3, నవంబర్ 2022, గురువారం

కృతఘ్నుడు

 శ్లోకం:☝️

  *కుతః కృతఘ్నస్య యశః*

*కుతః స్థానం కుతః సుఖం ll*

  *అశ్రద్ధేయః కృతఘ్నో హి*

*కృతఘ్నే నాస్తి నిష్కృతిః ll*

  - మహాభారతం, శాంతిపర్వం

పుడమి కీర్తి నెట్లు పొందు కృతఘ్నుడు ?

ఎటుల నుండు సుఖము ?ఎచట పథము ?

ఎవరు నమ్ము నతని ? ఏరీతి లోకమ్ము ?

నిష్కృ తసలులేదు నిక్కముగను 


గోపాలుని మధుసూదనరావు

భావం: కృతఘ్నుడు కీర్తి ప్రతిష్ఠలు ఎలా పొందగలడు? అతను ఉన్నత స్థానాన్ని మరియు సుఖాన్ని ఎలా పొందగలడు? కృతజ్ఞత లేనివాడిని లోకం ఎలా నమ్ముతుంది. కృతఘ్నునికి శాస్త్రాలలో కూడ ఎక్కడా ప్రాయశ్చిత్తం చెప్పలేదు.

కామెంట్‌లు లేవు: