25, జులై 2022, సోమవారం

పచ్చ కుంకుమ

 *"కుబేర పచ్చ కుంకుమ"*



మన భారతదేశంలో

"పసుపు-కుంకుమ"లను మంగళకరమైనవిగా, 'సౌభాగ్య'చిహ్నాలుగా భావించి, పవిత్రంగా చూసుకుంటారు !!


ఏ శుభకార్యానికైనా, పూజలకైనా,

ముందుగా......సిధ్ధం చేసుకునేవి.......,

'పసుపు-కుంకుమ"లే !!


పసుపులో పచ్చి పసుపు , కస్తూరి పసుపు, ఛాయ పసుపు, కొమ్ములు, దుంప పసుపు,అని పలు రకాలు !! అలాగే........,

కుంకుమలో కూడా పలు రకాలు వున్నాయి !! ఎరుపు, ముదురు ఎరుపు,సింధూరపు రంగు, మీనాక్షీ కుంకుమ,( ఈ కుంకుమ మొగలి పూవుల సువాసనతో వుంటుంది.)మొ.

ఎక్కువగా వాడుకలో వున్నాయి !!


కానీ. 'కుంకుమ'లో 'ఆకుపచ్చ' రంగు కుంకుమ గురించి మనకు తెలీదు !! దీనినే "కుబేరపచ్చ కుంకుమ" అంటారు !!


ఈ కుబేరపచ్చ కుంకుమకు ఓ ప్రత్యేకత ఉంది !!

పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ,

'కుబేరునికి చాలా ప్రీతికరమైనది' !!

అలాగే.........,

'పార్వతీదేవి' కి ప్రీతికరమైన రంగు కూడా,

ఈ........'పచ్చ రంగే' !!


ఈ 'కుంకుమ' గురించి

#శివపురాణం యిలా వివరించింది !!


'పరమశివుని భక్తుడైన కుబేరుడు' ఒకసారి కైలాసానికి వెళ్ళాడట !!

అక్కడ ఏకాంతంగావున్న శివపార్వతులను చూశాడట !ప్రతిరోజూ...దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆరోజు 'అంబిక' ను దర్శించగానే..

'కామవికారానికి, లోనయ్యాడట !!

ఒక్క క్షణం 'పార్వతీ దేవి'ని, తన భార్యగా ఊహించుకున్నాడట !!


'సర్వజ్ఞాని' ఆ......... సర్వేశ్వరునికి, ఇది తెలియకుండా ఉంటుందా ??

సర్వేశ్వరునికి కోపం వచ్చింది !! శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది !!

శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు !!

ఆ......చూపుల తీక్షణతకు, కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట !!

కుబేరుడు గడగడా వణికి పోయాడు !! పరమశివుని కాళ్ళమీదపడి, మన్నించమని

వేడుకున్నాడు !!


మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన యీ ఉగ్రత, మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది !!

అప్పుడు.......ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి, నీ చర్మం కమిలి పోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది !!అని పరమేశ్వరుడు కుబేరుని, దీవించాడు !!


అప్పుడు కుబేరుడు.........,

పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో, స్తుతించాడట !!

త్వరగానే పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట !!

వారి అనుగ్రహంతో కుబేరునికి, స్వస్ధత చేకూరిందట !!


అయినా............,

శరీరం కాలిన ప్రదేశాలలో, తప్పుకి శిక్ష గా, మచ్చలు శాశ్వతంగా వుండి పోయాయట !!


పరమేశ్వరుని కంఠం చుట్టూగల నీలం వర్ణం, పార్వతీ దేవి పసిమి ఛాయ.......,

{అంబిక మంగళరూపిణిగా దర్శనమిచ్చి నప్పుడు, పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది !! ఆ పసుపు వర్ణాన్ని, తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన

పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు}

ఈ.....నీల వర్ణం, ఆ....పసుపు వర్ణం రెండూ కలసినప్పుడు,

అక్కడ ఒక అద్భుతం జరిగిందట !!

ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా 'ఆకుపచ్చ'గా మారి పోయిందట !!

{నీలం....పసుపు రంగులను మిశ్రం చేస్తే,

ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది} !!


కుబేరుడు ఆ........'ఆకుపచ్చ మట్టి'ని తన శరీరానికి, పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా, మామూలు స్థితిని పొంది, శివపార్వతుల ఆగ్రహంనుండి విముక్తి పొందాడట !!

అంతే కాకుండా.............,

ఆ......పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకొని వెళ్ళి, నిత్యం శరీరానికి ధరించేవాడట !!


ఆనాటి నుండి 'పచ్చరంగు' కుబేరునికి


 ప్రీతిపాత్రమయిందట !!

'పచ్చరంగు కుంకుమ' కుబేర చిహ్నంగా అయి, పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకుంది !!


చర్మ రోగానికి ఈ కుంకుమ అద్భుతంగా పనిచేస్తుంది. ఈనాటి వైద్యుల ఉవాచ

ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం

 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..

ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....


అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.


వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసo

స్వర్ణప్రాశ్య లేహ్యము

 స్వర్ణప్రాశ్య లేహ్యము గురించి సంపూర్ణ వివరణ -


         ఈ లేహ్యము ప్రాచీనమైన ఒక మూలికల సమూహము మరియు భస్మాలను కలిపి తయారుచేయడం జరుగును . ఈ లేహ్యము నందు సుమారు 36 రకాల మూలికలు మరియు స్వర్ణభస్మం , రజతభస్మం , ముత్యభస్మం , శతపుటి అభ్రకం మొదలైన భస్మాలను కూర్చి స్వచ్ఛమైన తేనెతో కలిపి ఈ లేహ్యం తయారగును . ఇందులో కలిపే మూలికలను ఒక్కొక్కటి శుద్ది చేయుచూ ఉపయోగించవలెను . 


  ఈ లేహ్యం ఉపయోగించటం వలన ప్రయోజనాలు - 


 *  శరీరము నందలి మేహ సంబంధ దోషాలు నివారణ అగును . 


 *  నీరసం , నిస్సత్తువ తగ్గును . 


 *  శరీరము నందు కండరాలు బలహీనపడి ఉన్నవారు మరియు శరీరము బక్కచిక్కి ఉన్నవారికి ఈ లేహ్యం వాడుచున్న కండరాలు బలంగా తయరగును . కండరాలు వృద్ధిచెందును . 


 *  గుండె సంబంధ దోషాలు , గుండెల్లో దడ , గుండె మంట నివారణ అగును . 


 *  నోటివెంట రక్తము పడుట తగ్గును . 


 *  శరీరము నందు రక్తము వృద్ది అగును . 


 *  రక్తము శుద్దిచేసి రక్తము నందలి టాక్సిన్స్ నిర్వీర్యం చేయును . 


 *  థైరాయిడ్ గ్రంథి మీద పనిచేయును . గ్రంథి పనితీరు మెరుగుపరచును . 


 *  మెదడు నందలి న్యూరాన్లకు మంచిశక్తిని ఇచ్చి బుద్ధిబలమును , జ్ఞాపకశక్తిని పెంచును . 


 *  ఎముకలు బలపడును . మరింత గట్టిగా తయారగును . శరీరము నందలి క్యాల్షియం లోపములు తగ్గును. 


 *  ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవారు , ఆయసముతో ఇబ్బందిపడువారికి ఇది అత్యంత పుష్టిని కలుగచేయును . 


 *  కాలేయమునకు బలమును ఇచ్చును. 


 *  ఆడవారిలో గర్భసంబంధ దోషములను నివారించును . 


 *  వయస్సు పెరుగుతున్న కొలది వచ్చు బలహీనత మరియు ఎముకల సులువుగా విరిగిపోవడానికి కారణం అయిన క్యాల్షియం లోపాన్ని పోగొట్టును . 


 *  గర్భాశయాన్ని , అండాశయాలు శుద్దిచేయును . 


 *  నరాల సంబంధ దోషాలను నివారించును . 


 *  కాళ్ళు పట్టుకుపోవడం , కండరాల నొప్పులు నివారించును . 


 *  చర్మాన్ని కాంతివంతముగా ఉంచును . 


    

         పైన చెప్పినవే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచును . ఈ మధ్యకాలంలో కరోనా వచ్చి తగ్గినవారిలో తీవ్రమైన బలహీనత ఏర్పడుచున్నది. అటువంటి సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ లేహ్యాన్ని వాడటం మూలన త్వరగా శరీరబలాన్ని పొందవచ్చు. మాములుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని వాడుట మూలాన శరీరం నందలి రోగనిరోధక శక్తి పెరుగును రోగాలపాలు కాకుండా ఉంటారు . 


      ఈ లేహ్యంను చిన్నవారు మొదలుకొని స్త్రీపురుషులు మరియు వయస్సు మీదపడిన పెద్దవారు సహా అందరూ వాడవచ్చు . ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు . 


ముఖ్య గమనిక - 


      కరోనా వచ్చి తగ్గి శరీర బలహీనతతో ఇబ్బంది పడువారు ఈ లేహ్యాన్ని వాడుట వలన అత్యంత త్వరగా బలాన్ని పొందగలరు. 


           ఈ లేహ్యం కావల్సినవారు డైరెక్టుగా కాల్ చేయగలరు . 

   సంప్రదించవలసిన నంబర్       9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                      9885030034

రామాయణానుభవం_ 111*

 🌹 *రామాయణానుభవం_ 111* 


జాంబవంతుని మాటలతో నిజబలాన్ని గుర్తించిన హనుమ తన రూపాన్ని అంతకంతకు అధికం చేసికోసాగాడు. మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచిన త్రివిక్రముని ఆనాడు సురులు, భూసురులు ప్రస్తుతించినట్లు సముద్రాన్ని లంఘించడానికి పెరిగి పోతున్న హనుమ మహారూపాన్ని చూచి వానరులు సంభ్రమాశ్చర్యాలతో

స్తుతింప సాగారు.


గిరి గుహలో కేసరి తన శరీరాన్ని విస్తరింపజేసినట్లు హనుమ విజృంభింపసాగాడు. ఆయన ముఖము కాలిన పెనమువలె ఎఱ్ఱ బడింది. ఉత్సాహంతో ఆయన దేహంలోని వెంట్రుకలు నిక్కబొడుచుకొన్నాయి.


హనుమ ఒక్కసారి లేచి వానర వీరులకు నమస్కరించి నిలుచున్నాడు. ఆయన తన శక్తి సామర్ధ్యాల గురించి వారికి వివరింపసాగాడు.


అప్రమేయ బలసంపన్నుడు, అగ్నిహోత్ర మిత్రుడైన మా తండ్రి వాయుదేవుడు తన వేగంతో మహా పర్వత శిఖరాలను బంతులవలె ఎగర గొట్టగల్గుతాడు. గమనం లో ఆయనకు సాటి లేరు.


నేను వాయుదేవుని ఔరసపుత్రుడను. ఆయన ప్రసాదమువలన నేను కూడ మహావిస్తీర్ణమైన ఆకాశము యొక్క ఆద్యంతాలను స్పృశింపగలను. మేరు పర్వతాన్ని - ఆగకుండా మూడు మారులు పరిక్రమించగలను. నా బాహుబలానికి సముద్రము అల్లకల్లోలమై సమస్త పృథివీతలాన్ని జలమయం చేస్తుంది. జలచరాలన్ని నా తొడల పిక్కల రాపిడికి ఉవ్వెత్తుగా ఎగిరి పడుతాయి.


మహానుభావుడు, అమిత సత్వ సంపన్నుడైన గరుత్మంతునికి నేను వేలసార్లు ప్రదక్షిణం చేయగలను. సూర్య భగవానుడు ఉదయాద్రి నుండి బయలుదేరి అస్తమయాద్రికి పయనించేలోపు నేను ఆయనకంటే ముందుగా పయనించి తిరిగి వచ్చి ఉదయాచలాన్ని చేరగలను.


నా పరాక్రమంతో సముద్ర జలాన్ని ఎండింపగలను. భూమిని బ్రద్దలు చేస్తాను. మేఘాలను చిందరవందర చేస్తాను. నేను ఆకాశంలో ఎగిరేవేళ పర్వతాలపై ఉన్న వృక్షాలు లతలు, పుష్పాలు తమ నాయకుని అనుసరించే అనుచరులలాగా నన్ను అనుసరిస్తాయి. ఆకాశాన్ని మ్రింగేలా వెళ్లుతున్న నన్ను చూచి సకల భూతాలు సంభ్రమాశ్చర్యాలలో మునిగి పోతాయి.


ప్రశస్తమైన నా బుద్ధిబలంతో లంకలో ప్రవేశించి సీతాదేవిని తప్పక చూచి రాగలను. వజ్రాయుధుడైన మహేంద్రుని ఎదిరించి అమృతాన్ని లాగుకొని రాగలను. లంకను పెకిలించి తీసికవచ్చి రాముని పాదాలముందు ఉంచగలను". ఈ విధంగా వానర వీరులు భయాందోళనలు తొలిగి పోయేలా పరాక్రమ సంపన్నుడై గర్జిస్తున్న హనుమను చూచి వానర వీరులు హర్షపరవశులయ్యారు.


వృద్ధుడు, బుద్ధిమదగ్రేసరుడైన జాంబవంతుడు హనుమ ఉత్సాహపరాక్రమాలకు సంతోష భరితుడయ్యాడు. 


ఆయన హనుమకు కార్య సిద్ధి కలిగేలా శుభాశీర్వచనాలను పలికాడు. తదితర వానర వీరులకు ప్రణమిల్లి వారి మంగళాశాసనాలతో ముందడుగు వేయుమని ఉపదేశించాడు.


హనుమ తన సముద్రలంఘన వేగాన్ని భూమి భరింపజాలక బద్దలవుతుందని అందువలన సుస్థిరములైన మహేంద్ర పర్వత శిఖరాలనుండి సముద్ర లంఘనం చేస్తానని తెలిపి, ఆగిరి శిఖరాన్ని అధిరోహించాడు. 


ఆ పర్వత శిఖరాన్ని తన పాద బలంతో అదిమి పట్టాడు. అప్పుడు ఆ పీడనానికి మృగాలు, మాతంగాలు భయపడ సాగాయి. కన్నముల నుండి సగము పైకి వచ్చిన భుజంగాలు విజయ పతకాలవలె శోభిల్లాయి.


మనస్సులో మహోత్సాహాన్ని, శరీరంలో మహావేగాన్ని నింపుకొన్న శత్రుహంత అయిన హనుమ సముద్రాన్ని దాటి లంకలో చేరడానికి సన్నద్ధుడయ్యాడు. 


*స వేగవాన్ వేగసమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంతా,*

*మన స్సమాధాయ మహానుభావో జగామ లంకాం మనసా మనస్వీ.*


మహావేగము కలవాడు, అట్లు వేగముగ పోవుటయం దాసక్తి కలవాడు, శత్రువీరులను సంహరించువాడు, వానరులలో మేటి, కార్యసాధనకై దృఢ నిశ్చయము కల ఉత్తమ మనస్సుతో కూడిన హనుమంతుడు మనస్సులో సముద్రము దాట నిశ్చయించి, మనస్సుచే అప్పుడే లంకను చేరెను.


ఆయన కంటే ముందే ఆయన మనస్సు లంకవైపు పరుగులు తీసింది.


 _కిష్కింధా కాండ సమాప్తం._

*జై శ్రీ రామ్*


**


*సుందరకాండ ప్రారంభం*


శ్రీమద్రామాయణంలో ఇది వరకు గడచిన "బాలకాండ" శ్రీరామచంద్ర స్వామి బాల్యాన్ని సీతాకల్యాణం వరకు తెలిపింది. “అయోధ్య”, “అరణ్య”, “కిష్కింధ” కాండలు స్వామి నివసించిన స్థలాలను వివరిస్తున్నాయి.


అలాగే రాబోయే "యుద్ధకాండ” ప్రధానంగా “రామరావణయుద్ధాన్ని” వివరిస్తుంది. “ఉత్తరకాండ” శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకానంతరము (ఉత్తర = పట్టభిషేకము తరువాత) జరిగిన సీతావనవాసము, లవకుశ జననము, అశ్వమేధయాగము, సీతాదేవి భూప్రవేశము మొదలైన సంఘటనలను తెలుపుతుంది. ఇందులో "సీతాయాశ్చరితం మహత్" అని సీతాదేవి చరిత్ర అధికంగా ఉంటుంది.


ఈ సుందరకాండ మిగిలిన అన్ని కాండలకంటే విలక్షణమైంది. నిజంగా ఇందులో శ్రీరామునికి సూటిగా సంబంధము కల చరిత్ర చాల తక్కువ. సీతాదేవి చరిత్ర కొంత ఎక్కువ. అయితే వీరి ఇద్దరి కంటే ఆద్యంతములలో కూడ హనుమకు సంబంధించిన చరిత్ర నిండుగా ఉంటుంది.


అటువంటప్పుడు ఈ కాండకు “హనుమత్కాండ” అని పేరు పెట్టవచ్చు కదా! మరి వాల్మీకి కవీంద్రుడు హనుమ పేరును ఈ కాండకు ఎందుకు పెట్టలేదు?


హనుమ అత్యంత వినయ సంపన్నుడు. రాముడు తనను దూతగా పంపడం, తాను సముద్రం దాటి లంకలో సీతాదేవిని సందర్శించి ఆమెను ఓదార్చడం, రాక్షస సైన్యాన్ని వధించడం, సీతాక్షేమవార్తను శ్రీరామునికి తెలియజేయడం మొదలైన అద్భుత కార్యాలను తాను నిర్వహించినా, వీటన్నిటికి కారణము తన గొప్పదనమని హనుమ ఎన్నడు అనుకోలేదు. వీటన్నిటికి “తన పేరు” వాడు కోవడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు.


ఈ కాండకు తన పేరుతో “హనుమత్కాండ” అని పేరు పెట్టడం తనకేమాత్రము ఇష్టము లేదని వాల్మీకి మునీంద్రుని కలలో కనబడి హనుమ చెప్పాడని పురాణాంతరాలలో ఒక కథ ఉంది. ఆ కథ నిజమో, కాదో తెలియదు. కాని హనుమ స్వభావము మాత్రము ("స్వోత్కర్ష"ను) తన గొప్పదనాన్ని ప్రకటించుకోవడానికి విరుద్ధమని అందరికి తెలిసిందే. 


"యధా రాఘవ నిర్ముక్తః శరః" అని తనను రాఘవుడు ప్రయోగించిన బాణంగా (రాముని పనిముట్టుగా) హనుమ భావించాడు.


 బ్రహ్మ వరప్రసాదంగా ("సర్వంతేవిదితంభవతి” అని) అన్ని తెలిసిన వాల్మీకి మహర్షి హనుమ స్వభావాన్ని గుర్తించినందువలన ఈ కాండకు "హనుమత్కాండ" అని నామకరణం చేయలేదు. అయితే ఈ కాండను హనుమంతుని పేరు నుండి వేరు చేయడం కూడ వాల్మీకి మునీంద్రుని ఇష్టం కాదు. హనుమ పేరును సూటిగా పెట్టవద్దు. కాని “హనుమ” అనే అర్ధము వచ్చేట్లుగా పేరు పెట్టాలి.


"సుందరో, వానరః కపిః” అని “సుందరుడు”, “వానరుడు”, “కపి” అనే పదాలు హనుమను సూచిస్తాయి. మిగిలిన పదాల కంటే “సుందరుడు” అనే పేరు బాగుంటుందని వాల్మీకి కవీంద్రుడు అనుకొని ఈ కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టాడు.......

వాస్తవం - అవాస్తవం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

    *🌷వాస్తవం - అవాస్తవం🌷* 

                    🌷🌷🌷

       

ఒక గురువుగారు మరియు అతని శిష్యుడు వీధి దీపాల కింద నడుచుకుంటూ వెళుతున్నారు...


శిష్యుడు గురువుగారిని ఒక ప్రశ్న అడుగుతాడు..


అయ్యా! వాస్తవమంటే ఏమిటీ...?

అవాస్తవమంటే ఏమిటి...?""అని...


గురువుగారు చాలా ఆచరణాత్మక భోధిసత్తుడు....

మౌనంగా ఆ వీధి దీపాలకిందే నడుస్తూ ఉంటాడు ప్రశ్న వున్నప్పటికీ కూడా...


కొంత దూరం వెళ్ళాక తల ఎత్తి ఆ దీపాల వైపు చూస్తాడు

ఆరిపొమ్మన్నట్లు ఆజ్ఞ జారీ చేస్తూ మౌనంగానే.....


వున్నట్లుండి ఆ దారిలోని చమురు దీపాలన్నీ ఆరిపోతాయి..

ఇద్దరూ నడుస్తూనే వుంటారు....ఇంతలో వాళ్లముందర ఒక

పాము కనిపిస్తుంది దారికి ఎదురుగా...


శిష్యుడు అటూ ఇటూ వేదికి చివరికి ఆ చీకటిలో కఱ్ఱలాంటిదేదో చేతికి చిక్కితే దాన్ని తీసుకుని ఆ పాముని

గబా..గబా..అని నాలుగు బాదుతాడు....


అదే సమయంలో గురువుగారు  తల పైకెత్తి దీపాలను

వెలగమన్నట్లు మౌనంగానే ఆజ్ఞ జారీ చేస్తాడు...దీపాలన్నీ మళ్లీ వెలుగుతాయి...


ఆ వెలుగులో చూస్తే శిష్యుడు ఏదైతే పామనుకున్నాడో అది

పాము కాదు...వంకర కర్ర..

అదే సమయంలో ఏదైతే కర్ర అనుకుని చేతిలో పట్టుకున్నాడో

 అది పాము....

శిష్యుని గుండె ఆగినంత పనైంది...వెంటనే ఆ పామును 

వదిలేసి కర్రను పట్టుకుంటాడు...

గురువు గారు చిన్నగానవ్వి....""శిష్యా నీ ప్రశ్నకి సమాధానం దొరికిందా"""? అని అడుగుతాడు....


ఇప్పుడు శిష్యుడు రెండు చేతులు జోడించి గురువుగారికి

ప్రణమిల్లుతాడు....


అప్పుడు గురువుగారు...


చూడు శిష్యా ఈ మానవుడు....

ఏదైతే కనబడుతోందో ( శరీరము,,,ఆస్తులు,,,భౌతికము,,బంధాలు,,)

వాటిని వాస్తవమని నమ్ముతాడు...నువ్వు 

కర్రని పామని నమ్మినట్లు....పైవన్నీ కూడా కేవలం

మనసులో ఇమిడే భావాలు మాత్రమే....ఎవైతే మనసులో

ఇముడుతాయో అవన్నీ అవాస్తవాలే...కానీ వాటినే సత్యమనీ ,,శాశ్వతమనీ ,,నమ్ముతున్నాడు

ఇక ఏదైతే కర్ర అనుకున్నావో అది పాము....


ఈ మనిషి అనేవాడు

 ,,,ఏదైతే మాయకు ప్రాణం పోస్తుందో,,, ఏదైతే బంధానికి ప్రాణం పోస్తుందో,,,ఏదైతే ద్వంద్వానికి ఊతం ఇస్తుందో,,, దాన్నే,,, ఆ పామనే మనస్సునే వాణ్ణి వాడు రక్షించుకునే ఆయుధంగా వాడతాడు....


పాము సత్యం కానీ అది చేతిలో ఉంది...కర్ర అనుకుంటున్నావు కాబట్టి...అవాస్తవం...

కర్ర సత్యం కానీ అది కింద ఉంది...పామనుకుంటున్నావు కాబట్టి..... ఇదీ అవాస్తవమే....


 ఏదైతే చంపబడాలో ( మనస్సు ) దాన్ని పట్టుకుంటాడు...

ఏదైతే చంపడానికి పనికొస్తుందో (జ్ఞానం ) దాన్నే పామనుకుని వదిలించుకోవాలనుకుంటాడు....


కనబడుతున్న దాన్ని ( శరీరాన్ని ) శాశ్వతసత్యమని 

కనబడని ఆత్మను అసత్యమని నమ్ముతాడు.......

చీకట్లో ఉన్నంత వరకూ మనిషి ఇలాగే ఉంటాడు...


వెలుగొచ్చాక నువ్వు పాముని వదిలేసి 

కర్రను పట్టుకున్నట్లే...మనిషి

జ్ఞానోదయం అయ్యాక శరీర సత్యం వదిలేసి

ఆత్మసత్యం  పట్టుకుంటాడు.

చిత్తశుద్ధితో శోధించి

 శ్లోకం:☝️

  *వేదాంతార్థ విచారేణ*

*జాయతే జ్ఞానముత్తమం |*

  *తేనాత్యంతిక సంసార*

*దుఃఖనాశో భవత్యను ||*


భావం: ఉపనిషన్మంత్రాలను చిత్తశుద్ధితో శోధించి అర్థం చేసుకోవడం వలన నిత్యసత్యమైన జ్ఞానం జనిస్తుంది. ఆ జ్ఞానం వలన అత్యంత బాధాకరమైన సాంసారిక క్లేశములన్నీ పూర్తిగా నశిస్తాయి.