3, నవంబర్ 2022, గురువారం

కిడ్నీలలో నొప్పిని

 కిడ్నీలలో నొప్పిని 5 నిమిషాలలో హరించు సిద్ధయోగం  - 


      మూసామ్బరం అని ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో ఉంటుంది. ఇది కలబంద గుజ్జుతో తయారుచేస్తారు. కొంచం నల్లగా , బంకలా ఉంటుంది. కందిగింజ అంత మూసాంబరాన్ని ద్రాక్షా పండుని నిలువుగా చీల్చి దాంట్లో పెట్టి మింగి నీరు తాగాలి. 5 నిమిషాల్లో తీవ్రమైన కిడ్నీ నొప్పి మాయం అవుతుంది.


  గమనిక  - కిడ్నిలో రాళ్లు ఉన్నవారు ఇది కొంచం అందుబాటులో ఉంచుకోండి. ద్రాక్షపండు దొరకనప్పుడు ఎండుద్రాక్ష కూడా వాడవచ్చు. 


       ఇది నా అనుభవపూర్వకం ........


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

మొలలనొప్పిని

 మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం - 

మొలలనొప్పిని వెంటనే హరించు సిద్దయోగం - 


    మొలలవ్యాధి అనేది శరీరము నందు వేడి విపరీతముగా పెరిగినప్పుడు సంప్రాప్తిస్తుంది. మలద్వారం నందు మొలకలు జనియించి తీవ్రమైన నొప్పి వచ్చును. మలబద్ధక సమస్య కూడా ఉత్పన్నం అగును. బలంగా మలమును బయటకి పంపుటకు ప్రయత్నించినప్పుడు మొలకలు తెగి తీవ్ర రక్తస్రావం జరుగును. ఒక్కోసారి రక్తస్రావం ఆగకపోవడం వలన ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చు. వ్యాధి ముదరక ముందే సరైన చికిత్స తీసుకోవలెను . 


            ఇప్పుడు నేను చెప్పబోయే సిద్దయోగం మొలల నొప్పిని వెంటనే హరించును . 


      ఒక గుప్పెడు మునగ ఆకును తీసుకుని మరుగుతున్న నీటి యందు వేసి వచ్చు ఆవిరిని మొలల స్థానమునకు పట్టించిన వెంటనే నొప్పి తగ్గిపోవును . 


  ఇది నా అనుభవపూర్వకం ....


     నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది.

    మొలలవ్యాధి అనేది శరీరము నందు వేడి విపరీతముగా పెరిగినప్పుడు సంప్రాప్తిస్తుంది. మలద్వారం నందు మొలకలు జనియించి తీవ్రమైన నొప్పి వచ్చును. మలబద్ధక సమస్య కూడా ఉత్పన్నం అగును. బలంగా మలమును బయటకి పంపుటకు ప్రయత్నించినప్పుడు మొలకలు తెగి తీవ్ర రక్తస్రావం జరుగును. ఒక్కోసారి రక్తస్రావం ఆగకపోవడం వలన ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చు. వ్యాధి ముదరక ముందే సరైన చికిత్స తీసుకోవలెను . 


            ఇప్పుడు నేను చెప్పబోయే సిద్దయోగం మొలల నొప్పిని వెంటనే హరించును . 


      ఒక గుప్పెడు మునగ ఆకును తీసుకుని మరుగుతున్న నీటి యందు వేసి వచ్చు ఆవిరిని మొలల స్థానమునకు పట్టించిన వెంటనే నొప్పి తగ్గిపోవును . 


  ఇది నా అనుభవపూర్వకం ....


     నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది.

కృతఘ్నుడు

 శ్లోకం:☝️

  *కుతః కృతఘ్నస్య యశః*

*కుతః స్థానం కుతః సుఖం ll*

  *అశ్రద్ధేయః కృతఘ్నో హి*

*కృతఘ్నే నాస్తి నిష్కృతిః ll*

  - మహాభారతం, శాంతిపర్వం

పుడమి కీర్తి నెట్లు పొందు కృతఘ్నుడు ?

ఎటుల నుండు సుఖము ?ఎచట పథము ?

ఎవరు నమ్ము నతని ? ఏరీతి లోకమ్ము ?

నిష్కృ తసలులేదు నిక్కముగను 


గోపాలుని మధుసూదనరావు

భావం: కృతఘ్నుడు కీర్తి ప్రతిష్ఠలు ఎలా పొందగలడు? అతను ఉన్నత స్థానాన్ని మరియు సుఖాన్ని ఎలా పొందగలడు? కృతజ్ఞత లేనివాడిని లోకం ఎలా నమ్ముతుంది. కృతఘ్నునికి శాస్త్రాలలో కూడ ఎక్కడా ప్రాయశ్చిత్తం చెప్పలేదు.

శ్రీశైల మల్లన్నను

 *ఆహా ఏమి రాశావయ్యా!!!!! ఏమి స్వామి నీ మహిమ?*

      (అక్షరాంక గద్య )

మల్లికార్జున పండితుడు శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో ఎలా స్తుతించాడో 

చూడండి.  పాల్కురికి సోమన్న  అద్భుతంగా వ్రాశారు. 

'అ'ఖిల లోకాధార 

'ఆ'నంద పూర

'ఇ'న చంద్ర శిఖి నేత్ర  

'ఈ'డితామల గాత్ర

'ఉ'రు లింగ నిజరూప

'ఊ'ర్జితా జలచాప

'ఌ'లిత తాండవకాండ 

'ౡ'నికృతా జాండ

'ఏ'కైక వర్యేశ 

'ఐ'క్య సౌఖ్యా వేశ

'ఓం' కార దివ్యాంగ   

'ఔ'న్నత్య గుణ సంగ

'అం'బికా హృదయేశ

'అః'స్తోక కలనాశ

'క'నద హీనాభరణ 

'ఖ'ల జలంధర హరణ

'గ'ల నాయక విధేయ 

'ఘ'న భక్తి విజేయ

'జ'శ్చూల కాలధర

'చ'రిత త్రిశూల ధర

'ఛ'ర్మ యాధ్వస్త 

'ఞ'న గుణ ధళ ధీర

'ట' త్రయాది విదూర 

'ఠ' ప్రభావాకార

'డ'మరుకాది విహార 

'ఢ' వ్రాత పరిహార

'ణ' ప్రవాగార 

'త'త్త్వ జోనేత

'థ'వి దూర జవ పక్ష 

'ద'వన పాలన దీక్ష

'ధ'రణీ థవోల్లీడ 

'నంది కేశారూఢ

'ప'ర్వతీశ్వర లింగ 

'బ'హుళ భూత విలాస

'భ'క్త్వ హృద్వ నహన 

'మం'త్రస్తుతోధార 

'య'క్ష రుద్రాకార

'ర'తిరాజ బిన హంస

'ల'లిత గంగోత్తంస 

'ళ'మా విదవ్రంశ 

'వ'రద శైల విహార 

'శ'ర సంభ వాస్ఫార

'ష'ట్తింశ తత్త్వగత  

'స'కల సురముని వినుత

'హ'రి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ

'క్ష'ర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర 

శ్రీ పర్వత లింగ 

నమస్తే నమస్తే నమస్తే

*శ్రీ వేంకటేశ్వరస్వామి

 🚩🙏

*శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిన కూల్చాడానికి  స్కెచ్.......*

*తెరవెనుక మూటలు మారయా! లేక పాస్టర్ల తో కుమ్మక్కా..?*

*పెద గంట్యాడ ఎం ఆర్ ఓ రమాదేవి కధ ..........*

*ఇక్కడ ఏడుస్తున్న మహిళ వాళ్ల ఇంట్లో ఎదో పోయిందనో, వాళ్ళ బంధువులు ఎదో అయిపోయారని కాదు....*

*దేవుడు కోసం శ్రీ వెంకటేశ్వరస్వామి కోసం.....*

*గాజువాక బానోజీ తోట దగ్గర వాంబే కాలనీ కొండపైన ఉత్తర దిక్కున  వెలసిన స్వయంబు  శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఇప్పటికి 80% కట్టడం జరిగింది.*

 *ఇంకా పూర్తి కాకపోయునా ప్రతి శనివారం 1500 మందికి డోనర్స్ ద్వారా అన్న సమారాధన జరుగుతున్నది.  ఈ గుడిని జోలే పెట్టి జోగి దండి ప్రతి హిందూ బంధువు ఇచ్చినా రూపాయి రూపాయి తో నిర్మాణం గత 4 సంవత్సరాలనుండి కోనసాగుతున్నది.*

*ధర్మకర్త ఒక సాధారణ గృహిణి మహిళ అయిన మంత్రి మంజుల గారు.   కానీ కొన్ని రాక్షస మూకల కళ్ళు ఈ హిందూ దేవాలహం పై పడింది.  తక్షణమే ప్లాన్ అమలు చేశారు 02 నవంబర్ 2022 మధ్యహ్నం 2 గంటలకి అందరూ రెస్ట్ తీసుకునే సమయం పెద గంట్యాడ ఎం ఆర్ ఓ  తో పాటు 30 మంది జి వి ఎం సి ఉద్యగులు 10 మంది పోలీసులు (ఆ ఏరియా కి సంబంధం లేని గాజువాక పోలీసులు) ఒక్కసారి వచ్చి గుడి వంటసాల, గోశాల లో ఉన్న గోవులను విప్పేసి బూతులతో ధర్మ కర్త మరియు లోకల్ మహిళలతో చెలరేగి పోయిన పెద గంట్యాడ ఎం ఆర్ ఓ మరియు వారి స్టాఫ్.  ప్రాక్లేనర్ తో ధర్మకర్త మంజుల  చాలా సేపు గుడిని కొట్టకుండా ఫైట్ చేసింది. అలాగే వంట సామాన్లు బయటకి విశేరివేశారు.*

*నా ఉద్యగం పోయినా పర్లేదు ఈరోజు ఈ గుడిని కూల్చాలని సపదం చేసిన ఎం ఆర్ ఓ రమాదేవి.*

*హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి కట్టిన గుడిన కూల్చే స్థితిలో మనము ఉన్నమంటే ఆంధ్రప్రదేశ్ లో హిందువులు మైనారిటీ గా బ్రతకాలి అనే సంకేతం వినిపిస్తుంది.*

*అందరు ఏకం కావలి ధర్మాన్ని రక్షించాలి.మన గుడుల్ని మనమే కాపాడుకోవాలి....*

*ధర్మ కర్త మంత్రి మంజులకి సపోర్ట్ గా నిలుద్దాము....*

*మంత్రి మంజుల మొబైల్ 77023 29506 వీలైతే గుడిని సందర్శించండి.🙏*

https://drive.google.com/file/d/16a-8J0Dh25EP9veuTOdDDw0oxodNNxPO/view?usp=drivesdk 

కుటుంబ సంబంధాలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🌹🌹

*కుటుంబ సంబంధాలు*



👉నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు..సమాజంలో హోదా..సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా..నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు..కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం..అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు..మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో..ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో..ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ..కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..

             మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు..మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు..తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..

             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో..ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో..వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు..పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు..చేయించుకున్న నగలు..వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్..వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..ఇంకేమి మాట్లాడటం మానేసారు.

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..

                నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగిన వెంటనే రావడం,ఆ కుటుంబానికి దైర్యం చెప్పడం, అలాగే శుభకార్యం జరిగినప్పుడు కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

                కానీ ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా..చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ, 


 ఆదరిద్దాం  అని మర్చిపోతున్నారు..

                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి..తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న  ఇవ్వడం లేదు.బంధుత్వాలకు  చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు ఇవ్వడం,హాజరు అవ్వడం జరుగుతున్నాయి.

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్న సరే ,ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు.

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం ,అతిశయం తో వ్యవహరిస్తూ అందరికి అందరూ గిరిగీసుకుని బతుకుతున్నారు.

          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.వీళ్లు పెద్ధతనం,ఒంటరి తనం,అనారోగ్య సమస్యలతో బతుకు ఈడుస్తున్నారు. వీళ్ళకు మనిషి తోడు అవసరం అనే ధ్యాస పోయింది.

            కనీసం కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు!విపరీతమైన తామసంతో పక్క వాడి నీడ కూడా సహించడం లేదు.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు.

            వలసలు పుణ్యాన. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు ఒకటి!

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో,అప్పుడే మనుషుల మధ్య దూరం పెరిగింది. మనకు పుట్టిన ఒకడికి వంద సెంటీ జ్వరం వస్తే, మనకు నూట ఐదు జ్వరం.

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

కనీసం ఇద్దరిని కనండి.

అత్త, మామయ్య, పెద్ధనాన్న చిన్నాన అనే వరుసలు కాపాడండి.

డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే బతకడం కష్టం కాదు.

కుటుంబ వ్యవస్థను కాపాడండి.

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి బయటకు రండి.

           అందరూ కొద్దిగా ఆలోచించండి..మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ..మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి..మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు..మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..

           మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..

           నేను కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి..నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించి రాస్తున్నా....

 ఓ బంధువు 

సేకరణ: వాట్సాప్ పోస్ట్ 

🍁🍁🍁🍁🍁🍁🍁

_కార్తీకపురాణం - 8 వ అధ్యాయము_

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



*_కార్తీకపురాణం - 8 వ అధ్యాయము_*



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*శ్రీ హరి నామస్మరణా ధన్యోపాయం*

*ఆజా మీళుని కథ*



☘☘☘☘☘☘☘☘☘



వశిష్టుడు చెప్పిన దంతా విని ' మహానుభావా ! తమరు చెప్పిన ధర్మములన్నింటిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మ మనియు , పుణ్యం సులభంగా కలుగు ననియూ , అది - నదీస్నానము , దీపదానము , ఫలదానము , అన్నదానము , వస్త్ర దానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప దర్మములచేతనే మోక్షము లబించుచుండగా  వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులె చెప్పు చుందురు గదా ! మరి తమరు యిది సూక్ష్మములో  మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము  కలుగుచున్నది. దుర్మార్గులు  కొందరు సదాచారములను పటింపక , వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులగు 

మహా పాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించు చున్నాను'యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి . *' జనక మహారాజా ! నీవు వేసిన ప్రశ్న సహేతుక మైనదే , నేను వేద వేదంగములను కూడా పటీంచితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్విక , రాజస , తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక , మనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరర్పితము కావించి , మనో వాక్కాయ కర్మలచె నొనర్చిన ధర్మము అ ధర్మమందు యెంతటా ఆధిక్యత కలదు.  సాత్త్విక ధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగ ధగ మెరిసి , ముత్యమగు విధానముగా సాత్త్వికత వహించి , సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ , యమునా , గోదావరి , కృష్ణ నదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు దేవాలయముల యందు - వేదములు పటించి , సదచారుడై , కుటింబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానము చేసిననూ , లేక ఆ నదీ తీరమందున్న  దేవాలయం లో జపతపాదు లోనరించినను విశేష ఫలమును పొందగలరు.

రాజస ధర్మ మనగా - ఫలాపేక్ష  కలిగి శాస్త్రోక్త  విధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మ  హేతువై కష్ట సుఖాలు కలిగించున దగును.

తామస ధర్మమనగా - శాస్త్రోక్త  విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికా చరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.

దేశకాల పాత్రము సమ కూడినపుడు తెలిసి గాని తెలియకగాని యే స్వల్ప ధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీ మన్నా నారాయుణుని నామము , తెలిసి గాని , తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.


*🌹ఆజా మీళుని కథ🌹*


పూర్వ కాలమందు కన్యా కుబ్జ మను నగరమున నాల్గు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్య వ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమ వతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అ పూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు , అజా మీళుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దిన దిన ప్రవర్ధ మానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు , దుష్ట సావసములు చేయుచు , విద్య నభ్య సింపక , బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కమంధుడై , మంచి చెడ్డలు మరిచి , యజ్ఞో పవితము త్రెంచి , మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీ ని వలచి , నిరంతరము నామెతోనే కామా క్రీడలలో తేలియాడుచూ , యింటికి రాకుండా , తల్లిదండ్రులను మరిచి , ఆమె ఇంటనే భుజించు చుండెను. అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా ! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియ పర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జురుగును. కావున ఆజామీళుడు కుల భ్రష్టుడు కాగా , వాని బంధువులు తనని విడిచి పెట్టిరి. అందుకు ఆజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను , జంతువులను చంపుతూ కిరాత వృత్తి లో జీవించు చుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తెనేపట్టుకై చెట్టేక్కి తేనెపట్టు తియబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. ఆజామీళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి , తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామంధ కారాముచె కన్ను మిన్ను గానక ఆజా మీళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామ క్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడ కలిగిరి. ఇద్దరూ పురిటి లోనె చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి *'నారాయణ'* అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నూ ఆ బాలుని విడువక , యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ , *' నారాయణా - నారాయణా'* అని ప్రేమతో సాకు చుండిరి. కాని *' నారాయణ'* యని స్మరించిన యెడల తన పాపములు నశించి , మోక్షము పొంద వచ్చునని మాత్రమతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజా మీళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై 

మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. ఒకనాడు భయంకరాకారములతో , పాశాది ఆయుధములతో యమ భటులు ప్రత్యక్ష మైరి. వారిని చూచి అజా మీళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక *' నారాయణా ' నారాయణా'* యనుచునే ప్రాణములు విడిచెను. అజా మీళుని నోట *' నారాయణా'* యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణక సాగిరి. అదే వేళకు దివ్య మంగళ కారులు శంఖ చక్ర గదా ధరులూయగూ *శ్రీ మన్నారాయణుని* దూతలు విమానములో నచ్చటికి వచ్చి *' ఓ యమ భటులారా ! వీడు మావాడు మేము వీనిని వైకుంటమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి'* యని చెప్పి , అజా మీళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు *' అయ్యా ! మీ రెవ్వరు ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన , వానిని మాకు వదలుడని కొరగా విష్ణు దూతలు యిట్లు చెప్పదొడంగిరి.


*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*ఎనిమిదో అధ్యయము- ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.*


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

జ్యోతిర్లింగ ప్రత్యక్ష ప్రసారం

 మీరు ఏ లింక్ పై క్లిక్ చేస్తే, ఆ జ్యోతిర్లింగ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చూ👇


*12 Jyotirling Live Darshan Full Month*

🔱🏔️☘️🙏


1)

Mahakaleshwar

https://youtu.be/gk6Ty3A4yH8


2)

Trayambkeshwar

https://youtu.be/3IRPgwf2w3Q

3)

Rameshwar

https://youtu.be/ULzX2DWQ1Yg

4)

Kedarnath

https://youtu.be/u1XIrLNEp3U

5)

Bhima Shankar

https://youtu.be/kYRszVbJ28Q

6)

Nageshwar

https://youtu.be/cFeXqFQq0U4

7)

Baidhnath

https://youtu.be/2g_L3EZtyIU

8)

Omkareshwar

https://youtu.be/yqCLa1Q5YGc

9)

Kashi Vishwanath

https://youtu.be/GMmFVbhdx08

10)

Somnaath

https://youtu.be/rT0JojX26os

11)

Ghrushmeshwar

https://youtu.be/OwO-OvfWzc0

12)

Mallikarjun

https://youtu.be/FunwfFdLSV4


*Har Har Mahadeva Sambo Sankara!*

https://www.facebook.com/groups/194396027775943/?ref=share   HINDHU తీర్ధయాత్ర