31, జులై 2021, శనివారం

నేటి సెల్‌ఫోన్ చరవాణి...

 - ఎవరు వ్రాశారో తెలియదు కానీ చాలా బాగుంది. 


నేటి సెల్‌ఫోన్ చరవాణి...

జేబుల్లో కీరవాణి

మాయచేసే మహారాణి

వ్యసనాల యువరాణి


గుప్పిట్లో ఉండాల్సింది..

అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది

అదనపు అవయవంగా మారి..

అవయవాలన్నటినీ ఆడిస్తోంది


"ప్రపంచానికి" అవసరమని రూపిస్తే..

తానే "ప్రపంచమై" కూర్చుంది

సౌకర్యం కోసం సృష్టిస్తే ..

సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది


"నట్టింట్లో" మాటలు మాన్పించి ..

నెట్టింట్లో ఊసులు కలిపింది.


చాటింగులు...

మీటింగులు...

ఆపై రేటింగులు..అంటూ

యువతను పెడద్రోవ పట్టిస్తోంది

సమాజాన్ని పట్టి పీడిస్తోంది. 


విలువైన సమయాన్ని

తనలోనే చూపిస్తూ

చిత్రంగా హరిస్తోంది


అయిన వాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా 

యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది

వ్యసనపరులుగా మార్చింది


ప్రమాదవశాత్తు పడిపోయినా...

"ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా

"ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది.


ఎన్నని చెప్పను దీని లీలలు


ఓ మిత్రమా...!

విజ్ఞానం కోసం చేసింది

అజ్ఞానంగా వాడకు

ఊడిగం చేయించుకో...

అంతేగాని బానిసగా మారకు.


దేన్నెక్కడుంచాలో

అక్కడే ఉంచు. 

నెత్తినెట్టుకున్నావో ..

పాతాళానికి తొక్కేస్తుంది.

  బి కేర్ ఫుల్

అది మాయల మహరాణి

వ్యసనాల యువరాణి

చేతిలోని చరవాణి.Ss

కామెంట్‌లు లేవు: