20, సెప్టెంబర్ 2022, మంగళవారం

కృష్ణుడి గురించి చెప్తుంటే

 #Karthikeya2 సినిమా అద్భుతమే కాదు నాకైతే మహా అద్భుతమే అని చెప్పొచ్చు👌👌👌🚩


మన చరిత్రని స్పృశిస్తూ ఎన్నో అద్భుతమైన కథలు చెప్పొచ్చు అని మొత్తుకుంటూనే ఉన్నాం ఎప్పటినుంచో... ఇప్పటికి కుదిరింది ఏదో డైరెక్టర్ #Chandumondeti గారి పుణ్యమా అని... ఆ దిక్కుమాలిన ప్రేమకథలు, వెంటపడడం, ఆమె/అతడు లేకపోతే జీవితమే వ్యర్థం అన్నట్టు దిక్కుమాలిన కథలు చూపించి యువతను పెడదోవ పట్టించే సినిమాలే అన్నీ.


మ్యూజిక్ డైరెక్టర్ #kaalabhairava భలే చేశారు సంగీతం. ఆద్యంతం అద్భుతమైన సంగీత ప్రవాహంలా సాగింది. 


#AnupamKher కనిపించే 10 నిమిషాలు, కృష్ణుడి గురించి చెప్తుంటే భక్తితో, భావోద్వేగంతో మనసు కదిలిపోతుంది ఒక్కసారిగా....అసలు కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు అనే అనుపమ్ ఖేర్ గారి సందేశం సినిమాకి హైలెట్.


🚩గీతతో కోట్లమందికి దారిచూపించిన అతనికన్నా గురువెవ్వరు❓


🚩రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు❓


🚩నమ్మినవారి కోసం ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు❓


🚩యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు❓


🚩చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజీస్ట్ ఎవరు❓


🚩వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు❓


🚩నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు❓


🚩ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు❓


🚩 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా గొప్ప దార్శనికుడు ఎవరు❓


🚩కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజేవ్వరు❓


🚩హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న అతన్ని మించిన డైమటాలజిస్ట్ ఎవరు❓


🚩అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన డైనటిక్ ఇంజనీర్ ఎవరు❓


🚩మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా గొప్ప వీరాగి ఎవరు❓


🚩అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి🚩


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


చిన్న అంశంతో ముడిపెట్టి కథని మలిచిన తీరు అద్భుతం. #ChandooMondeti గారిని అభినందించాలి. మన ఋషులు అత్యంత శక్తివంతమైన దార్శనికులు.


ఇలాంటివి మరిన్ని రావాలనే సమయం తీసుకుని ఇలా రాస్తున్నాను. ప్రోత్సహిస్తేనే మంచి కథలు వస్తాయి, తద్వారా కొంతైనా చెడు ప్రభావం తగ్గుతుంది అని ఏదో ఆశ


#జయహోసనాతనధర్మం🚩

కామెంట్‌లు లేవు: