30, ఆగస్టు 2020, ఆదివారం

ఇలా ఉండాలి

అప్పు అయ్యేలా* 
*ఖర్చుచేయకండి*,
*పాపమయ్యేలా*
*సంపాదించకండి*,
*అజీర్తి అయ్యేలా*
*తినకండి*,
*మనస్పర్ధలొచ్చేలా*
*మాట్లాడకండి*,
*ఆలస్యమయ్యేలా*
*నడవకండి*,
*ఆలస్యం చేస్తూ*
*కాలాన్ని నిందించకండి*,
*అర్థం చేసుకోకుండా*
*అవమానపర్చకండి*,
*నాదే లోకం అనుకోకుండా*
*ప్రపంచాన్ని చూడండి*,
*ద్వేషాన్ని వదిలేసి*
*ప్రేమను ఆహ్వానించండి*,
*ఇతరులు తక్కువ అనకుండా*
*మనమే తక్కువ చేసుకోండి*,
*కోపంగా 10 మాటలు కాదు*
*ప్రేమగా ఒక్క మాట చాలు*,
*ముందు ఎంతున్నది కాదు*
*వెనక ఎంత ఖ్యాతి ఉందో తెలియాలి*,
*ఎంత సీనియారిటి అన్నది కాదు*
*ఎంత సిన్సియారిటి అన్నది ముఖ్యం*,
*ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు*
*ఎన్ని లోతులు తెలిసాయన్నది ముఖ్యం*,
*ఏమి సాధించామన్నది కాదు*
*ఏమి కోల్పోలేదన్నది ముఖ్యం*,
*ఎంత మంది స్నేహితులన్నది కాదు*
*ఒక్క శత్రువు లేరన్నది ముఖ్యం*,

An Old Lady Withdrawing Money

ఒక వృద్ధురాలైన మహిళ తన బ్యాంకు ఖాతా లో నుండి కొంత డబ్బు డ్రా చేసుకోవాలని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ ఉన్నబ్యాంకు క్యాషియర్ కి బ్యాంక్ కార్డును అందజేసి ఆమెతో “నేను రూ .500 ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను ..” అని అన్నారు.

ఆ మహిళా క్యాషియర్ ఆమెతో, “రూ.5,000 కన్నా తక్కువ డబ్బు డ్రా చేయడం కోసం కనుక అయితే, దయచేసి ఎటిఎం ఉపయోగించండి” అని అంది.

ఆ వృద్ధురాలు “ఎందుకు?” అని అడిగింది. వెంటనే ఆ క్యాషియర్ చిరాగ్గా, “ఇవి బ్యాంకు నియమాలు. వేరే విషయం లేకపోతే దయచేసి వెళ్ళండి . మీ వెనుక క్యూ ఉంది. అంటూ కార్డును వృద్ధురాలికి తిరిగి ఇచ్చేసింది.

వృద్ధురాలు రెండు నిముషాలు మౌనంగా ఉండిపోయింది. కానీ, వెంటనే ఆమె కార్డు క్యాషియర్ కి తిరిగి ఇచ్చి, “దయచేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఉపసంహరించుకోవడంలో నాకు సహాయపడగలరా” అని అడిగింది.

క్యాషియర్ వృద్దురాలి ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె (ఆ క్యాషియర్) చాలా వినయంగా, వృద్ధురాలితో, “నన్ను క్షమించండి మామ్మ గారు, మీ ఖాతాలో 350 కోట్లు రూపాయలు ఉన్నాయి మరియు మా బ్యాంకులో ప్రస్తుతం అంత నగదు లేదు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చి రేపు మళ్ళీ రాగలరా? " అని అడిగింది.

ఆ వృద్ధురాలు, “నేను ఇప్పుడు ఎంత ఉపసంహరించుకోగలను?” అని అడిగింది.

క్యాషియర్ రూ.300,000 వరకు ఎంతైనా " అని చెప్పింది.

ఆ వృద్ధురాలు తన ఖాతా నుండి,రూ.300,000 ఉపసంహరించుకోవాలని చెప్పింది. క్యాషియర్ చక చకా ఆమె అడిగిన మొత్తాన్ని డ్రా చేసి చాలా మర్యాదగా వృద్ధురాలికి ఇచ్చింది. వృద్ధురాలు తన సంచిలో రూ. 500 ఉంచుకొని, మిగిలిన రూ.299,500 లను తిరిగి తన ఖాతాలో జమ చేయమని క్యాషియర్ ను కోరింది. క్యాషియర్ అవాక్కైది.
The moral of this story: అవసరానికి మాత్రమే వినయంగా ప్రవర్తించడం అనేది ఆమోదించతగిన విషయం కాదు. ఎవరినైనా గాని రూపాన్ని బట్టి కానీ, వారు ధరించిన దుస్తులను బట్టి గానీ మాత్రమే గౌరవించడం అనేది సరిఅయింది కాదు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలి.
And ... never be too quick to judge a book by its cover
********************

మూలతత్వమైన శక్తి రాహువు

సృష్టి యెుక్క మూలతత్వమైన శక్తి రాహువు అది గోమేధిక రంగులో అనగా ఎరుపు నిలుపు రంగులో వ్యతిరేక గతిలో తిరుగుట వలన సవ్యగతియైనకేతువుగా మారినది దాని లక్షణము తెలియలేదు. అందువలననే విషు విష్ణతత్వముగా మారి వ్యాప్తమైనదని ఋక్కు తెలుపుచున్నది. అది వరుసగా ఆదయతృచస్యాశ్వినౌ, ద్వీతీయతృచస్సైయిన్ద్రః, తృతీయతృచస్య విశ్వే దేవా, చతుర్ధతృచస్య సరస్వతీ తత్ పంచమత్ త్రిగుణాత్ గాయత్రీ అని. హేతువుగాను మారిన శక్తి ఆదిలో ఋక్కు లక్షెణమైన అశ్వనీ శక్తి గా అశ్వ శక్తిగా, ఆతరువాత యిన్ద్రః పంచభూత యింద్రియశక్తిగా, యింద్రియ శక్తి విశ్వే దేవా విశ్వ వ్యాప్తి యైన దైవ శక్తిగా, దైవ శక్తి వ్యాప్తంగా సమస్త జీవ లక్షణమని, విశ్వరూప అణు ఆత్మ తత్వం గా, ఆతరువాత సరస్వతీ వాక్కు రూప శబ్ద శక్తిగా అది తిరిగి మరలా త్రగుణాత్మకమైన సక్వరజస్తమెూ గుణాత్మకంగా అనగా గాయత్రీ రూప జీవ లక్షణముగా తెలియుచున్నది. శక్తిని సాధన రూపంలో యజుః
తెలియుట యే జీవ లకిషణమైన ప్రకృతి యని అదియే అధ్వరమని యఙ్ఞం లక్షణము ప్రకృతి యని తెలియుట. తెలుసుకుంటూనే ఉందాం ఆచరిస్తూనే ఉందాం.
*******************

పోత‌న త‌ల‌పులో ...(35)

అశ్వ‌త్థామ వ‌దిలినది బ్ర‌హ్మ‌శిరోనామ‌క అస్త్రం,
నువ్వుకూడా బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించు అని అర్జునిడికి
బోధించాడు కృష్ణుడు.
వెంట‌నే బ్ర‌హ్మాస్త్రం ప్ర‌యోగించి
అశ్వ‌త్థామ‌ను బంధించి తీసుకువ‌చ్చి
ద్రౌప‌ది ముందు నిల‌బెట్టాడు అర్జునుడు.
అంత శోకంలోనూ అశ్వ‌త్థామ‌కు న‌మ‌స్క‌రించి ,
 ద్రౌప‌ది సంధించిన ప్ర‌శ్న‌లివి......
                               *****
భూసురుఁడవు, బుద్ధిదయా
భాసురుఁడవు, శుద్ధ వీరభట సందోహా
గ్రేసరుఁడవు, శిశుమారణ,
మాసురకృత్యంబు ధర్మ మగునే? తండ్రీ!

                                 **

ఉద్రేకంబున రారు, శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం
చిద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ, బిన్నపాఁపల, రణప్రౌఢక్రియాహీనులన్,
నిద్రాసక్తుల సంహరింప నకటానీ చేతు లెట్లాడెనో?
                                 **

తండ్రీ! దివ్యమైన బ్రాహ్మణుడివి కదయ్యా; వివేక, దయాదాక్షిణ్యాలతో ప్రకాశించేవాడివి కదయ్యా; వీరాధివీరులందరిలో ఎన్నదగ్గ వాడివి కదయ్యా; అలాంటి నువ్వు బాలుర ప్రాణాలు తీసే ఇలాంటి రాక్షసకృత్యానికి పాల్పడడం ధర్మమా? చెప్పు.
                                  **

ఉద్రేకంతో నీ పైకి దూకలేదే; యుద్ధరంగంలో ఆయుధపాణులై ఎదురు నిలువలేదే;  ఏ చిన్న అప‌కారం  కూడా  ఆ చిన్నిపాప‌లు నీకు చేయలేదే; అటువంటి వాళ్లను, అందాలు చిందే పిన్నవాళ్లను, యద్ధవిద్యలు ఇంకా సరిగా నేర్వని వాళ్లను, నిద్రలో ఆదమరచి ఉన్న వాళ్లను, కారుచీకటిలో, వీరావేశంతో వధించటానికి అయ్యో! నీకు చేతు లెలా వచ్చాయయ్యా?...

  🏵️పోత‌న ప‌ద్యం🏵️
 🏵️కరుణ రసాత్మకం🏵️
**************************

దుఃఖపుటాలోచనలు

దుఃఖపుటాలోచనలు మన ఆరోగ్యానికి,
 ఆనందానికి చాలా హాని చేస్తాయి.

 జయాపజయాలు,
సుఖ దుఃఖాలు అనేవి వస్తాయి, పోతాయి.

అవి శాశ్వతంగా ఉండవు.

అటువంటప్పుడు వాటిని ఎందుకు తీవ్రంగా పట్టించుకొని మనల్ని మనం విచార గ్రస్తులుగా చేసుకోవాలి?
సూర్యుడు దేనికి చిహ్నం?
 కాంతికి, ఆనందానికి చిహ్నం.

జీవితాన్ని ఆనందమయం చేసే ఆ ప్రకాశాన్ని మనలోనే కనుగొనాలని సూర్య తేజం మనకు బోధిస్తున్నది.

అయితే సర్వదా మనల్ని పరిరక్షించే భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనలోని ఈ చిరుదివ్వెను ఉజ్జ్వలంగా ప్రకాశించేలా చేయగలం.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.

*శ్రీమన్నారాయణా!*
మాలో ఉన్న దైవం నూతన అవగాహన మాలో కలిగించుగాక, మాలో శాశ్వతానందమును కలిగించుగాక,
ఆ ఆనందజ్యోతి సకల అంధకారాన్ని,
 విచారాన్ని పారద్రోలుగాక,
మా జీవితం ఇతరులకు ఆనందాన్ని పంచుతూ, దైవకృప,
దైవ ఆశీస్సుల యొక్క విలువను మరీ మరీ నిరూపించుగాక.


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*
***********************

వినాయక వైభవం:-4🚩*


🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️

వినాయకుని ఆసనంలో గల అంతరార్థం:
తనను చేరిన భక్తులకు సకల శుభాలను చేకూర్చే వినాయకుడు తాను భక్తుల పాలిట కల్పతరువు అని సూచించకనే సూచిస్తూ ఉంటాడు! ఆయన భంగిమ‌ల‌ను కాస్త గమనిస్తే అవుననే అనిపిస్తుంది. మనం నిత్యం వివిధ రూపాల్లో ఉన్న గణనాధులను చూస్తు ఉంటాము. శాస్త్ర ప్రకారం వినాయకుని యొక్క ఆసనాలను ఈ రోజు పరిశీలన చేద్దాం.

లలితాసనం:-
 చాలా ప్ర‌తిమ‌ల‌లో వినాయ‌కుడు త‌న ఎడ‌మ కాలుని ముడుచుకుని, కుడి పాదాన్ని కింద‌కి ఉంచి క‌నిపిస్తాడు. దీనినే యోగ‌శాస్త్రంలో ల‌లితాస‌నం అంటారు. సాక్షాత్తూ జ్ఞానానికి ప్ర‌తిబింబ‌మైన ల‌లితాదేవి కూడా ఈ ఆస‌నంలోనే క‌నిపిస్తుంది. భార‌తీయ ప్ర‌తిమ‌ల‌లో ఇది కాస్త అరుదైన‌ప్ప‌టికీ, బౌద్ధానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు ఈ ఆస‌నాన్ని సూచిస్తుంటాయి. ఒక ప‌క్క ప్రశాంతంగా ఉంటూనే అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎలాంటి కార్యాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే త‌త్వానికి ఈ ఆస‌నాన్ని ప్ర‌తీక‌గా భావిస్తారు. క‌ర్మ‌యోగుల‌కు ఈ రెండూ అవ‌స‌ర‌మే క‌దా! ఒక ప‌క్క జీవితంలో ఎదుర‌య్యే ఒడుదొడుకులను ఎదుర్కొంటూనే, మ‌న‌సుని స్థిరంగా నిలుపుకోగ‌ల‌డ‌మే మాన‌వుల‌కి నిజ‌మైన స‌వాలు. తాను అలాంటి స్థితిలో ఉన్నాన‌ని గ‌ణేశుడు చెప్ప‌క‌నే చెబుతున్నాడ‌న్న‌మాట‌. త‌న‌ను కొలిచే భ‌క్తుల విఘ్నాల‌ను తొల‌గించి వారిని కూడా పరిపూర్ణ‌మైన వ్య‌క్తులుగా తీర్చిదిద్దుతాన‌ని హామీ ఇస్తున్నాడు. అందుక‌నే భ‌క్తులు ఎక్కువ‌గా ల‌లితాస‌నంలో ఉన్న వినాయ‌కునికే పూజ‌లు చేస్తుంటారు.

అభంగం:-
స‌్థిరంగా నిల్చొని ఉన్న గ‌ణ‌ప‌తి రూపాన్ని `అభంగ‌` అంటారు. కాసేపు నిల్చొని ఉంటే `ఇక చాలు కూర్చుందాం` అని ఎవ‌రికైనా అనిపిస్తుంది. కానీ తాను నిల్చొని ఉన్నాన‌న్న బాధ‌ను కూడా జ‌యించి మ‌న‌సుని స్థిరంగా ఉంచుకోగ‌ల‌డ‌డం ఈ భంగిమ‌లోని ప్ర‌త్యేక‌త‌. జైనుల ధ్యాన ప‌ద్ధతుల‌లో ఈ భంగిమ‌ను పోలిన‌ `కాయోత్స‌ర్గ‌`కు గొప్ప ప్రాముఖ్య‌త ఉంది. తాను చూడ‌టానికి భారీకాయంతో ఉన్నా త‌న మ‌న‌స్సు ఆ శారీర‌క ప‌రిమితుల‌కు లోబ‌డ‌ద‌ని గ‌ణేశుడు ఈ భంగిమ‌లో మ‌న‌కి సూచిస్తున్నాడు. త‌న ద‌రికి చేరిన భ‌క్తుల‌కు విజయాన్ని చేకూర్చేందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని కూడా ఆ విఘ్న‌నాయ‌కుడు తెలియ‌చేస్తున్నాడు. భ‌క్తుల‌ను కూడా దృఢ‌సంక‌ల్పంతో ఉండ‌మ‌ని ప్రోత్స‌హిస్తున్నాడు. ఈ భంగిమ‌లోని కొద్దిపాటి మార్పులని బ‌ట్టి ద్విభంగ‌, త్రిభంగ భంగిమ‌లు అంటారు.

నాట్య గణపతి:-
నాట్య భంగిమ‌లో ఉన్న గ‌ణేశుని విగ్ర‌హాలను ఇళ్ల‌లోకి అలంకారంగా ఉంచుకునేందుకు ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తారు. త‌న త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టేందుకు గ‌ణేశుడు వారి ముందు నాట్యం చేసేవాడ‌ట‌. ప‌ట్ట‌రాని సంతోషం క‌లిగిన‌ప్పుడు ఎవ‌రికైనా నాట్యం చేయాల‌ని ఉంటుంది. అలా భ‌క్తుల‌కు అంతులేని ఆనందాన్ని అనుగ్ర‌హిస్తాన‌ని ఈ భంగిమ సూచిస్తుంది. మ‌న‌సులోని భావాల‌కు అనుగుణంగా ల‌య‌బ‌ద్ధమైన అడుగులు వేయ‌డం మ‌న భార‌తీయ నాట్య‌శాస్త్రంలోని ప్ర‌త్యేక‌త‌. మ‌నసు, శ‌రీరం రెండూ ఒక‌దానికొక‌టి అనుగుణంగా సాగే ఈ ఆనంద తాండ‌వంలా మ‌న అంద‌రి జీవిత‌మూ హాయిగా సాగిపోవాల‌ని ఆ గ‌ణేశుడు సంక‌ల్పిస్తున్నాడ‌న్న‌మాట‌. మ‌రికొన్ని అరుదైన సంద‌ర్భాల‌లో శ‌య‌న గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు కూడా పూజ‌లందుకుంటూ ఉంటాయి. భంగిమ ఏదైనా త‌న భ‌క్తులకు స‌క‌ల విజ‌యాల‌నూ క‌లిగించ‌డ‌మే ఆ విఘ్న‌నాయ‌కుని ల‌క్ష్యం! ఆయ‌న‌ను కొలుచుకుని కోరుకున్న విజ‌యాల‌ను చేరుకోవ‌డం భ‌క్తుల‌కు నిత్యానుభ‌వం!
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
శ్రీ మహా గణాధిపతయే నమః🙏🙏🙏🙏🙏🙏
********************

"సంధ్య" అంటే సంధికాలం

"సంధ్య" అంటే సంధికాలం అని అర్థం. రాత్రికి సూర్యోదయానికి మధ్య ఉన్న సంధికాలాన్ని "ప్రాంతహ్ సంధ్య" అంటారు. ఉదయానికి మధ్యాహ్నం కాలానికి కల సంధికాలాన్ని "మధ్యాహ్నిక సంధ్య" అంటారు. అలాగే సాయం కాలానికి, రాత్రికి మధ్య గల సంధికాలాన్ని "సాయం సంధ్య" అంటారు. ఈ మూడు సంధికాలాలను కలిపి "త్రికాల సంధ్యలు" అంటారు పెద్దలు. ప్రతీ రోజూ ఈ మూడు సంధికాలాలను మనం చూస్తూనే ఉంటాము. ప్రకృతి లో మార్పులు కూడా ఈ సంధికాలాల్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటికి విశిష్టత ఏర్పడింది. ఈ మార్పులు శుభములు కావచ్చును, కాకపోవచ్చును. సాధారణంగా అందరూ శుభములే కోరుకుంటారు. కాలగతి మాత్రం పంచభూతములు, అష్ట దిక్పాలకులు, నవగ్రహలు వారి వారి అధి దేవతలు మొదలగు వారి ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రక్రుతి శక్తులు అన్ని బాహ్యేంద్రియాలకు గోచారం గాని ఒక పరబ్రహ్మ తత్వం ఆధీనంలో ఉంటాయి. వీరందరూ శుభులు అయినప్పుడు మనకు తప్పకుండా శుభమే జరుగుతుంది. మనకూ, మన వారందరికీ శుభం చేకూరాలని ప్రార్ధించటాన్నే "సంధ్యావందనం" అంటాము.
        ఈ సంధ్యావందనం స్త్రీ లు, పురుషులు అందరూ చేయవచ్చును అని పెద్దలు అంటారు. కేవలము బ్రాహ్మణులే చేయాలని పూర్వం కొందరు చెప్పేవారు. అందరూ బ్రాహ్మణులు కావడానికి ఎట్టి అభ్యంతరమూ ఎవరూ చెప్పలేరు కాబట్టి ఈ సంధ్యావందనం నిత్యమూ చేసేవారిని బ్రాహ్మణులు అనవచ్చును. ఇచట"బ్రాహ్మణుడు" అంటే ఒక కులం కాదు. అది గుణ ప్రధాన మైన ఒక జాతి. అటువంటి బ్రాహ్మణులు ను సమాజం గౌరవిస్తుంది. సమస్త వేదాలను అవుపోసన పట్టిన వారే బ్రాహ్మణులు. కేవలం జన్మతః ఎవరూ అసలయిన బ్రాహ్మణుడు కావడం లేదు. బ్రహ్మ ఙ్ఞానం సంపాదనకై తహతహలాడే ప్రతి మానవుడు బ్రాహ్మణుడే." ఉపనయనం "అనే ఒక ప్రక్రియ ఉన్నది. బ్రహ్మ ఙ్ఞానం ను సంపాదించుకోవడానికి మన భౌతిక (బాహ్య) నేత్రాలు సరిపోవు. ఙ్ఞాన(అంతరంగ) నేత్రాలు కావాలి. అట్టి ఙ్ఞాన నేత్రాలు ప్రసాదించేదే ఉపనయన ప్రక్రియ. జన్మ కారకుడు, వీర్య ప్రదాత అయిన తండ్రి తో గాయత్రీ ఉపదేశం ఇప్పిస్తారు పండితులు. ఈ విధంగా ఙ్ఞాన నేత్రాలు పొందిన వానిని "ద్విజుడు" అంటారు. అంటే రెండు జన్మ లు ఎత్తిన వాడని అర్థం. ప్రతీ మానవుడు జన్యుపరంగా ఒకేసారి జన్మిస్తాడు. ఙ్ఞాన సముపార్జన కొరకు రెండో జన్మ ఎత్తి ద్విజుడు అవుతాడు.
         మానవ జన్మ చాలా దుర్లభమైనది. అందు వలన గాయత్రీ ఉపదేశము పొందిన ప్రతీ ద్విజుడూ కూడా జన్మ వ్యర్ధం చేసుకోకుండా నిత్యం త్రిసంధ్యలు గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి. అలాగే మిగిలిన మానవులు కూడా తమ జన్మ వ్యర్ధం కాకుండా నిత్యం భగవదారాధన చేయాలి. సేకరణ
*********************

*‌*సౌందర్య లహరి**



ప్రక్షిప్త శ్లోకము - 3

( **శ్రీ శంకర భగవత్పాద విరచితము**)

(శ్రీ లలితాంబికాయైనమః)

ప్రక్షిప్త శ్లోకాలలో ఈ మూడవ శ్లోకం ౘాలా ప్రసిద్ధ మైనది. ఇది శ్రీదేవి ధ్యాన
శ్లోకం. ఈ శ్లోకం లో. "ని" తో ప్రారంభమయ్యే శబ్ధాలు పదిహేను ఉన్నాయి.
ఇది అమ్మవారి "పంచదశాక్షరీ" మంత్ర రూపము వంటిదని ఉపాసనాపరులు
తెలుపు తున్నారు.

ఈ స్తోత్రము, నీయందు చేరుగాక అనీ , ఈ స్తోత్రాన్ని లేదు తుల్యంగా చేయమని
దేవి టి ఇందులో శంకరులు ప్రార్థించారు.

"నిధే! నిత్యస్మేరే! నిరవధి గుణే ! నీతినిపుణే
 నిరాధారజ్ఞానే !(నిరాఘాతజ్ఞానే!) నియమపరిచిత్తైకనిలయే!
 నియత్యా నిర్ముక్తే ! నిఖిల నిగమాంతస్తుతి (త) పదే !
 నిరాంతకే ! నిత్యే !నిగమయ మదీయాం స్తుతి మిమామ్ !!"

అమ్మా ! జగన్మాతా! సద్గుణములకు నిధీ, ఎల్లప్పుడూ చిరునవ్వు
కలదానా !అనంత కల్యాణ గుణ సంపన్నా ! నీతి నైపుణ్యము కలదానా !
అప్రతిహతమైన జ్ఞానసంపన్నురాలా ! నియమపరులైన ఉపాసకుల
చిత్తములో నివసించే తల్లీ ! ప్రకృతి బంధములు అనే నియమాలను ఉండి
విముక్తమైనదానా! సమస్తవేదాల శిరస్సు లైన ఉపనిషత్తులచే స్తుతింపబడిన
పాదపద్మాలు కలదానా ! ఏ ఆటంకము రూ లేనిదానా! ఈ స్తోత్రమును
నీయందు చేర్చుకో. ( ఈ స్తోత్రమును నీ యందు సమన్వయించుకో) దీన్ని
వేదతుల్యంగా చెయ్యి. (ఇది స్తోత్రకర్త చేసిన దేవీ ప్రార్థన).

ఓం సర్వేశ్వర్యైనమః
ఓం సర్వమయ్యైనమః
ఓం సర్వమంత్రస్వరూపిణ్యైనమః

🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**
🙏🙏🙏
https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU

 **హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
******************

శ్రీ త్రివిక్రమాష్టకం

1) నమో భగవతే త్రివిక్రమాయ
   త్రిలోకరక్షకమత్స్యావతారాయ
   జన్మమృత్యుజరావ్యాధివివర్జితాయ
   భక్తపరిపాలకలీలామానుషవిగ్రహాయ ||

2) నమో భగవతే త్రివిక్రమాయ
   పయోసముద్రస్థితవైకుంఠవాసాయ
   జయవిజయపార్షగణాదిసేవితాయ
   కలికలుషాపహారకల్కిస్వరూపాయ ||

3) నమో భగవతే త్రివిక్రమాయ
   మహీధరఆదిశేషావతారాయ 
   చిత్తవృత్తినిరోధకసామర్ధ్యప్రదాయ
   భీకరజ్వాలామాలాస్వరూపాయ ||

4) నమో భగవతే త్రివిక్రమాయ
   మాయానియామకజగద్రక్షాయ
    అంతర్ముఖదృష్టిప్రదకార్యోన్ముఖాయ
    దివ్యప్రభావస్వాయంభువస్వరూపాయ ||

5) నమో భగవతే త్రివిక్రమాయ
   క్షత్రియవంశనాశకభార్గవరామాయ
   వేదవేదాంగశాస్త్రవినీతవామనాయ
   ప్రదోషసమయమృదంగవాదనాయ ||

6) నమో భగవతే త్రివిక్రమాయ
   దీనార్తగజేంద్రరక్షకహస్తాయ
   రమాహృదయసామ్రాజ్యసుస్థితాయ
   సకలశుభలక్షణసుశోభితాంగాయ ||

7) నమో భగవతే త్రివిక్రమాయ
    చేతనాచేతవ్యక్తావ్యక్తస్వరూపాయ
    జాగ్రత్స్వప్నసుషుప్త్యావస్థాతీతాయ 
    అఖిలాండకోటిబ్రహ్మాండనాయకాయ ||

8) నమో భగవతే త్రివిక్రమాయ
   సమయోచితకార్యాచరణమార్గదర్శకాయ
   సంయమనశీలసునిర్మలమానసాయ
   సర్వోపనిషత్సారపరమాణుస్వరూపాయ ||

     సర్వం శ్రీత్రివిక్రమదివ్యచరణారవిందార్పణమస్తు
************************

“శ్రీ”కారం

*ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ”కారం రాస్తారెందుకు?*

“శ్రీ” లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.
“శ్రియ మిచ్దేద్దు తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.
మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.
ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుం
***************************

Life turned on it’s head in just 40 years!!!

 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴡᴀɴᴛᴇᴅ ᴛᴏ ʜᴀᴠᴇ ᴄʜɪʟᴅʀᴇɴ. ᴛᴏᴅᴀʏ ᴍᴀɴʏ ᴘᴇᴏᴘʟᴇ ᴀʀᴇ ᴀғʀᴀɪᴅ ᴏғ ʜᴀᴠɪɴɢ ᴄʜɪʟᴅʀᴇɴ.
..........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴄʜɪʟᴅʀᴇɴ ʀᴇsᴘᴇᴄᴛᴇᴅ ᴛʜᴇɪʀ ᴘᴀʀᴇɴᴛs. ɴᴏᴡ ᴘᴀʀᴇɴᴛs ʜᴀᴠᴇ ᴛᴏ ʀᴇsᴘᴇᴄᴛ ᴛʜᴇɪʀ ᴄʜɪʟᴅʀᴇɴ.
........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴍᴀʀʀɪᴀɢᴇ ᴡᴀs ᴇᴀsʏ ʙᴜᴛ ᴅɪᴠᴏʀᴄᴇ ᴡᴀs ᴅɪғғɪᴄᴜʟᴛ. ɴᴏᴡᴀᴅᴀʏs ɪᴛ ɪs ᴅɪғғɪᴄᴜʟᴛ ᴛᴏ ɢᴇᴛ ᴍᴀʀʀɪᴇᴅ ʙᴜᴛ ᴅɪᴠᴏʀᴄᴇ ɪs sᴏ ᴇᴀsʏ.
.........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴡᴇ ɢᴏᴛ ᴛᴏ ᴋɴᴏᴡ ᴀʟʟ ᴛʜᴇ ɴᴇɪɢʜʙᴏʀs. ɴᴏᴡ ᴡᴇ ᴀʀᴇ sᴛʀᴀɴɢᴇʀs ᴛᴏ ᴏᴜʀ ɴᴇɪɢʜʙᴏʀs.
.......................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴠɪʟʟᴀɢᴇʀs ᴡᴇʀᴇ ғʟᴏᴄᴋɪɴɢ ᴛᴏ ᴛʜᴇ ᴄɪᴛʏ ᴛᴏ ғɪɴᴅ ᴊᴏʙs. ɴᴏᴡ ᴛʜᴇ ᴛᴏᴡɴ ᴘᴇᴏᴘʟᴇ ᴀʀᴇ ғʟᴇᴇɪɴɢ ғʀᴏᴍ ᴛʜᴇ CITY ᴛᴏ ғɪɴᴅ ᴘᴇᴀᴄᴇ.
......................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴡᴀɴᴛᴇᴅ ᴛᴏ ʙᴇ ғᴀᴛ ᴛᴏ ʟᴏᴏᴋ ʜᴀᴘᴘʏ. ɴᴏᴡᴀᴅᴀʏs ᴇᴠᴇʀʏᴏɴᴇ ᴅɪᴇᴛs ᴛᴏ ʟᴏᴏᴋ ʜᴇᴀʟᴛʜʏ.
........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ʀɪᴄʜ ᴘᴇᴏᴘʟᴇ ᴘʀᴇᴛᴇɴᴅᴇᴅ ᴛᴏ ʙᴇ ᴘᴏᴏʀ. ɴᴏᴡ ᴛʜᴇ ᴘᴏᴏʀ ᴀʀᴇ ᴘʀᴇᴛᴇɴᴅɪɴɢ ᴛᴏ ʙᴇ ʀɪᴄʜ.
.........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴏɴʟʏ ᴏɴᴇ ᴘᴇʀsᴏɴ ᴡᴏʀᴋᴇᴅ ᴛᴏ sᴜᴘᴘᴏʀᴛ ᴛʜᴇ ᴡʜᴏʟᴇ ғᴀᴍɪʟʏ. ɴᴏᴡ ᴀʟʟ ʜᴀᴠᴇ ᴛᴏ ᴡᴏʀᴋ ᴛᴏ sᴜᴘᴘᴏʀᴛ ᴏɴᴇ ᴄʜɪʟᴅ.                 
..........................................
*40 ʏᴇᴀʀs ᴀɢᴏ*, ᴘᴇᴏᴘʟᴇ ʟᴏᴠᴇᴅ ᴛᴏ sᴛᴜᴅʏ & ʀᴇᴀᴅ ʙᴏᴏᴋs. ɴᴏᴡ ᴘᴇᴏᴘʟᴇ ʟᴏᴠᴇ ᴛᴏ ᴜᴘᴅᴀᴛᴇ ғᴀᴄᴇʙᴏᴏᴋ & ʀᴇᴀᴅ ᴛʜᴇɪʀ ᴡʜᴀᴛsᴀᴘᴘ ᴍᴇssᴀɢᴇs.

*40 YEARS WAS 1980..WHICH SEEMS LIKE JUST YESTERDAY!*

 *REFLECT ON ALL THE ABOVE REALISTIC FACTS These are hard ғᴀᴄᴛ of ᴛᴏᴅᴀʏ's ʟɪғᴇ.*
*********************

*అన్ లాక్ 4.0*




అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రం పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది.
అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ ....

సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి

సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ బంద్‌

సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ బంద్‌

100 మందికి మించకుండా స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజకీయ సమావేశాలకు అనుమతి

సెప్టెంబర్‌ 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలను తొలగించిన కేంద్రం

అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు

చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలన్న కేంద్రం

అత్యవసరమైతేనే బయటకు రావాలన్న కేంద్రం

సెప్టెంబర్‌ 30 వరకు కంటైన్మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు
*********************

రామాయణమ్. 46


కైకమాటలు పుట్టించిన శబ్దప్రకంపనలు దశరధమహారాజు హృదయకవాటాన్ని భేదిస్తున్నాయి.

ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలికూడ ఆయనకు అప్రియంగా తోచింది కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది.
.
నిశ్చేష్టుడైపోయాడు ! నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా! అప్పటిదాకా ఆమెచుట్టూ అల్లుకొన్న మోహభావనలు టపటపతెగిపోయాయి .ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము,జుగుప్స గా రూపాంతరంచెందింది .
.
మొదలునరికిన చెట్టులాగ కూలబడిపోయాడు ! ఛీ!ఛీ! అని ఛీత్కారాలు చేసుకుంటూ స్పృహతప్పిపోయాడు . మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగ విడుస్తున్నాడు ఉచ్ఛ్వాశనిశ్వాసాలు.
.
చాలాసేపటికి కొంతతేరుకున్నాడాయన నేత్రాలు అరుణిమదాల్చాయి ,కన్నులనుండి నిప్పుకణాలప్రవాహంలాగ ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి.
.
చాలా తీవ్రంగా దూషించాడు కైకను ! ఓసీ దుష్టురాలా,పాపాత్మురాలా సర్వప్రాణికోటి హితముగోరే రాముడు నీకేం అపకారంచేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు!
.
నిన్ను కన్నతల్లిలాగ చూసుకుంటున్నాడు కదనే వాడు ! వాడికే అనర్ధము తలపెడతావా! నీవు, ఓసి పాతకీ!
.
నీవు రాజకుమారివని తలచి తెచ్చుకొన్నానే కానీ లోకాలన్నీదహించివేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే!.
.
రాముడిలోని ఒక్కదోషము చెప్పునీవు ! ఏ దోషమున్నదని అడవులకు పంపాలి ?.
.
కౌసల్యను,సుమిత్రను ,నా సకలైశ్వర్యాలను,రాజ్యాన్ని,చివరకు నా ప్రాణాన్నయినా విడుస్తాను కానీ నారాముని నేను విడువలేను.
.
వాడేనాకు పరమానందము,వాడే నాకు బ్రహ్మానందము,వాడేనాకు దివ్యచైతన్యము.
.
సూర్యుడులేకుండా ఈ ప్రపంచముండవచ్చునేమో! నీరులేకుండా పంటలు పండవచ్చునేమో కానీ నారాముడు లేక నాప్రాణముండదు!.
.
కైకా! ఇకచాలు ! ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు! నాకు భరతుడిపైగల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా! 
.
నీవేకదా రాముడు సకలగుణాభిరాముడు,జ్యేష్ఠుడు వానికే రాజ్యాధికారమున్నదని నిన్నటిదాకా నాతోపలికెడిదానవు!
ఈ రోజు నా కేదయినా పరీక్షపెట్టదలిచావా? చెప్పు!.
.
ఎంతోనీతిసంపన్నురాలవు అనికదా నీకున్నపేరు! ఈ రోజు నీబుద్ధిలో ఈ వికారం ఏల జన్మించింది?.
.
పూర్వమెప్పుడూ నీలో రవ్వంతదోషము కూడా నాకుకానరాలేదు! మరి ఈరోజు ఎందుకిలా!
.
నారాముడు ! ఇక్ష్వాకు రాకుమారుడు! అత్యంతసుకుమారుడు ! 
ఘోరారణ్యములలో జటాధారియైసంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది ! కైకా నీకోరిక ఉపసంహరించుకో!.
.
అసలు నీకు రాముడుచేసినంత శుశ్రూష భరతుడుకూడా చేయలేదే ! .
.
రాముడు మహావీరుడు ! ధర్మవీరుడు,దయావీరుడు,దానవీరుడు,యుద్ధవీరుడు! 
.
కపటములేని రామునియందు నీకింతకాఠిన్యముతగదు ! 
.
కైకా ! కాటికి కాళ్ళు చాపుకొన్న ముసలివాడను నేను నామీద కరుణచూపవే ! నీ కాళ్ళుపట్టుకుంటాను.
.
అని పరిపరి విధాలుగా ప్రాధేయపడుతున్నాడు దశరధమహారాజు.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
...
కైకమాటలు పుట్టించిన శబ్దప్రకంపనలు దశరధమహారాజు హృదయకవాటాన్ని భేదిస్తున్నాయి.
ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలికూడ ఆయనకు అప్రియంగా తోచింది కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది.
.
నిశ్చేష్టుడైపోయాడు ! నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా! అప్పటిదాకా ఆమెచుట్టూ అల్లుకొన్న మోహభావనలు టపటపతెగిపోయాయి .ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము,జుగుప్స గా రూపాంతరంచెందింది .
.
మొదలునరికిన చెట్టులాగ కూలబడిపోయాడు ! ఛీ!ఛీ! అని ఛీత్కారాలు చేసుకుంటూ స్పృహతప్పిపోయాడు . మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగ విడుస్తున్నాడు ఉచ్ఛ్వాశనిశ్వాసాలు.
.
చాలాసేపటికి కొంతతేరుకున్నాడాయన నేత్రాలు అరుణిమదాల్చాయి ,కన్నులనుండి నిప్పుకణాలప్రవాహంలాగ ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి.
.
చాలా తీవ్రంగా దూషించాడు కైకను ! ఓసీ దుష్టురాలా,పాపాత్మురాలా సర్వప్రాణికోటి హితముగోరే రాముడు నీకేం అపకారంచేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు!
.
నిన్ను కన్నతల్లిలాగ చూసుకుంటున్నాడు కదనే వాడు ! వాడికే అనర్ధము తలపెడతావా! నీవు, ఓసి పాతకీ!
.
నీవు రాజకుమారివని తలచి తెచ్చుకొన్నానే కానీ లోకాలన్నీదహించివేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే!.
.
రాముడిలోని ఒక్కదోషము చెప్పునీవు ! ఏ దోషమున్నదని అడవులకు పంపాలి ?.
.
కౌసల్యను,సుమిత్రను ,నా సకలైశ్వర్యాలను,రాజ్యాన్ని,చివరకు నా ప్రాణాన్నయినా విడుస్తాను కానీ నారాముని నేను విడువలేను.
.
వాడేనాకు పరమానందము,వాడే నాకు బ్రహ్మానందము,వాడేనాకు దివ్యచైతన్యము.
.
సూర్యుడులేకుండా ఈ ప్రపంచముండవచ్చునేమో! నీరులేకుండా పంటలు పండవచ్చునేమో కానీ నారాముడు లేక నాప్రాణముండదు!.
.
కైకా! ఇకచాలు ! ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు! నాకు భరతుడిపైగల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా!
.
నీవేకదా రాముడు సకలగుణాభిరాముడు,జ్యేష్ఠుడు వానికే రాజ్యాధికారమున్నదని నిన్నటిదాకా నాతోపలికెడిదానవు!
ఈ రోజు నా కేదయినా పరీక్షపెట్టదలిచావా? చెప్పు!.
.
ఎంతోనీతిసంపన్నురాలవు అనికదా నీకున్నపేరు! ఈ రోజు నీబుద్ధిలో ఈ వికారం ఏల జన్మించింది?.
.
పూర్వమెప్పుడూ నీలో రవ్వంతదోషము కూడా నాకుకానరాలేదు! మరి ఈరోజు ఎందుకిలా!
.
నారాముడు ! ఇక్ష్వాకు రాకుమారుడు! అత్యంతసుకుమారుడు !
ఘోరారణ్యములలో జటాధారియైసంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది ! కైకా నీకోరిక ఉపసంహరించుకో!.
.
అసలు నీకు రాముడుచేసినంత శుశ్రూష భరతుడుకూడా చేయలేదే ! .
.
రాముడు మహావీరుడు ! ధర్మవీరుడు,దయావీరుడు,దానవీరుడు,యుద్ధవీరుడు!
.
కపటములేని రామునియందు నీకింతకాఠిన్యముతగదు !
.
కైకా ! కాటికి కాళ్ళు చాపుకొన్న ముసలివాడను నేను నామీద కరుణచూపవే ! నీ కాళ్ళుపట్టుకుంటాను.
.
అని పరిపరి విధాలుగా ప్రాధేయపడుతున్నాడు దశరధమహారాజు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
********************

బాబోయ్ కరోనా...



ఈ రోజు పాలవాడు చెప్తున్నాడు -
రేపటి నుండి immunity పెంచే పాలు తీసుకుని రానా, 1 lit. మీద rs. 10 extra.

అరే రే, ఇది ఎలాంటి పాలు?

ఇలాంటి ఆవు 🐂 పాల కోసం మేమ్ రోజు లెమన్ 🍋 ఇంకా ఆరంజ్ 🍊 తినిపింపిస్తాం దీని వలన పాలల్లో Vitamin C ఇంకా రోజు మార్నింగ్ ఓ గంట ఎండలో ☀️ నుంచో పెడతాం దీని వల్ల Vitamin D కూడా పుష్కలంగా లభిస్తుంది పాలల్లో, ఈ పాలు 🥛తాగితే immunity పెరుగుతుంది
😂😂😂

బాబు, నువ్వోక్కడివే మిగిలిపోయావ్, నువ్వు కూడా దోచేసుకో..
*******************************

అర్థం చేసుకోరూ...


‘బుజ్జి కుక్కపిల్లలు అమ్మబడును’ అని రాసి ఉన్న తోట వద్దకు వచ్చాడొక బాలుడు. చెంగుచెంగున ఆడుతూ ఎంతో ముద్దొస్తున్న పప్పీలను చూశాడు. ఒకటి కుంటిది. కాలు ఈడుస్తూ వస్తోంది. ‘అదే కావాలి’ అన్నాడు పిల్లాడు. అమ్మకందారుడు ఆశ్చర్యపోయాడు. ‘సరిగ్గా నడవలేదు, నీతో సమానంగా పరుగెత్తలేదు. మంచిదాన్ని తీసుకో’ అని సలహా ఇచ్చాడు. పిల్లవాడు నవ్వాడు. పంట్లాం పైకి లాగి తన కాలు చూపించాడు. అది కర్రకాలు. ‘కుంటిదానితోనే నేను బాగా ఆడుకోగలను, దాన్ని నేనే చక్కగా అర్థం చేసుకోగలను, అదే ఇవ్వండి’ అన్నాడు. ఒక ఆంగ్లకథ సారాంశమిది. ‘అర్థం చేసుకోవడం’ అనే పదానికి భాష్యమది. అర్థం చేసుకోవడం తెలిస్తే ఈ ప్రపంచంతో అందమైన సయోధ్య కుదురుతుందని బోధించే గొప్ప పాఠమది. ‘గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో’ అన్న దాశరథి కంటితడిని ఆ బాలుడు తన పలుకుల్లో పరిచయం చేశాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అర్థం చేసుకోవడమనే మాట ఒక వేదమంత్రం. అది ఆనందానికి అసలు సూత్రం. పెళ్ళి మంత్రాల్లోని ‘సఖ్యం’ అనే మాటకు తాత్పర్యం అదే. కొన్నిసార్లు కలతలు రావచ్ఛు అపార్థాలు ఏర్పడవచ్ఛు ‘కలసినయంత మాత్రమున కాదు సుమీ చెలికారము! అంతరంబులను అతుకంగ జాలిన అపూర్వపు లంకెయె స్నేహమౌ...’ అని రాయప్రోలు అన్నట్లుగా, సఖ్యం స్నేహం ప్రేమ వంటి దీప వికాసాలకు అర్థం చేసుకోవడమే సరైన ఇంధనం. ఇద్దరి మధ్య చక్కని అవగాహనే సంసార రథానికి ఇరుసు. చక్రాలను సజావుగా నడిపే కందెన.
‘ఆడ మనసును అర్థం చేసుకోవడం కష్టం’ అనేది చాలామంది అభిప్రాయం. ద్రాక్షాపాకం కదళి(అరటిపండు) పాకంలా కాదు...’ నారికేళ పాకము సుమీ! కామినీ హృదయ కావ్యరస గ్రహణంబు...’ దింపు తీసి డొక్క వలిచి టెంక చీల్చి కొబ్బరిముక్కను తిన్నంత కష్టం అన్నారు కవులు. శృంగార పటిమ కాదు, స్త్రీని అర్థం చేసుకోవడమే అసలైన మగతనం. తనతో అడవికి రావద్దని రాముడు శతవిధాల వారిస్తుంటే, సీతమ్మ వంటి సాధ్వి ‘నీవు మగాడివి అనుకొన్నాడే నా తండ్రి’ అంది. ఎదురయ్యే ప్రమాదాల వర్ణన కాదు, వాటినుంచి కాపాడగల మగటిమిని రాముడినుంచి ఆశించిందామె. సరుకులంటే నగలు. ‘సరుకులేమి కావాలే ఎలుతురు పిట్టా?’ అని అడిగితే ‘మరమ మిడిసి మనసునివ్వు నాయుడు బావా’ అంది యెంకి. పురాణ మహిళలు, జానపద స్త్రీలు అందరూ నిర్మలమైన మనసు కోరుకుంటారు. వారికి కావలసినవి కానుకల ధరలు కావు- వాటితో పెనవేసుకొనే జ్ఞాపకాల విలువలు. ఆడతనాన్ని అందలం ఎక్కించే మగతనం కావాలి వారికి. దీన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపడతారు, తడబడతారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏణ్నర్ధం క్రితం పెళ్ళాడిన భార్యపై ఆమె భర్త అలవికానంత ప్రేమను ఒలకబోస్తూ వచ్చాడు. ఇంటిపనీ వంటపనీ మొత్తం తానే చక్కబెట్టేస్తూ వచ్చాడు. భార్యలా కాకుండా మరీ దేవతలా చూస్తూ వచ్చేసరికి ఆమెకు విసుగెత్తి విడాకుల కోసం కోర్టుకెక్కింది. ‘అరవడు కరవడు నన్నెప్పుడూ కొట్టడు తిట్టడు ఆఖరికి ఏదైనా తప్పు చేసినా నన్ను ఏమీ అనడు... నేనింక ఎవరితో పోట్లాడాలి?’ అని న్యాయమూర్తి ముందు వాపోయిందావిడ. మొగుడు మొగలి పొత్తులా ఉండాలి గాని మల్లెపూవులా ఉంటే ఎలా... అనేది ఆమె ఆవేదన. హాస్యంగా కాదు, ఒక ఆధునిక యువతి ఆంతర్యంగా అర్థం చేసుకోవాలి దాన్ని. ఆమెకు కావలసింది బానిస కాదు, నికార్సయిన భర్త. మొగుడు మగాడిలాగే ఉండాలి, భార్య మనసును అర్థం చేసుకొంటూ!
******************