30, జులై 2024, మంగళవారం

నిత్యపద్య నైవేద్యం

:

 మ.

తన సౌఖ్యంబును గోరుచుండుట మహద్దౌష్ట్యంబు  చూపించుటల్

ఘనసంతాపము స్వీయకార్యములచే కల్గించి లోకమ్మునన్ 

జనులన్ శోకమునందు నెట్టుటయు నిస్సంకోచభావమ్ముతో

ననృతంబాడుట నిత్యకృత్యము లయెన్ హా నేడిలన్ మిత్రమా! 5.


హ.వేం.స.నా.మూర్తి.:

 నిత్యపద్య నైవేద్యం-1564 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-199. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

యత్కించి దపి సంకల్పాత్

నరో దుఃఖే నిమజ్జంతిl

న కించిదపి సంకల్పాత్

సుఖమక్షయ మశ్నుతేll 


తేటగీతి:

"ఏమయినను పొందగల నీ యిలను పైన"

యని మనిషి చేయు సంకల్ప మధిక చింత 

చిత్తమందు సంకల్పము చేయకున్న 

యధిక సుఖమును మానవుం డనుభవించు.


భావం: "ఏమైనా పొందుతాను" అని మనిషి చేసే సంకల్పం అతనిని దుఃఖంలో ముంచివేస్తుంది. స్వలాభాపేక్షతో ఎట్టి సంకల్పం చేయకుండా ఉంటే నాశనం లేని సుఖాన్ని అనుభవిస్తాడు.:

 ఆ.వె||

చట్టసభల లోన చెట్టలు జేరుచో

పట్ట బగ్గములును కట్టుబాట్లు

కంటబడవు సుమ్ము కలికాని కైనను!

ఎన్నుకొనెడి వారి నేమనవలె?


---------కోడూరి శేషఫణి శర్మ

----

"కం.

--

నగరాట్సేవితబాలక 

జగదంబకరుణనునొందు శరవణభవుఁడా

పగలన్ ద్రెంచుము మాదౌ

సుగతిన్ జూపించుమయ్య ' సుబ్రహ్మణ్యా' !!! "

----

కామెంట్‌లు లేవు: