ధర్మాకృతి : పరమేష్టి గురువుల అధిష్ఠాన దర్శనము
మహాస్వామివారు వారి పరమేష్ఠి గురువులయిన సుదర్శన మహా దేవేంద్ర సరస్వతీ స్వామివారి అధిష్ఠానం దర్శనం చేయాలని సంకల్పించారు. వీరి చరిత్ర వెనుక పుటలలో చెప్పుకొన్నాము. మహా దేవేంద్ర సరస్వతీ స్వామి కామకోటి పీఠ 65వ ఆచార్యుల వారు. పరమేష్టి గురువుల అధిష్ఠాన దర్శనానికి బయలుదేరిన మహాస్వామి వారు పుదుక్కొట చేరారు. పుదుక్కొట సంస్థానాధీశులు రాజ మర్యాదలతో ఆహ్వానించి సకల సదుపాయాలు చేశారు. స్వామివారు ఆ వూరిలో 15రోజులుండి ఇలయాత్తం గుడి విజయం చేశారు. పరమేష్టి గురువుల అధిష్ఠానం, అక్కడే ప్రతిష్ఠించ బడిన శంకరుల మూర్తిని సేవించుకొని తమ రెండవ చాతుర్మాస్యమునకు జంబుకేశ్వరం చేరారు. జంబుకేశ్వర చాతుర్మాస్యము ముగించి స్వామివారు కుంభకోణం తిరుగు ప్రయాణం పట్టారు. జంబుకేశ్వరం నుండి కుంభకోణం వెళ్ళే దారిలో అప్పటి తంజావూరు రాజపరివారం కోరికపై నెలరోజులు తంజావూరులో ఉండిపోయారు. తంజావూరులో స్వామికి చేసిన ఎదుర్కోలు సన్నాహం, ఊరేగింపు ఆ వూరి చరిత్రలో చిరస్థాయిగా నిలువ దగినది.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి