శబ్దార్థములరీతి శంకరాంబికలిట్లు
అర్ధనారీశ్వరాకృతిని దాల్చి
మమ్మేల వచ్చిరి మమతానుబంధమ్ము
ముప్పరిగొన్నట్లు ముదముమీర
తల్లియైతానంత తనయుల పోషించు
జనకుడై తానంత సంస్క రించు
భువనాల భయమంత పోగట్టు కళలోన
నైపుణ్యమున్నట్టి నిపుణమతులు కాలకంఠుడతడు కాపాడు జగమెల్ల
కామాక్షి మాతయై కరుణజూచు
ఆ.వె.భక్త జనులకెపుడు ప్రాపుగా నుండగా
భయము వీడి మనము బ్రతుక వచ్చు
మాయ తెరను ద్రుంచ మనలోన కలరయ్య
వెదికి చూడ నీకు వేద్యమగును
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి