18, ఆగస్టు 2024, ఆదివారం

తెలుగు పలుకుల తేనెలు!

 


తెలుగు పలుకుల తేనెలు!


సీ:వానిముందలబొట్టు,వానిదోవతికట్టు,

వానియామెడచుట్టు,

వానిజుట్టు,/

వానిమాటలయింపు,వానివన్నెలసొంపు,

వానిచెంపలకెంపు,

వానివంపు /

వాని మైగలతావి,వానిపిల్లనగ్రోవి,

వాని నడలఠీవి,వానిమోవి,/

వానిదౌపెనురొమ్ము,వానిచూపులయమ్ము,

వానియాకటియొమ్ము,వానిదమ్ము /

వానికే చెల్లునోచెలి,వలచితతని

వేగమేగొనిదెమ్ము,నేనాగలేను,

అతను నమ్ములు బాధించె నంచయాన!

చితికిపోదు నే విరహంపు హతికి దూలి.

-నీలిదొఱవన్నెలు-నీలకంఠ-


శ్రీకృష్ణవిలాసమనే యీచిరుకృతిని చదువుతున్నప్పుడు.మరల దక్షిణాంధ్రయుగంలోకి 

వెళ్ళామా ?అనే భ్రాంతికి లోనయ్యాను.ఇంతచక్కటి తెలుగు పలుకులమోహరింపు 

శబ్దాలంకార ప్రయోగ చాతుర్యం ఈమధ్య నేనెక్కడా చవిచూడలేదు.

తత్సమ పదప్రయోగాధిక్యంతో.తెలుగుపదాలప్రయోగం విరళమౌతున్న యీకాలంలో 

చిక్కటి తేటతెనుగుపదాలతోదేశికవితా వైభవంచవిచూపి, విందుచేశారు 

నీలకంఠంగారు.వారు మన "ముఖపుస్తక మిత్రులవటం మనభాగ్యం."

వృత్తిరీత్యావారు తెలుగు అధ్యాపకులు కాకపోయినా,ప్రవత్తిరీత్యా కవులై అపుడపుడు 

పద్యాలురచిస్తూ ఈశ్రీకృష్ణవిలాసకృతికి"-అక్షరరూపాన్ని 

సంతరించారు.శతాధికపద్యాలతో,వెలగట్టుటకు అశక్యమైన యీకృతిని వీరు 

వెలలేకుండానే అందించటం మరోవిశేషం.

శ్రీకృష్ణుని అష్ట మహిషులలో,నీలాసుందరి,మిత్రవిందాదుల పరిణయాల వర్ణనమే 

యీకృతి.చిరుకావ్యంలో అష్టవిధ శృంగారనాయికావర్ణమపురూపం!

దేశికవితకు చలువపందిరులు వేసి,కందాలతో 

మకరందాలుకురిపించి,తెలంగాణమాండలికపదాలఅందాలనువిస్తరింపజేసిన,

నీలకంఠరావుగారు ఆయురారోగ్యాలతో విసిల్లుతూ మరిన్ని కమ్మని కావ్యాలను రచించి 

రసజ్ఙులమనస్సును రంజింప జేయగోరుతున్నాను. 

                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: