తిరుమల సర్వస్వం -192*
**శ్రీవారి ఆభరణాలు -4*
5. *స్వర్ణ పీతాంబరాలు:*
ఇరవై కిలోల బరువైన స్వర్ణాంబరాన్ని 2009వ సంవత్సరంలో అప్పటి తి.తి.దే. బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మూడు కోట్లు వెచ్చించి చేయించారు. మూలవిరాట్టుకు నాభి క్రింద భాగం నుంచి ఈ పీతాంబరం ధరింప చేస్తారు. తి.తి.దే. వారు ఇరవై కిలోగ్రాముల మరో స్వర్ణ పీతాంబరం అంతకుముందే తయారు చేయించారు. ఇది రెండవది.
*మరికొన్ని ముఖ్యాభరణాలు*
ఇవే కాకుండా శ్రీవారి మూలమూర్తిని పాదాల నుండి శిరస్సు వరకు అలంకరించే మరికొన్ని ముఖ్య ఆభరణాల జాబితా, అదే క్రమంలో, ఇలా ఉంది:
1. శ్రీవారి పాదాల క్రిందనున్న బంగారు పద్మపీఠాన్ని కప్పుతూ ఉన్న నగిషీలు చెక్కిన బంగారు రేకు.
2. కుడి ఎడమ పాదాలకు రెండు బంగారు కవచాలు.
3. ఏడు కిలోల బరువైన బంగారు సూర్యకఠారి (ఖడ్గం).
4. వైకుంఠహస్తానికి బంగారుకవచం.
5. వైకుంఠ హస్తానికి, కటిహస్తానికి చెరొక నాగాభరణం.
(వీటిని శ్రీమద్రామానుజుల వారు తయారు చేయించారు.)
6. వైకుంఠ హస్తానికి నాగాభరణం క్రింద ఉండే కడియం.
7. వైకుంఠహస్తాన్ని అలంకరించే రత్నాల దస్తుబందు.
8. పెన్నా సిమెంట్స్ వారు ఐదుకోట్ల వ్యయంతో చేయించిన 'వల కటి, వరద హస్తాలు'.
9. 'కమ్మరపట్టి' అనబడే బంగారు వడ్డాణం.
10. దశావతార వడ్డాణం.
బంగారు గంటల మొలత్రాడు.
11. వక్షస్థల అమ్మవార్లకు రత్నాలతో కూడిన బంగారు కంటె.
12. దశావతార హారం.
13. అష్టోత్తర శతనామ హారం.
14. నాలుగు పేటలతో కూడిన బంగారు మొహరీల గొలుసు.
15. ఆరు ప్రోగుల బంగారు యజ్ఞోపవీతం.
16. బంగారు పులిగోరు.
17. రెండు భుజకీర్తులు.
18. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన శంఖం.
19. నాలుగు కిలోల బరువైన, రత్నాలు పొదిగిన సుదర్శనచక్రం.
20. మూడు కిలోల బరువున్న రవ్వల కర్ణాభరణాలు.
21. రత్నాలు పొదిగిన కుడి, ఎడమ బంగారు బావళీలు.
చంద్రవంక కంటి.
22. వజ్ర ఖచితమైన అశ్వత్థపత్ర హారం (అశ్వత్థపత్ర మనగా రావి ఆకు).
23. భుజదండ భూషణాలు
24. రెండు పేటల బంగారు గొలుసు.
25. ఐదు కిలోల బరువైన బంగారు గొడుగు.
26. ఇరవై ముత్యాల హారాలు.
27. యాభై కాసుల దండలు
*ఎన్నో కిరీటాలు...*
సకలలోక సార్వభౌముడు, దేవాది దేవుడు అయిన శ్రీనివాసుని మకుటాల గురించి చెప్పుకోవాలంటే ఉద్గ్రంథమే అవుతుంది.
*శ్రీవారికి ఏడు ముఖ్యమైన కిరీటాలు ఉన్నాయి -*
1. మామగారైన ఆకాశరాజుచే బహూకరింప బడ్డ తొమ్మిదిన్నర కిలోల బంగారు కిరీటం. దాదాపు ఐదువేల సంవత్సరాల నాటిదిగా భావించబడే ఈ కిరీటాన్ని *'ఆకాశరాజు కిరీటం'* గా పిలుస్తారు.
2. ఇరవయ్యవ శతాబ్దపు ప్రథమార్థంలో అప్పటి దేవాలయ పురాతత్వ శాస్త్రవేత్త సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆధ్వర్యంలో *గద్వాల మహారాణి చేయించిన వజ్రకిరీటం.*
3. 2009వ సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి గారు సమర్పించిన, 42 కోట్ల రూపాయల విలువగల వజ్రాల కిరీటం.
4. వేంకటేశ్వర హెచరీస్ సంస్థ సమర్పించిన 13 కిలోల కిరీటం.
5. గోయెంకా కుటుంబం కానుకగా ఇచ్చిన 10 కిలోల బంగారు కిరీటం.
6. 1945 సంవత్సరం లో తి.తి.దే. వారు చేయించిన వజ్రకిరీటం.
7. 1986వ సంవత్సరంలో, అప్పుడే 5 కోట్ల రూపాయలు వెచ్చించి తి.తి.దే. వారు చేయించిన మరో వజ్రకిరీటం.
7. ఇవే కాకుండా అరుదుగా వాడే లేదా అసలు ఉపయోగించని కిరీటాలెన్నో కూడా శ్రీవారి చెంత ఉన్నాయి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి