2, మార్చి 2025, ఆదివారం

పలువురు తోడుండునపుడు

 *2030*

*కం*

పలువురు తోడుండునపుడు

అల విపినంబైనగాని ఆవాసమగున్.

నలుగురినెయ్యము లేనిది

బలమగు నగరంబునైన భారమె సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పలువురు తోడు గా ఉన్నప్పుడు అడివైనా నివాసయోగ్యమే. నలుగురి తో స్నేహం లేనప్పుడు నగరం లో అయినా బతుకు భారమే అవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మాతృ దేవోభవ

 మాతృ దేవోభవ 

పితృ దేవోభవ 

అతిథి దేవోభవ 

ఆచార్య దేవోభవ!


ఎదురుగా ఉన్న, కళ్ళెదుట ఉన్న సకల చరాచర జగత్తు లో ప్రతీ ఒక్కటీ దైవాంశ సంభూతమే, విచిత్రం ఏమిటంటే మన దృష్టి పరిమితమైనది కనుక గురువు ద్వారా తగిన సాధనతో అర్హతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*పరమశివుడు తీసుకున్న విషాన్ని గూర్చి శంకరులు ఈశ్వరుణ్ణి మూడు విధాలుగా ప్రశ్నిస్తున్నారు.*


*శ్లోకం: 32*


*జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేళః కథంవా త్వయా*

                     

*దృష్టః కించ కరే ధృతఃకరతలే కింపపక్వ జంభూఫలం ?*

                     

*జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశేభృతః*


*కిం తే నీలమణి ర్విభూషణ మయం శంభో ! మహాత్మన్వద !!*


*పదవిభాగం:~*


*జ్వాలోగ్రః _ సకలామరాతిభయదః _ క్ష్వేళః _ కథం _ వా _ త్వయా _ దృష్టః - కిం _ చ _ కరో _ ధృతః _ కరతలే _ కిం _ పక్వ ఓం శ్లో _ జిహ్వాయాం నిహితః _ చ _ సిద్ధఘుటికా _ వా _ కంఠదేశే _ భృతః _ కిం _ తే _ నీలమణిః - విభూషణమ్ _ అయమ్ _ శంభో _ మహాత్మన్ _ వద.*


*తాత్పర్యము:~*


*మహాత్మా ! శివా! తీవ్ర జ్వాలలు క్రమ్ముతూ, సకలదేవతలకునూ మిక్కిలి భయమును పుట్టించే, ఆ కాలకూట విషాన్ని కన్నులతో  నీవు ఎలా చూశావు ? అంతేగాక అరచేతిలో దాన్ని ఎలా ఉంచుకున్నావు ?  అదేమైనా పండిన నేరేడు పండా ఏమిటి ?అదీగాక దానిని నాలుక మీద వేసుకున్నావు. అది సిద్ధఘుటికయా ఏమిటి ?  మఱియూ కంఠమునందు నిలుపుకున్నావు.  ఇది నీకు ఆభరణంగా వుండే ఇంద్రనీలమణియా  ?  చెప్పు.*


*వివరణ:-*


*ఈశ్వరుడు దేవతల ప్రార్థనపై కాలకూట విషాన్ని తన కంఠంలో  చిన్న సిద్ధ ఘుటికలా తన కంఠంవద్ద దాన్ని నిలుపుకున్నాడు. లోకాల్ని దగ్ధము చేయగల ఆ విషము శివుని ఏమీచేయలేక పోయింది. అంతేగాక స్ఫటికంలా తెల్లనైన  వన్నెగల  ఆ శివుని కంఠములో  ఇంద్రనీలమణిలా ఆభరణంగా అది ప్రకాశించింది. అందువల్లనే  ఈశ్వరుడు నీలకంఠుడని ప్రఖ్యాతి వహించాడు.*


*"నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ,  శ్రీమన్మహాదేవాయనమః ". అని వేదము ఈశ్వరుని ప్రస్తుతించింది.*


*శివుడు కాలకూట విషాన్ని  రస ఘుటికలా మ్రింగాడని, శ్రీనాథమహాకవి కూడా తన భీమేశ్వర పురాణంలో ఇలా చెప్పాడు.*


*కటుకమగు విషము విషధర*

 *కటకంబగు కేఁలబూని కౌతూహలియై*

*ఘుటికా సంసిద్ధుడు రస*

*ఘుటికయునుంబోలె శివుడు గుటుకున మ్రింగెన్ !!*


*తాత్పర్యం:~*


*ఈశ్వరుడు తీవ్రమైనవిషాన్ని , సర్పమును కడియంగా ధరించిన తన చేతితో పట్టుకొని, ఘుటికా యోగంలో నేర్పరియైన సిద్ధుడు, రసగుళికను మ్రింగినట్లుగా , ఆ విషాన్ని గుటుక్కున మ్రింగాడు.*


*విషాన్ని నేరేడు పండుతో పోల్చడం  అన్న పోలికనుగూడా , శంకరుల నుండియే ఇతర కవులు గ్రహించారు..*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

అర్చకుడు కావాలండి

 అయ్యా  సభ్యులందరకి కూడా నమస్కారమండి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలయగూడెం గ్రామంలో శ్రీ అచ్చమ్మ పేరంటాల తల్లి గుడి సమీపంలో ఉన్నటువంటి శ్రీ భీమ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు కావాలండి వేతనం 10000 జీతం ఇస్తారు ఇల్లు ఇస్తారు  ఒక బియ్యం కట్టేస్తారు అదేవిధంగా కార్తీక మాసంలో  ఎలా లేదన్న సరే 1,50,000 వస్తుంది దాంతోపాటు ఈ  ఆలయం పక్కనే ఉన్నటువంటి అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి జాతర 9 రోజులు చేస్తారు ఆ సమయంలో లక్ష రూపాయలు పైనే వస్తుంది ఆదాయం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయగలరు 9177089899 హర్ష శర్మ గారు

భజనం - భోజనం*

 *🌺🌸☸️🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸


🙏జై శ్రీమన్నారాయణ🙏*


*అంతర్యామి*


*భజనం - భోజనం* 


*మనిషి బతకడానికి భోజనం అవసరం. మంచివాడిగా బతకడానికి భజనం అత్యవసరం. భోజనం లేకుండా జీవించడమెలా దుర్లభమో, భగవద్భజనం లేకుండా జీవించడం అలాగే నిష్ఫలమన్నది పెద్దల మాట.*


ఆహారం శరీరారోగ్యానికి, శరీర పోషణకు ఎంతగానో ఉపకరిస్తుంది. భజనం ఆంతరిక, ఆధ్యాత్మిక పోషణకు మరింతగా వినియోగపడుతుంది. మానవజీవన వికాసానికి ఈ రెండూ ముఖ్యమైనవి, అవసరమైనవి. వీటిని సమతౌల్యంతో పాటించాలి.


*భోజనం సరైంది లభించనప్పుడు భజనం కూడా తృప్తిగా చేయలేం. అదే విధంగా భజన చెయ్యలేనప్పుడు భోజనం చేసే అర్హత తనకు లేదని భావించుకోవాలి*. 


'ఏ రోజు దైవప్రార్ధన చెయ్యలేకపోతే, ఆ రోజు నా జీవితంలో పూర్తిగా వ్యర్ధమైన రోజు' అని బాపూజీ అనే వారు.  ఇదే వ్రతాన్ని స్వీకరించగలిగితే, భగవంతుడితో మనకు అత్యంత గాఢమైన అనుబంధం ఏర్పడటంలో ఆలస్యమే ఉండదు. హితం కలిగించేది, సులభంగా జీర్ణమయ్యే సాత్వికాహారం స్వీకరించేవారే ఆరోగ్యవంతంగా ఉంటారని, వారి మనసే సర్వదా ప్రసన్నంగా ఉంటుందని గీత చెబుతోంది. మిత ఆహారం అమితమైన ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుందనడంలో సందేహం లేదు.


పంచభూత నిర్మితమైన మన దేహం, పంచభూతాల చేతనే వృద్ధి పొందుతుంది. సమాన స్వభావం గల పదార్ధంవల్ల సమాన ద్రవ్యం అభివృద్ధి చెందగలదన్నది ఆయుర్వేద సిద్ధాంతం. అటువంటి శరీరాన్ని, ఉన్న నాలుగు రోజులూ సంతులితాహారంలో పోషించుకుంటూ జీవనధర్మాచరణకు సంసిద్ధులం కావాలి. 


బాల్య, యావన. కౌమార, వార్ధక్య దశల్లో ప్రతి దశను మంచి ఆహారంతో పరిపుష్టం చేసుకోవాలి. 'అపధ్యం' అని తెలిసే చాపల్యంతో అతిగా భుజించకూడదు. అజ్ఞానంతో అపధ్యాన్ని పధ్యంగా భ్రమపడకూడదు. ఆహారంవల్ల పుట్టిన శరీరం ఆహార వైషమ్యంవల్లే నశిస్తుంది. 


*శరీరాన్ని దోచుకునేవి రెండు. అవి ఆహారం, నిద్ర. ఈ రెండూ ఎప్పుడూ మితంగానే ఉండాలి. అవి తగిన పాళ్లలో లేకపోతే శరీరం శీఘ్రంగా నాశనమైపోతుంది. బతుకు మెతుకు కోసం కాదు... బతకడం కోసమే మెతుకు అని గ్రహించాలి*. 


కర్మయోగమనేది అధికంగా భుజించేవాడికి, అసలు తిననివాడికి సిద్ధించదు. ఆహార, నిద్రలు పరిమితంగా ఉండాలి. *సత్వరజస్తమోగుణాలను ఆహారం ప్రభావితం చేస్తుంది. సత్వ గుణాన్ని సాత్వికాహారమే వృద్ధి చేస్తుంది. అదే మనిషిని సంస్కారవంతుణ్ని చేస్తుంది. తమోగుణం మానవుణ్ని దానవుడిగా మార్చివేస్తుంది. రజోగుణం మానవుణ్ని లోభిని చేస్తుంది. నిషేధిత కర్మలు చేయాలని ప్రేరేపిస్తుంది.* సోమరితనం, అహంకారం, మూర్ఖత్వం మొదలైన అవగుణాలకు మనిషి బానిసైపోతాడు. లోకంలోని హింస, దౌర్జన్యం, అత్యాచారం, అవినీతి, అధర్మం, మారణకాండ మొదలైన అకృత్యాలన్నింటినీ నిర్మూలించాలంటే అందరూ సాత్వికాహారాన్నే భుజించాలి. అదే మనిషిలోని ఆధ్యాత్మికచింతనా దృక్పథం పెంచుతుంది. భగవంతుణ్ని దగ్గరిగా చేరుస్తుంది. మోక్షార్హతను ప్రసాదిస్తుంది.


మంచి భోజనం మంచి భజనమే చేయిస్తుంది. భజనం చేసే శక్తి కలిగే మేరకే భోజనం తీసుకుంటే చాలు. అటువంటి భోజనమే సార్ధకమవుతుంది. శరీరాన్ని కాపాడుకోవడానికి ఆహారం అవసరమైనట్లే, ఆత్మ ఆరోగ్యానికి ప్రార్థన అంత అవసరం. ఆత్మకు ఆహారాన్ని చేకూర్చటం మన ప్రాథమిక ధర్మం. ధ్యానానికి అంకితమైపోవడమే అసలైన ప్రార్ధన. ఆత్మను ఆరాధించడమే అసలైన అర్చన. *శరీరంలో శక్తి ఉన్నప్పుడే తీర్ధయాత్రలు, పురాణపఠనం, సత్సంగం - ఈ మూడింటికి ప్రాధాన్యమిచ్చి అనుసరించటమే అసలైన భజనం*. ధర్మార్ధ కామ మోక్షాలకు ప్రధాన సాధనం దేహమే కనుక, దైవదత్తమైన పంచభూతాలను సేవించడమే మానవుడి పరమావధి.🙏


🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

ఓరిమితో-సాధనతో*

 *ఓరిమితో-సాధనతో*

               

ఋషి తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. కొన్నేళ్లపాటు సంఘ జీవనానికి దూరంగా, అరణ్యంలో ప్రశాంతంగా, తదేక దీక్షతో కూర్చుని, ఇహలోకాన్ని పూర్తిగా మరిచిపోయి, శరీరం చుట్టూ పుట్టలు పట్టి, జీవన్మరణ సంధి రేఖకు చేరువైనప్పుడు దైవ ప్రసాదిత వరం లభ్యమవుతుంది. 


చెట్టు కొమ్మన పువ్వు పూయగానే కాయగా, పండుగా రూపాంతరం చెందదు. దానికంటూ కొంత కాలవ్యవధి కావలసిందే! కొంగ తన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవడానికి చెరువులో ఒంటికాలి జపం ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే.


'సాధనమున పనులు సమకూరు' అన్నాడు వేమన. 


సాధనకు ఓపిక వెన్నెముక. ఎన్ని సద్గుణాలు ఉన్నా మనిషికి సహనం లేకపోతే ఏదీ సాధించలేడు.


భగవంతుడు సైతం తన భక్తుడిలో శ్రద్ధ, సబూరి ఉండాలంటాడు. నవ విధ భక్తులకు అదే పునాది. ధూప దీప నైవేద్యాలతో రెండు మంత్రాలు చదివి, నాలుగు పూలు వేసి చేసే పూజకు, సహస్ర నామార్చన, కోటి కుంకుమార్చన, సహస్ర ఘటాభిషేకం వంటివి భక్తులకు ఓపికను అలవరచే పూజా ప్రక్రియలకు ఎంతో భేదం ఉంది. నియమ నిష్ఠలతో, దేవుడిలో మనసును లయం చేసి నిర్వహించే పూజా విధానంలో, ఒక్కసారన్నా భక్తుడి మనసు భగవంతుడిలో లీనం అవుతుంది. మనిషికి జన్మించిన మానవుణ్ని, జనన మరణాల్ని జయించేలా చేసి దేవుడిలో ఐక్యం చేసేది అంతటి భక్తిప్రపత్తులే.


భక్త శబరి శ్రీరాముణ్ని ఇష్టదైవంగా భావించింది. ఒక తల్లిగా ప్రేమించి, దూరమైన కొడుకు రాకకోసం తపించి, తల్లడిల్లిపోతూ ఎదురుచూసే తల్లిలా రామయ్య కోసం ఎంతోకాలం ఓపికగా నిరీక్షించింది. తన భక్తితో జీవిత పర్యంతం రామనామం జపించి, అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనం పొంది, అనిర్వచనీయ ఆనందంతో, అత్యంత ప్రీతితో శ్రీరాముడికి ఫలాలు తినిపించి రామ హృదయ సాయుజ్యాన్ని పొందింది.


కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటిదాకా తొందరకు తావీయకుండా ఓపిక వహించాలి. అప్పుడే అనుకున్నది ఫలవంతమవుతుంది. నేడు దివిజ గంగ నీరు తాగుతూ, అందులో మునకలు వేసి పవిత్రులం అవుతున్నామంటే భగీరథుడి తపస్సే కారణం. 


కౌరవుల దురాగతాలను ఓపిగ్గా, మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయం. 


రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓరిమితో భరించిన శ్రీ మహావిష్ణువు, తన అవతార బలంతో వాళ్లను తుదముట్టించాడు. 


శిశుపాలుడి నూరు తప్పులు ఓపిగ్గా ఓర్చిన శ్రీకృష్ణుడు- అతడి వాచాలత్వాన్ని సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు. శిరస్సు ఖండిస్తాడు.


ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడానికి మహాభారత యుద్ధం తరవాత భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఓపికగా స్వచ్ఛంద మరణం కోసం వేచి చూశాడు. 


ధర్మరాజుకే కాకుండా లోకానికంతటికీ ద్వాపరయుగం చివరిదశ, కలియుగం ప్రారంభం కాబోతున్న దశలో అవసరమైన ధర్మసూక్ష్మాలు, రాజధర్మాలు, విష్ణుసహస్రనామం తెలియజేసిన మహాజ్ఞాని భీష్ముడు.


జీవితానికి పరిపూర్ణత సిద్ధించడానికి చెప్పేవాళ్లు గురుస్థానంలో కూర్చుని తమ అనుభవసారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెబుతారో, వినేవాళ్లూ అంతే ఓపికతో, శ్రద్ధతో వినాలి. ఆచరించాలి. ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువను సంతరించుకునేది అప్పుడే.✍️

హిందుస్థాన్

 హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్. [ Courtesy : Mohana ]


 ❤️ *Ministry of Home / Culture లో ఒక విభాగాన్ని ప్రారంభించి  గ్రామాలు /పట్టణాలు /మండలాలు / జిల్లాలు / నగరాలు  : పేర్లు మార్పు చేయించాలి* :❤️


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


🙏ఓం నమోవెంకటేశాయ 🙏

❓❓❓❓❓❓❓❓❓

*మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా..?*

               ➖➖➖


*1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ అసలు పేరు : ఆర్యవర్త!*


*2. కాన్పూర్*

*అసలు పేరు : కన్హాపూర్.*


*3. ఢిల్లీ*

*అసలు పేరు : ఇంద్రప్రస్థ.*


*4. హైదరాబాద్*

*అసలు పేరు : భాగ్యనగర్.*


*5. అలహాబాద్*

*అసలు పేరు : ప్రయాగ్.*


*6. ఔరంగాబాద్*

*అసలు పేరు : శంభాజీ నగర్.*


*7. భోపాల్*

*అసలు పేరు : భోజ్‌పాల్!*


*8. లక్నో*

*అసలు పేరు : లక్ష్మణపురి.*


*9. అహ్మదాబాద్.*

*అసలు పేరు : కర్ణావతి.*


*10. ఫైజాబాద్*

*అసలు పేరు : అవధ్.*


*11. అలీఘర్*

*అసలు పేరు : హరిగఢ్.*


*12. మీరాజ్*

*అసలు పేరు : శివప్రదేశ్!*


*13. ముజఫర్‌నగర్*

*అసలు పేరు : లక్ష్మీ నగర్.*


*14. షామ్లీ*

*అసలు పేరు : శ్యామాలి.*


*15. రోహ్తక్*

*అసలు పేరు : రోహితాస్పూర్.*


*16. పోర్బందర్*

*అసలు పేరు : సుదామపురి.*


*17. పాట్నా*

*అసలు పేరు : పాటలీపుత్ర.*


*18. నాందేడ్*

*అసలు పేరు : నందిగ్రామ్.*


*19. అజంగఢ్*

*అసలు పేరు : ఆర్యగఢ్.*


*20. అజ్మీర్*

*అసలు పేరు : అజయమేరు.*


*21. ఉజ్జయిని*

*అసలు పేరు : అవంతిక.*


*22. జంషెడ్‌పూర్*

*అసలు పేరు : కాళీ మతి!*


*23. విశాఖపట్నం*

*అసలు పేరు : విజత్రపశ్మ.*


*24. గౌహతి*

*అసలు పేరు : ప్రాగ్జ్యోతిష్‌పురా.*


*25. సుల్తాన్‌గంజ్*

*అసలు పేరు : చంపానగరి.*


*26. బుర్హాన్‌పూర్*

*అసలు పేరు : బ్రహ్మపూర్.*


*27. ఇండోర్*

*అసలు పేరు : ఇందూర్.*


*28. నశ్రులగంజ్*

*అసలు పేరు : భిరుండా!*


*29. సోనిపట్*

*అసలు పేరు : స్వర్ణప్రస్థ.*


*30. పానిపట్*

*అసలు పేరు : పర్ణప్రస్థ.*


*31. బాగ్‌పత్*

*అసలు పేరు : బాగ్‌ప్రస్థ!*


*32. ఉస్మానాబాద్*

*అసలు పేరు : ధరాశివ్ (మహారాష్ట్రలో).*


*33. డియోరియా*

*అసలు పేరు : దేవ్‌పురి.  (ఉత్తరప్రదేశ్‌లో)*


*34. సుల్తాన్‌పూర్*

*అసలు పేరు : కుష్భవన్‌పూర్*


*35. లఖింపూర్*

*అసలు పేరు : లక్ష్మీపూర్.  (ఉత్తరప్రదేశ్‌లో)*


*36. మొరెనా*

*అసలు పేరు : మయూర్వన్.*


*37. జబల్పూర్*

*అసలు పేరు : జబలిపురం*


*38. గుల్మార్గ్*

*అసలు పేరు : గౌరీమార్గ్*


*39. బారాముల్లా*

*అసలు పేరు : వర్హముల*


*40. సోపోర్*

*అసలు పేరు : సుయ్యపూర్*


*41. ముల్తాన్*

*అసలు పేరు : ములాస్థాన్*


*42. ఇస్లామాబాద్*

*అసలు పేరు : తక్షశిల*


*43. పెషావర్*

*అసలు పేరు : పుర్షపుర*


*44. స్కర్డు*

*అసలు పేరు : స్కంద*


*45. శ్రీనగర్*

*అసలు పేరు : సూర్య నగరం*


*ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చబడ్డాయి.*తిరిగి మనం మార్చేద్దాం :


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 హరిః ఓమ్. ❤️❤️

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ


దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ 

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః (49)


బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే 

తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ (50)


ధనంజయా.. ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామకర్మకంటే హీనం, ఫలితం ఆశించి కర్మచేసేవాళ్ళు అల్పులు. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు. సమభావన కలిగిన పురుషుడు పుణ్యపాపాలు రెండింటినీ ఈ లోకంలోనే వదిలేస్తున్నాడు. కనుక సమత్వబుద్ధి అయిన నిష్కామకర్మనే నీవు ఆచరించు. కౌశలంతో కర్మలు చేయడమే యోగమని తెలుసుకో.

*శ్రీ భాస్కర దండకం*

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌸🌸🌸


*శ్రీ భాస్కర దండకం*


శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడామణీ

ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా

నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా

మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా||


పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా

మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య

దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార

గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి

ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి||


జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు

వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు

సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ

మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి

కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి

నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో||


దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక

శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప

నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ

భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు

ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత

నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు

నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా||


శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్

స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి

విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్

కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా

నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః || 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌸🌸🌸🌸

ప్రతి వస్తువు తోడ భువిని

 *2029*

*కం*

ప్రతి వస్తువు తోడ భువిని

హితములు నహితములునుండు హెచ్చుగ నెపుడున్.

అతిగా నుపయోగించగ

ప్రతిగా దుష్ఫలములుండు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ప్రతీ వస్తువు తోనూ భూలోకంలో ఉపయోగాలు,నిరుపయోగాలూ/ప్రమాదాలు కూడా గొప్పగా నే ఉంటాయి. అతి గా ఉపయోగిస్తే దానికి ప్రతిగా దుష్ఫలితాలు ఉండగలవు.

*సందేశం*:-- నిరుపయోగమైన వస్తువులు నూ ఉండవు,ఉపయోగించే వస్తువులతో ఎల్లప్పుడూ ఉపయోగాలే ఉండవు. అతి గా ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తే అది ఉపయుక్తమైన వస్తువే అయినా దాని వలన ప్రమాదాలు కూడా ఉండవచ్చు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయం

 🕉 మన గుడి : నెం 1037


⚜ కేరళ  :  త్రిస్సూర్ 


⚜ పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయం



💠 రామాయణంలో శ్రీరాముని తమ్ముడు శతృఘ్నకు అంకితం చేయబడిన భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి.  

శత్రుఘ్న ఆలయం నలంబలం ఎక్కినప్పుడు భక్తులు సందర్శించే నాల్గవ ఆలయం 


💠 శత్రుఘ్న ఆలయం, భక్తులు నలంబలం (నాలుగు దేవాలయాలు) యాత్ర సందర్శించినప్పుడు సందర్శించే నాల్గవ ఆలయం. 

పాయమ్మాల్ ఆలయం గురువాయూర్‌లో మాదిరిగానే అతి చిన్న విగ్రహాన్ని కలిగి ఉన్న అతి చిన్న ఆలయం.  


🔅 రాముని కొరకు త్రిప్రయార్

🔅 భరతునికి కూడల్మాణికం

🔅 లక్ష్మణునికి మోజికులం 

 🔅 శతృఘ్న కోసం పాయమ్మాళ్.


💠 ఈ (నాలుగు దేవాలయాలు) యాత్ర లేదా సందర్శన మలయాళ మాసం కర్కిడకంలో నలంబలాన్ని సందర్శించడం ఒక పవిత్రమైన కార్యక్రమంగా పరిగణించబడుతుంది.


💠 ఇది దశరథ మరియు రాణి సుమిత్రల కుమారుడు మరియు రాముడి తమ్ముడు శత్రుఘ్నకు అంకితం చేయబడింది. 

ఈ ఆలయం శత్రుఘ్న భక్తులకు ముఖ్యమైనది మరియు భారతదేశం అంతటా యాత్రికులను ఆకర్షిస్తుంది.


💠 ఈ ఆలయం కేరళ బ్యాక్ వాటర్స్ చుట్టూ పచ్చని వాతావరణంలో ఉంది. దీని నిర్మాణంలో హిందూ పురాణాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలు ఉన్నాయి.


💠 పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయం ఆధ్యాత్మిక వాతావరణం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. 

హిందూ మతపరమైన ఆచారాలు మరియు భారతీయ వారసత్వం పట్ల ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక గమ్యస్థానంగా పనిచేస్తుంది. 


💠 ఈ ఆలయం రోజువారీ పూజలు మరియు దేవతకు నైవేద్యాలతో సహా మతపరమైన పద్ధతులు మరియు ఆచారాలకు ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయం ఏడాది పొడవునా వివిధ పండుగలు మరియు వేడుకలను నిర్వహిస్తు భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది.


🔆 ఆలయ చరిత్ర 


💠 దేవాలయం యొక్క గొప్ప చరిత్ర మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కేరళ యొక్క మతపరమైన వారసత్వంలో అంతర్భాగంగా మరియు దాని అనుచరుల శాశ్వత భక్తికి నిదర్శనం. 

కాలక్రమేణా, ఈ ఆలయం ప్రాముఖ్యతను సంతరించుకుంది మరియు శత్రుఘ్న భగవానుని భక్తులకు గౌరవనీయమైన తీర్థయాత్రగా మారింది, వారు అతని ఆశీర్వాదం మరియు వారి ప్రార్థనల కొరకు వస్తారు. 


💠 పాయమ్మాళ్ శత్రుఘ్న దేవాలయం కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే సున్నితమైన వాస్తుశిల్పం మరియు క్లిష్టమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఆలయ సముదాయం సాంప్రదాయ కేరళ వాస్తుశిల్పంలో నిర్మించబడింది, దాని విలక్షణమైన  పైకప్పులు, చెక్క శిల్పాలు మరియు అలంకరించబడిన అలంకరణలు ఉన్నాయి. 


💠 ప్రధాన గర్భగుడి హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే విస్తృతమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది, బయటి గోడలు రంగురంగుల కుడ్యచిత్రాలు మరియు శిల్పాలతో వివిధ దేవతలను వర్ణిస్తాయి.


💠 ఆలయ వాస్తుశిల్పం పురాతన కళాకారుల నైపుణ్యం మరియు నైపుణ్యానికి నిదర్శనం, వారు సందర్శించే వారందరికీ విస్మయం మరియు భక్తిని కలిగించే ప్రార్థనా స్థలాన్ని రూపొందించడానికి తమను తాము అంకితం చేసుకున్నారు.


💠 క్లిష్టమైన వివరాలు మరియు అలంకరించబడిన అలంకరణలు కనులకు దృశ్య విందుగా ఉంటాయి, ఈ పవిత్ర స్థలం యొక్క అందం మరియు వైభవాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి సందర్శకులను ఆహ్వానిస్తుంది.


💠 ఇక్కడి వేడుకలు సాంప్రదాయ సంగీతం, శ్లోకాల పఠనం మరియు పవిత్ర గ్రంథాల పఠనంతో పాటు భక్తి మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.


💠 ఈ ఆచారాల ద్వారా భక్తులను మార్గనిర్దేశం చేయడంలో ఆలయ పూజారులు కీలక పాత్ర పోషిస్తారు, ప్రతి ఉత్సవం అత్యంత భక్తితో మరియు భక్తితో నిర్వహించబడేలా వారి జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందిస్తారు.


💠 పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయంలోని మతపరమైన ఆచారాలు భక్తులు తమ విశ్వాసం మరియు భక్తిని వ్యక్తీకరించడానికి ఒక సాధనంగా పనిచేస్తాయి.


💠 పాయమ్మాల్ శత్రుఘ్న ఆలయంలో పండుగలు మరియు వేడుకలు

పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయంలో జరిగే పండుగలు మరియు వేడుకలు ఉత్సవాల్లో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను ఒకచోట చేర్చే ఉత్సాహభరితమైన మరియు సంతోషకరమైన సందర్భాలు. 


💠 ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శత్రుఘ్న జయంతి ఒకటి, ఇది శత్రుఘ్నుడి జన్మదినాన్ని సూచిస్తుంది. 

ఈ పండుగను రంగురంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు మరియు ఆలయ సముదాయాన్ని అలంకరించే విస్తృతమైన అలంకరణలతో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు.


💠 పాయమ్మాళ్ శత్రుఘ్న ఆలయంలో మరొక ముఖ్యమైన పండుగ నవరాత్రి, ఇది దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేయబడిన 9 రాత్రుల పండుగ. 

ఈ పవిత్రమైన కాలంలో, ఆలయం దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి దేవిని పూజించే ప్రత్యేక వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.



రచన

©️ Santosh Kumar

14-08-గీతా మకరందము

 14-08-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


తమ స్త్వజ్ఞానజం విద్ధి 

మోహనం సర్వదేహినామ్ | 

ప్రమాదాలస్యనిద్రాభిః 

తన్నిబధ్నాతి భారత || 


తాత్పర్యము:- ఓ అర్జునా ! తమోగుణము అజ్ఞానమువలన కలుగునదియు, సమస్తప్రాణులకును మోహమును (అవివేకమును) గలుగజేయునదియునని యెఱుగుము, అయ్యది మఱపు (పరాకు), సోమరితనము, నిద్ర మొదలగువానిచే జీవుని లెస్సగ బంధించివేయుచున్నది.


వ్యాఖ్య:- తమోగుణము అజ్ఞానజనితమైనది. అది జీవుని మోహపెట్టి ఆతనికి అవివేకమును గలుగజేసి సంసారమునబడవైచి బంధించుచున్నది, దట్టమగు మేఘము సూర్యుని గప్పిన చందమునను, నల్లటి గాజుచిమ్నీ దీపమునకు పెట్టిన చందమునను తమోగుణావృతుడగు జీవుని పరిస్థితి ఉండును. ‘సర్వదేహినామ్’ అని చెప్పుటవలన వివేకవంతులను, ఆత్మజ్ఞానయుతులనుదప్ప తక్కినవారినందఱిని అది ఆవరించుచునే యుండునని గ్రహించవలెను. ముముక్షువులకు వారి వారి ప్రయత్నతీవ్రతనుబట్టి అది క్రమముగ తొలగిపోవుచుండును. అయితే ఒకనికి తమోగుణము ఉన్నదా, లేదాయని తెలిసికొనుట ఎట్లు ? మత్తు, సోమరితనము, అతినిద్ర, అజాగ్రత, బద్ధకము మున్నగునవి ఎవనికుండునో, ఆతనికి తమోగుణము పూర్తిగా కలదనియే గ్రహించవలెను. అట్టి లక్షణములను ముందుగనే తెలిసికొని, వానిని నివారించుటద్వారా అంధకారసదృశమగు ఆ తమోగుణమును హృదయమునుండి దూరముగ పారద్రోలవలెను. ఏలయనిన, ఈ తమోగుణ, రజోగుణములు జీవుని గట్టిగ బంధించివైచి సంసారగర్తమున పడవైచి దైవమున కాతనిని దూరునిగ జేయుచున్నవి (నిబధ్నాతి). కాబట్టి ముముక్షువులు వాని విషయమున కడు జాగరూకులై మెలగవలెను.


‘భారత’ - (భరతవంశమందు జన్మించిన ఓ అర్జునా!) అను ఈ సంబోధనపదము ఈ అధ్యాయమున పెక్కుతూర్లు వాడబడుట గమనింపదగినది. ఎట్లనిన -

(1) సంభవః సర్వభూతానాం తతో భవతి భారత (14-3)

(2) ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత (14-8)

(3) సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత (14-9)

(4) రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత (14-10)

(5) రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ (14-12)


ఈ ప్రకారముగ ఒకే అధ్యాయములో ఒకే సందర్భమున 'భారత' అను పదమును ఇన్నిసార్లు ప్రయోగించుటలో ఏదైన విశేషముండియే యుండవలెను. అదియేది యనిన 'భా' అనగా ప్రకాశము (జ్ఞానము); అద్దానియందు ‘రతః’ - ఆసక్తుడవు కమ్ము - అను అర్థము ఈ పదముద్వారా అర్జునునకు సూచింపబడుచున్నది. ‘ఓ అర్జునా! ప్రకాశస్వరూపమై, త్రిగుణమాలిన్యవర్జితమై, అతి నిర్మలమైనట్టి నీస్వస్వరూపమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు అంధకారరూపములగు ఈ త్రిగుణములతో జేరినవాడవు కావు. అవి మాయా (ప్రకృతి) జన్యములు. నీవో తద్విలక్షణుడవు. జ్ఞానప్రకాశసచ్చిదానంద స్వరూపుడవు. కావున అట్టి ప్రకాశరూపనిజాత్మతత్త్వమున స్థితుడవై త్రిగుణాతీతుడవై పఱుగుము' అని హెచ్చరించుటకై కాబోలు ఇన్నిసార్లు 'భారత’ అను పదమును భగవానుడు ప్రయోగించిరి.


ప్రశ్న:- తమోగుణము దేనినుండి పుట్టినది?

ఉత్తరము:- అజ్ఞానమునుండి.

ప్రశ్న:- దాని స్వభావమేమి?

ఉత్తరము:- అది సమస్త జీవులకును మోహమును (అవివేకమును) గలుగజేయును.

ప్రశ్న:- ఏ రూపమున అయ్యది జీవులను బంధించును?

ఉత్తరము:- మఱపు, పరాకు, సోమరితనము, బద్దకము, అతినిద్ర మున్నగువానిచే బంధించును.

తిరుమల సర్వస్వం -165*

 *తిరుమల సర్వస్వం -165*

*తిరుమల క్షేత్రంలో తీర్థాలు-4*



 *జాబాలితీర్థం* 


 తిరుమలక్షేత్రంలోనున్న సుప్రసిద్ధ తీర్థాలలో ఇది కూడా ఒకటి. దేశవిదేశాలకు చెందిన ఎందరో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఈనాటికీ, అంజనాపుత్రుణ్ణి పూజించి తమ తమ వృత్తి, వ్యాపారాలలో రాణించే నిమిత్తం తరచూ జాబాలితీర్థం సందర్శిస్తూ ఉంటారు. తిరుమల ప్రధానాలయం నుండి పాపవినాశనం వెళ్లే మార్గమునందు, వేణుగోపాలస్వామి ఆలయానికి సమీపంలో రహదారి నుంచి దాదాపు మైలు దూరం మెట్ల మార్గంలో ప్రయాణించి ఈ తీర్థాన్ని చేరుకోవచ్చు. రమణీయమైన ప్రకృతిదృశ్యాలతో, వర్షఋతువు నందు చిన్నా-పెద్దా జలపాతాలతో ఈ మార్గమంతా కనువిందు చేస్తుంది. తిరుమలక్షేత్రంలో అత్యంత అరుదుగా కానవచ్చే పట్టుకుచ్చుల్లాంటి తోకలు, ముదురుగోధుమ వర్ణంలోనున్న పొడవాటి శరీరం గల 'బెట్లుడుత' లు ఈ మార్గానికి ఇరుప్రక్కలా ఉన్న వృక్షాలపై సయ్యాట లాడుతూ సందడి చేస్తుంటాయి.


 ఇక్ష్వాకువంశపు రాజపురోహితులలో ఒకరైన జాబాలిమహర్షి తన శిష్యులతో సహా కొంతకాలం ఈ తీర్థంలో నివసించినట్లు వరాహపురాణంలో చెప్పబడింది. తర్వాతి కాలంలో, అదే ప్రదేశంలో అగస్త్యముని తన శిష్యులతో పాటుగా సుదీర్ఘకాలం నివసించి శ్రీవేంకటేశ్వరునికి అట్టహాసంగా పూజాదికాలు నిర్వహించాడు. ఈ క్షేత్రంలో జాబాలిమహర్షి కోరిక మేరకు ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాల్లో చెప్పబడింది. స్కాందపురాణంలో మరియు తరిగొండ వెంగమాంబ విరచిత శ్రీవేంకటాచల మహత్యంలో కూడా ఈ తీర్థం యొక్క ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.


 శ్రీరామచంద్రుడు సీతా-లక్ష్మణ సమేతంగా వనవాసంలో ఉన్నప్పుడు; రాముణ్ణి అయోధ్యకు తిరిగి వచ్చేందుకు ఒప్పించడానికై జాబాలిమహర్షి నాస్తికవాక్కులు పలుకుతాడు. తత్ఫలితంగా వచ్చిన వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాబాలిమహర్షి ఈ క్షేత్రంలో సుదీర్ఘకాలం తపమాచరించాడు. రావణవధ అనంతరం అయోధ్యకు తిరిగి వెళుతూ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా ఈ ప్రాంతంలో కొంతకాలం విశ్రమించాడు. ఆ సమయంలో శ్రీరాముడు స్నానమాచరించిన నీటిమడుగు *'రామకుండం'* గానూ; సీతాదేవి స్నానం చేసిన నీటిమడుగు *'సీతాకుండం'* గాను ప్రసిద్ధికెక్కాయి. స్వచ్ఛమైన జలాలతో ఒప్పారుతున్న ఈ రెండు కుండాలను ఈనాడు కూడా వేలాది భక్తులు చూసి తరిస్తారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న సింధూర వర్ణపు ఆంజనేయుడు శిరస్సుపై సీతారామచంద్రులను మోస్తూ దర్శనమిస్తాడు. ఈ తీర్థానికి ఎగువన ధ్రువుడు తపస్సు చేసినట్లుగా చెప్పబడే *'ధ్రువతీర్థం'* కూడా ఉంది.


 హనుమజ్జయంతి నాడు ఈ ఆలయంలో పెద్ద ఎత్తున పూజాపునస్కారాలు జరుగుతాయి.

*చక్రతీర్థం* 


 ఆలయానికి ఉత్తర-పశ్చిమ దిశగా, రెండు మైళ్ల దూరంలో, వేదపాఠశాలకు వెళ్లే దారిలో; శిలాతోరణం ఉద్యానవన ప్రాంగణంలో దాదాపు నూరు మెట్లు దిగి ఈ తీర్థాన్ని దర్శించుకోవచ్చు. ఈ తీర్థంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి, శ్రీవేంకటేశ్వరుని ఆయుధమైన సుదర్శన చక్రత్తాళ్వార్ ల విగ్రహాలు మలచబడి ఉన్నాయి. కార్తీకమాసంలో వచ్చే బహుళద్వాదశి నాడు శ్రీవారి ముఖ్యాలయం నుండి తీసుకొని వచ్చిన పాయసాన్ని ఈ మూర్తులకు నివేదన కావించి, తదనంతరం భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. స్కాందపురాణం ప్రకారం, శ్రీవత్స గోత్రీకుడైన 'పద్మనాభుడు' అనే విప్రుడు పన్నెండు సంవత్సరాల పాటు కఠోర తపమాచరించగా; శ్రీవేంకటేశ్వరుడు ప్రత్యక్షమై, అప్పట్లో ఆ ప్రదేశాన్ని ఆవరించియున్న రక్కసి మూకలను తన చక్రాయుధంతో దునుమాడాడు. శ్రీవారి సుదర్శనచక్రం ద్వారా రాక్షససంహారం జరిగిన కారణంగా ఆ ప్రదేశం చక్రతీర్థంగా ప్రసిద్ధి కెక్కింది. పాప పరిహారార్ధం తపస్సు చేయదలచుకున్న వారికి ఈ ప్రదేశం అత్యుత్తమమైనదిగా పురాణాలలో చెప్పబడింది.


 స్కాందపురాణం లోని మరొక ఇతివృత్తాన్ని అనుసరించి, శ్రీరంగానికి చెందిన 'సుందరుడు' అనే బ్రాహ్మణుడు శాపవశాత్తూ రాక్షసరూపం ధరించాడు. ఆ బ్రాహ్మణుడు వశిష్ఠమహర్షి ఆదేశం మేరకు ఈ తీర్థంలో పవిత్ర స్నానమాచరించి తన నిజరూపాన్ని సంతరించుకుని మోక్షసిద్ధి పొందాడు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము ద్వితీయాశ్వాసము*


*304 వ రోజు*


సృంజయిని కుమారుడు జీవించుట*


ఆ మాటలు విని మిన్నకున్న సృంజయుని చూసి నారదుడు " ఇప్పటి వరకూ చెప్పినది నీ బుద్ధిలోకి ప్రవేశించిందా లేక నిష్ఫలమేనా !" అన్నాడు. సృంజయుడు " నారదా ! నీ మాటలు నాకు ఊరట కలిగించాయి నేను ప్రశాంత చిత్తుడను అయ్యాను " అన్నాడు. నారదుడు " సృంజయా ! నీకు ఏమి కావాలో కోరుకో " అని అడుగగా సృంజయుడు " దేవా ! నీవు నాకు ప్రసన్నుడవు అయ్యావు నాకు ఇంత కంటే కావలసినదేమిటి " అన్నాడు. నారదుడు " సృంజయా ! చోరుల మూర్ఖత్వముకు బలి అయిన నీ కుమారుని నీకు తెచ్చి ఇస్తాను " అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం నారదుడు సువర్ణష్ఠీవిని సృంజయునకు తెచ్చి ఇచ్చాడు. సృంజయుడు తన కుమారునికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పి వివాహం చేసాడు. అతడు సంతాన వంతుడు అయ్యాడు. కాలం తీరగానే అతడూ మరణించాడు. ధర్మరాజా ! మృత్యువును జయించుట ఎవరితరం కాదు. నీ కుమారుడు అభిమన్యుడు వీరస్వర్గము అలంకరించి సురలోక భోగములు అనుభవించుచున్నాడు. అతడి మృతికి నీవు చింతించుట అనవసరం. కనుక నామాటలు ఆలకించావు కనుక స్వస్థ చిత్తుడవై ధైర్యము వహించి ధీరుడవై కర్తవ్య నిర్వహణ కావింపుము " అని చెప్పి వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళాడు.


*అర్జునుడు మనసు కలత చెందుట*


వ్యాసుడి రాక ధర్మరాజుకు ఉరట కలిగించినా అర్జునుడు వచ్చి తనకుమారుని గురించి అడిగినా ఎలాబదులు చెప్పాలి. అతడిని ఎలా ఓదార్చగలను అని మధనపడసాగాడు. సంజయుడిలా చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! సంశక్తులతో యుద్ధానికి వెళ్ళిన అర్జునుడు ఏ విధంగా యుద్ధము చేసాడు. అభిమన్యుని మరణవార్త అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! సంశక్తులను అర్జునుడు సమూలంగా నాశనం చేసి తిరిగి వస్తుండగా అనేక దుశ్శకునాలు గోచరించాయి. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " ఎన్నడూ లేనిది నాకు దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి. నా మనస్సు అలజడి చెందుతుంది, శరీరం గగుర్పాటు చెందుతుంది ద్రోణాచార్యుడు సామాన్యుడు కాదు. మా అన్నయ్య ధర్మజునికి ఎలాంటి అపాయము జరగలేదు కదా !" అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు " అర్ఝునా ! ధర్మజునుకి అతడి తమ్ములకు ఎలాంటి ఆపదా కలుగదు. మిగిలిన వారికి కలిగిన మనకు త్వరలో తెలుస్తుంది " అన్నాడు. కృష్ణార్జునులు పాండవ శిబిరంలో ప్రవేశించగానే అక్కడ అలముకున్న నిస్తేజమైన వాతావరణం చూసి కలత చెందిన అర్జునుడు " కృష్ణా ! సైనికులు అందరూ నన్ను చూసి తల దించుకుంటున్నారు. వారి ముఖాలలో విషాదచ్ఛాయలు గోచరిస్తున్నాయి. మన శిబిరంలో సందడి లేదు. నేను రాగానే నాకెదురు వచ్చు అభిమన్యుడు నేడు రాలేదు. ఎలాంటి దుర్వార్త వినవలసి వచ్చునో అని మనసు వ్యాకులపడుతుంది. ఎలాంటి దుర్వార్త వినవలెనో అని భయంగా ఉంది " అన్నాడు. కృష్ణుడు బదులు చెప్పలేదు. అర్జునుడు వెంటనే ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు మొదలైన వారు కూర్చుని ఉన్నారు. వారిలో అభిమన్యుడు లేడు. అది చూసిన అర్జునుడికి కాళ్ళు తొట్రుపడ్డాయి


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *భావస్నిగ్ధైరుపకృతమపి ద్వేష్యతాం యాతి లోకే*

       *సాక్షాదన్యైరపకృతమపి ప్రీతయే చోపయాతి|*

       *దుర్గ్రాహ్యత్వాన్నృపతి మనసాం నైకభావాశ్రయాణాం*

       *సేవాధర్మః పరమగహనో యోగినామప్యగమ్యః॥*


         *- _మహా సుభాషిత రత్నావళిః_ -*


తా𝕝𝕝 *ఈ ప్రపంచములో ప్రేమభావముచే మెఱిసే మిత్రులచే చేయబడిన ఉపకారము కూడ శత్రుతను కలిస్తుంది.... సాక్షాత్తుగా శత్రువులు చేసిన అపకారం కూడా ప్రీతికి కారణం అవుతుంది.... భిన్నభావాలతో ఉండే రాజుల మనస్సులను గ్రహించడం, వారిని సేవించి వారి అనుగ్రహాన్ని పొందడం చాలా కష్టం.... అందుచేత సేవాధర్మం మిక్కిలి కష్టమైంది. యోగులకును అగమ్యమైనది .... అనగా అంతుబట్టనిది.... అర్థం కానిది అని అర్థం* !!!


 ✍️🌹🪷💐🙏

సముద్రాని చూడగలం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏          🔥 *సముద్రాని చూడగలం.. కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేము..అలాగే మనుషులను చూస్తాం.. కానీ వారి మనసులో ఏముందో చూడలేము.. కత్తి ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు.. అలాగే కొందరికి ఎంత విలువ ఇచ్చినా మనసు గాయపరచడమే తెలుసు* 🔥ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు  ఆలోచనల్ని అయినా మంచి వైపు మళ్లీస్తుంది.. అదే ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది..ఇది నా అనుకున్న వారికి నష్టం అనే ఆలోచన ఉంటే మానవత్వం ఉన్న ప్రతీ వాడు పరులను మరియు తోటి వారిని నష్ట పరచడు🔥అభిప్రాయాలను గౌరవించుకుంటే అవమానాలు ఉండవు.. ఆలోచనలను మంచిగా  చేసుకుంటే అవేశాలు ఉండవు.. అపార్దాలకు దూరంగా ఉంటే అనర్దాలకు తావు ఉండదు..అందరి పట్ల శుభ భావాలు ఉంటే అత్యాశలకు అవకాశం ఉండదు🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏

2, ఫిబ్రవరి 2025

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ  జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


*శ్రీమతే రామానుజాయ నమః*


తేదీ:- 2, ఫిబ్రవరి 2025

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- ఉత్తరాయనం

ఋతువు:- శిశిర

మాసం:- ఫాల్గుణ మాసం

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- తదియ రా.12.52 వరకు

వారం:- ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:- ఉత్తరాభాద్ర మ.12.20 వరకు

యోగo:- శుభం సా.4.05 వరకు

కరణం:- తైతుల మ.2.04 వరకు తదుపరి గరజి రా.12.52 వరకు

వర్జ్యం:- రా.11.32 - 1.01 వరకు

దుర్ముహూర్తము:- సా.4.28 - 5.15 వరకు

అమృతకాలం:- ఉ.7.53 - 9.22 వరకు

రాహుకాలం:- సా.4.30 - 6.00 వరకు

యమగండ/కేతుకాలం:- మ12.00 - 1.30 వరకు 

సూర్యరాశి:కుంభం 

చంద్రరాశి :మీనం 

సూర్యోదయం:- 6.23

సూర్యాస్తమయం:- 6.02


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

ఆదివారం సెలవువద్దు...

 *ఆదివారం సెలవువద్దు...*

ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం..


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||


స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


*తాత్పర్యం:*


మాంసం తినడం..! మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు, కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు..

కుటుంబ సౌఖ్యం లేకపోవటం...

ఆనారోగ్యం కూడా..!!


ఆదివారం సూర్యుడు జన్మించిన రోజు

ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు..


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు

(Thomas Babington Macaulay,

ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే)

ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు..

మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!!

ఆదివారం నాడు మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.!


ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! .స్వదేశీ సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.!

సూర్యనమస్కారాలు చేయండి.!

సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి.!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు

కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ

దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!


ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ

క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే

కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు.