20, సెప్టెంబర్ 2022, మంగళవారం

విమేచనమా

 *‼️విలీనమా? విమేచనమా? విద్రోహమా?‼️⁉️*


*సెప్టెంబర్‌ 17, 1948.. ‌హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలో కలిసిన రోజు. ఆగస్ట్ 15, 1947‌న బ్రిటిష్‌ ‌పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్‌ ‌సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్‌ ‌వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్‌ ‌నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. ‌తమది స్వతంత్ర రాజ్యమని, హైదరాబాద్‌ అటు భారత్‌లో, ఇటు పాకిస్తాన్‌లోనూ కలవదని ప్రకటించాడు. అప్పటికే నిజాం రాజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేర్గాంచాడు. ఆనాడే 236 బిలియన్ల సంపద కలిగి ఉన్నాడు. ఐదు టన్నుల బంగారమూ ఆయన వద్ద ఉంది. హైదరాబాద్‌ ‌సంస్థానం స్వతంత్రంగా ఉండటానికి నిర్ణయించుకున్నట్లు ఆయన 1947లో ఫర్మానా కూడా జారీ చేశాడు.*


*కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారత దేశంలో కలవాలని కోరుకున్నారు. ఎందుకంటే దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోని విధంగా రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు తీవ్ర భయానక వాతావరణం సృష్టించారు. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యా కాండను కొనసాగించారు. వారి చేతిలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నిజాం నిరంకుశ పాలన గురించి, రజాకర్ల అకృత్యాల గురించి, వాటిని ఎదుర్కోవడానికి జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటితరం కచ్చితంగా తెలుసుకోవాలి. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో వీరుల ప్రాణత్యాగాల ఫలితమే.*

*హైదరాబాద్‌తో పాటు మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్‌లో చేరకపోతే అది దేశ మనుగడకే ముప్పు అని భావించిన నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌హైదరాబాద్‌ ‌సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నిర్ణయించారు. పరిస్థితిని ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్‌ ‌సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.*

*నిజాం నవాబుతో చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకుందామని భారత తొలి ప్రధాని నెహ్రూ అనుకున్నారు. కానీ సైనికచర్య ద్వారా వెంటనే నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకొని భారత్‌లో విలీనం చేసి రజాకార్లని అరికట్టడం అత్యవసరం అని నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌పటేల్‌ ‌పట్టుపట్టి నెహ్రూని ఒప్పించారు. భారత ప్రభుత్వం తమపైకి యుద్ధానికి సిద్ధం అవుతోందని తెలిసిన నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏ ‌మాత్రం వెనక్కి తగ్గకుండా అందుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించడంతో భారత్‌-‌నిజాం సేనల మధ్య యుద్ధం అనివార్యమైంది.*


*‘ఆపరేషన్‌ ‌పోలో’ విజయవంతం*


*సెప్టెంబర్‌ 13, 1948‌న భారత సైన్యం ‘ఆపరేషన్‌ ‌పోలో’ పేరిట హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి ‘పోలీస్‌ ‌యాక్షన్‌’ అనే పేరు కూడా ఉంది. ఈ సైనిక చర్య కేవలం ఐదు రోజుల్లోనే ముగిసిపోయింది. భారతసేనల ధాటికి తట్టుకోలేక నిజాం నవాబు లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.*

*హైదరాబాద్‌ ‌నలువైపుల నుంచి భారత సైన్యం ముట్టడిని ప్రారంభించింది. ముందుగా మహారాష్ట్ర వైపు నుంచి అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి నల్‌దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించారు. సెప్టెంబర్‌ 14‌న ఔరంగా బాద్‌, ‌జాల్నా, నిర్మల్‌, ‌వరంగల్‌, ‌సూర్యాపేటను అధీనంలోకి తీసుకోని హైదరాబాద్‌ ‌వైపు వచ్చారు.*

*తుల్జాపూర్‌, ‌తల్ముమడి నుంచి బయల్దేరిన సైన్యానికి జనరల్‌ ‌డీఎస్‌ ‌బ్రార్‌ ‌నాయకత్వం వహించారు. మద్రాస్‌ ‌వైపు నుంచి వచ్చిన సైన్యానికి ఎ.ఎ. రుద్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్‌ ‌శివదత్త నాయకత్వం వహించారు. హైదరాబాద్‌కు నలుదిశల నుంచి భారత సైన్యం ఒక్కో గ్రామాన్ని అధీనంలోకి తీసుకుంటుంటే.. ఆయా గ్రామాల్లోని ప్రజలు సైన్యానికి స్వాగతాలు పలికారు. భారత సైన్యం ముందు రజాకార్లు, నిజాం సైన్యం ఎదురు నిలవలేకపోయింది. మూడు రోజుల్లోనే దక్కన్‌ ‌భాగాన్ని పూర్తిగా భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.*

*16వ తేదీ మధ్యాహ్నానానికి భారత సైన్యం హైదరాబాద్‌ ‌పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైనిక సంపత్తికి భయపడి నిజాం సైన్యం ప్రధానాధికారి ఇద్రూస్‌ ‌లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17‌న సాయంత్రం సుమారు 5 గంటల సమయాని కల్లా భారత ఆర్మీ హైదరాబాద్‌ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. కాసేపటికి ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు రేడియో ద్వారా ప్రకటించాడు. అలా ఆపరేషన్‌ ‌పోలో పూర్తైంది. దీంతో రెండు శతాబ్దాల అసఫ్‌జాహీల పాలన అంతమైంది. నాడు హైదరాబాద్‌ ‌స్టేట్‌కు ప్రధానిగా ఉన్న లాయక్‌ అలీ తప్పించుకుని పాకిస్తాన్‌ ‌పారిపోయాడు. రజాకార్ల నాయకుడైన కాసీం రజ్వీ జైలు పాలయ్యాడు. నిజాం సంస్థానంలో ఉన్న ఔరంగాబాద్‌, ‌నాందేడ్‌, ‌పర్బనీ, బీడ్‌ ‌మహారాష్ట్రలో; గుల్బర్గా, బీదర్‌, ఉస్మానాబాద్‌, ‌రాయచూర్‌ ‌కర్నాటకలో విలీనం అయ్యాయి. అందుకే సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విముక్త దినోత్సవంగా పాటిస్తున్నాం.*


*అనంతర పరిణామాలు*


*నిజాం లొంగుబాటు అనంతరం చాలా పరిణామాలు* *చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌ ‌స్టేట్‌లో పరిపాలన బాధ్యతలను నాటి మేజర్‌ ‌జనరల్‌ ‌జేఎన్‌ ‌చౌదురీకి అప్పగించారు. సైనిక పాలకుడిగా సెప్టెంబర్‌ 19, 1948‌న ఆయన బాధ్యతలు చేపట్టారు.* కేంద్రంలో *రాష్ట్ర వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా ఉన్న ఎంకే వెల్లోడిని భారత ప్రభుత్వం డిసెంబర్‌ 1, 1949‌న హైదరాబాద్‌ ‌తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించింది. సైనిక పాలన అంతమై తాత్కాలిక ప్రజా ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు, వీవీ రాజు, విద్యాలంకర్‌లు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. జనవరి 26, 1950న హైదరాబాద్‌ ‌స్టేట్‌లో భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ ఉత్సవం నిర్వహించారు.* *భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందని నిజాం చవివి వినిపించారు. అదేరోజున ఆయనను రాజ్‌‌ప్రముఖ్‌గా భారత ప్రభుత్వం నియమించింది. 1952లో హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌శాసనసభకు మొదటిసారి ఎన్నికలు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1956 వరకు కొనసాగారు.*

*రాష్ట్రాల పునర్‌ ‌వ్యవస్థీకరణతో భాషా ప్రాతిపదికన నవంబర్‌ 1, 1956‌న ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్‌ ‌స్టేట్‌లోని మరాఠా ప్రాంతాలైన 5 జిల్లాలను మహారాష్ట్ర, కన్నడ మాట్లాడే మూడు జిల్లాలను కర్ణాటకలో కలిపారు. తెలంగాణలోని 8 జిల్లాలు, మద్రాస్‌ ‌నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని జిల్లాలను కలిపి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఆరు దశాబ్దాలపాటు అలుపెరగని పోరాటంతో 2014 జూన్‌ 2‌న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.*


*విలీనమా? విమోచనమా?*


*ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఆ ఊసే మరిచారు. దీనికి కారణం ఆ పార్టీకి, అసదుద్దీన్‌ ‌నేతృత్వంలోని ఎంఐఎంతో ఉన్న దోస్తీనే కారణమని అందరికి తెలిసిందే. మరికొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సంతుష్టీకరణ కోసం ఈ రోజును విమోచనం దినంగా కాకుండా విలీన దినంగా జరుపుకోవాలని చెబుతున్నాయి. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించిన సెప్టెంబర్‌ 17‌ను భారతీయ జనతా పార్టీ ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తోంది.*


*వివాదం ఎక్కడ మొదలైంది?*


*భారత యూనియన్‌లో చేరేది లేదని నవాబు 1947లో ఫర్మానా విడుదల చేయటంతో హైదరా బాద్‌ ‌స్టేట్‌ ‌భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌దేంట్లోనూ చేరబోదని ఆగస్ట్ 8‌న నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్‌ ‌జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటన్‌ ‌చాలా చెప్పి చూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. బ్రిటిష్‌ అధికారుల నేతృ త్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని కూడా బాటన్‌ ‌ప్రతిపాదించారు. నవాబు ససేమిరా అన్నారు. సంస్థానాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఆనాటి కాంగ్రెస్‌ ‌విధానంలో ఒక భాగం. సంస్థానాల్లో భిన్న మతాలకు చెందిన ప్రజలున్న చోట దీన్ని ఇంకా బలంగా నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో కూడా ప్రజాభి ప్రాయ సేకరణకు అందుకే అంగీకరించారు. హైదరా బాద్‌లో ప్రతిపాదన కూడా అందులో భాగమే. సర్దార్‌ ‌పటేల్‌ ‌వీటన్నిటికీ అంగీకరించారు. ఏ సంస్థానానికి ఇవ్వని కొన్ని కీలక మినహాయింపులు హైదరాబాద్‌కు ఇచ్చారు. నైజాం-భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకో ఉదాహరణ. విలీనానికి అంగీకరిస్తే బెరార్‌ ‌ప్రాంతాన్ని హైదరాబాద్‌ ‌సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి నిజాం యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్‌ ‌కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకార్ల దారుణాలతో పరిస్థితి విషమించింది. 1948 సెప్టెంబర్‌ 9‌న సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల పాటు నిజాం సైన్యాల నుంచి ప్రతిఘటన ఉంటుందని భావించారు. కానీ మూడో రోజుకే నిజాం సైన్యం తోకముడిచింది. ఈ సైనిక చర్యలో మేనన్‌ అం‌చనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. వీపీ మేనన్‌ ‌హైదరాబాద్‌ ‌వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు.*

*నిజాంకు ముస్లింలలో ఉన్న పలుకుబడిని, ఒక సంస్థానంగా హైదరాబాద్‌కున్న ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధిపతిగా నవాబుని కొనసాగిస్తే బాగుంటుదని పటేల్‌కు మేనన్‌ ‌సూచించారు. నెహ్రూను సంప్రదించిన తర్వాతే ఏ సంగతి చెబుతానని పటేల్‌ అన్నారు. ఆ మరుసటి రోజే నెహ్రూ అంగీకారం తెలిపినట్లు పటేల్‌ ‌మేనన్‌కి చెప్పారు. కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నిజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్‌ ‌ద్వయం వ్యవహరించలేదు.*


*జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాల ప్రత్యేకత*


*సెప్టెంబర్‌ 17, 1948‌న నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీనితో భారత్‌ ‌నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్ముకశ్మీర్‌, ‌నిజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర. ఆ రెండింటికి సరితూగే సంస్థానాలు ఆనాడు లేవు. 550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో ఆ రెండే భారత నాయకత్వ పటిమను పరీక్షించాయి. ఆగస్ట్ 15, 1947 ‌నాటికి భారత యూనియన్‌లో చేరకుండా విపరీత తాత్సారం చేసి తీవ్ర ఉత్కంఠను, ఉద్రిక్తతను సృష్టించినవి ఈ రెండే. పాకిస్తాన్‌ అనుకూల శక్తులు ఒక వైపు నుంచి జమ్ముకశ్మీర్‌ను ముట్టడిస్తూ రావటం వల్ల ఆ సంస్థానం మహారాజా హరిసింగ్‌ అక్టోబర్‌ 27, 1947‌న భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్‌ ‌మహారాజు లాగానే నిజాం కూడా చివరి వరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు.*

సరస్సును అడ్డంగా ఆక్రమించుకుని

 అరణ్యవాసం 14 ఏళ్లు ముగిసింది. ఇన్నేళ్ల పాటు అలుపు లేకుండా అరిచిన ఆ గొంతుకలకు ఇప్పుడు ఓ అధికారి తోడయ్యాడు. అందమైన సరస్సును అడ్డంగా ఆక్రమించుకుని ధన బలంతో మమ్మల్ని ఎవ్వడేం చేయగలరని ఎగిరిన ఆ శక్తుల మెడలు వంచాడు ఆ ఆఫీసరు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల ఆస్తి...కళ్లు చెదిరిపోయే రీతిలో కట్టిన 54 విలాసవంతమైన విల్లాలు...అన్నీ అక్రమంగా సరస్సును చెరచి కట్టుకున్నవే. జేసీబీ ఇనుప హస్తాలతో ఒక్కో దెబ్బ వేస్తుంటే ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయి ఇప్పుడు. 


కేరళలోని అలెప్పీ జిల్లాలో ప్రవహిస్తున్న వెంబనాడ్ సరస్సు... #Kapico రిసార్టు పేరు తెలియని వాళ్లుండరు. అంత విలాసవంతమైన రిసార్టు అది. సామాన్యులకు అసలు నో ఎంట్రీ. ఒక్క రాత్రి అక్కడ గడపాలంటే 55 వేల రూపాయలు. ముత్తూట్ నుంచి కువైట్ దాకా పాకిన ప్రబల శక్తుల సొత్తు. సామాన్యుడు కన్నెత్తి చూసే తాహత కూడా లేని సామ్రాజ్యం. పద్నాలుగేళ్ల క్రితం ఈ సరస్సుపై పడింది వాళ్ల కన్ను. మూడెకరాల దీవిలో కట్టుకుంటామన్నారు. ఎలాగోలా అనుమతులు తెచ్చుకున్నారు. అడిగే వాడెవ్వడని దాన్ని పదెకరాలకు పొదుముకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన అమాయక మత్య్సకారులను తొక్కి పడేశారు. కానీ ఓ ఐదుగురు కుర్రాళ్లు మాత్రం తగ్గలేదు. కోర్టుల చుట్టూ తిరిగారు. వాళ్లకి మరింత మంది ప్రకృతి ప్రేమికులు తోడై న్యాయం స్థానం అనుమతులు తెచ్చుకున్నారు. 

  

సమస్యంతా ఇక్కడే వాటిని అమలు చేసే అధికారి ఎవ్వడు. ప్రతీ సారి ఏదో కుంటిసాకు. మధ్యలో రెండేళ్లు కొవిడ్. కానీ ఈ సారి వచ్చిన ఆఫీసరు మామూలోడు కాదు. 2018 వరదలు వచ్చినప్పుడు అదే అలెప్పీలో అణువణువూ తిరిగినోడు. ఎవడు ఎలాంటోడో చూపులతో లెక్కగట్టే టైపు. అసలు చేతిలో సుప్రీం కోర్టు ఆర్డర్సు ఉంటే ఇంకెవ్వడికి భయపడాలి. తగ్గేదేలే. వారం రోజుల క్రితం ఆ రిసార్టు భూమినంతా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించేశాడు. బెదిరింపులు. పై స్థాయి నుంచి. జిల్లాకు ఎంతో మంది ఆఫీసర్లు వచ్చెళ్లారు. ఎవ్వడికీ పట్టనది నీకెందుకు తంబీ అన్నట్లు. పైగా ఈ రాష్ట్రం కూడా కాదు అని. నవ్వి ఊరుకున్నాడు ఆ ఆఫీసరు. ప్రాంతం పేరో, పలుకుబడి తోనో భయపెట్టటానికి అతనేం చిన్న ఆఫీసరు కాదుగా. ఎస్ స్వయానా ఆ జిల్లా కలెక్టర్. IAS అధికారి, మన తెలుగు తేజం #కృష్ణతేజ_మైలవరపు (Krishna Teja Mylavarapu). వరదల్లో తమతోనే ఉండి నాలుగేళ్ల క్రితం దేశమంతా అలెప్పీ వైపు చూసేలా నాటి సబ్ కలెక్టరే ఇప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్. తీరప్రాంతాన్ని అడ్డంగా దోచుకుని కోట్లకు కోట్లు దోచుకుంటున్న ఆ శక్తుల ఆటలు ఇక సాగలేదు. ఆ విల్లాలన్నీ ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. అంతే కాదు ఒక్క పైసా కూడా ప్రజల ఖర్చు లేదు. మొత్తం ఆ ఓనర్లతోనే పెట్టిస్తున్నాడు. కూల్చే బిల్డింగ్ నుంచి ఇసుక రేణువు వెళ్లి సరస్సులో పడినా ఇత్తడై పోద్దనే మాస్ వార్నింగ్ కూడా ఇచ్చేయటంతో బిక్కచచ్చిపోయిన ఆ అక్రమార్కులు అంతా పాహిమాం అంటూ కట్టుకున్న అక్రమ కట్టడాల నుంచి కూలిన బండ రాళ్లు మోసుకుంటున్నారు.  ప్రకృతి పరవశించింది. ఈ రోజో రేపో అక్కడ వర్షం పడేలా ఉంది. ఆ మన్నూ మశానం సరస్సులోకి ఎగరకుండా.


Thank You Krishna Teja IAS sir 🙏

Krishna Teja IAS 


ఏం చెప్పగలం ఇంతకన్నా.

తెలంగాణాకు స్వాతంత్ర్యం

 🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪


*90 శాతం మందికి తెలుగు వాళ్లకు తెలియని విషయం-1*

*తెలంగాణాకు స్వాతంత్ర్యం* *15-ఆగస్టు-1947న రాలేదు.*

*17-సెప్టెంబర్-1948న వచ్చింది.*

*అదీనూ యుద్ధం ద్వారా.*


*👉: 90 శాతం మంది తెలుగు వాళ్లకు తెలియని విషయం-2*

*తెలంగాణా ఏనాడూ బ్రిటిష్ పాలనలో లేదు.. 1948లో స్వాతంత్ర్యం వచ్చింది ఇస్లామిక్ పాలన నుంచి.*


*👉:90 శాతం తెలుగు వాళ్లకు తెలియని విషయం-3*

*తెలంగాణాను ఇస్లామిక్(నిజామ్) పాలన నుంచి విముక్తం చేయడానికి వచ్చిన భారత సైన్యంపై పోరాడింది -  MIM పార్టీ, నిజామ్, రజాకార్లు.*


*🙋‍♂️ 1927లో నవాబు సధార్ యార్ జంగ్... మజిల్స్ -ఇత్తె హాదుల &- ముస్లిమీన్ ( MIM ) స్థాపించబడినది . తొలిదశలో ఈ సంస్థ సంస్కృతిక రంగానికి , "ముస్లింల వికాసానికి" ప్రయత్నo  చేసింది .*


*తరువాత కాలంలో దీనికి "బహదూర్ ఆలీ జంగ్" అధ్యక్షుడయ్యాడు. ఇతనే ఇక్కడ మొట్ట మొదటిసారిగా "రజాకార్" అనే పదం ఉపయోగించాడు . రజాకార్ అంటే "స్వచ్చంధసేవకుడు" వీళ్ళు నిజాం కార్యక్రమాలకు స్వచ్చంధంగా సహకరించడానికి పనిచేయడానికి పూనుకున్నవారుగా గుర్తింప బడ్డారు .*


*తర్వాతి కాలంలో ఈ సంస్థకు  "ఖాసీం రజ్వీ" అధ్యక్షత వహించాడు .*

*ఇతడు పెద్ద మతోన్మాది, అంతకు ముందున్న బహదూర్ ఆలీ జంగ్ ... "అనీ మాలిక్" అనే నినాదం ఇచ్చాడు,అంటే ప్రతీ ముస్లిం పరిపాలకుడే అని అర్ధం.*

*ఖాసీం రజ్వీ .... రజాకార్లను సైనిక శక్తిగా మార్చాడు, ఇతని స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ . రజాకార్లలో మొత్తం 50,000 మంది సైనికులు ఉండేవారు,  విసూనూరి దేశముఖ్, రామచంద్రా రెడ్డి దీనికి డిప్యూటీ కమాండర్లుగా పనిచేశారు .*


*ఖాసీం రజ్వీ .... ఆస్ట్రేలియా లోని సిడ్నీ కాటన్ వద్ద  ఆయుధాలను కొనొగోలు చేశాడు*


*రజాకార్ల దౌర్జన్యాలను భరించలేక హైదరాబాద్  కింగ్ కోఠి లోని మెయిన్ రోడ్డుపై 1947 డిసెంబర్ 4 న నిజాం నవాబుపై బాంబులదాడి జరిగింది. ఈ దాడిలో నారాయణ పవార్,  జగదీశ్వర్ ఆర్యా , గండయ్య లు పాల్గొన్నారు !*

*రాజాకార్లు నిజాం ప్రధానమంత్రి నవాబ్ చెత్తారిపై "శ్యామంజిల్" లో దాడి చేశారు. దీనిపై నిజాం స్పందించలేదు . 9 ఆగస్టు 1948 వరంగల్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ ని హత్య చేశారు*


*ఆగస్టు 22, 1948 లో కాచిగూడలో ఒక ప్రముఖ పత్రికా విలేఖరి అయిన "షోయాబుల్లా ఖాన్" అనే వ్యక్తిని రజాకార్లకు వ్యతిరేకముగా రాసినందుకు నిర్ధ్యక్షిణంగా హాత్య చేశారు .*


*వీరి అకృత్యాల ఫలితముగానే తెలంగాణా ఉద్యమకారులు తిరుగుబాటు జండా ఎగురవేశారు సాయుధ పోరాటానికి నాంది పలికారు, వీళ్ళను అణగద్రొక్కడానికి రజాకార్లను ఉపయోగించి దారుణ మారణఖాండకు తెర తీశారు. అనేకమంది అమాయకపు హిందువులను, చిన్నా పెద్దా అనీ తారతమ్యం లేకుండా కనబడ్డవారిని కనపడ్డట్టుగా చిత్రవధలతో "కాల్చి" చంపుతూ శవాల గుట్టలు  పేర్చారు .*


*అనేక హిందూమతాల దేవాలయాలు ధ్వంసం చేశారు , ఆస్తుల భూములు , లాగేసుకున్నారు .ప్రజలను భయబ్రాంతులను  చేస్తూ, బలవంతపు  మతమార్పిడులు  కూడా చేశారు*


*రజాకార్ల మూలంగా భైరాంపల్లి , పరకాల , పేరుమడ్ల , సంకీర్త , ధర్మారం , ఊయలవాడ ,భువనగిరి ,సూర్యాపేట  మొదలగు గ్రామాలపై దాడులు జరిపి వేలాది మంది హిందువులను నిర్ధ్యాక్షిణముగా చంపేశారు  !...*

*ఆడవారిని పసిపిల్లలను గర్భవతులను మొగుడు చూస్తుండగా కత్తులతో కడుపులు కోసి పసిపిల్లలను బయటికి లాగారు .*

 

*హిందూ ఆడవారి ఒంటిపైన ఉన్న వస్త్రాలను విప్పించి నడి రోడ్డుపై  బతుకమ్మ ఆటలు  ఆడించారు !*

*ఆడవారి రొమ్ములను తూకం వేసి బరువును లెక్కగట్టి పన్నులు వసూలు చేశారు .*


*వీరి దౌర్జన్యాలా ఫలితంగానే భారత ప్రభుత్వం  సైనికచర్య Operation Polo కు దిగింది !..* *ఈ సైనిక చర్యతో రజాకార్ల కు చరమగీతం పలకడం జరిగింది .*


*ఉక్కుమనిషి సర్ధార్ పటేల్ జోక్యంతో నిజాం సంస్థానం భారత ప్రభుత్వంలో కలిపారు ...*

*ఒకవేళ ఈ నైజాం సంస్థానమే కేరళలో మాదిరిగా ఉండినట్టయితే ఈ పాటికి మొత్తం రాష్ట్రం మతమార్పిడులు దాడులు జరిగి హిందువు అనేవాడే లేకుండా మొత్తం ముస్లింలతో నిండిపోయి ఉండేది .*


*ఖాసీం రజ్వీ అరెస్టు కాబడ్డాడు, సైనికచర్యతో ఆపరేషన్ పోలో కు దారితీసింది .*


*■ నిజాం అంత మంచోడే అయితే తెలంగాణ లో అంత నిరక్షరాస్యత ఎందుకో..?*

 *మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష కాకుండా పిడికెడు మంది మాట్లాడే ఉర్దూ ఎందుకు అధికార భాష అయింది.*


*◆ ఉర్దూని బలవంతంగా రుద్ది స్వచ్ఛమైన తెలుగును బ్రష్టుపట్టించింది నిజాం కాదా..?? సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేయలేదా??*


*◆బలవంతపు మత మార్పిడీలు చేయలేదా??*

*ఇప్పుడున్న ముస్లిమ్స్ లో 90% మంది మన పూర్వీకులు హిందువులు కాదా??*


*◆ 60 యేండ్లు దోసుకుంటే ఆంధ్రోడు దోసుకున్నాడు అంటిమి, 350 యేండ్లు దోసుకున్నోన్ని మాత్రం దేవుడు అనవడితిరి.*


*◆బేగంపేట విమానాశ్రయం ప్రజల కోసమా??*

*గండిపేట చెరువుల నీళ్లు సామన్యులకోసమ? లేక  పాలకులను దృష్టిలో పెట్టుకొని తవ్విందా??*.                                         

                                                           *◆ నిజాంసాగర్ ప్రాజెక్టు దేనికి కట్టిండు,*


*◆ 350 సంవత్సరాల పాటు సంస్కృతిని నాశనం జేసీ, సామాన్యులను సత్తెనాస్ జేసినోన్ని ఇయ్యాల వచ్చిన దొరల పాలన  దేవుడిని చెయ్యవడితిరి.*


*రజాకార్లు.... ధన,మాన,ప్రాణాలు తీస్తూ అడ్డొస్తే అంతమొందిస్తూ ఎదురు తిరిగితే గుంజకు కట్టేస్తూ రాక్షస ఆనందం పొందేవారు*


*దొరల భూస్వాముల పెత్తందారీ ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణమే రజాకార్లు*


*అడ్డగోలు పన్నులేస్తూ అట్టడుగు వర్గాలను బానిసలుగా మార్చుకుంటూ ఆధిపత్యం చేలాయిస్తుంటే తిరుగుబాటు పుట్టింది.*


*రజాకార్ల అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు* 


*2022 సెప్టెంబర్ 17 "తెలంగాణా విమోచనాదినం, రండి... నైజాం నుండి మనం విముక్తమై 74 సంవత్సరాలు పూర్తి అయి 75 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇవి మనకు స్వాతంత్ర అమృతొత్సవాలు కాబట్టి రేపు రాబోయే సెప్టెంబర్ 17 వ తేదీ శనివారం నాడు అన్ని మండల కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేసి నైజాం విముక్తి స్వాతంత్ర అమృతోత్సవాలను ప్రారంభం చేద్దాం. తెలంగాణ ప్రజలమైన మనం అందరం ఈ తెలంగాణా స్వాతంత్ర అమృతోత్సవాల్లో సగర్వంగా పాల్గొని మన జాతి గౌరవాన్ని నలుదిశలా చాటుదాం."*

🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪.   *🙏భారతమాత కీ జయ్🙏*

 https://www.srisukabrahmashram.org/2019/01/80-pdf.html

పది సార్లు ఆలోచించండి.*

 **హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.



Sp బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.


అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త. 


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

👍👍🤝🤝

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి  షేర్ చేద్దాం మిత్రులారా      భవదీయ.                మీ               మన్నె. సత్యనారాయణ,.     for Vasudha Green,.      Mera Spandana,.        9133498366,.             7416446789       🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సంకల్పం

 సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందేహం గురుపరంపరం

 భక్తులందరికి విజ్ఞప్తి వచ్చే సోమవారం అనగా 26వ తారీకు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా వచ్చే నెల రెండవ తారీకు సప్తమి తిధి మూలా నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా ఆరోజు గత రెండు సంవత్సరాలగానే ఈ సంవత్సరం కూడా చండీ హోమం నిర్వహించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంకల్పం చేయడం జరిగినది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి ఈ సంవత్సరం అమ్మవారి స్వరూపమైన స్త్రీల చేత లక్ష కుంకుమార్చన కూడా జరిపించాలనే ఆలోచన ఆ జగన్మాత కల్పించింది కావున భక్త వరేంణ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా గత సంవత్సరం కన్నా కొంచెం ఎక్కువ అనగా 40,000 వరకు ఖర్చు వస్తుంది అందువల్ల దయచేసి ఇంటికోపువ్వు దేవునికి మాల అన్న రీతిగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి కార్యక్రమానంతరం అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా చేయసంకల్పించాము సర్వం జగన్మాతార్పణమస్తు

9032547475 ఈ నెంబర్ కి ఫోన్ పే గాని గూగుల్ పే గాని పేటియం గాని మూడు కూడా ఈ నెంబర్లోనే ఉన్నాయి

బతుకమ్మ

 శుభకృత్ నామ సంవత్సరం బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల వివరాలు


సేకరణ మరియు సమర్పణ : 

*గోగులపాటి కృష్ణమోహన్*


*25-09-2022 ఆదివారం*

భాద్రపదమాసం అమావాస్య మొదటిరోజు

ఎంగిలి పూల బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. 


నైవేద్యంగా నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.



*26-09-2022 సోమవారం*

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రెండవ రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. 


నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.



*27-09-2022 మంగళవారం,*

ఆశ్వీయుజ శుద్ధ విదియ మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ జరుపుకుంటారు.


నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.



*28-09-2022 బుధవారం*

 ఆశ్వీయుజ శుద్ధ తదియ, నాల్గవ రోజు

నానే బియ్యం బతుకమ్మ జరుపుకుంటారు.


నైవేద్యంగా నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.



*29-09-2022 గురువారం*


ఆశ్వీయుజ శుద్ధ చవితి, ఐదవరోజు అట్ల బతుకమ్మ జరుపుకుంటారు.


నైవేద్యంగా అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..



*30-09-2022 శుక్రవారం*

ఆశ్వీయుజ శుద్ధ పంచమి, ఆరవ రోజు,

అలిగిన బతుకమ్మ .


ఈరోజు నైవేద్యమేమి సమర్పించరు.



*01-10-2022 శనివారం*

ఆశ్వీయుజ శుద్ధ షష్టి, ఏడవ రోజు, 

వేపకాయల బతుకమ్మ .


నైవేద్యంగా బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.



*02-10-2022 ఆదివారం*

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి , ఎనిమిదవ రోజు, వెన్నముద్దల బతుకమ్మ.


నైవేద్యంగా నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.



*03-10-2022 సోమవారం*

 ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తొమ్మిదవ రోజు, సద్దుల బతుకమ్మ.


 ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. 

నైవేద్యంగా పెరుగన్నం, చింతపండు పులిహోర, పెసర సద్ది, కొబ్బరన్నం, నువ్వులన్నం. బెల్లాపన్నం మొదలగు సద్దులు సమర్పిస్తారు.



*గోగులపాటి జ్యోతి కృష్ణమోహన్*

9700007653

ప్రశ్న ఒక జవాబు

 ఒక ప్రశ్న  ఒక  జవాబు

60యేళ్ళ తరువాత మన క్రియా శీలక జీవితం ముగుస్తుందా ? ఔనననే నా మిత్రులు కొందరు చర్చించుకోవడం విన్నాను. 

నాకు మాత్రం అలా అనిపించటం లేదు .. భౌతికంగా మన శరీరంలో కొంత అరుగుదల ఉన్నా, మానసికంగా గొప్ప పరిణితి. పరిపక్వత మనలో ఉంటుంది ఆ వయస్సులో.. విస్త్రుతమైన జీవిత అనుభవాలు ,ప్రపంచంలో మానవుల నైజం, ఆ పాటికి మనకు బాగా అర్ధమై ఉంటాయి.

వీటి కారణంగా ఒక బుద్ధుడు, ఒక యోధుడు మనలో ఆవిష్క్రుతమౌతారు.. నా జీవితంలోని ఒక ఉదాహరణ మీకు చెబుతాను.

మా గురువుగారైన డాక్టర్ ఉప్పల లక్ష్మణ రావు గారు మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పనిచేస్తూ ఉండేవారు.

అనుకోకుండా ఒక రోజు ఆయన శ్రీమతి మెల్లీ గారు 1965 జూనులో ఒక రోడ్దు ప్రమాదంలో మరణించారు. భార్య మరణించడం మూలాన, ఒక్కరు మాస్కోలో జీవించడం కష్టతరం కావటం వల్ల 1970 ఫిబ్రవరిలో ఆయన భారత దేశం తిరిగి వచ్చారు.. అప్పటికి ఆయన వయస్సు 72 సంవత్సరాలు.

ఆ 72 యేళ్ల ప్రాయంలో ఆయన మా బరంపురం  వికాసం సాహితీ సంస్థలో చేరారు. 25 మంది యువతీ యువకుల మధ్య నేలపై  చతురస్రాకారంగా కూర్చొని సాహితీ వ్యాసాంగం కొనసాగించారు. ఈ వ్యాసాంగం ఆయన తుది శ్వాస విడిచేదాకా 1985 వరకు కొనసాగింది.

పది సంవత్సరాల పాటు సంస్థ అధ్యక్షునిగా ఉంటూ రచనలు చేసారు. అనారోగ్య కారణాల వల్ల పదవిని విడిచి పెట్టినా  సారస్స్వత వ్యాసాంగం కొన సాగిస్తూ వచ్చారు.

ఈ కాలంలో  ఆయన అతడు - ఆమె మూడవ భాగం నవలను, నాలుగవ భాగాన్ని, రచించారు. ప్రఖ్యాత ఇండోలజిస్టు వాల్టర్ రూబెన్ జర్మన్లో  రాసిన " ప్రాచీన భారత దేశంలో బానిసల స్థితిగతులు " అనే గ్రంధాన్ని తెలుగులోకి అనువదించారు. పై రెండు పుస్తకాలు విశాలాంధ్రవారు అచ్చు వేయించారు.

తెలుగునాటా సుప్రసిద్ధమైన ఆయన  స్వీయ చరిత్ర " బతుకు పుస్తకం " ఈ సమయంలోనే వెలువడింది. దీన్ని ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ధారా వాహికంగా ప్రచురించారు.

" బ్రౌణ్యం నాటి తెలుగు వ్యవహారానికి  నేటి తెలుగు వ్యవహారానికి తారతమ్యాన్ని ఒక వ్యాసం రూపంలో  రాసారు. ఇది భారతి పత్రికలో ప్రచురించారు. ఇంతేకాదు " తెలంగాణా సాయుధ పోరాట నేపధ్యంగా  " గెరిల్లా " కధ రాసారు. అందులో పార్వతి కధా నాయకురాలు.

అగ్యాత సమయాల్లో విప్లవకారులు ఎలా దాక్కుంటారో, ఎంత పకడ్బంధీగా జీవిస్తారో చిత్రీకరించారు. ఉష్ ఉష్ అని విజిల్ లాంటి సంగ్య చేస్తే అటక మీద ఇంట్లోవారికి కూడా తెలియ కుండా దాక్కొన్న ఆసామీ కిందకు దిగి వచ్చి భోజనం చేసి మళ్ళా అటక మీదకు పోతాడు.

తాను యవ్వనంలో జర్మనీలో ఒక ప్రొఫసరు గారింటికి వెళ్తున్నప్పుడు ఎదురైన సంఘటన ఆధారంగా " పెంటబండి " అనే రూపకం రాసారు.

ఒక షాపులో టెన్నిస్ రాకెట్ కొనబోతే సేల్సు గర్లుతో ఎదురైన సంభాషణ ఆధారంగా " టెన్నిస్ రాకెట్ అమ్మిన అమ్మాయి " అనే  మరో రచన చేసారు.

ప్రతీ నెల మా వికాసం సమావేశాల్లో చదివిన సభ్యుల రచనల మీద సమగ్ర సమీక్ష రాసి తీసు కొచ్చి చదివేవారు. ఆ నెలలో ఒక ఉత్తమ సాహితీ ప్రక్రియని ఎన్నిక చేసేవారు. ఆ నాడు ఆయన చదివే ఆ సమీక్ష కోసం మేము ఎంతో ఆశతో ఎదురు చూసేవాళ్లం. 

ఐరిష్ విప్లవకారుడు బాబీ శాండ్స్  నిరాహార దీక్ష సందర్భంగా ఆయన డైరీని  తెలుగులోకి అనువదించారు. ఈ రచన మా స్ప్రుహ పత్రికలో ప్రచురించాము..

సుప్రసిద్ధ జర్మన్ కవి హెన్రిక్ హైనే స్పురణతో " ఉండండుండండి " అనే కవిత రాసారు. ఈ కవిత మకుటమే శీర్షికగా వికాసం తన రెండవ ప్రచురణ " ఉండండుండండి " కవిత సంపుటిని  స్వర్గీయ పురిపండా అప్పల స్వామి గారి ముందు మాటతో  వెలువరించింది.

ఇవి కాక అనేక కధలూ, కవితలూ, వ్యాసాలు రాసేరు.

ఆ నాటి కాలంలో మా యువకుల్లో గొప్ప అధ్యయనం కొనసాగుతూ ఉండేది. జీన్ పాల్ సార్త్రే, అల్బర్త్ కామూస్, జార్గె బెర్నార్ద్ షా,, ఇతర నోబుల్ ప్రైజు విన్నెర్స్ రచనలు చదువుతూ ఉండే వాళ్ళం. అస్థిత్వవాదం, నిహిలిజం, డాడాఇజం, లాంటి అనేక వాదాల చర్చ జరుగుతూ ఉండేది. ఎప్పటి కప్పుడు లక్ష్మణ రావు గారు వాటి గురించి సమగ్ర విశ్లేషణ రాసి తీసు కొచ్చి సమావేశంలో చదివేవారు.

చీలీలో  ప్రజలతో ఎన్నికైన అల్లెండే ప్రభుత్వాన్ని మిలటరీ జెనరళ్ళు అమెరికా సీ ఐ యి మద్దతుతో కూల్చేసినప్పుడు అత్మ హత్యా సద్రుశంగా మరణించిన  మహాకవి నెరూడా స్మ్రుతిలో ఎన్నో నెరూడా కవితల్ని తెలుగులోకి అనువదించి మా సమావేశంలో చదివి వినిపించారు.

చీలీ మీద ఆనాడు నేనొక కవిత రాసాను అన్న ప్రేమతో ఫాసిజాన్ని వ్యతిరేకించే పోస్టర్లు నాకు తెచ్చి ఇచ్చారు.. నేను నజ్రూలు బిద్రోహీ క్యాసెట్టు మీటింగులో వినిపించితే నజ్రూలు కవిత్వం బెంగాలీలో రాసిన పుస్తకం కలకత్తా నుంచి తెప్పించి నా కిచ్చారు.

ఏనాడు ఆయన నన్ను గానీ, మా సభ్యుల్ని గానీ " నువ్వు " అని ఏక వచనంలో సంభొదించి ఎరుగరు. ఎల్లప్పుడూ " మీరు " అనేవారు. ఆయన అలా సంబోదిస్తున్నప్పుడు వయస్సులో, గ్యానంలో ఎంతో చిన్న వారిమైన మేము ఎంతో సిగ్గు పడేవాళ్లం. ఆయన సంస్కారం అంత గొప్పది.

ఆయన ఎం. ఏ పీ.హెచ్. డీ (ఎడింబర్గ్ ), డాక్టర్ ఆఫ్ సైన్సు. మొగ్గ అంకురించడంలో కాంతి పాత్ర అనే అంశంపై డాక్టరేటు చేసారు.

స్ప్రసిద్ధ వ్రుక్ష శాస్త్రవేత్త సర్ జగదీసు చంద్ర బోసు దగ్గర కూడా ఆయన పనిచేసారు. అలీఘర్ ఉనివర్సిటీలో, కాకినాడ p.r. కళాశాలలో అధ్యాపక వ్రుత్తి కొన్నాళ్ల పాటు నిర్వహించారు. సుప్రసిద్ధ బీ. ఎన్నర్. రైల్వే సమ్మే సందర్భంగా ఆనాటి ం వహించిన మాజీ రాష్ట్రపతి వీ. వీ. గిరిగారి దాగ్గర సమ్మె ముగిసేవరకూ ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసారు.

భార్య మెల్లీ షోలింగరుతో కలిసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. గాంధీ గారి ఆశ్రమంలో కొన్నాళ్ళున్నారు. మన శ్రీకాకుళంలో 2-3 సంవత్సరాలు భార్యా సమేతంగా ఉండి మేలి రకం ఖద్దరుపై పరిశోధనలు చేసారు. ఆంధ్ర ప్రదేష్ వర్కింగ్ జర్నలిస్ట్ అస్సొసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు, నా మిత్రుడు అయిన శ్రీ నల్లి ధర్మా రావు గారి దగ్గర ఆయన శ్రీకాకుళం లో జీవించిన కాలం నాటి వివరాలున్నాయి.

ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం కోసం ప్రాయోపవేశం చేసిన అమరజీవి పొట్టి శ్రీ రాములు గారు ఈ దంపతులకు గొప్ప సన్నిహితుడు. సబర్మతీ ఆశ్రమంలో ఉన్నప్పుడు వీరి మధ్య స్నేహం కుదిరింది.మెల్లీగారు బెజవాదలో నివశిస్తున్నప్పుడు  శ్రీరాములు గారు తమ స్వగ్రామానికి వెళ్తూ విధిగా బెజవాడలో ఆమె ఇంటిలో బస చేసేవారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా జీవితాల్లో మాకు ఉప్పల లక్ష్మణరావు గారి లాంటి  మేధావి, గొప్ప వ్యక్తి సహచర్యం ఒక దశాబ్దానికి పైగా లభించింది. ఇది మా అద్రుష్టంగానే నాలాంటి వాళ్లం భావిస్తాము.

.మా ద్రుష్టిలో వయస్సు ఒక సంఖ్య మాత్రమే. షష్ఠి పూర్తి కావటం మరో ఉజ్జ్వల అధ్యాయానికి ప్రారంభం మాత్రమే.

ఇదే మా గురువుగారినుంచి శిష్యరికంలో మేము నేర్చుకున్నాం.

కావున చింత వలదు, నిరాశ వలదు, నిస్ప్రుహ ,నిర్వేదం ఒకోసారి మబ్బులా ఆవరించినా మన క్రుషితో తొలగిపోతుంది. నిత్య చైతన్యంతో బ్రతుకుదాం, ఏమంటారు ?


విజయ్ చంద్ర.

ఇసుకరాతలు

 నేటి జీవిత సత్యం. *అభిప్రాయాలు - -ఇసుకరాతలు.*


సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ... 

*"ఈ సముద్రం మహా దొంగ"* అని రాశాడు.


కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో...

 *"ఈ సముద్రం గొప్ప దాత"* అని రాశాడు. 


ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి.... 

*"ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి"* అని రాసింది. 


ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో .... *"‘ఈ సముద్రం ఒకటి చాలు  జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను "* అని రాశాడు.


అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. 


రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది... 


అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు...


ఇంకా... ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.


ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాని తొలగించి ముందుకు అడుగు వేయండి.


నిజాయితీగా అంతరాత్మను తోడుగా చేసుకోండి.

వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది..


సేకరణ. మానస సరోవరం

లైట్ భోజనం

 *లైట్ భోజనం*


ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తారు, భోజనానికి ఎప్పుడూ ఉండరు....అనే మా చిన్ననాటి స్నేహితుడి భార్య మరీ నిష్టూరమాడుతుంటే చెప్పాను.


భోజనానికి పిలిస్తే ఎందుకు రాం. కానీ మా భయమల్లా మేం వస్తున్నామంటే మీరు పొద్దున్నే నాలుగింటికి లేచి బోల్డన్ని వెరైటీలు చేస్తారు. మీ కష్టం చూడలేకే మీ ఇంటికి భోజనానికి రావట్లేదు మేం. సరే ఇన్నిసార్లు పిలిచారు కాబట్టి మా షరతులు ఒప్పుకుంటేనే వస్తాం...అన్నాను.


సరే చెప్పండి. మీరు ఎలా అంటే అలాగే అన్నారావిడ.


సరే చెప్పాను. మరీ ఎక్కువ కాకుండా లైట్గా మామిడికాయ పప్పు, సాంబారు అంతే. అంతకు మించి ఇంకేమీ వద్దు. ఇక మీరు గుత్తొంకాయ కూర బాగా చేస్తారని మీ ఆయన చెప్తుంటాడు, కాబట్టి అదొకటే. ఇహ చిన్నచిన్నవంటారా.. ఏదో మరీ ఎక్కువ కాకుండా ఓ గుప్పెడు చల్ల మిరపకాయలు, రెండు అప్పడాలు.


ఇహ మీ అత్తగారు పెట్టిన గుమ్మడికాయ వడియాలు నాలుగు. నాకు గారెలు అంత ఇష్టం ఉండవు కాబట్టి మీకు గారెలు చేసే బాధ లేదు. ఏవో నాలుగంటే నాలుగు ఆవడలు, మరీ పెద్దవి కాకుండా చపాతీ సైజులో రెండంటే రెండు బొబ్బట్లు, ఇక మీ అమ్మగారు మీతోనే ఉన్నారు కాబట్టి ఆవిడ తరం పులిహోర అంతే. మా చిన్నప్పుడు మీ అత్తగారు దద్దోజనం, చక్రపొంగలి చేసి పెట్టేవారు. ఒకసారి ఆవిడని ఫోనులో అడిగి కొంచెం కొంచెం చెయ్యండి. 


యే పదార్థం అయినా ఎక్కువ చేసేసి తర్వాత ఇంటికి కూడా పట్టుకెళ్ళండి అని బలవంతం చెయ్యొద్దు. ఇక మీకు తెలుసుగా నేను ఆవకాయలు తినను. అందుకని కొంచెం మామిడి+కొబ్బరి కలిపిన పచ్చడి, రెండో పచ్చడి గురించి నాకు ఎక్కువ పట్టింపు లేదు, మీరు ఏదంటే అదే. ఇక భోజనానంతరం గులాబ్జామ్. 


ఇక ఇంత కంటే ఒక్కటి ఎక్కువ చేసినా వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం మరి మీ ఇష్టం అని నిష్కర్షగా చెప్పాను.


ఇంకో విషయం మర్చిపోయానండీ...మీకు తెలుసుగా నేను ఉదయం 11 గంటలకే భోజనం చేసేస్తా. అందుకని ఉదయం 10 తర్వాత కాఫీ తాగను. మేం పొద్దున్నే 7 కల్లా వచ్చేస్తాం. మరి మా ఆవిడకి కూడా ఏదో ఒకపని చెప్పండి. వూరికే కూర్చుంటే ఎలా. మీరు ఫిల్టర్ వేసి, మంచి పాలు తెప్పించి ఆ కాఫీల వ్యవహారం ఆవిడకి ఇవ్వండి. స్నేహితులం అయి మేం ఆ మాత్రం సాయం చెయ్యొద్దూ అన్నాను.


తర్వాత చాలా సార్లు వాళ్ళింటికి వెళ్ళాం కానీ భోజనం ప్రస్తావన లేదు ఎందుకో తెలియదు మరి.

సమస్యా పూరణం

 సమస్యా పూరణం;-మమత ఐలకరీంనగర్ 9247593432




*కలము యు కాగితమ్ములును కావలెనా


కవితాస్రవంతికిన్*


కలవరమొంద జెప్పెనట గాంచిన దృశ్యము మౌనివెంటనే


సులువుగ శ్లోకమై కుదుర సుస్వర వాక్కులు బ్రహ్మ మెచ్చగన్


జలజల భావజాలములు జారుచు వాహిని వోలె దూకగన్


*కలము యు కాగితమ్ములును కావలెనా


కవితాసవంతికిన్*

50+ సంవత్సరాలు నిండిన మేము రెండు తరాలకు

 ప్రియమైన  స్నేహితులు............. సరదాగా చదివి  ఆనందించి ........ నవ్వుకోండి ......!                                 🙏  🙏  🙏  🙏     👍  👍                             50+ సంవత్సరాలు    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం..,

         

స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.     🌾🌴

పరిశుభ్రమైన...,    వాతావరణం  లో  పుట్టి    పెరిగిన   వాళ్ళం... 

👦తలపై   నుండి    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని........,


📚  చేతికి     పుస్తకాల   సంచి తగిలించుకుని...,

ఒక్కడిగా    బయలుదేరి    దారిలో స్నేహితులను

ఒక్కొక్కళ్లను      కలుస్తూ పెద్దగుంపుగా.......  👦. 👦 👩. 👧 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం....., 🚶🏃


జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు   లాక్కుంటూ ..., చిరుగు    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం ....., 🕺


10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు   వేసుకున్న......  ,             తరం మాదే.....! 🌲 పదవ తరగతిలో మాత్రమే పది రూపాయలు అది కూడా పరీక్ష ఫీజు చెల్లించిన వాళ్ళం మేమే


🤸🤹

గోలీలు,     బొంగరాలు,

కర్రా బిళ్ళ, కోతి కొమ్మ గంటల తరబడి కబడ్డీ ఆడిన తరం మాది


?


🚴🏊🤽

బడికి    వేసవి కాలం   సెలవులు రాగానే   గంటల తరబడి బావిలో ఈత ఒకరిని ఒకరు ముంచుకొనుడు నేరేడు చెట్లు. ..  సీమ తుమ్మ చెట్లూ..,     ఈతచెట్లు    ఎక్కి కాయలు   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లోఎండ్రకాయలు, చేపలు పట్టి..,. వొంకల్లో, వాగుల్లో  స్నానాలు     చేసిన   వాళ్ళం. 


🪔🪔🪔

దీపావళి  కి రెండు మూడు పైసలకు ఒక్కొక్క టపాకాయ కొట్టి ఆ తర్వాత ఉన్నవాళ్లు కొడుతుంటే చూసిన వాళ్ళము 


🌦️ వర్షం   వస్తే  యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం......!


📖 second    hand   text  books     కోసం     పరీక్షలు 

అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం......., 🤣


🚴సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క  తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...


✉️ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 🌴


పండగ    సెలవులు,

వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు

ఎన్ని సెలవులు  వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా   ఆటపాటలతో ఆనందాన్ని.  🤼  🏃🏻 ⚽ 🏸 🪁🏹  🤸  ⛹️. 🏊   అనుభవించిన    తరం వోళ్ళం...,


 👨👩👧👦 పెద్దలు  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని...,   పొట్ట    చెక్కలయ్యేలా

నవ్వుకున్నదీ మేమే.... ☘️


 😄ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,

అంతామేమే  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...🍁




👨👩👧👧చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడి కూర..... వండి పెట్టిన  తరం....🍁

అత్తయ్యా,

మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,

స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం........... 🤣🤣🌺


కట్టెల    పొయ్యి    మీద  వండిన అన్నం/కూర    తిన్నవాళ్ళం ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం వాళ్ళం..,🌱


తాతయ్యలు   అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే  దగ్గర   చేరి    మధురమైన      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..🦋


అమ్మమ్మలు / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది మేమే.......  ,🌵


నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,🍀


📻రేడియో,

దూరదర్శన్📺

టూరింగ్ టాకీస్📽️.   కాలం చూచిన వాళ్ళం... .🍁


🎥 40 పైసల  నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని....., 

1.00   chair   టిక్కెట్ తో    లో కూర్చుని    సినిమా  చూసిందీ    మేమే...🌵


 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .🍂


అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...🌹


😄చదువులు తక్కువైనా సాంప్రదాయం సంస్కారాన్ని చూసిన వాళ్ళము  చదువులు ఎక్కువ సంస్కారం తక్కువ ఉన్నవాళ్లను చూసిన వాళ్లము😂

📲🖥️🖨️

ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb skype లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,

మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...

 మేమే-- -💐


 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  🌸


   అప్పటి గుండె   లోతుల్లో   నుంచి   వచ్చిన     ప్రేమని   చూసిన  వాళ్ళం..........!

ఇప్పుడు    గుండీల   పైనుంచి  వచ్చే    ప్రేమని 

చూస్తున్న వాళ్ళం.......!! 🌷

😄😄 అప్పుడు ఊర్లో ఒకరిద్దరికి మాత్రమే బీబీ షుగర్ చుసిన వాళ్ళము ఇప్పుడు ఇంటింటికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళని చూస్తున్న వాళ్ళము😳😳


ఒక  విధంగా  చెప్పాలంటే   మేం  చాలా     అదృష్టవంతులం...?

🙏🙏🙏👍👍👍....    ప్రియమైన  స్నేహితులు సరదాగా చదివి  ఆనందించి  నవ్వుకోండి .....!!    🙏🙏🙏🙏👍

అహం అనే భావన

 అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్ఠం, అఖండం అయిన సత్‌ స్వరూపం ‘నేను, నేను’ అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది’ అని ఈ శ్లోక భావం. భగవాన్‌ రమణ మహర్షి రచించిన 31 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం.. ‘ఉపదేశ సారం’లోని 20వ శ్లోకమిది. మనో నాశనం కావాలంటే ‘నేను’ అనే భావన తొలగిపోవాలని తెలిపిన రమణులు.. ఆ భావన పోయాక మిగిలి ఉండే స్థితి గురించి ఇందులో వర్ణించారు. అహం భావన పడిపోయాక మిగిలే ‘నేను’.. సత్యమైనది. అది జ్ఞాన స్వరూపం. సత్‌ రూపం. అఖండం, పరిపూర్ణం అయిన శాశ్వత వస్తువు. ఈ ‘నేను’నే రమణ మహర్షి ‘తాను’ అని వ్యవహరించేవారు. మనం సుషుప్తిలో ఉన్నప్పుడు అన్ని భావనలు, మనస్సు అంతమైనా కూడా ప్రకాశిస్తూ ఉండేది ఇదే. కాకపోతే మనస్సు ఆ ‘నేను’లో లయమైందే తప్ప నశించలేదు కనుక..

మెలకువ రాగానే మళ్లీ మనసు, దాంతోపాటు ఈ జగత్తు, సుఖదుఃఖాలు అన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రయత్నపూర్వకంగా, విచారణతో ‘అహం’ భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో తాను (ఆత్మ) ‘నేను నేను’ అని స్వయంగా ప్రకాశిస్తుంది. అదే ఆత్మసాక్షాత్కారం. ఆత్మ దర్శనం. అయితే.. ఆత్మదర్శనం అనే మాట నిజానికి పెద్ద తప్పు. ఎందుకంటే.. ఆత్మ అనేది ఒక వస్తువు కాదు. దర్శించడానికి అది దృశ్యమూ కాదు. అది మనచే చూడబడే వస్తువే అయితే.. అది పరిమితమైనదే అవుతుంది. పరిమితమైనది నశిస్తుంది. అలా నశించేది ఆత్మ కాదు. అది ఏకం, అద్వయం, సర్వవ్యాపకం. అది మనకన్నా వేరు కాదు. కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేం. ఆత్మ దర్వనం అంటే.. అది ‘నేనే’ అని అనుభవం కలుగుతుందంతే.

ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ ‘అహం’భావన తొలగిపోదు. ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే. ‘అహం’ పుట్టుక ఎక్కడో వెతకడం (విచారణ) వల్లనే అది పడిపోతుంది. అప్పుడే ఆత్మదర్శనం. అయితే, దీనికి ఒక మినహాయింపు ఉంది. సాధకుడు సాధన చతుష్టయ సంపన్నుడై తగిన శ్రద్ధ చూపిస్తే సద్గురువు ద్వారా వేదాంత బోధ వింటూ ఉండగానే అతడికి ఈ స్థితి సద్యోఫలంగా లభిస్తుంది. ఆ అర్హత లేనివారు దాన్ని సంపాదించడానికే జపధ్యానాదులు. వాటి ద్వారా అర్హత సంపాదిస్తే అప్పుడు విచారణ చేసి, అజ్ఞానాన్ని తొలగించుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. 

ఆత్మ ఎక్కడి నుంచో రాదు. అది స్వయం వ్యక్తం. అందుకే రమణులు ‘స్ఫురతి హత్‌ స్వయం’ అన్నారు. వర్షాకాలంలో సూర్యుడు మబ్బుల వెనుక ఉండడం వల్ల వెలుగు కనిపించదు. అంతమాత్రాన సూర్యుడు లేనట్టు కాదు. ఆయనెప్పుడూ జ్వాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటాడు. ఆత్మ కూడా అంతే. అజ్ఞానమనే మేఘాలు కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే. జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి ఆత్మదర్శనమవుతుంది. అందుకే.. ‘నేనడంగిన చోట నేను నేననుచు తానుగా తోచును తాను పూర్ణంబు’ అన్నారు రమణ మహర్షి.

ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి?

ఈ మధ్య చాలమంది గురువులు కొంచెం పేరు సంపాదించి మీడియాలలో tvలలో కనిపిస్తూ ఆత్మసాక్షాత్కారం కలిగింది అని చెప్పుకుంటూనే పరమాత్మ ఎవరు అనే విషయాన్ని మరుగున పరచి శైవ వైష్ణవ శాక్తేయ గొడవలు సృష్టిస్తున్నారు కొందరైతే గ్రంథ రచనచేసి మరింత ప్రచారము చేసుకుంటున్నారు.

మనస్సు ఆత్మతో లయం చేయడమే ఆత్మసాక్షత్కారము అని ఒక tvగురువు ఈమధ్యనే ఒకగ్రంధంలో వ్రాశారు.

మనస్సు ని ఆత్మతో లయం చేస్తే ఇంద్రియనిగ్రహం వస్తుంది కాని ఆత్మసాక్షాత్కారం ఎలా వస్తుంది.

ఆయనచెప్పినది ఏమిటంటే ఆదినారాయణుడు వేరు సదాశివుడు వేరు శివుడువేరు విష్ణువు వేరు శంకరుడు వేరు మహేశ్వరుడు వేరు పరాశక్తి వేరు అని

శివుడే పరబ్రహ్మం అని సెలవిచ్చారు.

అత్మసాక్షాత్కారం పొందిన వాడు చెప్పే మాటలేనా ఇవి.

అత్మసాక్షాత్కారం అంటే సర్వం ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడం.

ఆత్మసాక్షాత్కారం అంటే ఆత్మని పరమాత్మతో ఒక్కటి చెయ్యటం.

ఆత్మసాక్షాత్కారం అంటే మూలాధారచక్రంలో ఉన్న కుండలిని శక్తిని

మేల్కొలిపి ఆప్రాణశక్తిని ఆజ్ఞాచక్రం దాటి సహస్రారమునకు చేర్చడం.

ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మస్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.

ఆ పరబ్రహ్మస్వరూపానికి ఎలాంటి పేరు లేదు ఏలాంటి గుణములు లేవు నిరాకారుడు సర్వానికి అతీతుడు లింగరహితుడు ఆపరబ్రహ్మమునే ఆదినారాయణుడు అని పరమశివుడని ఆదిపరాశక్తి అని ఎవరికి నచ్చినట్లువారు పూజిస్తారు.

ఎవరిని పూజించినా చేరేది ఒక్కరికే.

ఎవరిని స్మరించినా అది ఒక్కరినే.

నారాయణుడు శివుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు వేరు వేరు కాదు ఒక్కటే ఒకేపరబ్రహ్మస్వరూపులు.

నిరాకారము(పరమాత్మ)

సాకారము(జీవాత్మ)

ఒక్కటే.

పరమాత్మ యోగమాయచే శూన్యస్థితి నుండి జీవాత్మగా మారుతున్నాడు.

జీవాత్మ యోగసాధనతో పరమాత్మలో లయమయ్యి ఆశూన్యస్థితిని చేరి పరమాత్మగా మారుతున్నాడు.

సృష్టి స్థితి లయములో స్థితి శాస్వతమైనది అదే పరబ్రహ్మస్వరూపమైన శూన్యస్థితి.

అంటే నీరాకారపరబ్రహ్మమే శాశ్వతమైన స్థితి ని పొందుతున్నాడు మిగిలినది అది ఏదైనా సరే అశాశ్వతమే అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే నిజమైన ఆత్మసాక్షాత్కారము.

ప్రతీ జీవి పరమాత్మ(నీ యొక్క) స్వరూపమే అనే సత్యాన్ని తెలుసుకోవడమే ఆత్మసాక్షాత్కారము...

ధర్మాకృతి

 ధర్మాకృతి : మాతృమూర్తి 


తమ అక్కగారిని పరామర్శించడానికి వచ్చిన మహాలక్ష్మమ్మ గారు తన పుత్రునే సన్యాసిగా ముండన కాషాయదండ కమండలాదులతో కడసారిగా దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. చిదంబర అగ్నిప్రమాదం తరువాత గిణిని గుండెలకు హత్తుకొని తండ్రితో కూడా కుమారుని ఎక్కడికీ పంపనని పలికిన మాతృమూర్తి తన వెంటనే వచ్చిన కుమారుని శ్రీమఠానికి సమర్పించి తిరుగు ముఖం పట్టారు.


మహాలక్ష్మమ్మ గారికి గిణి అంటే ప్రత్యేక అభిమానం అని మనం ముందే చెప్పుకొన్నాము. చిన్నతనం నుంచీ ఆమె తma కుమారుని దగ్గర కూర్చోబెట్టుకొని అనేక పురాణ కథలు చెప్పేవారు. అనేక శ్లోకాలు నేర్పించేవారు. చిలుక పలుకుల గిణి అమ్మ చెప్పినవన్నీ ఇట్టే గ్రహించి తన రమ్యమైన కంఠంతో ఒప్పగించేవారు. అమ్మగారిది ధర్మశాస్త్రంలో గట్టి పాండిత్యమున్న నాగేశ్వర శాస్త్రి కుమార్తె అవడం వలన నిప్పులు కడిగే ఆచారము. స్వామివారి మడి మరి వారిదేనేమో. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు హేజీబు కుమారుడు. ఆయనవి రాచపోకడలు. సంగీతాలు, స్నేహాలూనూ. 


గిణికి అప్పుడ్ పదమూడేండ్లు. ఎప్పుడూ కొంగు పట్టుకొని తిరుగుతూ నవ్వుతూ నవ్విస్తూ విసిగిస్తూ సంతోష పెడుతూ తననలరించే ఈ ముద్దుల తనయుడు ఈ పాలుగారే పసివాడు నిస్సంగునిగా, నిర్లిప్తునిగా జీవితాంతం సన్యాసిగా గడపబోతున్నాడా?” లొట్టలు క్రొంబొదుగులో జిలు ముట్టియగ్రుమ్ముదూడ నా చిత్తిని చేతబట్టుకొని సింహఘటాలి నెదుర్ప జూచెదో” అంటారు విశ్వనాథవారి దశరథుడు. అప్పటికి శ్రీరామునికి పదునారేండ్లు. బ్రహ్మర్షి విశ్వామిత్రుని తోడు ఉంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. మన గిణికి పట్టుమని పదమూడేండ్లు కూడా నిండలేదే! మళ్ళీ తన కుమారుని తాను కనులారా చూడలేదు. మాట్లాడలేదు. ఈ హఠాత్సంఘటనకు బిత్తరపోయారామె.


కామకోటి పీఠాచార్యుల వారికి, వారి పూర్వాశ్రమ బంధువులు, తండ్రితో సహా యావన్మందీ సామాన్య శిష్యగణంతో పాటు వచ్చి నమస్కారం చేసుకొంటారు. వారికి ప్రత్యేక మర్యాదలు ఏమీ ఉండదు. తల్లిగారు మాత్రం ఎదురుబడరు. పీఠాధిపతుల మర్యాదననుసరించి పరదేవతకు తప్పించి నమస్కరించే అవకాశం లేదు. అయితే తల్లి ఎదురుబడితే యతి అయినప్పటికీ నమస్కరించక పోతే ధర్మభంగం అవుతుంది. అందువల్లనే వారు తల్లిగారిని కలుసుకోరు. ఈ విషయం పరంపరగా శ్రీమఠంతో పరిచయమున్న మహాలక్ష్మమ్మ గారు ఎరుగుదురు. ఈ ఎరుక వారికి మరింత దిగులు కలుగజేసి ఉంటుంది.


తరువాత కాలంలో కూడా ఎవరైనా వారి ముందు శ్రీవారి ప్రస్తావన తెస్తే తల్లి తండ్రులిద్దరూ మౌనంలోకి జారిపోతుండేవారు. బహుశః తమ పుత్రుడు లోకోద్ధరణకై అవతరించిన దైవాంశ సంభూతుడని సరిపెట్టుకొన్నారేమో! పదమూడు సంవత్సరములుగా పెంచుకొన్న మమకారం, ప్రేమ ఆశలు సమూలంగా తెంపుకొని తన గారాలపట్టిని మనకై సమర్పించి వెనుదిరిగారు జగన్మాత. జీవన్ముక్తుని కన్న ఆ తల్లిదండ్రులు ధన్యులు. వారిపై తరాలు క్రింది పదితరాలు తరించాయి. స్వామివారి కాలంలో జీవించి వారిని దర్శించిన మనందరం తరించాము.


పట్టుబట్టి అమ్మతో శ్రీమఠానికి బయలుదేరిన గిణి శ్రీమఠానికి అధిపతులుగా ఒంటరిగా మిగిలిపోయారు. తరువాతి కాలంలో చాటుగా దర్శించాలనీ, పుత్రుని వాక్యములు వినాలనీ మహాలక్ష్మమ్మగారు రెండు మూడు పర్యాయములు ప్రయత్నించారట. అది తెలుసుకొనిన స్వామివారు అర్థాంతరంగా ఆ ఊరినుంచే మకాం ఎత్తేశారట. సన్యాసాశ్రమపు నిస్సంగత్వం క్షణికంగానైనా చెదిరిపోతుందేమోనన్న ఒక healthy fear. అయితే తమ 95ఏళ్ళ వయస్సులో వారి అమ్మగారి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు స్వామివారి కన్నులలో ఆ పదమూడేళ్ళ మెరుపు, మురిపం ఉత్సాహం కన్పించాయి.


1932 జూన్ 14వ తేదీన శ్రీవారు బుగ్గ గ్రామంలో విద్వద్గోష్ఠిలో మునిగి ఉన్నారు. దూరంగా చేతిలో తంతితో మఠం మేనేజర్ నిలుచుని ఉండడం గ్రహించారు. కుంభకోణం నుంచేనా టెలిగ్రాం అని అడిగారు. ఔనని సమాధానం వచ్చింది. శ్రీవారు మౌనముద్రాంకితులయ్యారు. సభ నిశ్శబ్దంగా ఉంది. స్వామి మనస్సులో ఉవ్వెత్తున లేస్తున్న భావతరంగాలు కనులనుండి బయటకు దూకటానికి ప్రయత్నిస్తున్నట్లున్నాయి. మరుక్షణంలో తమాయించుకొన్నట్లు కన్పించారు. మాతృనిర్యాణం విన్న సన్యాసి ఏం చేయాలి అని పండితులను ధీరోదాత్తమైన కంఠధ్వనితో ప్రశ్నించారు. పండితులకు విషయం అర్థం అయింది. చింతాక్రాంతులయ్యారు. స్వామివారు నిదానంగా లేచి బయలుదేరారు. శిష్యులందరూ భగవన్నామ సంకీర్తనతో సామిని అనుసరించారు. స్వామి అక్కడకు రెండు మైళ్ళ దూరంలో నున్న జలపాతంలో స్నానం చేశారు. పండితులు, పామరులు, పరివారం యావత్ శిష్యగణమూ శ్రీవారి వెనుకనే స్నానం చేశారు. మఠపక్షాన భూరిదానాలు చేయబడినవి. పదవ రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది.


శ్రీవారు అవతారం చాలించేరోజు ఉదయాన అమ్మగారి జన్మ స్థలమైన ఇచ్చంగుడి వేదపాఠశాలలో పెట్టడానికి తీసుకొని వెళుతున్న మహాలక్ష్మమ్మగారి పటం శ్రీవారి ముందుంచబడింది. అప్పటికి శ్రీవారు చాలాకాలంగా మౌనంగా, సహజ సంవిన్మయీస్థితిలో ఉన్నారు. అయినా ఆ పటాన్ని చూసి, చేతితో ప్రేమగా స్పృశిస్తూ అమ్మ అంటూ గౌరవాదరాలతో అలా ఎంతోసేపు చూస్తూనే ఉన్నారట. ఆ రోజున స్మరించిన ఇంకో విషయం తనకు సన్యాస దీక్ష ఈయబడిన కలవై శ్రీవారు ఏ ఊరిలో ఉన్నా ప్రతిరోజూ సంధ్యావందనం అయిన వెంటనే కనులు మూసుకొని ఖచ్చితంగా ఒక గంట జపం చేసేవారు. ఇది శ్రీమఠంలో ‘ఒరుగంట జపం’గా ప్రసిద్ధి. ఆ ఒక గంట జపం అయిపోయిన తరువాత కలవై వైపుకు తిరిగి నమస్కారం చేసేవారు. అక్కడి గురు పరమ గురువుల అధిష్ఠానాల మధ్య అనేక రోజులు ఆవాసం చేశారు. కలవై అంటే కలయిక అనే అర్థం కూడా ఉన్నది. ఆ రోజు పదిగంటల సమయంలో అకస్మాత్తుగా కనులు తెరిగి కలవై వైపు నమస్కారం చేసి కలవై అన్నారట. అక్కడున్న పారిషదులు శీవారు కలవై వెళ్ళాలనుకుంటున్నారేమో అనుకున్నారు. ఈవిధంగా తమ అవతార విరమణ సమయంలో స్వామి తమ జన్మకారకులయిన తమ అమ్మగారిని, పునర్జన్మ కారకులయిన గురు పరమ గురువులను స్మరించుకొన్నారు. స్వామిని మనకు ప్రసాదించిన వారు మనందరకూ నిరంతరమూ స్మరణీయులు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

శబ్దార్థములరీతి

 శబ్దార్థములరీతి శంకరాంబికలిట్లు

అర్ధనారీశ్వరాకృతిని దాల్చి

మమ్మేల వచ్చిరి మమతానుబంధమ్ము

ముప్పరిగొన్నట్లు ముదముమీర

తల్లియైతానంత తనయుల పోషించు

జనకుడై తానంత సంస్క రించు

భువనాల భయమంత పోగట్టు కళలోన

నైపుణ్యమున్నట్టి నిపుణమతులు కాలకంఠుడతడు కాపాడు జగమెల్ల

కామాక్షి మాతయై కరుణజూచు

ఆ.వె.భక్త జనులకెపుడు ప్రాపుగా నుండగా

భయము వీడి మనము బ్రతుక వచ్చు

మాయ తెరను ద్రుంచ మనలోన కలరయ్య

వెదికి చూడ నీకు వేద్యమగును

(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)

పృధ్వీలింగం( కాంచీపురం)🙏

 https://www.facebook.com/100043481421388/posts/pfbid02K3o6EiCJjy9k2UAhFcZGjUWw7A7LDT7BHgR4jKv5B6JBm3wsG7u7ma5QsaRh8cxSl/

🙏ఏకామ్రేశ్వరుడు-- 

పృధ్వీలింగం( కాంచీపురం)🙏


🙏🌹🙏🌹🙏🌹


పంచభూతలింగాలలోని "పృధ్వీలింగం"గా పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రం కాంచీపురంలోని "ఏకామ్రేశ్వరుని" దేవాలయం. 


దక్షిణభారతదేశంలోని అతి పురాతనమయిన పట్టణాల లో "కంచి" ఒకటి.చెంగల్పట్టు నుండి అరక్కోణంకు  ఉన్న రైలుమార్గంమధ్యలో ఈ పట్టణం ఉంది. తిరుపతి నుంచి కంచి 110 కి.మీ దూరంలో ఉంది.

              శ్రీ చక్రస్వరూపిణి అయిన దేవిని ఉపాసించేందుకు కంచిలోని "శ్రీకామాక్షిదేవి" ఆలయం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.దాదాపు వంద దేవాలయాలతో స్వర్ణనగరంలా విలసిల్లే కాంచీపురం వైష్ణవులకూ,శైవుల కూ ఆరాధ్య మైనది. బ్రహ్మ యజ్ణంచేసి "వరదరాజ" రూపంలో విష్ణువును వెలయింపజేసిన తపోభూమి ఇది.


ఇక్కడనే పార్వతిదేవి తన భర్త అయిన పరమేశ్వరుడు మామిడిచెట్టు రూపంలో వెలిసినట్లు భావించి సేవించిం దని ప్రతీతి. ఆచోటనే "ఏకామ్రేశ్వర దేవాలయం" ఉంది. ఇది కంచిలోని అన్ని ఆలయాలకన్నావిశాలమైనది,  ప్రాచీనమైనది.ఇక్కడ గొపురాలు,ప్రాకారాలు స్థంభాలు అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. 

 

                       శివ రూపంలో వెలిసిన ఇక్కడి మామిడిచెట్టు 3500 సంవత్సరాల నాటిదని చెబుతారు. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం. ప్రస్తుతం ఈ మామిడివృక్షం యొక్క  కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.


స్థలపురాణం.....

పార్వతిదేవి శివునికన్నులు మూయడం, అందువల్ల  జరిగిన పరిణామాలు వలన పార్వతిదేవి తపస్సుకు బయలుదేరడం , ముందుగా కాశిలో తపస్సు చేయడం, అక్కడనుంచి కంచివచ్చి మామిడి చెట్టుక్రింద సైకిత లింగంచేసి పూజలు చేస్తూ ఉండటం, పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం, తత్ఫలితంగా శివుని జటాఝూటం నుండి గంగానది పోంగడం, పార్వతిదేవి ఇసుకతో చేసిన లింగం కోట్టుకునిపొకుండా ఆలింగనం చేస్కోవడం, శివుడు సంతొషించి అనుగ్రహించడం,  అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అర్దనారీశ్వరులుగా ఏకమవడం అందరికీ తెలిసినదే కదా! అందువలన ప్రస్తావించలేదు.


        ఇక్కడి ఏకామ్రేశ్వరలింగం "పృధ్వీలింగం" కనుక ఇక్కడి మట్టికూడా చాలా గొప్పదంటారు. ఈ క్షేత్రంలో చేసిన మంచిపని ఏదయినావెంటనే  ఫలిస్తుందనీ,అది నానాటికీ పెరుగుతుందని కూడా అంటారు.


 కంచిలో ఉండటానికి వసతికి, భోజనానికి ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ గుడికి అందుబాటులోనే ఉంటాయి.


🙏🌹🙏🌹🙏🙏

తెలుసుకోవసిన సత్యలు.

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸


_*జీవిత పయనంలో తెలుసుకోవసిన అక్షర సత్యలు.*_ 


1. అజ్ఞానం : - అంటే ఏమిటి ?


నన్ను నేను తెలియక విషయాదులయందు ప్రవర్తించుట, శరీరమును సుఖపెడితే వచ్చే ఆనందము సత్యమని, ఇంద్రియాలు, మనసు వీటివల్ల కలిగే సుఖదుఃఖ అనుభవాలే సత్యమని, ఇవి లేకపోతే నేను లేను అనుకొనుటే అజ్ఞానము.


2. జ్ఞానము :- అంటే ఏమిటి ?


నేను దేహమును తెలుసుకొను వాడను కాని నేను దేహమును కాను. నేను ఆత్మ స్వరూపుడను, నేను మనసును తెలుసుకొనువాడను కాని మనసు యొక్క అనుభవములు నావి కావు. నేను మనసును కాను. నేను ఆత్మస్వరూపుడను. నేను ప్రకాశరూపుడను. ప్రజ్ఞా స్వరూపుడను. ఈ ప్రజ్ఞయే పిపిలికాది బ్రహ్మపర్యంతము 'నేను' గా ప్రకాశింప బడుతున్నదని తెలుసుకొనటయే జ్ఞానము.


3. విజ్ఞానము :- అంటే ఏమిటి ?


ఇట్లు తెలిసిన జ్ఞానమును తనకు అన్వయించుకొని, తన స్వరూపమే జ్ఞానమని, తక్కినదంతయు అన్యముగా నిరశించి, జ్ఞానమే తానైన స్థితి విజ్ఞానము. 


4. సుజ్ఞానము :- అంటే ఏమిటి ?


పైన చెప్పిన అనుభవములకు కారణము ఎఱుక అనియు. (ఎఱుకన్నా, జ్ఞానమన్నా ఒక్కటే). ఈ ఎఱుకే జీవుడి అజ్ఞానమును, ఈశ్వరుడిగా జ్ఞానస్థితినీ, పరబ్రహ్మగా మౌనస్థితిని పొందుతున్నదనియూ, కాలప్రభావమున మరలా ఎఱుక సంకల్పించి, జీవేశ్వర జగత్తుగా మారవచ్చుననియూ, త్రిగుణముల యొక్క సామ్యావస్థే పరబ్రహ్మమనియు, త్రిగుణముల యొక్క వ్యవహారమే సృష్టి అనియూ, ఇది కాలచక్రముగా అనేక బ్రహ్మాండములను పరిపోషించుచున్నదనియూ ఎరిగి, త్రిగుణములను నిరశించి, ఎరిగే ఎఱుకను వీడి, ఎఱుకను నిరశించి బయలగుటే సుజ్ఞానము...

.

.

.

అర్థం పురుషార్థాల్లో ఉత్తమమైందని 

పంచతంత్ర వాక్యం. 


ధర్మమార్గంలో కలిగిన అర్థమే పురుషార్థంగా గ్రహింపదగింది. 


ఒక్కొక్క నీటిబొట్టు పడుతుంటే క్రమంగా కుండ నిండిపోతుంది. అలాగే ధనం కూడా క్షణం క్షణం కణకణం సాధించుకోవాలి. 


ఆత్రంగా నీటితో నింపబోతే కుండవిచ్చిపోవచ్చు. నీరు నేలపాలు కావచ్చు. ధనార్జన విషయంలో ఒక క్రమపద్ధతి అవలంబించాలని విజ్ఞులు చెబుతారు.


డబ్బుంటే చాలు కానిదేదీలేదన్న ఆలోచన నేడు చాలామందిలో ప్రబలంగా ఉంది. సంపాదనకు అధర్మమార్గం తొక్కడమూ సాధారణమైంది. ద్రవ్యం ధర్మార్జితం కావాలన్నారు పెద్దలు. అధర్మ మార్గాల్లో సంపాదించి విశేషంగా దానాలు చేస్తున్న ఎందరినో లోకం కొనియాడుతుంటుంది. వారు ఏ రకంగా ఆర్జించారన్నది పట్టించుకోదు. దానం చేసే ధనం న్యాయమార్గంలో సంపాదించినదై ఉండాలి.


ఒక ఊళ్లో పేద పండితుడు యాచకవృత్తిలో ఉంటూ ఓ ఇంటికి భోజనానికి వెళ్లాడు. ఉత్తమురాలైన ఇల్లాలు భోజనం పెట్టింది, చేతులు కడుక్కోవటానికి వెండి చెంబుతో నీళ్లిచ్చింది. పండితుడు ఇంటికి వచ్చేటప్పుడు గృహిణి ఇచ్చిన వస్తువులతో పాటు వెండిచెంబు కూడా సంచిలో చేరింది. ఆమె గమనించలేదు. ఇంటికి వచ్చాక సంచి తెరిచి చూసి అతడు ఖిన్నుడయ్యాడు. తనవల్ల ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఎంత ఆలోచించినా అలాంటి దుర్బుద్ధి ఎలా కలిగిందో అర్థంకాలేదు. తానెలా వెండిచెంబు సంగ్రహించాడో తెలియలేదు. ఆతిథ్యం ఇచ్చిన ఇంటికి వెళ్ళి, సిగ్గుపడుతూ- తన అపరాధం మన్నించమని వేడుకున్నాడు. వెళ్లిపోతూ 'తల్లీ... నీ భర్త ఏం చేస్తుంటారు' అని అడిగాడు. ఆ గృహిణి దుఃఖిస్తూ. తన భర్త దారి దోపిడులు చేసి సంపాదిస్తున్నాడని ఇదంతా పాపమని చెప్పినా వినడం లేదని, ఆ పాపం పోవడంకోసం తాను దాన ధర్మాలవంటి సత్కార్యాలు చేస్తున్నానని పలికింది. అప్పుడా పండితుడు- అన్యాయార్జితమైన విత్తంతో చేసిన దానధర్మాలుగాని, అన్నప్రసాదనంగాని స్వీకరించరాదని శాస్త్రాలు చెబుతున్నవనే విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. సంపాదించిన ధనం అన్యాయార్జితమైతే సత్ఫలితాలను ఇవ్వదు సరికదా, తప్పుడు ఆలోచనలు కలిగిస్తుంది.


తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం. సోదరుడినుంచి వచ్చినది అధమం. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమని శాస్త్రవచనం. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశపడకూడదు.


సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు. ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు. ధర్మం, అగ్ని, రాజు, దొంగ- ఈ నలుగురూ ధనానికి దాయాదులు. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు. అంటే- ధర్మంలేనివాడి ధనం అగ్నిపాలో, రాజుపాలో, దొంగలపాలో అవుతుందని భావం...

.

మనిషి జీవిస్తున్నాడు 

కానీ జీవించడం తెలియదు


మనిషి పని చేస్తున్నాడు కానీ 

ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని తెలియదు


అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన గురువుగా స్వీకరించి తన తక్షణ కర్తవ్యమేమిటో తెలుపమని వేడుకున్నాడు.


కార్పణ్యదోషో పహతస్వభావః

పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః 

యచ్ర్ఛేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే

శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌


‘‘నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు. ఆందోళన, పిరికితనం నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణి. నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దాన్ని ఉపదేశించు’’ అని ప్రార్థించాడు. 


జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే, ప్రామాణిక పరంపరకు చెందిన ఆచార్యుణ్ణి ప్రతి ఒక్కరూ తమ ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించవలసిన ఆవశ్యకతను పై సందర్భం సూచిస్తుంది. అటువంటి ఆచార్యుడు కచ్చితంగా విశుద్ధ కృష్ణ భక్తుడై ఉండాలి.


భగవద్గీత విన్న అర్జునుడు దృఢ నిశ్చయుడై, మనస్సులో ఉప్పొంగిన ఉత్సాహంతో... ధనుస్సు చేతపట్టి నిలచి, వీరోచితంగా పోరాడాడు. విజయాన్ని సాధించాడు. 


అర్జునుణ్ణి తన కర్తవ్యం వైపు నడిపించేలా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినదేమిటి? 


భగవద్గీతలో శ్రీకృష్ణుడు అస్త్ర శస్త్రాల గురించి గానీ, యుద్ధ నైపుణ్యాల గురించి గానీ ప్రస్తావించలేదు. మన నైపుణ్యాలు, నేర్పరితనం లాంటివేవీ... మన జీవితంలో ఎదురయ్యే ఆత్రుత, ఆవేదనల నుంచి మనల్ని కచ్చితంగా రక్షించగలవని చెప్పలేమనడానికి ఇదే నిదర్శనం. అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించింది... జీవిత సత్యాల గురించి. తద్వారా, ఉన్నత జీవన విధానాల పట్ల అర్జునునికి ఉన్న అపోహలను కృష్ణుడు మార్చేశాడు.


ఈ దేహం మనం కాదు, మనమంతా ఆత్మ స్వరూపులం అంటూ మానవ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో జీవుని నిజమైన స్వరూపాన్ని గురించి వివరించాడు. సమస్త జీవులు ఆధ్యాత్మిక స్వరూపాలని, అయితే ప్రస్తుతం ఈ భౌతిక దేహంలో బంధితులై జీవిస్తున్నారన్న సత్యాన్ని బోధించాడు. 

.

పకృతి జీవజాతితో సమానంగా 

మానవజాతి మనగడ సాగిస్తుంది 


అయితే మానవులు 

కట్టుబాట్లు పెట్టుకున్నారు పేరుకు మాత్రమే 


కానీ 


అన్ని జీవుల మాదిరిగానే మానవుడు బ్రతకాలని కోరుకుంటున్నారు 


మనిషి కట్టుబాట్లలో ఉన్న 

మనసు మాత్రం పకృతి పరంగానే సంచరిస్తుంది


మానవ జాతిలో 

ఎవరిని నమ్మకూడదు 

ఎవరిని ప్రేమించకూడదు 

ఎవరిపై నమ్మకాలు పెట్టుకోకూడదు ఎక్కువ

ఎందుకంటే అందరూ మోసం చేసేవారు అందరూ వదిలి వెళ్ళిపోయేవారు

.

కన్నతల్లి అయినా ఎవరైనా మోసం చేయవచ్చు 

కన్న తండ్రి అయిన ఎవరైనా మోసం చేయవచ్చు 

అన్నదమ్ములైన మోసం చేయవచ్చు

అక్క చెల్లెలు అయినా మోసం చేయవచ్చు

భార్య కూడా మోసం చేయవచ్చు

భర్త కూడా మోసం చేయవచ్చు

బిడ్డలు కూడా మోసం చేయవచ్చు

కొడుకులు కూడా మోసం చేయవచ్చు

.

అందరు మోసం చేస్తారు ఏదో ఒకనాడు తప్పకుండా

అందరు మోసపోతారు ఏదో ఒకనాడు తప్పకుండా


అందుకే ఎవరి మీద ఎక్కువ అంచనాలు వేయకూడదు

ఎక్కువ ప్రేమ పెట్టుకోకూడదు

ఎవరిపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకోకూడదు

ఎవరిని కంట్రోల్ లో పెట్టాలని చూడకూడదు


అందరూ ఇలా ఉంటే బాగుండు అని అనుకోకూడదు

ఎవరు మీరు అనుకున్నట్లు ఉండరు ఉండరు ఉండరు ఉండలేరు ఇది రాసి పెట్టుకోండి.


సర్వేజనాసుఖినోభవంతు.


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

కృష్ణుడి గురించి చెప్తుంటే

 #Karthikeya2 సినిమా అద్భుతమే కాదు నాకైతే మహా అద్భుతమే అని చెప్పొచ్చు👌👌👌🚩


మన చరిత్రని స్పృశిస్తూ ఎన్నో అద్భుతమైన కథలు చెప్పొచ్చు అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో... ఇప్పటికి కుదిరింది ఏదో డైరెక్టర్ #Chandumondeti గారి పుణ్యమా అని... ఆ దిక్కుమాలిన ప్రేమకథలు, వెంటపడడం, ఆమె/అతడు లేకపోతే జీవితమే వ్యర్థం అన్నట్టు దిక్కుమాలిన కథలు చూపించి యువతను పెడదోవ పట్టించే సినిమాలే అన్నీ.


మ్యూజిక్ డైరెక్టర్ #kaalabhairava భలే చేశారు సంగీతం. ఆద్యంతం అద్భుతమైన సంగీత ప్రవాహంలా సాగింది. 


#AnupamKher కనిపించే 10 నిమిషాలు, కృష్ణుడి గురించి చెప్తుంటే భక్తితో, భావోద్వేగంతో మనసు కదిలిపోతుంది ఒక్కసారిగా....అసలు కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు అనే అనుపమ్ ఖేర్ గారి సందేశం సినిమాకి హైలెట్.


🚩గీతతో కోట్లమందికి దారిచూపించిన అతనికన్నా గురువెవ్వరు❓


🚩రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు❓


🚩నమ్మినవారి కోసం ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు❓


🚩యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు❓


🚩చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజీస్ట్ ఎవరు❓


🚩వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు❓


🚩నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు❓


🚩ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు❓


🚩 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా గొప్ప దార్శనికుడు ఎవరు❓


🚩కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజేవ్వరు❓


🚩హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న అతన్ని మించిన డైమటాలజిస్ట్ ఎవరు❓


🚩అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన డైనటిక్ ఇంజనీర్ ఎవరు❓


🚩మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా గొప్ప వీరాగి ఎవరు❓


🚩అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి🚩


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


చిన్న అంశంతో ముడిపెట్టి కథని మలిచిన తీరు అద్భుతం. #ChandooMondeti గారిని అభినందించాలి. మన ఋషులు అత్యంత శక్తివంతమైన దార్శనికులు.


ఇలాంటివి మరిన్ని రావాలనే సమయం తీసుకుని ఇలా రాస్తున్నాను. ప్రోత్సహిస్తేనే మంచి కథలు వస్తాయి, తద్వారా కొంతైనా చెడు ప్రభావం తగ్గుతుంది అని ఏదో ఆశ


#జయహోసనాతనధర్మం🚩