31, జులై 2021, శనివారం

*తొలి తిరుపతి- పెద్దాపురం*

 *తొలి తిరుపతి- పెద్దాపురం* 


🔔🔔🔔🔔🔔🔔


తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.


అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం దగ్గర తిరుపతి వుందని

అదే తొలి తిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై, పరమ పవిత్రమైన చిరుమందహాస చిద్విలాస *శ్రీ శృంగార వల్లభ స్వామి* శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.


విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ...


స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.


ఆలయ చరిత్ర :🙏


ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం. ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్న సమయంలో ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట. అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.


అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విధానం అడుగగా ఆ ముని, "నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.


ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే, ఆ కాంతిని చూడలేక ధృవుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా! భయమెందుకు నేనూ నీ అంతే వున్నాను కదా అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట.


ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.


స్వామి నీ అంతే వున్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)


ఆ అరణ్య ప్రాంతంలో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. 


ఆతరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).


ఆలయవిశిష్టత :🙏


1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 


2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 


3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 


4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 


5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి లబిస్తుంది. 


6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.


కార్యక్రమాలు - పూజా విధానం :


1) నిత్య ధూప దీప నైవేద్యం.


2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం.


3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.


4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 


తొలితిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. 


️పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి...


ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా..గోవిందా..


జై శ్రీమన్నారాయణ🙏


🔔🔔🔔🔔

ఆత్మదర్శనం కావాలంటే

ఆత్మదర్శనం  కావాలంటే ముందు నీలోనున్న ఆరు శత్రులను విడనాడు ...???

కామం క్రోధం లోభం మోహం

త్యక్త్వాత్మానం పశ్యతి సోహం

ఆత్మజ్ఞాన విహీనా మూఢా

స్తేపచ్యన్తే నరక నిగూఢా

కామ, క్రోధ, లోభ, మోహ గుణాలను విసర్జించి, పరమాత్మే నాలోని ఆత్మ అనే సమభావం కలిగితే ఆత్మదర్శనం సులభ సాధ్యం. అజ్ఞానులు మూఢులై, ఆత్మజ్ఞానం లేక నరకంలో పడి బాధలు అనుభవిస్తారు.

అరిషడ్వర్గాలు ఆరు. కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యాలు మనిషికి శతృవులు. ఆరింటికి మూలం మనస్సు. మనస్సును సత్యమార్గంలో పెడితే పొందే ఫలితం అమోఘం. అంతఃశ్శతృవులైన అరిషడ్వర్గాలలో మనస్సుతో కామాన్ని, బుద్ధితో క్రోధాన్ని, చిత్తంతో లోభాన్ని, సోహం భావనతో మోహాన్ని అణచివేయాలి. అప్పుడు మధ, మాత్సర్యాలు మాయమై సమదర్శకత్వం సమకూరుతుంది. జన్మతః జీవుడు నిర్మలుడే. ప్రారబ్ధ కర్మ ఫలితంగా కర్మల నాచరించి, మాయావరణలో చిక్కుకుని, సంసార లంపటంలో బంధింపబడుతున్నాడు. కొంచెం వివేకంతో ఆలోచించగలిగినా మాయావరణను ఛేదించి, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకోవడానికి సాధన చేసి, సాధించి, ముక్తి పొందాలి

 సేకరణ సి. భార్గవ శర్మ 

ఉద్యోగము

 ఉద్యోగము

ఉద్యోగము! ఉద్యోగము!! ఉద్యోగము!!! ఈ రోజులలో ప్రతి చదువుకున్నవ్యక్తి ఉద్యోగమును ఆశించేవాడే, ఉద్యోగముకొరకు ప్రయత్నించేవాడే. కానీ ఆశించి, ప్రయత్నించిన వారిలో ఏ కొద్దిమందికో ఉద్యోగాలు దొరుకుతున్నవి. మిగతావారికి అంతే సంగతులు! ఎందుకంటే ప్రభుత్వమువారు ఉద్యోగములు ఇవ్వడము లేదు అంటారు. ప్రభుత్వము ఎందుకు ఉద్యోగములు ఇవ్వడము లేదు అనేది చాలామంది విచారించరు. ప్రభుత్వము ఉద్యోగములు ఇవ్వకపోవడానికి వారి కారణాలు వారికున్నాయి అయితే, వాటిని పైకి చెప్పరు. పైకి మాత్రం ఇస్తాం, ఇస్తాం అంటారు…


దానితో నిరుద్యోగులు దినములు, నెలలు, సంవత్సరములు ఉద్యోగముల కొరకు ఎదురుచూస్తూనే కాలాన్ని గడుపుతారు. అట్లు ఎదురుచూసిన వారిలో అతి కొద్ది మందికే ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతావారు ఎదురుచూసి, ఎదురుచూసి… అందులో కొంతమంది డిప్రెషనుకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తద్వారా వారి తల్లిదండ్రులకు మరియు వారిమీద ఆధారపడ్డవారికి తీరని దుఃఖమును కలిగిస్తున్నారు. ఇది మనందరము నిత్యము చూస్తున్నదే, వింటున్నదే, తెలిసినదే. 


అయితే, మనము ఇప్పుడు ఉద్యోగము అంటే ఏమిటో తెలుసుకుందాం. “ఉద్యోగము” అనే సంస్కృత పదములో రెండు పదములున్నవి “ఉత్+యోగము=ఉద్యోగము “ఉత్” అనగా ఉన్నతమైన. “యోగము” అనగా కలయిక అంటే ఉన్నతమైన విషయముతో కలయిక. ఉద్యోగమునకు ఇంకొక అర్థము “ప్రయత్నము” అందువలననే పూర్వము మన ఋషులు “ఉద్యోగం పురుష లక్షణం” అని అన్నారు. అనగా, ప్రయత్నమే పురుషలక్షణం, అంతేగాని ఏదో ఒక ఉద్యోగము చేయుట కాదు. మరి అట్లయితే ఈ కాలములో స్త్రీలు కూడా ఉద్యోగము చేస్తున్నారు కదా! వారు కూడా పురుషులేనా? మరి ఎందఱో పురుషులు ఉద్యోగము చెయ్యని వారున్నారు కదా! వారు పురుషులు కారా? 

  

అది కాదు సరియైన అర్థము, ప్రయత్నము చేసేవారందరూ పురుషులే! అని. “ఇంకా పురుషుడు అనే పదమునకు సరియైన అర్థము మన శరీరము అనే పురములో నఖశిఖ పర్యంతము ఉన్న దివ్య చైతన్యమునకే పురుషుడు అని పేరు. అంతేగాని గడ్డము మీసము ఉన్నవాడు పురుషుడు అని కాదు”. మనము ప్రొద్దున నిద్రలేచినది మొదలు ప్రతి చిన్న విషయమునకు ప్రయత్నము చేస్తూనే ఉంటాము. పళ్ళు తోముకోవడానికి, స్నానము చెయ్యడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నము వండుకోవడానికి ఇట్లా అనేక విషయములకు ఎంతో ప్రయత్నము చేస్తూనే ఉంటాము.

ఆ ప్రయత్నము చేయడమునే “సాధన” అంటారు. అందుకే “సాధనమున పనులు సమకూరు ధరలోన” అన్నారు. కనుక, ఇట్టి నిత్యకృత్యములకే ఎన్నో ప్రయత్నములు చెయ్యవలసి వచ్చినప్పుడు, మన కుటుంబ పోషణకు మనము ఇంకా ఎంత ప్రయత్నించాలి. 

 మన భారత దేశము కర్మభూమి! త్యాగభూమి!! యోగభూమి!!! కానీ, భోగభూమి మాత్రము కాదు. మన పూర్వీకులు ఎవ్వరు కూడా సోమరిగా జీవితమును గడపలేదు. వారు పడ్డ కష్టములను తలచుకుంటే మనవి ఒక కష్టాలేనా అనిపిస్తుంది. పూర్వపు రోజులలో వారికి ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. అనగా, రోడ్లు సరిగా లేవు, ఆటోలు, బస్సులు, ద్విచక్రవాహనములు లాంటివి లేవు. ఒక సైకిల్ ఉంటే, మహాగొప్ప! ఆ రోజులలో. ఇంకా, కట్టెలపొయ్యి మీద వండుకోవడము. బియ్యము కావాలంటే వడ్లు దంచుకోవాలి, పిండి కావాలంటే విసురుకోవాలి మరియు కారము కావాలంటే దంచుకోవాలి. ఎక్కడికి వెళ్ళవలసిననూ నడచి వెళ్ళేవారు. మరియు ఈ రోజులలో ఉన్నట్లు వారికి రేడియోలు, టి.వి.లు, సినిమాలు, ఫోన్లు, కంప్యూటర్లు లేవు. వారికి ఇవేవీ లేకపోయినా, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి వారు ఎంతో తృప్తిగా, ఆనందముగా, ఆరోగ్యముగా జీవితమును గడిపినారు.     


మన పూర్వీకులు ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగముకొరకు పాటుపడలేదు, వారికి అట్టి ఆలోచన కూడా లేదు. మరి, ఏమి చేసి బ్రతికినారు? అంటే మన భారత దేశములో ప్రధానమైనది వ్యవసాయము, కనుక చాలామంది వ్యవసాయము చేసుకొని బ్రతికేవారు. ఇంకా కొంతమంది వ్యవసాయ ఆధారితమైన పనులు మరియు కులవృత్తులు అనగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి. మంగలి, స్వర్ణకారులు, పద్మశాలీలు మొదలగు వారు వారియొక్క పనులను చేస్తూ జీవించేవారు. 


మన పూర్వీకులు ఉద్యోగములను కోరకపోవడానికి కారణము, ఆ రోజులలో ఇప్పుడున్నంత పెద్ద మొత్తములో జీతాలు లేకపోవడము కూడా ఒక కారణముగా కనిపిస్తుంది. ఇంకొక ముఖ్య కారణము ఏమనగా, అప్పుడన్నీ ఉమ్మడి కుటుంబాలు కావడము. ఎట్లనగా, ఉద్యోగము చేస్తే ఎక్కడనో నా కుటుంబమునకు, బంధువులకు దూరముగా వారిని వదలి ఉండవలసి వస్తుందని, వారిని విడిచి ఉండలేనని ఈ ప్రేమాభిమానములకంటే నాకు డబ్బు ప్రధానము కాదని అనుకునేవారు. కానీ, ఇప్పుడు అట్లాకాదు, ఉద్యోగమువస్తే చాలు! డబ్బు వస్తే చాలు! ఎక్కడైనా ఉంటాను, ఎవ్వరికైనా దూరంగా అంటే తల్లిదండ్రులకే కాదు చివరికి భార్యాబిడ్డలకైనా సరే దూరంగా ఉంటాను. అది ఎంత దూరమైనా సరే అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, చివరకు అండమాన్ అయినా సరే! అని. అప్పటికి ఇప్పటికి ఆలోచనలలో ఎంత తేడా?


ఉద్యోగము కోరుకునే వారికి ఒక చిన్న మనవి: అదేమంటే, మీరు ఉద్యోగము కొరకు ప్రయత్నించండి. తప్పు లేదు! కానీ ఈ రోజులలో ఉద్యోగము రావడమనేది కష్టమని, రికమండేషనో, ఇంకేదో... ఇంకేదో... ఉంటేనే ఉద్యోగము వస్తున్నదని వింటున్నాము. కనుక, మీరు ఉద్యోగమును ఆశించే బదులు, మీరే నలుగురికి ఉద్యోగము ఇచ్చే స్థాయికి ఎందుకు ఎదగకూడదు? ఆలోచించండి!


నలుగురికి ఉద్యోగమివ్వడమంటే మాటలా! అని మీరు అనుకోవద్దు. నలుగురికి పని చూపెట్టడమంటే, పెద్ద పెద్ద సంస్థలు, ఫ్యాక్టరీలను స్థాపించవలసిన అవసరము లేదు. ఉదాహరణమునకు ఒక పిండి గిర్ని పెట్టుకోవచ్చు, నాలుగైదు బర్రెలతో పాలు పెరుగు తయారు చేసి అమ్ముకోవచ్చు, ఒక కిరాణ షాపు పెట్టుకోవచ్చు లేదా టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ పని, ప్లంబర్ పని, మెకానిక్ పని, డ్రైవర్ పని, కంప్యూటర్ పని, కుట్టుమిషన్ పని... ఈ విధముగా అనేక మార్గాలలో తాను తన కాళ్ళమీద నిలబడవచ్చు, నలుగురికి పని చూపెట్టవచ్చు. కనుక, ప్రతివ్యక్తి ఉద్యోగము! ఉద్యోగమని, ఉద్యోగము కొరకని ప్రభుత్వమును ఒత్తిడి చేస్తే వారు కూడా ఎంత మందికి ఉద్యోగాలు ఇవ్వగలరు? చెప్పండి!.


ఉద్యోగుల గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు ఇలా అన్నారు:          

ఉద్యోగములో చేరిన తరువాత కూడను ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. దేశము యొక్క గౌరవాన్ని కూడను చక్కగా మనము చూడాలి. మన దేశ గౌరవమే లేకపోతే, మన దేహ గౌరవము ఏ రీతిగా ఉంటుంది? ఉద్యోగాల్లో ప్రవేశించినపుడు ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి. మనము ఎంత జీతము డ్రా చేస్తున్నాము. ఈ జీతమునకు తగిన పని మనము చేస్తున్నామా? నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి. నీ అంతరాత్మ నిన్ను అంగీకరించనపుడు, తిరిగి నీవు మరింత ఎక్కువ పని చెయ్యాలి. అట్లు లేకుండా, “జీతము ఎక్కువ - పని తక్కువ” అయిపోతే, దేశ ద్రోహులుగా మారిపోతారు! దేశ ద్రోహులు. ఇంతింత జీతాలు తీసుకొని పని తక్కువ చేస్తే దేశానికి ఎంత కీడు చేసినవారమౌతాము. మీ జీతాల కోసమని ప్రభుత్వము అన్ని దేశాలనుండి అప్పు తీసుకొస్తున్నారు. ఆ తెచ్చినటువంటి అప్పంతాకూడను మీ జీతాలకే ఇచ్చేస్తున్నారు. ఈ అప్పు తీర్చేదెప్పుడు? అప్పు యొక్క వడ్డీ తీర్చేదెప్పుడు? మీరు అధికమైన పని చేసినప్పుడే, అభివృద్ధికి అవకాశము ఉంటుంది. కానీ, ఈనాటి ఉద్యోగులు అధిక జీతాలు తీసుకొంటూ కూడా ఇంకా కావాలి! ఇంకా కావాలి!! ఇంకా కావాలి!!!. దురాశ దుఃఖమునకు చేటు! కనుక మనము తృప్తిఅలవరచుకోవాలి, “అసంతృప్తో ద్విజో నష్ట” అసంతృప్తునకు రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి. కనుక మనము తీసుకున్న జీతమునకు తగిన పని చెయ్యాలి. అప్పుడే Self satisfaction అవుతుంది. లేకపోతే Self satisfaction మనకు ఏ ప్రయత్నము చేసినా రాదు. బంగారు కొండను తెచ్చి నీ నెత్తిమీద పెట్టినా నీకు Self satisfaction రాదు. నీవు తృప్తికరంగా పనిచేస్తే అదే చాలు. (03-06-1993 దివ్యోపన్యాసము నుండి)

ఉత్పలమాలిక

 ఒకనాడు సభలో శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక బంగారు పళ్ళెరంలో బంగారంతో చేసిన గాండ పెండేరమును పట్టుకొని ఈ సభలో తెలుగులో సంస్కృతంలో ధీటుగా కవిత్వం చెప్పగలవారికి దీనిని బహుకరిస్తాననిన   అప్పుడు వెంటనే అల్లసాని పెద్దన ఏక బిగిని అనర్గళంగా,  ఆసువుగా ఈ క్రింది ఉత్పలమాలిక చెప్పారు. 

ఉ:   పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్

రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని

ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్

బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ

కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్

జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే

ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్

డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ

వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్

గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు

న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం

బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం

గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా

సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్

మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ

రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ

టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ

భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా

శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా

పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ

జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం

గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి

వ్రాతనయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ

నూతన ఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం

ఘాతవియధ్ధునీ చకచకద్వికచోత్పలసారసంగ్రహా

యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై

చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర

ద్యోతకగోస్తనీఫలమధుద్రవగోఘృతపాయస ప్రసా

రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్

 

ఈ విధంగా పెద్దన గారు చెప్పిన మరు క్షణమే రాయల వారు ఆంధ్ర కవితా పితామహుడైన పెద్దన గారి వామ పాదానికి గండ పెండేరాన్ని తొడిగారు. 

చిన్నవాస్తు కథ🍁

 *🍁ఒక చిన్నవాస్తు కథ🍁*

 👌👌👌👌👌👌👌


👉🏼హైదరాబాద్ కి చెందిన సత్యనారాయణ ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు.


ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు.


వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడేవాడు.


ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు.


సత్యనారాయణగారు వాస్తును పరిశీలించే శాస్త్రిగారిని తీసుకొని కారులో ఇద్దరూ బయలుదేరారు.


కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో సత్యనారాయణగారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.


దానికి సత్యనారాయణగారు నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని అయిఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.


అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది.

అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో సత్యనారాయణగారు కారు వేగం తగ్గించి నెమ్మదిగా నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన సత్యనారాయణగారు అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు.


అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 

ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు

ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రీ గారి వంతైంది. సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడను మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు. దానికి

సత్యనారాయణ గారు నవ్వుతూ పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.


కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. 

కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి,


అది చూసిన సత్యనారాయణ గారు శాస్త్రిగారిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం..అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కొస్తున్నట్లు ఉంది, మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.

ఎందుకండీ అనవసరంగా

అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.


శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు. ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !


ఈసారి ఆశ్చర్యపోవడం సత్యనారాయణ గారి వంతైంది.

ఎం?ఎందుకండి?


ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.


ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది. అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ అన్నిసమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మరిపోతాడు.

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!


*👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼*

*👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼*

*👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼*

*👉🏼విశ్వస్య కళ్యాణమస్తు

లక్షణములు ముందుగా తెలుసుకొనుట

 మరణించు వాని లక్షణములు ముందుగా తెలుసుకొనుట - 



      రోగులకు చికిత్స చేయు క్రమములో కొన్ని రకాల తీవ్రమైన జబ్బులు ఔషధములతో ఎంత ప్రయత్నించినను లొంగవు . అటువంటప్పుడు ఆరోగి మరణమును తప్పక పొందును. మరణము సమీపించునకు మునుపే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడి రాబోవు మరణమును సూచించును . వీటిని అయుర్వేదము నందు అరిష్టములు అందురు. ఇటువంటి ప్రత్యేక లక్షణములను ఎంతో అనుభవము కలిగిన వైద్యులు మాత్రమే పసిగట్టగలరు. ఈ లక్షణములు వైద్యులు రహస్యముగానే ఉంచెదరు. 


         నేను మాత్రం వాటిని మీకు సంపూర్ణముగా వివరిస్తాను . 



   మరణ అరిష్టములు - 



 * కామెర్ల రోగములో వలే కళ్లు పచ్చగా ఉండి ముఖం , దవడలు మాంసముతో నిండి ఉండి రోగి భయముతో ఉండి శరీరం జ్వరం ఉన్నవాని వలే ఉండిన అరిష్టము. 


 * మంచము మీద నుంచి లేవనెత్తిన వెంటనే మూర్చపోతాడు. ఎప్పుడు లేపినను ఇదే పరిస్థితి ఉండును. ఇట్టివాడు 7 దినములలో మరణించటం తథ్యం . 


 * శరీరం నందు కొన్ని రోగాలు పైభాగము నందు , కొన్ని కింద భాగము నందు ప్రభావము చూపించును. అందు గ్రహణి అను రోగం అత్యంత తీవ్రము అయిన ఆ రోగి 15 దినముల కంటే ఎక్కువ బ్రతకడు . 


 * పురాణరోగం పీడిస్తూ తిండి తక్కువ తింటూ అంతకు మించి మలమూత్రాదులు ఉన్నరోగి బ్రతుకుట దుర్లభం. 


 * శరీరం కండ లేకుండా దుర్బలముగా ఉండి తిండి అధికంగా తినడం మరికొంత సమయం అవ్వగానే మరలా తినడం అరిష్టం. 


 * ఇష్టము , బలవర్థకం , సర్వగుణసంపన్నం అయిన ఆహారం తినుచున్ననూ రోజురోజుకి శరీరం క్షీణించువాడు బ్రతకడు. 


 * మూలగడం , ఆగి ఆగి ఆయసం రావడం , అతిసార రోగం , బలం ఉండదు , తీవ్ర దప్పిక , నోరు ఎండుకొని పోవడం వంటి లక్షణాలు అరిష్టం . 


 * నేత్రములు పైకి పోవడం , కంఠం ఇరువైపులా ఉండు సిరలు ఆగకుండా కంపించడం , బలహీనత , దప్పిక , శరీరం ఎండుకు పోవడం వంటి లక్షణాలు అరిష్టం. 


 * శిరస్సు , నాలిక , ముఖం తిరిగిపోవడం , కనుబొమ్మలు వాలిపోవడం , నాలిక మీద రుచిమొగ్గలు ముళ్ళు వలే పైకి తేలి ఉండటం వంటి లక్షణాలు అరిష్టం . 


 * శిశ్నము పూర్తిగా లోపలికి పోయి వృషణములు కిందకి జారి బయటకి వచ్చినట్టు కనిపించినను లేక వృషణములు లోపలికి వెళ్లి శిశ్నము బయటకి వచ్చినట్టు కనిపించినను అరిష్టము . 


 * మాంసం పూర్తిగా నశించి చర్మం , ఎముకలు మాత్రమే మిగిలి అస్థిపంజరంలా మారినవాడు 30 దినములలోపు మరణించును. 


 * రెప్పలు వాచిపోయి దగ్గరకు రావు . శరీరం కృశించి , కండ్లు మకిలి , మాలిన్యము నిండి ఉండటం అరిష్టం . 


 * రోగము సంభవించినను , సంభవించకున్నను ఎవ్వరి తలవెంట్రుకలు పట్టి లాగినను వానికి ఎంత మాత్రం నొప్పి తెలియకుండా ఉండునో వాడు 6 దినములలో తప్పక చచ్చును. 


 * తలవెంట్రుకలుకు చమురు రాయకున్నను రాసినట్టుగా చమురుతో తడిచిన విధముగా ఉండునో వాడు జీవించడు . 


 * శరీరం చిక్కిపోతున్ననూ ముక్కు దూలం మాత్రం కండతో బలంగా ఉండి శరీరం ఉబ్బురోగం లేకున్ననూ ఉబ్బినట్టుగా ఉన్నను అరిష్టం . 


 * నాసారంధ్రములు పూర్తిగా మూసుకొని పోయినను , విశేషముగా తెరచుకొని ఉన్నను , వంకర పోయినను , ఎండిపోయినను ఆ రోగి బ్రతకడు. 


 * దీర్ఘముగా ఊపిరి విడుస్తూ మరలా వెంటవెంటనే వాయువును లోపలికి తీసుకుంటూ మిగుల వేదనను అనుభవించువాడు జీవించడు. 


 * మోకాలుతో మోకాలును చేర్చి వాయించుతూ రెండు పాదములను పైకి ఎత్తి గభాలున మంచం మీద వదులువాడు , సర్వదా ముఖమును అటుఇటు కదిలించుట అరిష్టం . 


 * గోళ్లను దంతాలతో కొరుక్కోవడం , తలవెంట్రుకలును గోళ్లతో పట్టి తెంచుకొనుట , కర్రపట్టి నేలమీద గీయుట అరిష్టం. 


 * మేల్కొన్న సమయములో దంతాలు కోరుకుట , బిగ్గరగా ఏడవడం మరలా అంతలోనే నవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉన్నవాడికి వాడి శరీరంలో బాధలు వాడికే తెలియవు . ఇది అరిష్టం . 


 * అతిగా నవ్వడం , కటకట మని శబ్దం చేయుట సకిలిస్తాడు , పాదాలతో మంచాన్ని కొట్టువాడు , ముక్కులు , చెవులు , కండ్లు వంటి రంధ్రములలో వ్రేళ్లు దూర్చుట అరిష్టం. 


 * శిరస్సు బరువైపోయి మోయలేక కంఠం ఒకవైపుకు వాలిపోవడం , శరీరం బరువు మోయలేక నడుము వంగిపోవడం , అన్నం నోట్లో పెట్టిన దౌడలు వ్రేలాడిపోయి అన్నం జారిపోవడం అరిష్టం. 


 * తెల్లవారుజామున ముఖం పైన చెమట పడుతూ ఉండును. ఇట్టి జ్వర పీడితుడు జీవించడు. 


 * శ్లేష్మరూపం అయిన కళ్లే , మలము , శుక్రము ఇవి తేలిక పదార్దాలు అగుట చేత నీటిలో తేలును . కాని ఏ రోగి సంబంధం అయిన ఈ మూడు నీటిలో వేసిన మునిగిపోవునో ఆ రోగి జీవించడు. 


            పైన చెప్పిన లక్షణాలు ఒక్కో రోగిలో ఒక్కోలా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న వైద్యుడు మాత్రమే ఆయా లక్షణాలను సరిగ్గా అంచనా వేయగలడు. 



     పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*తీర్ధం..విభూతి..*


"స్వామీ దత్తాత్రేయా నాకీ బాధను తగ్గించు నాయనా..లేకపోతే నన్ను త్వరగా తీసుకుపో తండ్రీ!.." అంటూ ఆ వృద్ధురాలు శ్రీ స్వామివారి మందిరం లోని మంటపం లో పడుకొని మెలికలు తిరిగిపోతూ వేడుకుంటున్నది..సుమారు పది రోజుల నుంచీ కడుపులో నొప్పితో బాధపడుతోంది ఆవిడ..సుమారు డెబ్భై ఏళ్ల పైబడిన వయసు..వైద్యులకు చూపించాలని ఆమె కుమారుడు శతవిధాల ప్రయత్నం చేసాడు..ససేమిరా ఒప్పుకోలేదు ఈవిడ..తాను దత్తాత్రేయ స్వామినే నమ్ముకున్నానని..అక్కడికే తీసుకెళ్లమని కొడుకుతో తేల్చి చెప్పి..మొగలిచెర్ల కు వచ్చి..శ్రీ స్వామివారి మందిరం వద్ద ఉన్నది..ఆమె పేరు శకుంతలమ్మ..ఊరు కృష్ణారెడ్డిపల్లె..


మూడురోజులు గడిచాయి..రోజూ ఉదయాన్నే శ్రీ స్వామివారి కి అర్చక స్వాములు ప్రభాత పూజ హారతి పూర్తి చేసిన తరువాత..వరుస క్రమం లో వచ్చి శ్రీ స్వామివారి తీర్ధాన్ని తీసుకుంటుంది..ఆ తరువాత అక్కడే పాదుకలు ఉంచిన చిన్న మంటపంలో ఉన్న పాత్ర నుంచి విభూతి తీసుకొని..తన కడుపు మీద రాసుకొని..మరికొంచెం విభూతిని నోట్లో వేసుకొని..తిరిగి వచ్చి మంటపం లో పడుకునేది..బాధ తీవ్రంగా వున్నప్పుడు..నొప్పి భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్ధించేది..అంతేకానీ..మరే విధమైన వైద్యాన్ని ఒప్పుకోలేదు..నాలుగోరోజు కల్లా శకుంతలమ్మ కడుపులో నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది..


ఈ నాలుగురోజుల పాటు ఆవిడ పడుతున్న బాధను దగ్గరా వుండి గమనిస్తున్న నాకు.."ఎందుకు ఈవిడ ఇంత బాధపడుతూ మొండిగా ఇక్కడే ఉంది?..ముందుగా మానవప్రయత్నం చేయాలి కదా?..పూర్తిగా దైవమే వచ్చి ఆదుకోవాలని కోరుకోవడం మూర్ఖత్వం కదా?.." అని చాలాసార్లు అనిపించింది..ఆమాటే ఆవిడ కుమారుడి తో అన్నాను కూడా..అతను నా వైపు అదోలా చూసి.."అమ్మను డాక్టర్ల వద్ద చూపించాలని ఎన్నో సార్లు అనుకున్నాను..కానీ ఆవిడ ఒప్పుకోలేదు..నేను నిస్సహాయంగా ఉండిపోయాను.." అన్నాడు..


ఐదోరోజు కు ఆవిడ నొప్పి చాలాభాగం తగ్గిపోయింది..కేవలం శ్రీ స్వామివారి తీర్ధం..విభూతి మాత్రం తోనే తాను కోలుకున్నది..నాకు విపరీతమైన ఆశ్చర్యం వేసి.."అమ్మా..మీరు ఏ నమ్మకం తో ఇంత నొప్పి భరిస్తూ వుండగలిగారూ.." అని అడిగాను..


"నాయనా..నేను ఆ దత్తాత్రేయ స్వామిని పరిపూర్ణంగా నమ్మాను.. దానికీ కారణం ఉంది..నాకు ముప్పై ఏళ్ల వయసప్పుడు..స్వామిని మాలకొండలో మొదటిసారి చూసాను..అప్పుడు వీడికి మూడేళ్ల వయసు..ఆ తరువాత కూడా మా ఆయన నేనూ రెండు మూడుసార్లు స్వామివారిని దర్శించుకున్నాము..ఒక శనివారం నాడు స్వామివారు పార్వతీదేవి మఠం వద్ద కూర్చుని వున్నారు..మా దంపతులము స్వామికి నమస్కారం చేసి ఎదురుగా కూర్చున్నాము..స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారు..ఆరోజు నుంచీ స్వామివారంటే మాకు గురి కుదిరింది..ఒకసారి మేము మాలకొండ వెళ్ళి, పార్వతీదేవి మఠం వద్దకు వచ్చేసరికి మా ఆయనకు కడుపులో నొప్పి వచ్చింది..బాగా బాధ పడ్డారు..శ్రీ స్వామివారు స్వయంగా అమ్మవారి ముందున్న తీర్ధం తీసి మాకు ఇచ్చారు..కొద్దిసేపటికే ఆయన కడుపులో నొప్పి తగ్గిపోయింది..అది నాకు మనసులో నాటుకుపోయింది..శ్రీ స్వామివారు ఇక్కడ సమాధి చెందిన తరువాత కూడా మేము చాలా సార్లు ఇక్కడికి వచ్చాము..నాకు కడుపులో నొప్పి రాగానే..మా వాడితో " నాకు ఏ వైద్యమూ వద్దు..నన్ను మొగలిచెర్ల లోని స్వామివారి మందిరానికి తీసుకెళ్లు" అని మొండికేశాను.. నా నమ్మకం స్వామి నిలబెట్టాడు..మూర్ఖత్వం అనుకుంటావో..మొండితనం అనుకుంటావో..లేదా స్వామి మహిమ అనుకుంటావో నీ ఇష్టం.." అన్నది..


మూర్ఖత్వం ఆవిడది కాదు..నాది అని నాకు ఆ క్షణంలో తెలిసివచ్చింది..కాకుంటే..ఇన్నాళ్లు శ్రీ స్వామివారి మందిరం లో వుంటూ..ఇటువంటి లీలలు ఎన్నో చూస్తూ కూడా అలా అనుమానం పడటం మూర్ఖత్వం కాక మరేమిటి?..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

నేను డబ్బుని

 🤑నేను డబ్బుని💰👈

మీరు మరణించినప్పుడు⚰ నన్ను మీతో మోసుకు వెళ్ళలేరు 🤗


🤑నేను డబ్బుని 💷👈

నేను దేవుణ్ణి కాను👺కానీ... ప్రజలందరు నన్ను దేవుని కంటే ఎంతో ఎక్కువగా పూజిస్తారు, కోరుకుంటారు😍


🤑నేను డబ్బుని💶👈

నేను ఉప్పు లాగా అవసరమే కానీ మోతాదుకు మించితే🏥 అనర్దమే 👹


🤑నేను డబ్బుని 💵👈

నేను మీతోవుంటే అందరూ మీతోనే ,నేను లేకపోతే మీకు ఎందరు వున్నా మీరు ఏకాకి కాక తప్పదు🙇🕴


🤑నేను డబ్బుని💵👈

సమస్త కీడులకు మూలము నేనె ,అయిననూ జనులంతా నా వెంటే 🏃


🤑నేను డబ్బుని💷👈

నన్నెంతగా ప్రెమిస్తే అంతగా మిమ్మల్ని అందరూ ద్వేషించేలా🗡🔪 పరిస్తితులు మార్చేస్తాను😡


🤑నేను డబ్బుని💴👈

నేను అనేకుల్ని ధనవంతులుగా చేసాను ,కాని మరణం🚑🚨 నుంచి వారిని తప్పించలేను. 


🤑నేను డబ్బుని👈

నాకు స్తిరత్వం ⤴️⤵️↩↪🌪 లేదు😜


🤑నేను డబ్బుని💳👈

నన్ను దేవుడు సృష్టించలేదు🙏మీరే నన్నుసృష్టించి నేను ఆడించినట్లు ఆడుతున్నారు


👏👏👏👏

నేటి సెల్‌ఫోన్ చరవాణి...

 - ఎవరు వ్రాశారో తెలియదు కానీ చాలా బాగుంది. 


నేటి సెల్‌ఫోన్ చరవాణి...

జేబుల్లో కీరవాణి

మాయచేసే మహారాణి

వ్యసనాల యువరాణి


గుప్పిట్లో ఉండాల్సింది..

అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది

అదనపు అవయవంగా మారి..

అవయవాలన్నటినీ ఆడిస్తోంది


"ప్రపంచానికి" అవసరమని రూపిస్తే..

తానే "ప్రపంచమై" కూర్చుంది

సౌకర్యం కోసం సృష్టిస్తే ..

సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది


"నట్టింట్లో" మాటలు మాన్పించి ..

నెట్టింట్లో ఊసులు కలిపింది.


చాటింగులు...

మీటింగులు...

ఆపై రేటింగులు..అంటూ

యువతను పెడద్రోవ పట్టిస్తోంది

సమాజాన్ని పట్టి పీడిస్తోంది. 


విలువైన సమయాన్ని

తనలోనే చూపిస్తూ

చిత్రంగా హరిస్తోంది


అయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా 

యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది

వ్యసనపరులుగా మార్చింది


ప్రమాదవశాత్తు పడిపోయినా...

"ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా

"ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది.


ఎన్నని చెప్పను దీని లీలలు


ఓ మిత్రమా...!

విజ్ఞానం కోసం చేసింది

అజ్ఞానంగా వాడకు

ఊడిగం చేయించుకో...

అంతేగాని బానిసగా మారకు.


దేన్నెక్కడుంచాలో

అక్కడే ఉంచు. 

నెత్తినెట్టుకున్నావో ..

పాతాళానికి తొక్కేస్తుంది.

  బి కేర్ ఫుల్

అది మాయల మహరాణి

వ్యసనాల యువరాణి

చేతిలోని చరవాణి.Ss

ఆలోచించండి

 ఆలోచించండి!!!


అఖండ భారతాన్ని ఏలిన ఈ రాజవంశాలలో కనీసం ఒక్క రాజుపేరు చెప్పగలరా?


మౌర్యులు

శాతవాహనులు

గుప్తులు

పాండ్యులు

చోలులు

కాకతీయుల

పల్లవులు

చాలుక్యులు

విజయనగర రాజులు

రెడ్డి రాజులు


ఈ రాజ్యాల రాజధానుల పేర్లు చెప్పగలరా? ఒక్కొక్క రాజ్యం ఎన్ని సంవత్సరాలు వున్నదో చెప్పగలరా? వీరి సామ్రాజ్య విస్తీర్ణం ఎంతో తెలుసా? ఈ వంశాల గురించి కనీసం వినియున్నారా?


పై ప్రశ్నలకు సమాధానాలు NCERT పుస్తకాలల్లో కూడ దొరకవు. కానీ కోట్లాది భారతీయులను ఊచకోత కోసిన మొఘలు సామ్రాజ్యం గురించి అడగండి ...ఠక్కుమని సమాధానం చెబుతారు. బాబరు నుండి ఔరంగజేబు వరకు ప్రతి ఒక్కరి పేరు అందరికి తెలుస్తుంది. బాబరు, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు. 

రాజ్యలు ఏలిన సమయాలు చూడండి


మొఘల్ 250 years

మౌర్యులు 550 years

శాతవాహనులు 500 years

గుప్తులు 400 years

పాండ్యులు 800 years

చోలులు 1000 years

పల్లవులు 600 years

చాలుక్యులు 600 years

అహోం 650 years(ఈశాన్యభారతం)


చాలామందికి ఈసామ్రాజ్యాలో కనీసం ఒక్క రాజు పేరు కూడ తెలవదు. అసలు భారతమంతా మొఘలుల క్రిందనే వున్నట్టు చరిత్ర పాఠ్యపుస్తకాలు చెబుతాయి. ఇంత ఘోరంగా మనపుస్తకాలు రాయబడ్డాయి 


ఒకడేమో హిందువులే కులాన్ని సృష్టించారు అంటడు. ఒకడేమో బ్రిటీషు వాడి వళ్ళనే మనకు నాగరికత, సైన్సు తెలిసిందంపాడు. ఇంకొకడేమో మనకసలు శాస్త్రీయ దృక్పథమే లేదంటడు. మరొకడేమో ఎప్పుడో మనం ధనికదేశం కావచ్చు కానీ వేయి సంవత్సరాల దరిద్రం వుంది అంటాడు.


నా చిన్నప్పుడు చరిత్రలో, మిగతా సామ్రాజ్యాలన్ళింటిని ఒక చాప్టర్లో చదివితే...మొఘల్ రాజులకేమో..ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క చాప్టర్... 32000 మంది లొంగిపోయిన రాజపుత్రవీరులను ఒకేరోజు తలలు నరికి గుట్టలుగా పోసిన అక్బర్ ను ధర్మాత్ముడుగా చదవాలిసిన ఖర్మ నాకెందుకు పట్టింది. కోట్లాది మంది వున్న హిందూమతం గురించి చదవటం మత మౌఢ్యమైతే, కేవలం పదిమంది మాత్రమే వున్న దీన్-ఇ-లాహి అనే మత సూత్రాలను నేర్పించిన కుక్కలకొడుకులనేం చేయాలి?


మన దేశంగురించి చరిత్ర తెలవకుండా చేసింది ఎవరు? మన దేశ చరిత్ర తెలియకుండా జాగ్రత్తపడేవారెవ్వరు? 

ఈదేశంలో పుట్టిన హిందూత్వం కానీ బౌద్దంకానీ జైనంకానీ చదివితే మతమౌఢ్యం...కోట్లమందిని చంపి మనదేశ చరిత్రను, సంస్కృతును, సాంప్రదాయాలను రూపుమాపిన ఎడారి మతాలను ప్రోత్సహిస్తే సెక్యులరిజం ఎలా అయింది?. అమ్మా నాన్నలను, గురువునూ, దేశాన్నీ, గౌరవించమనీ,ప్రేమించమనీ చెప్పే సదాచారం మతమౌఢ్యం ఎలా అవుతుంది?


ప్రతి దేశంలో దేశభక్తి అనేది గొప్ప తత్వం. మరి మన దేశంలో దేశభక్తి అంటే హిందూ మత దురహంకారం ఎలా అయింది.


మెకాలె నుంచి మొదలు నేటి సెక్యులరిస్టుల వరకు మన సంస్కృతిమీద‌, విలువలమీద, మతంమీద, ఆచారాలమీద, మనం బ్రతికే విధానంమీద జరిపే దాడులను చూస్తూ, వింటూ భరించాలిసిందేనా?. మనం ప్రశ్నించలేమా? వేయి సంవత్సరాల పరాయిపాలనకింద బానిసత్వం అలవాటయి పోయిందా?


ఆలోచించండి!!!