🙏
*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం), భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు
*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్
*శ్రీ స్వామివారిచ్చిన ఆజ్ఞలను పాటించకపోతే?*
చీట్ల ద్వారా శ్రీ స్వామివారిచ్చిన ఆజ్ఞలను పాటించని వారి గతి ఎలా ఉందో చూడండి!
వెంకటేశ్వర్లు అనే బేలుదారి మేస్త్రి కావలి దగ్గర గ్రామము. చాలా ధర్మపరుడు, నీతి, దయ గలవాడు. వివాహమైన రెండు నెలలలోపే భార్య ప్రవర్తన నచ్చక ఆమెను వారి అమ్మగారింటికి తరిమేశాడు. అనేకమంది మధ్యవ్యక్తుల ద్వారా రాయబారం నడిపింది కానీ ఇతను అంగీకరించలేదు. ఆమె చివరకు కోర్టుకు వెళ్ళింది. నా భర్త నన్ను ఏలుకోవడం లేదు. నాకాభర్తే కావాలి అని ఆమె వాదన. ఇతడు ఆ గ్రామం వదలి గొలగమూడి వచ్చాడు.
1. నన్ను గొలగమూడిలోనే ఉండమని శ్రీ స్వామివారి ఆజ్ఞ 2. మా గ్రామం వెళ్ళమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అని రెండు చీట్లు సమాధిమీద పెట్టించి ఒకటి తీయమని పూజారికి చెపితే గొలగమూడిలోనే ఉండమని శ్రీ స్వామివారి ఆజ్ఞ అనే చీటీ వచ్చింది. కానీ పదిరోజుల తర్వాత వాళ్ళ గ్రామం వెళ్ళాడు. అతని అన్నదమ్ములే అతనిని రెండుమార్లు చితకబాదారు. తిరిగి గొలగమూడికి వచ్చాడు. శ్రీ స్వామి కరుణించినా మన అజ్ఞానము, మన బలీయమైన కర్మ శ్రీ స్వామివారి ఆజ్ఞలను పాటించనివ్వదు. ఇలాంటి అనుభవాలు చదివిన తర్వాతనైనా మనం శ్రీ స్వామివారి ఆజ్ఞలను పాటించి మేలు పొందవలెనని ప్రార్థన.
శ్రీ స్వామివారి లీలలు వ్రాసేందుకు మానవ మాతృలకు శక్యము కాదు. *శ్రీ స్వామివారు కోరిన సత్యం, ధర్మం సంపన్నత్వం, సాధారణత్వం సద్గురుసేవ ఆచరించి వారికి తృప్తి గల్గించి మన జీవితాలను సార్ధకం చేసుకుందాం.*
🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*
శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*
*సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*
*టాపిక్ :- 22*
*స్థిత ప్రజ్ఞుడు*
- శ్రీ రామచంద్రరావు
మాస్టర్ గారికి పెళ్ళి అయిన తర్వాత జపమాల తీసుకొని జపం చేయటం నేను చూశాను. స్టూడెంట్స్ మి కదండీ పెళ్ళైన తర్వాత గురువుగారు మారిపోయారు. మనలాగే భయం పట్టుకుందేమోనని అన్నాడొకడు. "మాస్టర్ గారు మీరేమనుకుంటూ జపం చేస్తారు" అని అడిగితే, "ఈ ప్రపంచమంతా దేనితో చేయబడిందో ఆ చైతన్యాన్ని తలచుకుంటూ ఒక్కో రుద్రాక్ష తిప్పుతాను." అని సమాధానమిచ్చారు. ఒకసారి ఎవరితోనో అన్నారట. "నేనూ సాధన చేశాను. ఆమె చేసింది. అందువల్ల ఇంకా గొప్ప సాధకుడు పుత్తాడు " అని. "ఇది నిజమా సార్?" అని, అడిగితే "నిజమే" అని చెప్పారు.
🙏జై సాయిమాస్టర్🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*ఓం సమర్ధ సద్గురు శ్రీ సాయినాథాయ నమః*
*శ్రీ సాయి లీలామృతము: అధ్యాయము 28*
అలాగే రేగే అను సాయిభక్తుడు
హజరత్ తాజుద్దీన్ బాబా వారి దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడమెంతో కష్టతరమయ్యేది. దానికితోడు వేలాది జనం రాజభవనానికి ముంగిటనున్న తోటలో వారి దర్శనానికి వేచియున్నారు. నాటి సాయంత్రం 4 గం||లకు రేగే రైలెక్కవలసి యుండటం వలన మధ్యాహ్నం 3 గం||ల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచియుండదలచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు వుండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకు వెళ్ళాడు, రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి, వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తరువాత శ్రీ శ్రీ లలానాధ్ మహరాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి, రేగే వారిని గూడా దర్శించి, వారిని తన యింటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే యిల్లు చేరి సాయి పటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం త్రాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయి ఖేడా నివాసియైన శ్రీ కేశవానందజీని, పూనే నివాసియైన హస్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలిని గూడ దర్శించాడు రేగే. ఆ యిద్దరు మహాత్ములూ అతనిని చూస్తూనే, "నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడవు" అని ఎంతో ఆదరించారు.
*రచన: ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి