ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, జులై 2024, మంగళవారం
మిత్రోత్సాహము
: మిత్రోత్సాహము జనులకు
మిత్రత్వము జూపినపుడు మేలొనరించున్
మైత్రీ బంధము నుండినఁ
శత్రువు లను పారద్రోలి సాంత్వన నిచ్చున్:
ఉతికెడిది పట్టు చీరట
ఉతికించెడిది మరి నా మనోహరి యట నే
నుతికిన నిర్మల మగునట
ఉతికెద వేరొండు చీర నుతకగ నేలా
రచన:శనగల చంద్రశేఖర్
(పోతన గారి ప్రసిద్ధ పద్యానికి పేరడి పద్యం సరదాగా రాసినది. క్షమించండి )
😊😊😊😊😊
*దత్తపది*
*తే.గీ.*
*పాలు* మీగడ తియ్యని పద్యరచన!
*వెన్న* పూసగ మెత్తని విలువ లందె!
*జున్ను* ముక్కల భావము జుఱ్ఱుకొనగ!
*మీగడ* తరకల మధురిమ వేగమందె!
కృషితో నాస్తి దుర్భిక్షం
13 సెప్టెంబర్ 2015
కృషితో నాస్తి దుర్భిక్షం
!!
కృషితో నాస్తి దుర్భిక్షం! జపతో నాస్తి పాతకః! మౌనేన కలహో నాస్తి! నాస్తి జాగరతో భయః!!
కృషి(వ్యవసాయము)చేయుచో కఱవుండదు; జపమొనర్చిన పాతకములు తొలగిపోవును; మౌనముగా నుండుచో పోట్లాటలు రావు; జాగరూకత వల్ల భయముండదు.
మన భారత దేశం మౌలికంగా వ్యవసాయాధారిత దేశం. అందుచేత వ్యవసాయం చేస్తే కఱవుండదని అన్నారు.కాని రాను రాను వ్యవసాయం గిట్టుబాటుగా లేకపోవడమే కాకుండా రైతు నష్టాలబారినపడి వ్యవసాయానికి క్రమక్రమంగా దూరమౌతున్నాడు.ఉచిత విద్యుత్తూ జలయజ్ఞం వగైరాలు అతణ్ని ఎంత వరకూ గట్టెక్కిస్తాయో వేచి చూడాల్సిందే.
మంగళవారం*🍁 🌹 *జూలై 30, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
🌹 *జూలై 30, 2024*🌹
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*
*ఆషాఢమాసం - కృష్ణపక్షం*
*తిథి : దశమి* సా 04.44 వరకు ఉపరి *ఏకాదశి*
వారం :*మంగళవారం*(భౌమవాసరే)
*నక్షత్రం : కృత్తిక* ఉ 10.23 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : వృద్ధి* మ 03.56 వరకు ఉపరి *ధ్రువ*
*కరణం : భద్ర* సా 04.44 *బవ* రా 04.17 తె వరకు
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.30 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం :*ఉ 08.02 - 09.36*
అభిజిత్ కాలం :*ప 11.48 - 12.40*
*వర్జ్యం : రా 02.16 - 03.51*
*దుర్ముహుర్తం : ఉ 08.22 - 09.14 రా 11.07 - 11.52*
*రాహు కాలం : మ 03.27 - 05.03*
గుళిక కాలం :*మ 12.14 - 01.50*
యమ గండం :*ఉ 09.01 - 10.37*
సూర్యరాశి : *కర్కాటకం*
చంద్రరాశి : *వృషభం*
సూర్యోదయం :*ఉ 05.48*
సూర్యాస్తమయం :*సా 06.40*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు*
*ప్రయాణం పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.48 - 08.22*
సంగవ కాలం :*08.22 - 10.57*
మధ్యాహ్న కాలం :*10.57 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31 - 04.06*
*ఆబ్ధికం తిధి: ఆషాఢ బహుళ దశమి*
సాయంకాలం :*సా 04.06 - 06.40*
ప్రదోష కాలం :*సా 06.40 - 08.54*
నిశీధి కాలం :*రా 11.52 - 12.36*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.19 - 05.03*
______________________________
🌹 *ప్రతినిత్యం*🌹
*_గోమాతను 🐄పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
⚜️♦️ *శ్రీ ఆంజనేయం*
*శిరసా నమామి*♦️⚜️
⚜️🚩శ్రీరామచంద్రుడు
విజయానంతరం హనుమంతునితో...
♦️ఏకైకస్యోపకారాయ ప్రాణాన్ దాస్యామి హే కపే,
ప్రత్యహం క్రియమాణేన
శేషస్యఋణినావయమ్♦️
👉హనుమా... నీవు చేసిన ఒక్కొక్క ఉపకారమునకు
నేను ప్రాణార్పణం చేసి
ఋణమున తీర్చుకొనువాడును.
నిస్వార్ధంగా నీవు చేసిన సేవల
ఋణమును నేనెట్లు తీర్చుకొనగలను?
సదా నీకు ఋణపడియే యుందును..... అని భావం.
🍁 *ఓం*🍁
🌹 *ఆంజనేయా నమః* 🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
సూక్ష్మంలో మోక్షం
సూక్ష్మంలో మోక్షం... తప్పక చదవాల్సిందే..
తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని
అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి
వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.
మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు
అయింది.కొడుకు....కూతురు అమెరికాలో
స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు
వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు
ఆయన పోయాక నాకు
ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో
కాలం గడుపుతున్నాను.
కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!
చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్
చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.
అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.
నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.
ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని
గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.
కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో
విష్ చేసింది.
అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!
నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.
ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.
నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.
అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు
నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.
" నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ
వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.
మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.
ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.
స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.
"నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.
"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు
సంతాపం తెలియ బరిచింది.
కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి
వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.
"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.
"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.
"ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి
తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు
ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు
తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి
పోయాము.
ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత
నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.
మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి
జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత
గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.
నెల తరువాత ఒక రోజు " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను
మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.
సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.
నాకు సంతోషం అనిపించింది.
తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్
లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా
నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.
వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ తెచ్చింది.
"ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.
స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా
తీసుకోవడం లేదు" అన్నాను.
తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద
ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది. అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..
బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం
మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.
కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.
తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"
అన్నాను.తను రెండు అగరొత్తులు తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం
అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు
మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.
" ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో
బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.
స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు
మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"
అన్నది."అలానే" అన్నాను.
గదిలో అలుముకున్న అగరొత్తుల
పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను
గుర్తు చేస్తూనే ఉంది.
మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో
లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే
బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత
ప్రభాత సమయంలో ఉత్సాహంగా అనిపించింది.
వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి
చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.
స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో
అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని
శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం
అద్భుతం అనిపించ సాగింది.
మావారు ఉన్నప్పుడు పూల కుండీలు
ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి
కొత్త అనుభవం.
మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం
పంచుకుంది.
ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి
ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.
"ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.
రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో
బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి
మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.
తన భావం గ్రహించి" సరే" అన్నాను.
అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...
దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.
ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...
అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...
నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న
మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.
నాలోని మార్పుకు స్వప్నే కారణం.
ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద
వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.
బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను
చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.
మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.
నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు
కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు
ఎంతో తృప్తిని ఇచ్చింది.
పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.
" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.
"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.
నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి
చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"
అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.
ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్
తెచ్చి ఇచ్చింది.
దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.
ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.
పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.
ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.
నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.
" పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.
ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్
మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"
అన్నది.
కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి
ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు
వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్ లో
కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో గర్వంగా అనిపించింది.
స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను
పరిచయం చేసింది.నేను సోఫాలో కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి
వెళ్ళింది.
స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..
" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో
స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు
అక్కడినుంచి వెళ్లి పోయారు.
అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...
మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.
అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.
మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని
చెప్పింది.
అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు
కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే
ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.
స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?
చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.
నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"
అన్నాను.
ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం
బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.
నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో
నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.
కొద్ది కాలానికి మా వారి పేరు మీద
ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి
సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.
ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...
ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.
వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే
ఇచ్చాను!!
Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఊడటం తప్పు కాదు.... 🙏🙏🙏
ఈశ్వరో విక్రమీ ధన్వీ
👆శ్లోకం
ఈశ్వరో విక్రమీ ధన్వీ
మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాధర్షః
కృతజ్ఞః కృతిరాత్మవాన్||
ప్రతిపదార్ధ:
ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
మనిషి జయించవలసిన 6 దోషాలు
✳️*మనిషి జయించవలసిన 6 దోషాలు✳️
******వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం.
ఈ ప్రయాణంలో ఎదురయ్యే " అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, ఎడతెగని ఆలోచన అనే ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడు ".
విదురుడు- భారతంలోని ఉద్యోగ పర్వం.
మన జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలు జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగక పోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహం కారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది.
మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదలి వేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమం లో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే..
👉 అతినిద్ర :-
నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవు తుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే.
👉 రెండో లక్షణం బద్ధకం:-
ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని ఆమోదించ లేని సమయంలో కలిగేది భయం.
👉 భయం :-
భయం వల్ల ఏ పనిని సంకల్పించినా, ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా? అపహాస్యం పాలవుతానేమో? అపజయం కలుగుతుందా’’? అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గి, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం.
👉 క్రోధం :-
క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితు లు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుం ది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు.
👉 అలసత్వం :-
అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు.
👉 ఎడతెగని ఆలోచనలు :-
ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితే నే విజయం.
ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.
✳️ శ్రీ కృష్ణార్పణమస్తు🙏
సనాతన ధర్మం
*🕉️🙏🕉️*
*🕉️🙏"సనాతన ధర్మం - పునర్జన్మ"🕉️🙏*
*🕉️🙏ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు, పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు.🕉️🙏*
*🕉️🙏అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.🕉️🙏*
*🕉️🙏”స్వామిజీ , నేను మీ "సనాతన ధర్మం" యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ "పునర్జన్మ సిద్ధాంతం" నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.🕉️🙏*
*🕉️🙏”ఎందుకంటే మా ధర్మం ప్రకారం- ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెప్పాడు.🕉️🙏*
*🕉️🙏అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర ‘కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా?’ అని అడిగారు.🕉️🙏*
*🕉️🙏అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు, అని అనుకున్నాడు.🕉️🙏*
*🕉️🙏”సరే స్వామిజీ , ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.🕉️🙏*
*🕉️🙏అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.🕉️🙏*
*🕉️🙏ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు,” అని తన కారులో వెళ్ళిపోయాడు. 🕉️🙏*
*🕉️🙏సాయత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.🕉️🙏*
*🕉️🙏“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చేసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.🕉️🙏*
*🕉️🙏"స్వామివారు అతన్ని చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.."*
*”వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉండడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”🕉️🙏*
*🕉️🙏“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి 'పాపము పుణ్యము' అనేది ఏమి లేదు.” అని చెప్పాడు.🕉️🙏*
*🕉️🙏మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది ఆరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు.🕉️🙏*
*🕉️🙏ఇదే "పునర్జన్మ సిధ్ధాంతం” అని చెప్పారు.🕉️🙏*
*🕉️🙏"ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే "పునర్జన్మ సిద్ధాంతం" నిజం అనేది తేటతెల్లమవుతోంది.🕉️🙏*
*🕉️🙏 "ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు".🕉️🙏*
*🕉️🙏"ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వు నవ్వుతోంది."🕉️🙏*
*🕉️🙏"సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం".🕉️🙏*
*🕉️🙏"పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం"||*🕉️🙏
*🕉️🙏అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥🕉️🙏*
*🕉️🙏కంచిపరమాచార్యవైభవం🕉️🙏*
*🕉️🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🕉️🙏*
వేడుకలు
☘️☘️☘️☘️☘️
మన భారతదేశంలో హిందువులు ఒక సంవత్సర కాలంలో జరుపుకునే వేడుకలు
1) వివాహ వేడుక
2) 16 రోజుల పండుగ వేడుక
3) అప్పగింతల వేడుక
4) శ్రీమంతం వేడుక
5) కుమారుడు లేక కూతురు పురిటి స్నానం వేడుక
6) ఉయ్యాల వేడుక
7) నామకరణ వేడుక
8) ముక్కు చెవులు కుట్టించే వేడుక
9) పుట్టి వెంట్రుకలు తీపించే
వేడుక
10) జన్మదిన వేడుక
11) ఉపనయన సంస్కార వేడుక
12) విద్యారంభ వేడుక
13) పుష్పవతి వేడుక
14) ఓణీలు లేదా పంచలు వేడుక
15) షష్టిపూర్తి వేడుక
16) దశదినకర్మ వేడుక
17) ముక్కోటి ఏకాదశి వేడుక
18) భోగి పండుగ
19) సంక్రాంతి పండుగ
20) కనుమ పండుగ
21) రథసప్తమి పండుగ
22) శివరాత్రి పండుగ
23) ఉగాది పండుగ
24) శ్రీరామ నవమి పండుగ
25) అక్షయ తృతీయ వేడుక
26) ఏరువాక పూర్ణిమ వేడుక
27) శ్రావణ శుక్రవారం లో వేడుక
28) రాఖీ పౌర్ణమి వేడుక
29) నాగుల చవితి వేడుక
30) దీపావళి వేడుక
31) కృష్ణాష్టమి వేడుక
32) వినాయక చవితి నవరాత్రుల వేడుకలు
33) అట్లతద్ది వేడుక
34) దసరా శరన్నవరాత్రుల వేడుకలు
35) కార్తీక సోమవారాల వేడుకలు
36) ధనుర్మాసం వేడుకలు
37) గీతా జయంతి వేడుక
38)హనుమాన్ జయంతి వేడుక
39) సత్యనారాయణ స్వామి వ్రతం
40) సావిత్రి వ్రతం
41) కేదారేశ్వర స్వామి వ్రతం
42) జగన్నాధ రథోత్సవం వేడుకలు
43)బ్రహ్మోత్సవ వేడుకలు
44)వివిధ ఆలయాల రథోత్సవ వేడుకలు
45)నదీ పుష్కర వేడుకలు
46) అయ్యప్ప మాలలు
47) శివ మాలలు
48) హనుమాన్ మాలలు
49) వెంకటేశ్వర స్వామి మాలలు
50) కుమారస్వామి మాలలు
51) భవాని మాలలు
52)గృహప్రవేశం వేడుకలు
53)మొక్కులు
54)తీర్ధ యాత్రలు
55)శాంతి యజ్ఞాలు హోమాలు
56)గిరి ప్రధక్షణలు
57)తిరుణాళ్ళు
58)జాతరలు
59)కొలుపులు
60)ఊరేగింపులు గుడి ప్రతిష్టలు ధ్వజస్తంభ ప్రతిష్టలు.
ఇందులో మీరు ఏది మిస్ ఆయారో చెప్పండి.
☘️☘️☘️☘️☘️
సత్యనారాయణ స్వామీ
🙏🙏🙏🙏🙏
పెళ్లయిన వెంటనే సత్యనారాయణ స్వామీ వ్రతం ఎందుకు చేయమంటారు?
సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు . కానీ ఎందుకు ఆ సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు ! ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు
సత్యనారాయణ స్వామీ వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే . ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు , వ్రతాలు మారె మహర్షీ అందించలేదేమో ! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు . ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు . స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు . ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి , సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని , అదీ అదీ అననేల, సకల సౌభాగ్యాలూ వృద్ధి చెందుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చేప్పారు .
పైగా సత్యనారాయణుడు అంటే, కేవలం విష్ణు స్వరూపము కాదు ! ఆయన త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం . అందుకే శ్రీ సత్యనారాయణ స్వామివారిని
" మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.
ఇక, వివాహం అయిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరింపజేయడానికి కారణం కూడా ఇందులోనే దాగి ఉంది . కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు , ఆ సత్యనారాయణుని ఆసీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. అందువలనే , నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు
సాధారణంగా ఎప్పుడైనా కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే, ఒక మంచి రోజు చూసి, బంధు మిత్రులను పిలిచి, పంచభక్ష్య పరమాన్నాలు చేసి, పూలు, ఫలము భగవంతునికి సమర్పించి , భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి, బంధు మిత్రులకు, విందు భోజనాలు పెట్టి, ప్రసాదము తాను తిని యితరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు.
ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష పలితాన్నిస్తుంది.
🙏🙏🌹🙏🙏
మధ్యరంగ శ్రీ రంగనాథ స్వామి ఆలయం*
🕉 *మన గుడి : నెం 393*
⚜ *కర్నాటక : శివసముద్రం - మండ్యా*
⚜ *మధ్యరంగ శ్రీ రంగనాథ స్వామి ఆలయం*
💠 హిందూ మాసం మార్గశి లేదా మార్గశిర పవిత్ర మాసంగా పరిగణించబడుతుంది.
ఇది డిసెంబర్ మరియు జనవరి నెలల మధ్య శీతాకాలంలో వస్తుంది.
ధనుర్ మాసము అని పిలువబడే ఈ 30 రోజుల కాలంలో చాలా మంది హిందువులు దేవాలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తారు . ఆలయాలు తెల్లవారుజామున తెరిచి ఉంటాయి - దాదాపు 4.30 గంటలకు, సాధారణం కంటే చాలా ముందుగానే.
త్రిరంగ యాత్ర లేదా దర్శనం ఈ కాలానికి ప్రత్యేకమైనది.
💠 పేరు సూచించినట్లుగా, దర్శనంలో ఒకే రోజున మూడు రంగనాథ ఆలయాలను సందర్శించడం ఉంటుంది - తెల్లవారుజాము మరియు సాయంత్రం మధ్య. ఇక్కడ రంగా అనేది శ్రీ రంగనాథ స్వామిని సూచిస్తుంది, విష్ణువు యొక్క రూపం, ఆదిశేషుడు మీద పడుకుని ఉంటాడు.
💠 ఈ పవిత్ర త్రిమూర్తులు ఏర్పడే మూడు ఆలయాలు కావేరి నది కర్ణాటక నుండి తమిళనాడులోకి ప్రవహించడం ద్వారా సృష్టించబడిన ద్వీపాలలో ఉన్నాయి.
• మొదటి దానిని ఆది రంగ (శ్రీరంగపట్నంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయం) అని పిలుస్తారు.
• మధ్యలో ఉన్న దానిని మధ్య రంగ (శివసముద్రంలోని ఆలయం) అని పిలుస్తారు
• శ్రీరంగంలో అంత్య రంగా.
ఇక్కడి శ్రీ రంగనాథస్వామిని "మధ్య రంగ" అని కూడా పిలుస్తారు, ఇతను శ్రీ వైష్ణవ భక్తులచే గౌరవించబడ్డాడు.
💠 రంగనాథుని మూడు రూపాలలో, ఇక్కడి దేవత సర్వోన్నత జీవి యొక్క యవ్వన రూపాన్ని సూచిస్తుందని నమ్ముతారు, అందుకే దీనిని 'మోహన రంగ' మరియు 'జగన్మోహన రంగ' అని కూడా పిలుస్తారు.
మధ్యరంగ అనేది ఒక అందమైన విగ్రహాన్ని కలిగి ఉన్న ఒక పురాతన దేవాలయం, అయినప్పటికీ కొద్ది మంది సందర్శకులు మాత్రమే వెళ్లి చూస్తారు.
ఇది వారాంతంలో మంచి సంఖ్యలో సందర్శకులను చూస్తుంది
💠 ద్వీపంలోని మరో మూడు వైపులా మరో మూడు దేవాలయాలు ఉన్నాయి.
శివనసముద్రంలో ఉన్న పురాతన శ్రీ సోమేశ్వర దేవాలయం మరొక ప్రసిద్ధ దేవాలయం.
ఆదిగురువు శ్రీ శంకరాచార్యులు ఈ ప్రదేశాన్ని సందర్శించారని మరియు ఈ ప్రదేశంలో "శ్రీ చక్రాన్ని" స్థాపించారని చెబుతారు. ఆశ్చర్యకరంగా, ఇక్కడ సోమేశ్వర లింగం రంగనాథ విగ్రహానికి చాలా ముందు ఉందని మరియు సప్తర్షులు ఈ లింగానికి పూజలు చేసి పూజిస్తున్నారని నమ్ముతారు.
💠 శివనసముద్రం బెంగుళూరు నుండి చాలా ప్రసిద్ధ వారాంతపు గమ్యస్థానంగా ఉంది మరియు సాధారణంగా దాని రెండు గంభీరమైన నీటి జలపాతాలు - గగన్ చుక్కి మరియు భారచుక్కి ద్వారా ప్రసిద్ధి చెందింది.
🔆 ఈ ప్రదేశాన్ని శివసముద్ర అని ఎందుకు పిలుస్తారు?
💠 ఈ పేరు వెనుక కొన్ని ఇతిహాసాలు ఉన్నాయి. ఒకరి ప్రకారం, ఒక రోజు, శివుడు మరియు పార్వతి ఆకాశంలో షికారు చేస్తూ, పై నుండి కావేరీ నదిని చూస్తున్నారని చెబుతారు.
ఒక పెద్ద రాయి నది ప్రవాహాన్ని అడ్డుకోవడం శివుడు గమనించాడు. కానీ నది సముద్రంలా వ్యాపించి ఆ రాయిని చుట్టుముట్టి ముందుకు ప్రవహించింది.
తనకు మహాసముద్రంలా కనిపించిన నది యొక్క పరిమాణాన్ని చూసి ఆశ్చర్యపోయిన శివుడు "ధన్య కావేరీ" అని ప్రకటించాడు. శివుని మెప్పించిన నది వంటి సముద్రాన్ని గమనించిన పార్వతి దానికి "శివనసముద్రం" అని పేరు పెట్టింది.
💠 మరొక పురాణం ప్రకారం, "వృతసుర హత్య" నుండి ప్రభావితమైన దేవేంద్రుడు అనేక పవిత్ర ప్రదేశాలలో తపస్సు చేస్తున్నాడు.
బ్రహ్మదేవుడి సూచనల ప్రకారం, అతను అందమైన రంగనాథ స్వామీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ అతనిని పూజించడం ప్రారంభించాడు.
💠 ఒకరోజు, నీటి ప్రవాహం వేగంగా పెరిగి, ఆ స్థలాన్ని ముంచెత్తడం ప్రారంభించింది.
తన తపస్సుకు భంగం కలుగుతుందనే ఆందోళనతో అతను ఈ ప్రదేశంలో ఉన్న భారీ బండలో కొంత భాగాన్ని పగులగొట్టి, బండకు ఇరువైపులా నది ముందుకు ప్రవహించేలా చేశాడు.
రాయి యొక్క కుడి వైపు నుండి చాలా శక్తితో నది క్రిందికి /పడిపోయింది. దీనిని "భారచుక్కి" జలపాతం అని పిలుస్తారు.
( భారీగా ప్రవహించేది అని అర్థం)
ఎడమవైపు నుండి, ప్రవహించడానికి ముందు అది కొండపైకి మరింత స్థిరమైన విధానాన్ని తీసుకుంది. ఇది "గగనచుక్కి"
(ఆకాశం లాగా స్థిరముగా ఉండేది అని అర్థం) జలపాతం అని పిలువబడింది.
దేవేంద్రుడు తన పూజను విజయవంతంగా పూర్తి చేసి, తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని స్థానిక పురాణం
💠 శివనసముద్రంలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.
💠 మైసూర్ నుండి 85 కి.మీ మరియు బెంగుళూరు నుండి 115 కి.మీ దూరంలో ఉంది.
పద్య తాంబూలం
: పద్య తాంబూలం
జ్ఞాననేత్ర మెపుడు తానుగా వెలుగునో
ముడులు విడును బాగ జడలు పెరుగు,
వైరాగ్య భావమ్ము వదలకున్నను చాలు
గోముసేయక బట్ట గోచి యగును,
తృప్తి శాంతులు నిండు తీరైన ఘడియలో
గడ్డి పరకయె బంగార మగును,
మనసు పరుగులాపి మర్యాద నేర్చినన్
మాటవిలువ తగ్గి మౌనమగును..
వేదఋషులఁ దిట్టు వేమనాదులఁ దిట్టు,
వేషములకె పోవు వెఱ్ఱివాడు,
గోచి పెట్టినంత గొప్పవాడైపోడు,
గడ్డమింత పెంచ దొడ్డ యతియ?🙏
- రామ్ డొక్కా, ఆస్టిన్, టెక్సస్
(2022లో వ్రాసుకొన్నది)
: శ్రీమాత్రేనమః
లేత సూర్యుని బోలు పూతమౌ మోముపై
కరుణారసంబు పొo
గారు వాని
నలినీదళములట్లు నలు
వుగా శోభిల్లు
లోచనద్వయితోడ
తోచువాని
దొండ పండ్లను బోలు మండితతప్రభ తోడ
మెఱుపుదీపించువా
తెఱల వాని
జీవరాశిని తన భావం
బుతో కట్టు
అంగజునికి లొంగ
నట్టి వాని
రాక్షస ధ్వాన్త విద్వంస రశ్మి వంతు
ఘనునిధీమంతుబలవంతు కాంతి వంతు
కీశసామంతు నతిలోక కీర్తి వంతు
అవతరించినహనుమంతు నతుల దాంతు
చూచితిలకించిపులికించి చోద్య మంది
భక్తి ప్రభవించిచిగురించి
పరిణమించి
పరఁగిప్రసరించిఫలియించి పరిఢ వించి
నతిని తలవంచి మది నెంచి నాడ నపుడు.
🌺🙏🙏🌺
దేవీదాస శర్మ:
మంగళగీతి
రాతినికరిగించు రసరమ్య భాషయే
జాతికి ధీటుగజవసత్వములనిడి
ప్రీతినొసంగుచుపృథ్విన్ వెలుగుచు వి
ఖ్యాతినిగాంచిన యమరభాషతెలుగు
: మంగళగీతి
మౌక్తికతుల్యమౌ మానసమందున
భక్తిప్రపత్తులన్ బాతిగ నిల్పియు
శక్తినంతయుకూర్చిశరణంబువేడితి
ముక్తినొసంగమ మోహనరూపుడ!
: 🌸ఆంజనేయ స్తుతి🙏
కందపద్యము
హనుమా మానుము మౌనము
కనుమా మా బాధలనిక కారుణ్యముతోన్
వినుమయ్యామావినతులు
మనమున నిన్నే కొలుతుము మారుతి మహిలో
సాహితీ శ్రీ జయలక్ష్మి:
బుద్ధి జ్ఞానము గలిగిన పురుషుడెపుడు
బద్ధు డవ్వడాశా పాశ బంధమునకు
బుద్ధి హీనుడే దానికి బద్ధు డౌను
నిక్కమిది తెలిసికొనుము నిర్మలాత్మ!
రచన :శనగల చంద్రశేఖర్
: కేసరి నందన హనుమా!
కౌసల్యా తనయు జేరి కార్యము దీర్చన్
దాసుడవైతివి, మరినీ
దాసుల కార్యముల దీర్చ దయజూపుమయా!
🙏🙏🙏
పి.వి.శైలజ.:
అంజని పుత్రా! హనుమా!
మంజులరాముని భజనను మాధుర్యము గన్
కంజర మీటుచు జేసెద
భంజన జేయుమ సతతము భక్తుల భయముల్
🙏🙏
పి.వి.శైలజ:
కం.
వదనము బహుసుందరమన
పెదవుల మురళీరవమయి ప్రీతి గొలుప నే
నొదిగెద నీ కరముల స
మ్ముదమారగ కరుణగనవె మోహనకృష్ణా!
దోర్బల బాలసుజాత
గోచి
గోచి
-------
సీ||
గోచి కొఱకు క్రొత్త గుడ్డతో పనిలేదు;
పాత పంచెను జించి వాడవచ్చు!
పండుగలకు గాని పబ్బమ్ములకు గాని
బెట్టు చేయగ లేడు కుట్టువాడు!
వాషింగు మిషనునే వాడంగ బనిలేదు
చేతితో శుభ్రమౌ శీఘ్రముగను!
బట్ట బయట నారబెట్టంగ వచ్చును
దొంగ లెత్తుక పోవు బెంగ లేదు!
ఆ.వె||
యోగులైన గాని యోగ్యులైనను గాని
గోచి పెట్టినంత పేచి లేదు;
మనిషి పట్ల సుంత మన్నన చాలును!
శేషఫణియె చెప్పె చిత్తమలర!
--------కోడూరి శేషఫణి శర్మ
లోకంతీరు-10
లోకంతీరు-10
కందం||
తరవాణీయన్నముగనమున్
చరవాణీపున్నెమనగజగమిలఝడిసెన్
పరువానికిపదనిసలున్
జనవాణీవాడివేడిసారముతగ్గెన్
భావము:-
పాతకాలమునాటి తరవాణీ అన్నముతినినా,తరవాణీ తాగినా శరీర ఆరోగ్యమహత్తు
చెప్పనలవి కానిది.నేడు ప్రపంచాన్ని చరవాణితన చెరలోబందీచేసింది.
ప్రయోజనాలనటుంచి
మానసిక రుగ్మతలకు
ప్రధానహే తువౌతోంది.
ఈ లోకాన జీవనానుబం
ధాలను మృగ్యంచేస్తోంది.
బాహ్య సౌందర్యానికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వడం,ఆత్భసౌందర్యానికి ప్రాధాన్యతనీయకపో
వడం,జనుల పలుకులందు తగినంత న్యాయధర్మసమ
సమర్ధత లోపించడం అవాంఛనీయములు
దేవరకొండ: రాజోలు
నిత్యపద్య నైవేద్యం
:
మ.
తన సౌఖ్యంబును గోరుచుండుట మహద్దౌష్ట్యంబు చూపించుటల్
ఘనసంతాపము స్వీయకార్యములచే కల్గించి లోకమ్మునన్
జనులన్ శోకమునందు నెట్టుటయు నిస్సంకోచభావమ్ముతో
ననృతంబాడుట నిత్యకృత్యము లయెన్ హా నేడిలన్ మిత్రమా! 5.
హ.వేం.స.నా.మూర్తి.:
నిత్యపద్య నైవేద్యం-1564 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-199. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
యత్కించి దపి సంకల్పాత్
నరో దుఃఖే నిమజ్జంతిl
న కించిదపి సంకల్పాత్
సుఖమక్షయ మశ్నుతేll
తేటగీతి:
"ఏమయినను పొందగల నీ యిలను పైన"
యని మనిషి చేయు సంకల్ప మధిక చింత
చిత్తమందు సంకల్పము చేయకున్న
యధిక సుఖమును మానవుం డనుభవించు.
భావం: "ఏమైనా పొందుతాను" అని మనిషి చేసే సంకల్పం అతనిని దుఃఖంలో ముంచివేస్తుంది. స్వలాభాపేక్షతో ఎట్టి సంకల్పం చేయకుండా ఉంటే నాశనం లేని సుఖాన్ని అనుభవిస్తాడు.:
ఆ.వె||
చట్టసభల లోన చెట్టలు జేరుచో
పట్ట బగ్గములును కట్టుబాట్లు
కంటబడవు సుమ్ము కలికాని కైనను!
ఎన్నుకొనెడి వారి నేమనవలె?
---------కోడూరి శేషఫణి శర్మ
----
"కం.
--
నగరాట్సేవితబాలక
జగదంబకరుణనునొందు శరవణభవుఁడా
పగలన్ ద్రెంచుము మాదౌ
సుగతిన్ జూపించుమయ్య ' సుబ్రహ్మణ్యా' !!! "
----
*శ్రీ గణనాథోద్భవము
శుభోదయం!🙏
*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!
10ఉ.
బాలుని మాటలన్ వినిన భవ్యముదంబున పుత్రు జూచుచున్!
పోలిక గానమీ భువిని పోరున నిన్ననుచిచ్చి వేత్రమున్,
పాలకు జేయుచున్ నిజ నివాస భవంతికి నాతి యిట్లనెన్!
తాలిమి నాదు యాజ్ఞలను దప్పగ రాదు కమార నిత్యమున్!!
భావము: బాలకునిమాటలు విని సంతోషముతో వానిని జూచుచూ నీకు పోరునందు సమానులు లేరని పలుకుచూ వానికి ఒక దండమునిచ్చి తననివాసభవన పాలకుని జేయుచూ నాయానతినెప్పుడూ తప్పరాదుసుమా అని పలికి ఇంకనూ....
☘️☘️🙏☘️☘️
శ్రీ రామ స్తుతి🙏
ఆ.
అధరమందు పుట్టు మధుర వాక్కుల చేత
కుదిరినట్టి మైత్రి కూలుపోవు
హృదయమందు పుట్టు పదిలమౌ స్నేహమే
చెదరదెప్పుడైన చిన్న సూరి
:
పెదవులు పలికినమాటలు
కుదరుగ నిలుపవుగ మైత్రి గూలగజేయున్
హృదయము బలికిన మాటలు
చెదరక కలకాలముండు స్నేహము గూర్చున్
జనమంచి
జీవులందు నీవు జనుల-జీవమీవు
ద్వైతమున నీవుతెలియన-ద్వెతమీవు
సర్వమునునీవు సకలార్ధ-సాక్షినీవు
పతిత పావన!వేణుగోపాలదేవ!!-డా.గుడిసేవ.
శ్రీ రామ స్తుతి🙏
సీ.ఘనమైన హారముల్ కాంచన చేలముల్
ధరియించి కొలువైన ధర్మపాల !
మహనీయ శ్రీరామ ! మధుర మధుర నామ !
ధరణిపాలకరామ ! ధన్యచరిత !
జానకీ ప్రాణేశ ! జగదభి రామయ్య !
కాకుత్థ్సవంశజా ! ఘనచరిత్ర !
రఘువంశ చంద్రమా ! రాజిత గుణధామ
కమనీయరఘువరా ! కావు మమ్ము
తే.వల్కలమ్ముల ధరియించి వనము కేగి
దనుజ దర్పమ్ము నణచిన ధర్మవీర !
సవనమును గాచి బ్రోచిన శౌర్యరామ !
దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !
సాహితీ శ్రీ జయలక్ష్మి
శిఖిన్యై* నమః..🙏🏼
362. ఓం *శిఖిన్యై* నమః..🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 362వ నామము
నామ వివరణ.
అమ్మ ఆడనెమలి
తే.గీ. *శిఖిని!* నాకిమ్ము సర్వతోముఖజయంబు,
లసదృశమ్ముగ, నిన్ గొల్తు ననుపమాన!
దీప్తమౌనట్టి సద్గుణవ్యాప్తిఁ గొల్పి
నిరతమున్ నన్ను రక్షించు నీరజాక్షి.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
మాటగందం
*మాటగందం* *చక్రవర్తి*
ఆవె.
చట్టసభలనిండ సార్థవాహులు చేర
జనులబ్రతుకులుండు సంతయందు
గుంటనక్క లడవినంటి పాలించిన
క్రందు స్వార్థనీతి రాజ్యమేలు
కొడవలి చేతబట్టుకొని
కొడవలి చేతబట్టుకొని గొంతుక కూర్చుని , పల్లి చేలలో
కొడుముల నీరుజల్లుచును గొప్పులు త్రవ్వి దినాంతమందు , పూల్
ముడచిన కొప్పుపై కడవ పొందుగ నిల్పి , శ్రమం బెఱుంగకే
వడివడి పోవు చానల విభావము చూడగ మోదమయ్యెడున్.
చేతను పాల చిక్కము , సుచేలక మొక్కటి మూపుపైన , డా
చేతను దుడ్డుకఱ్ఱ , చిఱు చెమ్మట మోమున కిర్రు చెప్పులున్ ,
ప్రీతిని గొఱ్ఱె పోతు తన వెంట చనంగను , దుక్కి టెద్దులన్
హూతి నదల్చుచున్ వెడల చుండెను రైతు కనoబడున్ మదిన్.
నాపద్యం
నా చిత్రం...నాపద్యం
సీ.మా.
సింగిరెడ్డికుటుంబసిగలోనమణిగాను
బుచ్చమ్మమల్లయ్యబుడుతడయ్యి
హనుమాజిపేటలో నవతారమెత్తియు
నారాయ ణుడిగాను నామమొంది
ఉన్నతవిద్యలోఉత్తమఛాత్రుడై
ఆంధస్రాహిత్యము నభ్యసించి
కవితలుకథలును గజలుతెలుగులోన
పరిచయ మొనరించి వన్నెదెచ్చి
వీధిబడిమొదలు విశ్వంభరవరకు
జ్ఞానపీఠముబొందిజ్ఞాని వయ్యి
నన్ను దోచుకునుందు ,ననుపాట నుండియు
తెలుగుజాతిమనది,వెలుగుజాతి
మనదని పంచెను మంచిగావర్ణించి
మూడువేలకుపైన ముచ్చటైన
పాటల రాసియు పఖ్ర్యా తి నొందగ
చితస్రీమనుయేలి సిరులు బొంది
ఆ.వె.
తెలుగు భాష తీపితెలగాణకీర్తిని
తెలుగుకవిగ తానేతేజ పరిచి
కళల తల్లి సేవ కడవరకునుజేసి
వెలిగినారు వారు విశ్వ కవులు
సి.నా.రే.కి...నతులిత్తు చేతులెత్తి..
సి.నా.రే.కి...నతులిత్తు చేతులెత్తి..
సీ..
సింగిరెడ్డివంశీయ చిత్రగీతతిలక
అయ్యారె హే భళారె యాసినారె
పదబంధలాలిత్య భావనామయకావ్య
సృజనంబు ఘనముగాచేసినారె
పలుగజళ్ళలిఖించి పటుతనుజూపించి
తెలుగును పుష్టిగ తీర్చినారె
విశ్వంభరరచించి విశ్వకీర్తిని గాంచి
యా జ్ఞానపీఠుడునౌ సినారె....
తేగీ
ఆధునికసాహితీవాణినాదరించి
శోధనాత్మకరీతిలో సొబగులలది
భాష వెలుగంగ బహువిధప్రక్రియలను
పండజేసిన ఘనుడురా..పండితుండు
శ్రీ సి.నా.రే.కి నతులిత్తు.. చేతులెత్తి.
వారి జయంతి వేళ అక్షరప్రశంస...
రాయప్రోలు జగదీశచంద్రశర్మ తెనాలి.
ఆగమేఘాలు
1)ఆగమేఘాలు:-
అగము=కొండ.ఆగమేఘాలు=కొండపైనున్న
మేఘాలు.మామూలుమేఘాలకన్న కొండపైని
మేఘాలుదగ్గరగానున్నచెట్లగాలికి వేగంగా ప్రయాణిస్తాయి.అతివేగమని దీనియర్థము....
2)శీతకన్ను:-శ్రీదుడంటే
కుబేరుడు.పార్వతిని
ఒకరకముగాచూచినందున శివుడు కోపించి
అతనికంటినిపగులునట్లుగా శపించెను.దృష్టిలోపమున్నట్లు గమనించనప్పుడీప దం
వాడతారు."శ్రీదకన్ను"
కాస్తా శీతకన్నైంది.ఇది
వైరిసమాసము.
గమనించండి...
మత్తేభము
----
"మత్తేభము..
--
జగదాధార శివా పరేతమహినీస్థానమ్మునచ్చెన్ గదే..
నగరాట్సేవిత కింకరప్రణుత నీనామంబెమోక్షంబిడున్
అగరాట్పుత్రికభార్యగానమరె యాగధ్వంసి రుద్రా భళా..
సగమైనుండెనె పార్వతమ్మయహ యీశా నీశరీరమ్మునన్ !!! "
----
క్రొత్తపలుకు-10
క్రొత్తపలుకు-10
స్నేహహస్త మీయ చెలరేగి కొందఱు
స్వప్రయోజనమును బావుకొండ్రు
స్వార్థమింత లేని సన్మైత్రి నిజమురా
త్యాగయుక్తమైత్రి యమలమౌను
*~శ్రీశర్మద*
గురువు ఉపదేశించిన
*గురువు ఉపదేశించిన జ్ఞానమే ప్రయోజనకరం*
“గురువు ఉపదేశించిన జ్ఞానమే ప్రయోజనకరం; ఉపనిషత్తు చెబుతోంది. గురు ఉపదేశం లేకుండా వచ్చే జ్ఞానము ప్రభావవంతంగా ఉండేది కాదు. భగవంతుడు గీతలో చెప్పినప్పుడు,
*ఇమం వివస్వతే యోగం బ్రోఖ్తవానహమవ్యమ్ I*
*వివస్వాన్ మనవే ప్రాహ మనురీక్ష్వాగవేప్రవీద్ II*
అన్నారు. అంటే “సృష్టిలో సూర్యునికి ఇది నేర్పించాను” అంటాడు. అప్పుడు, ఈ గురు-శిష్య వంశం సృష్టి నుండి వచ్చిందని చెప్పాలి. గురువు లేకుండా మనం మన జీవితాన్ని నడిపించలేము. కాబట్టి, గురు-శిష్య సంప్రదాయం ద్వారా శాస్త్ర తత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే మళ్లీ గురువుగా మారగలడు. అంతే కాదు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆసనాలు వేయగలగాలి. మేము పుస్తకం చదివాము. బాగా బోధిద్దాం. కానీ వాటిని ఆచరించకపోతే ఆయనను గురువు అని ఎలా పిలుస్తాము? ముందుగా మనం సరైన, శాస్త్రీయంగా మరియు నైతికంగా ఉండాలి. అలా ప్రవర్తించమని మనం మరొకరికి చెప్పవలసి వస్తే, అలా ప్రవర్తించగలిగేలా యోగధంశం ఉండాలి.
ముందుగా సదాచరణంలో ఉండి తర్వాత ఇతరులకు ధర్మాన్ని ప్రబోధించడం గురువు విధి. ప్రతి ఒక్కరు గురు సంప్రదాయ పూర్వకంగా గ్రంధాలను తెలుసుకోవాలి. శాస్త్రోక్తాన్ని అనుసరించి ఆసనాలు వేయాలి.
-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*
నీటిలోపడిన
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *జలే తైలం ఖలే గుహ్యం*
*పాత్రే దానం మనాగపి* |
*ప్రాజ్ఞేశాస్త్రం స్వయం యాతి*
*విస్తారం వస్తుశక్తితః||*
*--- చాణక్యనీతి ---*
తా𝕝𝕝 *నీటిలోపడిన నూనె, నీచుడికి తెలిపిన రహస్యం, యోగ్యిడికిచ్చిన దానం, బుద్ధిమంతుడికి నేర్పిన విద్య* ఇవి కొద్దిపాటివైనా సహజంగానే వ్యాప్తి చెందుతాయి.... అనగా ఇవి బాగా వ్యాప్తిచెంది *బహుళ ప్రచారం అవుతాయి* అని భావము....
చాణక్యనీతి
💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *జలే తైలం ఖలే గుహ్యం*
*పాత్రే దానం మనాగపి* |
*ప్రాజ్ఞేశాస్త్రం స్వయం యాతి*
*విస్తారం వస్తుశక్తితః||*
*--- చాణక్యనీతి ---*
తా𝕝𝕝 *నీటిలోపడిన నూనె, నీచుడికి తెలిపిన రహస్యం, యోగ్యిడికిచ్చిన దానం, బుద్ధిమంతుడికి నేర్పిన విద్య* ఇవి కొద్దిపాటివైనా సహజంగానే వ్యాప్తి చెందుతాయి.... అనగా ఇవి బాగా వ్యాప్తిచెంది *బహుళ ప్రచారం అవుతాయి* అని భావము....
హనుమ నామ స్మరణం
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*హనుమ నామ స్మరణం -*
*సర్వపాప నివారణం*
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
*ఎంతటి కష్టాన్నైనా తొలగించే అంజని పుత్రుడు. జీవితంలో సమస్యలెదురై క్లిష్ట పరిస్థితిలో వున్నప్పుడు కార్య సాధనకై భక్తులు శ్రీరామ సమేతుడైన ఆ రామభక్తుని స్మరిస్తే చాలు హనుమంతుడు వెంటనే వారి కోరికలు తీరుస్తాడు.*
*అంజనేయస్వామి చరిత్ర చదివిన వారికి బ్రహ్మచర్య వ్రతపాలన, శీలరక్షణ, బలబుద్దుల వికాసము శ్రీరామచంద్రల వారి యెడల భక్తి పూర్వకమైన దాస్య భావము మెదలైన మహత్తర గుణోపదేశము లభిస్తాయి.*
*అంజనేయుని ప్రార్ధించిన భక్తులకు నెల్లప్పుడూ సంరక్షిస్తుంటాడు ఆస్వామి. భూత, ప్రేత రాక్షసాదులు ఆ స్వామి నామాన్ని ఉచ్చరించినంత మాత్రమే పారిపోతాయి. స్మరణ చేస్తేనే చాలు, ఆరోగ్యం కుదుటపడుతుంది.*
*ఆయనవల్ల తులసీదాసుకు రామదర్శనం లభించింది. ఆయన్ని ధ్యానిస్తే అలౌకికమైన సిద్దులు లభిస్తాయి.*
*అందుకే శ్రీ రామచంద్రుడు హనుమంతుని యశస్సు గురించి చెబుతూ "యుధ్దంలో ఆంజనేయుడు చూపించిన పరాక్రమాన్ని యముడు, ఇంద్రుడు, కుబేరుడు ఇతర లోక పాలకులెవరూ చూపలేరు" అన్నాడు.*
*"హనుమంతుడు ఒక్కడు జీవించే వుంటే చాలు మనమంతా లేకుంటేనేం శ్రీరాముడికి తప్పక జయం లభిస్తుంది" అని యుధ్ధకాండలో అంటాడు జాంబవంతుడు.*
*ఆయనలో వుండే శ్రీరామభక్తి కారణంగానే ఆంజనేయుని స్మరణ అమోఘమైన ఫలాన్ని సాధిస్తుంది.*
*”శ్రీరామ"* *నామాన్ని ఆంజనేయుడు తన జీవిత సర్వస్వంగా భావించాడు.*
*హనుమంతుడు నలుడు, నీలుడు మెదలైన వానర వీరులకు శ్రీరామనామాన్ని ఉపదేశిస్తూ..*
*"త్రాసులోని ఒక పళ్లెంలో సమస్త మహా మంత్రాలను అనంత కోటి జ్జాన ధ్యాననాది సాధనా ఫలాలను ఉంచి, రెండవ పళ్లెంలో కేవలం శ్రీ రామనామాన్ని ఉంచితేచాలు అవన్ని కలిసినా సరితూగవు" అంటాడు.*
*శ్రీరామ నామాన్ని జపించే వారి పట్ల ఆంజనేయస్వామి తప్పక ప్రసన్నుడై వుంటాడు. అటువంటి వారిపట్ల వారికి తను కల్పవృక్షమై సమస్త కోరికలను తప్పక తీరుస్తాడు.*
*సమస్తరోగములకు ఒకే ఒక దివ్యౌషథం కలదు. ఆదియే "భగవన్నామం"*
*ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యం కోరికల నుండి మనసును దూరం చేయడం అని పెద్దలు చెబుతారు.*
*శ్రీ హనుమత్ త్రికాల ధ్యానం.*
*[ఉదయ, మధ్యాహ్న, సాయం సమయములందు హనుమద్భక్తులు పఠించవలసిన భక్తి శ్లోకాలు]*
*ఉదయం:>*
*ప్రాతః స్మరామి హనుమంత మనంత వీర్యం*
*శ్రీ రామ చంద్ర చరణాంబుజ చంచరీకం*
*లంకా పురీ దహన వందిత దేవ బృందం*
*సర్వార్ధ సిద్ధి సదనం ప్రదిత ప్రభావం.*
*మధ్యాహ్నం:>*
*మాద్యం నమామి సృజినా ర్నవ తారనైకా*
*దారం శరణ్య ముదితానుపమా ప్రభావం*
*సీతార్తి సింధు పరిశోషణ కర్మ దక్షం*
*వందారు కల్ప తరు మవ్యయ మామ్జనేయం*
*సాయంత్రం:>*
*సాయం భజామి శరనోప శ్రుతాఖి లార్తి*
*పుంజ ప్రనాషణ విధౌ ప్రదిత ప్రభావం*
*అక్షామ్తకం సకల రాక్షస కేతు ధూమం*
*ధీరం ప్రమోదిత విదేహ సుతం దయాళుం .*
*ఓం నమో శ్రీ ఆంజనేయ॥*
*ఓం నమః శివాయ॥*
✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఆడి కృత్తిక*
*శ్రీ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు*
*విశేషమైన రోజు*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ...*
*ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ...*
*ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు వెలిగించి ... చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు, వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ.*
*మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. ...*
*అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాం ...*
*తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట.*
*అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది.*
*పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.*
*వీలైతే ఈ రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయిన వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, పైపంచ, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు( లేదా పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర ) సమర్పించి తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము ... ఒకవేళ బాల బ్రహ్మచారియైన వేదవిధుడు లేక గృహస్తు అయిన వేదవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే ... ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది .*
*కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి.*
*ఓం శరవణభవ॥*
*ఓం గణేశాయ నమః॥*
*ఓం నమఃశివాయ॥*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
పాప కర్మల వైపే
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
పాప కర్మల వైపే మనుష్యులు మ్రొగ్గు చూపుటకుగల కారణములు
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*పాపపుణ్యాల గురించి చాలా మందికి మంచి అవగాహనే ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మల మరియు దుష్కర్మల ఫలితమని వారికి తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గ్రహించగలిగినా ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు.*
*ఒకసారి దుర్యోధనుని యిలా ప్రశ్నించారు. ''మీరు రారాజు. శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు యిలా ఎందుకు ప్రవర్తిస్తారు?'' అందుకు దుర్యోధనుడు -*
*जानामि धर्मं न च मे प्रवृत्तिः जानाम्यधर्मं न च मे निवृत्तिः ||*
*''ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటం లేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నామనస్సు పాప కర్మలను ఆచరించటానికే ఇష్టపడుతోంది.'' అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.*
*శ్రీకృష్ణ భగవానుని మాటలను వింటున్న అర్జునుడు ''దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది'' అని ప్రశ్నించాడు.*
*अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः |*
*अनिच्छन्नपि वार्ण्षेय बलादिव नियोजितः ||*
*''మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి ?'' దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇది -*
*काम एष क्रोध एष रजोगुणसमुद्भवः |*
*महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ||*
*కామము మరియు క్రోధమనబడు శత్రువులు రజో గుణం వలన ఉద్భవించుచున్నవి. అవి మహా పాపిష్ఠమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి.*
*పై అభిప్రాయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీ మళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా. కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ధ శత్రువులు. మనిషికి మొదట యిష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలవంతపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనిపించదు.*
*ఒక వస్తువును తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది. क्रुद्धो हन्याद्गुरूनपि - క్రోధంతో ఉన్నవాడు ఏమైనా చేస్తాడు. చివరికి తన గురువుగారిని హింసించటానికి కూడ వెనకాడడు.*
*శ్రీకృష్ణభగవానుడు కామ క్రోధాలను తొలగించుకోవలసిన అవసరం గురించి భగవద్గీతలో వివరించాడు. కామక్రోధాల బంధువులే లోభ, మోహ, మద, మాత్సర్యాలు.*
--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు.*
*శ్రీ గురుభ్యోనమః!*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐