12, ఏప్రిల్ 2023, బుధవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

 🙏


*గ్రంథం:* నమ్మిన వారికి సొమ్ము - నమ్మకుంటే (వారి ప్రారబ్దం),  భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య లీలలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*సంపూర్ణ విశ్వాసం*


శ్రీ స్వామివారి సేవకులలో  తులసమ్మ గారు మరియు రోశి రెడ్డి గారు స్వామి మీద సంపూర్ణ విశ్వాసముంచి శరణాగతి ఎలా చేసారో ఈ క్రింది లీల చెబుతుంది. 


అరగంటలో తులసమ్మగారు చనిపోతుందని అమెరికన్ ఆస్పత్రి డాక్టరు చెప్పినప్పుడు *'ఆమెకేమీ ఫరవాలేదు, నాలుగు రోజులు ఇంట్లో వుంచి తీసుకురమ్మని'* శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు. వారు చెప్పినట్లే చేస్తే ఆ తల్లి అది మొదలు 20 సం||లు వదలకుండా స్వామిని సేవించింది. సిరిసంపదలు వదలవచ్చు, బంధుమిత్రులను వదలగలము కానీ ఈ తల్లి కారులలో తిరుగుతూ కాలుక్రింద పెట్టినామె కాదు. కానీ స్వామివారి సేవకొచ్చాక ఏనాడూ పాదరక్షలు ధరించలేదు. మైళ్ళు కొలది ఎలా నడిచిందో నేను (రచయిత) ప్రత్యక్షంగా చూచాను. ఆవకాయ పిండివంటలు తిన్న ఆ నోటితో కూటినీళ్ళు, పచ్చడి, మిరప్పొడితోనే గడిపింది.


 ఈ తులశవ్వగారికి స్వప్నంలో కాశీ యాత్ర చేయించారు. ప్రత్యక్షంగా చూచిన వారి కంటే గొప్పగా వారు చూడని ముఖ్యమైన ప్రదేశాలు కూడా చూపించారు. దాసగణుకు గంగా, యమునలను సాయి తన పాదములలో చూపించినట్లుంది.


 అన్నమే తినకుండా కేవలం చక్కెర నీళ్ళతో జీవిస్తూ - సంపూర్ణంగా కళ్ళు కనపడని గ్రుడ్డివారు మరియు 80 సం॥ల వృద్ధుడు, రోశి రెడ్డి తాత. తాను పొగాకు తంబ వూసే ముంత తన ప్రక్కనే ఉన్నా కనబడక చేతితో తడిమి వెతుక్కునేవాడు. ఇట్టి గ్రుడ్డివాని చేత గ్రామమంతా తిరిగి మూడు కిలోల బియ్యపు భిక్షాన్నం తెప్పించే వారు శ్రీ స్వామివారు. వీరి విశ్వాసమే వీరికి తోడు. ఈ సేవ ఈ మహనీయుడు చివరి శ్వాస వరకు చేశారు. స్నానం చేసి గుడ్డలు మార్చుకొని గురుస్మరణతో తనువు చాలించిన ధీరుడు. *శ్రీ స్వామివారు ఆజ్ఞాపిస్తే బండరాళ్ళయినా కదలి పనిచేస్తాయి. నాదేమి లేదు అంతా స్వామి దయ* అంటారు.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


   అదంతా వినగానే నా మనస్సులో ఒక అనుమానం తలెత్తింది. ఎక్కడి నుండో వచ్చిపోయే నాకు ఉపదేశ దీక్షయిచ్చి నా బాధ్యత తమ మెడకు తగిలించుకోవడం ఇష్టంలేక మాత్రమే నా బెడద ఎలాగైనా వదలించుకోడానికి మాత్రమే ఆయనలా చెప్పారేమోననిపించింది. నేను తలవంచుకొని కూర్చోగానే ఆయన కొంచెం చికాకుగా, “నేను ఇంత హృదయపూర్వకంగా యథార్థం చెప్పినా గూడ అతడింకా ఏవో శంకలు మనసులో పెట్టుకుంటున్నాడు. వాటిని లోపల పెట్టుకోకుండా నిశ్శంకగా అడిగి తెలుసుకో” మని మరల చెప్పించారు.


*********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*జై సాయిమాష్టర్🌹🌹🙏🙏*

 "షిరిడీలో సమాధి మందిరం సజీవ కళతో ప్రకాశిస్తున్న సాయి బాబా పాలరాతి విగ్రహాన్ని 

దర్శించి ఒక విచిత్రమైన అనుభూతితో పొందిన మనసుతో " బాబా స్థితి ,ఆయనకు ఈ సృష్టినుంచి అననన్యముగా తోచి వుండదు .

ఆయన తాను శరీర పరిమితుడన్న భావాన్ని విస్మరించి ,ఈ చరాచర విశ్వమంతా ఏ మహత్తర చైతన్యములో సంకల్పమాత్రముగా ఉన్నదో ,ఆ చైతన్యముతో  బాబా తాదాత్మత చెంది ఉన్నారు .

ఇది ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారికి షిరిడీలో 

బాబా మొదట దర్శనములో కలిగిన అనుభూతి .

"ఎవరయితే ఎప్పుడూ నా గురుంచే వింటూ ,నా 

లీలలే చింతన చేస్తూ ,నన్నే స్మరిస్తారో ,వారి కర్మ 

నశించి నేనే వారిగా మారిపోతారు " అని సాయబాబా పలికిన మాటలు .26 సంవత్త్సరాలు 

నిరంతర సాయి సేవలో ,సాయి స్మరణలో జీవితాన్ని గడపి ధన్యులైనారు ." శ్రీ సాయిమాస్టర్ 

గా ,సాయబాబా బేటా గా ,మహాత్ముల ముద్దు బిడ్డడుగా పేరొందిన శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు ." తల్లికి తగ్గ బిడ్డలు కండి ,మీ 

అధ్యాత్మిక ధనాగారాలు నింపుకోండి " అన్న బాబా 

సూక్తికి ప్రతీకగా బాబా పూర్ణ అనుగ్రహాన్నీ పొంది 

సాయిభక్తుల మనసులలో స్థిరంగా నిలిచిపోయిన 

మహానుభావుడు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు .

మరుగుపడిన దత్త స్వరూపాలైన అవధూతలను 

మహాత్ములను ,యోగులను భక్తులందరికీ అవగాహన కల్పించిన మహనీయుడు మన మాస్టరుగారు .ఉన్నత పదవులు ,కీర్తి కాంక్షలు 

ఆశించక ,సాయి శరణాగతి తత్వములో 51 సం .

లు జీవించి, 1989 ఏప్రియల్ 12 వ తేదీనాడు ఆ 

సమర్ధసద్గురు ,కైవల్య ప్రదాత అయిన శ్రీ షిర్డి సాయినాధునిలో ఐక్యమయ్యారు .నేడు ఆయన 

34 వ ఆరాధన దినోత్సవం .ఆ సాయిమాష్టరుకి 

ఇవే మా హృదయకపూర్వక నమస్సులు .

సవరణ -నేడు మాస్టారుగారి 34 వ ఆరాధనఉత్సవం .

*జై సాయిమాష్టర్🌹🌹🙏🙏*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: