🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*పదవిభాగం, తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పరమశివుడు తీసుకున్న విషాన్ని గూర్చి శంకరులు ఈశ్వరుణ్ణి మూడు విధాలుగా ప్రశ్నిస్తున్నారు.*
*శ్లోకం: 32*
*జ్వాలోగ్రస్సకలామరాతి భయదః క్ష్వేళః కథంవా త్వయా*
*దృష్టః కించ కరే ధృతఃకరతలే కింపపక్వ జంభూఫలం ?*
*జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశేభృతః*
*కిం తే నీలమణి ర్విభూషణ మయం శంభో ! మహాత్మన్వద !!*
*పదవిభాగం:~*
*జ్వాలోగ్రః _ సకలామరాతిభయదః _ క్ష్వేళః _ కథం _ వా _ త్వయా _ దృష్టః - కిం _ చ _ కరో _ ధృతః _ కరతలే _ కిం _ పక్వ ఓం శ్లో _ జిహ్వాయాం నిహితః _ చ _ సిద్ధఘుటికా _ వా _ కంఠదేశే _ భృతః _ కిం _ తే _ నీలమణిః - విభూషణమ్ _ అయమ్ _ శంభో _ మహాత్మన్ _ వద.*
*తాత్పర్యము:~*
*మహాత్మా ! శివా! తీవ్ర జ్వాలలు క్రమ్ముతూ, సకలదేవతలకునూ మిక్కిలి భయమును పుట్టించే, ఆ కాలకూట విషాన్ని కన్నులతో నీవు ఎలా చూశావు ? అంతేగాక అరచేతిలో దాన్ని ఎలా ఉంచుకున్నావు ? అదేమైనా పండిన నేరేడు పండా ఏమిటి ?అదీగాక దానిని నాలుక మీద వేసుకున్నావు. అది సిద్ధఘుటికయా ఏమిటి ? మఱియూ కంఠమునందు నిలుపుకున్నావు. ఇది నీకు ఆభరణంగా వుండే ఇంద్రనీలమణియా ? చెప్పు.*
*వివరణ:-*
*ఈశ్వరుడు దేవతల ప్రార్థనపై కాలకూట విషాన్ని తన కంఠంలో చిన్న సిద్ధ ఘుటికలా తన కంఠంవద్ద దాన్ని నిలుపుకున్నాడు. లోకాల్ని దగ్ధము చేయగల ఆ విషము శివుని ఏమీచేయలేక పోయింది. అంతేగాక స్ఫటికంలా తెల్లనైన వన్నెగల ఆ శివుని కంఠములో ఇంద్రనీలమణిలా ఆభరణంగా అది ప్రకాశించింది. అందువల్లనే ఈశ్వరుడు నీలకంఠుడని ప్రఖ్యాతి వహించాడు.*
*"నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ, శ్రీమన్మహాదేవాయనమః ". అని వేదము ఈశ్వరుని ప్రస్తుతించింది.*
*శివుడు కాలకూట విషాన్ని రస ఘుటికలా మ్రింగాడని, శ్రీనాథమహాకవి కూడా తన భీమేశ్వర పురాణంలో ఇలా చెప్పాడు.*
*కటుకమగు విషము విషధర*
*కటకంబగు కేఁలబూని కౌతూహలియై*
*ఘుటికా సంసిద్ధుడు రస*
*ఘుటికయునుంబోలె శివుడు గుటుకున మ్రింగెన్ !!*
*తాత్పర్యం:~*
*ఈశ్వరుడు తీవ్రమైనవిషాన్ని , సర్పమును కడియంగా ధరించిన తన చేతితో పట్టుకొని, ఘుటికా యోగంలో నేర్పరియైన సిద్ధుడు, రసగుళికను మ్రింగినట్లుగా , ఆ విషాన్ని గుటుక్కున మ్రింగాడు.*
*విషాన్ని నేరేడు పండుతో పోల్చడం అన్న పోలికనుగూడా , శంకరుల నుండియే ఇతర కవులు గ్రహించారు..*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి