*విద్యారణ్యం-అత్యుత్తమ వేదపాఠశాల*
*అవమానం..అవహేళన లను దిగమింగుకుని పట్టుదల ఉక్కు సంకల్పంతో గొప్ప లక్ష్యాన్ని సాకారం చేసుకుంటున్న ఓ వేదపండితుని విజయగాథ*
వేదం మాకు కర్ణకఠోరం...మా కాలనీలో వేదపాఠశాల మాకు శబ్ద కాలుష్యం కలిగిస్తోంది...వెంటనే పాఠశాల ఇక్కడి నుంచి తొలగించండి అంటూ హుంకరిస్తూ వేదాన్ని అపహాస్యం..అవహేళన చేసి.. వేదపాఠశాల నిర్వాహకుడిని పరుష పదజాలంతో తూలనాడిన ఓ దుర్మార్గుడి అకృత్యం...జ్ఞాపకం చేసుకున్నపుడల్లా ఒళ్ళు జలదరిస్తుంది...ఆ దుర్మార్గుడి తీరుపై అసహ్యం వేస్తుంది.. బోడుప్పల్ లోని ఆర్ ఎస్ ఎన్ కాలనీలో 2017 నవంబరులో (ఏడేళ్ల క్రితం) ఈ ఉదంతం మరచిపోలేని పైశాచిక దుర్ఘటన...దుర్మార్గుడి బెదిరింపులు, పరుషతిట్లకు తీవ్ర మనస్తాపం చెందిన ఈ ఘటనలో బాధితుడు వేదపాఠశాల నిర్వాహకుడు బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి ఎంతో కసి, పట్టుదలతో... సడలని మనోధైర్యంతో తనను, వేదాన్ని తూలనాడిన దుర్మార్గుడితో యుద్ధం చేసి ఎదుర్కునేకన్నా గొప్ప వేద విద్యాలయాన్ని స్థాపించి వాడి వాడి తత్వం గల దుర్మార్గపు సమాజానికి గట్టి సమాధానం చెప్పాలని ప్రతిన బూనాడు..వేరే చోట పాఠశాల ఏర్పాటు కోసం ఎంతో మంది స్థలాలు విరాళాలు ఇవ్వటానికి ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి...మహేశ్వరం లోని తమ స్వగ్రామం సొంత స్థలం లోనే వేద విద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని విద్యారణ్యం అనే సంస్థకు అంకురార్పణ చేశారు .తమ పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 50 కోట్ల ప్రణాళికతో విశ్వ విద్యాలయ స్థాయిలో వేద విద్యాలయ భవననిర్మాణ సముదాయానికి శ్రీకారం చుట్టారు...ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 125 మంది విద్యార్థులతో వేద విద్యాలయం, 75 గోవులతో గోశాల నిర్వహిస్తున్నారు...అనేక మంది ధార్మికులు, వదాన్యులు చేయూత నిస్తుండగా ఇప్పటి వరకు అధ్యాపకుల నివాస సముదాయం, భోజన శాల,వంటశాల భవనాలను దాదాపు 8కోట్ల రూపాయల వ్యయం తో పూర్తి చేసారు .ఆధునిక హంగులతో సువిశాల గోశాల ప్రాంగణం, పిల్లలకు ఈత కొలను, సహజ సిద్ధ సభా మండపం, ఉద్యాన వనం, పిల్లల ఆటపాటలు, ఆహ్లాదం కోసం పార్కు ఏర్పాటు చేసారు ...నివాస సముదాయం మధ్యలో రాతి కట్టడంతో(కృష్ణ శి ల) రాజశ్యామల దేవాలయం శరవేగంగా నిర్మాణం అవుతున్నాయి...ఇంకా ఆధునిక సకల హంగులతో 500 మంది విద్యార్థులకు సరిపడా విద్యాలయం, వసతి గృహం నిర్మాణం పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఇప్పటికే అత్యుత్తమ వేద విద్య తో పాటు లౌకిక విద్య(ఆంగ్లం, కంప్యూటర్, దూరవిద్య ద్వారా డిగ్రీ) కోసం తగిన ప్రణాళికతో విద్యావిధానాన్ని అమలు చేస్తున్నారు..పదెకరాల స్థలంలో దాదాపు యాభై కోట్ల రూపాయల వ్యయంతో విద్యాలయం నిర్మాణ ప్రణాళిక రూపొందించి అమలుచేస్తున్నామని...మరో మూడేళ్లలో ఈ ప్రణాళిక పూర్తవుతుందని విశ్వవిద్యాలయ స్థాయిలో మౌలిక వసతులు, వేదవిద్యా బోధన ఉండేలా ప్రణాళిక కార్యాచరణ అమలు చేస్తున్నామని విద్యారణ్యం నిర్వాహకులు మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి తెలిపారు...చెన్నై ఐఐటి వారు తన పాఠశాలకు తగిన నిర్వహణ,కార్యాచరణకు సాయం అందించటానికి ముందుకు వచ్చారని తెలిపారు ...సంస్కృతం, ఆంగ్లం, కంప్యూటర్ సహా లలిత కళలు, మార్షల్ ఆర్ట్స్, క్రీడల్లో ఆయా రంగాల నిపుణులు,కళాకారులచే శిక్షణ ఇప్పిస్తున్నామని శశి భూషణ శర్మ సోమయాజి తెలిపారు .. బోడుప్పల్ లో వేదపరిరక్షణోద్యమం నుంచి ఏడేళ్లుగా పాఠశాల ఏర్పాటు కార్యాచరణలో పాలుపంచుకున్న నేను నిన్న విద్యారణ్యంలో జరిగిన శ్రౌత యాగం పూర్ణాహుతి లో పాల్గొని ...అనంతరం అక్కడి విద్యాలయం నిర్మాణ పురోగతిని శశుభూషణ సోమయాజి ద్వారా తెలుసుకుని వారిని ఇంటర్వ్యూ చేసాను...మొత్తం మూడు వీడియోల లింకులు కింద ఉన్నాయి...
మీకు వీలు కుదిరినప్పుడు దయచేసి ఈ వీడియోలు చూడండి ..
https://youtu.be/r4YJws70Uyc
https://youtu.be/HBlST5KP6WQ
https://youtu.be/uDP5BA3RljY
వీలు కుదిరితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని చిప్పల పల్లి లో ఉన్న విద్యారణ్యం వేదపాఠశాలను సందర్శించండి...ఈ ఉదాత్త కార్యాచరణలో మీరూ భాగస్వాములై తోచినంత సాయం చేయండి ...
మీ దర్శనమ్ శర్మ
విద్యారణ్యం వివరాలు:
Vidyaranyam CONTACT DETAILS
Account Details:-
VIDYARANYAM VAIDIKA TRUST
BANK OF BARODA
CURRENT AC NO:- 54180200000269
IFSC CODE: BARB0MAHESW
( USE BARB ZERO MAHESW )
MICR CODE: 501012582
UPI ID:- vidya96031@barodampay
Contact:
9603167371,
7013976136
vidyaranyam18@gmail.com
Vidyaranyam Rout Map
https://maps.app.goo.gl/hKyNokPLGF9LEjX86
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి