31, జులై 2021, శనివారం

లక్షణములు ముందుగా తెలుసుకొనుట

 మరణించు వాని లక్షణములు ముందుగా తెలుసుకొనుట - 



      రోగులకు చికిత్స చేయు క్రమములో కొన్ని రకాల తీవ్రమైన జబ్బులు ఔషధములతో ఎంత ప్రయత్నించినను లొంగవు . అటువంటప్పుడు ఆరోగి మరణమును తప్పక పొందును. మరణము సమీపించునకు మునుపే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడి రాబోవు మరణమును సూచించును . వీటిని అయుర్వేదము నందు అరిష్టములు అందురు. ఇటువంటి ప్రత్యేక లక్షణములను ఎంతో అనుభవము కలిగిన వైద్యులు మాత్రమే పసిగట్టగలరు. ఈ లక్షణములు వైద్యులు రహస్యముగానే ఉంచెదరు. 


         నేను మాత్రం వాటిని మీకు సంపూర్ణముగా వివరిస్తాను . 



   మరణ అరిష్టములు - 



 * కామెర్ల రోగములో వలే కళ్లు పచ్చగా ఉండి ముఖం , దవడలు మాంసముతో నిండి ఉండి రోగి భయముతో ఉండి శరీరం జ్వరం ఉన్నవాని వలే ఉండిన అరిష్టము. 


 * మంచము మీద నుంచి లేవనెత్తిన వెంటనే మూర్చపోతాడు. ఎప్పుడు లేపినను ఇదే పరిస్థితి ఉండును. ఇట్టివాడు 7 దినములలో మరణించటం తథ్యం . 


 * శరీరం నందు కొన్ని రోగాలు పైభాగము నందు , కొన్ని కింద భాగము నందు ప్రభావము చూపించును. అందు గ్రహణి అను రోగం అత్యంత తీవ్రము అయిన ఆ రోగి 15 దినముల కంటే ఎక్కువ బ్రతకడు . 


 * పురాణరోగం పీడిస్తూ తిండి తక్కువ తింటూ అంతకు మించి మలమూత్రాదులు ఉన్నరోగి బ్రతుకుట దుర్లభం. 


 * శరీరం కండ లేకుండా దుర్బలముగా ఉండి తిండి అధికంగా తినడం మరికొంత సమయం అవ్వగానే మరలా తినడం అరిష్టం. 


 * ఇష్టము , బలవర్థకం , సర్వగుణసంపన్నం అయిన ఆహారం తినుచున్ననూ రోజురోజుకి శరీరం క్షీణించువాడు బ్రతకడు. 


 * మూలగడం , ఆగి ఆగి ఆయసం రావడం , అతిసార రోగం , బలం ఉండదు , తీవ్ర దప్పిక , నోరు ఎండుకొని పోవడం వంటి లక్షణాలు అరిష్టం . 


 * నేత్రములు పైకి పోవడం , కంఠం ఇరువైపులా ఉండు సిరలు ఆగకుండా కంపించడం , బలహీనత , దప్పిక , శరీరం ఎండుకు పోవడం వంటి లక్షణాలు అరిష్టం. 


 * శిరస్సు , నాలిక , ముఖం తిరిగిపోవడం , కనుబొమ్మలు వాలిపోవడం , నాలిక మీద రుచిమొగ్గలు ముళ్ళు వలే పైకి తేలి ఉండటం వంటి లక్షణాలు అరిష్టం . 


 * శిశ్నము పూర్తిగా లోపలికి పోయి వృషణములు కిందకి జారి బయటకి వచ్చినట్టు కనిపించినను లేక వృషణములు లోపలికి వెళ్లి శిశ్నము బయటకి వచ్చినట్టు కనిపించినను అరిష్టము . 


 * మాంసం పూర్తిగా నశించి చర్మం , ఎముకలు మాత్రమే మిగిలి అస్థిపంజరంలా మారినవాడు 30 దినములలోపు మరణించును. 


 * రెప్పలు వాచిపోయి దగ్గరకు రావు . శరీరం కృశించి , కండ్లు మకిలి , మాలిన్యము నిండి ఉండటం అరిష్టం . 


 * రోగము సంభవించినను , సంభవించకున్నను ఎవ్వరి తలవెంట్రుకలు పట్టి లాగినను వానికి ఎంత మాత్రం నొప్పి తెలియకుండా ఉండునో వాడు 6 దినములలో తప్పక చచ్చును. 


 * తలవెంట్రుకలుకు చమురు రాయకున్నను రాసినట్టుగా చమురుతో తడిచిన విధముగా ఉండునో వాడు జీవించడు . 


 * శరీరం చిక్కిపోతున్ననూ ముక్కు దూలం మాత్రం కండతో బలంగా ఉండి శరీరం ఉబ్బురోగం లేకున్ననూ ఉబ్బినట్టుగా ఉన్నను అరిష్టం . 


 * నాసారంధ్రములు పూర్తిగా మూసుకొని పోయినను , విశేషముగా తెరచుకొని ఉన్నను , వంకర పోయినను , ఎండిపోయినను ఆ రోగి బ్రతకడు. 


 * దీర్ఘముగా ఊపిరి విడుస్తూ మరలా వెంటవెంటనే వాయువును లోపలికి తీసుకుంటూ మిగుల వేదనను అనుభవించువాడు జీవించడు. 


 * మోకాలుతో మోకాలును చేర్చి వాయించుతూ రెండు పాదములను పైకి ఎత్తి గభాలున మంచం మీద వదులువాడు , సర్వదా ముఖమును అటుఇటు కదిలించుట అరిష్టం . 


 * గోళ్లను దంతాలతో కొరుక్కోవడం , తలవెంట్రుకలును గోళ్లతో పట్టి తెంచుకొనుట , కర్రపట్టి నేలమీద గీయుట అరిష్టం. 


 * మేల్కొన్న సమయములో దంతాలు కోరుకుట , బిగ్గరగా ఏడవడం మరలా అంతలోనే నవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉన్నవాడికి వాడి శరీరంలో బాధలు వాడికే తెలియవు . ఇది అరిష్టం . 


 * అతిగా నవ్వడం , కటకట మని శబ్దం చేయుట సకిలిస్తాడు , పాదాలతో మంచాన్ని కొట్టువాడు , ముక్కులు , చెవులు , కండ్లు వంటి రంధ్రములలో వ్రేళ్లు దూర్చుట అరిష్టం. 


 * శిరస్సు బరువైపోయి మోయలేక కంఠం ఒకవైపుకు వాలిపోవడం , శరీరం బరువు మోయలేక నడుము వంగిపోవడం , అన్నం నోట్లో పెట్టిన దౌడలు వ్రేలాడిపోయి అన్నం జారిపోవడం అరిష్టం. 


 * తెల్లవారుజామున ముఖం పైన చెమట పడుతూ ఉండును. ఇట్టి జ్వర పీడితుడు జీవించడు. 


 * శ్లేష్మరూపం అయిన కళ్లే , మలము , శుక్రము ఇవి తేలిక పదార్దాలు అగుట చేత నీటిలో తేలును . కాని ఏ రోగి సంబంధం అయిన ఈ మూడు నీటిలో వేసిన మునిగిపోవునో ఆ రోగి జీవించడు. 


            పైన చెప్పిన లక్షణాలు ఒక్కో రోగిలో ఒక్కోలా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న వైద్యుడు మాత్రమే ఆయా లక్షణాలను సరిగ్గా అంచనా వేయగలడు. 



     పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: