2, అక్టోబర్ 2022, ఆదివారం

భగవద్గీత శ్లోకం పారాయణ

 ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ

       చేద్దాము చేయిద్దాము 

 భగవద్గీత 1వ అధ్యాయం అర్జునవిషాద యోగం 

32 వ శ్లోకం- నకాంక్షేవిజయం కృష్ణ, నచరాజ్యం సుఖానిచ |

                   కింనోరాజ్యేన గోవిందా, కింభోగైర్ జీవితే నవా ||


 అర్థం- అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు ఓ కృష్ణా! నాకు విజయం కానీ రాజ్యము కానీ సుఖములు కానీ అక్కరలేదు. గోవిందా!ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనం ఏమిటి?

-----------------------------------------------

 అర్జునుడికి ఏదో ఒక విధంగా తీవ్రమైన వైరాగ్యము వచ్చింది. తీవ్రమైన వైరాగ్యము ఉన్న వారికే బ్రహ్మజ్ఞానం ఉపదేశించాలి అని శాస్త్రం చెబుతోంది.అర్జునుడికి ప్రాపంచిక విషయాల పట్ల విరక్తి కలిగింది. రాజ్యాన్ని భోగాలను అతడు గడ్డి పరికలా చూస్తున్నాడు.ఇంతవరకు ఎప్పుడూ అర్జునుడికి ఇటువంటి భావనలు కలగలేదు. ఇప్పుడు కలగడం చూసిన శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో భగవద్గీతను అర్జునుడికి బోధించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మనకు కూడా అర్జునుడిలా భగవద్గీత మీద  తీవ్రమైన భక్తి,శ్రద్ధ,కోరిక ఉండాలి. అప్పుడే భగవద్గీత అర్థం అవుతుంది బ్రహ్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది.తద్వారా మనస్సు ప్రశాంతంగా,ఆరోగ్యంగా ఉంటుంది.


  షేర్ చేసి మన వారందరికీ ప్రతిరోజు ఒక్కభగవద్గీత శ్లోకం పారాయణ చేసే అదృష్టాన్ని కల్పిద్దాము.

ధర్మాకృతి : మహామఖ స్నానం

  ధర్మాకృతి : మహామఖ స్నానం


1909లో కుంభకోణంలో 12ఏళ్ళకు ఒకసారి వచ్చే మహా మఖం వచ్చింది. మాఘ పూర్ణిమ నాడు సూర్యుడు కుంభ రాశిలోనూ, బృహస్పతి సింహరాశిలోనూ, చంద్రుడు మఖ నక్షత్రంలోనూ కూడి ఉన్నప్పుడు పుణ్యకాలం వస్తుంది. రమారమి ఐదెకరాల విస్తీర్ణమున్న మహామఖ సరస్సులో ఆరోజు 65 కోట్ల తీర్థములు, గంగాది సకల పవిత్ర నదులు తమ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాయట. ఇక్కడ మహామఖ సరస్సు, కుంభకోణం గురించిన ఒక ఐతిహ్యం చెప్పుకోవాలి. మహా ప్రళయకాలంలో జీవరాసులన్నీ బీజరూపంగా ఒక అమృత కుంభంలో జాగ్రత్తపరచబడినవట. ఆ కుంభం మేరు పర్వతంపై ఉంచబడింది. 


మహాజల ప్రళయంలో ఆ కుండ కొట్టుకుంటూ దక్షిణాదికి వచ్చేసింది. ఇంతలో వరద నెమ్మదించింది. ఈ కలశం మఖా సరస్సు ప్రాంతంలో బురదలో కూరుకొని పోయింది. ఈ కుంభాన్ని వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలు వచ్చారు. కుంభమో! మహా తేజస్సుతో వెలిగిపోతూ దుర్నిరీక్ష్యంగా ఉంది. బ్రహ్మగారు కూడా దగ్గరకు చేరలేక మరల సృష్టి చేసే అవకాశం లేక పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పినాకపాణి తన వాడి అయిన బాణంతో ఆ కుంభాన్ని ఛేదించారు. కుండ ముక్కలు ముక్కలయి చుట్టుప్రక్కల పడిపోయింది. ఆ ముక్కలు పడిన ప్రదేశాలన్నీ క్షేత్రాలయిపోయాయి. కోణంగా ఉన్న ముక్కు వంటి ముక్క పడడంతో ఊరు కుంభకోణంగా పిలువబడింది. బురదలో ఇరుక్కుపోయిన కుండ మొదలు మహా మఖ సరస్సులో మిగిలిపోయింది. కుండలో అమృతంతో సరస్సు నిండిపోయింది. 


పరమేశ్వరుడు అమృతంతో తడిసిన ఆ బురద తీసుకొని లింగాకారంగా చేసుకొని దానికి అంతర్గతుడయి అందరినీ ఆదికుంభేశ్వరునిగా అనుగ్రహీతులను చేశాడు. మహా మఖ పుణ్యకాలంలో ఆ సరస్సులో గంగాది సర్వ పుణ్య నదులు, 65 కోట్ల తీర్థములు, 33కోట్ల దేవతలు తమ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తారు. కుంభకోణంలో ఉన్న ఆదికుంభేశ్వర దేవాలయం మొదలు అన్ని గుళ్ళనుంచి స్వామి ఊరేగింపుగా తీర్థ స్నానానికి వస్తారు. లక్షలాది ప్రజలు ఈ తీర్థమునకు వస్తారు. అట్లాంటి ముఖ్య సందర్భాలలో ముఖ్య సమయానికి అన్ని ప్రధాన రహదారుల వెంబడి పెద్ద ఎత్తున ఊరేగింపుగా వచ్చి మొదటి స్నానం చేసే గౌరవం కామకోటి పీఠ ఆచార్యులకు అనూచానంగా వస్తున్నది. 


మహాస్వామి వారు తంజావూరు రాజ పరివారం వెంటరాగా ఏనుగు అంబారీపై పెద్ద ఊరేగింపుగా మహామఖ స్నానానికి వెళ్ళారు. కుంభకోణపు ప్రజలు గుర్తుంచుకోదగిన చారిత్రాత్మక సన్నివేశమది. తేపరమానల్లూరు శివం ఆధ్వర్యంలో మఠంలో లక్షలాది ప్రజలకు భారీగా అన్నదానం చేయబడింది. ప్రభుత్వ గెజెట్లలో ఈ అన్నదానం ఎంతో గొప్పగా శ్లాఘించబడింది.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సరస్వతీ స్తోత్రమ్.

 #శ్రీవేదవ్యాస కృత సరస్వతీ స్తోత్రమ్... 


సరస్వతి నమస్తేస్తు పరమాత్మ స్వరూపిణి!

జగతామాదిభూతా త్వం జగత్వం జగదాకృతిః!!

ఇంద్రనీలాలకా చంద్రబింబాననా, పక్వబింబాధరా రత్నమౌళీధరా!

చారు వీణాధరా చారుపద్మాసనా, శారదా పాతు మాం లోకమాతా సదా!!

స్వర్ణముక్తామణి ప్రోతహారాన్వితా, ఫాల కస్తూరికా యోగి బృందార్చితా!

మత్తమాతంగ సంచారిణీ లోకపా, శారదా పాతుమాం లోకమాతా సదా!!

రాజరాజేశ్వరీ రాజరాజార్చితా, పద్మనేత్రోజ్జ్వలా చంద్రికాహాసినీ!

అద్వితీయాత్మికా సర్వదేవాగ్రణీ, శారదా పాతుమాం లోకమాతా సదా!!

భారతీ భావనా భావితా కామదా, సుందరీ కంబుదాయాద కంఠాన్వితా!

రత్నగాంగేయ కేయూర బాహూజ్జ్వలా, శారదా పాతుమాం లోకమాతా సదా!!

జ్ఞాన సరస్వతి

 #జ్ఞాన సరస్వతి దేవాలయం , బాసర) ..


ఆదిలాబాదు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతిచెందిన ఆలయం జ్ఞానసరస్వతి ఆలయం. ఇది ఆదిలాబాదు జిల్లా ముధోల్ మండలం బాసరలో ఉంది. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా , రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి , మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.


#పురాణగాధ


బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి , తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం , జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా , గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతున్నది. ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కథనం ప్రచారంలో ఉంది.


#ఆలయ విశేషాలు


సరస్వతి ఆలయ గోపురము , వెనక సరస్వతి విగ్రహము

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.


#రవాణా సౌకర్యాలు


హైదరాబాదు - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి , మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ , భైంసా) బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషను ఉంది.


సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.


ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం , దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము , వ్యాస లింగము ఉన్నాయి.


మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్థం , సూర్యతీర్థం , వ్యాసతీర్థం , వాల్మీకి తీర్థం , విష్ణుతీర్థం , గణేషతీర్థం , పుత్రతీర్థం , శివతీర్థం.


#పూజా విశేషాలు


ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర , ఒడిషా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యైఆర్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక , బలపము , కాగితము , కలము వంటి కానుకలు సమర్పించే ఆచారము ఉంది. కేశ ఖండనము , ఉపనయనము , వివాహాలు , భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. 


#దర్శన వేళలు :


 ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు. 4 గంటల నుండి 7.30 గంటల వరకు అభిషేకము , అలంకారము , హారతి, నైవేద్యము చేసి ప్రసాద వితరణ చేస్తారు. 7.30 గంటల నుండి 12.30 గంటల వరకు అర్చన , సర్వదర్శనం ఇతర పూజలు చేస్తారు. 12.30 గంటలకు నివేదన చేసి ఆలయము 2 గంటవరకు మూసి ఉంచుతారు. 2 గంటల నుండి 6.30 గంటల వరకు అర్చన సర్వదర్శనం చేస్తారు. 6.30 గంటల నుండి 7 గంటల వరకు ప్రదోష పూజ నిర్వహిస్తారు. 7 గంటల నుండి 8.3౦ గంటల వరకు మహా హారతి దర్శనం తరువాత ఆలయము మూసి వేస్తారు.


#నవరాత్రులు:


ఆశ్వియజ శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము , దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహార్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము , సుందరమైన అలంకారము , సాయంకాలము పల్లకీ సేవ , శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు , ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు , ఉపన్యాసములు , హరికథలు , పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.

పుణ్యం వూరికే పోదు*

  *పుణ్యం వూరికే పోదు*

                ➖➖➖✍️


ఒక రైతు తన పొలంలో పని చేసుకుంటుంటే ఏవో అరుపులు వినిపించాయి.


వెంటనే అటు వైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడి “HELP, HELP” అని అరుస్తూ ఉంటాడు. 


రైతు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలో దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు.


తర్వాతి రోజు వాళ్ళింటి ముందు ఒక ఖరీదయిన గుర్రపుబండి వచ్చి ఆగుతుంది, అందులో నుండి ఖరీదయిన దుస్తులు ధరించిన పెద్ద మనిషి దిగి నేరుగా రైతు వద్దకు వస్తాడు. 


“ఎవరు బాబు మీరు?ఎవరు కావాలి?” అని అడుగుతాడు రైతు.


“నమస్తే, నేను పక్క వూర్లో ఉంటాను, నిన్న మీరు మా అబ్బాయిని బావిలో పడిపోతే రక్షించారు, అందుకు కృతజ్ఞతగా ఏమిచ్చినా మీ ఋణం తీరదు, దయచేసి ఈ ధనం తీసుకోండి” అంటూ ఒక ఇనప్పెట్టె ఇస్తాడు. 


అప్పుడు రైతు “క్షమించండి, నేను ప్రతిఫలం ఆశించి చేయలేదు, ఒక వ్యక్తి ఆపదలో ఉంటే నా చేతనయిన సాయం చేసాను, అది మనిషిగా నా ధర్మం,” అంటూ సున్నితంగా తిరస్కరిస్తాడు.


ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి పెద్ద మనిషికి నమస్కరిస్తాడు,

“ఈ అబ్బాయి నీ కొడుకా? ఏం చదువుతున్నాడు?” అని అడుగుతాడు పెద్దమనిషి.


“అవునండి నా కొడుకే, కొంతవరకు చదివించాను, ఇక చదివించే స్తోమత లేదు, ఇపుడు నాతో పాటే పొలానికి వచ్చి పనుల్లో సాయపడుతుంటాడు” అంటాడు రైతు.


“అలాగా, అయితే నా మాట విను, నీ కొడుకుని నేను చదివిస్తాను, నా కొడుకుతో పాటు పెద్ద చదువులు చదువుకుంటాడు, ఖర్చంతా నేను భరిస్తాను. నా మాట కాదనకు, నా కొడుకుని కాపాడిన నీ ఋణం కొంతయినా తీర్చుకోనివ్వు” అంటాడు.


ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు రైతు.


పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివిస్తాడు, వాళ్ళిద్దరూ చాలా గొప్ప వాళ్ళు అవుతారు. 


కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి ఒక అంతు తెలియని వ్యాధి వస్తుంది,

డాక్టర్లు అందరూ అతన్ని పరీక్షించి చేతులెత్తేస్తారు, అప్పుడు ఆ రైతు కొడుకు వచ్చి తను కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు.


ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా?

పెన్సిలిన్ మందుని కనిపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త

“Alexander Fleming”..!!!


ఇంతకు ఆ రెండో వ్యక్తి ఎవరో తెలుసా??

బ్రిటీష్ ప్రధాన మంత్రి

” Winston Churchil”


అందుకే అంటారు…

” పుణ్యం వూరికే పోదు, కలకాలం తోడొస్తుంది” అని.!!✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం...

*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-6

 శరన్నవరాత్రాంతర్గత శ్రీదేవీసంస్తుతి-6 

షష్ఠి 

11.

శుంద్భృంగవినీలకోమలకచాం చంద్రాతపాశీతలామ్ 

ఫుల్లాబ్జారుణదేహకాంతివిలసత్ సుస్మేరబింబాననామ్ 

భాస్వద్భానుసహస్రకోటిరుచిరాం వేదత్రయీరూపిణీమ్ 

వందే మాతర మార్తచిత్తశరణాం భక్తాలిచిన్తామణిమ్ 


12. చండిక 

శుంభచ్చండపరాక్రమోద్ధతియుతాం శాత్రవ్యదుర్భేదినీమ్ 

వీరాం దుర్జనదౌష్ట్యఖండనరతాం 

చాముండనామాంచితామ్ 

శౌర్యాం భండనరక్తబీజదమనాం సంతానసంపత్ప్రదామ్ 

వందేహం శుభసప్తవర్షకలితా మానందసంవర్ధినీమ్


*~శ్రీశర్మద*

కలశము

 *కలశము*

                


    *కలశము అంటే ఏమిటి?..!!*


*నీటితో నిండిన ‘ఇత్తడి’ లేక ‘మట్టి’ లేక ‘రాగి’ పాత్ర! పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది.*


*తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది.*


*అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది.* 


*ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు 'పూర్ణకుంభము' అనబడుతుంది.*


*అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది.*


*ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.*


*సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో ‘ కలశం’ ఏర్పాటు చేయబడుతుంది.*


*స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది.*


*ఇది (పూర్ణకుంభం) మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.*



*మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే…*

*సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు.*


*అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు.*


*కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది.*


*ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.*


*ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది.*


*ఆకులు,కొబ్బరికాయ సృష్టికి ప్రతీక.*


*చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది.*


*అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింప బడుతున్నది.*


*అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు 'అభిషేకము' తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది.*


*దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు.*


*పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.*


*కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.*


*పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు.*


*వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా ‘పూర్ణకుంభం’తో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము...✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ముసలివారినిచూసి

 ముసలివారినిచూసి రచన: కొడవంటి


ప. ముసలివారినిచూసి మూల్గుటెందులకు యవ్వనమ్మనునది ఎన్నాళ్లు నిలచు 

1. వృద్ధాప్యమనునది వూడిగము కారాదు శాంతిసౌఖ్యములతో హాయిగనుండవలె ముసలివారినిచూసి మమకారమేచూపి మనసు రంజిల్లెడి మాటలాడగవలె

 2. వృద్ధులును ఒకనాటి యువకులేసుమ్మీ అనుభవము పొందిరి అన్ని రంగముల పిల్లలను పాపలను ఆప్యాయతలతోడ మంచి పౌరులుగ మలచిన ఘనులు 

3. తనయుడే తండ్రి తండ్రియే తాత

కలగమనమెమనకు కనువిందుచేయు ఎల్లపుడు ఆనందమందుచును మనుజుడు దేశప్రగతికి పాటు పడుచునుండగవలె

మహర్షుల చరిత్రలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷మన మహర్షుల చరిత్రలు🌷* 

                 🌷🌷🌷

*🌹ఈ రోజు 40వ, దేవల మహర్షి గురించి తెలుసుకుందాం 🌹*


🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️


🍁పూర్వం దేవుడనే మనువుండేవాడు . అతని కొడుకు ప్రజాపతి . ప్రజాపతి కొడుకు ప్రత్యూషుడు . ప్రత్యూష్యుడికి ఇద్దరు కొడుకులు . 


☘️మొదటివాడు దేవలుడు రెండవవాడు విభువు . దేవలుడు నల్లగా ఉండేవాడు . అందుకే అతడిని ' అసితుడని ' కూడా పిలిచేవాళ్ళు .


🍁దేవలుడు పెద్దవాడయ్యాక విద్యాభ్యాసానికి వ్యాసుడి దగ్గరకి పంపాడు తండ్రి .


☘️దేవలుడు చక్కటి గుర్తుభక్తితో విద్య నేర్చుకున్నాడు . 

వ్యాసుడు తాను రాసిన మహాభారతాన్ని వ్యాప్తి చెయ్యమని పితృలోకం పంపించాడు దేవలుడిని .


🍁గురువు గారు చెప్పినట్లే చేశాడు దేవలుడు . గురువు గారిని మించిన శిష్యుడని అందరూ మెచ్చుకున్నారు .


☘️దేవలుడు గొప్ప తపస్విగా , సత్యవ్రతుల్లో మొదటివాడుగా బ్రహ్మనిష్ఠ గలవాడుగా పేరుపొందాడు .


🍁ఒకసారి జైగీషవ్యుడు దేవలుడున్న చోటికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు . 


☘️బృహస్పతి లాంటి పెద్దలందరు వచ్చి దేవల జైగీషవ్యులున్న ప్రదేశాన్ని దివ్యతీర్థంగా ప్రశంసించారు .


🍁దేవలుడు అందరి దగ్గర సెలవు తీసుకుని సింధునదీ తీరానికి వెళ్ళిపోయాడు .


☘️దేవలుడు ఒక చెఱువులో స్నానం చేస్తుంటే ' హూహూ ' అనే పేరుగల గంధర్వుడు అదే చెఱువులో తన భార్యలో స్నానం చేస్తూ దేవలుడి పాదాలు పట్టుకుని బాధపెట్టడం మొదలుపెట్టాడు . 


🍁దేవలుడు కోపంతో గంధర్వుడిని మొసలిగా పుట్టమని శపించాడు . గంధర్వుడు దేవలుడిని రక్షించమని ప్రార్థించాడు . 


☘️నువ్వు మొసలివై ఒక ఏనుగుని పట్టుకున్నప్పుడు ఏనుగుని రక్షించడానికి విష్ణుమూర్తి వస్తాడు . అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుందని చెప్పాడు దేవలుడు .


🍁మీరు గజేంద్రమోక్షం అనే కధలో తెలుసుకునే వుంటారు . ఆ గజేంద్రుణ్ణి పట్టుకున్న మొసలే ఈ గంధర్వుడు . 


☘️బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు గానీ , వస్త్రాలు తయారు చెయ్యడం రాక శివుడికి ఆపని అప్పగించాడు .


🍁శివుడు ఇది నావల్ల కాదు 

నా ప్రియశిష్యుడు దేవలుడికి అప్పగిస్తానని చెప్పాడు . 


☘️శివుడి ఆజ్ఞ ప్రకారం దేవలుడు వస్త్రాలు తయారుచేసి దేవతలకిచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందాడు.


🍁 దేవలుడు కఠోర దీక్షలో వుండి తపస్సు చేసుకుంటుంటే రంభ వచ్చి తనతో గడపమని అడిగింది .


☘️దేవలుడు అందుకు అంగీకరించలేదు . తన మాట వినలేదు గనుక శూద్రుడిగా పుట్టమని దేవలుడిని శపించింది .


🍁రంభ శాపం వల్ల దేవాంగ కులంలో పుట్టిన దేవలుడు రకరకాల వస్త్రాల్ని తయారు చెయ్యడం మొదలు పెట్టి తన కొడుకులు దివ్యాంగుడు ,


☘️విమలాంగుడు , ధవలాంగుడు ముగ్గురితో కలసి నేత పరిశ్రమని లోకంలో వ్యాపించేలా చేశాడు.


🍁దేవాంగుడు పై లోకాల కెళ్ళాడు . అక్కడ శేషుడి కూతురు చంద్రలేఖని , సూర్యుడి సోదరి దేవదత్తిని పెళ్లి చేసుకుని వంశవృద్ధి జరిగాక సన్యాసం తీసుకుని మోక్షాన్ని పొందాడు.


☘️ఒకసారి నారదుడు దేవలుడి దగ్గరకి వచ్చి ఈ ప్రపంచం ఎల్లా పుట్టిందీ , ప్రళయకాలంలో ఏమవుతోంది ? మొదలయిన విషయాలు అడిగి తెలుసుకున్నాడు . 


🍁దేవలుడు తీర్థయాత్రలు చేస్తూ గంగాస్నానం చేసి విష్ణుజపం చేస్తుండగా అతడికి పితృదేవతలు కనిపించి 


☘️పున్నామ నరకం నుంచి రక్షించమని వేడుకున్నారు . నాయనా ! 

బ్రహ్మచర్యం వలన ముని ఋణం తీరుతుంది .


🍁అగ్నిహోత్రానికి సంబంధించిన పనులవల్ల దేవ ఋణం తీరుతుంది . 

పెళ్ళిచేసుకుని మంచి సంతానం పొందితేనే పితృదేవతల ఋణం తీరుతుంది .


☘️కాబట్టి నువ్వు పెళ్ళి చేసుకుని మాకు మోక్షంకలిగేలా చెయ్యమన్నారు పితృదేవతలు .


🍁అయ్యా ! నేను పెద్దవాడ్నయ్యాను . 

ఈ వయస్సులో నాకు పిల్లనెవరిస్తారు ? అని అడిగాడు దేవలుడు .


☘️కౌండిన్యుడనే మహామునికి ఒక కుమార్తెవుంది . ఆమెని నువ్వు పెళ్ళి చేసుకో . ఆమెను నీ కోసమే బ్రహ్మ సృష్టించాడని చెప్పారు పితృదేవతలు .


🍁దేవలుడు బయలుదేరి కౌండిన్యుడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు . 


☘️దేవలుడి గురించి తెలిసిన కౌండిన్యుడు తనకుమార్తెను దేవలుడికిచ్చి పెళ్ళి జరిపించాడు . 


🍁కొంతకాలానికి దేవలుడికి సువర్చల అనే కూతురు కొంతమంది కొడుకులు పుట్టారు . 


☘️పితృదేవతల ఋణం కూడా తీర్చుకున్నాడు దేవలుడు . సువర్చలని ఆమె కోరిక ప్రకారం శ్వేతకేతుడికిచ్చి పెళ్ళి జరిపించాడు . 


🍁దేవల మహర్షి మహాధర్మశాస్త్రాన్ని ప్రతిపాదించాడు . ఈయన రాసిన ' దేవలస్మృతి ' ఇంకా పూర్తిగా దొరకలేదు .


☘️దేవల మహర్షి , దివ్యి , మహాతపస్వి , యోగీశ్వరుడు , ధర్మశాస్త్ర ప్రవక్త , మహా పురుషుడుగా ప్రసిద్ధికెక్కాడు .


🍁భారతదేశ మహర్షుల్లో గొప్ప ఋషిగా పేరు పొందాడు . ఇదండి దేవల మహర్షి గురించి మనం తెలుసుకున్న విషయాలు


☘️రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి..


సేకరణ: కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

దసరా పాట

 👇🌷🪷 *దసరా పాట* 🪷🌷


🚩దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే

ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...


ఇదే ఆ దసరా పాట


పల్లవి-


1⃣

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!


దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక ఇవ్వలేమనక !


ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!


శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2⃣


పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


3⃣

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!


*

దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.


పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటాఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.


లోగుట్టు


ఒక వ్యక్తి అభివృద్ధి గాని

కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.


ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు.

వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి

ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.

దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.


పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.

ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు

విద్యార్ధులకు

ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో.

దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.

ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.


అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.

ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది...

సేకరణ: వాట్సాప్ పోస్ట్. 

👇

💐💐💐💐💐💐

ధర్మాకృతి : పరమేష్టి గురువుల అధిష్ఠాన దర్శనము

 ధర్మాకృతి : పరమేష్టి గురువుల అధిష్ఠాన దర్శనము


మహాస్వామివారు వారి పరమేష్ఠి గురువులయిన సుదర్శన మహా దేవేంద్ర సరస్వతీ స్వామివారి అధిష్ఠానం దర్శనం చేయాలని సంకల్పించారు. వీరి చరిత్ర వెనుక పుటలలో చెప్పుకొన్నాము. మహా దేవేంద్ర సరస్వతీ స్వామి కామకోటి పీఠ 65వ ఆచార్యుల వారు. పరమేష్టి గురువుల అధిష్ఠాన దర్శనానికి బయలుదేరిన మహాస్వామి వారు పుదుక్కొట చేరారు. పుదుక్కొట సంస్థానాధీశులు రాజ మర్యాదలతో ఆహ్వానించి సకల సదుపాయాలు చేశారు. స్వామివారు ఆ వూరిలో 15రోజులుండి ఇలయాత్తం గుడి విజయం చేశారు. పరమేష్టి గురువుల అధిష్ఠానం, అక్కడే ప్రతిష్ఠించ బడిన శంకరుల మూర్తిని సేవించుకొని తమ రెండవ చాతుర్మాస్యమునకు జంబుకేశ్వరం చేరారు. జంబుకేశ్వర చాతుర్మాస్యము ముగించి స్వామివారు కుంభకోణం తిరుగు ప్రయాణం పట్టారు. జంబుకేశ్వరం నుండి కుంభకోణం వెళ్ళే దారిలో అప్పటి తంజావూరు రాజపరివారం కోరికపై నెలరోజులు తంజావూరులో ఉండిపోయారు. తంజావూరులో స్వామికి చేసిన ఎదుర్కోలు సన్నాహం, ఊరేగింపు ఆ వూరి చరిత్రలో చిరస్థాయిగా నిలువ దగినది.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఆయుర్వేదం లో జ్యోతిష్యం

 ఆయుర్వేదం లో జ్యోతిష్యం యొక్క పాత్ర -


 ఆయుర్వేదంలో జ్యోతిషం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదం అంటే కేవలం చెట్ల మందులు , పసర్లు అని మాత్రమే అనుకుంటారు . జ్యోతిష్యం కూడా ఒక భాగమే . అందుకే "వైద్యజ్యోతీష్యం " అనే పేరు కూడా ఉంది. నేను ఔషధాలు తయారీకి అవసరం అయిన మొక్కల్ని సేకరించేప్పుడు కాని , ఔషధం  తయారుచేసేప్పుడు కాని ఈ జ్యోతిష్య సంబంధ నియమాలు తప్పకుండా ఆచరిస్తాను. ఇప్పుడు మీకు ఆయుర్వేదంలో జ్యోతీష్యం ప్రధానపాత్ర ఎలా ఉంటుందో మీకు తెలియచేస్తాను.


 *  అమృతగడియాల యందు క్రొత్తగా చేయు మందులు అనగా లేహ్యములు, చూర్ణములు , రోగిచే సేవించబడు ఔషధం అమృతతుల్యమై వాతపిత్త శ్లేష్మజ్వరాది రోగములను హరింపచేసి ఆరోగ్యంబును అవయవాలకు బలమును ఆయుర్వృద్దిని చేయును . అమృతఘడియల్లోనే నూతన ఔషధాలను తయారుచేయవలెను అని శ్రీ ధన్వంతరి తెలియచేశారు. మందు ఇచ్చినప్పుడు కూడా అమృత ఘటికలలోనే తయారుచేయవలెను.


 *  "ఔషదారంభే గురుశ్రేష్ఠహా " అనే ఆర్యోక్తి ప్రకారం గురువారం నూతనౌషధములను అమృతగడియాలలో సేవించిన అది అమృతం వలే తప్పక పనిచేయును .


 *  నవౌషధం బుధసోమాయోహ "  అనగా బుధసోమవారాలు అమృతగడియాలలోనైనా మందు సేవించరాదు . అటుల సేవించిన గుణం ఇవ్వదు.


 *  అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి ఈ నక్షత్రములు, అదివారం, సోమవారం, బుధవారం, గురువారం , శుక్రవారం లు వీటితో చేరిన శుభతిథుల యందు మిధున, కన్యా, ధనుస్సు , మీన లగ్నముల యందు ఏ గ్రహములు లేకుండా ఉండటం , ఆయుష్మన్నమ యోగము నందు మందులు సేవించుటకు , మందులు చేయుటకు యోగ్యముగా ఉండును. మంగళవారం, శుక్రవారం విరేచనములకు మందు తీసుకుంటా మంచిది .


 *  అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణము, ధనిష్ట , శతబిషం, రేవతి ఈ నక్షత్రములు మరియు అదివారం , బుదవారం, శనివారం , తదియ , పంచమి, సప్తమి తిధుల యందు తైలములు సేవించుటకు చాలా మంచి సమయం.


 *  అశ్వని, కృత్తికా, ఆరుద్ర, ఆశ్లేష, చిత్త, విశాఖ, జేష్ఠ, మూల , శతబిషం ఈ నక్షత్రాలతో కూడిన అదివారం, మంగళవారం యందు క్రూర లగ్నములు అగు మేష,వృశ్చిక , మకర, కుంభ లగ్నముల యందు శరీరమునకు రక్షా రేకులు అనగా తాయత్తులు కట్టించుకొనుట మంచిది . ఈ ముహుర్తాలు శస్త్ర చికిత్స చేయుటకు పాటించవలెను .


 *  అశ్వని, మృగశిర, పునర్వసు , పుష్యమి, హస్త, చిత్త, స్వాతి , అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతబిషం , రేవతి నక్షత్రములు, అదివారం, మంగళవారం, గురువారములతో కలిసినపుడు పాదరసం , రసకర్పూరాది రసములు కలిసిన మందులు సేవించవలెను .


 *  పంచాంగ శుద్ది నందు క్షేమతార  గురువు మరియు చంద్రబలం కలిగి ఉండినప్పుడు రోగము శీఘ్రముగా నశించును.


        ఇంకా స్వప్నములను బట్టి ఏ వ్యాధి కలుగునో , మరణానికి ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో కూడా వివరణ ఉంది .వాటిని తరువాతి పోస్టులలో వివరిస్తాను.


   

      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

సర్పములు రకాలు -

 సర్పములు వాటిలోని రకాలు - 


 సర్ప జాతులు 2 రకాలుగా ఉండును. 


 1 - దేవతా సర్పాలు .

 2 - భూమి మీద ఉండు సర్పాలు .


 దేవతా సర్పముల రకాలు -

 

 అనంతుడు, వాసుకి , తక్షకుడు, కర్కోటకుడు , పద్ముడు, మహా పద్ముడు , శంఖపాలుడు, కులికుండు అని 8 రకాల దేవతా సర్పాలు కలవు.


 దేవతా సర్పముల గుర్తులు - 


 అనంతుని కి ఫనాగ్రము నందు శ్వేత పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నం ఉండును. వాసుకికి వీపు మీద నల్ల కలువ పువ్వు వంటి గుర్తు ఉండును. కర్కోటకుడికి మూడు నేత్రములు బోలిన 

చిహ్నం ఉండును. తక్షకునికి పడగ యందు స్వస్తికము వంటి గుర్తు ఉండును. శంఖు పాలుని కి వీపు నందు అర్ద చంద్ర త్రిశులాకారం గల గుర్తు ఉండును. మాహా పద్మునికి వీపు నందు రాజవర్త మణి తుల్యమగు చుక్కలు ఉండును. పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. ఈ గుర్తులు బట్టి దేవ నాగులు అని తెలుసుకొనవలెను. 


 దేవ నాగులకు వారములు - 


 ఆది, సొమ, మంగళ , బుద, గురు, శుక్ర , శని వారము పగలు, శనివారము రాత్రి అను వారముల 

యందు మాత్రమే క్రమముగా అనంతుడు మొదలగు దేవతా సర్పములు కరుచును. అప్పుడే వానికి విషం అధికముగా ఉండును.


 దేవతా సర్పముల మహిమ - 


 ఈ దేవతా సర్పములు 8 రకాలుకి జరా మరణాలు లేవు . వీటి విషానికి చికిత్స నే లేదు . 


 భూమి మీద ఉండు సర్పాలు - 


 ఇవి 4 రకాలుగా ఉండి భూమి పై ఎల్లవేళల సంచరించును. 


 ధర్వీకములు , మండలీ సర్పములు , రాజి మంతములు , ఉపజాతి సర్పములు . 


 వీటి లక్షణములు - 

 

   పడగలు కలిగి గరిట వలే ఉండునవి ధర్వీకములు అనియు, శరీరం అంతయు రత్న కంబళి వలే గాని చాందిని వలే గాని చిత్ర విచిత్రమైన పొడలు గలిగి యుండునవి మండలీ సర్పములు అనియు, శరీరం నందు సన్న చుక్కలు , ఉర్ధ్వ రేఖలు , తిర్యక్ రేఖలు కలిగి చిత్రాకారం గా ఉండునవి రాజిమంతనములు అని చెప్పబడును.


 వీటి విష లక్షణాలు - 


 ధర్వీకరముల విష లక్షణము ఉష్ణము తో చేరిన కారముగాను, మండలీ విషము ఉష్ణము తో చేరిన పులుసు గాను , రాజిమంత విషము చలువ తో చేరిన మధురం గాను ఉండును. ఈ రుచులను బట్టియే వాతాది దోషములు ప్రకోపించును.


       భూమి మీద ఉండు సర్పముల సంఖ్య - 


 ధర్వీకములు ( త్రాచు పాములు ) పదునాలుగు విధములుగాను , మండలీ సర్పములు ( పెంజర ) ఇరువది యెక్క బేదములు గలవి గాను రాజమంత సర్పములు ( క్షుద్ర జాతి సర్పములు ) ముప్పది ఆరు విధములుగా యున్నవని తెలియును .


 త్రాచు పాములలొ రకాలు - 


 చింతపువ్వు వన్నె త్రాచు , నాగజేర్రి, రేల త్రాచు , సెనగ పువ్వు త్రాచు , నల్ల త్రాచు , అరికె వన్నె త్రాచు కంది పొడల త్రాచు , మొగలిపువ్వు త్రాచు , తెల్ల త్రాచు , కోడె త్రాచు , గిరి నాగు , నీరు త్రాచు , గొధుమ త్రాచు , రాచ నాగు అని పదనాలుగు రకాలు . 


 త్రాచు పాము లక్షణములు - 


 చింతపువ్వు వన్నె త్రాచు లక్షణము - 


 చింతపువ్వు వన్నె శరీర ఛాయ, సాధారణం అగు క్రోధమును , ఆదివారం నందు విషం అధికం కలిగి యుండునది చింతపువ్వు వన్నె త్రాచు అని చెప్పబడును.


 నాగజెర్రి లక్షణము - 


 సగం త్రాచు పాము వలెను, సగం జెర్రిపోతు వలెను ఉండి చెట్ల తోర్రల యందు , చెట్ల యందును నివసిస్తూ గోదుమవన్నే తెలుపు రంగు కలిగి అత్యంత కోపమును కలిగి సొమవారం నందు విషం అదికంగా కలిగి యుండెడిది నాగజెర్రి అను త్రాచుపాము .


 రేల త్రాచు లక్షణము - 


 అడువుల యందు నివసించుట, సన్నని పొడవు గల శరీరం కలిగియుండుట, సొమవారం నందు విషం అధికంగా కలిగియుండి , సామాన్య కోపముని కలిగి యుండేది రేల త్రాచు అని చెప్పవచ్చు.


 నల్ల త్రాచు - 


 నేరేడు పండు వర్ణమును , మితమైన పొడవుని , ప్రచండమైన కొపమును, స్వచ్చమైన విషమును , పర్వతముల యందు నివాసమును, మంగళవారం నందు విషం అధికముగా కలిగియున్డునది నల్లత్రాచు అని చెప్పబడును.


 అరికవన్నే త్రాచు - 


   మల విసర్జన స్థలముల యందు సంచారము , మల భక్షణము , అత్యదిక కొపము, స్వచ్చమైన గరళము, బుదవారం నాడు విషం అధికంగా కలది. ఆరిక ధాన్యం వంటి రంగును కలిగి యుండును.


 కంది పొడల త్రాచు - 


 కంది బెడల వంటి పొడలు కలిగిన శరీరం తో , సామాన్యమగు కొపము, బుదవారం విషం అధికంగా కలిగి ఉండును. 


 మొగలిపూవు త్రాచు -


 గేదంగి రేకు సమానమైన ఆక్రుతియు, వెండితో తుల్యమైన శరీరచాయని పరిమళించు కుసుమములు గల ప్రదేశములు , మొగలి పొదలు పరిమళ ఔషధాలు కలుగు అరణ్యముల నందు సంచారంను, కొపము లేమియు, అతి శాంతమును,

సుక్షమమైన మొగలిరేకు ప్రమాణం శరీరంను, గురువారం నందు విషమును అధికంగా కలిగి యుంటుంది.


 తెల్లత్రాచు - 


 కొపంలేమియు , సాత్విక గుణమును, శాంత స్వభావమును, వెన్నెల వంటి శరీర ధావల్యమును,

గురువారం నందు విషము అధికము గా కలిగి యుండునని తెల్లత్రాచు అని చెప్పబడును.


 కోడె త్రాచు - 


 18 అంగుళాల నిడుపును , కోళ్ళని భ్రమ చెందించుటకై కోళ్ల వలే అరుచును. ఇండ్లయందును, కోళ్ల గుళ్ళ యందు నివాసమును , అధిక కోపమును, రాత్రుల యందు కోళ్ళని భక్షించుట , రూపం నందు భయంకరత్వం , చురుకుదనం , శుక్రవారం విషం అధికం కలిగియున్డునది కోడెత్రాచు 


 గిరినాగు - 


 చంద్రబింబం వంటి వట్రువ, ధావళ్యం కలిగిన పడగ, పర్వతముల యందు సంచారం, చెట్లకొమ్మల మీద నివాసం, నిరంతరం పక్షులను భక్షించుట, పడగ యందు కృష్ణ పాదములు , శుక్రవారం విషమును అధికముగా కలిగి యుండును.


 నీరు త్రాచు - 


 అధికమగు విషమును , అతి కొపమును, జలము నందు సంచారమును, జలజంతు భక్షణ, శుక్రవారం నందు విషం అధికముగా కలిగి యుండునని చెప్పబడును.


 గొధుమ త్రాచు - 


 సాత్విక స్వభావం , గజము పొడవును, శనివారం నందు విషం కలిగి యుండునది గోదుమత్రాచు .


 రాచ త్రాచు - 


 గుండ్రమై కృష్ణ పాదములు లేని పడగ యు , మూడడుగుల పొడవు, అధిక కొపము, భయంకర స్వభావము, పగతీర్చుకొను నట్లు పట్టుదలయు, పర్వతారన్యముల నందు నివాసము, పసుపుపచ్చని కాంతియు, బుదవారం నందు అధిక ప్రభావంతమైన విషాన్ని కలిగియుండును. ఇది విశాఖపట్నం మండలం నందు మాత్రమే కనిపించును. మరిఎక్కడా కనిపించదు.


      మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034