29, మార్చి 2025, శనివారం

శనివారం🍁* *🌹29, మార్చి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🍁శనివారం🍁*

*🌹29, మార్చి, 2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః*

*ఫాల్గుణ మాసం -  కృష్ణపక్షం*


*తిథి       : అమావాస్య* సా 04.27 వరకు ఉపరి *చైత్ర మాసారంభః*

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* రా 07.26 వరకు ఉపరి *రేవతి*


*యోగం  : బ్రహ్మ* రా 10.04 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం   : చతుష్పాద* ఉ 06.13 *నాగ* సా 04.27 ఉపరి *కింస్తుఘ్న*


 *సాధారణ శుభ సమయాలు:* 

          *- ఈరోజు లేవు -*

అమృత కాలం  : *మ 03.11 - 04.36*

అభిజిత్ కాలం  : *ప 11.48 - 12.37*


*వర్జ్యం              : ఉ 06.40 - 08.05*

*దుర్ముహూర్తం  : ఉ 06.05 - 07.43*

*రాహు కాలం   : ఉ 09.08 - 10.40*

గుళికకాళం      : *ఉ 06.05 - 07.37*

యమగండం    : *మ 01.44 - 03.16*

సూర్యరాశి : *మీనం* 

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.05* 

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.05 - 08.32*

సంగవ కాలం         :      *08.32 - 10.59*

మధ్యాహ్న కాలం    :      *10.59 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.53*


*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ అమావాస్య*

సాయంకాలం        :  *సా 03.53 - 06.20*

ప్రదోష కాలం         :  *సా 06.20 - 08.41*

రాత్రి కాలం             :  *రా 08.41 - 11.48*

నిశీధి కాలం          :*రా 11.48 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.30 - 05.17*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వరస్వామి🙏*

 *🔯ద్వాదశనామ స్తోత్రం🔯*


*ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే* 

*శ్రీ వేంకటేశ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||*


*🙏ఓం నమో వేంకటేశాయ🙏*

******************************


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*

*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*

*క్రోధా ద్దశానన పురీ దహన ప్రకారిన్*

*శ్రీరామదూత సతతం హనుమన్ నమస్తే||*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో

 *తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.*

-ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.

-ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.

-ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.

-ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.

-ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.

-ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.

-ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.

-ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.

పద్యం

 🚩🚩మా గురువు గారు మాకు చెప్పిన పద్యం.!

#ఎన్ని కష్టాలు ఆయినా నవ్వు తో ఓర్చు కోవాలి .. పాండవు ల వలే

.

♦️"రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్

పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్

గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్

లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !--🖤

(రాఘవ శతకము..)

🚩🚩శాప భయమున సముద్రమందు గట్టబడిన మేడలో

 జాగ్రత్తగా నుండిననూ పరీక్షిత్తుపాము కాటుచే మరణించినట్లు కారణభూతములైన కర్మములు పూనుకొనిననే గాని ఎన్ని ప్రయత్నములు చేసిననూ కావాలినవి కాకమానవు. 

మనము ఎక్కడ చావవలెనని వ్రాసి వుండిన కర్మ మనలను 

అక్కడికి కొనిపోవును.

♎️♎️♎️♎️♎️♎️

⚜ శ్రీ వరక్కల్ దేవి ఆలయం

 🕉 మన గుడి : నెం 1064


⚜ కేరళ  :  కోజికోడ్


⚜ శ్రీ వరక్కల్ దేవి ఆలయం



💠 కోజికోడ్‌లోని వరక్కల్ దేవి ఆలయం కేరళ పురాణ స్థాపకుడు శ్రీ పరశురామ నిర్మించిన 108వ మరియు చివరి దేవి ఆలయంగా పరిగణించబడుతుంది.  

దేవత కనిపించడానికి పరశురాముడు ఈ ప్రాంతాన్ని దున్నాడని నమ్ముతారు. 



💠 పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో  పరశురాముడు తపస్సు చేసిన తరువాత, దుర్గాదేవి ప్రత్యక్షమై, భక్తులను ఆశీర్వదించడానికి నేను చోతి నక్షత్రం రోజున మరియు వావు (పౌర్ణమి రోజు) తీర్థరూపంలో ఉంటానని చెప్పింది.  

దీనిని అనుసరించి పరశురామన్ ఆలయాన్ని ప్రతిష్టించాడు  మరియు ఈ ఆలయాన్ని సృష్టించడం అతనికి గొప్ప సంతృప్తిని ఇచ్చింది. 


💠 ఆలయ మూలాలు త్రేతాయుగం నాటివి, ఇది ఈ ప్రాంతంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటిగా నిలిచింది. 

సెప్టెంబర్‌లో జరిగే నవరాత్రి పండుగ మరియు వావు బలి ఆచారం ఇక్కడ ముఖ్యమైన సంఘటనలు. 

తులం మరియు కర్కిడకం అమావాస్య రోజుల్లో జరిగే వావు బలి సముద్రతీరంలో పితృకర్మలు చేసే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. విశేషమేమిటంటే, ఈ ఆచారాల సమయంలో సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, వేడుకలను సులభతరం చేస్తుంది.


💠 వరక్కల్ దేవి ఆలయం దక్షిణ తీర్థయాత్రలో యాత్రికులకు మరియు శబరిమల యాత్రలో అయ్యప్ప భక్తులకు కూడా ఒక ముఖ్యమైన విడిది .


💠 ఆలయ ప్రారంభ కాలంలో సరైన రోజువారీ ఆచారాలు ఉండేవి.  అనంతరం నిధుల కొరత లేదా ఇతర కారణాలతో కర్మకాండలకు సెలవు ఇచ్చారు.  

ఆలయ నిర్లక్ష్యానికి ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

ఇది విన్న అప్పటి పాలకులు పెరుమాళ్లోర్లు రంగప్రవేశం చేసి నిత్యకృత్యాలు తీర్చుకున్నారు.  వెంటనే ఆ మందిరం మహాక్షేత్రం (పెద్ద దేవాలయం) స్థానంలోకి దూసుకెళ్లింది.  తరువాత, జామోరిన్లు ఆలయ బాధ్యతలు స్వీకరించారు, పునరుద్ధరించారు మరియు ప్రస్తుత స్థితికి నిర్మాణాన్ని సవరించారు.  

నేటికీ ఆలయాన్ని జామోరిన్ కుటుంబం నిర్వహిస్తోంది.


💠 ఈ ఆలయంలో గణపతి, దక్షిణామూర్తి మరియు శ్రీ అయ్యప్పన్ ఉప దేవతలు కూడా ఉన్నారు.


💠 ఈ ఆలయం ఒకప్పుడు మలబార్ యొక్క కళ మరియు సాంస్కృతిక కార్యక్రమాల ప్రచార కేంద్రంగా ఉంది.


💠 ఆలయ ప్రధాన పండుగ వావు బలి, వర్క్కల్ బీచ్‌లో బలి తర్పణం చేయడానికి భక్తులు తులం వావు కోసం పెద్ద సంఖ్యలో గుమిగూడుతారు.

 

🔅 నవరాత్రి: 

ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి.  మహానివేదం ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఆచారం, పుష్పాంజలి, పడివిలకు, నైవిలక్కు, త్రికాలపూజ, స్వయంవర పుష్పాంజలి, సంతాన గోపాల పూజ, గణపతి హోమం, తిలహోమం మరియు ఇతర నైవేద్యాలు.


💠 నవరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.  

తులం (అక్టోబర్/నవంబర్) నెలలో పౌర్ణమి రోజున వావు బలి (వెళ్లిపోయిన ఆత్మలకు సంబంధించిన ఆచారం) నిర్వహిస్తారు.  

మునుపటి రోజు ఉపవాసం ఉన్న వేలాది మంది ప్రజలు వరక్కల్ బీచ్‌లో సమావేశమవుతారు మరియు ఆలయ పూజారులు తన ప్రియమైన మరియు సమీపంలోని ఆత్మల కోసం వావు బలి చేసే ప్రతి వ్యక్తికి వేడుకలను నిర్వహిస్తారు.  

వావు బలి నిష్క్రమించిన ఆత్మలను సంతృప్తిపరుస్తుందని మరియు వారు జీవించి ఉన్న ప్రియమైనవారికి మరియు సమీపంలోని వారికి రక్షణగా నిలుస్తారని భావన.


💠 ఆలయం, ప్రతిరోజూ ఉదయం 05:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు సాయంత్రం 05:30 నుండి రాత్రి 08:00 వరకు తెరిచి ఉంటుంది, ఇది కేరళ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణ సౌందర్యం మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మిళితం చేస్తూ గౌరవప్రదమైన ప్రదేశంగా కొనసాగుతుంది. .



💠 కోజికోడ్ రైల్వే స్టేషన్, సుమారు 6 కి.మీ దూరంలో ఉంది.



 రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -192*

 తిరుమల సర్వస్వం -192*

**శ్రీవారి ఆభరణాలు -4*

5. *స్వర్ణ పీతాంబరాలు:* 


 ఇరవై కిలోల బరువైన స్వర్ణాంబరాన్ని 2009వ సంవత్సరంలో అప్పటి తి.తి.దే. బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మూడు కోట్లు వెచ్చించి చేయించారు. మూలవిరాట్టుకు నాభి క్రింద భాగం నుంచి ఈ పీతాంబరం ధరింప చేస్తారు. తి.తి.దే. వారు ఇరవై కిలోగ్రాముల మరో స్వర్ణ పీతాంబరం అంతకుముందే తయారు చేయించారు. ఇది రెండవది.


 *మరికొన్ని ముఖ్యాభరణాలు* 


 ఇవే కాకుండా శ్రీవారి మూలమూర్తిని పాదాల నుండి శిరస్సు వరకు అలంకరించే మరికొన్ని ముఖ్య ఆభరణాల జాబితా, అదే క్రమంలో, ఇలా ఉంది:


1. శ్రీవారి పాదాల క్రిందనున్న బంగారు పద్మపీఠాన్ని కప్పుతూ ఉన్న నగిషీలు చెక్కిన బంగారు రేకు.


2. కుడి ఎడమ పాదాలకు రెండు బంగారు కవచాలు.


3. ఏడు కిలోల బరువైన బంగారు సూర్యకఠారి (ఖడ్గం).


4. వైకుంఠహస్తానికి బంగారుకవచం.


5. వైకుంఠ హస్తానికి, కటిహస్తానికి చెరొక నాగాభరణం. 

(వీటిని శ్రీమద్రామానుజుల వారు తయారు చేయించారు.)


6. వైకుంఠ హస్తానికి నాగాభరణం క్రింద ఉండే కడియం.


7. వైకుంఠహస్తాన్ని అలంకరించే రత్నాల దస్తుబందు.


8. పెన్నా సిమెంట్స్ వారు ఐదుకోట్ల వ్యయంతో చేయించిన 'వల కటి, వరద హస్తాలు'.


9. 'కమ్మరపట్టి' అనబడే బంగారు వడ్డాణం.


10. దశావతార వడ్డాణం. 

       బంగారు గంటల మొలత్రాడు.


11. వక్షస్థల అమ్మవార్లకు రత్నాలతో కూడిన బంగారు కంటె.


12. దశావతార హారం.


13. అష్టోత్తర శతనామ హారం.


14. నాలుగు పేటలతో కూడిన బంగారు మొహరీల గొలుసు.


15. ఆరు ప్రోగుల బంగారు యజ్ఞోపవీతం.


16. బంగారు పులిగోరు.


17. రెండు భుజకీర్తులు.


18. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన శంఖం.


19. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన సుదర్శనచక్రం.


20. మూడు కిలోల బరువున్న రవ్వల కర్ణాభరణాలు.


21. రత్నాలు పొదిగిన కుడి, ఎడమ బంగారు బావళీలు.

చంద్రవంక కంటి.


22. వజ్ర ఖచితమైన అశ్వత్థపత్ర హారం (అశ్వత్థపత్ర మనగా రావి ఆకు).


23. భుజదండ భూషణాలు 


24. రెండు పేటల బంగారు గొలుసు.


25. ఐదు కిలోల బరువైన బంగారు గొడుగు.


26. ఇరవై ముత్యాల హారాలు.


27. యాభై కాసుల దండలు


     *ఎన్నో కిరీటాలు...* 


 సకలలోక సార్వభౌముడు, దేవాది దేవుడు అయిన శ్రీనివాసుని మకుటాల గురించి చెప్పుకోవాలంటే ఉద్గ్రంథమే అవుతుంది. 


 *శ్రీవారికి ఏడు ముఖ్యమైన కిరీటాలు ఉన్నాయి -* 


1. మామగారైన ఆకాశరాజుచే బహూకరింప బడ్డ తొమ్మిదిన్నర కిలోల బంగారు కిరీటం. దాదాపు ఐదువేల సంవత్సరాల నాటిదిగా భావించబడే ఈ కిరీటాన్ని *'ఆకాశరాజు కిరీటం'* గా పిలుస్తారు.


2. ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్థంలో అప్పటి దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్త సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆధ్వర్యంలో *గద్వాల మహారాణి చేయించిన వజ్రకిరీటం.*


3. 2009వ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి గారు సమర్పించిన, 42 కోట్ల రూపాయల విలువగల వజ్రాల కిరీటం.


4. వేంకటేశ్వర హెచరీస్ సంస్థ సమర్పించిన 13 కిలోల కిరీటం.


5. గోయెంకా కుటుంబం కానుకగా ఇచ్చిన 10 కిలోల బంగారు కిరీటం.


6. 1945 సంవత్సరం లో తి.తి.దే. వారు చేయించిన వజ్రకిరీటం.


7. 1986వ సంవత్సరంలో, అప్పుడే 5 కోట్ల రూపాయలు వెచ్చించి తి.తి.దే. వారు చేయించిన మరో వజ్రకిరీటం.


7. ఇవే కాకుండా అరుదుగా వాడే లేదా అసలు ఉపయోగించని కిరీటాలెన్నో కూడా శ్రీవారి చెంత ఉన్నాయి.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

15-13-గీతా మకరందము

 15-13-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - భూమియందు ప్రవేశించి సస్యాదుల నభివృద్ధిపఱచునది తానే యని భగవానుడు పలుకుచున్నారు -


గామావిశ్య చ భూతాని ధారయామ్యహ మోజసా | 

పుష్ణామి చౌషధీస్సర్వాః

సోమో భూత్వా రసాత్మకః || 


తాత్పర్యము:- మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్త ప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యము లన్నింటిని పోషించుచున్నాను. 


వ్యాఖ్య:- 'ధారయామి ఓజసా’ - అని చెప్పుటవలన జగత్తునందలి సమస్త పదార్థములకును, ప్రాణికోట్లకును శక్తిని, సామర్థ్యమును, బలమును ఒసంగునది ఆ పరాత్పరుడే యని తెలియుచున్నది. పైవాక్యమువలన శ్రీకృష్ణమూర్తి వసుదేవునకు జన్మించిన ఒకానొక చిన్నఉపాధి మాత్రమే కాదనియు, విశ్వవ్యాపి, జగద్భర్తకూడ యనియు స్పష్టమగుచున్నది. మఱియు సస్యములను అభివృద్ధిపఱచునది తానేయని చెప్పుటచే జీవులు భుజించు ఆహారము సాక్షాత్ పరమాత్మవలననే సంభవించుచున్నదని తెలియుచున్నది. కావున, ఆహారమును భుజించునపుడు ఈ అన్నమెవరివలన మనకు వచ్చినది? అని ఆలోచించి అన్నస్రష్ట, అన్నదాత యగు ఆ సర్వేశ్వరునకు సర్వులును కృతజ్ఞత చూపవలసియున్నారు. మనుజుడు తాను ఆహారమును భుజించుటకుముందు అద్దానిని ఆ దేవదేవునకు సమర్పించి తదుపరి దైవభావనతో దానిని భుజించవలెను. సస్యములను భగవానుడు పోషించనిచో జనులకు అన్నము దొఱకదు; సూర్యచంద్రాగ్నులకు ప్రకాశమివ్వనిచో లోకము అంధకారావృతమై యుండును. కాబట్టి ఎన్నియో అనుకూలములుచేసి ప్రాణులను భరించుచున్న ఆ జగద్ధాత్రికి మనుజులు సదా కృతజ్ఞులై వర్తించవలెను. సర్వకాలములందును. వారిని స్మరించుచు, కీర్తించుచు నుండవలెను.


ప్రశ్న:- భగవాను డే యేప్రకారములుగ ప్రజలకు మేలొనర్చుచున్నారు?

ఉత్తరము:- (1) భూమియందు ప్రవేశించి బలముచే సమస్తప్రాణులను భరించుచున్నారు. (2) చంద్రుడయి సస్యములన్నిటిని పోషించుచున్నారు.

ప్రశ్న:- కావున జీవు లేమి చేయవలెను?

ఉత్తరము: - అతనికి కృతజ్ఞులై వర్తించుచు, సంకీర్తన, జప, పూజాదులచే నిరంతర మాతనిని స్మరించుచుండవలెను.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము చతుర్థాశ్వాసము*


*331 వ రోజు*


*అర్జునాదులు కౌరవసేనలతో పోరుట*


భీమ సాత్యకులు అర్జునుడి వద్దకు చేరగానే అలంబసుడు అనే రాజు వారిని చేరుకున్నాడు. సాత్యకి, అలంబసుడు ఘోరంగా చేస్తున్నాడు. ఒకరి విల్లు ఒకరు విరిచారు. కవచాలను చీల్చుకున్నారు. సాత్యకి కోపించి అలంబసుని రధసారధిని, హయములను చంపి ఒక అర్ధచంద్ర బాణంతో అలంబసుని తల తెగనరికాడు. ఇంతలో నీ కుమారులు అందరూ దుశ్శాసనుడిని ముందుంచుకుని సాత్యకిని ఎదుర్కొన్నారు. సాత్యకి దుశ్శాసనుని హయములను చంపి రధము మీదకు దూకబోయాడు. అది చూసి త్రిగర్త సైనికులు అతడిని ఎదుర్కొన్నారు. సాత్యకి వారిని ఎదుర్కొని వెంటనే ఏభై మందిని చంపాడు. అది చూసి మిగిలిన సైనికిలు పారిపోయారు. సాత్యకి శూరసేనదేశాధీశుని వెంబడించాడు. కళింగ సైనికులను నాశనం చేసాడు. అతడి బలపరాక్రమము చూసిన కృష్ణుడు " అర్జునా ! అటు చూడు నీ శిష్యుడు సాత్యకి నీ పేరు నిలబెడుతున్నాడు. ద్రోణుడు అంతటి వాడిని జయించి లోపలకు వచ్చాడు. ధర్మరాజు మీద భక్తి, నీతోటి మైత్రి అతడిని ఇంత వరకు తీసుకు వచ్చింది " అని ప్రశంసించాడు. అర్జునుడు " కృష్ణా ! నేను సాత్యకిని ధర్మరాజుకు రక్షణగా ఉండమన్నాను. నా మాట వినక ఇక్కడకు వచ్చాడు. అక్కడ ధర్మజుని పరిస్థితి ఎలా ఉందో కదా! అతడు ద్రోణుని బారిన పడ్డాడు. ఇక్కడ నేను సైంధవుడిని ఇంకా చంప లేదు. పొద్దు వాలి పోతుంది. సాత్యకి కృపాచార్యుడు, కృతవర్మ మొదలైన యోధులను ఎదిరించి అలసిపోయాడు. భూరిశ్రవసుడు అతడితో తలపడుతున్నాడు. సాత్యకి ఎలా యుద్ధం చేస్తాడో ఏమో ! ద్రోణాచార్యుడు పక్షి కొరకు ఎదురు చూస్తున్న డేగవలె మా అన్నయ్య ధర్మజుని కొరకు ఎదురు చూస్తున్నాడు అని ధర్మజునికి ఎందుకు అర్ధం కాలేదు " అని మనసులో పరితపిస్తున్నాడు. ఇంతలో సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు సాత్యకిపై విరుచుకు పడ్డాడు. ఇరువురి నడుమ పోరు ఘోరమైంది. ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించారు. ఒకరి రధాశ్వములను ఒకరు చంపారు. ఒకరి రధసారధిని ఒకరు చంపుకున్నారు. రధము దిగి నేల మీద కత్తి సాము చేస్తున్నారు. అవి కూడా వదిలి మల్ల యుద్ధము చేయసాగారు. చివరకు భూరిశ్రవసుడిదే పైచేయిగా ఉండటము చూసి కృష్ణుడు చూసి " అర్జునా! ఏమిటి అలాచూస్తున్నావు నీకు సాయంగా వచ్చిన సాత్యకి భూశ్రవసునితో యుద్ధమ చేసి అలసి ఉన్నాడు. సత్వరమే రక్షించు " అన్నాడు. అప్పుడు భూరిశ్రవసుడు సాత్యకిని కింద పడ వేసాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇది న్యాయం కాదు నీకు సాయం చేయడానికి వచ్చిన నీశిష్యుడు ఆపదలో ఉన్నాడు సతరం రక్షించడం నీ కఎర్తవ్యం " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! మల్లయుద్ధం చేసుకుంటున్న ఇరువురి నడుమ నేను బాణ ప్రయోగం చేయడం ధర్మం కాదు అయినా నా మిత్రుడిని నేను రక్షిస్తాను " అన్నాడు. అర్జునుడు అలా అంటుండగా భూశ్రవసుడు సాత్యకిని నేలపై వేసి గొండెలపై కాలు వేసి సాత్యకి తల నరకడానికి కత్తి తీసుకుని చేయి పైకెత్తాడు. అది చూసిన కృష్ణుడు " అర్జునా! ఇక ఆలస్యం చేయకు బాణ ప్రయోగం చెయ్యి " అన్నాడు. అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టి ఒకే ఒక బాణంతో ఎత్తిన భూశ్రవసుడి చేయి నరికాడు. భూరిశ్రవుసుడి చేయి తెగి పడింది వెంటనే భూరిశ్రవడు " అర్జునా ! ఇంతటి అన్యాయానికి పాలు పడతావని అనుకోలేదు. సాత్యకితో యుద్ధం చేస్తున్న నా చేయి నరకడం న్యాయమా, ధర్మమా ! ఇంటటి నీచ రాజ నీతిని నీకు నీరువు ద్రోణుడు నేర్పాడా ! నిన్ను పుట్టించిన ఇంద్రుడు నేర్పాడా ! పాశుపతం అందించిన శివుడు నేర్పాడా! నీ పక్కన కూర్చుని శ్రీకృష్ణుడు ఇది చూసి ఎలా సహించాడు " అన్నాడు. అర్జునుడు ఆ మాటలకు నవ్వి భూరిశ్రవసా! నీవు నాకు నీతులు నేర్పే వాడివా యుద్ధరంగమున యుద్ధం చేస్తున్న వీరులను వారి బంధువులు కాపాడరా ! అలసి పోయి నిరాయుధుడైన సాత్యకిని చంపబూనడం ధర్మమా ! అతడిని నేను రక్షించండం అధర్మమా! మీరంతా కలసి బాలుడైన అభిమన్యుని వధించడం మాత్రం అధర్మమం కాదా! " అన్నాడు. చేయి తెగిన భూరిశ్రవసుడు బాణములను భూమి మీద పరచి వాటిపై కూర్చుని ప్రాయోపవేశం చేసాడు. ఇది చూసి సాత్యకి భీమసేనుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వారిస్తున్నా వినక భూరిశ్రవుసుడి తల నరికి వారించిన వారిని అభిమన్యుని చంపిన వారిని ఇలా చంపడం అధర్మము కాదని సమర్ధించుకున్నాడు " అని సంజయుడు చెప్పగా


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

ఆహర విరుద్ధాలు -

 ఆహర విరుద్ధాలు -


 మనం భుజించే ఆహరం వరసగా 


 1.రసం .


 2.రక్తం .

 

 3.మాంసం .


 4.మేధస్సు (కొవ్వు ) .


 5. ఎముక .


 6. మజ్జా .


 7. వీర్యము. (ఆర్థవము ).


అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.


 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.


 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.


 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.


 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.


 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .


 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .


 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.


 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.


 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.


 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.


 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.


 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.


       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు. 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


             కాళహస్తి వేంకటేశ్వరరావు  


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                     9885030034

ఆశయం

 ఆశయం 


జననమరణ చక్రంలో 

జనియించే పట్టుదల

మనిషి మనసులో రగిలే 

సాధించాలనే ఆశయం!


నిదుర వదిలి నిట్టూర్చి

అనుకున్నది సాధిస్తే

అమరసిద్ధి కలుగును

ఆశయ సాధన జరుగును!


చేసుకున్న కర్మలని చేధించి

మంచిఆశయం మొలకెత్తించి

పట్టుదలనే పణంగాపెట్టి

పరిశ్రమిస్తే కలుగు విజయం!


పదిమందికి పాటుపడుతు

ప్రగతివైపు పయనిస్తే

తరతరాల భవిష్యత్తుకు

తరగని నిధిఐ వెలుగుతుంది!


కలలుకంటు కాలంగడపక

నిర్ధిష్టకాంక్షతో పోరాడు

ప్రతిఫలం నీకే సొంతం

విజయమే నీలోదీపం!


స్వార్ధచింతన కొంతమాని

కోరికలు చంపుకొని

కొత్తమార్గం ఎంచుకొని

సాధించు నీ లక్ష్యం!


ప్రసాదు యంవివి(సాదు)

కల్లూరు, ఖమ్మం జిల్లా

వేదాంత వ్యాసం

 వేదాంత వ్యాసం 

                         మొదటి భాగం 

బ్రహ్మ : 

గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము, సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్‌ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.


పరబ్రహ్మ : 

బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ, అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.

         ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.


అచల పరిపూర్ణ పరబ్రహ్మ : 

శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని, పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.


పరిపూర్ణము : 

పరిపూర్ణము నిర్వికారము. దానినుండి, దానికి సంబంధము లేకనే, ఆనందము అనే స్పందన దానికదే కలిగెను. ఈ ఆనంద స్పందనమే మూలావిద్య. ఈ ప్రథమ స్పందనకు మూలావిద్య కారణము గాని, పరిపూర్ణము కారణము కాదు. జీవ ఈశ్వర జగత్తులు మూడూ మూలా విద్యకారణముగా తోచెను గనుక జీవేశ్వర జగత్తులు మాయా కల్పితములు. లోకములు, లోకేశులు, లోకస్థులు కూడా మాయా కల్పితములే. అవన్నీ భ్రాంతియే. పరిపూర్ణము భ్రాంతి రహితము, త్రిగుణ రహితము, నిర్వికారము, శాశ్వతము, అచలము. ఉన్నదున్నట్లున్నది. పరిపూర్ణమనగా అచల పరిపూర్ణము, అచల బ్రహ్మము. అచల పరిపూర్ణ పరబ్రహ్మము.


ఇహరూపము : 

ఎదురుగా ఇంద్రియ గోచరముగా నున్న దృశ్య జగత్తునకు అంతర్గతమైనది ఇహ రూపము. ఇది మధ్యలోనే వచ్చి, మార్పు చెందుచూ మధ్యలోనే పోయే స్వభావము కలది. ఆది అంతములు, ఉత్పత్తి నాశములు, చావు పుట్టుకలు కలది. ప్రాకృతము, పాంచభౌతికమైనది. మానసిక రూపమును సంతరించుకొన్నది. ఇహ అనగా ఇక్కడి సంగతి, ఇక్కడి సందర్భము, ఇక్కడి సంబంధము కలిగినది. ఇంతగా వర్ణించిన ఇహ రూపము నిజానికి లేదు. లేకనే ఉన్నట్లు కల్పించబడినది. పైగా బాధించేది. ఇంద్రజాలము వంటిది. మిథ్య. మాయా కల్పితము, త్రిగుణాత్మకము, స్వప్నతుల్యము, మేల్కొంటే లేనిది. స్వస్వరూపమందు లేనిది. ఊహామాత్రము. భావనామాత్రము. యత్భావంతద్భవతి. అభావమందు లేనిది. మృతరూపము. తనకు తానే తోచినది. పరజ్ఞానమందు తోచినది ఇహరూపము.


పరరూపము : 

ఈ దృశ్య జగత్తుకు ఆవలనున్నది. ఇహరూపమునకు పరము, అతీతము గనుక పరరూపము అని పేరు. పరరూపుడు ఇహమునకు సాక్షిరూపుడు. ఇక్కడి వ్యవహారము అంతా భావనారూపమని తెలిసి, శరీర లక్షణమునకు, సర్వమునకు ఆధారము, అవస్థా సాక్షిరూపము, మార్పు చేర్పులకు అతీతమైనది. ప్రేరణ రూపమైనది. ధారణా రూపమైనది. కాని అమృత రూపము, జీవేశ్వర జగత్తుల యొక్క అఖండ సారమైనది. స్వతఃసిద్ధమై యున్నది. శాశ్వతము, నిర్వికారము, నిర్వికల్పము అయినది పరరూపము

                             సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ