2, మార్చి 2025, ఆదివారం

ప్రతి వస్తువు తోడ భువిని

 *2029*

*కం*

ప్రతి వస్తువు తోడ భువిని

హితములు నహితములునుండు హెచ్చుగ నెపుడున్.

అతిగా నుపయోగించగ

ప్రతిగా దుష్ఫలములుండు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ప్రతీ వస్తువు తోనూ భూలోకంలో ఉపయోగాలు,నిరుపయోగాలూ/ప్రమాదాలు కూడా గొప్పగా నే ఉంటాయి. అతి గా ఉపయోగిస్తే దానికి ప్రతిగా దుష్ఫలితాలు ఉండగలవు.

*సందేశం*:-- నిరుపయోగమైన వస్తువులు నూ ఉండవు,ఉపయోగించే వస్తువులతో ఎల్లప్పుడూ ఉపయోగాలే ఉండవు. అతి గా ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తే అది ఉపయుక్తమైన వస్తువే అయినా దాని వలన ప్రమాదాలు కూడా ఉండవచ్చు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: