12, ఏప్రిల్ 2023, బుధవారం

భగవన్నామ స్మరణ

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴 సంసార సాగరంలో మునిగిపోతూ మనశ్శాంతి లేకుండా నిత్యమూ ఏదో ఒక చింతతో సతమతమవుతూ  ' మా పరిస్థితి ఇంతేనా! మేము ఇలా ఉండిపోవల్సిందేనా!! మాకు ఉద్దరింపబడే మార్గం లేదా!!? ' అని చింతించేవారు ఒకసారి తెలుసుకోండి. పుష్కరాలు సమయంలో నదిలో స్నానం చేసినపుడు నది ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడానికి నదిలో ఇనుప గొలుసులుతో పొడవాటి త్రాడువంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు. స్నానం చేసేవారు ఆ గొలుసులు పట్టుకుని స్నానం చేస్తారు.  అలాగే సంసారము అనెడి నదిలో ఉండి కూడా వాటి బంధాలనే ప్రవాహానికి కొట్టుకుపోకుండా  ఉండడానికి భగవంతుడు భగవన్నామ స్మరణ అనే గొలుసు ఏర్పాటు చేశాడు.  ఈ గొలుసు గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకూ ఈ సంసారపు చింతల ప్రవాహం  మనల్ని ఏమీ చేయలేదు. ప్రవాహం వేగముగా ఉన్నపుడు గొలుసును మరింత దృఢముగా పట్టుకోవాలి తప్ప వదిలేయకూడదు. ఎంత దృఢముగా పట్టుకుంటే అంత రక్షణ. కనుక అనవసర చింతలు మానివేసి భగవంతున్ని స్మరిస్తుండండి. సకల చింతలు రూపుమాపేది ఒక్క సర్వేశ్వర చింతనే అన్న సత్యమును మరువకండి.🌴

వివాహం యొక్క ఎనిమిది రూపాలు

 వివాహం యొక్క ఎనిమిది రూపాలు: నాల్గవ ప్రజాపత్యం



మనుస్మృతితో సహా ధర్మశాస్త్రాలు ఎనిమిది రకాల వివాహాలను పేర్కొన్నాయి.


బ్రహ్మో-దైవస్తథైవర్షః


ప్రజాపత్య-స్తథా 'సురః


గన్ధర్వో రాక్షసశ్చైవ


పైశావస్తమః స్మృతః


-మనుస్మృతి, 3. 21



ఎనిమిది రకాలు: బ్రహ్మ, దైవం, అర్ష, ప్రాజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస మరియు పైశాక.



ప్రాజాపత్యంలో వ్యాపారం లేదు మరియు బ్రహ్మోత్సవం వలె కన్యాదానం దానిలో ఒక భాగం. 

అయితే ప్రాజాపత్య అనే పేరును బట్టి వధువు యొక్క రుతుక్రమం ఆసన్నమైందని మరియు వివాహం అయిన వెంటనే ఒక బిడ్డ పుట్టాలని భావించాలి. 

ఈ కారణంగా వధువు తండ్రి బ్రహ్మ రకానికి భిన్నంగా వరుడిని వెతుకుతాడు. 

బ్రహ్మ రకం వివాహం ప్రాజాపత్యం కంటే మెరుగైనది, ఎందుకంటే అందులో, వరుడి వ్యక్తులు తమ ఇంటికి గ్రహలక్ష్మిగా ఉండాల్సిన వధువును వెతుకుతారు.

కాకి నేర్పే అద్వైతం

 కాకి నేర్పే అద్వైతం


ఒకసారి భక్తుడొకరు పరమాచార్య స్వామివారిని, “మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్ప పక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు?” అని అడిగాడు.


స్వామివారు ఒకసారి చిరునవ్వి, “తమిళంలో మనం కాకిని ‘కాకా’ అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మానం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని ‘మ్యావ్’ అని, చిలుకలు కికి అంటాయి కాబట్టి వాటిని ‘కికి’ అని పిలుస్తామా? లేదు! కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత.


క అంటే కాపాత్తు (కాపాడు), రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి ‘కా కా’ అని పిలిస్తే, కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు!


విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబాట్టి కాకిని నువ్వు అల్ప పక్షి అంటున్నావు. కాకి ఎంత గొప్పదో ఇప్పుడు చెబుతాను విను.


అది బ్రహ్మముహూర్తంలో లేస్తుంది. కా కా అని అరచి నిన్ను నిద్రలేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు. కాని కాకి సరైన సమయానికి లేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్రలేపుతుంది. 


అది పూజకు సరైన నిర్దేశం. అవును కదా?


అంతేకాక, దానికి ఆహరం దొరికితే ఇతర కాకులను పిలుస్తుంది. ఆహారాన్ని పంచుకుని తినండి అని మనకు తెలిపే వేరే ప్రాణుల్లో కనపడని ఒక ప్రత్యేకక లక్షణంకలిగినది.


మరలా సాయంత్రం నిద్రకు ఉపక్రమించే ముందు, మరలా కాకా అని అంటుంది. ఆరోజు జరిగిన అన్ని విషయాలకు భగవంతునికి కృతజ్ఞతగా. అలాగే, కాకులు సూర్యాస్తమయం తరువాత ఏమీ తినవు. ఇది శాస్త్రములు చెప్పిన ఉత్తమమైన విషయం కూడా.


ఇది ఎంతమంది పాటిస్తున్నారు?


కనుక నాకు తెలిసి కాకి అల్ప ప్రాణి కాదు. అది మనకు ఎంతో నేర్పుతుంది. అందుకే పితృ దేవతలు కాకి రూపంలో వస్తారు.

మరొక్క విషయం . . . కేవలం మహాలయంలోనే కాదు, ప్రతిరోజూ కాకికి ఆహారం పెట్టు.


కాకి మనకు అద్వైతాన్ని కూడా నేర్పుతుంది.


నువ్వు పెట్టిన ఆహారాన్ని చూడగానే కాకి ఎంతో సంతోషపడి ఆ ఆహారాన్ని స్వీకరిస్తుంది. అది తినడం చూడడం వల్ల నువ్వు కూడా ఆనందాన్ని పొందుతావు. కనుక ఇరువురు ఆనందంగా ఉంటారు. ఇద్దరూ భగవత్ స్వరూపులే!” అని తెలిపారు.


ఇది వినగానే ఆ భక్తుడు, అక్కడున్న వారందరూ స్వామివారికి నమస్కారం చేసి, అందరూ ఒక్కసారిగా “జయ జయ శంకర, హర హర శంకర” అని పెద్దగా పలికారు.

పరమాచార్య స్వామివారి అద్భుతమైన అందమైన విశ్లేషణను మనమందరం పాటించి మన పూర్వీకుల ఆశీస్సులను పొండుదాము.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।



#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సంపూర్ణ విశ్వాసం*


శ్రీ స్వామివారి సేవకులలో  తులసమ్మ గారు మరియు రోశి రెడ్డి గారు స్వామి మీద సంపూర్ణ విశ్వాసముంచి శరణాగతి ఎలా చేసారో ఈ క్రింది లీల చెబుతుంది. 


అరగంటలో తులసమ్మగారు చనిపోతుందని అమెరికన్ ఆస్పత్రి డాక్టరు చెప్పినప్పుడు *'ఆమెకేమీ ఫరవాలేదు, నాలుగు రోజులు ఇంట్లో వుంచి తీసుకురమ్మని'* శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. వారు చెప్పినట్లే చేస్తే ఆ తల్లి అది మొదలు 20 సం||లు వదలకుండా స్వామిని సేవించింది. సిరిసంపదలు వదలవచ్చు, బంధుమిత్రులను వదలగలము కానీ ఈ తల్లి కారులలో తిరుగుతూ కాలుక్రింద పెట్టినామె కాదు. కానీ స్వామివారి సేవకొచ్చాక ఏనాడూ పాదరక్షలు ధరించలేదు. మైళ్ళు కొలది ఎలా నడిచిందో నేను (రచయిత) ప్రత్యక్షంగా చూచాను. ఆవకాయ పిండివంటలు తిన్న ఆ నోటితో కూటినీళ్ళు, పచ్చడి, మిరప్పొడితోనే గడిపింది.


 ఈ తులశవ్వగారికి స్వప్నంలో కాశీ యాత్ర చేయించారు. ప్రత్యక్షంగా చూచిన వారి కంటే గొప్పగా వారు చూడని ముఖ్యమైన ప్రదేశాలు కూడా చూపించారు. దాసగణుకు గంగా, యమునలను సాయి తన పాదములలో చూపించినట్లుంది.


 అన్నమే తినకుండా కేవలం చక్కెర నీళ్ళతో జీవిస్తూ - సంపూర్ణంగా కళ్ళు కనపడని గ్రుడ్డివారు మరియు 80 సం॥ల వృద్ధుడు, రోశి రెడ్డి తాత. తాను పొగాకు తంబ వూసే ముంత తన ప్రక్కనే ఉన్నా కనబడక చేతితో తడిమి వెతుక్కునేవాడు. ఇట్టి గ్రుడ్డివాని చేత గ్రామమంతా తిరిగి మూడు కిలోల బియ్యపు భిక్షాన్నం తెప్పించే వారు శ్రీ స్వామివారు. వీరి విశ్వాసమే వీరికి తోడు. ఈ సేవ ఈ మహనీయుడు చివరి శ్వాస వరకు చేశారు. స్నానం చేసి గుడ్డలు మార్చుకొని గురుస్మరణతో తనువు చాలించిన ధీరుడు. *శ్రీ స్వామివారు ఆజ్ఞాపిస్తే బండరాళ్ళయినా కదలి పనిచేస్తాయి. నాదేమి లేదు అంతా స్వామి దయ* అంటారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   అదంతా వినగానే నా మనస్సులో ఒక అనుమానం తలెత్తింది. ఎక్కడి నుండో వచ్చిపోయే నాకు ఉపదేశ దీక్షయిచ్చి నా బాధ్యత తమ మెడకు తగిలించుకోవడం ఇష్టంలేక మాత్రమే నా బెడద ఎలాగైనా వదలించుకోడానికి మాత్రమే ఆయనలా చెప్పారేమోననిపించింది. నేను తలవంచుకొని కూర్చోగానే ఆయన కొంచెం చికాకుగా, “నేను ఇంత హృదయపూర్వకంగా యథార్థం చెప్పినా గూడ అతడింకా ఏవో శంకలు మనసులో పెట్టుకుంటున్నాడు. వాటిని లోపల పెట్టుకోకుండా నిశ్శంకగా అడిగి తెలుసుకో” మని మరల చెప్పించారు.


*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*జై సాయిమాష్టర్🌹🌹🙏🙏*

 "షిరిడీలో సమాధి మందిరం సజీవ కళతో ప్రకాశిస్తున్న సాయి బాబా పాలరాతి విగ్రహాన్ని 

దర్శించి ఒక విచిత్రమైన అనుభూతితో పొందిన మనసుతో " బాబా స్థితి ,ఆయనకు ఈ సృష్టినుంచి అననన్యముగా తోచి వుండదు .

ఆయన తాను శరీర పరిమితుడన్న భావాన్ని విస్మరించి ,ఈ చరాచర విశ్వమంతా ఏ మహత్తర చైతన్యములో సంకల్పమాత్రముగా ఉన్నదో ,ఆ చైతన్యముతో  బాబా తాదాత్మత చెంది ఉన్నారు .

ఇది ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారికి షిరిడీలో 

బాబా మొదట దర్శనములో కలిగిన అనుభూతి .

"ఎవరయితే ఎప్పుడూ నా గురుంచే వింటూ ,నా 

లీలలే చింతన చేస్తూ ,నన్నే స్మరిస్తారో ,వారి కర్మ 

నశించి నేనే వారిగా మారిపోతారు " అని సాయబాబా పలికిన మాటలు .26 సంవత్త్సరాలు 

నిరంతర సాయి సేవలో ,సాయి స్మరణలో జీవితాన్ని గడపి ధన్యులైనారు ." శ్రీ సాయిమాస్టర్ 

గా ,సాయబాబా బేటా గా ,మహాత్ముల ముద్దు బిడ్డడుగా పేరొందిన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు ." తల్లికి తగ్గ బిడ్డలు కండి ,మీ 

అధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి " అన్న బాబా 

సూక్తికి ప్రతీకగా బాబా పూర్ణ అనుగ్రహాన్నీ పొంది 

సాయిభక్తుల మనసులలో స్థిరంగా నిలిచిపోయిన 

మహానుభావుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు .

మరుగుపడిన దత్త స్వరూపాలైన అవధూతలను 

మహాత్ములను ,యోగులను భక్తులందరికీ అవగాహన కల్పించిన మహనీయుడు మన మాస్టరుగారు .ఉన్నత పదవులు ,కీర్తి కాంక్షలు 

ఆశించక ,సాయి శరణాగతి తత్వములో 51 సం .

లు జీవించి, 1989 ఏప్రియల్ 12 వ తేదీనాడు ఆ 

సమర్ధసద్గురు ,కైవల్య ప్రదాత అయిన శ్రీ షిర్డి సాయినాధునిలో ఐక్యమయ్యారు .నేడు ఆయన 

34 వ ఆరాధన దినోత్సవం .ఆ సాయిమాష్టరుకి 

ఇవే మా హృదయకపూర్వక నమస్సులు .

సవరణ -నేడు మాస్టారుగారి 34 వ ఆరాధనఉత్సవం .

*జై సాయిమాష్టర్🌹🌹🙏🙏*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

గుర్తు చేసుకోవలసిన కథ

 💓🍫💓🍫💓🍫💓

*365 రోజులు గుర్తు చేసుకోవలసిన కథ* ...  


 ♥️ *కథ- 2022* ♥️


చదవడానికి ముందు ఒక్క క్షణం ఆగి... మెల్లగా కళ్లు మూసుకోండి... మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందండి... ఆ వాతావరణపు లోతుల్లోకి వెళ్లండి.... చదవడం కొనసాగించండి...


పరిస్థితిని బట్టి అవగాహనలో మార్పు


 ఓ రైలులో ఇద్దరు పిల్లలు అటు ఇటు పరుగెడుతున్నారు.  ఒక్కోసారి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు, ఒక్కోసారి సీట్లపైన ఎక్కి గెంతుతున్నారు.


 పక్కనే కూర్చున్న వారి తండ్రి తన ఆలోచనల్లో కూరుకుపోయాడు. మధ్యమధ్యలో పిల్లలు తనవైపు చూస్తున్నప్పుడు, ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతున్నాడు, ఆ తర్వాత పిల్లలు మళ్లీ తమ అల్లరిలో మునిగిపోతున్నారు, వారిని అతను ప్రేమగా చూస్తూ ఉన్నాడు.


రైలులో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు పిల్లల అల్లరితో విసుగు చెంది, తండ్రి వైఖరిని చూసి  చిరాకుపడ్డారు. రాత్రి సమయం కావడంతో అందరూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు.  పిల్లల అల్లరి చూసి ఓ ప్రయాణికుడు ఆపుకోలేక తండ్రితో, "ఏమి తండ్రండీ మీరు.. పిల్లలు అంత అల్లరిగా ప్రవర్తిస్తూంటే, వాళ్ళని ఆపకుండా చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నారు. వారికి వివరించడం మీ బాధ్యత కాదా?", అని అన్నాడు.


ఆ పెద్దమనిషి ఇలా ధైర్యంగా అడగడంతో ఇప్పుడు ఆ తండ్రి సిగ్గుపడి  పిల్లల అల్లరిని ఆపుతాడని ఇతర ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

 

 కానీ తండ్రి కొన్ని క్షణాలు ఆగి, "వారికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను" అన్నాడు.


 ప్రయాణికుడు "ఎలా చెప్పాలా.... అంటే అర్థం ఏమిటి ?" అన్నాడు.


ఆ వ్యక్తి ఇలా అన్నాడు, "నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది, ఆమె నిన్న ప్రమాదంలో మరణించింది, నేను పిల్లలను అంత్యక్రియల కోసం అక్కడికి తీసుకువెళుతున్నాను, ఇప్పుడు వారు ఎప్పటికీ తమ అమ్మని చూడలేరు అన్న విషయాన్ని వారికి ఎలా వివరించాలా అని నేను అయోమయంలో ఉన్నాను." 


 ఇది విని అందరూ అవాక్కయ్యారు.  అసలు ఏదైనా మాట్లాడడం పక్కన పెడితే, ఎవరూ ఏమీ ఆలోచించలేక అందరూ స్తబ్ధుగా అయిపోయారు.


 పిల్లలు ఇంకా తమ అల్లరిలో మునిగిపోయి ఉన్నారు. కంపార్ట్మెంట్ లో  ఇంకా అటుఇటు పరిగెడుతూనే ఉన్నారు. తండ్రి మళ్ళీ మౌనం వహించాడు.  

వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ ఇప్పుడు ఆ పిల్లలు, తోటి ప్రయాణీకులకు క్రమశిక్షణ లేని పిల్లలలా కనిపించడం లేదు, ప్రతి ఒక్కరూ వారిపై  ప్రేమను కురిపించాలనుకున్న మృదువైన లేతపువ్వుల వలే కనిపిస్తున్నారు.

ఇప్పుడు తండ్రి కూడా బాధ్యత లేనివాడిగా కనిపించడం లేదు, తన జీవిత భాగస్వామిని పోగొట్టుకుని దీనంగా ఉన్న ఇద్దరు పిల్లలకు తండ్రిగా, ఒక తల్లిగా కనిపిస్తున్నాడు.


ఇలాంటిదే మరో సందర్భంలో, రోడ్డు మీద నా ముందు ఒక కారు చాలా నెమ్మదిగా కదులుతోంది, నేను పదే పదే హారన్ కొట్టినా నన్ను ముందుకు దాటనివ్వట్లేదు. నేను నా సహనాన్ని కోల్పోయే సమయంలో, కారు వెనుక ఉన్న చిన్న స్టిక్కర్ ని చూసాను, 

అక్కడ ఇలా రాసి ఉంది: "శారీరక వికలాంగులు; దయచేసి ఓపికపట్టండి!"


 అది చదివిన వెంటనే, అంతా మారిపోయింది!  వెంటనే తేరుకుని కారు నెమ్మది చేసాను. ఆ కారు డ్రైవర్ కి ఇబ్బంది కలగకుండా నేను కూడా ప్రత్యేక శ్రద్ధతో నడపడం మొదలుపెట్టాను. కొన్ని నిమిషాలు ఆలస్యంగా ఆఫీసుకు చేరుకున్నా, మనస్సులో ఒక సంతృప్తి ఉంది.


నిజమైనా, అబద్ధమైనా ఇది కథ మాత్రమే. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అనుభూతి/గ్రహణశక్తి/ఆలోచనలో మార్పు మన ప్రవర్తనలో మార్పుకు దారితీస్తుంది. ఒకరి పట్ల మన వైఖరి, అవగాహన ఒక్కక్షణంలో మారిపోతుంది.


 *మన చుట్టూ ఉన్నవాటిపై మన స్వంత అవగాహనల ఆధారంగా, మనం సృష్టించుకున్న దృష్టి కోణం వల్ల మనమందరం ఒకరకమైన గందరగోళంలో ఉంటాం.*


*జీవితంలో కష్టాలు ఉండవని కాదు... కానీ  నిరాశ లేదా ప్రతికూల ఆలోచనలు, ఆ పరిస్థితులను మార్చడానికి మనకు సహాయపడతాయా?*


 *కావలసింది ఆశ - ఉత్సాహంతో కూడిన సానుకూల ఆలోచన.*  *అప్పుడు మన హృదయంలో మార్పును వెంటనే అనుభూతి చెందుతాం.  ఆ సానుకూల దృక్పథంతో  వైరాగ్యపు ఎడారి కూడా పచ్చని అడవిలా ఉల్లాసంగా మారుతుంది.*


అందుకే.... ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మనం (మనసుతో) చూసే దృష్టి కోణాన్ని .... 

మనస్సుతోనే క్రమబద్ధీకరించి, జీవితంలోని విపత్కర పరిస్థితుల్లో కూడా మనం కాసేపు ఆగి, విశ్లేషించి సరైన చర్య తీసుకునే విధంగా స్థిరత్వానికి తీసుకురావాలని కోరుకుంటూ ....

శుభాకాంక్షలు*


🙏🙏🙏🙏🙏🙏😆https://chat.whatsapp.com/G4vTknQuOME6XXxxzzU3mS

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏 


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*శ్రీ స్వామివారిచ్చిన ఆజ్ఞలను పాటించకపోతే?*


చీట్ల ద్వారా శ్రీ స్వామివారిచ్చిన ఆజ్ఞలను పాటించని వారి గతి ఎలా ఉందో చూడండి!


వెంకటేశ్వర్లు అనే బేలుదారి మేస్త్రి కావలి దగ్గర గ్రామము. చాలా ధర్మపరుడు, నీతి, దయ గలవాడు. వివాహమైన రెండు నెలలలోపే భార్య ప్రవర్తన నచ్చక ఆమెను వారి అమ్మగారింటికి తరిమేశాడు. అనేకమంది మధ్యవ్యక్తుల ద్వారా రాయబారం నడిపింది కానీ ఇతను అంగీకరించలేదు. ఆమె చివరకు కోర్టుకు వెళ్ళింది. నా భర్త నన్ను ఏలుకోవడం లేదు. నాకాభర్తే కావాలి అని ఆమె వాదన. ఇతడు ఆ గ్రామం వదలి గొలగమూడి వచ్చాడు. 


1. నన్ను గొలగమూడిలోనే ఉండమని శ్రీ స్వామివారి ఆజ్ఞ 2. మా గ్రామం వెళ్ళమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని రెండు చీట్లు సమాధిమీద పెట్టించి ఒకటి తీయమని పూజారికి చెపితే గొలగమూడిలోనే ఉండమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అనే చీటీ వచ్చింది. కానీ పదిరోజుల తర్వాత వాళ్ళ గ్రామం వెళ్ళాడు. అతని అన్నదమ్ములే అతనిని రెండుమార్లు చితకబాదారు. తిరిగి గొలగమూడికి వచ్చాడు. శ్రీ స్వామి కరుణించినా మన అజ్ఞానము, మన బలీయమైన కర్మ శ్రీ స్వామివారి ఆజ్ఞలను పాటించనివ్వదు. ఇలాంటి అనుభవాలు చదివిన తర్వాతనైనా మనం శ్రీ స్వామివారి ఆజ్ఞలను పాటించి మేలు పొందవలెనని ప్రార్థన.


శ్రీ స్వామివారి లీలలు వ్రాసేందుకు మానవ మాతృలకు శక్యము కాదు. *శ్రీ స్వామివారు కోరిన సత్యం, ధర్మం సంపన్నత్వం, సాధారణత్వం సద్గురుసేవ ఆచరించి వారికి తృప్తి గల్గించి మన జీవితాలను సార్ధకం చేసుకుందాం.*


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*

శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

      

*సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 22*

                   *స్థిత ప్రజ్ఞుడు*

                              - శ్రీ రామచంద్రరావు


మాస్టర్ గారికి పెళ్ళి అయిన తర్వాత జపమాల తీసుకొని జపం చేయటం నేను చూశాను. స్టూడెంట్స్ మి కదండీ పెళ్ళైన తర్వాత గురువుగారు మారిపోయారు. మనలాగే భయం పట్టుకుందేమోనని అన్నాడొకడు. "మాస్టర్ గారు మీరేమనుకుంటూ జపం చేస్తారు" అని అడిగితే, "ఈ  ప్రపంచమంతా దేనితో చేయబడిందో ఆ చైతన్యాన్ని తలచుకుంటూ ఒక్కో రుద్రాక్ష తిప్పుతాను." అని సమాధానమిచ్చారు. ఒకసారి ఎవరితోనో అన్నారట. "నేనూ సాధన చేశాను. ఆమె చేసింది. అందువల్ల ఇంకా గొప్ప సాధకుడు  పుత్తాడు " అని. "ఇది నిజమా సార్?" అని, అడిగితే "నిజమే" అని చెప్పారు.


                      🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*

*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*


అలాగే రేగే అను సాయిభక్తుడు

హజరత్ తాజుద్దీన్ బాబా వారి దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడమెంతో కష్టతరమయ్యేది. దానికితోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచియున్నారు. నాటి సాయంత్రం 4 గం||లకు రేగే రైలెక్కవలసి యుండటం వలన మధ్యాహ్నం 3 గం||ల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచియుండదలచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు వుండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకు వెళ్ళాడు, రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి, వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తరువాత శ్రీ శ్రీ లలానాధ్ మహరాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి, రేగే వారిని గూడా దర్శించి, వారిని తన యింటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే యిల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయి ఖేడా నివాసియైన శ్రీ కేశవానందజీని, పూనే నివాసియైన హస్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలిని గూడ దర్శించాడు రేగే. ఆ యిద్దరు మహాత్ములూ అతనిని చూస్తూనే, "నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు" అని ఎంతో ఆదరించారు.


*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*

అర్చకుని ఓ చిన్న కోరిక

 అర్చకుని ఓ చిన్న కోరిక


నమస్కారం. నా పేరు వారణాసి మహదేవ శాస్త్రి. శివార్చకులం. వంశ పారంపర్యంగా ఇదే మావృత్తి. నా చిన్నప్పుడే నాన్న నన్ను యింగ్లీష్ చదువు మానిపించి, ఆగమ పాఠశాల లో జేర్పించారు. అర్చక వృత్తికి కావలసిన అన్ని విద్యలు ఓ అయిదేళ్ళ పాటు క్షుణ్ణంగా నేర్చుకొని, యీ వృత్తిలో ఓ నలభై యేళ్ళుగా కాలం గడుపుతున్నాను. లక్షలు, కోట్లు సంపాదించకపోయినా.. నమ్ముకున్న ఆ పరమేశ్వరుని కృపతో కుటుంబం సజావుగానే సాగిపోతుంది. నా గురించిన పరిచయం యిక్కడతో ఆపి అసలు విషయానికి వస్తాను. 


చాలా మంది భక్తులు దేవుడి దగ్గరకి వచ్చేటప్పుడు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమల ప్యాకెట్లు, నాలుగయిదు అగరు బత్తీలు, కొంత మందయితే ఓ గిన్నెలోనో, ఓ ప్లాస్టిక్ సీసాలోనో దీపారాధన నిమిత్తం నూనె లాంటిది తీసుకుని వస్తారు. 

అయ్యాలారా ! అమ్మలారా !! ఇక్కడ ఒక విషయం గమనించండి. దేవుడి కోసం మీరు తెచ్చే ఆ పూజా ద్రవ్యాలన్నీ డబ్బు కక్కుర్తి తో అతి దారుణంగా కల్తీ చేయబడ్డవే. దేవుడికి సమర్పించే ఆ పూజా ద్రవ్యాలు యెంత హేయంగా,  నికృష్టంగా తయారు చేస్తారో చెప్ప దలుచుకోలేదు. మీరు తట్టుకోలేరు.  


చివరికి, మా అర్చకులు  రోజూ వంటికి పూసుకొనే విభూది కూడా కల్తిదే. నిజానికి అది విభూదిగాదు. సున్నపు ముద్ద. కొన్ని యేళ్ళుగా ప్రతి రోజు ఆ విభూతి రాసుకొని.. రాసుకొని.. చర్మ వ్యాధులతో బాధ పడే అర్చకులు మాలో చాలమంది వున్నారు. ఆ హారతి కర్పూరం, ఆ అగరు బత్తీలు వెలిగించి.. వాటి వాసనలని కొన్ని గంటల పాటు ప్రతి రోజూ పీల్చి.. పీల్చి.. ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రాణాల మీదకి తెచ్చుకొన్న వాళ్ళూ, ప్రాణాలు పోగుట్టుకున్నవారు వున్నారంటే మీరు నమ్ముతారా? చచ్చిపోయిన పశువుల కొవ్వుతో తయారు చేయబడ్డ ఆ నూనెల దీపారాధనల వాసనలకి వైద్యులకంతుపట్టని రోగాలతో బతుకు గడుపుతున్న అర్చకులు.. యెంతో మంది. ఒక్క సారి ఆలోచించండి. ఆరోగ్యానికి ప్రమాదకరమైన రసాయనిక పదార్ధాలతో తయారు చేయబడ్డ ఆ నకిలీ పూజా ద్రవ్యాలతోనా మనం నమ్ముకున్న మన దేవుణ్ణి పూజించేది? ఆయన ప్రసన్నుడౌతాడా ? మనకు ముక్తి ప్రసాదిస్తాడా ? మనం పుణ్యం మూట కట్టుకుంటామా? అసలు ఆయన అడిగాడా? సృష్టి అంతా ఆయనదే అయితే ఆయనకి మనం యిచ్చేదేంటి ?  మనం యెంత? మనకున్నది యెంత? కొద్దిగా ఆలోచించండి. నిష్కల్మషం, నిష్కామం, నిస్స్వార్ధం తో కూడుకున్న  ధ్యానంలో ఓ నమస్కారం చాలదా ఆయన దీవెనలు అందుకోవటానికి? 


గాలి కూడా దూరని గర్భగుళ్ళో గంటల తరబడి తమ విధులు నిర్వహించే అర్చకుల ఆరోగ్యంతో పాటు.. మీఆరోగ్యం కూడా దృష్టిలో వుంచుకొండి.  ఇకనుంచైనా ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలతో.. విషపూరిత పదార్థాలతో ఆ పరమేశ్వరుని పూజించకండి. నా యీ మాటల్లోని వాస్తవికతను గుర్తించండి. 


హర హర మహాదేవ !!   

జై శ్రీరాం !! 


భవదీయుడు


వారణాసి మహాదేవ శాస్త్రి

శోభకృత్ బహుళ చవితి

(10 ఏప్రిల్ 2023).