కైకమాటలు పుట్టించిన శబ్దప్రకంపనలు దశరధమహారాజు హృదయకవాటాన్ని భేదిస్తున్నాయి.
ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలికూడ ఆయనకు అప్రియంగా తోచింది కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది.
.
నిశ్చేష్టుడైపోయాడు ! నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా! అప్పటిదాకా ఆమెచుట్టూ అల్లుకొన్న మోహభావనలు టపటపతెగిపోయాయి .ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము,జుగుప్స గా రూపాంతరంచెందింది .
.
మొదలునరికిన చెట్టులాగ కూలబడిపోయాడు ! ఛీ!ఛీ! అని ఛీత్కారాలు చేసుకుంటూ స్పృహతప్పిపోయాడు . మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగ విడుస్తున్నాడు ఉచ్ఛ్వాశనిశ్వాసాలు.
.
చాలాసేపటికి కొంతతేరుకున్నాడాయన నేత్రాలు అరుణిమదాల్చాయి ,కన్నులనుండి నిప్పుకణాలప్రవాహంలాగ ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి.
.
చాలా తీవ్రంగా దూషించాడు కైకను ! ఓసీ దుష్టురాలా,పాపాత్మురాలా సర్వప్రాణికోటి హితముగోరే రాముడు నీకేం అపకారంచేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు!
.
నిన్ను కన్నతల్లిలాగ చూసుకుంటున్నాడు కదనే వాడు ! వాడికే అనర్ధము తలపెడతావా! నీవు, ఓసి పాతకీ!
.
నీవు రాజకుమారివని తలచి తెచ్చుకొన్నానే కానీ లోకాలన్నీదహించివేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే!.
.
రాముడిలోని ఒక్కదోషము చెప్పునీవు ! ఏ దోషమున్నదని అడవులకు పంపాలి ?.
.
కౌసల్యను,సుమిత్రను ,నా సకలైశ్వర్యాలను,రాజ్యాన్ని,చి వరకు నా ప్రాణాన్నయినా విడుస్తాను కానీ నారాముని నేను విడువలేను.
.
వాడేనాకు పరమానందము,వాడే నాకు బ్రహ్మానందము,వాడేనాకు దివ్యచైతన్యము.
.
సూర్యుడులేకుండా ఈ ప్రపంచముండవచ్చునేమో! నీరులేకుండా పంటలు పండవచ్చునేమో కానీ నారాముడు లేక నాప్రాణముండదు!.
.
కైకా! ఇకచాలు ! ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు! నాకు భరతుడిపైగల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా!
.
నీవేకదా రాముడు సకలగుణాభిరాముడు,జ్యేష్ఠుడు వానికే రాజ్యాధికారమున్నదని నిన్నటిదాకా నాతోపలికెడిదానవు!
ఈ రోజు నా కేదయినా పరీక్షపెట్టదలిచావా? చెప్పు!.
.
ఎంతోనీతిసంపన్నురాలవు అనికదా నీకున్నపేరు! ఈ రోజు నీబుద్ధిలో ఈ వికారం ఏల జన్మించింది?.
.
పూర్వమెప్పుడూ నీలో రవ్వంతదోషము కూడా నాకుకానరాలేదు! మరి ఈరోజు ఎందుకిలా!
.
నారాముడు ! ఇక్ష్వాకు రాకుమారుడు! అత్యంతసుకుమారుడు !
ఘోరారణ్యములలో జటాధారియైసంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది ! కైకా నీకోరిక ఉపసంహరించుకో!.
.
అసలు నీకు రాముడుచేసినంత శుశ్రూష భరతుడుకూడా చేయలేదే ! .
.
రాముడు మహావీరుడు ! ధర్మవీరుడు,దయావీరుడు,దానవీరుడు ,యుద్ధవీరుడు!
.
కపటములేని రామునియందు నీకింతకాఠిన్యముతగదు !
.
కైకా ! కాటికి కాళ్ళు చాపుకొన్న ముసలివాడను నేను నామీద కరుణచూపవే ! నీ కాళ్ళుపట్టుకుంటాను.
.
అని పరిపరి విధాలుగా ప్రాధేయపడుతున్నాడు దశరధమహారాజు.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
కైకమాటలు పుట్టించిన శబ్దప్రకంపనలు దశరధమహారాజు హృదయకవాటాన్ని భేదిస్తున్నాయి.
ఆ శబ్దాలను మోసుకొచ్చిన గాలికూడ ఆయనకు అప్రియంగా తోచింది కొంతసేపు శ్వాసించటం ఆగిపోయింది.
.
నిశ్చేష్టుడైపోయాడు ! నీరసం ఆవహించింది ఆయన శరీరాన్నంతా! అప్పటిదాకా ఆమెచుట్టూ అల్లుకొన్న మోహభావనలు టపటపతెగిపోయాయి .ఆమె అంటే ఉన్న అంతులేని కామభావన అసహ్యము,జుగుప్స గా రూపాంతరంచెందింది .
.
మొదలునరికిన చెట్టులాగ కూలబడిపోయాడు ! ఛీ!ఛీ! అని ఛీత్కారాలు చేసుకుంటూ స్పృహతప్పిపోయాడు . మంత్రప్రభావానికి కట్టుబడ్డ మహానాగు కొట్టే బుసలలాగ విడుస్తున్నాడు ఉచ్ఛ్వాశనిశ్వాసాలు.
.
చాలాసేపటికి కొంతతేరుకున్నాడాయన నేత్రాలు అరుణిమదాల్చాయి ,కన్నులనుండి నిప్పుకణాలప్రవాహంలాగ ఆయన చూపులు కైకను కాల్చివేసేటట్లుగా ఉన్నాయి.
.
చాలా తీవ్రంగా దూషించాడు కైకను ! ఓసీ దుష్టురాలా,పాపాత్మురాలా సర్వప్రాణికోటి హితముగోరే రాముడు నీకేం అపకారంచేశాడే? నేనేమి ద్రోహం చేశానే నీకు!
.
నిన్ను కన్నతల్లిలాగ చూసుకుంటున్నాడు కదనే వాడు ! వాడికే అనర్ధము తలపెడతావా! నీవు, ఓసి పాతకీ!
.
నీవు రాజకుమారివని తలచి తెచ్చుకొన్నానే కానీ లోకాలన్నీదహించివేసే మహాభయంకర విషనాగువని అప్పుడు నాకు తెలియదే!.
.
రాముడిలోని ఒక్కదోషము చెప్పునీవు ! ఏ దోషమున్నదని అడవులకు పంపాలి ?.
.
కౌసల్యను,సుమిత్రను ,నా సకలైశ్వర్యాలను,రాజ్యాన్ని,చివరకు నా ప్రాణాన్నయినా విడుస్తాను కానీ నారాముని నేను విడువలేను.
.
వాడేనాకు పరమానందము,వాడే నాకు బ్రహ్మానందము,వాడేనాకు దివ్యచైతన్యము.
.
సూర్యుడులేకుండా ఈ ప్రపంచముండవచ్చునేమో! నీరులేకుండా పంటలు పండవచ్చునేమో కానీ నారాముడు లేక నాప్రాణముండదు!.
.
కైకా! ఇకచాలు ! ఈ పాపపు ఆలోచన విడిచిపెట్టు! నాకు భరతుడిపైగల ప్రేమను పరీక్షించడానికి ఇలా మాట్లాడావా!
.
నీవేకదా రాముడు సకలగుణాభిరాముడు,జ్యేష్ఠుడు వానికే రాజ్యాధికారమున్నదని నిన్నటిదాకా నాతోపలికెడిదానవు!
ఈ రోజు నా కేదయినా పరీక్షపెట్టదలిచావా? చెప్పు!.
.
ఎంతోనీతిసంపన్నురాలవు అనికదా నీకున్నపేరు! ఈ రోజు నీబుద్ధిలో ఈ వికారం ఏల జన్మించింది?.
.
పూర్వమెప్పుడూ నీలో రవ్వంతదోషము కూడా నాకుకానరాలేదు! మరి ఈరోజు ఎందుకిలా!
.
నారాముడు ! ఇక్ష్వాకు రాకుమారుడు! అత్యంతసుకుమారుడు !
ఘోరారణ్యములలో జటాధారియైసంచరించవలెనన్న క్రూరబుద్ధి నీలో ఎలా పుట్టింది ! కైకా నీకోరిక ఉపసంహరించుకో!.
.
అసలు నీకు రాముడుచేసినంత శుశ్రూష భరతుడుకూడా చేయలేదే ! .
.
రాముడు మహావీరుడు ! ధర్మవీరుడు,దయావీరుడు,దానవీరుడు,యుద్ధవీరుడు!
.
కపటములేని రామునియందు నీకింతకాఠిన్యముతగదు !
.
కైకా ! కాటికి కాళ్ళు చాపుకొన్న ముసలివాడను నేను నామీద కరుణచూపవే ! నీ కాళ్ళుపట్టుకుంటాను.
.
అని పరిపరి విధాలుగా ప్రాధేయపడుతున్నాడు దశరధమహారాజు.
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి