🙏శ్లోకం
అసంఖ్యేయో ప్రమేయాత్మా
విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|
సిద్ధార్థః సిద్ధసంకల్పః
సిద్ధిద సిద్ధి సాధనః||
ప్రతిపదార్ధ:
అసంఖ్యేయః -లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.
అప్రమేయాత్మా - కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.
విశిష్టః -అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.
శిష్టకృత్ -తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.
శుచిః -(157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.
సిద్ధార్థః -సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.
సిద్ధసంకల్పః -సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.
సిద్ధిదః -భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.
సిద్ధిసాధనః -సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి