🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹
*కుటుంబ సంబంధాలు*
👉నేను గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాను..
పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు..సమాజంలో హోదా..సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చిక్కగా వుండేవి..
ఒకరికి ఒకరు చేదోడుగా..నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..
వున్నంతలో తృప్తిగా వున్నారు..కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం..అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..
కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..
మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు..మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..
కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో..ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో..ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ..కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..
మొదట్లో వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు..మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు..తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..
కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో..ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో..వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..
అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు..పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది..
ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు.. కొన్న ఆస్తులు..చేయించుకున్న నగలు..వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్..వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..ఇంకేమి మాట్లాడటం మానేసారు.
వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..
నా చిన్న నాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగిన వెంటనే రావడం,ఆ కుటుంబానికి దైర్యం చెప్పడం, అలాగే శుభకార్యం జరిగినప్పుడు కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..
తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..
రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..
కానీ ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా..చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ,
ఆదరిద్దాం అని మర్చిపోతున్నారు..
అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి..తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ఇవ్వడం లేదు.బంధుత్వాలకు చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు ఇవ్వడం,హాజరు అవ్వడం జరుగుతున్నాయి.
అందరికి పిల్లలు దూరంగా వుంటున్న సరే ,ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు.
నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం ,అతిశయం తో వ్యవహరిస్తూ అందరికి అందరూ గిరిగీసుకుని బతుకుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..
నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.వీళ్లు పెద్ధతనం,ఒంటరి తనం,అనారోగ్య సమస్యలతో బతుకు ఈడుస్తున్నారు. వీళ్ళకు మనిషి తోడు అవసరం అనే ధ్యాస పోయింది.
కనీసం కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు!విపరీతమైన తామసంతో పక్క వాడి నీడ కూడా సహించడం లేదు.
చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు.
వలసలు పుణ్యాన. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.
దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు ఒకటి!
చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..
నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో,అప్పుడే మనుషుల మధ్య దూరం పెరిగింది. మనకు పుట్టిన ఒకడికి వంద సెంటీ జ్వరం వస్తే, మనకు నూట ఐదు జ్వరం.
రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..
కనీసం ఇద్దరిని కనండి.
అత్త, మామయ్య, పెద్ధనాన్న చిన్నాన అనే వరుసలు కాపాడండి.
డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే బతకడం కష్టం కాదు.
కుటుంబ వ్యవస్థను కాపాడండి.
నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి బయటకు రండి.
అందరూ కొద్దిగా ఆలోచించండి..మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ..మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..
ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి..మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము?
ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు..మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..
మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం అతిశయం వదిలి వెద్ధాము..
మన తరువాత కూడా మన పిల్లలకి మన కుటుంబ అనుబంధాలు వారసత్వంగా ఇద్దాము..
నేను కొన్ని వందల కుటుంబాలను చాలా సమీపంగా చూసి..నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించి రాస్తున్నా....
ఓ బంధువు
సేకరణ: వాట్సాప్ పోస్ట్
🍁🍁🍁🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి