🙏🕉️శ్రీ మాత్రేనమః. శుభోదయం🕉️🙏 🏵️వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు.. వెళ్ళిపోయినప్పుడు ఏమి తీసుకుపోము అని తెలియని వారుండరు.. అయినప్పటికి అందుకొనే వాటి కోసం పోరాటాలు.. అందుకోలేకపోయామని ఆరాటాలు చేస్తుంటారు.. అందివచ్చిన అవకాశాల పట్ల చిన్న చూపు.. అందుకున్న వారి పట్ల మాత్రం పెద్ద చూపును చూస్తూ మనసును చిత్రవద చేసుకుంటారు🏵️మన జీవితం అంటే ఆది మనము మాత్రమే తయారు చేసుకునేది కాదు.. అందులో మన జీవితంలోకి వచ్చిన ప్రతీ ఒక్కరి పాత్ర ఉంటుంది.. మరియు ఆది మన జీవితంలో జరిగిన అనుభవాల సారాంశము.. మనమందరం ఒకరి జీవితంలో ఇంకొకరు బాగస్వాములం.. మనము తోటి వారిని ప్రోత్సాహించే వ్యక్తులుగా ఉందాము.. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే విమర్శించే వాళ్ళు పుష్కలంగా ఉన్నారు🏵️లేని వాటి కోసం వెంపర్లాడతారు.. వున్న వాటిని ఉపయెగించుకోలేరు.. కనుక ఉన్న అవకాశాలను సద్వినియెగం చేసుకుంటే సంతృప్తి లభిస్తుంది.. అదే సంతోషానికి పునాది అవుతుంది.. అంతులేని ఆనంద జీవన సౌరభానికి వారధిని కడుతుంది.. వ్యర్థ ఆలోచనల వలన సమయం వ్యర్థంగా పోతుంది.. సమయం వ్యర్థమైతే జీవితం వ్యర్థమైనట్లే🏵️🏵️మీ * అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజెన్సీస్ .D.N.29-గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమహేంద్రవరం వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు లేదా కొత్త వారికి రాలేని వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి