18, మే 2023, గురువారం

బహుళ ప్రచారం

 .

                 _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*జలే తైలం ఖలే గుహ్యం*

*పాత్రే దానం మనాగపి|*

*ప్రాజ్ఞేశాస్త్రం స్వయం యాతి*

*విస్తారం వస్తుశక్తితః||*


*--- _చాణక్యనీతి_ ---*


తా𝕝𝕝 

*నీటిలోపడిన నూనె, నీచుడికి తెలిపిన రహస్యం, యోగ్యిడికిచ్చిన దానం‌, బుద్ధిమంతుడికి నేర్పిన విద్య ఇవి కొద్దిపాటివైనా సహజంగానే వ్యాప్తి చెందుతాయి*..... *అనగా ఇవి బాగా వ్యాప్తిచెంది బహుళ ప్రచారం అవుతాయి అని భావము*.....

దీపారాధన

 🌹🙏🌺దీపారాధన ఉండగా పూజగది తలుపులు వేయొచ్చా❓️


🌺ఈ అనుమానం అనేకమందికి ఉంది. నివృత్తి చేసుకోండి 

ప్రాచీనకాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోను పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి. అప్పట్లో వంట గదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ వుండేవారు. ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు.🌺


🌺ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది.అయితే ఉదయం వేళలోను ... సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత, వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా? ... వేయకూడదా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతుంటుంది.🌺


🌺మరికొందరు దీపారాధన వుండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకూ ఆ తలుపులను తెరిచే వుంచుతుంటారు.ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది.🌺


🌺అలాగే దీపారాధన ఉన్నంత వరకూ తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని శాస్త్రం చెబుతోంది. ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది.....🚩🌞🙏🌹


🌺సర్వేహిందూజనా సుఖినోభవంతు 🌺


జై శ్రీమన్నారాయణ

బయట పడటానికి

 శ్లోకం:☝️

  *పతితః పశురపి కూపే*

*నిస్సర్తుం చరణ చాలనం కురుతే l*

  *దిక్త్వాం చిత్త! భవాబ్ధేః*

*ఇచ్ఛామపి నో బిభాషి నిస్సర్తుం ll*


భావం: బావిలో పడిన పశువు కూడా బయట పడటానికి బలంగా కాళ్ళు ఆడిస్తుంది. మరి  సంసారమనే ఈ బావిలో పడిన మానవుడు బలంగా కాదు కదా, బయట పడేందుకు కనీస ప్రయత్నము కూడ చేయట్లేదు. అట్లే ఉండాలనుకొంటున్నాడు. ఎందుకో?

దేవాలయ దర్శనంలో

 మన దేవాలయ దర్శనంలో ఉన్న  సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 


1. మూలవిరాట్ : భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి.


2. ప్రదక్షిణ : మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.


3. ఆభరణాలతో దర్శనం : ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని...


4. కొబ్బరి కాయ : ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం...


5. మంత్రాలు : ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర  నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి.


6. గర్భగుడి : గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._


7. అభిషేకం : విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._


8. హారతి : పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.


9. తీర్థం : ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు.


10. మడి : తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..

జై శ్రీమనరాయణ

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 63*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


                    

*పార్ట్ - 63*


మురాదేవి దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ "అవున్నాయనా ... ఇంతకాలానికి మన మొర ఆలకించగల మహానుభావుడు లభించాడన్న బాధతో నా దుఃఖాన్ని, కష్టాన్ని వారికి చెప్పుకునే ప్రయత్నంలో నా కంట కన్నీరు చిందింది. ఆనాడు నా ప్రాణాలకి తెగించి మీ తండ్రిగారి ఆన పాటించి, రహస్యమార్గం ద్వారా నిన్ను పిప్పలవనానికి చేర్చిందీ, వృషలుడనే మారుపేరు పెట్టి నిన్ను ఇంత వాడిని చేసిందీ, నీ వ్యర్ధావేశానికి నిన్ను బలిచెయ్యడానికి కాదు" అంటూ పమిట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. చంద్రుడు ఆవేశాన్ని వుగ్గడించుకుని గుడ్లప్పగించి తల్లిని చూసాడు. 


"నాయనా, చంద్రా ! ఏ జన్మ పుణ్యఫలమో గానీ, ఘటనా ఘటన సమర్థులైన ఆర్య చాణక్యుల వారి సాహచర్యం, కృపాకటాక్షం నీకు లభించింది. ఇహనించీ నీకు తల్లీ, తండ్రీ, గురువూ, దైవం సర్వమూ చాణక్యుల వారే .... వారేం చెబితే అది చెయ్యి. వారెట్లా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకో.... మీ తండ్రి మహానందుల వారి అంతిమ కోరిక 'వారి రక్తమే' మగధ సింహాసనాన్ని అధిష్టించడం... దాన్ని నెరవేర్చే వరకూ దేనికీ చలించకు. జీవితాంతం వరకూ చాణుక్యుల వారి ఆశ్రయాన్ని వదలకు...." అని కుమారునికి హితబోధ చేసింది మురాదేవి. 


చంద్రుడు తల్లి ముందు మోకరిల్లి ఆమె పాదాలను తాకి "మీ ఆజ్ఞను శిరసా వహిస్తానమ్మా" అని ప్రమాణం చేశాడు. 


మురాదేవి కుమారుని లేవదీసి, అతడిని చాణక్యుడు ముందుకు తీసుకువెళ్లి "స్వామీ ! చంద్రుడు ఇంతవరకు మురా... మహానందుల వారి పుత్రుడు. ఈ క్షణం నుంచే మీ బిడ్డడు. స్వీకరించండి..." అంటూ చంద్రుని చేతిని చాణక్యుని చేతిలో పెట్టి అప్పగింత చేసింది. 


అప్రతిహత ప్రతిభా సంపన్నుడైన చాణక్యుని నిష్టూర నేత్రాలు ఆ సంఘటనకు చిప్పిల్లి చెమ్మగిల్లాయి. అతడి విశాల నయనాల నిండుగా ఆనందాశ్రువులు గిర్రున సుడులు తిరుగుతుండ, భావావేశంతో అతని కంఠం గాద్గదికమైంది.


"అమ్మా ! అపూర్వమూ, అనిర్వచినీయమైన అద్భుత సంఘటన ఈ చాణక్యుని జీవితంలో చోటు చేసుకుంటుందని సృష్టికర్త అయిన ఆ పరమాత్మ కూడా ఊహించి ఉండడు. చంద్రుని కంటే ఐదారు సంవత్సరాలు పెద్దవాడినైన నాకు... ధర్మపత్ని వలన రేపో మాపో పితృస్థానం లభించనున్న నాకు... భగవంతుడు ప్రసాదించిన వరంలా... నీ దయవల్ల తండ్రినయిన భాగ్యం లభించింది. సోదరులలో జ్యేష్ఠుడు 'కనిష్ఠులకు' తండ్రితో సమానం... నిన్ను 'అమ్మా' అని పిలిచి, వయస్సు చేత నీకు జ్యేష్టుడినయ్యాను. ఆ విధంగానూ నేను చంద్రునికి తండ్రినయ్యాను. ఆ అధికారంతో... ఆ అభిమానంతో నా గాయత్రి సాక్షిగా నీకు మాటిస్తున్నాను... ఇకనుంచీ చంద్రుడు నా బిడ్డడు. నా అభిమాన పుత్రుడు. 'మురా - చంద్రగుప్తుల' ప్రతీకగా భాసిల్లే 'మౌర్య రాజ్యస్థాపనే' ఇక నా ధ్యేయం. మౌర్య సామ్రాజ్య సుస్థిరతయే ఏ నా జీవిత లక్ష్యం....." 


చాణక్యుని ప్రమాణ వచనంతో మురా చంద్రగుప్తుల హృదయాలు ప్రశాంతత నందాయి. మురాదేవి ఆనందాశ్రువులను తుడుచుకుంటూ... 

"చాలు నాయనా .... ! నీ చల్లని మాటతో ఇన్నేళ్ల నా పరితాపం ఒక్కసారిగా శాంతించింది. నీ వంటి మేరునగధీరుని అభిమాన పుత్రునిగా బడసి నేనూ ధన్యురాలినయ్యాను. ఈ క్షణం నుంచీ నాకూ నీ ఆదేశమే శిరోధార్యం. చెప్పు తండ్రీ... ఏమిటి నీ ఆజ్ఞ ?" అని అడిగింది సంతృప్త హృదయంతో.


చాణక్యుడు చిరునవ్వు నవ్వి "ఆజ్ఞ కాదమ్మా, అభ్యర్థన .... ఈ రాత్రి పాటలీపుత్రం ఉత్తర దిక్కునున్న కుసుమపుర ఉద్యానవనంలో మహానందుల వారి అభిమానులైన కొందరు ప్రముఖ రాజోద్యోగుల సమావేశం ఏర్పాటు చెయ్యబడింది. ఆ సమావేశానికి ప్రధాన అతిధి మహారాణి మురాదేవి...." అన్నాడు సాలోచనగా. 


"నాయనా .... !" విస్తుపోయింది మురాదేవి. 


చాణక్యుడు తలపంకిస్తూ "ఆ రహస్య సమావేశంలో మహారాణి మురాదేవి నందులవల్ల తమకు జరిగిన అన్యాయాన్ని, ద్రోహాన్ని ఆ రాజభక్తులకు హృదయవిదారకంగా వివరిస్తారు... మురాదేవి దుఃఖంతో తల్లడిల్లి, నందులపై కృద్దులైన రాజోద్యోగులు చంద్రగుప్త దిగ్విజయానికి తమ వంతు సాయం చేస్తామని ఆవేశంతో ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞా సారాంశంతో కూడిన లేఖపై ఆ రాజభక్తులచేత చేవ్రాలు చేయిస్తారు మురాదేవి. అది చేతికి రాగానే... రేపు ఉదయమే కార్యసాధనకు మా ప్రయాణం..." అని చెప్పి, సిద్ధంగా ఉంచుకున్న ఒక లేఖను మురాదేవి చేతుల్లో పెట్టి "ఇదే మీరు సంతకాలు చేయించవలసిన లేఖ.... రాత్రి తొలిఝాము దాటాక చాణక్య శిష్యులు వచ్చి తమరిని సురక్షితంగా కుసుమపురానికి తీసుకువెళ్లి, కార్యం ముగిసిన తదుపరి తిరిగి ఇక్కడికి చేరుస్తారు" అని చెప్పాడు గంభీరంగా. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

హనుమజ్జయంతి ప్రత్యేకం - 7

 ॐ      హనుమజ్జయంతి ప్రత్యేకం  - 7 

    (ఈ నెల 14వ తేదీ హనుమజ్జయంతి) 


VII. హనుమంతుడు - కార్యదీక్ష 


    సముద్రం దాటటం - సీతాన్వేషణ అనే కార్యం హనుమపై పడింది. 

    దానికి సంబంధించి కనీస సమాచారమేదీ ఆయనకి అందజేయబడలేదు. 

    ఆ ప్రయత్నంలో ప్రలోభాలూ, ప్రమాదాలూ ఎదురవుతూ వచ్చాయి. 

    కానీ వాటన్నిటినీ హనుమ అధిగమిస్తూ, అప్పటికప్పుడు ఎదుర్కొన్న తీరూ - ముందుకు సాగిన పద్ధతులూ, ఆయన ఏకాగ్రతకూ కార్యదీక్షకూ అద్దం పడుతాయి. 

      అందులో కొన్ని 


అ) సముద్ర లంఘనము 


(i) ప్రలోభం:

    మైనాకునిపై విశ్రమించక సాగిపోవడం. 


    సముద్రుని కోరికమేరకు మైనాకుడు తనపై విశ్రమించి వెళ్ళమన్నాడు. 

    మధ్యలో ఆగనని (రామబాణం) ప్రమాణం చేశాననీ, సమయం కూడా మించిపోతోందనీ చెప్పి ముందుకు సాగాడు. 

(ii) పరీక్ష: 

    సురస పరీక్షించదలచి, తన నోటిలోకి ప్రవేశించమని హనుమని  కోరింది. 

    హనుమ బొటనవ్రేలు పరిమాణంలో అయి, సురస కోరినట్లు నోటిలోకి ప్రవేశించి, ఉపాయంతో బయటకు వచ్చాడు. 

(iii) అకస్మాత్ హింస: 

    నీడను బట్టీలాగే సింహికను మర్మావయవాలు ఛేదించి సంహరించాడు. 


ఆ) ప్రవేశ ప్రయత్నం: 

    లంకాధిదేవత అడ్డగించినప్పుడు, 

    ఆమెను ఎదుర్కొని, లంకలోనికి ప్రవేశించాడు. 


ఇ) నిగ్రహం: 

     అంతఃపురంలో స్త్రీలను చూడడమే ధర్మలోపం అనీ, 

    అయినా తన మనస్సు ఎట్టి వికారాలకూ లోనవలేదనీ తలచుకున్నాడు. 

    తప్పిపోయిన స్త్రీని స్త్రీల మధ్యలోనే కదా వెదకవలెననే సూత్రంతో వెదికాడు. 


ఈ) ఉత్సాహము: 

    సీతాన్వేషణలో ఫలితము కనబడనప్పుడు నిరాశ ఆవహించినా, 

"ఉత్సాహమే సంపదకు మూలమని" జ్ఞప్తికి తెచ్చుకొని, 

    ప్రార్థన చేసి, సీతాదర్శనాన్ని పొందగలిగాడు. .


ఉ) సంభాషణ ప్రణాళిక:  

    సీతాదేవితో మాట్లాడడానికి వివిధ విశ్లేషణలు చేసి, 

    ఆమెకు రామకథాగానం, అదీ కోసల భాషలో వినిపించి,  పనులు చక్కబెట్టాడు.

    

ఊ) రాక్షసులను రప్పించి దాడి: 

    అశోకవనం ధ్వంసంచేసి, పర్యవసానంగా, 

    రావణుడిచేత పంపబడ్డ కింకరులు, జంబుమాలి మొదలగు రాక్షసులతో తలపడి సంహరించాడు. 


ఋ) జయఘోష, హెచ్చరిక: 

    కింకరులు వచ్చినపుడు జయఘోష చేశాడు. అనంతరం వారిని సంహరించాడు.  

   "ఇక్ష్వాకు వంశీయులతో వైరం వల్ల లంకగానీ, లంకలోనివారుగానీ, రావణుడుగానీ ఉండబోరు" అని 

లంకలో అందరికీ హెచ్చరిక చేశాడు. 


ఋూ) సహనం - కార్యాలోచన:

    ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి 

  - చేష్టలుడిగినా తేరుకునీ, 

  - అస్త్రం విడిపోయినా బంధింపబడీ, 

    హింసని సహించాడు. 

    తద్వారా రావణ సభకు చేరుకోగలిగాడు. 

        

ఌ) ఉపదేశం: 

         రావణునికి ధైర్యంగా వాస్తవం తెలుపుతూ, సరియైన సలహా ఇచ్చాడు. 


ౡ) వచ్చిన అవకాశం - మెఱుపుదాడి: 

        (Surgical Strike) 


    తోకకు నిప్పంటిస్తే, వివిధ కోణాలలో ఆలోచించి, 

    త్రిజట కలలో చెప్పిన "వానరుడు లంకను తగులబెడుతున్న" విషయం జ్ఞప్తికి వచ్చిందేమో అన్నట్లు, 

    లంకా దహనం కావించాడు. 

           

ఎ) సమయపాలన: 

         సీతాదేవి విశ్రమించివెళ్ళమని అన్నా, వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. 


ఏ) నివేదిక: 

    తిరిగి వచ్చిన హనుమ వానరులతో "చూచాను సీతను" అంటూ, సుదీర్ఘంగా విషయాలు తెలిపాడు. 

    శ్రీరామునితో మాత్రం, తన గొప్ప చెప్పుకోక, తెలుపవలసిన ముఖ్యవిషయాలు  తెలియజేశాడు. 


కార్యాచరణ 


        హనుమంతుడు 

  - ఎప్పుడెప్పుడు 

  - ఎక్కడెక్కడ 

  - ఎవరెవరితో 

  - ఏఏవిధంగా ప్రవర్తించాలో, 

    పూర్తిగా క్షణాలలోనే సరియైన నిర్ణయం తీసుకుని, 

    కార్యాచరణ చేయగలిగిన అత్యంత సమర్థుడైన కార్య నిర్వాహకుడు. 

        

    మనం ఆయన్ని స్మరిస్తేచాలు. అవన్నీ మనకీ లభింపజేస్తాడు. 


బుద్ధిర్బలం యశోధైర్యం 

నిర్భయత్వం అరోగతా I 

అజాడ్యం వాక్పటుత్వంచ 

హనుమత్స్మరణాభవేత్ ॥ 


               జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 


          జై హనుమాన్ జై జై హనుమాన్  


                           కొనసాగింపు .... 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం 

        (86399 68383)

స్వానుభవాలు

స్వానుభవాలు


పరమాచార్య స్వామివారిని నేను 18-3-1978న మొదటిసారి దర్శించుకున్నాను. అది పరమ పవిత్రమైన శుభదినం. ఆరోజు మహాస్వామి వారు నన్ను వారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసిన రోజు.


వలాజలో ఉపాధ్యాయుడైన మా నాన్నగారు టి.ఆర్. సుందరమూర్తి గారు పరమాచార్య స్వామివారి గొప్పతనం గూర్చి ఎన్నోమార్లు నాకు చెప్పారు. వారితో పాటు నేను కూడా చాలాసార్లు మహాస్వామి వారిని దర్శించుకున్నాను. ఎటువంటి భక్తీ పారవశ్యము లేని కేవల దర్శనాలు అవి.


కాని మార్చి పద్దెనిమిదిన చేసుకున్న దర్శనం నన్ను స్వామివారి వైపుకి తిప్పింది. కైలాసనాథునికి సేవ చేసే శివగణాలలాగా పరమాచార్య స్వామివారి సేవ చేసుకునే గణాలలో నన్నూ చేర్చుకున్నారు.


అప్పుడు మహాస్వామి వారు శివాస్థానంలో ఉండేవారు. వారు నాకు అప్పగించిన పని ఏమిటో తెలుసా?


నీటి పని, అక్కడున్న బావిలో నుండి నీరు చేదడం, శ్రీమఠం ఆవులు దూడలకు మామిడి చెట్లకు పాదులకు నీరు పెట్టడం. దానితోపాటుగా పానకం తయారుచెయ్యడం - అక్కడకు వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి.

అప్పట్లో నాకు శ్రీమఠం ఆచార అనుష్టానాలు, సంప్రదాయాలు గురించి ఏమీ తెలియదు. మెట్టూర్ రాజగోపాల మామ(తరువాత మెట్టూర్ స్వామివారు), బాలు మామ వాటిలో నాకు తర్ఫీదుని ఇచ్చేవారు.


మహాస్వామి వారు శివాస్థానం బ్రహ్మపురీశ్వర ఆలయం ప్రదక్షిణం చేసేటప్పుడు అక్కడున్న ప్రతి చెట్టునీ, మొక్కని, ఆవులని, దూడలని ఎంతో ప్రేమతో చూసేవారు స్వామివారు. (తరువాత నాకు అర్థం అయ్యింది, పరమాచార్య స్వామివారి దీర్ఘదృష్టి సోకడానికి ఆ చెట్లు, పశువులు ఎంత పుణ్యం చేసుకున్నాయో).


అప్పుడు స్వామివారే స్వయంగా “ఈరోజు నువ్వు ఏం చేశావు?” అని అడిగేవారు. నా సమాధానానికి స్వామివారి వివరణ ఎన్నో ఉపదేశాల సారం. నేను ఏదైనా పొరపాటు చేస్తే, ఎంతో సున్నితంగా నన్ను బాధించకుండా తెలిపేవారు.

ప్రతి రోజూ తెల్లవారుఝామున మూడు గంటలప్పుడు శివాస్థానం నుండి మొదలుపెట్టి, శ్రీ వరదరాజ స్వామి ఆలయం నాలుగు మాడ వీధుల గుండా ప్రదక్షిణం చేసేవారు. మేమందరమూ చిన్న గొంతుతో విష్ణు సహస్రం పారాయణ చేస్తూ స్వామివారిని అనుసరించేవారం.


1978 ఏప్రిల్ 6


మామూలుగా తెల్లవారు మూడుగంటలకు మొదలుపెట్టి, కామాక్షి అమ్మవారి దేవాలయంలో దర్శనం చేసుకుని, శ్రీమఠంలో ఉన్న సురేశ్వరాచార్యుల దర్శనం చేసుకుని పరమాచార్య స్వామివారు కీళంబి అనే గ్రామానికి పాదయాత్రను మొదలుపెట్టారు.


కాంచీపుర వాసులు పెద్ద ఎత్తున వచ్చి, అశ్రునయనాలతో చాలాదూరం పాదయాత్రకు వెళ్లరాదని ప్రార్థించారు. అప్పుడు మహాస్వామివారు కాష్టమౌనంలో ఉన్నారు. ఎటువంటి సంకేతములు చూపకుండా పాదయాత్ర కొనసాగించారు.

చిత్తూరు జిల్లా చిన్న తిప్ప సముద్రం నుండి అనంతపురం వైపు వెళ్తూ కదిరి అనే ఊరిలో మకాం చేశాము. ఈ గ్రామంలో పురాణ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది.


అనంతపురం నుండి మొదలుపెట్టి, సంగమేశ్వరం(అనంతపురం జిల్లా) చేరుకొని, అక్కడి నుండి బయలుదేరి తమ్మాపురం అనే ఊరిలో ఉన్న ఒక శిథిల మండపంలో బస చేశాము.


జూన్ 27, 1978 నా జేవితంలో మరచిపోలేని రోజు. అ శుభ దినాన, నేను మహాపెరియవా, పుదు పెరియవా ఇద్దరినీ జంటగా దర్శనం చేసుకున్నాను.

అది ఒక పాడుబడ్డ మండపం, అక్కడ ఎంతో వైభవంగా మూడు కాలాలపాటు చంద్రమౌళీశ్వర ఆరాధన జరిగింది.


తమ్మాపురం నుండి తాడిపత్రి అన్న ఊరి మీదుగా గుత్తి అనే ఊరు చేరుకున్నాము. ఆక్కడ పరమాచార్య స్వామివారికి పెద్ద ఉత్సవం చేశారు. సిబ్బంది మరియు పురప్రజలు మా మకాం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.


తరువాత అక్కడి నుండి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపురం చేరుకున్నాము. ఆరోజు అల్ప ద్వాదశి (13-7-78); అంటే ఆరోజు ఉదయం పదిగంటల వరకే ద్వాదశి ఉంది. కనుక పదిగంటల లోపే మా పారణను ముగించి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిమ్మంచర్ల గ్రామానికి బయలుదేరాము. దారిలో ఎక్కడా ఆగకుండా నిదానంగా నడుస్తున్నాము. చీకటి పడింది. దాంతో పాటు భోరున వర్షం! ఉరుములు మెరుపులతో!


ముందున్న దారి అస్సలు కనబడడం లేదు. ఎత్తు పల్లాలు ఏవీ కనబడకపోవడంతో కాళ్ళు తడబడుతున్నాయి. దగ్గర్లో ఒక మంచి భవనం కనబడింది. ‘అక్కడ ఉందాము’ అని మహాస్వామి వారు అంటారేమో అని ఆత్రుతతో నడుస్తున్నాము.


“విష్ణు సహస్రనామం చెబుతూ నడవండి” అని స్వామివారి ఆజ్ఞ అయ్యింది. అంటే దాని అర్థం మనం ఎక్కడా ఆగడంలేదు అని.


అప్పుడు నేను, పనాంపట్టు కణ్ణన్ సైకిల్ రిక్షాను లాగుతూ ముందర వెళ్తున్నాము. వెనకాల సైకిల్ రిక్షాను తోస్తూ శ్రీకంఠన్ మామ, బాలు మామ స్వామివారితో కలిసి వస్తున్నారు. రిక్షాకు కుడివైపున వెనుకగా మెట్టూర్ రాజగోపాల మామ వస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్ టార్చిలైటుతో మాకు దారి చూపిస్తూ, శ్రీ చంద్రమౌళి (చీను మామ కొడుకు) మమల్ని ముందుకు నడిపిస్తున్నాడు.


తిమ్మంచర్ల చేరుకునేటప్పటికి రాత్రి పదకొండున్నర అయ్యింది. మరుసటి రోజు మరొక పెద్ద ఊరు గుంతకల్లు చేరుకున్నాము.


శ్రీమఠం మకాం గుంతకల్లులో. మరుసటి రోజు ఒక పని మీద నేను గుత్తికి వెళ్ళాల్సివచ్చింది. మేము వచ్చిన దారిని గమనిస్తూ వెళ్లాను. అది పక్కా అడవి దారి అని నాకు అప్పుడు తెలిసింది.


యాత్ర ముందుకు సాగింది. హగరి అనే ప్రాంతంలో పాణ్యం సీమెంట్ వారి పెద్ద భవనంలో మకాం చేశాము. అక్కడే పరమాచార్య స్వామివారు చాతుర్మాస్య వ్రతాన్ని మొదలుపెట్టారు. కనుక మరొక రెండు నెలల పాటు ఎక్కడికీ వెళ్ళడానికి వీలులేదు.


డన్ లాప్ కృష్ణన్ మామ, మా నాన్నతో పాటు నన్ను హంపికి వెళ్లి, చూసిరమ్మని ఆదేశించారు స్వామివారు. మేము హగరికి తిరిగొచ్చేటప్పుడు హోస్పేట నుండి హంపి జీర్ణోద్ధరణ సంస్థకు చెందినా ఇద్దరు ప్రముఖుల్ని పిలుచుకుని రమ్మన్నారు. వారు చాలా సంతోషంగా మాతోపాటు వచ్చారు.


వారితో స్వామివారు కీళంబి మరియు హంపి గురించి ఎంతగానో మాట్లాడారు. కీళంబి శాసనాలలో ఉన్న వైరుధ్యాన్ని వారికి వివరించారు. “హంపి జీర్ణోద్ధరణకు మీరు చేసుకున్న ప్రణాలికలు ఏమిటి?” అని వారిని అడిగారు.


సంభాషణ చాలాసేపు సాగింది. స్వామివారికి భిక్షా సమయం అవ్వడంతో లేచి లోపలకు వెళ్ళారు. భిక్ష ముగించుకుని తిరిగిరాగా హోస్పేట నుండి వచ్చిన వారిరువురు కనబడలేదు. “కొద్దిదూరం బయటకు వెళ్లి చూసి వారు కనబడితే వెంట తీసుకునిరా” అని సేవకుడికి చెప్పారు.


స్వామివారి నుండి సెలవు తీసుకోకుండా వారు వెళ్ళిపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. వారిని వెతకడం కోసం వెళ్ళిన వ్యక్తి తిరిగొచ్చి వారు కనబడలేదని చెప్పాడు.


ఆ హోస్పేట మిత్రులు బళ్ళారి దాటుతుండగా, వారి కారుకు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు పెద్ద గాయాలతో తప్పించుకున్నారు అని వార్తా తెలిసింది. బహుశా స్వామివారు ఆ ప్రమాదం నుండి వారిని కాపాడాలి అనుకున్నారా? కాని వారి ప్రారబ్ధం చాలా గట్టిగా ఉంది.


1978 జులై 28


మా నలుగురికి - నాకు, డన్ లాప్ కృష్ణన్, డా. సుబ్రహ్మణియన్, చేనేత దుకాణం వెంకట్రామయ్యర్ కి పరమాచార్య స్వామివారు ఒక ఆదేశం ఇచ్చారు. “ప్రతి రోజూ తేవారం పారాయణ చెయ్యండి”


దానిపై వివరణలు మొదలయ్యాయి. పరమాచార్య స్వామివారు అంబలవాణ దేశికర్ (తిరువాడుతురై శైవ ఆధీనం పీఠాధిపతి మరియు నమచ్చివాయ పండారత్తార్) గురించి మాట్లాడారు. అంబలవాణ దేశికర్ చివరి రోజుల్లో మఠం పరిపాలన నుండి వైదొలగి వేరొక ప్రాంతంలో సమాధి చెందారు. మహాస్వామి వారు ఇంతటి చారిత్రిక విషయాలను ఎలా తెలుసుకుని వాటిని గుర్తు పెట్టుకుంటారో అని మాకందరికీ ఆశ్చర్యం కలిగింది.


1978 ఆగస్ట్ 2


పరమాచార్య స్వామివారు కాంచీపురం మరియు కుంభకోణం స్థలాల గొప్పదనాన్ని ఎంతగానో వివరించారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన వీధులు, మధ్యలో ఖాళీ లేకుండా కట్టిన గృహాలు కేవలం కాన్చేపురంలోనే కనబడతాయి. అలాగే, కుంభకోణం మరియు పరిసర ప్రాంతాలు చాలా ఎక్కువ సంఖ్యలో దేవాలయాలు ఉన్న ప్రాంతంగా మాకు తెలిపారు.


“తంజై (తంజావూరు) జిల్లాలో అసలు కొండలు లేవు. కాని ఆ ప్రదేశంలోనే మనకు రాళ్ళతో కట్టిన ఎక్కువ దేవాలయాలు కనబడతాయి. దీనికి కారణం కేవలం ఈశ్వర భక్తే. 274 పాడాల్ పెట్రా స్థలాల(అప్పర్, సుందరర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ పాడిన పవిత్ర స్థలాలు) లో 200 స్థలాలు తంజావూరు జిల్లా(ఇప్పటి తంజై, నాగపట్టినం, తిరువారూరు జిల్లాలు) లోనే ఉన్నాయి. కుడంధై (కుంభకోణం) లోని నాగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శాసనాలలో శాస్త్రాలు అధ్యయనం చెయ్యడానికి మాన్యాలు ఇచ్చిన విషయం ఉంది”.

“చోళ రాజులు కావేరీ వరదలప్పుడు తెప్పలు నిర్మించి, కొల్లిమలై నుండి బండరాళ్ళను తెప్పించి దేవాలయలాను నిర్మించారు”.


“ఆండాన్ కోవిల్ అనే ఒక స్థలం ఉంది. ఆండాన్ అనే ఒక భక్తుడు అక్కడ నివసిస్తుండేవాడు అందుకనే ఆ పేరు. అక్కడ ఓడం పోక్కి అనే కాలువ పారుతుంది. తిరువారూరు దేవాలయాన్ని నిర్మిచడానికి ఓడంపోక్కి ద్వారా రాళ్లు తెచ్చినప్పుడు, ప్రతి సారి ఒక రాతిని తెచ్చి, శీర్కాలిలో దేవాలయాన్ని నిర్మించారు.ఇక్కడ చాలా శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలలో విషయం మొదట గ్రంథ లిపిలో, తరువాత తెలుగులో, తరువాత దేవనాగరి లిపిలో ఉంది”.


1978 ఆగస్ట్ 6


మేము అప్పర్ తేవారం చదువుతున్నాము. అప్పుడు పరమాచార్య స్వామివారు మాకు ఇలా చెప్పారు.


“స్వామి శివునికి ప్రాణనాథర్ అన్న పేరు ఉంది. తిరుమంగలక్కుడి దేవాలయంలో ప్రాణేశ్వరుడు. అక్కడి స్థల పురాణం ప్రకారం, అగస్త్య ముని ప్రాణాయామం చేస్తూ, నది నుండి నీరు తెచ్చి, రెండు చేతులతో ప్రాణేశ్వరునికి అభిషేకం చేసాడు. ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం. కేవలం ముక్కుని ముట్టుకుని మంత్రం చెప్పడం కాదు. గాయత్రీ జపం చేసేటప్పుడు ఊపిరి నియంత్రించి చెయ్యాలి.


చంద్రకం అంటే నెమలి తోక. కలశ చంద్రక నీలకంఠ విస్ఫూరితం కాళికా అన్న యొక వాక్యం ఉంది.


ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టినప్పుడు, నెమళ్ళు తమ పురి విప్పి ఆనందంతో నాట్యం చేస్తాయి. వరుసగా ఎగురుతున్న కొంగల గుంపు పూలదండలా కనిపిస్తుంది. పరమేశ్వరుని నాట్యం కూడా అటువంటిదే. నీలకంఠ అనే మేఘం, అస్థిమాల తెల్లని కొంగలులా స్వామివారి విస్ఫూరిత నటనం పురి విప్పిన నెమలి నాట్యంలా! ఎంతటి అద్న్హుతమైన ఉపమానం!!


తిరువీళైమలై శివునికి కురుంబర్ అనే ఒక వ్యక్తి వెలగపండును ఇచ్చాడు. 

ఇక్కడున్న స్వామి కత్యాయనిని వివాహం చేసుకుని ఒక ముదుసలి వానిలా పెళ్లి ఊరెరిగింపు వెళ్ళాడు. అందరికీ దర్శనం ఇచ్చిన తరువాత దంపతీ సమేతంగా అదృశ్యమయ్యాడు. తరువాతా కాత్యాయన మహర్షికి అయిదువందల మంది ఋషులతో కలిసి దర్శనం ఇచ్చాడు. ఇక్కడి స్వామికి మాప్పిళ్లై స్వామి (పెళ్ళికొడుకు స్వామి) అన్న మారుపేరు కూడా ఉంది.


అమ్మవారి సన్నిధి వీధిలో శుక్ల యజుర్వేదం నేర్చుకున్న కాత్యాయన సూత్రకారులు ఉండేవారు. ఇక్కడ అయిదువందల మంది మగవారికి విళియాన్ అన్న ఒక్కటే పేరు. అయిదువందల ఒకటో వాడికి మాత్రమే స్వామివారి పేరు పెట్టేవారు.


వైశాఖ పూర్ణిమ రోజు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అయిదువందల మంది ఉంటే మాత్రమే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.


చోళ నాడు దేశంలో అయిదు అద్భుతాలు ఉన్నాయి. 1. ఆవుడయైర్ కోయిల్ కొడుంగై - పలుచని రాతి వంకర పైకప్పు, 2. తిరువలంచులి పలకణి - అల్లిన గ్రానైటు కిటికీ, 3. మండపాచ్ చెంకల్ - ఇటుక భవనము, తిరువీలైమలై లో 4. మధిల్ - ప్రహరీ గోడ, కిడారాన్ కొండాన్ లో 5. విష్ణుపురం దేవాలయం ఉత్సవ విగ్రహం కాళ్ళపై కన్ను, వెలగపండు చిత్రాలు


ఒకసారి కరువు కాలంలో, అప్పర్ సంబంధర్ భక్తులను పోషించడానికి కావాల్సిన ధనం కోసం శ్లోకాలు పాడారు. తిరువీలైమలై దేవాలయ బలిపీఠంపై రెండు బంగారు నాణాలను ఉంచి శివుడు అనుగ్రహించాడు. అప్పర్ కు లోపం లేని పూర్తీ నాణెం దొరకగా, సంబంధర్ కు లోపమున్న నాణెం దొరికింది.”

మేము పెరియ పురాణం పారాయణం చేస్తున్నప్పుడు స్వామివారు కంబర్ మరియు అంబికాపతి గురించి చెప్పారు.


“తిరువొట్రియూర్ మఠంలో పనిచేసే ఆమెకు కంబర్ పుట్టాడు.


అంబికై చెట్టి అనే ఒకామె కీళంబిలో ఒక శివలింగాన్ని పూజించేది. ఆ లింగానికి అంబికాపతీశ్వరుడు అని పేరు. అదే పేరును కంబర్ తన కుమారునికి పెట్టాడు. కంబర్ భార్య కూడా తిరువొట్రియూర్ కు చెందినావిడే. 


పురాతన కాలంలో కళింగ్గ మానగరం అన్న ఊరే ఇప్పుడు టక్కోలం అని పిలవబడుతోంది.


తొండైమండలం అన్నది ఒక సత్య స్వరూపంగా ఉన్న దేశం. ఈ విషయం అశోకుని కాలం నాటి రాతి శాసనాలలో ఉంది.”

ఇలా మహాస్వామి వారు మాకు అప్పుడప్పుడు ఎన్నో విలువైన విషయాలను తెలిపేవారు.


1978 సెప్టెంబర్ 21


పరమాచార్య స్వామివారు ఒక కారు షెడ్డులో మకాం చేస్తున్నారు. అప్పటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్, వారితో పాటు శ్రీ పి. రామచంద్రన్, వాజ్ పేయ్, దేవరాజ్ అర్స్ వచ్చి ఆ కారుషెడ్డులో మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు.


యాత్ర ముందుకు సాగింది. సండూర్ అనే ఒక పాత సంస్థానం చేరుకున్నాము. రాజ పరంపరలో ఇప్పటివాడైన శ్రీ గోర్ఫడే, యువరాజు ఇద్దరూ పరమాచార్య స్వామివారికి వైభవంగా స్వాగతం పలికారు.


అక్కడ పదిహేను రోజుల పాటు మకాం. శ్రీ శంకర జయంతిని విశేషంగా ఆచరించాము.


సండూరులో రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కడ చేసుకున్నారు అని.


రాజా గోర్ఫడే వారు నిర్వహిస్తున్న గోశాలలోని జమ్మి చెట్టు కింద కూర్చుని దర్శనం ఇస్తున్నారు మహాస్వామి. స్వామివారి సరళత్వాన్ని, సమానత్వాన్ని చూసి రాష్ట్రపతి ఆశ్చర్యపోయారు. రాష్టపతి పర్యటనలో ఉండే హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా జరిగిన సమావేశం అది.


పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోట, స్వామివారి స్మృతిగా గోర్ఫడే రాజు మణిమండపం తరహాలో ఒక దేవాలయాన్ని నిర్మించారు. గోర్ఫడే గురుభక్తికి ఎల్లలు లేవు.


చిత్తూరు నుండి మదనపల్లి వెళ్ళేదారిలో ఒక కుగ్రామం. ఆరోజు రాత్రికి మేము ఒక శివాలయంలో మకాం చేశాము. అది రాత్రి కావడంతో, నడక శ్రమ చేత పరమాచార్య స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు. సాధారణంగా ఉదయం పూట యాత్ర కొనసాగించడం ఆనవాయితీ కనుక మేమందరమూ సిద్ధంగా ఉన్నాము. “సాయంకాలం బయలుదేరుదాము” అని తెలిపారు స్వామివారు.

సూర్యోదయం అయిన తరువాత పరమాచార్య స్వామివారు దేవాలయం నుండి బయటకు వచ్చారు దర్శనం ఇవ్వడానికి. చుట్టుపక్కల నుండి వచ్చిన ఒక యాభై అరవై మంది స్వామివారిని చూడగానే దూరం నుండి సాష్టాంగం చేసి నిలుచున్నారు.


మాకు అందరికి ఆశ్చర్యం. ఆ గ్రామ ప్రజలు రాత్రే వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయమే స్వామివారు యాత్ర కొనసాగిస్తే, వారికి దర్శనం దొరకదని రాత్రే వచ్చి దర్శించుకున్నారు. మరి వీరు రాత్రే వచ్చి ఎందుకు దర్శించుకోలేదు?


మేము వారి వద్దకు వెళ్లి, “దగ్గరకు వచ్చి దర్శించుకోండి” అని పిలిచాము. అందుకు వారు అంగీకరించలేదు. “మేము దేవాలయం దగ్గరకు రాకూడదు. మేము సామి కోసం రాత్రి నుండి వేచి కాచుకున్నాము. ఇప్పుడే సామి బయటకు వచ్చారు” అని చెప్పారు.


మేము స్వామివారికి విషయం చెప్పడానికి వెళ్ళాము. “రాత్రి దర్శించుకున్న వాళ్ళు సమర్పించిన మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. వాటిని ఒక సంచిలో వేసుకుని వీరికి ఇవ్వండి. రాత్రి నుండి ఏమీ తినలేదు కదా తిననివ్వండి” అన్నారు స్వామివారు.


మేము పళ్ళు ఇవ్వగానే, సంతోషంతో వాటిని స్వీకరించి తిన్నారు. “రాత్రి మీరు ఏమీ తినలేదా?” అని అడిగాము. “లేదు. మేము సామిని చూడడానికి వచ్చాము. సామి లోపల ఉన్నారు. తప్పక బయటకు వస్తారు కదా అని మేము ఇక్కడే ఉండిపోయాము”


వారు ఉపవాసం ఉన్నారని స్వామివారికి ఎలా తెలుసు? అదే బ్రహ్మ గ్రంథి.


--- ఇందువాసన్, వలాజపెట్టై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

హిందూ ఋషులు జాబితా

 🍁*హిందూ ఋషులు జాబితా*🍁

🦜🦚🐿️

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

🦜🦚🐿️

*అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ -* *అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ -* *త - థ - ద - ధ - న - ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ* *- శ - ష - స - హ - ళ - క్ష*

🦩🐓🦤

*దేవర్షి*    దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.

🐘🫏🦒

*బ్రహ్మర్షి*  ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.

🐢🐟🦚

*మహర్షి*  సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.

🦤🦚🦜

*రాజర్షి*   రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

🦙🐘🦓

*అ*

అగ్ని మహర్షి

అగస్త్య మహర్షి

అంగీరస మహర్షి

అంగిరో మహర్షి

అత్రి మహర్షి

అర్వరీవత మహర్షి

అభినామన మహర్షి

అగ్నివేశ మహర్షి

అరుణి మహర్షి

అష్టావక్ర మహర్షి

అష్టిక మహర్షి

అథర్వణ మహర్షి

ఆత్రేయ మహర్షి

అథర్వాకృతి‎

అమహీయుడు

అజామిళ్హుడు‎

అప్రతిరథుడు‎

అయాస్యుడు‎

అవస్యుడు

అంబరీషుడు

🦋🐪🐎

*ఇ*

ఇరింబిఠి‎

🐒🦆🦉

*ఉ*

ఉపమన్యు మహర్షి

ఉత్తమ మహర్షి

ఉన్మోచన

ఉపరిబభ్రవుడు

ఉద్దాలకుడు‎

ఉశనసుడు

ఉత్కీలుడు

🐥🦉🐴

*ఊ*

ఊర్ఝ మహర్షి

ఊర్ద్వబాహు మహర్షి

🦖🐡🦛

*ఋ*

ఋచీక మహర్షి

ఋషభ మహర్షి

ఋష్యశృంగ మహర్షి

ఋషి

🐢🦓🐋

*ఔ*

ఔపమన్యవ మహర్షి

ఔరవ మహర్షి

🐏🐖🐃

*క*

కపిల మహర్షి

కశ్యప మహర్షి

క్రతు మహర్షి

కౌకుండి మహర్షి

కురుండి మహర్షి

కావ్య మహర్షి

కాంభోజ మహర్షి

కంబ స్వాయంభువ మహర్షి

కాండ్వ మహర్షి

కణ్వ మహర్షి

కాణ్వ మహర్షి

కిందమ మహర్షి

కుత్స మహర్షి

కౌరుపథి‎

కౌశికుడు‎

కురువు

కాణుడు‎

కలి

కాంకాయనుడు

కపింజలుడు‎

కుసీదుడు

🦖🐌🐬

*గ*

గౌతమ మహర్షి

గర్గ మహర్షి

గృత్సమద మహర్షి

గృత్సదుడు‎

గోపథుడు‎

గోతముడు

గౌరీవీతి

గోపవనుడు

గయుడు

🐥🐦🐣

*చ*

చ్యవన మహర్షి

చైత్ర మహర్షి

చాతనుడు‎

🐖🦣🦒

*జ*

జమదగ్ని మహర్షి

జైమిని మహర్షి

జ్యోతిర్ధామ మహర్షి

జాహ్న మహర్షి

జగద్బీజ

జాటికాయనుడు‎

🐩🐕🦮

*త*

తండి మహర్షి

తిత్తిరి మహర్షి

త్రితుడు

తృణపాణి

🐡🦀🐠

*ద*

దధీచి మహర్షి

దుర్వాస మహర్షి

దేవల మహర్షి

దత్తోలి మహర్షి

దాలయ మహర్షి

దీర్ఘతమ మహర్షి

ద్రవిణోదస్సు‎

🦮🦙🐕‍🦺

*న*

నచికేత మహర్షి

నారద మహర్షి

నిశ్ఛర మహర్షి

సుమేధా మహర్షి

నోధా

నృమేధుడు

🐆🦓🐟

*ప*

పరశురాముడు

పరాశర మహర్షి

పరిజన్య మహర్షి

పులస్త్య మహర్షి

ప్రాచేతస మహర్షి

పులహ మహర్షి

ప్రాణ మహర్షి

ప్రవహిత మహర్షి

పృథు మహర్షి

పివర మహర్షి

పిప్పలాద మహర్షి

ప్రత్య్సంగిరసుడు

పతివేదనుడు

ప్రమోచన‎

ప్రశోచనుడు‎

ప్రియమేథుడు

పార్వతుడు

పురుహన్మ‎

ప్రస్కణ్వుడు

ప్రాగాథుడు

ప్రాచీనబర్హి

ప్రయోగుడు

పూరుడు

పాయు

🦄🦋🐴

*బ*

భరద్వాజ మహర్షి

భృగు మహర్షి

భృంగి మహర్షి

బ్రహ్మర్షి మహర్షి

బభ్రుపింగళుడు

భార్గవవైదర్భి‎

భాగలి

భృగ్వంగిరాబ్రహ్మ

బ్రహ్మస్కందుడు‎

భగుడు‎

బ్రహ్మర్షి

బృహత్కీర్తి‎

బృహజ్జ్యోతి‎

భర్గుడు

🐅🦛🦭

*మ*

మరీచి మహర్షి

మార్కండేయ మహర్షి

మిత మహర్షి

మృకండు మహర్షి

మహాముని మహర్షి

మధు మహర్షి

మాండవ్య మహర్షి

మాయు

మృగారుడు‎

మాతృనామ‎

మయోభువు‎

మేధాతిథి

మధుచ్ఛందుడు

మనువు

మారీచుడు

మైత్రేయ

🐬🐘🦤

*య*

యాజ్ఞవల్క మహర్షి

యయాతి‎

🐖🐑🐎

*ర*

రురు మహర్షి

రాజర్షి మహర్షి

రేభుడు

🐄🐂🐘

*వ*

వశిష్ట మహర్షి

వాలఖిల్యులు

వాల్మీకి మహర్షి

విశ్వామిత్ర మహర్షి

వ్యాస మహర్షి

విభాండక ఋషి

వాదుల మహర్షి

వాణక మహర్షి

వేదశ్రీ మహర్షి

వేదబాహు మహర్షి

విరాజా మహర్షి

వైశేషిక మహర్షి

వైశంపాయన మహర్షి

వర్తంతు మహర్షి

వృషాకపి

విరూపుడు‎

వత్సుడు‎

వేనుడు

వామదేవుడు‎

వత్సప్రి

విందుడు

🦆🦋🐒

*శ*

శంఖ మహర్షి

శంకృతి మహర్షి

శతానంద మహర్షి

శుక మహర్షి

శుక్ర మహర్షి

శృంగి ఋషి

శశికర్ణుడు

శంభు‎

శౌనకుడు

శంయువు‎

శ్రుతకక్షుడు

🐟🐄🐪

*స*

సమ్మిత మహర్షి

సనత్కుమారులు

సప్తర్షులు

స్థంభ మహర్షి

సుధామ మహర్షి

సహిష్ణు మహర్షి

సాంఖ్య మహర్షి

సాందీపణి మహర్షి

సావిత్రీసూర్య

సుశబ్దుడు‎

సుతకక్షుడు‎

సుకక్షుడు‎

సౌభరి

సుకీర్తి‎

సవితామహర్షి సామావేదానికి మూలము.

సింధుద్వీపుడు

శునఃశేపుడు

సుదీతి

🐆🪼🐳

*హ*

హవిష్మంత మహర్షి

హిరణ్యరోమ మహర్షి.                          

🦁🐟🦓

       

                  *శుభమస్తు*

   

పిల్లాడి రుద్రయ్య