నేడు అనగా మార్గశీర్ష మాసం, కృష్ణపక్షం, అష్టమి అనగా కాలభైరవస్వామి ఆవిర్భవించిన రోజు.
ఎవరైనా ఏదైనా సాధించలేకపోయినా, సాధించినా సాధారణంగా అందరం ఒక మాట అంటూ ఉంటాం, అదేంటంటే, కాలం కలిసిరాలేదు అనో లేదా కాలం కలిసి రావడం వల్ల వాడు గొప్పోడు అయ్యాడనో ఇలా ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా "కాలం" గురించి అంటూ ఉంటాం.
అలాంటి కాలాన్ని మనం జయించలేము అని కొందరు అంటారు. కానీ, దివ్య జ్ఞానం కలిగిన వారు మాత్రం "కాలాన్ని జయించడం చాలా కష్టం" అంటారు గానీ, అసాధ్యం అని మాత్రం అనరు.
అలాగే, మన జాతక దోషాలు కావచ్చు, పూర్వజన్మ పాప కర్మలు కావచ్చు, ఏవైనా పితృ, సర్పాది దోషాలు కావచ్చు అవి అన్నీ కూడా మనకి కాలం కలిసి వచ్చినప్పుడు ఏమీ చేయలేవు.
ఐతే, అలా మనకి కాలం కలిసిరావా లంటే అప్పుడు ఆ కాలానికి అతీతుడు, శాసకుడు ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుంది.
అలాంటి కాలాన్ని శాసించే రూపమే "కాలభైరవ" రూపం. అందుకే ఎవరైతే "నాకు టైం బాగాలేదు" అని భావిస్తూ ఉంటారో వాళ్ళు అందరూ తప్పకుండా ఈ రోజు కాలభైరవస్వామి వారిని పూజించడం వల్ల వారికి అడ్డుపడుతున్న దుష్టశక్తులు అన్నీ పక్కకి తొలగిపోతాయి.
ఈ రోజు "కూష్మాండ దీపం" పెట్టడం ఎంతో విశేషంగా చెప్తారు.
అందరూ ఈ రోజు కాలభైరవ అష్టకం గాని, తీక్ష్ణదంష్ట్ర కాలభైరవ అష్టకం గాని పదే పదే చదవండి.
మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని సార్లు చదవండి.
అలాగే స్వామి వారికి గారెల మాల సమర్పించండి.
మీ ఇంటి వద్ద ఏవైనా శునకాలు ఉంటే అందులోనూ నల్లటి శునకాలు ఉంటే రొట్టెలు చేసి ముక్కలు చేసి దాని మీద కొన్ని నువ్వుల నూనె చుక్కలు వేసి పెట్టడం చాలా శ్రేష్టం ఎందుకంటే స్వామి వారి వాహనం శునకం.
ఈ రోజు కాలభైరవ స్వామి ప్రీతి కోసం చేసే పనులు వల్ల జాతకంలోని అన్నీ గ్రహదోషాలు తొలగుతాయి. అందులోనూ ముఖ్యంగా "శనైశ్చరుడి అనుగ్రహం" సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే, కాలభైరవస్వామి వారి శిష్యుడే శనైశ్చరుడు. గుర్వనుగ్రహం ఉన్నప్పుడు శిష్యుడు అనుగ్రహిస్తాడే గాని పీడించడు.
ప్రస్తుతం సమాజంలో ఎన్నో దుష్టశక్తులు మన సనాతనధర్మం పై దాడి చేస్తూ ఉన్నాయి, అలాంటి వారిని తిప్పికొట్టగలిగే మహత్తరమైన శక్తి "కాలభైరవ" శక్తి. కాబట్టి కాలభైరవుని అనుగ్రహం మన ధర్మానికి ఎంతో ఆవశ్యకం.
*🙏🏻ఓం నమః శివాయై చ నమః శివాయ!🙏🏻*
*ఓం నమో భగవతే కాలభైరవాయ!*
(డా. ఆర్.వి. కుమార్ గారి సౌజన్యంతో)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి