   


1995  వరకు మన రాష్ట్రాల్లో దాదాపు అన్ని హోటల్స్ ఇలా సర్వర్లతో కళకళలాడేవి.  కానీ, ఆ తరువాత సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్ వచ్చేసాయి.  రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుని టిఫిన్స్ అమ్మే పధ్ధతి వచ్చింది.  హోటళ్లలో అయిదు రూపాయలు ఉండే దోశ బయట బండిమీద ఒక్క రూపాయి ఉండేది.  2000  ప్రాంతంలో అనుకుంటాను..దిల్సుఖ్నగర్ వేంకటాద్రి టాకీస్ ముందు వరుసగా పది బండ్లు ఉండేవి. వారు ఒక్క రూపాయితో దోసెను అమ్మటం స్టార్ట్ చేశారు.  వారి దెబ్బకు అక్కడే ఉన్న హరిద్వార్ హోటల్ దివాళా తీసి మూతపడింది.  హరిద్వార్ లో అప్పుడు దోశ అయిదు రూపాయలు!   


సర్వర్లను పోషించడం ఆర్థికభారం అని భావించిన హోటళ్ల యజమానులు సెల్ఫ్ సర్వీస్ హోటళ్లను ప్రారంభించారు. వీటిలో ముందుగానే టోకెన్ తీసుకోవాలి.  టోకెన్ చూపిస్తేనే మనకు టిఫిన్ ప్లేట్ ఇస్తారు.  కూర్చోడానికి కుర్చీలు తీసేసారు.  గోడకు కొట్టిన ఒక పొడవాటి చక్క మీద ప్లేట్ పెట్టుకుని నిలుచుని తినాలి.  చట్నీ మళ్ళీ కావాలంటే మనమే వెళ్లి వేయించుకోవాలి.   ఈ సంప్రదాయం కారణంగా వేలాదిమంది సర్వర్లు ఉపాధిని కోల్పోయారు.  


ఏ మాటకామాటే చెప్పుకోవాలి.  పెద్ద పెద్ద కార్పొరేట్ హోటళ్లలో టిఫిన్లకన్నా బయట బండ్ల మీద అమ్మే టిఫిన్లే నాకు నచ్చుతాయి.  మన కళ్ళముందే చేస్తారు.  ఉప్పుకారాలు మన అభిరుచికి తగినట్లుగా ఉంటాయి.  నిన్న జూబిలీ హిల్స్ లో ఒక పెద్ద హోటల్ కు వెళ్ళాము టిఫిన్ చేద్దామని.  అక్కడ రెండు ఇడ్లీ 120  రూపాయలు.  రెండు పూరి 180  రూపాయలు.  ఉల్లిపాయ దోశ 200  రూపాయలు.  ఇడ్లీ గోరువెచ్చగా ఉన్నాయి.  సాంబార్ ఉగ్గుగిన్నెతో తెచ్చాడు.  నాలుగుసార్లు మళ్ళీ అడగాల్సివచ్చింది.   చట్నీ ఎంత పల్చగా ఉన్నదంటే దానికన్నా మంచినీళ్లు చాల చిక్కగా ఉంటాయి.  ఉప్పు కారం అనేవి అనే రెండు పదార్ధాలు ఈ ప్రపంచంలో ఆ ఉంటాయని ఆ హోటల్ యజమానులకు తెలుసో తెలియదో తెలియదు.    ఇద్దరం తిని అయిదు వందల బిల్లు కట్టి వెంటనే NTV  ఆఫీస్ సమీపంలో ఒక బండి హోటల్ ఉంటే వెళ్ళాము.  సాంబార్ పెద్ద గంగాళంలో కుతకుత ఉడుకుతుంది.  దానిలో పాతిక వడలు మునకలు వేస్తున్నాయి.  పొగలు కక్కుతున్న ఆ సాంబార్ ను చూడగానే ప్రాణం లేచివచ్చింది.  ఇడ్లీ అడిగాం.  పెద్ద పేపర్ కప్పులో ఇడ్లీ వేసి నిండా సాంబార్ పోసి, ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి  ఇచ్చాడు.  అమృతం కూడా అంత రుచిగా ఉండదేమో!  ఒక్క ఇడ్లీకే పావు లీటర్ సాంబార్ అయిపోగా మళ్ళీ బౌల్ నిండా పోశాడు.  ఇద్దరం చెరో రెండు ఇడ్లీ తింటే ముప్ఫయి అయిదు రూపాయలు అయింది బిల్! .   


మళ్ళీ ఆ పాత రోజులు  వస్తాయా?  అలాంటి వాతావరణాన్ని మళ్ళీ చూడగలమా?

( వాట్సప్ నుండి సేకరణ)

కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 


  గమనిక -


          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.


     

       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శ్రద్ధా విశ్వాసాలు

 శ్లోకం:☝️

*వాచ్యం శ్రద్ధాసమేతస్యపృచ్ఛతశ్చ విశేషతః ।*

*ప్రోక్తం శ్రద్ధావిహీనస్యారణ్యరుదితోపమమ్ ॥*


భావం: శ్రద్ధా విశ్వాసాలు ఉన్నవాడికి మరియు ముఖ్యంగా ఆసక్తిగా ప్రశ్నలు అడిగేవాడికి అన్నీ చెప్పవచ్చు. ఆ రెండు లేనివాడికి ఏమి చెప్పినా మనకు కంఠశోషే తప్ప వాడు వినడు కనుక అది అరణ్యరోదనతో సమానం.

అంటే-

_చెప్పేవాడికి వినేవాడు లోకువ. విననివాడికి చెప్పేవాడు లోకువ_ అన్నమాట! 😋

అసంఖ్యేయో ప్రమేయాత్మా

 🙏శ్లోకం 

అసంఖ్యేయో ప్రమేయాత్మా                   

విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|                         

సిద్ధార్థః సిద్ధసంకల్పః                           

సిద్ధిద సిద్ధి సాధనః||


ప్రతిపదార్ధ:


అసంఖ్యేయః -లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.

అప్రమేయాత్మా - కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.

విశిష్టః -అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.

శిష్టకృత్ -తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.

శుచిః -(157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.

సిద్ధార్థః -సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.

సిద్ధసంకల్పః -సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.

సిద్ధిదః -భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.

సిద్ధిసాధనః -సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.

పంచాంగం 18.08.2024 Sunday.

 ఈ రోజు పంచాంగం 18.08.2024 Sunday.


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాస శుక్ల పక్ష చతుర్థశి తిధి భాను వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ఆయుష్మాన్ తదుపరి సౌభాగ్య యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చతుర్థశి రాత్రి 03:03 వరకు. 

ఉత్తరాషాఢ పగలు 10:11 వరకు.


సూర్యోదయం : 06:03

సూర్యాస్తమయం : 06:36


వర్జ్యం : మధ్యాహ్నం 01:51 నుండి 03:18 వరకు.


దుర్ముహూర్తం : సాయంత్రం 04:56 నుండి 05:46 వరకు.


అమృతఘడియలు : 10:38 నుండి 12:05 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

సౌందర్యలహరి

 . *🌹సౌందర్యలహరి ప్రారంభం🌹*



*🍁ముముక్షువుల అర్హతను బట్టి వారి జ్ఞాన సముపార్జనకు సహాయపడేటట్లు ఆదిశంకరాచార్యులు చేసిన ప్రస్థానత్రయ భాష్యాలు (బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత), ప్రకరణ గ్రంథాలు (ఆత్మబోధ, వివేకచూడామణి, అపరోక్షానుభూతి వంటివి) కాకుండా మన స్థాయి వారికోసం చేసిన స్తోత్రాలలో శివానందలహరి, సౌందర్యలహరి ముఖ్యమైనవి*.


*🍁అయ్యవారి గురించి చేసిన స్తోత్రంలో 'ఆనందం' అనే మాట వాడితే, అమ్మవారి స్తోత్రానికి వచ్చేటప్పటికి 'సౌందర్యం' అనే శబ్దం ఎందుకు వాడారు? మనకు తెలుసు -- సుందరుడు పురుష శబ్దం, సుందరి స్త్రీ శబ్దం. అయితే అమ్మవారు కేవలం సచ్చిదానందస్వరూపిణి. ఆ స్వరూపానికి లింగభేదం అన్వయించదు. విశ్వమంతా వ్యాపించి వున్న స్వరూపమది. ఆమె తప్ప మరొకటి లేదు. అది సాధన వల్ల మాత్రమే తెలుసుకోగలిగిన తత్వము. ఆమెయే చైతన్యము, ఆ చైతన్యమే సౌందర్యం. ఆ సాధనయే శ్రీవిద్యోపాసన. ఇక లహరి అంటే కెరటాలు , తరంగాలు; నిరంతరం ఒకదాని వెనుక ఒకటిగా ప్రవహించటం. అమ్మవారి చిచ్ఛక్తి ఆ విధంగా ప్రపంచమంతా ప్రసరిస్తూ ఉంటుంది. శివానందలహరి, సౌందర్యలహరిలలో ఏది గొప్పది అంటే ఒక్కటే చెప్పవచ్చు. అందమే ఆనందం అని. ఏది ఆనందం కలిగిస్తుందో అదే అందం. చైతన్య రూపిణితో తాదాత్మ్యం కలిగించే ఆనందమే శివానందం, సచ్చిదానందం, సత్యం-శివమ్-సుందరం*.


*🍁శంకరుల స్తోత్రాలు ఉపాసనా సంబంధమైనవి, మంత్ర శక్తి కలిగినవి. ఏ దేవతనుద్దేశించి స్తోత్రం చేస్తున్నామో, ఆ దేవత ఈ స్తోత్ర నాదంలో ఉంటుంది. ఆత్మవిద్య సాధనలో చిత్త ఏకాగ్రత అవసరం. అట్టి ఏకాగ్రతను ఉపాసన ద్వారా పొందవచ్చు. ఉపాసన ద్వారా* *అమృతమును పొందుతున్నాను అంటుంది ఉపనిషత్. అమృతత్త్వము అంటే మృత్యువు లేకపోవటం. అంటే ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందని కాదు. మృత్యువును కూడా సాక్షీభూతుడిగా చూస్తాడు జీవుడు, ఎలాటి దుఃఖము, చింత లేకుండా. దేహమే నేను అనుకోవటం అవిద్య, అజ్ఞానం. ఉపాసన ద్వారా ఈ అవిద్యను దాటి బ్రహ్మజ్ఞానమును పొందాలి. భక్తి, యోగ, జ్ఞాన సమన్వయమే శ్రీవిద్య. అది బ్రహ్మజ్ఞానాన్నిస్తుంది. నిరంతర సచ్చిదానందమును కలిగిస్తుంది*.


*🍁సౌందర్యలహరిలో ప్రధానమైన అంశం శివ, శక్త్యైక భావం. శివ, శక్తుల ఐక్య దర్శనమే 'సమయాచారము' అన్నారు*. *మన శరీరంలోనూ, ప్రపంచంలోని అన్ని జీవుల్లోనూ, వస్తువుల్లోనూ, అవసరమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి పరమేశ్వరునిది. ఆయననూ, ఈ శక్తినీ కలిపి దర్శించగలగాలి మనం. ఆ శక్తియే మంగళం. శివునిది కాబట్టి శివే. ఈ శక్తి* *పురుషార్ధములను సాధించిపెడుతుంది కనుక సర్వార్థ సాధికే. శివుడిని వదిలేసి శక్తిని మాత్రమే పూజించటం వామాచారం అనబడుతుంది. దక్ష ప్రజాపతి అలా అనుకొనే భ్రష్టత్వం పొందాడు. శంకరులు అందుచేతనే శివానంద లహరిలోనూ, సౌందర్యలహరి లోనూ, ప్రారంభ శ్లోకాలు శివ, శక్తుల ఏకత్వాన్ని, సామ్యతను ప్రస్తుతించారు*. 


*🍁ఇవి నామ సామ్యం: శంకర/శాంకరి రూపసామ్యం ఇద్దరూ త్రినేత్రులు, చంద్రకళాధారులు*. *ఆయన కామేశ్వరుడైతే, ఈమె కామేశ్వరి అధిష్టాన సామ్యం: శివ శక్త్యాత్మికములు కనుక లింగార్చన, శ్రీచక్రార్చన ఏది* *చేసినా ఇద్దరికీ కలిపి చేసినట్లే కృత్యసామ్యం: సృష్టి, స్థితి, లయము, తిరోధానము (మాయ ఆవరించటం) అనుగ్రహము (ఆ మాయను తొలగించటం) అనబడే పంచకృత్యములు చేయటంలో* *అమ్మవారు అయ్యవారికి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది. అమ్మ నామాల్లో సామరస్య పరాయణ అన్నారందుకే.లలితా* *సహస్రనామాల్లోని చివరి నామమైన శివా శివ శక్త్యైక రూపిణీ తో సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం ప్రారంభం అవుతుంది*. *🍁లలితా నామాలు ఇందులో శబ్దపరంగా, భావపరంగా కనబడతాయి*.


*శంకరులు ఈ స్తోత్రం చేయటం వెనుక ఒక ఇతిహాసం చెప్తారు. ఆయన దేశాటనం చేస్తూ కేదారంలో తపస్సు చేస్తూండగా దత్తాత్రేయ దర్శనం లభించి. వారి ఆదేశానుగ్రహాలతో యోగశక్తితో కైలాసం వెళ్తారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులను భక్తితో ప్రార్ధించగా సంతసించిన ఈశ్వరుడు అయిదు స్ఫటిక లింగములను, అమ్మవారు నూరు శ్లోకాల స్తోత్ర గ్రంథాన్ని శంకరులకు బహుకరించారట. ఆయన తిరిగి వస్తుండగా నందీశ్వరుడు అడ్డగించి విషయం తెలుసుకొని అయిదు స్ఫటిక లింగములను తీసుకువెళ్ళమని అమ్మవారిచ్చిన నూరు శ్లోకాలలో 41 మాత్రమే శంకరులకిచ్చి మిగిలినవి తనవద్దనే ఉంచుకొన్నాడట*. 


*అంటే భోళా శంకరుడు భక్తులకు వారు అడిగినవన్నీ ఇచ్చినా అర్హతను నిర్ణయించి ఎవరికి ఎంతవరకు అవసరమో ఇస్తాడట నందీశ్వరుడు. అందుకే మనకు లోకంలో ఒక సామెత వుంది. దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వడు అని. ఇక అప్పుడు శంకరులు మారు మాటాడక చిదంబర క్షేత్రానికి చేరి అమ్మవారి పై మిగిలిన 59 రచించారట. చిదంబరం శ్రీచక్ర క్షేత్రమని చెప్తారు. ఇక్కడ అమ్మవారు శివకామసుందరి. నటరాజ స్వామి సాక్షాత్తు శ్రీచక్ర రూపమేనని చెప్తారు.*


🍁 *అమ్మవారు అనుగ్రహించిన 41 శ్లోకాల్లో దివ్యమైన మంత్ర*, *తంత్ర, యోగ, ఉపాసనా రహస్యములు నిక్షిప్తమై* *ఉన్నాయట ఇవి సచ్చిదానంద తత్త్వమును చెప్తాయి*. 


*🍁మిగిలిన శ్లోకాల్లో అమ్మవారి సౌందర్య వర్ణన వేదాంతపరమైన అనేక విషయములను సూచిస్తాయి*. 


*🍁శంకరులు కైలాసంనుండి తెచ్చిన అయిదు స్ఫటిక లింగాలు ఇప్పటికీ త్రికాల పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాయి*. ఇవి


 *🚩ముక్తిలింగం - కేదారనాథ్* 

 *🚩వర లింగం - నీలకంఠ క్షేత్రం* (నేపాల్)

*🚩భోగలింగం - శృంగేరి శారదా పీఠం*

*🚩మోక్షలింగం - చిదంబరం* *నటరాజ ఆలయం* 

*🚩యోగలింగం - శ్రీ కంచీ కామకోటి పీఠం*. 


*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే* 

 *శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే*.🙏🏻*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️

తెలుగు పలుకుల తేనెలు!

 


తెలుగు పలుకుల తేనెలు!


సీ:వానిముందలబొట్టు,వానిదోవతికట్టు,

వానియామెడచుట్టు,

వానిజుట్టు,/

వానిమాటలయింపు,వానివన్నెలసొంపు,

వానిచెంపలకెంపు,

వానివంపు /

వాని మైగలతావి,వానిపిల్లనగ్రోవి,

వాని నడలఠీవి,వానిమోవి,/

వానిదౌపెనురొమ్ము,వానిచూపులయమ్ము,

వానియాకటియొమ్ము,వానిదమ్ము /

వానికే చెల్లునోచెలి,వలచితతని

వేగమేగొనిదెమ్ము,నేనాగలేను,

అతను నమ్ములు బాధించె నంచయాన!

చితికిపోదు నే విరహంపు హతికి దూలి.

-నీలిదొఱవన్నెలు-నీలకంఠ-


శ్రీకృష్ణవిలాసమనే యీచిరుకృతిని చదువుతున్నప్పుడు.మరల దక్షిణాంధ్రయుగంలోకి 

వెళ్ళామా ?అనే భ్రాంతికి లోనయ్యాను.ఇంతచక్కటి తెలుగు పలుకులమోహరింపు 

శబ్దాలంకార ప్రయోగ చాతుర్యం ఈమధ్య నేనెక్కడా చవిచూడలేదు.

తత్సమ పదప్రయోగాధిక్యంతో.తెలుగుపదాలప్రయోగం విరళమౌతున్న యీకాలంలో 

చిక్కటి తేటతెనుగుపదాలతోదేశికవితా వైభవంచవిచూపి, విందుచేశారు 

నీలకంఠంగారు.వారు మన "ముఖపుస్తక మిత్రులవటం మనభాగ్యం."

వృత్తిరీత్యావారు తెలుగు అధ్యాపకులు కాకపోయినా,ప్రవత్తిరీత్యా కవులై అపుడపుడు 

పద్యాలురచిస్తూ ఈశ్రీకృష్ణవిలాసకృతికి"-అక్షరరూపాన్ని 

సంతరించారు.శతాధికపద్యాలతో,వెలగట్టుటకు అశక్యమైన యీకృతిని వీరు 

వెలలేకుండానే అందించటం మరోవిశేషం.

శ్రీకృష్ణుని అష్ట మహిషులలో,నీలాసుందరి,మిత్రవిందాదుల పరిణయాల వర్ణనమే 

యీకృతి.చిరుకావ్యంలో అష్టవిధ శృంగారనాయికావర్ణమపురూపం!

దేశికవితకు చలువపందిరులు వేసి,కందాలతో 

మకరందాలుకురిపించి,తెలంగాణమాండలికపదాలఅందాలనువిస్తరింపజేసిన,

నీలకంఠరావుగారు ఆయురారోగ్యాలతో విసిల్లుతూ మరిన్ని కమ్మని కావ్యాలను రచించి 

రసజ్ఙులమనస్సును రంజింప జేయగోరుతున్నాను. 

                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జంధ్యాల పూర్ణిమ

 *జంధ్యాల పూర్ణిమ , శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం*

శ్రావణ పూర్ణిమను *జంధ్యాల పూర్ణిమ* అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, జప, అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము *‘యజ్ఞము’* *‘ఉపవీతము’* అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే *‘యాగము’* *‘ఉపవీతము’* అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే *యాగకర్మ చేత పునీతమైన దారము* అని అర్థము. 


యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు.

శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన *‘అమరకోశాన్ని’* రచించిన అమరసింహుడు *‘సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః’* అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం , వేదాన్ని అధ్యయనం చేయడం *‘ఉపాకరణం’*. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ.

మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను , జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని *‘ద్విజుల’* అని అంటారు. ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు , గాయత్రీపూజ చేయుటకు , ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. *‘సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్’* బ్రహ్మతత్వాన్ని సూచించడానికి , వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం. యజ్ఞోపవీతాన్ని , శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని , ఒకటి అమ్మ కడుపునుంచి పుట్టడం జన్మ అయితే , ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట.

ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. *యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము* రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు. ఆదిదేవుడు , సర్వమంగళా (పార్వతీ)పతి , సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని *‘నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః’* అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని , యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని , ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం , రెండవ తంతువులో అగ్నిదేవుడు , మూడవ తంతులో నాగదేవత , నాలుగవ తంతువులో సోమదేవత , ఐదవ తంతువులో పితృదేవతలు , ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు , ఏడవ తంతువులవో వాయుదేవుడు , ఎనిమిదవ తంతువులో సూర్యుడు , తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.

యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని , గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను , ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.


బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు , అధ్యాపకులు , గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. *జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ* అలా ప్రసిద్ధి చెందింది.

ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. *ఉపాకర్మలోని విశేషం* ఇది. ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారుచేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని , లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని , సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.

యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం , సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ , యజ్ఞోపవీతాన్ని చేసుకుని *‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం’* అనే శ్లోకాన్ని పఠించి , మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత (జిగి) యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి.

అశౌచాలవల్ల , ఆప్తుల జనన మరణ సమయంలో , గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి.

ఉపాకర్మ సందేశం

ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా , పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది. శారీరక , మానసిక పరిపక్వతకు , పరిశుద్ధతకు యజ్ఞోపవీతమ్ దివ్యౌషధమని పెద్దలు చెబుతారు.

దినేదినే గయా

 👏శ్లో|| దినేదినే గయా తుల్యం భరణ్యాం గయ పంచకే, దశ తుల్యం వ్యతీపాతే, పక్షమధ్యేతు వింశతిః, ద్వాదశ్యాం శతమిత్యాహుః,అమాయాంతు సహస్రకం.

🌹🌹🌹🌹🌹🌹


🌹భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే పితృ పక్షాల యందు మనం శ్రాద్ధం చేయడం వల్ల గయాశ్రాద్ధ ఫలితం లభిస్తుంది. అందులోని విశేష ఫలితాలు గమనిద్దాం.👇


🌹1.పితృ పక్షాల యందు ఏ ఒక్క రోజు శ్రాద్ధం చేసినా గయలో ఒకసారి చేసినంత శ్రాద్ధ ఫలితం లభిస్తుంది.


🌹2.భరణీ నక్షత్రం ఉన్న రోజును మహాభరణీ అంటారు.ఆరోజు చేసే శ్రాద్ధం వల్ల గయలో ఐదు సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹3.ఏ రోజైతే వ్యతీపాతయోగం ఉన్నదో, దానిని వ్యతీపాత మహాలయం అంటారు.ఆరోజు చేసిన శ్రాద్ధం వల్ల గయలో పదిసార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹4.పక్షమధ్యేతు అనగా మధ్యాష్టమీ (అష్టమి ఉన్న రోజు) రోజు శ్రాద్ధం చేయడం వల్ల గయలో ఇరవై సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹5.ద్వాదశి ఉన్న రోజు శ్రాద్ధం చేయడం వల్ల గయలో వందసార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹6.మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం వల్ల గయలో వెయ్యి సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.

  🌹 మనజీవితం లో ఒక్కసారి అయినా గయలో శ్రాద్ధం చేస్తామని,ఉత్తమ లోకాన్ని మన ద్వారా పొందే అవకాశం కల్పిస్తామని పూర్వం ఎక్కువ మంది సంతానాన్ని పొందగలిగే వారు,

   మనం శ్రాద్ధాలు  శ్రద్ధగా చేయడం ద్వారా  పితృదేవతలు ఆయుస్సు, సంతానం,ధనం, సుఖం,సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తారు.


 ప్రతి అమావాస్య రోజున తర్పణం మరియు ప్రతి సంవత్సరం శ్రాద్ధం, అలాగే చనిపోయిన వారికి కర్మకాండ చేయక పోవటం వల్ల నిరాశ చెందిన పితృదేవతలు శాపనార్థాలు పెట్టుటయే కాకుండా వీడు మా వంశం లో వ్యర్థం గా జన్మించాడు అని బాధ తో

కన్నీరుమున్నీరుగా నరకయాతన అనుభవిస్తారు.

ఆ పాపం మూట కట్టుకుని ఉన్న మనం కష్టాలపాలు అవుతాము.విద్యరాక, పెళ్లి కాక, పెళ్లి అయినా సంతానం కలగకుండా, సంతానం కలిగినా ఆ సంతానం అంగవైకల్యం గలవారు గా,మూగ, చెవిటి, అంధులు గా,రోగగ్రస్తులుగా అనేక

విధాలుగా పితృ శాపం అనుభవించక తప్పదు.

   శ్రాద్ధం వదలకుండా శ్రద్ధగా చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులతో

సుఖసంతోషాలు పొందగలుగుతాము కదా అని శ్రద్ధ తో ఆచరిస్తే మన జీవితం సుఖమయం గా ఉంటుంది. 

🌹జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 🌹