23, డిసెంబర్ 2024, సోమవారం

ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు

 ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు  


        మనకి ప్రకృతి అనేక రకాలు అయిన ఆహారపదార్థాలని మనకి ప్రసాదించింది. వాటిని సంపూర్ణంగా వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . 


         అపథ్యం అని తెలిసీ ఒక పదార్థం రుచిగా ఉంది అని తినకూడదు. ఏది తినవలనో , ఏది తినకూడదో బాగుగా పరీక్షించి పదార్థాలను భుజించవలెను . ఆహారం వలన పుట్టిన ఈ శరీరం ఆహార వైషమ్యం వలన నశిస్తుంది. కావున ప్రతిదినం మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యం చెడిపోకుండా కొత్తగా ఏ రోగం రాకుండా చూసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం రక్షించబడుతుందో ఆ ఆహారాన్ని మనం సర్వదా తీసుకుంటూ ఉండాలి అని చరక మహర్షి వివరించారు . 


            మనలో చాలామంది ఆకుకూరలు తింటారు కాని వాటి యొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియదు . కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు అయా రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కూడ శరీరానికి పుష్కలంగా విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చు.  


        కొన్ని ముఖ్యమైన ఆకుకూరల గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను . 


  అవిసె ఆకు కూర  - 


 *   ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఎరుపు మరియు తెలుపు దీని పువ్వులనుబట్టి చెప్పవచ్చు. 


 *  ఏకాదశి ఉపవాసం మొదలయిన ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా ఉపయోగిస్తారు . ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది.


 *  దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా ఉపయోగిస్తారు . గాయాలకు , దెబ్బలకు మంచి మందు.


 * జలుబు , రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గును. లొపల నుంచి జలుబు నీరు రూపంలో కారిపోయి తలనొప్పి, బరువు తగ్గును.చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి వాడవలెను . 


 *  పురిటిబిడ్డలలో పడిసెం ఎక్కువుగా ఉంటే రెండు చుక్కల అవిసె రసంలో 10 చుక్కల తేనె వేసి రంగరించి పాతకాలం లో వైద్యులు ఆ బిడ్డ ముక్కులలో వేలితో పైపైన రాస్తారు . 


 *  ఈ అవిసె ఆకులు రుచికి కారంగా , కొంచం  చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది . ఈ మధ్య మార్కెట్లో అవిసె కారం దొరుకుతుంది దానిని పిల్లలు మరియు పెద్దలు విరివిగా వాడుకొనవలెను . 


 *  సాలీడు , పులికోచ మున్నగు జంతువుల విషాన్ని కూడా ఈ ఆకురసం విరిచేస్తుంది.


 *  అవిసె ఆకుల రసం టాన్సిల్స్ కి పూస్తే అవి కరిగిపోతాయి.


 * రేజీకటి రోగం కలవారు అవిసె ఆకులకూర వాడటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అవిసె ఆకులు దంచి ముఖ్యంగా రోట్లో కర్ర రోకలి వాడవలెను . ఆ దంచిన పిప్పిని కుండలో వేసి ఉడకపెట్టి రసం తీసి ఆ రసాన్ని 10ml లొపలికి తీసుకోవడం వలన రేజీకటి పుర్తిగా దూరం అగును.


 *  నాలుగు రోజులకు వచ్చే జ్వరానికి దీని ఆకురసం అయిదారు చుక్కలు ముక్కులలో వేసుకొని లొపలికి పీలిస్తే మంచి ప్రభావం కనిపించును.


 *  అవిసె ఆకు , మిరియాలు కలిపి నూరి రసం పిండి ఆ రసాన్ని ముక్కులలో వేస్తే అపస్మారంలో ఉన్న వ్యక్తి కోలుకుంటాడు.  


 *  చిన్నపిల్లలో వచ్చే బాలపాప చిన్నెలకు ఇది అద్భుత ఔషదంగా పనిచేయును 


 *  దీనిలో ఉన్న కారం మరియు చేదు ఉన్నను వండాక మధురంగా ఉండును.


 *  ఇది క్రిమి రహితం అయ్యి శరీరంలో మలిన పదార్థాలు మరియు మల పదార్థాలు బయటకి పంపును. దీనిని మనకంటే తమిళ సోదరులు ఎక్కువ వాడతారు.


 కరివేపాకు  - 


 *  దీనిని రావణ , గిరి నింబిక , మహానింబ అని కూడా పిలుస్తారు .


 *  ఈ చెట్టుకు ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు పోస్తూ ఉంటే లేత కరివేపాకు చెట్లు ఏపుగా ఎదుగుతాయి.అదే విధంగా ముదురు చెట్లకు బియ్యం కడిగిన నీరు పోస్తే వాటి ఆకులు మంచి సువాసనలు వెదజల్లుతాయి .


 *  ఈ కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం మరియు వాతాన్ని పోగొడుతుంది. 


 *  అగ్నిదీప్తి ఇస్తుంది.


 *  దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన గ్రహణి రోగం అనగా విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు తగ్గించును . 


 *  ఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు మరియు దద్దుర్లకు ఉపయోగిస్తారు . 


 *  కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాదిని కూడా నివారించును.


 *  కరివేపాకు , మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేపాకు కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి నోటి యెక్క అరుచిని పొగొట్టును.


   కామంచి ఆకు కూర  - 


 *  దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గును. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పట్టును . 


 *  శరీరం ఉబ్బుతో కూడి యున్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్బుతంగా పనిచేయును . 


 *  ఎలుక కాటు సమయంలో ఈ ఆకుల రసం పైన రాయవలెను . 


 *  ఈ కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరించును . 


 *  ఔషదాలతో పాటు కుష్టు వ్యాధి కలవారు దీనికి కూడా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వేగంగా వస్తాయి.  


కొత్తిమీర  - 


 *  ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము . 


 *  వీటియొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును. 


 *  కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి , అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది . 


 *  కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది . విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది . భ్రమ ని తగ్గిస్తుంది . కొత్తిమీర మంచి జీర్ణకారి.


 * కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి.లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరును .


 *  కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది.


 *  ప్రాచీన కాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలెను.


 *  నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయును . 


 *  ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.


 *  దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచును.


 *  దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అగును.


 కొత్తిమీర కారం తయారీ విధానం  - 


     కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలని 

తొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. 


          దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గును.


 గమనిక  - 


           గ్రహణి రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు.


 గంగపాయల కూర  - 


 *  ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు , ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.


 *  దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగును . 


 *  ఇది పాలకంటే మరియు వెన్నకంటే మంచిది .


 *  దీనిలో A ,B విటమినులు బాగా ఉన్నాయి .పాలకంటే , వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది . అదేవిధంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలో తెలిసింది.


 *  ఈ కూరలో ఐరన్ ,  కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. A విటమిన్ ఎక్కువ , B ,C D విటమినులు కొద్దిగా ఉన్నాయి.


 *  రక్తహీనత వ్యాధి కలవారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు.


 *  శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .


 *  మన శరీర ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే " క్షారశిల " అను మూల పదార్థం కావాలి ఈ పదార్థం గంగపాయల కూరతో దేహములోకి చేరును . ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం.


*  సంగ్రహణి , కుష్టు , మూత్రాశయం లో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు  ఈ కూరని ఆహారం లో బాగం చేసుకోవాలి .


 *  వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును.


 *  రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధం గా పనిచేయును . 


        ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో బాగం చేసుకోవలెను . 


 గమనిక  - 


            ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకును కావున ఇసుక , మట్టి ఎక్కువుగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి 


             దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచెసే గుణం కలిగినది.కావున ఎక్కువ తిన్నచో శరీరంలో శ్లేష్మమును పెంచును. కండ్లకు మరియు మూత్రపిండముల పై , తలలో నరములపై కొంచం ప్రభావం చూపించును. కావున 10 రోజులకు ఒకసారి తిన్నచో చాలును.


 గుంటగలగర  - 


 *  దీనిని కేశరంజన , భృంగరాజ అని సంస్కృతంలో పిలుస్తారు . 


 *  దీనిని పితృదేవతల అర్చనల్లో వాడుతారు.


 *  తేమగల ప్రదేశాలలో ఉంటుంది. లంక నేలల్లో శీతాకాలంలో పెరుగును .


 *  ఇది మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, పసుపు, నలుపు . నలుపు దొరకటం మహాకష్టం దీనిలో పసుపురంగు పువ్వులు పూసేది మంచి ప్రశస్తమైనది.


 *  దీనియొక్క రుచి కారం,చేదు కలిసి ఉంటుంది. 


 *  దీనిని లోపలికి తీసుకోవడం వలన శరీరం నందలి కఫం మరియు వాతాన్ని పోగొడుతోంది 


 *  దంతాలు , చర్మం వీనికి హితంగా ఉంటుంది. ఆయువుని , ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది.


 *  కుష్టువు, నేత్రరోగం , శిరోరోగం , వాపు , శరీరం యొక్క దురద నివారించును.


 * హెర్నియా , ఆయాసం , పొట్టలోని క్రిములు , ఆమరోగం అనగా రుమాటిజం , పాండు రోగం అనగా భయంకరమైన రక్తక్షీణత , గుండెజబ్బు , చర్మరోగం వంటి వ్యాధులు హరించును . 


 *  కొన్ని రకాల ఆకుకూరలు నేత్రాలకు చెడుచేస్తాయి అని అంటారు. కాని ఆకుకూరల్లో పొన్నగంటి కూర తరువాత నేత్రాలకు మేలుచేసేది గుంటగలగర కావున గుంటగలగరని ఉపయొగించవలెను . 


 *  గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. 


 *  కేశాలువృద్ధి , మేధావృద్ధి ని కలుగచేస్తుంది.


 *  స్ప్లీన్ , కామెర్లు , సుఖఃరోగాల్లో దీనిని వాడటం వలన మంచి ఫలితం కనిపించును.


 *  గుంటగలగర ఆకు రసం మజ్జిగలో కలిపి తీసుకోవడం వలన పాముకాటు నుంచి కాపాడవచ్చు.


 *  ఎనిమిది చుక్కల తేనెలో రెండు చుక్కల గుంటగలగర ఆకు రసాన్ని వేసి పురిటి బిడ్డల జలుబురోగాల్లో వాడతారు.


 *  కడుపులో నులిపురుగులు ఉన్నాయి అని అనుమానం వచ్చినపుడు ఆముదంతో ఈ ఆకుపసరు కలిపి పుచ్చుకోవడం మంచిది .


 *  చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు.


 *  ఈ ఆకులు ముద్దగా నూరి తేలు కుట్టినచోట వేస్తే విషం విరుగును.


 *  చర్మరోగాల్లో ఈ ఆకుపసరు బాగా పనిచేస్తుంది .


 *  గుంటగలగర ఆకుల పొగని కాని , ఆ ఆకులు వేసి కాచిన నీటి ఆవిరి కాని గుదముకు పట్టించిన మూలశంక రోగం తగ్గును.


 *  గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది . 


  గుంటగలగర ఉపయోగించు విధానం  - 


     దీనిని తరచుగా కూరగా, పచ్చడిగా ఉపయోగించడం మంచిది . తియ్యకూరగా కాని , పులుసుకూరగా కాని వండుకోవచ్చు. గుంటగలగర ఆకువేయించి చేసిన పచ్చడికి 

కొంతవరకు గోంగూర పచ్చడి రుచి వస్తుంది.

గుంటగలగర ఆకులో ఇనుము ఎక్కువుగా ఉంటుంది. దీనిని లోపలికి తరచుగా తీసుకోవడం వలన శరీరానికి ఇనుము చక్కగా అందును. మరియు నేత్రాలకు చల్లదనం , కేశాలకు వృద్ది కలుగును.


 గోంగూర  - 


             వెల్లులి బెట్టి పొగిచిన 

      పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా ?

              మొల్లముగ  నూని వేసుక 

       కొల్లగ  భుజియింపవలయు గువ్వల చెన్నా !


         పైన చెప్పిన పద్యం గువ్వలచెన్న శతకంలోనిది. దీనిలో ఆ కవి వర్ణించిన తీరు చూస్తుంటే తెలుస్తుంది . గొంగూర యొక్క గొప్పతనం . ఇప్పుడు మీకు దానిలోని పోషక విలువలు మీకు తెలియచేస్తాను. 


 *  దీనిని సంస్కృతంలో పీలు , గుచ్ఛఫల , ఉష్ణప్రియ అని కూడా పిలుస్తారు . 


 *  ఆకుకూరలలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది.


 *  ఈ ఆకుల్లో రాగి ఎక్కువ ఉంటుంది.


 *  దీనిలో పోటాష్ కూడా ఉంటుంది.


 *   ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గోంగూరని వేడిని కలుగజేసేదిగా పేర్కొన్నది. బలం కలుగచేసే ఆకుకూర గా తెలియచేశారు .


 *  రక్తపిత్తవ్యాధి అనగా నోటినుంచి రక్తం పడువ్యాధిని హరించును . 


 *  శరీరంలోపలి గడ్డలు , మూలవ్యాధి , స్ప్లీన్ సంబంధ సమస్యల ను నివారించవచ్చు.


 *  వాతం , కఫం ఉన్నవారు దీనిని లొపలికి తీసుకోవలెను . 


 *  ఇది మంచిరసాయనం . 


 *  ఈ గోంగూరలో నాలుగు రకాలు ఉన్నాయి.

గొంగూరలో పుల్లగోంగూర , ఎర్ర గోంగూర , తెల్ల గోంగూర దీనిని దేశివాళి గోంగూర అని కూడా అంటారు. మరొక రకం ధనాసర గోగు అని 4 రకాలు ఉన్నాయి.


 *  పుల్లగోంగూర కాయలు ఎర్రగాకాని , తెల్లగా కాని ఉంటాయి. పుల్లగోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు . 


 *  ఎర్రగోగు చెట్టు కాడలు బూడిద రంగుతో కలిసిన పచ్చని రంగుతో ఉంటాయి.


 *  తెల్లగోంగూర సర్వసామాన్యమైనది. దీనిని నాటు గోంగూర లేదా దేశివాళి గోంగూర అని కూడా అంటారు.


 *  ధనాసర గోంగూర విదేశీది మలేసియా దేశం లోని తర్నాసరి రాష్ట్రం నుంచి వచ్చింది. తర్వాత దాని పేరు ధనాసరి గా క్రమంగా మారింది. ఇది మంచి పథ్యకరమైనది . బాలింతరాళ్ళకి కూడా పెట్టవచ్చు.


 *  పైర గోంగూర అని ఇంకోరకం కూడా ఉన్నది. దీన్ని శీతాకాలంలో సాగుచేస్తారు . ఇది మిగిలిన గోంగూరల కంటే మంచి రుచిగా ఉంటుంది. పచ్చజొన్న , పైరగోంగూర రెండు శ్రేష్టం అయినవని సామెత .


 *  నువ్వుల చేలో పండిన గోంగూర అంత పథ్యకరం కానిది అని వైద్యులు చెప్తారు . 


 *  గుంటూరు జిల్లాలో పెరిగే గోంగూర చాలా రుచిగా ఉంటుంది. దీని ఆకుతో పులుసు , పచ్చడి చేసుకుంటారు . 


 *  గుంటూరు జిల్లాలో దీనిని నిలువ పచ్చడిగా పెడతారు.


  నిలువపచ్చడి పెట్టే విధానం  - 


       నిలువ పచ్చడి పెట్టడానికి పైర గోంగూర వేయించాలి . కావాలిసిన ఉప్పు చేర్చి ముందు ఒకసారి తొక్కాలి. ఆ తరువాత పండు మిరపకాయలు కొద్దిగా పసుపు చేర్చి మరలా తొక్కాలి . తరువాత గిన్నెలోకి తీసుకుని ఊరనివ్వాలి . 


 *  సంవత్సరానికి పైగా ఊరిన ఈ పచ్చడి చాలా పథ్యకరం అయినది. పైన చెప్పిన పచ్చడి నూనెతో కూడా చేయవచ్చు . కాని పైన చెప్పినవలె నూనె కలిపితే పథ్యకరం కాదు.


 *  గోంగూర మంచి బలకారం అయిన శాకం . అందుకే గొంగూర పచ్చడి కోడి మాంసంతో సమానం అయినది అని చెప్తారు . 


 *  రేజీకటి రోగం కలవారు ఈ కూర చాలా మేలు చేయును . 


 *  గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి అని చెప్తారు . 


 *  మేహ సంభందమైన వ్రణాలు కు గోంగూర ఆకు ఉడికించి కడితే మేహవ్రణాలు పక్వానికి వస్తాయి.


 *  గోంగూర నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి.


 *  బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.


 *  గేదల లేగదూడలకు నాలుగయిదు గోంగూర ఆకులు పెట్టడం వలన మల సమస్య తీరి ఆరోగ్యంగా ఎదుగుతాయి.


 *  గోంగూరని ఎక్కువ ఉడికించడం వలన మరియు కుక్కర్లలో ఉడికించడం వలన దానిలోని జీవపోషకాలు నశిస్తాయి.


  గమనిక  - 


       ఈ గోంగూరని ఎక్కువుగా వాడరాదు . శరీరంలో వేడిని పెంచును. మరియు మలబద్దకం సమస్య పెంచును.


 చక్రవర్తి కూర  - 


 *  దీనిని సంస్కృతంలో వాస్తుక , శాకపత్ర , కంబీరా , ప్రసాదక అనే పేర్లతో పిలుస్తారు . 


 *  ఇది తొందరగా జీర్ణం అవుతుంది. రుచిగా ఉంటుంది. 


 *  శుక్రవృద్ధిని కలిగి ఉండి , శరీరంలో తొందరగా వ్యాపిస్తుంది.


 *  స్ప్లీన్ , రక్తంలో దోషం , పిత్తం అనగా శరీరంలో వేడి తగ్గించును . 


 *  మూలవ్యాధి , కడుపులో నులిపురుగులు , త్రిదోషాలు వీటిని పోగొట్టును .


 *  ఇది మధురంగాను మరియు కొంచం ఉప్పగాను ఉంటుంది.


 *  మలమూత్ర సమస్యలని నివారిస్తుంది.


 *  ఈ కూర బుద్ధిబలాన్ని పెంచును.


 *  ఆకలి పుట్టిస్తుంది.


 *  కళ్ళకు మేలు చేయును . 


 *  మలబద్దకం సమస్యని నివారించును.


 *  వాత పిత్త శ్లేష్మ దోషాలను నివారించడంలో దీనికిదే సాటి .


 *  చర్మరోగాలు ను పోగొడుతుంది . 


 గమనిక  - 


     దీనిని ఎక్కువుగా తీసుకొన్నచో మలబద్దకం మరియు ఉష్ణాన్ని చేయును.


 చామ ఆకు  - 


 *  చామ ఆకు కూర చాలా మంచిది . జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది .


 * మూలశంక సమస్యతో బాధపడేవారు దీనిని లోపలికి తీసుకోవడం చాలా మంచిది 


 *  ఈ ఆకుకూర మూత్రాన్ని బాగా జారిచేస్తుంది .


 *  అరుచి అనగా నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది.


 *  ఆకలి పుట్టిస్తుంది.


 *  ఈ చామ ఆకులను పులుసుకూరగా తినడం చాలా మంచిది . 


 *  ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి.


 *  రక్తనాళాల నుంచి కారే రక్తం ఆగిపోతుంది.


 గమనిక  - 


          దీనిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో వాతం , శ్లేష్మంని కలిగించును.దీనికి పులుసు విరుగుడు కావున పులుసు కూర చేసుకోవడం వలన దీనిలో దుర్గుణాలు నశించును.


  చింతాకు  - 


 *  కూరగాను , పచ్చడిగాను దీనిని ఉపయోగిస్తారు . దీని లేత చిగురుని చింతచిగురు అంటారు.


 *  ఈ చింతచిగురు హృదయానికి మేలు చేయును . 


 *  ఇది వగరు మరియు పులుపు రసాలని కలిగి ఉంటుంది.


 *  రుచిని పుట్టిస్తుంది.


 *  బుద్ధికి మేలు చేయును . 


 *  జీర్ణక్రియకు మేలు చేయును . 


 *  కఫ మరియు వాతాలని అద్భుతంగా నిర్మూలించును.


 *  చింతచిగురు ఎక్కువుగా వేసవికాలంలో దొరకును. కాని ఒక ప్రక్రియ ద్వారా అకాలంలో కూడా చింతచిగురు పొందవచ్చు.


 అకాలంలో చింత చెట్టు చిగురించేలా చేసే ప్రక్రియ  - 


    మనం ఏ చెట్టుకి అయితే అకాలంలో చింతచిగురు తెప్పించాలి అనుకుంటున్నామో ఆ చెట్టు కొమ్మ పాత ఆకులని రాలిపివేయాలి . ఆ తరువాత ఆ కొమ్మకి సెగ బాగా తగిలేలా అక్కడ తాటాకు మంట వేయాలి . ఈ విధంగా చేసిన వారం పదిరోజుల్లో ఆ చెట్టుకి బాగా చిగురు తొడుగును.ఇలా కొత్తగా వచ్చిన ఆకుతో పచ్చడి చేసుకుని తినవచ్చు 


 *  చింతచిగురు శరీరానికి వేడిచేస్తుంది అనుకుంటారు . కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట విస్తారంగా పట్టును . చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదు.


 *  చింతచిగురు వాత వ్యాధులని , మూలరోగాన్ని , శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గించును . 


 *  పైత్యం , వికారములు ను తగ్గించును . 


 *  కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు.


 *  ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత కలదు. ఈ పొడికూర చాలా పథ్యకరమైనది మరియు తినదగినది.


 *  చింతాకు రసంలో పసుపు కలుపుకుని తాగితే మసూచికా వ్యాధి నివారణ అగును.


 *  మోకాళ్ళ వాపు తో చింతాకు ముద్దగా చేసి నీళ్లతో నూరి పట్టు వేయవచ్చు.


 *  మొండి వ్రణాలను చింతాకు కషాయంతో కడిగితే అవి త్వరగా నయం అవుతాయి. 


 *  ఎర్రగా కాల్చిన ఇనుప గరిటె చింతాకు రసంలో ముంచి ఆ రసం వేడిగా ఉండగానే తాగితే అజీర్తి విరేచనాలు కట్టుకుంటాయి.


 గమనిక  - నేత్ర వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినరాదు. కొంచం జఠరాగ్నిని కూడా తగ్గించును . 


 చిర్రికూర  - 


 *  దీనిని సంస్కృతంలో మేఘనాధ , భండీర , విషఘ్న , కచర అని రకరకాల పేర్లతో పిలుస్తారు . దీనికి పథ్య శాకం అని పేరుకూడా కలదు . అనగా అన్ని రకాల వ్యాధుల్లో దీనిని ఉపయోగించవచ్చు అని అర్ధం .


 *  ఇది కొద్దిపాటి తేమగల ప్రదేశాలలో చిర్రికూర బయలుదేరి బాగా పెరుగును . 


 *  ఇది చూడటానికి ముళ్లతోటకూరలా ఉంటుంది. కాని దానిలా ముళ్ళు ఉండవు.


 *  చిర్రికూరలో మూడురకాల జాతులు కలవు. చిర్రి , నీటి చిర్రి , చిన్న చిర్రి అనేవి కలవు. వైద్యగ్రంధాలలో మాత్రం నీటిచిర్రి గురించి వివరించబడి ఉంది. కాని వంటకాలలో ఉపయోగిస్తున్నట్టు ఎక్కడా కనపడదు.


 *  వైద్యగ్రంధాలలో వివరించినదాని ప్రకారం పిత్తాన్ని , కఫాన్ని , రక్తదోషాన్ని పోగొట్టును . 


 *  మలమూత్రాన్ని బాగా బయటకి పంపిస్తుంది.


 *  నాలుకకు రుచిని పుట్టిస్తుంది.


 *  రక్తం కక్కే వ్యాధిని పోగొడుతుంది . శరీరంలో జఠరాగ్ని పెంచును.


 *  చిర్రికూర పాషాణాది విషాన్ని , సర్ప విషాన్ని మొదలయిన విషాలను హరిస్తుంది అని పేరు కలదు.


 *  విషంతో కూడిన రక్తాన్ని  శుభ్రపరచడంలో దీనికి మంచి పేరు ఉంది.


 *  పెట్టుడు మందుల విషాన్ని పోగొట్టడానికి 

చిర్రికూర వండిపెడతారు.


 *  కందిపప్పు మొదలయిన పప్పుల్లో చేర్చి ముద్దకూరగా , లేదా పొడికూరగా వండవచ్చు.


 *  ఈ కూర బాగా ఆకలి కలిగిస్తుంది.


 *  వాత, పిత్త, శ్లేష్మాలు అనే త్రిదోషాలను  నివారిస్తుంది.


 *  కళ్ళజబ్బులు , మెదడు జబ్బులు కలవారికి ఇది మిక్కిలి హితకరం అయినది.


 *  ఈ కూరలో ఉక్కు లోహం ఉంది అని చెప్తారు . 


 * రక్తం కక్కుకునే వ్యాధుల్లో , గుండెజబ్బుల్లో చిర్రిఆకుకూర చాలా ఉపయోగికారిగా ఉంటుంది.


 *  ఈ కూర తినటం వలన అతిసార వ్యాధి తగ్గును.


  చిలుకకూర  - 


 *  దీనిని "జలబ్రహ్మి" అని అంటారు.


 *  నదుల గట్టులు , చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూర పెరుగును . 


 *  ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. మరియు నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.


 *  దీనిలో రెండురకాల జాతులు కలవు. ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు . 


 *  ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది. 


 *  శరీరంలో జఠరాగ్ని పెంచును. 


 *  స్ప్లీన్ , రక్తదోషం , త్రిదోషాలు , శరీర అంతర్భాగంలో గల క్రిములను హరించును . 


 *  తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరించును . జ్వరంతో పాటు వచ్చే దోషాలని , త్రిదోషాలని హరించును . 


 *  ఇది రుచికి చేదుగా ఉంటుంది.


 *  ఇది మంచి విరేచనకారి.


 *  కడుపులో నులిపురుగులని హరిస్తుంది.


 *  కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో కలదు.


 *  శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.


 *  మూలవ్యాధుల్లో , గ్రహణి రోగం అనగా బంక విరేచనాలలో , ఉబ్బు రోగాల్లో , కడుపులో బల్లలు పెరిగే రోగాల్లో ఈ ఆకుకూర వాడవలెను.


 *  మసూచి వంటి వ్యాధుల్లో చిలుకకూరాకు రసంలో తెల్ల చందనం ముద్ద ను రంగరించి తాగితే ఆ రోగము తగ్గును.


  చుక్క కూర  - 


 

 *  ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు.


 *  ఈ చుక్క ఆకులు దళసరిగా , పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.


 *  దీనిలో 2 రకాల జాతులు కలవు. అవి  

    చుక్కకూర , చిన్న చుక్కకూర .


 *  ఈ చుక్కకూర పుల్లగా , తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది. 


 *  ఇది జఠరాగ్ని పెంచును.


 *  ఇది రుచిని పుట్టించును . 


 *  కఫం , వాతం పోగొడుతోంది . పిత్తాన్ని కలిగిస్తుంది . 


 *  గ్రహణి , మూలరోగం , అతిసారం , కుష్టువు వీనిని నశింపచేస్తుంది.


 *  మలబద్దకం ని తొలగించి సుఖవిరేచనం కలిగించును.


 *  నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది.అది కఫ సంబంధమైన సమస్య ఆ సమస్యకి చుక్కకూర తరచుగా తీసుకోవడం వలన సమస్యకి అద్బుతంగా పనిచేయును .


 *  వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేయును . 


 *  వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేయును .


 *  జీర్ణకోశంలో ఏర్పడే మంటని , వేడిని ఇది తగ్గించును . 


 *  పైత్యం అధికం అవ్వడం వలన కలిగే విరేచనాలని , రక్తంతో కూడియున్న బంక విరేచనాలని తగ్గించడంలో చుక్కకూర చాలా అద్బుతంగా పనిచేస్తుంది .


 *  మూలరోగాలు , గుల్మాలు , క్షయలు , మేహవ్యాధులు మొదలయిన వ్యాధుల్లో ఈ కూరని ఉపయోగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.


 *  గుండెజబ్బులు కలవారు , ఆమవాతం , గుండెల్లో నొప్పిని తగ్గించును . 


 *  విషాదోషాలు పొగొట్టును.


 *  బుద్దికి చలువచేయును .


 *  శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది .


 *  మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చూస్తుంది.


 *  పక్వము అవ్వని గట్టిగా ఉండే వ్రణాల పైన చుక్క ఆకు వేసి కడితే మంచి గుణకారిగా ఉంటుంది.


 *  చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అగును.


 *  తెలంగాణా ఏరియాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.


  చెంచలి కూర  - 


   

 *  ఏ ఆకు కూరలు దొరకని ఆషాడ మాసంలో ఈ ఆకుకూర దొరుకుతుంది .


 *  ఎందుకనో ప్రజలు దీనిగురించి ఎక్కువ పట్టించుకోరు.


 *  దీనిలో  చెంచలికూర, నీరు చెంచలి కూర అని రెండురకాలు కలవు. సాదారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు.


 *  ఇది మలాన్ని గట్టిపరుస్తుంది.


 *  మేహాంని , త్రిదోషాన్ని పోగోట్టును . 


  తమలపాకు  - 


 *  దీన్ని సంస్కృతంలో భక్ష్యపత్రి అంటారు.


 *  భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉన్నది.


 *  తమలపాకు ని సంస్కృతంలో తాంబూల వల్లి ,  నాగవల్లరి అని కూడా పిలుస్తారు . 


 *  వానాకాలం వచ్చే తమలపాకులు దళసరిగా , పెద్దగా ఉంటాయి. ఎండాకాలం వచ్చే ఆకులు పలచగా కొద్దిగా ఉంటాయి. వానకాలం తమలపాకుల కంటే ఎండాకాలం వచ్చే తమలపాకులు ఎక్కువ రుచిగా ఉంటాయి.


 *  తమలపాకులు శరీరాన్ని శోధనం చేస్తాయి.అనగా శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి.


 *  రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి.


 *  వగరు , చేదు , ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి.  శ్లేష్మాన్ని , నోటికంపుని , బడలికని పోగొట్టును . 


 * మిగిలిన ఆకుకూరలు చెట్టు నుంచి కోసిన తరువాత ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది . కాని తమలపాకు విషయంలో  దీనికి పూర్తి వ్యతిరేకం . చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో మరియు జడంగా ఉంటాయి. 


 *  దోషయుతమైన తమలపాకులు వాడటం వలన వాంతులు , మలం స్థంభించుట , నాలిక రుచి లేకుండా పోవడం . దాహం వేయడం , రక్తదోషం వంటి సమస్యలు సంభంవించును.


 *  పండిన తమలపాకులు రుచిలో అత్యుత్తమంగా ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి . 


 *   భోజనం చేసుకున్నాక తాంబూలం వేసుకోవడం వలన మంచి జీర్ణశక్తి పెరుగును .


 *  తమలపాకులు అతిగా తినటం వల్ల వచ్చే భుక్తాయాసాన్ని నివారించును.


 *  నోటి దుర్వాసన పోగొట్టును 


 *  తమలపాకులు వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి . 


 *  వాత , కఫాలని హరిస్తాయి.


 *  కంఠస్వరాన్ని బాగుచేస్తాయి.


 *  తమలపాకులు పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు . బాలింతలు కూడా తీసుకోవచ్చు .


 *  పత్తిచెట్టు వేరు , తమలపాకు రసంతో నూరి ముద్దచేసి ఉపయొగిస్తే వజ్రం కూడా భస్మం అగును.


 *  ఇంతగొప్ప లక్షణాలు ఉన్నను తాంబూలం మితిమీరి సేవించరాదు . సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి.


 *  తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది.


 *  భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే , వాంతి చేసుకున్న వెంటనే , నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోరాదు.


 *   వెలగపండు , పుల్లనిపండ్లు , పనసతొనలు , అరటిపండ్లు , చెరకు గఢ  , కొబ్బరికాయ , పాలు , నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్తతుల్లో తినరాదు.


 *  తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.


 తొటకూర  - 


 *  తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గును. శరీరంలో ఉన్న అతివేడిని తగ్గించి శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది.


 *  ఋషిపంచమి వంటి పుణ్యదినాల్లో మరియు వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం .


 *  తోటకూర మూడు లేక మూడున్నర అడుగుల వరకు ఎదిగే చిన్నమొక్క . తోటకూరని ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు.


 *  విత్తనం మొలకెత్తి మూడో ఆకు వేసేదాకా తోటకూరవిత్తనాలు చల్లిన మళ్ల మీద అరటిసోరగు కాని ఎండు కొబ్బరిఆకులు కాని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన పక్షుల నుంచి విత్తనాలను కాపాడవచ్చు.


 *  మడిలో విత్తులు ఒత్తుగా చల్లడమే మంచిది . లేతగా ఉండగానే నడుమనడుమ కొన్ని మొక్కలని పీకేస్తూ కూరకు ఉపయోగిస్తుంటే ఉన్న మొక్కలు ముదిరి బాగా కాస్తాయి. ఇలా ముదిరిన మొక్కల కాడలు కూరకి మరియు పులుసుకి పనికివస్తాయి.


 *  తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి.


పెరుగుతోటకూర , కొయ్యతోటకూర , చిలుకతోటకూర , ఎర్రతోటకూర , ముళ్లతోటకూర మెదలైనవి.


 *  కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది.కాబట్టే దీనిని బాలింతలకు , నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడవలెను . వాతత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఉష్ణశరీరం కలవారికి గుండెలో నొప్పి , కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు. 


 *  ముళ్లతోటకూర ఆకులని పప్పుకూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.


 *  ఈ మొక్కల్ని తెచ్చి ఎండించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని బట్టలసోడాకు బదులుగా చాకలివారు  వాడతారు. దీనికి కారణం ముళ్లతోటకూరలో క్షారపదార్థం విస్తరించి ఉందని తెలుస్తుంది.


 *  సోడాపెట్టి ఉతికిన బట్టలు కంటే ముళ్లతోటకూర బూడిద పెట్టి ఉతికే బట్టలు చాలారోజులు మన్నుతాయి. మరియు సోడా పెట్టిన వాటికంటే ఇవి శుభ్రముగా ఉంటాయి.


 *  చిలకతోటకూర పెరళ్ళలో బాగా ఎదుగును. పెరుగుతోటకూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది.


 *  అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తల పరిశోధనలలో కనుగొనబడినది.


 *  ఇది పుల్లకూరగా , తీయకూరగా,  పప్పుకూరగా , పులుసుగా వండుకుంటారు.


  దోసకాయ ఆకు కూర  - 


 *  మనం దోసకాయలను ఆహారంగా తీసుకుంటాం కాని దోస ఆకు లో కూడా చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఇది లొపలికి కూరగా తీసుకొవడం వలన మలమూత్రాలను జారీచేస్తుంది. 


 *  పైత్యం పెరగటం వలన బ్రాంతి తగ్గును.


  పుదీనా ఆకు  - 


 *  నోటియొక్క అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి చేసుకుని తినవలెను . పుదీనా  ఆకులు , ఖర్జురపు కాయలు , మిరియాలు , సైన్ధవ లవణం , ద్రాక్షా మొదలయిన పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు 


 *  పుదీనా ఆకుని నేతితో వేయించి కాని పచ్చిది కాని నూరి పచ్చి మిరపకాయలు , ఉప్పు చేర్చి నూరి నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.


 *  జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది . వారికి ఈ పచ్చడి అద్బుతంగా ఉంటుంది.


 *  గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.


 *  పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలు కు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అగును. 


 *  అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది .


 పొన్నగంటి ఆకు కూర  - 


  

 *  ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోంది .


 *  ఇది మలాన్ని గట్టిపరుస్తుంది. శీతలంగా ఉంటుంది.


 *  కుష్టు వ్యాధి , రక్తదోషం , కఫం , వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది . 


 *  జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం , వాంతి , అరుచి వీనిని పోగొడుతుంది.


 *  హృదయానికి మేలు చేస్తుంది.


 *  ఇది చలువచేయును . జ్వరతాపాలను , అతిదాహం తగ్గిస్తుంది . 


 *  ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి.


 *  మూలవ్యాధుల్లో కూడా పొన్నగంటికూర చాలా బాగా పనిచేస్తుంది 


 *  వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిది . 


 *  పొన్నగంటిఆకు రక్తదోషాలను మరియు కుష్టురోగాలను నయం చేస్తుంది.


  మునగాకు  - 


 *  ఆషాడ మాసంలో మునగాకు కూర తినవలెను అని పెద్దలు చెపుతారు.


 *  మునగాకులో 5 ,000 యూనిట్ల A విటమిన్ ఉంది . అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .


 *  మలాన్ని గట్టిపరుస్తుంది. 


 *  జఠరాగ్నిని పెంచును.


 *  కఫాన్ని , వాతాన్ని హరించును . 


 *  శరీరంకు వేడిచేయును . రక్తములో వేడి పెంచును కావున తక్కువ తీసుకోవడం మంచిది .


 *  మునగాకుని పప్పులో వేసి ముద్దకూరగా కాని పొడికూరగా కాని వండుకోవచ్చు .


 *  ఈ కూర దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది అని చెబుతారు.


 *  శరీరంలో చెడ్డ నీరు తొలగించుటకు మునగాకు కూర చాలాబాగా పనిచేస్తుంది .


 *  వేడిశరీరం కలవారు ఈ మునగాకుని వాడకుండా ఉంటే మంచిది .


 *  స్త్రీ ముట్టులో ఉన్నప్పుడు మునగాకు కూర పెట్టడం చాలా మంచిది . దీనికి కారణం స్త్రీలు ముట్టులో ఉన్నప్పుడు శరీరంలో వాతం ఎక్కువుగా ఉండును. ఈ సమయంలో మునగాకు తినిపించడం వలన వాతం హరించును . 


 

  మెంతి ఆకు   - 


 

 *  ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగును.


 *  నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.


 *  మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడు కాని , ఎండపెట్టి వరుగు చేసి కాని ఉపయోగించుకోవచ్చు.


 *  రక్తపిత్తం , అగ్నిదీప్తి , మలాన్ని బందించును., బలాన్ని కలిగించును.


 *  జ్వరం , వాంతి , వాతరక్తం , కఫం , దగ్గు , వాయువు అనగా వాతం , మూత్రరోగం , క్రిమి , క్షయ , శుక్రం వీటిని నశింపచేస్తుంది.


 *  ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు , వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.


 *  ఈ మెంతిఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి.వెంట్రుకలు రాలే జబ్బు తగ్గును.


 *  మెంతికూర స్త్రీల గర్భాశయాన్ని బాగుపరచడంలో ఋతుస్రావాన్ని సుష్టుచేయడంలో మెంతికూర బాగా పనిచేయును .


 *  ఈ మెంతిఆకుల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడంలో పులుసు వస్తువులు వాడవలెను.


  

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన నెంబర్ నందు సంప్రదించగలరు .


    కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

మహా కుంభమేళా

 


శ్రీభారత్ వీక్షకులకు ధనుర్మాస శుభాకాంక్షలు 🌹ఒక మహా క్రతువు మహా కుంభమేళా సందర్భంగా జరుగబోతోంది. శ్రీలలితా త్రిపుర సుందరీ మహోత్సవాల్లో భాగంగా జరిగే ఈ క్రతువు అపూర్వం. ఆరు  రోజులు జరిగే ఈ మహా క్రతువులో వారాహి, రాజశ్యామల వంటి మహా యాగాలతో పాటు మాఘ పూర్ణిమ రోజున 108 అడుగుల మహా శ్రీచక్రంతో శ్రీచక్ర నవావరణ పూజ అపూర్వ రీతిలో జరుగబోతోంది. శ్రీవిద్యోపాసకులు బ్రహ్మశ్రీ వెంకట శాస్త్రి గారు చెబుతున్న విశేషాలు వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

అపార్ధం చేసుకోవద్దు.*

 🙏

*దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్ధం చేసుకోవద్దు.*


జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు.

మా నుండి ఆశించవద్దు.

హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో తెలుగువారి సంవత్సరాది పండుగ  ఉగాది.

హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది.

జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రివేళ నూతనసంవత్సర వేడుకలలో పాల్గొనడంగానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి, ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు.

హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయం ఏమనగా హిందూమతంలో  బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారుజామున సుమారు 3.30గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుండి మనము మంచిసమయంగా హిందూధర్మంలో భావిస్తాం.  రాత్రి 11గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధసమయముగ భావిస్తాo. ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం.

*గమనించండి.* 

హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్లీ చెబుతున్నా. మనకు తెలుగు సంవత్సరాది నూతన సంవత్సరం ఉగాదిపండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు. ఉగాది ముద్దు. 

దయచేసి ఈ మెసేజ్ ను అన్ని హిందూ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన  పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం హిందూ బంధువులందరూ దీనిని గ్రూపులలో ప్రచారం చేసి మన సాంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.

By-- Brahmana Samaakhya.

🙏

కాలభైరవస్వామి ఆవిర్భవించిన రోజు.

 నేడు అనగా మార్గశీర్ష మాసం, కృష్ణపక్షం, అష్టమి అనగా కాలభైరవస్వామి ఆవిర్భవించిన రోజు.

ఎవరైనా ఏదైనా సాధించలేకపోయినా, సాధించినా సాధారణంగా అందరం ఒక మాట అంటూ ఉంటాం, అదేంటంటే, కాలం కలిసిరాలేదు అనో లేదా కాలం కలిసి రావడం వల్ల వాడు గొప్పోడు అయ్యాడనో ఇలా ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా "కాలం" గురించి అంటూ ఉంటాం.

అలాంటి కాలాన్ని మనం జయించలేము అని కొందరు అంటారు. కానీ, దివ్య జ్ఞానం కలిగిన వారు మాత్రం "కాలాన్ని జయించడం చాలా కష్టం" అంటారు గానీ, అసాధ్యం అని మాత్రం అనరు.


అలాగే, మన జాతక దోషాలు కావచ్చు, పూర్వజన్మ పాప కర్మలు కావచ్చు, ఏవైనా పితృ, సర్పాది దోషాలు కావచ్చు అవి అన్నీ కూడా మనకి కాలం కలిసి వచ్చినప్పుడు ఏమీ చేయలేవు. 


ఐతే, అలా మనకి కాలం కలిసిరావా లంటే అప్పుడు                   ఆ కాలానికి అతీతుడు, శాసకుడు ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుంది. 


అలాంటి కాలాన్ని శాసించే రూపమే "కాలభైరవ" రూపం. అందుకే ఎవరైతే "నాకు టైం బాగాలేదు" అని భావిస్తూ ఉంటారో వాళ్ళు అందరూ తప్పకుండా ఈ రోజు కాలభైరవస్వామి వారిని పూజించడం వల్ల వారికి అడ్డుపడుతున్న దుష్టశక్తులు అన్నీ పక్కకి తొలగిపోతాయి. 


ఈ రోజు "కూష్మాండ దీపం" పెట్టడం ఎంతో విశేషంగా చెప్తారు.


అందరూ ఈ రోజు కాలభైరవ అష్టకం గాని, తీక్ష్ణదంష్ట్ర కాలభైరవ అష్టకం గాని పదే పదే చదవండి.


మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదవండి.


అలాగే స్వామి వారికి గారెల మాల సమర్పించండి.


మీ ఇంటి వద్ద ఏవైనా శునకాలు ఉంటే అందులోనూ నల్లటి శునకాలు ఉంటే రొట్టెలు చేసి ముక్కలు చేసి దాని మీద కొన్ని నువ్వుల నూనె చుక్కలు వేసి పెట్టడం చాలా శ్రేష్టం ఎందుకంటే స్వామి వారి వాహనం శునకం.


ఈ రోజు కాలభైరవ స్వామి ప్రీతి కోసం చేసే పనులు వల్ల జాతకంలోని అన్నీ గ్రహదోషాలు తొలగుతాయి. అందులోనూ ముఖ్యంగా "శనైశ్చరుడి అనుగ్రహం" సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే, కాలభైరవస్వామి వారి శిష్యుడే శనైశ్చరుడు. గుర్వనుగ్రహం ఉన్నప్పుడు శిష్యుడు అనుగ్రహిస్తాడే గాని పీడించడు.


ప్రస్తుతం సమాజంలో ఎన్నో దుష్టశక్తులు మన సనాతనధర్మం పై దాడి చేస్తూ ఉన్నాయి, అలాంటి వారిని తిప్పికొట్టగలిగే మహత్తరమైన శక్తి "కాలభైరవ" శక్తి. కాబట్టి కాలభైరవుని అనుగ్రహం మన ధర్మానికి ఎంతో ఆవశ్యకం. 


*🙏🏻ఓం నమః శివాయై చ నమః శివాయ!🙏🏻*

*ఓం నమో భగవతే కాలభైరవాయ!*


(డా. ఆర్.వి. కుమార్ గారి సౌజన్యంతో)

ఏమి తీసుకుపోము

 🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏        🏵️వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు..  వెళ్ళిపోయినప్పుడు ఏమి తీసుకుపోము అని తెలియని వారుండరు.. అయినప్పటికి అందుకొనే వాటి కోసం పోరాటాలు.. అందుకోలేకపోయామని ఆరాటాలు చేస్తుంటారు.. అందివచ్చిన అవకాశాల పట్ల చిన్న చూపు.. అందుకున్న వారి పట్ల మాత్రం పెద్ద చూపును చూస్తూ మనసును చిత్రవద చేసుకుంటారు🏵️మన జీవితం అంటే ఆది మనము మాత్రమే తయారు చేసుకునేది కాదు.. అందులో మన జీవితంలోకి వచ్చిన ప్రతీ ఒక్కరి పాత్ర ఉంటుంది.. మరియు ఆది మన జీవితంలో జరిగిన అనుభవాల సారాంశము.. మనమందరం ఒకరి జీవితంలో ఇంకొకరు బాగస్వాములం.. మనము తోటి వారిని ప్రోత్సాహించే వ్యక్తులుగా ఉందాము.. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే విమర్శించే వాళ్ళు పుష్కలంగా ఉన్నారు🏵️లేని వాటి కోసం వెంపర్లాడతారు.. వున్న వాటిని ఉపయెగించుకోలేరు.. కనుక ఉన్న అవకాశాలను సద్వినియెగం  చేసుకుంటే సంతృప్తి లభిస్తుంది.. అదే సంతోషానికి పునాది అవుతుంది.. అంతులేని ఆనంద జీవన సౌరభానికి వారధిని కడుతుంది.. వ్యర్థ ఆలోచనల వలన సమయం వ్యర్థంగా పోతుంది.. సమయం వ్యర్థమైతే జీవితం వ్యర్థమైనట్లే🏵️🏵️మీ  * అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజెన్సీస్ .D.N.29-గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమహేంద్రవరం వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏

తమము వికార పూరిత

 చ.తమము వికార పూరిత విధానములన్ మది పెంపు జేయు స్వాం

తమున కశాంతి గూర్చుచు సతమ్మును వర్ధిలుచుండి యొప్పు మో

హమునకు మూలమౌను వివిధార్థ వినాశనకారియౌను ను

త్తముల కయోగ్యమై చనుచు ధర్మ విఘాతపు హేతువయ్యెడున్౹౹ 91


ఉ.కామము క్రోధమున్ భువిని గర్వితులౌ పిసినారులైన దు

ష్కాముక లక్షణమ్ములు వికారపు చేష్టల దుష్ట రూపముల్

తాము వసించు సీమకు సతమ్ము నశాంతికి మూల హేతువుల్

క్షేమము గాని రాజసపు చేష్టలు హానిని గూర్చు సర్వదా౹౹ 92

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్లోనింగ్ నామ సంవత్సరం దక్షిణాయణం - హెమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - అష్టమి - ఉత్తరాఫల్గుణి -‌‌ ఇందు వాసరే* (23.12.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విద్యారణ్యం-అత్యుత్తమ వేదపాఠశాల*

 *విద్యారణ్యం-అత్యుత్తమ వేదపాఠశాల*

 

*అవమానం..అవహేళన లను దిగమింగుకుని పట్టుదల ఉక్కు సంకల్పంతో గొప్ప లక్ష్యాన్ని సాకారం చేసుకుంటున్న ఓ వేదపండితుని విజయగాథ* 


వేదం మాకు కర్ణకఠోరం...మా కాలనీలో వేదపాఠశాల మాకు శబ్ద కాలుష్యం కలిగిస్తోంది...వెంటనే పాఠశాల ఇక్కడి నుంచి తొలగించండి అంటూ హుంకరిస్తూ వేదాన్ని అపహాస్యం..అవహేళన చేసి.. వేదపాఠశాల నిర్వాహకుడిని పరుష పదజాలంతో తూలనాడిన ఓ దుర్మార్గుడి అకృత్యం...జ్ఞాపకం చేసుకున్నపుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది...ఆ దుర్మార్గుడి తీరుపై అసహ్యం వేస్తుంది.. బోడుప్పల్ లోని ఆర్ ఎస్ ఎన్ కాలనీలో 2017 నవంబరులో (ఏడేళ్ల క్రితం) ఈ ఉదంతం మరచిపోలేని పైశాచిక  దుర్ఘటన...దుర్మార్గుడి బెదిరింపులు, పరుషతిట్లకు తీవ్ర మనస్తాపం చెందిన ఈ ఘటనలో బాధితుడు వేదపాఠశాల నిర్వాహకుడు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి ఎంతో కసి, పట్టుదలతో... సడలని మనోధైర్యంతో తనను, వేదాన్ని తూలనాడిన దుర్మార్గుడితో యుద్ధం చేసి ఎదుర్కునేకన్నా గొప్ప వేద విద్యాలయాన్ని స్థాపించి వాడి వాడి తత్వం గల దుర్మార్గపు సమాజానికి గట్టి సమాధానం చెప్పాలని ప్రతిన బూనాడు..వేరే చోట పాఠశాల ఏర్పాటు కోసం ఎంతో మంది స్థలాలు విరాళాలు ఇవ్వటానికి ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి...మహేశ్వరం లోని తమ స్వగ్రామం సొంత స్థలం లోనే వేద విద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని విద్యారణ్యం అనే సంస్థకు అంకురార్పణ చేశారు .తమ పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 50 కోట్ల ప్రణాళికతో విశ్వ విద్యాలయ స్థాయిలో వేద విద్యాలయ భవననిర్మాణ సముదాయానికి శ్రీకారం చుట్టారు...ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 125 మంది విద్యార్థులతో వేద విద్యాలయం, 75 గోవులతో గోశాల నిర్వహిస్తున్నారు...అనేక మంది ధార్మికులు,  వదాన్యులు చేయూత నిస్తుండగా ఇప్పటి వరకు అధ్యాపకుల నివాస సముదాయం, భోజన శాల,వంటశాల భవనాలను దాదాపు 8కోట్ల రూపాయల వ్యయం తో పూర్తి చేసారు .ఆధునిక హంగులతో సువిశాల గోశాల ప్రాంగణం, పిల్లలకు ఈత కొలను, సహజ సిద్ధ సభా మండపం, ఉద్యాన వనం, పిల్లల ఆటపాటలు, ఆహ్లాదం కోసం పార్కు ఏర్పాటు చేసారు ...నివాస సముదాయం మధ్యలో రాతి కట్టడంతో(కృష్ణ శి ల) రాజశ్యామల దేవాలయం శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి...ఇంకా ఆధునిక సకల హంగులతో 500 మంది విద్యార్థులకు సరిపడా విద్యాలయం, వసతి గృహం నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఇప్పటికే అత్యుత్తమ వేద విద్య తో పాటు లౌకిక విద్య(ఆంగ్లం, కంప్యూటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ) కోసం తగిన ప్రణాళికతో విద్యావిధానాన్ని అమలు చేస్తున్నారు..పదెకరాల స్థలంలో దాదాపు యాభై కోట్ల రూపాయల వ్యయంతో విద్యాలయం నిర్మాణ ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నామని...మరో మూడేళ్లలో ఈ ప్రణాళిక పూర్తవుతుందని విశ్వవిద్యాలయ స్థాయిలో మౌలిక వసతులు, వేదవిద్యా బోధన ఉండేలా ప్రణాళిక కార్యాచరణ అమలు చేస్తున్నామని విద్యారణ్యం నిర్వాహకులు మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి తెలిపారు...చెన్నై ఐఐటి వారు తన పాఠశాలకు తగిన నిర్వహణ,కార్యాచరణకు సాయం అందించటానికి ముందుకు వచ్చారని తెలిపారు ...సంస్కృతం, ఆంగ్లం, కంప్యూటర్ సహా లలిత కళలు, మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లో ఆయా రంగాల నిపుణులు,కళాకారులచే శిక్షణ ఇప్పిస్తున్నామని శశి భూషణ శర్మ సోమయాజి తెలిపారు .. బోడుప్పల్ లో వేదపరిరక్షణోద్యమం నుంచి ఏడేళ్లుగా పాఠశాల ఏర్పాటు కార్యాచరణలో  పాలుపంచుకున్న నేను నిన్న విద్యారణ్యంలో జరిగిన శ్రౌత యాగం పూర్ణాహుతి లో పాల్గొని ...అనంతరం అక్కడి విద్యాలయం నిర్మాణ పురోగతిని శశుభూషణ సోమయాజి ద్వారా తెలుసుకుని వారిని ఇంటర్వ్యూ చేసాను...మొత్తం మూడు వీడియోల లింకులు కింద ఉన్నాయి...

మీకు వీలు కుదిరినప్పుడు దయచేసి ఈ వీడియోలు చూడండి ..


https://youtu.be/r4YJws70Uyc


https://youtu.be/HBlST5KP6WQ


https://youtu.be/uDP5BA3RljY


వీలు కుదిరితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని చిప్పల పల్లి లో ఉన్న విద్యారణ్యం వేదపాఠశాలను సందర్శించండి...ఈ ఉదాత్త కార్యాచరణలో మీరూ భాగస్వాములై తోచినంత సాయం చేయండి ...

మీ దర్శనమ్ శర్మ


విద్యారణ్యం  వివరాలు:

Vidyaranyam CONTACT DETAILS 

Account Details:-

VIDYARANYAM VAIDIKA TRUST

BANK OF BARODA 

CURRENT AC NO:- 54180200000269

IFSC CODE: BARB0MAHESW

( USE BARB ZERO MAHESW )

MICR CODE: 501012582


UPI ID:- vidya96031@barodampay

Contact:

9603167371,

7013976136

vidyaranyam18@gmail.com

Vidyaranyam Rout Map


https://maps.app.goo.gl/hKyNokPLGF9LEjX86

తిరుప్పావై ప్రవచనం‎- 8 వ రోజు*

 🌹🌷🪷🏹🛕🏹🪷🌷🌹

*🕉️సోమవారం 23 డిసెంబర్,  2024🕉️*

  *వేకువఝామున పాడుకొనుటకు*



  *తిరుప్పావై ప్రవచనం‎- 8 వ రోజు*              

    *🏹8 వ పాశురము🏹*


*కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు*

*మేయ్ వాన్ పరన్దనకాణ్!* *మిక్కుళ్ళపిళ్ళైగళుమ్*

*పోవాన్ పొగిన్ఱారై* *ప్పోగామల్ కాత్తున్నై*

*కూవువాన్ వన్దు* *నిన్ఱోమ్; కోదుకల ముడైయ*

*పావాయ్!* *ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు*

*మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ*

*దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్*

*ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.*



            *🕉️భావము🕉️*


తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.



       *🌹అవతారిక:l🌹*


క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను 

లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము. 



🌷8.వ మాలిక:

(మలయమారుత రాగము - ఆదితాళము)


ప. తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

తీరుగ మహిషములు మేతకై! తరలె!

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!


అ..ప. పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు

తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ 

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!


చ.. కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన

కేశవుడౌ సర్వేశుని జేరి

ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతియింప-లో

కేశుడౌ తాను కాపాడడే మనల

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

తీరుగ మహిషములు మేతకై తరలె!



  *ఎనిమిదవరోజు ప్రవచనం‎*


*08 వ రోజు - నేను నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు!

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 



 పాశురము:


*కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు*

*మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం*

*పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -*

*క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ*

*పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు*

*మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ*

*దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్ ఆవా* *ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్*


ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. 


*"అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే"* ‘మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు’ అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ 

ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ‘ముముక్షు’ అని అంటారు. 

మరి ఏం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తికి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. “ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది బహుశా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చెయ్యాలో చెప్పు!” అని అడిగింది. 


*"ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ"* అంటూ ఉపదేశం చేసాడు. హే మైత్రేయీ *"ఆత్మావారే ద్రష్టవ్యః "* లోపల ఉండే ఆత్మ అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది? “ద్రష్టవ్యః” - చూడాలి అనుకున్న దాన్ని మొదట *"శ్రోతవ్యః"* వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.

మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శంఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం *"ద్రష్టవ్యః"* అప్పుడు స్పష్టంగా చూడగలం. 


*"కీళ్"* తూర్పు దిక్కున *"వానమ్"* ఆకాశం *"వెళ్ళెన్ఱ్"* తెల్లవారిందని అనుకుని *"ఎరు మై"* గేదెలన్ని కూడా *"శిఱు వీడు మెయ్యాన్"* చిన్న మేత మేయడానికి *"పరందన కాణ్"* పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు- *"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే"* మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు. 


*"మిక్కుళ్ళ పిళ్ళైగళుం"* మిగతా పిల్లలందరూ *"పోవాన్ పోగిన్ఱారై"* త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే *"ప్పోగామల్ కాత్తు"* వాళ్ళను ఆపి, *"ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం"* నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, *"కోదుగలం ఉడైయ పాపాయ్!"* శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా *"ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః"* జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. *"ఎళుందిరాయ్"* లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. అక్కడకు వెళ్ళి *"పాడి ప్పఱై కొండు"* మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. 


*"మావాయ్ పిళందానై"* గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు *"ఇంద్రియాణి హయానాహుః"* శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే కళ్ళెంను బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.


*"మల్లరై మాట్టియ"* మథురా నగరిలో మల్ల యోధులైన చాణూరుడు ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ బలరాములను సంహరించడానికి ఏర్పాటుచేసాడు. వారు మాదక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోధాలు ఈ మల్ల యోధులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. ‘పూరణైరేవ కన్యతే’- దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇంధనం, ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వధ అనంతరం, హే రావణా! ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోధాలను పైకి లేపుకున్నావు వాటితో నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మళ్ళిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు. 


*"దేవాది దేవనై"* ఆయన దేవాది దేవుడు, మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం ‘నేను- నీవాడను’ అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితోĥ ఒక్క సారి అను. ఏమని *"చ్చెన్ఱు నాం శేవిత్తాల్"* ఒక్క సారి మనం చేరి తండ్రీ ‘మేము నీవారమని’ తెలిపితే చాలు. *"ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్"* మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. ‘తిరుమరిసై ఆళ్వార్’ ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన’దేవుణ్ణి పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు!’ అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడంతో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. ‘యదోక్తకారి’- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం. ఇది కాంచి పురంలో ఒక ఆలయం.  మనపై పడేట్టు చేస్తుంది.

      

    *బాగ స్వామ్యం  చేయడమైనది*

*న్యాయపతి నరసింహారావు*

సోమవారం🕉️* *🌹23, డిసెంబర్, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🕉️ సోమవారం🕉️*

  *🌹23, డిసెంబర్, 2024*🌹

      *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - హేమంత ఋతౌః*

*మార్గశిర మాసం - కృష్ణపక్షం*


*తిథి     : అష్టమి* సా 05.07 వరకు ఉపరి *నవమి*

*వారం :సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : ఉత్తర* ఉ 09.09 వరకు ఉపరి *హస్త*


*యోగం  : సౌభాగ్య* రా 07.55 వరకు ఉపరి *శోభన*

*కరణం  : కౌలువ* సా 05.07 *తైతుల* (24) ఉ 06.30 వరకు


*సాధారణ శుభ సమయాలు*

           *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  :  *ప 11.44 - 12.29*


*వర్జ్యం         : సా 06.39 - 08.27*

*దుర్ముహూర్తం  : మ 12.29 - 01.14 & 02.43 - 03.27*

*రాహు కాలం  : ఉ 07.56 - 09.20*

గుళికకాళం     : *మ 01.30 - 02.54*

యమగండం    : *ఉ 10.43 - 12.07*

సూర్యరాశి : *ధనుస్సు*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.32* 

సూర్యాస్తమయం :*సా 05.41*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.32 - 08.46*

సంగవ కాలం       :*08.46 - 11.00*

మధ్యాహ్న కాలం  :*11.00 - 01.14*

అపరాహ్న కాలం : *మ 01.14 - 03.27*


*ఆబ్ధికం తిధి     : మార్గశిర బహుళ అష్టమి*

సాయంకాలం   :  *సా 03.27 - 05.41*

ప్రదోష కాలం    :  *సా 05.41 - 08.15*

రాత్రి కాలం         :  *రా 08.15 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.50 - 05.41*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

    

*ఆకాశలింగం చిదంబరం(తమిళనాడు)*


*ధ్యాయతే మునేర్గణం సహాయతే పురావళిం*

*అహాయలే చతుర్యయం హరాజతే మహాఖలం*

*లీయతే చరాచరం ప్రభాయతే మహఖిలం*

*ప్రియతే పిశాచ తాం చిదంబరేశ్వరం భజె ||

🌸🌸🌸🌸🌸🌸🌸


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*


*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*సదంచిత-ముదంచిత నికుంచిత పదం ఝలఝలం-చలిత మంజు కటకమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹